టీఆర్‌ఎస్‌ను ఓడించి అధికారంలోకి వద్దాం
టీఆర్‌ఎస్‌ను ఓడించి అధికారంలోకి వద్దాం
Published Sat, Jul 15 2017 3:46 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ బూత్‌లో బీజేపీకి మెజారిటీ వస్తే తిరుగుండదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన పార్టీ పూర్తికాలం కార్యకర్తల భేటీలో ఆయన మాట్లాడారు. పార్టీకి పోలింగ్ బూత్‌లో మెజారిటీ సాధించ డానికి అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలు, కార్యకర్తలు కేంద్రీకరించి పనిచేయా లని సూచించారు. 2019 ఎన్నికలను లక్ష్యం గా పెట్టుకోవాలని, రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించి అధికారంలోకి రావాల నే లక్ష్యంతో పార్టీ శ్రేణులు పనిచేయాలని లక్ష్మణ్ పిలుపుని చ్చారు. పల్లె పల్లెకు బీజేపీ–ఇంటింటికీ మోదీ కార్యక్రమాన్ని పార్టీని బలోపేతం చేసే అవకాశంగా వాడుకోవాలని సూచించారు. అనంతరం పూర్తికాలం కార్యకర్తలకు మోటార్ సైకిళ్లను పంపిణీ చేశారు.
పలువురి చేరిక
లక్ష్మణ్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన యువకులు బీజేపీలో చేరారు. లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీకి మైనారిటీలను దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా 40 శాతం మైనారిటీలు ఉన్న అస్సాంలోనూ, 30 శాతానికి పైగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లోనూ, ఇంకా ఎక్కువశాతం ఉన్న మణిపూర్‌లోనూ బీజేపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అన్ని వర్గాలతోపాటు మైనారిటీల విశ్వాసాన్ని పొంది అధికారంలోకి వస్తామని లక్ష్మణ్ అన్నారు.
Advertisement