-
∙ర్యాలీలతో హోరెత్తిన పోరుగడ్డ
-
∙జేఏసీ బంద్ సంపూర్ణం
-
∙స్తంభించిన జనజీవనం
పరకాల: పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని పార్టీలకతీతంగా ప్రజలు నినదించారు. ర్యాలీలు, రాస్తారోకోలతో పోరుగడ్డ హోరెత్తింది. జేఏసీ, డివిజన్ సాధన సమితి ఇచ్చిన బంద్ శనివారం విజయవంతమైంది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా పాల్గొని తమ ఆకాంక్షను తెలిపారు. బంద్ సందర్భంగా పట్టణంలోని బట్టల దుకాణాలు, విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, పెట్రోల్‌బంక్‌లు, కిరాణషాపులు, హోటళ్లు మూతపడ్డాయి. బంద్‌లో జనజీవనం స్తంభించింది.
వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, డీవైఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుంచి ఆర్టీసీ డిపోవరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు నక్క చిరంజీవి, దుప్పటి సాంబయ్య మాట్లాడుతూ నాడు చందూలాల్ ప్రాంతీయ అభిమానంతో ఆర్డీవో కార్యాలయాన్ని తరలించుకుపోయారన్నారు. కార్యక్రమంలో నాయకులు ఇల్లందుల రాములు, మహేందర్, కృష్ణంరాజు, మల్లయ్య, చంద్రమౌళి, వినయ్, కళ్యాణ్, రమేష్, సంజీవ్, ఐలయ్య, కుమార్, భద్రయ్య పాల్గొన్నారు.
న్యాయవాద జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో..
రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ న్యాయవాద జేఏసీ ఆధ్వర్యంలో పరకాల–హన్మకొండ ప్రధానరోడ్డుపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ డివిజన్ కోసం ప్రజాప్రతినిధులు ప్రయత్నించాలన్నారు. విజయపాల్‌రెడ్డి, వెంకటరమణ, చంద్రమౌళి, శ్రీనివాస్, పరమేశ్వర్, సుదర్శన్‌రెడ్డి, రమేష్ పాల్గొన్నారు.
డివిజన్ ప్రకటించే వరకు
పోరాటం ఆపేది లేదు : ‘ఇనుగాల’
పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించే వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి స్పష్టం చేశారు. డివిజన్ ఏర్పాటు కోసం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నగర పంచాయతీ వద్ద ఇనుగాల శనివారం 48 గంటల నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ నుంచి ర్యాలీగా వచ్చి దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రెవెన్యూ డివిజన్ కోసం పోరాడడం లేదన్నారు. గతంలో ఉన్న హోదానే తిరిగి కల్పించాలని కోరుతున్నామన్నారు. భవిష్యత్‌లో మూడు జిల్లాలకు కేంద్రం కాబోతున్న పరకాలను డివిజన్‌గా ప్రకటించాలన్నారు. ఈ విషయంలో స్పీకర్ మధుసూధనాచారి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిల వైఖరిని స్పష్టం చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి అనుకూల ప్రకటన రాకపోతే అధికార పార్టీ ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరుగనివ్వమని హెచ్చరించారు. పుట్టగతులుండవ్ :
గన్నోజు శ్రీనివాసచారి, టీడీపీ ఇన్‌చార్జి
రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేయకపోతే ఎమ్మెల్యే ధర్మారెడ్డికి పుట్టగతులుండవని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గన్నోజు శ్రీనివాసచారి అన్నారు. ఇనుగాల చేపట్టిన నిరవధిక దీక్షను సందర్శించి సంఘీభావం ప్రకటించారు. దీక్షల్లో పట్టణ అధ్యక్షుడు బండి సారంగపాణి, డీసీసీ ప్రధాన కార్యదర్శి బొచ్చు కష్ణారావు, పీఏపీఎస్ చైర్మన్ కట్కూరి దేవేందర్‌రెడ్డి, ఆత్మకూరు జెడ్పీటీసీ లేతాకుల సంజీవరెడ్డి, ఓడీసీఎంఎస్ వైస్ చైర్మన్ గోల్కొండ సదానందం, పి.సంతోష్, రజాక్, శ్రీనివాస్, శ్రీను, రమేష్, రఘుపతి, సాంబశివుడు, సుమన్ పాల్గొన్నారు.
దీక్షకు పలువురి సంఘీభావం
ఇనుగాల చేపట్టిన దీక్షకు బీజేపీ నుంచి మేకల రాజవీరు, కానుగుల గోపినాథ్, ఆర్‌పీ జయంత్‌లాల్, సీపీఐ నుంచి దుప్పటి సాంబయ్య, సీపీఎం నుంచి నక్క చిరంజీవి, బీఎంఎస్ నుంచి జనార్ధన్‌రావు, నాన్‌పొలిటికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ శ్రీనివాసచారి, కిరాణావర్తక సం ఘం, ఫర్టిలైజర్స్ వ్యా పారులు, బట్టల వర్తక సంఘం, పా¯Œషాపు యాజమానుల సంఘం, నాÄæూబ్రాహ్మణుల సంఘం, పండ్ల వ్యాపారులు, ఆర్యవైశ్య సంఘం, నగర పంచాయతీ కార్మికులు సంఘీభావం ప్రకటించారు.