కుంటి సాకులు వెతికేందుకే బీజేపీపై బురద | BJP Laxman comments on Digvijay | Sakshi
Sakshi News home page

కుంటి సాకులు వెతికేందుకే బీజేపీపై బురద

Published Tue, Feb 21 2017 2:22 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కుంటి సాకులు వెతికేందుకే బీజేపీపై బురద - Sakshi

కుంటి సాకులు వెతికేందుకే బీజేపీపై బురద

దిగ్విజయ్‌ వ్యాఖ్యలను ఖండించిన లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌–సమాజ్‌వాదీలను ఓడించేందుకు మజ్లిస్‌ పార్టీని బీజేపీ ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఖండించారు. బీజేపీ కోసమే ఎంఐఎం పోటీ చేస్తోందని దిగ్విజయ్‌ ఆరోపణలు చూస్తుంటే యూపీలో సమాజ్‌వాదీ–కాంగ్రెస్‌ కూటమి ఓటమిని అంగీకరిం చడమేనని, కుంటి సాకులు వెతికేందుకే బీజేపీపై బురద చల్లుతున్నారని విమర్శించారు.

గత ఆరు దశాబ్దాలుగా మజ్లిస్‌ను, ఆ పార్టీ దౌర్జన్యాలను, హింసను ఎదుర్కొం టూ ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ అని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ చరిత్ర రాష్ట్ర ప్రజలకు పూర్తిగా తెలుసని, మజ్లిస్‌తో మున్సిపల్‌ కార్పొరేషన్‌ మొదలుకుని పార్లమెంట్‌ ఎన్నికల వరకు గత 60 ఏళ్లుగా పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న విషయం అందరికీ తెలుసన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement