కేసీఆర్‌ పాలనలో తెలంగాణ అధోగతి | Telangana is being ruled by betrayers, alleges Uttam | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ పాలనలో తెలంగాణ అధోగతి

Published Thu, Jul 5 2018 3:44 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Telangana is being ruled by betrayers, alleges Uttam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ ఇష్టారాజ్యంగా పాలి స్తూ తెలంగాణను అధోగతిపాలు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తెలం గాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగుతోందన్నారు. బుధవారం ఇక్కడి గాంధీభవన్‌లో పరకాల మున్సిపల్‌ చైర్మన్‌ మార్తిరాజు భద్రయ్య తన అనుచరులతో కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు ఉత్తమ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఉత్తమ్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ జెండా ఎగిరి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరికలే ఇందుకు సాక్ష్యాలని అన్నారు. టీఆర్‌ఎస్‌ తప్పుడు విధానాలకు విరక్తి చేందే పరకాల చైర్మన్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారని, టీఆర్‌ఎస్‌ పాలన పట్ల ప్రజలు ఆగ్రహంతో కాంగ్రెస్‌కు పట్టం కడతారని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement