కరెంట్ మోటార్ల దొంగల అరెస్టు
Published Thu, Oct 10 2013 1:50 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
పరకాలరూరల్, న్యూస్‌లైన్ : వ్యవసాయ బావుల కరెంట్ మోటార్లను ఎత్తుకెళుతు న్న దొంగలను పోలీసులు బుధవారం అ రెస్ట్ చేశారు. దొంగల నుంచి 3 కరెంట్ మోటార్లు, 2 బోరు మోటార్లు, 6 కరెంట్ వైరు బెండల్స్, 33 అల్యూమినియం పల కలు (330 కిలోలవి), ద్విచక్రవాహనం, 50 కిలోల రాగి వైరు స్వాధీనం చేసుకున్నారు. పరకాల డీఎస్పీ సంజీవరావు కథ నం ప్రకారం.. కరీంనగర్ జిల్లా జమ్మికుం ట, హుజూరాబాద్, కమాన్‌పూర్, బేగంపే ట పరిసర ప్రాంతాలకు చెందిన జగన్నా థం సమ్మయ్య, తిరుపతి ఆంజనేయులు, పల్లంకొండ సాయిలు, రాబెల్లి రాజేష్‌కుమార్, షేక్ హమీద్‌బాబా వ్యవసాయ బా వుల వద్ద మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్నారు. పక్కా సమాచారంతో రేగొం డ, పరకాల పోలీసులు రెండు బృందాలు గా ఏర్పడి వారి కోసం గాలింపు తీవ్రత రం చేశారు.
పరకాల మండలం మల్లక్కపేట శివారులో జగన్నాథం సమ్మయ్య, తి రుపతి ఆంజనేయులును సీఐ వెంకటేశ్వర్లు అదుపులోకి తీసుకోగా, రేగొండ మండల శివారులో పల్లంకొండ సాయి లు, రాబెల్లి రాజేష్‌కుమార్, షేక్ హమీద్‌బాబాను ఎస్సై పులి వెంకట్ అదుపులోకి తీసుకున్నారు. వారిపై గతంలో రేగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిరుమలగిరి, చె న్నాపురం, రామన్నగూడెం, రూపిరెడ్డిపల్లి గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్ పగులగొట్టి కా పర్ వైరు ఎత్తుకెళ్లిన నాలుగు కేసులు, పరకాల మండలం రాయపర్తి, కంఠాత్మకూర్, ముస్త్యాలపల్లి గ్రామాల్లో వ్యవసాయ బా వుల వద్ద గల మోటార్లు, శాయంపేట, చి ట్యాలలో విద్యుత్ వైరు ఎత్తుకెళ్లిన కేసు, ప రకాల మండలంలో పోచారంలో జరిగిన చోరీ కేసులు నమోదై ఉన్నాయని తెలిపా రు. దొంగిలించిన వస్తువులను బైక్‌పై తీసుకెళ్తుండగా పక్కాసమాచారంతో వారి ని అరెస్టు చేశామని పేర్కొన్నారు. దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న సామగ్రి విలు వ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని డీఎస్పీ పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి దుండగులను అరెస్టు చేసిన సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వెంకట్, సిబ్బందిని డీఎస్పీ సంజీవరావు అభినందించారు.
Advertisement
Advertisement