Tpcc Uttam Kumar Reddy
-
కరోనా మరణాలకు కేసీఆర్‌దే బాధ్యత
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించిందని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. క్లిష్ట పరిస్థితుల్లో వైద్యాన్ని గాలికొదిలేశారని, రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని, కరోనా మరణాలకు సీఎం కేసీఆరే బాధ్యుడని ఆయన వ్యాఖ్యానించారు. సీఎల్పీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ’ఆసుపత్రుల యాత్ర’లో భాగంగా దృష్టికి వచ్చిన ప్రభుత్వ వైఫల్యాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ను శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, పొడెం వీరయ్య, ఇతర పార్టీ నేతలతో కలిసి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి వీక్షించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ తన యాత్రలో భాగంగా వైద్య సిబ్బంది పడుతున్న ఇబ్బందులు చూశానని చెప్పారు. సరైన పీపీఈ కిట్లు, సదుపాయాలు కల్పించకపోయినా వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారన్నారు. ఆరున్నరేళ్లుగా రాష్ట్రంలో కొత్త హాస్పిటల్ భవనాలు నిర్మించలేదని, వైద్య పరికరాలు సమకూర్చలేదన్నారు. తాను వెళ్లిన ప్రతి ఆసుపత్రిలో సిబ్బంది కొరత వేధిస్తోందని, ఆరోగ్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోని ఆసుపత్రిలో కూడా సిబ్బంది లేరంటే ఆరేళ్లుగా గాడిదలు కాస్తున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు. మద్యం, బెల్ట్ షాపుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయన్న భట్టి.. రాష్ట్రంలో వైద్యం అందించడానికి సిబ్బంది లేరని, మందులు లేవని, మిషన్లు లేవని ఎద్దేవా చేశారు. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే జలగల్లా పట్టి పీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఆరోగ్య శాఖను మూసేశారా? ఉత్సవ విగ్రహంలాంటి శాఖకు ఈటలను మంత్రిని చేశారా?’అని ప్రశ్నించారు. మూడు లక్షల కోట్ల అప్పుల్లో కనీసం పదివేల కోట్లు ప్రజారోగ్యానికి ఖర్చు చేసుంటే ప్రజలకు తిప్పలు తప్పేవన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి చికిత్స అందించాలని, ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి పేదల ప్రాణాలను కాపాడాలని కోరారు. తమ పర్యటన అనుభవాలను పేర్కొంటూ స్పీకర్, గవర్నర్‌ను కలిసి నివేదిక ఇస్తామని, ఈ సమాచారంతో హైకోర్టులో ప్రజల పక్షాన న్యాయ పోరాటం చేస్తామని, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని భట్టి వెల్లడించారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ భట్టి బృందం ఆసుపత్రులను సందర్శించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చిందని అభినందించారు. గవర్నర్, హైకోర్టు తిట్టినా ప్రభుత్వం స్పందించడం లేదని, ఇంకా ఆ శాఖను పట్టుకుని వేలాడటానికి మంత్రి రాజేందర్‌కు సిగ్గనిపించడం లేదా అని వ్యాఖ్యానించారు. హుజురాబాద్ సంఘటనలో మంత్రి రాజేందర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం చెప్పినట్టు తప్పుడు లెక్కలు చూపించలేదని వేధించారని విమర్శించారు. అక్రమ కేసులు పెట్టి ఆపరేటర్ ప్రవీణ్‌యాదవ్‌ను పోలీస్‌స్టేషన్‌లో కరెంట్ షాక్ పెట్టి చనిపోయేలా చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజారోగ్యంపై దృష్టిపెట్టి పేదల ప్రాణాలను కాపాడాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. -
విదేశీ వ్యవహారాల్లో పీవీది చెరగని ముద్ర
సాక్షి, హైదరాబాద్: ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పడంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు సఫలీకృతమయ్యారని, విదేశాంగ వ్యవహారాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని లోక్‌సభ సభ్యుడు, విదేశీ వ్యవహారాల శాఖ మాజీమంత్రి శశిథరూర్ అన్నారు. పీవీ హయాంలో అమెరికాతో ఆర్థికంగా బలమైన ఒప్పందాలు జరిగాయని, విదేశాంగ విధానంలో ఆయన అనేక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. ఆదివారం టీపీసీసీ ఆధ్వర్యంలో పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్పర్సన్ గీతారెడ్డి అధ్యక్షతన ఇందిరాభవన్‌లో జరిగిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. దక్షిణాసియా దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంతోపాటు లుక్ ఈస్ట్, లుక్ వెస్ట్ పాలసీ రూపొందించిన ఘనత పీవీకి దక్కుతుందన్నారు. ఆర్థికంగా ప్రపంచ దేశాలకు భారత్‌ను ఒక రోల్‌మోడల్‌గా నిలిపారని కొనియాడారు. సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టి కేవలం రెండేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 36 శాతం పెంచారని తెలిపారు. పీవీ నేతృత్వంలో భారత్.. ప్రపంచ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిందని, ప్రధానిగా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం దేశం అభ్యున్నతికి కారణమైందని అన్నారు. దేశం అణ్వాయుధ సాంకేతికతను సాధించడంలో కీలకపాత్ర పోషించారని, 1993 లో చైనాలో పర్యటించడం ద్వారా స్నేహహస్తం అందించి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించారని గుర్తు చేశారు. మైనారిటీ ప్రభుత్వాన్ని తన చాణక్యంతో నడిపిన పీవీ ప్రపంచ స్థాయి మేధావి అని, పది భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే మేధస్సు ఉన్నగొప్ప వ్యక్తి అని శశిథరూర్ కొనియాడారు. పీవీ ప్రధానిగా నేను సైన్యంలో..: ఉత్తమ్ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పీవీ నర్సింహారావు నాయకత్వంలో భారతదేశం గొప్పగా వెలుగొందిందని వ్యాఖ్యానించారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు తాను సైన్యంలో ఉన్నానని, వాయుసేనను బలోపేతం చేయడం కోసం మిగ్– 21 ఫ్లైట్లు సైన్యంలో ప్రవేశ పెట్టారని, రష్యాతో స్నేహపూర్వక బంధాలను ఏర్పాటు చేసి సైన్యాన్ని బలోపేతం చేశారన్నారు. ఇంకా వెబ్ నార్ లో తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, మాజీ ఎంపీ, కమిటీ గౌరవాధ్యక్షుడు వి.హనుమంతరావు, వైస్ చైర్మన్, ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్, శ్రవణ్ రెడ్డి పాల్గొన్నారు. డిగ్రీ అధ్యాపకులుగా పదోన్నతులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకులు, లైబ్రేరియన్లుగా పనిచేస్తున్న 33 మందికి డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, లైబ్రేరియన్లుగా పదోన్నతులు కల్పిస్తూ కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. 5వ జోన్లో 14 మంది, ఆరో జోన్లో 16 మంది, సిటీ జోన్లో ముగ్గురు పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు. -
రాజీవ్‌ది చెరగని ముద్ర
సాక్షి, హైదరాబాద్: అనూహ్య పరిస్థితుల్లో ప్రధానిగా పదవి చేపట్టిన రాజీవ్ గాంధీ దేశ చరిత్రలో చెరగని ముద్ర వేశారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఉండాలనే ఆకాంక్షతో దేశాభివృద్ధికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత ఆయన దని కొనియాడారు. గురువారం మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాజీవ్ చిత్రపటానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పూలమాలలు వేసి, దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ మాజీనేత జానారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ నేతలు అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, దాసోజు శ్రవణ్, ఉజ్మా షకీర్, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ 40 ఏళ్ల వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సమర్థంగా పాలించారని అన్నారు. దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐటీ అభివృద్ధికి ఆయనే కారణమని పేర్కొ న్నారు. గాంధీ, నెహ్రూ కుటుంబాలు ఈ దేశానికి చేసిన సేవలను మోదీ ప్రభుత్వం తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రాజీవ్ బాటలో నడుస్తూ జీహెచ్ ఎంసీ, వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. -
కరోనా మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌ను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ మొదటి నుంచి అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శిం చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ‘స్పీకప్ తెలంగాణ’కార్యక్రమంలో భాగంగా ఆయన ‘ఫేస్బుక్’ద్వారా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో శాస్త్రీయత పాటించడం లేదని, ఐసీఎంఆర్ నిబంధనలూ అనుసరించడం లేదని ఆరోపించారు. తక్కువ టెస్టులు చేసి, రాష్ట్రంలో తక్కువ కేసులున్నాయని చెప్పుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదన్నారు. గత నాలుగు నెలలుగా ఈ మహమ్మారి పట్టి పీడిస్తున్నా రాష్ట్రంలో ఇప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించలేదని మండిపడ్డారు. ఈ వ్యాధి సోకిన వారికి చికిత్స చేసేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించలేకపోయారని, చికిత్స పేరిట దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించలేక పోయారని ఎద్దేవా చేశారు. కరోనా సోకిన వారికి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఈ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడం ద్వారా పేదలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని కోరారు. వైరస్ సోకి చనిపోయిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు రూ.10 లక్షల పరిహారం అందించాలని, ఈ వైరస్‌పై ముందుండి పోరాడుతున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, జర్నలిస్టులకు ప్రాణహాని జరిగితే రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ‘స్పీకప్’తెలంగాణ విజయవంతం కాగా, ఏఐసీసీ పిలుపుమేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ‘స్పీకప్ తెలంగాణ’ కార్యక్రమం విజయవంతం అయిందని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలు ఆన్లైన్ ద్వారా కరోనా వైరస్ విషయంపై సామాజిక మాధ్యమాల్లో గళమెత్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఆన్లైన్ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయని తెలిపాయి. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, మండల నేతలు, పార్టీ అధికార ప్రతినిధులు, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు, పార్టీ కోర్ కమిటీ సభ్యులు, గ్రామస్థాయి నేతలు, ప్రజాప్రతినిధులు పాలుపంచుకున్నారు. -
సీఎం ప్రకటన ప్రజలను అవమానించడమే: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: సచివాలయం కాంప్లెక్స్‌లో ఉన్న ఆలయం, మసీదు కూల్చి వేతపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ప్రజల్ని ఘోరంగా అవమానించడమేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయం, మసీదులను ఎంతో పవిత్రమైనవిగా ఆయా వర్గాల ప్రజలు భావిస్తారని, వాటిని కూల్చి వేయడం దారుణమన్నారు. ఆలయం, మసీదును కూల్చివేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. -
కరెంటు బిల్లులు మాఫీ చేయండి
సాక్షి, హైదరాబాద్: కరెంటు బిల్లులపై సీఎంకు కాంగ్రెస్ లేఖాస్త్రం సంధించింది. కరోనా కరుణించలేదు.. కనీసం మీరైనా కనికరించాలని విజ్ఞప్తి చేసింది. పేద కుటుంబాలు, ఎంఎస్ఎంఈలు లాక్డౌన్ కారణంగా బిల్లులు భరించలేకపోతున్నందున వాటిని మాఫీ చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోరారు. ఇతర వినియోగదారులకు కూడా బిల్లులో రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ‘బీపీఎల్ కుటుంబాలకు లాక్డౌన్ కాలానికి 100 శాతం విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని కోరుతున్నాం. తెల్లరేషన్ కార్డుదారులకు విద్యుత్ బిల్లులను పూర్తిగా మాఫీ చేయాలి. బిల్లింగ్ పద్ధతిలో తప్పులను సరిదిద్దడం ద్వారా ఇతర వినియోగదారులకు కూడా తగిన విధంగా తగ్గించాలి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థిర, సాధారణ చార్జీలు సహా విద్యుత్ బిల్లులు పూర్తిగా మాఫీ చేయాలి. జూన్‌లో విద్యుత్ బిల్లులు చాలా అన్యాయంగా ఉన్నాయి. వినియోగం మీద ఆధారపడి నెలవారీగా చార్జీలు వసూలు చేయాలి. కానీ, ఈఆర్సీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ 90 రోజుల్లో చేసిన మొత్తం వినియోగం ఆధారంగా బిల్లులను తయారు చేశారు. పర్యవసానంగా, వినియోగదారులకు యూనిట్‌కు రూ.4.30కి బదులు రూ.9 బిల్లు వేశారు. ప్రజలపట్ల తన విధానాన్ని మార్చుకునే స్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదు. రెండు నెలలకుపైగా లాక్డౌన్ కారణంగా నష్టపోయిన ప్రజలపై భారాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవైపు కోవిడ్ –19 ని అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వం మరోవైపు సామాన్యులపై అదనపు ఆర్థిక భారం వేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది జీవనోపాధి వనరులను కోల్పోయి విద్యుత్ బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. పెరిగిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రమంతటా నల్ల జెండాలు, బ్యాడ్జ్‌లతో నిరసనలు నిర్వహిస్తాం’అని లేఖలో పేర్కొన్నారు. -
ఇంధన ధరలతో కేంద్రం దగా
శంషాబాద్: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత కష్టకాలంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలను దగా చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వ్యాపార దృక్పథంతో పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా గత మూడు మాసాలుగా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలపై ధరల పెంపు భారం మోపడం దారుణమన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పడుతున్న సమయంలో దేశంలో మాత్రం ఇం«ధన రేట్లు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 108 డాలర్లు ఉండగా, ఇక్కడ లీటరు పెట్రోలు రూ.71.40, డీజిల్ ధర రూ. 59.49 ఉందని.. అదే క్రూడాయిల్ బ్యారెల్ ధర ప్రస్తుతం 41 డాలర్లు ఉన్నా.. పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. గత ఆరేళ్ల కాలంలో పదకొండు సార్లు ఎక్సైజ్ పన్ను పెంచిన ఘనత బీజేపీ సర్కారుకే దక్కిందన్నారు. రోజూ పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపుతున్నాయని తెలిపారు. అనంతరం తహసీల్దార్ జనార్దన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి రాచమల్ల సిద్దేశ్వర్, పార్టీ సీనియర్ నాయకురాలు మైలారం సులోచన తదితరులు పాల్గొన్నారు. శనివారం శంషాబాద్ తహసీల్ ఎదుట జరిగిన ధర్నాలో ఉత్తమ్, విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 29 నుంచి జూలై 3 వరకు ప్రజా సమస్యలపై నిరసనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం గాంధీభవన్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉత్తమ్ రాష్ట్రంలోని సమస్యలపై పార్టీ నేతలతో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్.సి. కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సంపత్‌కుమార్, ఎంపీ రేవంత్‌రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, ఏఐసీసీ ట్రైనింగ్ సెల్ ఇన్చార్జి సచిన్ రావ్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డిలతో పాటు పలువురు డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఈనెల 28న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని కోరారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ఈనెల 29న జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈనెల 30న కరోనా వైరస్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో విలేకరుల సమావేశాలు నిర్వహించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో పెరిగిన కరెంటు బిల్లులను నిరసిస్తూ జూలై 3న నల్ల బ్యాడ్జీలతో జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ప్రధాన కార్యదర్శులు మహేష్‌కుమార్ గౌడ్, బొల్లు కిషన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌లతో కూడిన ఒక కమిటీని కూడా ఉత్తమ్ ప్రకటించారు. -
కేసీఆర్ అసమర్థతతోనే ముప్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కరోనా ముప్పు రావడానికి కారణం కేసీఆర్ అసమర్థతే అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కోవిడ్ నియంత్రణలో ఘోరంగా విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రధాన కార్యదర్శులు మహేశ్‌కుమార్ గౌడ్, బొల్లు కిషన్లతో కలిసి ఉత్తమ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కరోనా వైరస్ రాష్ట్రంలోకి వచ్చిన మూడు నెలల తరువాత కూడా ఒక్క బెడ్ అందుబాటులో లేకపోవడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. కేసీఆర్ సమర్ధత ఏంటో ప్రజలందరూ తెలుసుకున్నారని, రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు ఒక్క కోవిడ్ హాస్పిటల్ మాత్రమే పనిచేస్తుందా అని ఎద్దేవా చేశారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి కేంద్రం రూ. 50 లక్షలు నష్టపరిహారం ప్రకటిస్తే రాష్ట్రం అమల్లోకి తేలేదని అన్నారు. కేంద్రంతో సహా రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, కోవిడ్ బారిన పడిన పేద కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి వచ్చే కేంద్ర బృందాన్ని కలిసి కరోనాపై నివేదిక ఇస్తామని చెప్పారు. పీవీ కాంగ్రెస్‌కు గర్వకారణం దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. పీవీ దేశాన్ని గొప్పగా నడిపించిన తీరును కాంగ్రెస్ నేతలుగా తాము గర్వంగా చెప్పుకుంటామని, ఆయన గురించి ఎవరు గొప్పగా చెప్పినా స్వాగతిస్తామన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏడాది పొడవునా పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని ఉత్తమ్ చెప్పారు. కాంగ్రెస్ పీవీని గౌరవించి పదవులు ఇచ్చిందని, తెలంగాణ ముద్దు బిడ్డ పీవీని పార్టీ చిరస్థాయిగా గుర్తు పెట్టుకుంటుందన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం మోపినందున జూలై 3న నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేస్తామన్నారు. తెల్ల రేషన్‌కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ.. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్రం భారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో పెట్రోల్, డీజిల్ ధరల పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ రోజు చేస్తోంది ఏంటని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గ డం లేదని, 2014 నుంచి ఇప్పటివరకు 200 శాతం టాక్స్‌లు పెంచారని విమర్శించారు. -
పేదలకు నిత్యావసర సరుకులు
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ 50వ జన్మదినోత్సవాన్ని పురçస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు ఎలాంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ, అన్నదానం, రక్తదాన కార్యక్రమాలతో పాటు, కరోనా ఫ్రంట్ వారియర్స్‌కు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం గాంధీ భవన్లో రాష్ట్ర ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్రావు నేతృత్వంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారం భించగా గ్రేటర్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు మనోజ్ కుమార్ కుటుంబానికి ఎన్ఎస్యూఐ తరఫున 50వేల రూపాయల చెక్కును వారి బంధువులకు అందచేశారు. ఈ సందర్భం గా ఉత్తమ్ మాట్లాడుతూ రాహుల్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ శ్రేణులను అభినందించారు. గాల్వాన్ అమరవీరుల ఆత్మ శాంతి కోసం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. -
నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో ‘గోదావరి జల దీక్ష’
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టి పూర్తి కాకుండా మిగిలిపోయిన ప్రాజెక్టులను టీపీసీసీ నేతలు శనివారం సందర్శించనున్నారు. వాటి పురోగతి, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ ప్రాజెక్టుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియ జేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఆయన ’గోదావరి జల దీక్ష’పై డీసీసీ అధ్యక్షులు, ముఖ్యనేతలతో గాంధీభవన్ నుంచి ఫోన్ లో మాట్లాడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు, నియోజక వర్గ ఇంచార్జులు, ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాష్ట్ర స్థాయి నేతలు వారి పరిధులలో ఉన్న ప్రాజెక్టుల వద్దకు వెళ్లి శనివారం దీక్షలు చేయాలని, స్థానిక మీడియాతో మాట్లాడి ప్రాజెక్టు వివరాలు తెలియజేయాలని ఉత్తమ్ పార్టీ నేతలను కోరారు. -
రాములు నాయక్ దీక్ష విరమణ
సాక్షి, హైదరాబాద్: గిరిజన రిజర్వేషన్ల పరిరక్షణ కోసం మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఒక రోజు ఉపవాస దీక్ష నిర్వహించారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తన నివాసంలో పోలీసు పహారా మధ్య ఆయన గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేశారు. సాయంత్రం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీ వీ హెచ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు అయితే గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తానని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, వారి హక్కులు కాల రాస్తున్నా పట్టించుకోవడం లేదనివిమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాములు నాయక్ దీక్ష ప్రకటించిన నేపథ్యంలో కౌంటర్ వేస్తామని సీఎం అంటున్నారని ఎద్దేవా చేశారు. గిరిజనుల పక్షాన కాంగ్రెస్ అండగా ఉంటుందని ఉత్తమ్ భరోసా ఇచ్చారు. -
కాంగ్రెస్ ‘చలో సెక్రటేరియట్’ భగ్నం
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం, కరెంటు బిల్లుల మోత, నియంత్రిత సాగు పేరుతో సీఎం కేసీఆర్ నియంతృత్వ విధానానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్’కార్యక్రమం భగ్నం అయింది. గురువారం ఉదయం నుంచే హైదరాబాద్‌లో నివాసమున్న టీపీసీసీ ముఖ్య నేతలను వారివారి నివాసాల్లో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, పార్టీ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎ.రేవంత్ రెడ్డి, మాజీ మంత్రులు గీతారెడ్డి, శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, మాజీ ఎంపీలు వీహెచ్, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్రావు తదితరులను హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి దాదాపు సాయంత్రం వరకు పోలీసులు నాయకుల ఇళ్ల వద్దనే కాపలా ఉండి బయటకు రానీయలేదు. బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం: కేసీఆర్‌పై భట్టి ఫైర్ ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను కలవాలని అపాయింట్మెంట్ కోరిన తమను నిర్బంధించడం పట్ల సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. ప్రజాసమస్యలపై వారితరఫున ముఖ్యమంత్రిని, మంత్రులను అపాయింట్మెంట్ తీసుకుని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలవడం ప్రజాస్వామ్యంలో సర్వ సాధారణమని, కానీ ఇందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నయా ఫ్యూడలిస్ట్‌లా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. మూడు నెలలుగా తెలంగాణ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, తాజాగా కరెంట్ బిల్లుల మోతతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని, కరోనాతో తెలంగాణ కల్లోలంగా మారుతోందని, రైతు బంధుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొందని, వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం తమ బాధ్యత అని చెప్పారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్, వ్యవసాయ శాఖ మంత్రులను కలిసేందుకు ఈ నెల 11న అపాయింట్మెంట్ కోరుతూ 9న లేఖ రాశామని, అపాయింట్మెంట్ ఇవ్వకపోగా పోలీసులను ఉపయోగించి తమ హక్కులను కాలరాసే ప్రయత్నం చేశారని విమర్శించారు. తాము ప్రజలచేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలమని, సచివాలయం కశ్మీర్ సరిహద్దుల్లో లేదని, తామేమీ ఉగ్రవాదులం కాదని భట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న నాయకులు మాత్రమే ఇలాంటి మూర్ఖపు పనులు చేస్తారని, సీఎల్పీ నాయకుడిగా ప్రజల గొంతును, ప్రజా సమస్యలను లేవనెత్తుతున్న తనను అణచివేసే కుట్రలను సహించేది లేదని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధుల హక్కులను హరించివేస్తున్న ఈ ప్రభుత్వంపై శాసనసభలో హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తానని చెప్పారు. దీనిపై సభలో న్యాయం జరగకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. గురువారం బంజారాహిల్స్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసం వద్ద మోహరించిన పోలీసులు -
పంట నష్టం ఇవ్వని వ్యక్తి ఏం శుభవార్త చెప్తారు?
సాక్షి,హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించలేని ముఖ్యమంత్రి రాష్ట్ర రైతాంగానికి ఏం శుభవార్త చెప్తారని టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. గాంధీభవన్ నుంచి శనివారం జూమ్ యాప్ ద్వారా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ చెబుతున్న దానికి, చేసే దానికి పొంతన ఉండదని, ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. ఎన్నికల హామీ కింద రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు చేయని వ్యక్తి, కనీసం రైతుబంధు కూడా అందరికీ ఇవ్వలేని వ్యక్తి ఇంకా ఏం శుభవార్త చెప్తారని, రైతులు దేని కోసం ఎదురుచూడాలని ఆయన ఎద్దేవా చేశారు. అదనంగా ఒక్క ఎకరం కూడా తడవలేదు రాష్ట్రంలోని రైతాంగానికి ఇప్పటివరకు అప్పట్లో నిజాం కట్టిన ప్రాజెక్టులు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల ద్వారానే సాగునీరు అందుతోందని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీరు పారలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఉత్తమ్ చెప్పారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందలేదన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలని కోరారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని, కేసీఆర్ అక్రమ సంపాదనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ వారికి అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు అమానవీయం వలస కార్మికుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఇందిరారావు ఆధ్వర్యంలో..హైదరాబాద్ కింగ్ కోఠిలోని షేర్ గేట్లో మూడు వందలమంది నిరు పేదలకు ఉత్తమ్ తో పాటు పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అంజనీ కుమార్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. -
కరోనా పరీక్షల్లో రాష్ట్రం విఫలం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షలు అతి తక్కువగా చేసిన రాష్ట్రం తెలంగాణ అని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైద్య పరీక్షలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, రోజుకు 5 వేల పరీక్షలు చేస్తామని వైద్య మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారని, ఇప్పుడు అంత సంఖ్యలో పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదో స్పష్టం చేయాలన్నారు. హైకోర్టు ఎన్నిసార్లు మొట్టి కాయలు వేసినా ప్రభుత్వానికి సోయి రావడం లేదన్నారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని, వలస కార్మికులు, నిరుపేదలకు ప్రభుత్వం ఆశ్రయం కల్పించలేకపోయిందన్నారు. కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని చెప్పి ఇప్పుడు 50 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేయలేదన్నారు. కొన్ని రకాల విత్తనాలు అమ్మాలి, మరికొన్ని రకాల విత్తనాలు అమ్మొద్దని ఆదేశాలు ఇవ్వడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ అంశాలపై కాంగ్రెస్ పార్టీ ‘స్పీక్అప్ ఇండియా’పేరిట సామాజిక మాధ్యమాల్లో పోరాటం చేస్తున్నదన్నారు. ఈ పోరాటం విజయవంతం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. 27 వేల మంది కేడర్‌తో మాట్లాడి, ఏఐసీసీ ఇచ్చిన పిలుపుమేరకు ఆన్లైన్ పోరాటం చేపట్టినట్లు తెలిపారు. వలస కూలీలకు బస్సు ఏర్పాటు: వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ ఎన్నారైల ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కూలీలను హైదరాబాద్ నుంచి పంపించేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. గురువారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్, జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ ఎన్నారై సెల్ అధ్యక్షుడు వినోద్ తదితరులు జెండా ఊపి బస్సు ప్రారంభించారు. -
జేబులు నింపుకోవడానికే ప్రాజెక్టులు
స్టేషన్ మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని కేసీఆర్‌ను సీఎంగా ఎన్నుకుంటే అందుకు భిన్నంగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జేబులు నింపుకోవడానికే మిషన్ భగీరథ, కొత్త ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపించారు. ఇంత అవినీతి సీఎం దేశంలో ఎవరూ లేరని ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై బుధవారం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. పోతి రెడ్డిపాడు ద్వారా రోజూ 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కుల నీళ్లు ఏపీ తీసుకువెళితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకెళుతామని గత డిసెంబర్లో ఏపీ ప్రభుత్వం ప్రకటించిందని, ఈ విషయంపై జనవరి 5న తమ పార్టీ నేత నాగం జనార్దన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తే స్పందించలేదన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క నూతన ఆయకట్టు కన్నా నీరిచ్చారా అని ప్రశ్నించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడితే 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చేదని, కానీ సీఎం పట్టించుకోలేదని విమర్శించారు. మహబూబ్‌నగర్‌ను బొందపెట్టిండు... కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులను 90% పూర్తిచేస్తే, ఈ ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10% పనులను కూడా పూర్తి చేయలేదని ఉత్తమ్ దుయ్యబట్టారు. ఎంపీగా రాజకీయ జీవితాన్ని ఇచ్చిన మహబూబ్‌నగర్‌ను కేసీఆర్ బొందపెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ 30 కిలోమీటర్లు పూర్తి చేస్తే, మిగిలిన 10 కిలోమీటర్ల పనులను టీఆర్ఎస్ పూర్తి చేయలేకపోయిందన్నారు. వచ్చే నెల 2న కృష్ణానది పరివాహక ప్రాజెక్టుల వద్ద జల దీక్ష చేస్తున్నట్లు ఉత్తమ్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం, వలస కార్మికులను వారి సొంతూళ్లకు తరలించడం తదితర కార్యక్రమాలపై పార్టీ నేతలు, కార్యకర్తలు నేడు సోషల్ మీడియా క్యాంపెన్ నిర్వహించాలని సూచించారు. సాగర్ ఎండిపోయే ప్రమాదం.. ఉన్న నీళ్లనే వాడుకలోకి తీసుకురాలేని ప్రభుత్వం అదనపు నీళ్లను ఎలా తీసుకువస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అదనంగా నీళ్లను తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చేది కాదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండితేనే నాగార్జునసాగర్‌కు నీళ్లు వస్తాయని, సాగర్ నిండక ఏడేళ్లు అవుతుందని, ఈ పరిస్థితుల్లో సంగమేశ్వర నుంచి నీళ్లను తీసుకువెళితే భవిష్యత్‌లో నాగార్జునసాగర్ ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో సాగర్ ఎడమ కాల్వ మీద ఆధారపడిన ఖమ్మం, నల్లగొండ జిల్లాలు ఎడారిగా మారతాయన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్రెడ్డిలు సాగునీటి రంగంలో జిల్లాకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీ మల్లురవి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, సీనియర్ నేతలు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. చిత్రంలో కాంగ్రెస్ నేతలు సంపత్ తదితరులు -
నీళ్ల పేరిట నిధుల ఎత్తిపోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అనాలోచితంగా, తప్పుడు నిర్ణయాలతో ముందు కెళ్తోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. నీళ్లను సాకుగా చూపి అడ్డుగోలుగా నిధులు ఎత్తిపోస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, వాటికి నిధులివ్వకుండా ఒక్క కాళేశ్వరం ఎత్తిపోతలకే రూ. లక్ష కోట్లు ఖర్చు చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. గ్రావిటీ ద్వారా అందించగల గోదావరి, కృష్ణా జలాలను వదిలిపెట్టి ఎత్తిపోతలకే ఎందుకు మొగ్గుచూపుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనాలోచిత నిర్ణయాలను ఎండగట్టేందుకే కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టుల వద్ద దీక్షలకు దిగనున్నామన్న ఉత్తమ్ సోమ వారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... అదనపు టీఎంసీకన్నా.. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి మిన్న.. కాంగ్రెస్ హయాంలోనే కల్వకుర్తి, నెట్టెం పాడు, భీమా, ఎస్ఎల్బీసీ, దేవాదుల వంటి పథకాలు చేపట్టి 85 శాతం పూర్తి చేశాం. మరో రూ. 2–3 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీళ్లొ స్తాయి. కానీ వాటిని ప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టింది. తమ్మిడిహెట్టి ద్వారా వచ్చే గ్రావిటీ గోదావరి నీటిని వదిలేసి రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం ఎత్తిపోతలు చేపట్టింది. కాళేశ్వరం ద్వారా ఇంతవరకు ఒక్క ఎకరా కొత్త ఆయకట్టుకైనా నీళ్లిచ్చారా? కాళేశ్వరం ద్వారా ఎత్తిపోయకున్నా ఎస్సారెస్పీలోకి వచ్చిన వరద జలాల ద్వారా స్టేజ్–2 ఆయకట్టుకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి కేవలం రూ. 2 వేల కోట్లు ఖర్చవుతుంది. దీనిద్వారా సుమారు 100 టీఎంసీల నీటిని గ్రావిటీ ద్వారా సుందిళ్లకు తరలించి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా కేసీఆర్ ఎందుకు దీని నిర్మాణం చేయలేదు? రెండో టీఎంసీ నీటిని ఎత్తిపోయకుండానే కాళేశ్వరం ద్వారా 3వ టీఎంసీ నీటి ఎత్తిపోతలు చేపట్టారు. ఈ నిధులను తమ్మిడిహెట్టి, పెండింగ్ ప్రాజె క్టులపై ఖర్చు చేస్తే బాగుంటుంది కదా. కృష్ణాపై ఏపీ కొత్త ప్రాజెక్టులు కడితే రాష్ట్రానికి నీరు గగనమే.. ఇప్పటికే కృష్ణా నదిలో వరద ప్రవాహాలు కరువయ్యాయి. ఆగస్టులో ఎగువ నుంచి వరద వచ్చినా 215 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం నిండి అక్కడి నుంచి సాగర్ వరకు నీరొచ్చేందుకు మరో నెలకుపైగా సమయం పడుతోంది. శ్రీశైలంపై ఆధార పడి తెలంగాణలో కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు న్నాయి. ఇవన్నీ ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల అవసరాలు తీర్చేవే. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఏపీ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచినా, కొత్తగా రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేలా కొత్త పథకాలు చేపట్టినా తెలంగాణకు నీరు దక్కడం గగనమే. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు నీరు రావాలంటేనే సెప్టెంబర్ పడుతోంది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి నీటిని ఎప్పటికప్పుడే తీసుకుంటే అక్టోబర్, నవంబర్ వరకు నీరు రాదు. అదే జరిగితే సాగర్ కింది ఆయకట్టు 6.40 లక్షల ఎకరాలతోపాటు ఏఎంఆర్పీ తాగు, సాగునీటి అవసరాలకు పూర్తిగా విఘాతమే. దక్షిణ తెలంగాణ పూర్తిగా ఎడారే. ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తిచూపేందుకే దీక్షలు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలపై తీరని భారం పడనుంది. ఎత్తిపోతల పథకాల ద్వారా ఏటా రూ. వేల కోట్ల వడ్డీలు, కరెంట్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న డిమాండ్‌తో జలదీక్షలు చేయనున్నాం. జూన్ 2న కృష్ణా ప్రాజెక్టుల వద్ద, 6న గోదావరి ప్రాజెక్టుల వద్ద పార్టీ నేతలు, శ్రేణులు దీక్షలు చేస్తారు. గ్రావిటీ ద్వారా కృష్ణా నీటిని తీసుకొచ్చే ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డితో కలసి నేను దీక్షలో కూర్చుంటా. పాలమూరు ప్రాజెక్టులోని లక్ష్మీదేవునిపల్లి వద్ద ఎంపీ రేవంత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కల్వకుర్తి వద్ద వంశీచంద్‌రెడ్డి, ఎల్లూరు వద్ద నాగం జనార్దన్‌రెడ్డి, నెట్టెంపాడు వద్ద సంపత్, కర్వెన వద్ద చిన్నారెడ్డి దీక్షలో కూర్చుంటారు. -
ప్రభుత్వ వైఫల్యాలపై టీపీసీసీ ‘పోరుబాట’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట పట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నిర్ణయించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ముఖ్య నేతలు మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి తదితరులు గాంధీభవన్‌లో సమావేశమై రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారు. ప్రభుత్వ వైఫల్యాలపై అధ్యయనం చేసేందుకు నాలుగు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్థిక వ్యవహారాలపై సీఎల్పీ నేత భట్టి నేతృత్వంలో, ఉస్మానియా భూములు, విద్యారంగాలపై మాజీ ఎంపీ పొన్నం నేతృత్వంలో, నూతన వ్యవసాయ విధానంపై అధ్యయనానికి చిన్నారెడ్డి, కోదండరెడ్డి, గోదావరి పెండింగ్ ప్రాజెక్టులపై ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి నేతృత్వంలో కమిటీలు ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా, గోదావరి నదులపై పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర ప్రాజెక్టుల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జూన్ 2న కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల వద్ద, జూన్ 6న గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టుల వద్ద దీక్ష చేయాలని నిర్ణయించారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఆరేళ్లవుతున్నా కృష్ణానదిపై ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీస్తూ దీక్షలు చేయనున్నారు. అందులో భాగంగా శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్సెల్బీసీ) వద్ద ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దీక్ష చేయనున్నారు. పాలేరు జలాశయం వద్ద సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్యేలు సీతక్క, పొడెం వీరయ్య, లక్ష్మీదేవిపల్లి పంపుహౌస్ దగ్గర మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎల్లూరు జలాశయం దగ్గర మాజీ మంత్రి నాగం, కరివేన ప్రాజెక్టు దగ్గర మాజీ మంత్రి చిన్నారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు ప్రాజెక్టుల దగ్గర ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్ ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ 6న గోదావరి నదిపై ఉన్న పెం డింగ్ ప్రాజెక్టులకు నిరసనగా ఇదే తరహాలో దీక్షలు చేయనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు బీజేపీ, టీఆర్ఎస్ నేతలు భూములు కబ్జా చేస్తున్నారన్న అంశంపై చర్చించిన టీపీసీసీ నేతలు ఆదివారం ఉస్మానియాకు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో పా టు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటు న్న నూతన వ్యవసాయ విధానంపై జూన్ 3, 4 తేదీల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీలు రైతులతో సంప్రదించాలని నిర్ణయించారు. చెప్పడానికి వారెవరు: ఉత్తమ్ సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ది తుగ్లక్ చర్య అని, నూతన వ్యవసాయ విధానం పేరుతో ప్రభుత్వం తెస్తున్న ప్రతిపాదనలను రైతులు అంగీకరించరని చెప్పారు. నూతన వ్యవసాయ విధానంపై రైతులతో సంప్రదిస్తామని, వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కొన్నిచోట్ల వరి, మొక్కజొన్న విత్తనాలు అమ్మవద్దని కలెక్టర్లు చెబుతున్నారని, ఫలానా విత్తనాలు అమ్మవద్దని చెప్పేందుకు కలెక్టర్లు ఎవరని ప్రశ్నించారు. కలెక్టర్ల తీరుపై కోర్టుకు వెళ్తామని ఉత్తమ్ చెప్పారు. ప్రధానితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. శనివారం గాంధీ భవన్లో సమావేశమైన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, కుసుమ కుమార్, పొన్నం ప్రభాకర్, జీవన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, దామోదర రాజనర్సింహా -
ప్రపంచ శాంతి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు రాజీవ్: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ శాంతి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాజీవ్‌గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా గురువారం గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ..రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. రాజీవ్‌ను హత్య చేసిన మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటించాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఉగ్రవాద వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, టీపీసీసీ ముఖ్య నేతలు చిన్నారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, సంపత్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ ఎందుకు మాట్లాడరు?
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ విస్తరణతో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, ఈ విషయంలో ఏపీ సీఎంతో మాట్లాడే బాధ్య త తెలంగాణ సీఎం కేసీఆర్ దేనని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌కు మంచి సంబం ధాలు ఉన్నాయని, అలాంటప్పుడు అక్కడి ప్రభుత్వం నీళ్లు తీసుకుపోతుంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్ నుంచి ఆయన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో ఫేస్‌బుక్‌లైవ్ ద్వారా మాట్లాడారు. పోతిరెడ్డిపాడు విషయంలో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికే ఈ అంశంపై గాంధీభవన్‌లో దీక్ష నిర్వహించడంతో పాటు కృష్ణా రివర్‌బోర్డు చైర్మన్‌ను కలిశామని, కేంద్రమంత్రి షెకావత్‌తో మాట్లాడి తమ అభ్యంతరాలు చెప్పామని వివరించారు. కానీ, అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ మాత్రం మౌనంగా ఉంటున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేసీఆర్ అసమర్థతతో వ్యవహరిస్తున్నారా లేదంటే ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారా.. అనే అనుమానాలు కలుగుతున్నాయని, వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లాక్డౌన్ కారణంగా సాధారణ, మధ్య తరగతి ప్రజల జీవనం అస్తవ్యస్తమయిందని, ఈ క్లిష్ట సమయంలో రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం ఉదారంగా ముందుకు రావాలని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీ నిరుత్సాహపరిచిందని అన్నారు. మధ్య తరహా, చిన్న పరిశ్రమలు అసంతృప్తితో ఉన్నాయని, వాటికి జీఎస్టీ లేదా రుణాల రూపంలో ఉపశమనం కల్పించాలని కోరారు. కరోనా సమయంలో పేదల కష్టాలు తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు వలస కూలీలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. -
అడ్డుకోకుంటే దక్షిణ తెలంగాణ ఎడారే
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను వినియోగించుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టదలిచి న రాయలసీమ లిఫ్టు పథకం, పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్ధ్యం పెంపు నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని టీపీసీసీ ప్రతినిధుల బృందం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీ చేపట్టబోయే ప్రాజెక్టులను నిలువరించకుంటే దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్‌నగర్, నల్లగొండలు పూర్తిగా ఎడారయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ ప్రాజెక్టుల విషయంలో తక్షణమే జోక్యం చేసుకొని వాటిని ఆపాలని, దీన్ని వెంటనే కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. గురువారం ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, సీనియర్ నేతలు నాగం జనార్ధన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, గూడూరు నారాయణరెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డిలతో కూడిన బృందం జలసౌధలోని బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌తో భేటీ అయింది. ఏపీ ఇచ్చి న జీవో 203 అంశాన్ని వివరించడంతో పాటు, తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరించింది. పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు దీన్ని అడ్డుకోవాలని సూచించింది. ప్రధానికి, కేంద్రమంత్రికి లేఖలు రాస్తాం: ఉత్తమ్ ఈ భేటీ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ఏపీ ఇచ్చిన జీవోతో తెలంగాణకు తీవ్ర నష్టమని, వీటిని వెంటనే ఆపేలా తమ పరిధిలో చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని కేంద్రానికి నివేదిక ఇవ్వడంతో పాటు, క్షేత్ర స్థాయిలో పర్యటించాలని కోరామన్నారు. ఏపీ జీవో మేరకు ముందుకు పోతే, దక్షిణ తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారడంతో పాటు, సాగర్ జలాలపై ఆధారపడిన హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కష్టాలు తప్పవన్నారు. దీంతో పాటే నీటి వినియోగ లెక్కలు పక్కాగా ఉండేందుకు టెలిమెట్రీ వ్యవస్థను సమర్ధంగా వాడేలా చూడాలని, రెండు రాష్ట్రాల ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలతో పర్యవేక్షణ ఏర్పా టు చేయాలని కోరామన్నారు. దీనిపై తప్పనిసరిగా పరిశీలన చేసి తమ పరిధి మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. దీనిపై పార్టీ ఎంపీలంతా కలిసి ప్రధాని మోదీకి లేఖ రాస్తామని, కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖ రాశామని, ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు చేశామని తెలిపారు. మీరు మంత్రిగా ఉన్న సమయంలోనే పోతిరెడ్డిపాడు కట్టారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు కదా? అని ప్రశ్నించగా, ‘అన్నోడికి సిగ్గు, శరం ఉండాలి. నేను ఆ రోజు మంత్రిగా లేనని గుర్తుంచుకోవాలి’అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చెబుతున్నట్లుగా ఒక్క కొత్త ప్రాజెక్టు చేపట్టలేదని, కాళేశ్వరం పాత ప్రాణహిత–చేవెళ్ల అయితే, దుమ్ముగూడెంను సీతారామ సాగర్‌గా పేరుమార్చారన్నారు. -
ఉచిత క్వారంటైన్ సౌకర్యం కల్పించండి
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ దేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వలస కార్మికులకు ఉచిత క్వారంటైన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు లేఖ రాశారు. గల్ఫ్ నుంచి వచ్చిన వారికి ఉచితంగా క్వారంటైన్ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, కానీ, ఈనెల 9న కువైట్ నుంచి 163 మంది వలస కార్మికులను రూ.1,500 చొప్పున చెల్లించే పెయిడ్ హోటల్‌కు తీసుకెళ్లారని ఆ లేఖలో తెలిపారు. ఇందులో 9 మంది వద్ద డబ్బులు లేకపోవడంతో వారిని ఆ హోటళ్లలో ఉంచి ఖర్చులు చెల్లిస్తామని బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు. గల్ఫ్ కార్మికులను విదేశాల నుంచి రాష్ట్రానికి ఉచితంగా తీసుకురావాలని, వారికి ఎలాంటి రుసుం విధించకుండా క్వారంటైన్ ఏర్పాట్లు చేయాలని గతంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరిందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కోరారు. -
దేశంలోనే అతి పెద్ద సంక్షోభం
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు పడుతున్న ఇబ్బందుల వల్ల దేశంలోనే అతి పెద్ద సంక్షోభం ఏర్పడిందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభాన్ని మానవతా కోణంలో ఆలోచించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వలస కార్మికులు, అసంఘటిత రంగాల కార్మికులపై కోవిడ్–19 టాస్క్ఫోర్స్పై చర్చించేందుకు టీపీసీసీ నేతలు ఆదివారం వీడియె కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిటీ చైర్మన్, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి, దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘం కార్యదర్శి ఎం.రాఘవయ్య, ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో వలస కార్మికుల సమస్యలను సమన్వయం చేయడానికి టాస్క్‌ఫోర్స్ సబ్ కమిటీ కన్వీనర్‌గా దాసోజు శ్రవణ్‌ను నియమించారు. -
వలస కార్మికులకు సాయం చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను ఆదుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు రావాలని టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు, కేడర్‌తో ఫేస్బుక్ ద్వారా మాట్లాడుతూ వలస కార్మికులను ఆదుకోవాలని ఏఐసీసీ అధ్యక్షురాలు ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉండాలనుకునే వలస కూలీలకు ఆహారం, నివాసం ఏర్పాట్లు చేయాలని, వెళ్లిపోవాలనుకునే వారికి ప్రభుత్వం వసూలు చేస్తున్న రైలు ఖర్చులను కాంగ్రెస్ కేడరే చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికులను ఆదుకోవడంలో విఫలమైందని, అసలు ఎంత మంది వలస కూలీలున్నారో లెక్క కూడా ప్రభుత్వానికి తెలియడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వలస కూలీల విషయంలో సీఎం ఒక లెక్క చెబితే మంత్రులు మరో లెక్క చెప్తున్నారంటే వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. వలస కార్మికుల విషయంలో రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు చేసిన కృషిని ఏఐసీసీ కూడా గుర్తించిందని ఉత్తమ్ చెప్పారు. -
రైతుల తరఫున మాట్లాడితే రాజకీయమా?
ఇల్లందకుంట (హుజూరాబాద్)/సాక్షి, సిద్దిపేట: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని, అలాగే ధాన్యంలో ఎలాంటి కోత లేకుండా కొనుగోలు చేయాలని మాత్రమే తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. అయితే రైతుల తరఫున మాట్లాడితే సీఎం కేసీఆర్, ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని అంటున్నారని ఆయన విమర్శించారు. రైతుల తరఫున మాట్లాడితే రాజకీయమా అని ప్రశ్నించారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేసీఆర్, రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. శుక్రవారం పీసీసీ బృందం కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ బృందం సందర్శించింది. తడిసిన వరి ధాన్యం, మక్కలను పరిశీలించింది. నాయకులు రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. క్వింటాల్‌కు పదికిలోల ధాన్యంకోత పెడుతున్నారని, తూ కంలోనూ జాప్యం చేస్తున్నారని రైతులు కాం గ్రెస్ నాయకులవద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జనవరి, ఫిబ్రవరిలో అమ్మిన కందుల డబ్బులు ఇప్పటికీ రైతులకు అందలేదన్నారు. వరి, బత్తాయి, నిమ్మ, మామిడి, పసుపు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో తాలు, మిల్లు ల్లో తరుగు పేరుతో 4 కిలోల వరకు కోత విధిస్తున్నా ఉమ్మడి జిల్లాలో ఉన్న నలుగురు మంత్రులు ఏమీ చేయలేకపోతున్నారని ఆరోపించారు. జిల్లా మంత్రులు మిల్లర్లతో మిలాఖత్ అయి రైతులను మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. కొనుగోళ్లలో జాప్యంతోనే రైతులకు నష్టం .. ‘ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరిపడా గన్నీ బ్యాగులు సరఫరా చేయలేదు.. కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు పెట్టి వారాల తరబడి ధాన్యం కొనకుండా జాప్యం చేశారు. దీని మూలంగానే రైతుల ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్ద అయింది.. రైతుల నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలం బస్వాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీపీసీసీ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా అకాల వర్షంతో తడిచిన ధాన్యాన్ని నాయకులు పరిశీలించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కోటి నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు రూ.30 వేల కోట్లు సిద్ధంగా ఉంచామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలు అయ్యాయన్నారు. వైఎస్ హయాం నుంచే ధాన్యం కొనుగోళ్లు పండిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయం ముఖ్యమంత్రికి తెలియకపోవడం శోచనీయమన్నారు. మన రాష్ట్రం కంటే ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేస్తున్నారన్నారు. మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కు: ఉత్తమ్ రాష్ట్ర ప్రభుత్వం రైస్‌మిల్లర్లతో కుమ్మక్కై..ధాన్యం కొనుగోలులో రైతులను దగా చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రైతులకు జరుగుతున్న అన్యాయం.. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కరీంనగర్ జిల్లా లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన శుక్రవారం డీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. బస్తాల్లో 42 కిలోల వడ్లు నింపి 40 కేజీలకే లెక్క కడుతున్నారని, ఎవరి ఆదేశాలతో ఇది చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం మిల్లర్లకు లబ్ధి కలిగేలా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ముఖ్యమంత్రి ఎదురుదాడికి దిగుతూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. బత్తాయి ఆరోగ్యానికి మంచిదని.. మనమే వినియోగించుకోవాలని చెప్పి బయటకు అమ్ముకోకుండా చేశారని విమర్శించారు. గతేడాది రూ.40 వేలకు టన్ను అమ్మితే.. ప్రసుతం రూ.10 వేలకు కూడా ఎవరూ కొనేవారు లేకుండా పోయారని అన్నారు. విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీ సంపత్‌కుమార్ పాల్గొన్నారు. -
సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షాలను తిట్టడం మీద పెట్టిన శ్రద్ధను ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై పెట్టడం లేదని, కరోనా సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వలస కార్మి కులు ఎంతమంది ఉంటారో కూడా ప్రభుత్వం దగ్గర లెక్కలు లేకపోవడం ఆశ్చ ర్యంగా ఉందని, కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో పరిపాలనలోనూ, రైతుల పంటలను కొనుగోలు చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్లో చేపట్టిన ఒక రోజు సత్యాగ్రహ దీక్షలో కూర్చున్న ఉత్తమ్ మాట్లాడుతూ...ప్రభుత్వ తీరుతో వలస కార్మికుల జీవితాలు నాశనమయ్యాయన్నారు. వలస కార్మికుల కోసం హైదరాబాద్‌లో 400 అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టామని ప్రభుత్వం చెపుతోందని, అవి ఎక్కడ ఉన్నాయనే వివరాలు కూడా లేవన్నా రు. వలస కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. వలస కార్మికులు ఊళ్లకు వెళ్లేందుకు రైల్వే శాఖ రూ.50 వసూలు చేస్తోందని, వారి వద్ద డబ్బులు వసూలు చేయవద్దని, కాంగ్రెస్ పార్టీ ఆ ఖర్చును భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ సమయంలో రాష్ట్రంలో వైన్ షాపుల విషయంలో అత్యుత్సాహం చూపవద్దని ఉత్తమ్ కోరారు. ఈ దీక్షలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీలు హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాద వ్, టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, నాయకులు బెల్లయ్య నాయక్, దాసోజు శ్రవణ్, మేడిపల్లి సత్యం తదితరులు దీక్షలో కూర్చున్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానా రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, టీపీసీసీ నేతలు నిరంజన్, బొల్లు కిషన్, ఎంఆర్జీ వినోద్‌రెడ్డి, మానవతారాయ్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు కాగా, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్షలు నిర్వహించారు. ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్‌చైర్మన్ ఎం.కోదండరెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, కుసుమ కుమార్, మల్లు రవి తదితరులు వారి ఇళ్లల్లో దీక్షలు చేశారు. -
కరోనా పరీక్షలు.. మరణాల లెక్కలు తేల్చండి
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దృష్టికి తీసుకెళ్లింది. కరోనా పరీక్షలను పూర్తిగా తగ్గించారని, దీనికి గత సహేతుక కారణాలను వెల్లడించడం లేదని వివరించింది. పరీక్షలకు అవసరమైన అన్ని సదుపాయాలున్నా వాటిని ఎందుకు వినియోగించుకోవడం లేదో ప్రభుత్వం నుంచి వివరణ కోరాలని విన్నవించింది. కరోనాపై నిర్మాణాత్మక విమర్శలు చేస్తుంటే, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులకు కరోనా సోకాలని సీఎం కేసీఆర్ శాపాలు పెడుతున్నారని గవర్నర్ దృష్టికి తెచ్చింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డిలు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసి వినతి పత్రం సమర్పించారు. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, వైద్యులకు సదుపాయాల కల్పన, ధాన్యం సేకరణ, వలస కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఈ అంశాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యంలో నాణ్యత లేదని, ధాన్యం కొనుగోళ్లలో వాడుతున్న పాత గోనె సంచులు ఫొటోలు, ధాన్యం కేంద్రాలు వసతుల లేమి అంశాలను ఫొటోలతో సహా చూపించారు. సన్నబియ్యం ఇవ్వాలి: పీసీసీ చీఫ్ ఉత్తమ్ గవర్నర్‌తో భేటీ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని పేదలకు నెలకు రూ.5 వేలు ఇవ్వడంతో పాటు సన్న బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి అన్ని రాజకీయపక్షాలతో మాట్లాడుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని విమర్శించారు. ఐసీఎమ్ఆర్ మార్గదర్శకాల ప్రకారం రోజుకు ఎన్ని కరోనా పరీక్షలు చేస్తున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాలు చూపెట్టడం లేదని, మరణాలపై ప్రభుత్వం వద్ద సరైన లెక్కలు లేవని ఆరోపించారు. చనిపోయిన వారికి కరోనా పరీక్షలు చేయవద్దని ఆదేశాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని, కరోనాతో మరణించిన కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎంతమంది వలస కూలీలున్నారో ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవని, వలస కూలీలు వెళ్ళి పోతే తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుందని, ఈ దృష్ట్యా వలస కూలీలకు సదుపాయాలు కల్పించాలని సూచించారు. నరేగాలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల ను బేషరుతుగా విధుల్లోకి తీసుకోవాలని కోరారు. -
రేపు కాంగ్రెస్ ఒక రోజు దీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, కరోనా వైరస్ నివారణ చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఒక రోజు దీక్షలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పీసీసీ, డీసీసీ కార్యాలయాలు, స్థానిక సేకరణ కేంద్రాలు, పార్టీ నేతల ఇళ్లలో ఈ దీక్షలు చేపట్టాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి ఎం. శశిధర్‌రెడ్డి సమన్వయ కర్తగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. -
రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న రూ.1,500 సరిపోవట్లేదని, వారికి రూ.5 వేలు ఇవ్వాలని కోరారు. ఉత్తమ్ నేతృ త్వంలోని అఖిలపక్ష బృందం గురువారం స చివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలసి రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించింది. కోదండరాం (టీజేఎస్), చాడ వెంకటరెడ్డి (సీపీఐ), ఎల్.రమణ (టీడీపీ), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటి పార్టీ)లు సీఎస్‌ను కలసి పలు సూచనలతో కూడిన వినతిపత్రం అందించారు. అనంతరం మీడియాతో మా ట్లాడారు. 40 రోజుల లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, అనివార్యమైన ఇబ్బందులను స్ఫూర్తితో ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. అఖిలపక్ష నేతలు ఎవరేమన్నారంటే రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పని చేయట్లేదు. గాంధీ, ఉస్మానియాలో మిగతా ఆరోగ్య సేవలు పునరుద్ధరించాలి.’ –చెరుకు సుధాకర్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసిన వారికి కూడా రేషన్ బియ్యం ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేలు ఇవ్వాలి. సంగారెడ్డిలో నిరసన తెలిపిన కార్మికులకు జీతం ఇప్పించాలి. చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ‘రేషన్‌లో బియ్యంతో పాటు, పప్పు, నూనె ఇవ్వాలి. వాహనాల పన్నును 3 నెలల పాటు రద్దు చేయాలి. కోదండరామ్, టీజేఎస్ ‘రైతు రుణమాఫీ చేయాలి. సూరత్, భివండి, ముంబైలలో ఉన్న వలస కార్మికులను సొంత రాష్ట్రానికి తీసుకురావాలి. – ఎల్.రమణ, టీటీడీపీ అధ్యక్షుడు -
సామాజిక బాధ్యతగా కరోనాపై పోరాటం
సాక్షి, హైదరాబాద్: కరోనాపై పోరాటాన్ని కాంగ్రెస్ పా ర్టీ సామాజిక బాధ్యతగా తీసుకుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బాధ్యత గల ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇస్తూనే తమ వంతుగా పేదలకు సాయం చేసే ప్రయత్నం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ నేత అనిరుధ్ రెడ్డి నేతృత్వంలో ఆ నియోజకవర్గ ప్రజలకు 1.50 లక్షల శానిటైజర్ బాటిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన సోమవారం గాంధీభవన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. లాక్డౌన్ వేళ పేదలను ఆదుకునే కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని కార్యకర్తలకు సూచించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని, దీనికి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని పిలుపునిచ్చారు. జిల్లా, మండల, బ్లాక్, గ్రామ కాంగ్రెస్ నేతలు తమ ప్రాంతాల పరిధిలో వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి కరోనాపై ప్రజలను చైతన్యవంతులు చేయాలని కోరారు. -
కరోనాకు మతం రంగు పులమొద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో మతం ప్రస్తావన అనవసరమని, మతం రంగు పులిమి ప్రచారం చేయడం తగదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలకు తావు లేకుండా ఈ మహమ్మారిని ఐక్యంగా ఎదుర్కోవాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా దేశానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. గాంధీభవన్ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌తో పాటు ఫేస్బుక్ లైవ్‌లో ఆదివారం ఉత్తమ్ మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో రాష్ట్రంలోని ప్రజలు, పేదలను ఆదుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. -
ఆ రోజు అలా మాట్లాడి తప్పు చేశా!
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా గురించి గతంలో బహిరంగంగా మాట్లాడి తప్పు చేశానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే పార్టీకి నష్టం జరగకూడదనే ఆలోచన, ఆవేదనలే తనను అలా మాట్లాడించాయని పేర్కొన్నారు. టీడీపీతో పొత్తు వద్దని, అందరినీ కలుపుకుని వెళ్లాలని మాత్రమే చెప్పానని, అయినా తాను చేసింది తప్పేనని అంగీకరించారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పార్టీ నేతలకు ఏదైనా సమస్య ఉంటే అంతర్గత వేదికల్లో మాత్రమే మాట్లాడాలన్న కుంతియా సూచన సరైందేనని, పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లడానికి, ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి రావడానికి సంబంధం లేదన్నారు. రేవంత్ ఓటుకు నోటు కేసులోనే జైలుకు వెళ్లారని, ఇప్పుడు జైలుకు వెళ్తే తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతాననే ఆలోచనతో జైలుకు వెళ్లలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిమానులు వారు అభిమానించే వారికి పీసీసీ అధ్యక్ష పదవి రావాలనుకోవడంలో తప్పులేదని, అయితే అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవి అధిష్టానం ఎవరికి ఇచ్చినా అందరూ సహకరించాలని కోరారు. బలమైన నాయకుడికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని, టీఆర్ఎస్ను గద్దె దించుతామని ధీమా వ్యక్తం చేశారు. -
కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అనుసరించి కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపించాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం ఆయన పార్లమెంటు ఆవరణ లో మీడియాతో మాట్లాడారు. రైల్వే పద్దులపై జరిగిన చర్చలో ఈ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించినట్టు తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పా టు చేయాల్సి ఉన్నప్పటికీ, ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. ఏదైనా ఇబ్బందులుంటే స్పష్టత ఇవ్వా లని, కనీసం పీపీపీ పద్ధతిలోనైనా కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని కోరామని వివరించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహ దారి వెంట రైల్వే లైన్ వేస్తే ప్రయాణ సమయం చాలా తగ్గుతుందని పేర్కొన్నారు. రెండు రాజ ధానుల మధ్య హై స్పీడ్ ట్రైన్ వేస్తే 2 గంటల్లో ప్రయాణం చేయొచ్చని పేర్కొన్నారు. -
ఎన్నార్సీ వ్యతిరేక తీర్మానానికి మద్దతు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ఎన్పీఆర్, ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేసే తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతునిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీలో తీర్మానం చేసి సరిపెట్టుకోకుండా కేరళ, ఇతర రాష్ట్ర ప్రభుత్వాల తరహాలో తాము ఎన్పీఆర్, ఎన్నార్సీలను తెలంగాణలో అమలు చేయబోమని జీవోలు కూడా విడుదల చేయడం ద్వారా మోదీ–షా మతరాజకీయాలకు తెలంగాణ వ్యతిరేకమని తెలియజేయాలని కోరా రు. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) అమలుతో సమస్య లేదని, దాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ దేశంలోని పౌరుల మధ్య చిచ్చు పెట్టాలనుకునే కుట్రతోనే దేశ సమగ్రతకు ముప్పు ఉందన్నారు. -
పీఆర్సీ అమలు చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన పార్టీ అధికార ప్రతినిధి, టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.హర్షవర్ధన్‌రెడ్డితో కలసి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు నిరాశలో ఉన్నాయని, తెలంగాణ ఏర్పాటైన తర్వాత వీరి హక్కులు కాలరాస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. 2018, జూలై 1 నుంచే అమల్లోకి రావాల్సిన 11వ పీఆర్సీని 20 నెలలు గడుస్తున్నా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ‘పీఆర్సీ గడువు మరో 10 నెలలు ఎందుకు పొడిగించాల్సి వచ్చింది. పొడగింపు కోసం కమిషన్ సభ్యులు అడిగిన కారణాలను ప్రజాబాహుళ్యంలో ఎందుకు పెట్టలేదు? ఐదేళ్ల కాలపరిమితి ఉన్న పీఆర్సీలో మూడేళ్లు ఉద్యోగులకు ఫిట్మెంట్ ప్రకటించకపోతే ఆ మేరకు వారు ఆర్థికంగా నష్టపోరా?’అని ఆ లేఖలో నిలదీశారు. -
ఎక్స్ అఫీషియో ఓటుపై కోర్టుకు ?
సాక్షి,హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఎక్స్ అఫీషియో ఓట్లతో ప్రజాతీర్పునకు విఘాతం కలిగించేలా వ్యవహరించిందని, ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని టీపీసీసీ నిర్ణయించింది.తుక్కుగూడ మున్సిపాలిటీలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఓటేయడం, ముందుగా తుక్కుగూడకు టీఆర్ఎస్ ఎక్స్అఫీషియోగా కేటాయించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిని మళ్లీ నేరెడుచర్లకు మార్చడం, మంత్రి సబితా ఇంద్రారెడ్డి తొలుత బడంగ్‌పేటకు ఆప్షన్ ఇచ్చి, ఆ తర్వాత తుక్కుగూడలో ఓటేయడం వంటి ఉదంతాలపై చట్టపరంగా కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. ఆయా సందర్భం, అవసరాన్ని బట్టి రాజ్యసభ ఎంపీల ఎక్స్ అఫీషియో ఓటు వ్యవహారంపై రాజ్యసభ చైర్మన్‌ను, సెక్రటేరియట్‌ను కోరాలని కొందరు నేతలు ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ ఓటు విషయంలో తాము ముందు నుంచి హెచ్చరిస్తున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరిగా స్పందించలేదని, అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరించిన తీరును ఎండగట్టాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.శుక్రవారం రాత్రి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో ఆయా అంశాలు చర్చకు వచ్చాయి. ప్రజాతీర్పును కాదని ... మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్రమాలు, ఎక్స్ అఫీషియో సభ్యుల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరుపై చర్చించారు. న్యాయనిపుణుల సలహాలు, సూచనల మేరకు దీనిపై చట్టపరంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్‌నేతలతో పాటు, న్యాయవాది జంధ్యాల రవిశంకర్ పాల్గొన్నారు. త్వరలోనే జరగనున్న సహకార సంఘాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పక్షాన అనుసరించాల్సిన వ్యూహం పైన చర్చించారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశంలో అధికార టీఆర్ఎస్ ఎక్స్ అఫీషియో ఓటింగ్ విషయంలో వ్యవహరించిన తీరుపై చర్చించినట్టు తెలిపారు.ప్రజాతీర్పును కాదని పలు మున్సిపాలిటీలను టీఆర్ఎస్ అక్రమంగా కైవసం చేసుకుందని, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని కూడా భయపెట్టారని ధ్వజమెత్తారు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. కేసీఆర్ హయాం లో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఈ భేటీలో సహకార ఎన్నికల పై అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించామన్నారు. టీఆర్ఎస్ను సహకార ఎన్నికల్లో ఓడించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ముఖ్యనేతల సమావేశంలో సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు డా.జి.చిన్నారెడ్డి, డా.సీహేచ్ వంశీచంద్‌రెడ్డి, మాజీ మంత్రులు మహ్మద్ అలీ షబ్బీర్, మర్రి శశిధర్‌రెడ్డి, కిసాన్సెల్నేత ఎం.కోదండరెడ్డి, టీపీసీసీనేత నిరంజన్ పాల్గొన్నారు. సమావేశంలో ఉత్తమ్. చిత్రంలో జగ్గారెడ్డి, నిరంజన్, జీవన్‌రెడ్డి, జానా, కోదండరెడ్డి, వంశీ చంద్, షబ్బీర్ అలీ, శశిధర్‌రెడ్డి, చిన్నారెడ్డి తదితరులు -
‘ఎక్స్ అఫీషియో ఓటు నమోదు’పై వివాదం
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఓటు హక్కు నమోదుపై నెలకొన్న వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు ఇక్కడ ఓటు హక్కు నమోదుకోసం దరఖాస్తు పెట్టుకోగా జాబితాలో ఆయన పేరులేదని కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందనే ఉద్దేశంతో కావాలనే మంత్రి జగదీశ్‌రెడ్డి, అధికారులు కుమ్మకై ఆయన పేరును తొలగించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కేవీపీ పేరును తొలగించి అధికార యంత్రాంగం నిబంధనలను ఉల్లంఘించిందని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూర్యాపేటలోని కలెక్టర్ క్యాం పు కార్యాలయం ఎదుట ఆదివారం రాత్రి 10.30 గంటలకు కాంగ్రెస్ శ్రేణులతో కలసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి జగదీశ్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉందన్న అక్కసుతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. -
ఎన్నార్సీకి నిరసనగా జాతీయ నిరుద్యోగ రిజిస్టర్
సాక్షి, హైదరాబాద్: జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్నార్సీ)కి నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘జాతీయ నిరుద్యోగ రిజిస్టర్ (ఎన్యూఆర్) ప్రక్రియను ప్రారంభించారు. తమకు కావాల్సింది ఉద్యోగాలు మాత్రమేనని ఎన్నార్సీ కాదని గురువారం గాంధీభవన్‌లో నిరుద్యోగ పట్టభద్రులు తమ నిరసన వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కార్యదర్శి గురజాల వెంకట్ల ఆధ్వర్యంలో ఇడ్లీలు, చాయ్‌లు అమ్ముతూ, చెప్పులు కుడుతూ, టైర్లు రిపేర్ చేస్తూ ఎన్నార్సీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన ప్రధాని మోదీ నిరుద్యోగులను మోసం చేశారని, ఇప్పటికైనా తమకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జాతీయ నిరుద్యోగ రిజిస్టర్ తయారీ కోసం జాతీయ యువజన కాంగ్రెస్ నిర్వహిస్తున్న మిస్డ్ కాల్ క్యాంపెయిన్‌ను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ రిజిస్టర్లో పేరు నమోదు చేసుకునేందుకు రాష్ట్రంలోని నిరుద్యోగులు 81519 94411 నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వాలని అనిల్‌కుమార్ యాదవ్ కోరారు. -
ఏమీ చేయలేదు..ఏమీ చేయబోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల అభివృద్ధికి గత ఆరేళ్లలో టీఆర్ఎస్ చేసిందేమీ లేదని, భవిష్యత్‌లో కూడా ఆ పార్టీ నేతలు ఏమీ చేయబోరని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసలు పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై వారికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ విషయాలు సీఎం కేసీఆర్‌కు గుర్తుకు రావాలంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను చిత్తుగా ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన గురువారం గాంధీభవన్ నుంచి టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. గత ఆరేళ్లలో టీఆర్ఎస్ వైఫల్యాలను, ప్రజలను మోసం చేసిన తీరును ఎన్నికల ప్రచారంలో ఎండగట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్కు ఓట్లడిగే అర్హత లేదు మూడేళ్లలో మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లడగబోనని 2014 డిసెంబర్లో అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పారని, నేటికీ నీళ్లివ్వని టీఆర్ఎస్, కేసీఆర్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత లేదని ఉత్తమ్ అన్నారు. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, రైతుబంధు, ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు తదితర అన్ని అంశాల్లో కేసీఆర్ మాట తప్పిన విషయాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీలు తీర్మానాలు చేశాయని, తెలంగాణలో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేయాలని తాము కోరినా సీఎం పట్టించుకోవడం లేదన్న విషయాన్ని మైనార్టీలు గుర్తించాలని కోరారు. మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లండి.. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన కామన్ మేనిఫెస్టో–విజన్ డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రాలు, శనివారం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ను గెలిపిస్తే పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి చేస్తామో ప్రజలకు వివరించాలని కోరారు. తాము మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన ఉత్తమ్ మున్సిపల్ ఎన్నికల్లో అసలు బీజేపీ పోటీలోనే లేదని వ్యాఖ్యానించారు. -
ఏం ఉద్ధరించారని ఓట్లడుగుతారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో ఏ మున్సిపాలిటీని ఉద్ధరించారని ఓట్లు అడగుతున్నారో ప్రచారానికి వచ్చిన టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆరేళ్లుగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ చేసింది శూన్యమని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పట్టణ ప్రాంత ప్రజల అభివృద్ధికి చేసిందేమీ లేదనే విషయాన్ని ప్రతి ఓటరు దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు. శుక్రవారం గాంధీభవన్ నుంచి మున్సిపల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఉత్తమ్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో జరిగిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి డబ్బును అడ్డం పెట్టుకుని, అధికార దుర్వినియోగం చేసి టీఆర్ఎస్ గెలవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ ప్రయత్నాలను, కుట్రలు, కుతంత్రాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఛేదించాలని, వీరసైనికుల్లా పోరాడి ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఒక్క నిరుద్యోగికి భృతి ఇవ్వలే.. మున్సిపాలిటీల్లో కొత్తగా రోడ్లు వేయడం అటుంచితే, మిషన్ భగీరథ పేరుతో ఉన్న రోడ్లను ధ్వంసం చేశారని, విద్యుత్, శానిటేషన్, నీటిసరఫరా విషయంలో పూర్తిగా విఫలమయ్యారని ఉత్తమ్ మండిపడ్డారు. రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలో కనీస మౌలిక వసతుల కల్పన జరగలేదని, ఈ విషయాలన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. నిరుద్యోగ యువతకు ఇస్తామన్న నిరుద్యోగ భృతిని ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతుకు రుణమాఫీ చేయలేదని, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు ఝలక్ ఇస్తేనే నిరుద్యోగ భృతి, రైతురుణమాఫీ వస్తాయని ఉత్తమ్ అన్నారు. టీఆర్ఎస్–బీజేపీలు మిలాఖత్.. అన్ని విషయాల్లో ఇలాగే మోసం చేసే కేసీఆర్ గత ఆరేళ్లలో అనేక సందర్భాల్లో బీజేపీతో జతకట్టిన విషయాన్ని రాష్ట్రంలోని మైనార్టీలు కూడా గుర్తించాలని ఉత్తమ్ కోరారు. అవసరమైన అన్ని సందర్భాల్లోనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ వత్తాసు పలికిందని, టీఆర్ఎస్, బీజేపీలు మిలాఖత్ అయ్యాయని ఆరోపించారు. టీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనన్న విషయాన్ని మైనార్టీలు గుర్తించి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సీఏఏపై సీఎం మౌనం ఎందుకు? పంజాబ్, కేరళ, బిహార్, ఒడిశా, బెంగాల్ సీఎంలు తమ రాష్ట్రాల్లో సీఏఏను అమలు చేయడం లేదని స్పష్టంగా చెప్పినా, కేసీఆర్ మాత్రం మౌనంగా ఉంటున్నారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. ఈ విషయంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి సీఏఏకు వ్యతిరేకంగా తీర్మా నం చేయాలని కాంగ్రెస్ పార్టీ పదేపదే కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ను ఎందుకు నిలదీయడం లేదో ఎంఐఎం అధినేత ఒవైసీ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని ఉత్తమ్ కోరారు. నామినేషన్ల పరిశీలన, అవసరమైన చోట్ల అప్పీల్ చేయడం, పోలింగ్, కౌంటింగ్ వరకు అందరూ ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
స్థానిక అంశాల వారీగా లోకల్ మేనిఫెస్టో
సాక్షి, హైదరాబాద్: స్థానిక అంశాల వారీగా లోకల్ మేనిఫెస్టో తయారు చేసుకోవాలని జిల్లా, మున్సిపాలిటీల నాయకులకు సూచించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం వరకు సెలక్ట్ ఎలక్ట్ పద్ధతిలో అభ్యర్థులను నిర్ణయిస్తామని, బుధవారం అన్ని మున్సిపాలిటీల్లో స్థానిక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ‘కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసేవారు రూ.20 బాండ్ పేపరుపై అఫిడవిట్ ఇవ్వాలి. పార్టీనుంచి గెలిచిన వారు ఇతర పార్టీలకు వెల్లకుండా అఫిడవిట్ ఇవ్వాలి. 11, 12 ఏ, బీ ఫాంలు ఇస్తాం. స్క్రుటినీ తర్వాత బీ ఫాంలు ఇవ్వొచ్చు’ అని ఆయన తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో, నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేదా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి.. ఎంపీ అభ్యర్థితో పాటు డీసీసీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రాష్ట్ర నాయకులు కలిసి అభ్యర్థులను నిర్ణయిస్తారన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో టీపీసీసీ తెలంగాణ ఇంచార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, వీహెచ్, మల్లురవి, కుసుమకుమార్, చిన్నారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్, మధుయాష్కి, గీతారెడ్డి, శారద, కొండా విశ్వేశ్వరరెడ్డి, బలరాం నాయక్, అంజన్ కుమార్‌యాదవ్, జి.నిరంజన్ పాల్గొ న్నారు. సమావేశంలో మున్సిపల్ ఎన్నికలు, మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చించారు. కామన్ మేనిఫెస్టో తయారు చేయాలని, కాంగ్రెస్ గెలిచే మున్సిపాలిటీలపై చర్చించినట్లు ఉత్తమ్ మీడియాకు తెలిపారు. ‘పార్టీలో నేను కూడా ఉన్నా. కనీసం పట్టించుకోండి. డీసీసీ నియామకం సమాచారం ఉండదు.. పొత్తుల విషయం చెప్పకుండా మీరే చేస్తారా?’అని రేణుక చౌదరి ప్రశ్నించినట్లు సమాచారం. బుధవారం నుంచి నామినేషన్లుండగా, ఇప్పుడు సమావేశం పెడితే ఎలా? అని ఆమె అన్నారు. ‘మీకు సమాచారం ఇస్తూనే వచ్చాం. మీరే సమావేశాలకు రాలేదు’అని కుంతియా సమాధానమిచ్చినట్లు తెలిసింది. సీనియర్లకు ఒక మున్సిపాలిటీ బాధ్యత ఇవ్వడం అవమానించడం కాదని, వారి అనుభవాలతో గెలవడం కోసమే అని పేర్కొన్నట్లు సమాచారం. -
మున్సి‘పోల్స్’పై పిల్
సాక్షి, హైదరాబాద్: మున్సిపాల్టీల్లో వివిధ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం రాజ్యాంగ వ్యతిరేకమంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ పిల్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం దీనిపై విచారించనుంది. గత నెల 23న ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేయాలని, దీనిని రీషెడ్యూల్ చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని, పిల్‌పై తుది ఉత్తర్వులు వెలువడే వరకూ షెడ్యూల్‌పై ఏవిధంగా ముందుకు వెళ్లకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ నెల 7న రాష్ట్ర ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోతుందని, ఈప్రక్రియను నిలిపివేయాలని కోరారు. ఈనెల 5న రాష్ట్ర ప్రభుత్వం ఆయా పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎస్ఈసీకి ఇస్తుందని, ఆ తర్వాత ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తుందని, రిజర్వేషన్ల ఖరారుకు ఎన్నికల నోటిఫికేషన్ జారీకి మధ్యలో ఒక్క రోజు మాత్రమే గడువు ఉందని పత్రికల్లో వార్తలు వచ్చాయని, ఒక్క రోజు వ్యవధిలో కుల ధ్రువీకరణ పత్రాలు పొందడం కష్టమని, కనీసం వారం రోజుల వ్యవధి ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. షెడ్యూల్ విడుదల చేసే నాటికి ఓటర్ల జాబితా కూడా సిద్ధం కాలేదని, ఉద్దేశపూర్వకంగానే రిజర్వేషన్ల ఖరారులో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. వ్యవధి తక్కువగా ఉండటం వల్ల అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని, రిజర్వేషన్ల ఖరారులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పడానికి, సమస్యపై వివరించేందుకు వారం రోజులు సమయం ఉండేలా చేయాలని పిల్లో పేర్కొన్నారు. ఇందులో మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి, డైరెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. -
ఉత్తమ్ వారసుడెవరో?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పదవి వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల ప్రజలకు, నల్లగొండ పార్లమెంటు పరిధిలోని ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేందుకుగాను తాను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి మున్సిపల్ ఎన్నికల తర్వాత తప్పుకుంటానని ప్రస్తుత చీఫ్ ఉత్తమ్ స్వయంగా వెల్లడించడంతో ఆయన వారసుడు ఎవరనే దానిపై కాంగ్రెస్ కేడర్‌లో విస్తృత చర్చ జరుగుతోంది. వాస్తవానికి, గత ఏడాది కాలంగా టీపీసీసీ అధ్యక్షుని మార్పుపై రాష్ట్రంలో చర్చ జరుగుతున్నా, స్వయంగా ఉత్తమ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త ‘బాస్’ఎవరనేది ఆసక్తి కలిగిస్తోంది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబుల పేర్లు రేసులో ముందు వరుసలో వినిపిస్తుండగా, టీపీసీసీ ముఖ్య నేతలు చాలా మంది తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. జాబితా పెద్దదే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు టీపీసీసీలోని చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. ఈ పదవి కోసం వినిపిస్తున్న వారి పేర్లలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల్లోని అందరూ ఉన్నారు. అయితే, మాస్లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని త్యజించిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం ఇస్తారనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. ఆయన కూడా బహిరంగంగా తాను పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని పలుమార్లు చెప్పగా, గులాంనబీ ఆజాద్ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఆయన మద్దతుదారులు గాంధీభవన్‌లో ఆందోళన కూడా నిర్వహించారు. మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా రేసులో అందరికంటే ముందున్నారు. యువకుడు కావడంతో పాటు రాష్ట్రంలో మంచి క్రేజ్ ఉన్న నేతగా ఆయనకు అవకాశం ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది. అయితే, రేవంత్ అభ్యర్థిత్వానికి అధిష్టానం నుంచి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా కొందరు స్థానిక నేతలు అడ్డు తగులుతున్నారని సమాచారం. ఇక, సౌమ్యుడిగా ముద్ర పడిన మాజీ మంత్రి శ్రీధర్‌బాబు కూడా టీపీసీసీ రేసులో ముందు వరుసలోనే ఉన్నారు. శ్రీధర్‌బాబుకు అధ్యక్ష పదవి కోసం రాష్ట్ర పార్టీలోని కొందరు కీలక నేతలు ప్రయత్నిస్తున్నారని, ఆయనకు మద్దతుగా ఇద్దరు కీలక నేతలు లేఖలు కూడా ఇచ్చారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరితో పాటు పలువురు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు ఒక్కతాటిపైకి వచ్చి ఈసారి తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని అడుగుతున్నారు. ఇందుకోసం హైదరాబాద్ వేదికగా ఇటీవల సంయుక్తంగా సమావేశం కూడా పెట్టుకున్నారు. వీటన్నింటి నేపథ్యంలో కాబోయే టీపీసీసీ చీఫ్ ఎవరు.. అధిష్టానం ఏ వర్గానికి ప్రాధాన్యమిస్తుంది.. సామాజిక అంశాల ను బేరీజు వేసుకుంటుందా..? చరి ష్మా ఆధారంగా పదవి కట్టబెడు తుందా..? అన్నది కాం గ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఏఐసీసీ ప్రక్షాళన తర్వాతే! టీపీసీసీ అధ్యక్ష పదవిపై ప్రస్తుతానికి ఏఐసీసీ దృష్టి పెట్టకపోయినా గతంలో ప్రాథమికంగా కొంత కసరత్తును పూర్తి చేసింది. ఏఐసీసీ కసరత్తుతో పాటు టీపీసీసీ నేతలు పలువురు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు కూడా తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయితే, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏఐసీసీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తారని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జులను కూడా దేశవ్యాప్తంగా మార్పు చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఇన్చార్జి కుంతియా స్థానంలో కొత్త నేత వచ్చే అవకాశముందని, పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా కొత్త నాయకుడు వచ్చిన తర్వాత ఆయన నేతృత్వంలోనే టీపీసీసీ అధ్యక్ష ఎంపిక కసరత్తు పూర్తిస్థాయిలో జరుగుతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే మార్చి లేదా ఏప్రిల్ వరకు టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కొనసాగనున్నారు. మరి కొత్త ఇన్చార్జి రాష్ట్ర కాంగ్రెస్ కొత్త బాస్ ఎంపిక కసరత్తు పూర్తి చేస్తారా? ఉత్తమ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈలోపే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా? అన్నది వేచి చూడాల్సిందే! -
ప్రజలకు ఒరిగిందేమీ లేదు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఏడాది అంతా హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, అప్పులు, ఆందోళనలతోనే గడిచిపోయిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. దిశ హత్య, హాజీపూర్, వరంగల్, ఆసిఫాబాద్, జడ్చర్ల ఘటనలు దేశవ్యాప్తం గా తెలంగాణ పరువు తీశాయని, ఈ ఏడాది తెలంగాణ అశాంతి నిలయంగా మారిందని శుక్రవారం ఆయన ఓప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. -
బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదేలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లాంటి అవగాహన రహిత నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఇంతటి నిరుద్యోగ సమస్య ఎప్పుడూ లేదని, వేలాది చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, లక్షల కోట్ల రూపాయల సంపద నష్టపోయామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక తిరోగమన విధానాలకు నిరసనగా ఏఐసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 30న ఢిల్లీలోని రాం లీలా మైదానంలో నిర్వ హించనున్న ‘భారత్ బచావో ర్యాలీ’కి రాష్ట్రం నుంచి పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హాజరుకావాలన్నారు. కార్యక్రమ బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సి.జె.శ్రీనివాస్‌లకు అప్పగిస్తున్నట్టు తెలిపారు. -
ప్రజా పోరాటాలకు..కాంగ్రెస్ కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ దీనిపై ప్రజా పోరాటాలు చేసేందుకు నిర్ణయించింది. ఇప్పటికే ఏఐసీసీ కోర్‌కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రభుత్వ అవినీతిపై పూర్తి సమాచారం, ఆధారాలు సేకరించాలనే నిశ్చయానికి వచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను సందర్శించి ఆధారాల సేకరణకు వీలుగా ఓ కమిటీని నియమించింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చైర్మన్‌గా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కన్వీనర్‌గా 26 మందితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో పార్టీ సీనియర్ నేతలు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, టి.జీవన్‌రెడ్డి, కె.జానారెడ్డి, దామోదర రాజనర్సింహా, విజయశాంతి, చిన్నారెడ్డి, మధుయాష్కీ, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, గీతారెడ్డి, మల్లురవి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, అమీర్ జావేద్‌లను సభ్యులుగా నియమించారు. అవినీతిపై మెమోరాండం రూపంలో రాష్ట్రపతి, గవర్నర్, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సమర్పిస్తుంది. -
ఆత్మహత్యలు వద్దు..: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వంతో పోరాడి సాధించుకుందామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఖమ్మంలో డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యాయత్నానికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించి, అతని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ఉత్తమ్ శనివారం ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దసరా పండుగ రోజు ఆర్టీసీ కార్మికులు పస్తులున్నారని, వారి ఆకలి బాధలు కేసీఆర్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు కార్మికుల ఉసురు తగులుతుందని, ఇప్పటికైనా మొండి వైఖరి విడనాడి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కాంగ్రెస్‌పార్టీ వారికి అండగా ఉంటుందని ఆ ప్రకటనలో భరోసా ఇచ్చారు. -
కేటీఆర్‌వి అవగాహనలేని మాటలు: ఉత్తమ్
చింతలపాలెం (హుజూర్నగర్): మంత్రి కేటీఆర్ హుజూర్నగర్ ప్రాంత అభివృద్ధిపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ‘రోడ్‌షోలో కేటీఆర్ మాటలు చూస్తుంటే.. ఆయనకు స్థానిక పరిస్థితులపై అవగాహన లేదన్న విష యం తేటతెల్లమైంది’అని అన్నారు. ‘బ్రదర్ మీకు ఎవరు స్పీచ్ రాసిచ్చారో అది చేంజ్ చేసుకోండి’అని కేటీఆర్‌ను ఉద్దేశించి ఉత్తమ్ చురక వేశారు. మీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి ఊరిలో కూడా ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు. -
జీ హుజూరా? గులాబీ జెండానా?
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: ‘ఈరోజు హుజూర్నగర్ ప్రజల ముందు స్పష్టమైన అవకాశం.. మార్గం ఉంది. ప్రత్యామ్నాయం ఉంది. మళ్లీ వాళ్లకే ఓటేసి జీ హుజూర్ అందామా.. లేదా గులాబీ జెండాను గుండెకు హత్తుకొని జై హుజూర్నగర్ అందామా? ఏ విషయం ఆలోచించుకోవాలి’అని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఉత్తమ్ మోసకారి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన ఉత్తమ్, అప్పుడు సీఎంని అవుతానంటూ ఓట్లు వేయించుకున్నారని, మళ్లీ 2019లో కేంద్ర మంత్రిని అవుతానని చెప్పి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారని, ప్రజలను ఇలా మభ్య పెట్టిన ఉత్తమ్ మోసకారి అని కేటీఆర్ విమర్శించారు. రూ.2 వేల కోట్లు ఇచ్చాం.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు మొత్తం రూ.2 వేల కోట్లపైచిలుకు వివిధ కార్యక్రమాల ద్వారా హుజూర్నగర్ ప్రజలకు అందించినట్లు కేటీఆర్ చెప్పారు. కాగా, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అన్నారు. ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తట్ట, పార పారేసి ఎప్పుడో చెక్కేశారన్నారు. ఆయన దేశంలోనే లేడన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు.. పేరుకే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అని, ఆయన వెనక 12 మంది ‘నేను సీఎం, నేను సీఎం’ అంటూ ఎన్నికలు కాకముందే అన్నారన్నారు. అందులో నల్లగొండలో నలుగురు ఉన్నారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఎలాగైనా సైదిరెడ్డిని ఓడించాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే సంక్షేమం, పల్లెపల్లెలో అభివృద్ధి చేసి చూపించే బాధ్యత తనదని మంత్రి కేటీఆర్ అన్నారు. రోడ్‌షోలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జిల్లా సీపీఐ నాయకులు పాల్గొన్నారు. ఏనాడూ ప్రజలకోసం అడగలేదు.. గతంలో ఉత్తమ్ ఎమ్మెల్యేగా ఉన్నా .. ఐదేళ్లలో ఏనాడూ మా ప్రజలకు ఇది కావాలంటూ ఒక్క దరఖాస్తు కూడా చేయలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘నేను సీఎం స్థాయి వ్యక్తిని నేను వెళ్లి, జగదీశ్, కేటీఆర్‌ను అడుగుతానా..?’అన్న అహంకారం ఉత్తమ్‌కు ఉందన్నారు. -
అభివృద్ధి చేసిందే కాంగ్రెస్
హుజూర్నగర్ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హుజూర్‌నగర్‌లో అభివృద్ధి జరిగిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. సోమవారం హుజూర్నగర్ పబ్లిక్ క్లబ్లో నిర్వహించిన కాంగ్రెస్ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. హుజూర్నగర్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచిన తాను రూ.2వేల కోట్లతో అభివృద్ధి పనులు చేయించానని చెప్పారు. మట్టపల్లిలో హై లెవెల్ వంతెనను రూ.50 కోట్లతో కట్టిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రూ.50 లక్షలతో అప్రోచ్ రోడ్డు వేయకుండా, బ్రిడ్జిని ప్రారంభించకుండా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అలాంటి వారు మేమే అభివృద్ధి పనులు చేశామంటూ ప్రజల్లోకి వెళితే ఛీ కొడుతున్నారని చెప్పారు. హుజూర్‌నగర్‌లో రూ.200 కోట్లతో 4వేల ఇళ్లు 80 శాతం పూర్తి చేస్తే, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఆరేళ్లయినా 20 శాతం పనులు పూర్తి చేయలేదని, నిరుపేదలకు ఇళ్లు పంపిణీ చేయలేదన్నారు. కాంగ్రెస్‌దే గెలుపు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు 700 మంది వచ్చి టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేసినా గెలుపు కాంగ్రెస్‌దేనని ఉత్తమ్ అన్నారు. అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీనే ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారన్నారు. అధికార పార్టీ వారు పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తానని చెప్పి పది నెలలు దాటినా ఇంత వరకు అతీగతి లేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులను కుక్క తోకతో పోలి్చన కేసీఆర్‌కు ప్రజలు, కార్యకర్తలు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అప్పులతో తాకట్టు..: కోమటిరెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టే దుస్థితి తెచి్చందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైరల్ ఫీవర్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తన కుక్క చనిపోయిం దని డాక్టర్ రంజిత్కుమార్పై కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన కేసీఆర్‌కు హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధం గా ఉన్నారన్నారు. తామిద్దరం ఎంపీలం కలసి హుజూర్‌నగర్‌కు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ని గెలిపిస్తే నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం అసెంబ్లీలో కేసీఆర్‌ను నిలదీస్తామన్నారు. 52 ఏళ్ల క్రితమే 50 లక్షల ఎకరాలకు సాగునీరందించిన ఘనత కాంగ్రెస్‌దేనని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ, జాతీయ ఉపాధి హామీ పథకం లాంటివి కాంగ్రెస్ హయాంలోనే జరిగాయన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంటు మల్లు భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి, కర్ణాటక ఎమ్మెల్సీ సలీం అహ్మద్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్యే సీతక్క, హుజూర్నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మావతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ నేతలు భయంతో వణికిపోతున్నారు సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారంలోకి వచి్చన ఆరేళ్లలో హుజూర్నగర్ నియోజకవర్గంలో చేసిన ఒక్క అభివృద్ధి పనిని చూపించినా పోటీ నుంచి కాంగ్రెస్ తప్పుకుంటుందని ఉత్తమ్ చెప్పారు. హుజూర్నగర్ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సోమవారం ఆయన ఫేస్బుక్లో కాంగ్రెస్ కేడర్‌నుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2009లో తాను తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో విద్యుత్ సమస్య నుంచి బయటపడేశామని, నియోజకవర్గ వ్యాప్తంగా 130 కేవీ, 13/11 కేవీ ఉప సబ్స్టేషన్లు 12 ఏర్పాటు చేయించామన్నారు. తన హయాంలోనే నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల వచి్చందని, 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశామని చెప్పారు. నేరేడుచర్ల–కోదాడ–ఖమ్మం రోడ్డును ఫోర్‌లైన్‌గా విస్తరించామన్నారు. టీఆర్ఎస్ హయాం లో నియోజకవర్గంలో చెప్పుకోదగిన ఒక్క అభివృద్ధి పని జరగలేదని, అందుకే ఓటమి భయంతో టీఆర్ఎస్ నేతలు వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు. శాంతియుత ప్రాం తంగా పేరొందిన నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు భయోత్పాతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాపాడేందుకు సీపీఐ తమకు మద్దతు ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఎం, టీడీపీలు కూడా పోటీ నుంచి వైదొలగి కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ఉత్తమ్ కోరారు. -
హుజూర్నగర్ నుంచే టీఆర్ఎస్ పతనం
గరిడేపల్లి: హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఓటమితోనే టీఆర్ఎస్ పతనం ప్రారంభం కానుందని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని అప్పన్నపేట, అబ్బిరెడ్డిగూడెం, లక్ష్మీపురం, సర్వారం గ్రామాల్లో జరిగిన పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ఒక్క ఆడ మనిషిని ఓడించడానికి 700 మంది టీఆర్ఎస్ నాయకులు హుజూర్‌నగర్‌లో మోహరించారంటే ఆ పార్టీ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవాలన్నారు. గలీజు రాజకీయాలకు మారు పేరుగా టీఆర్ఎస్ మారిందని విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని, ప్రలోభాలకు తెరదించుతూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ మంత్రులు, నాయకులకు హుజూర్నగర్ ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ‘నా సతీమణి పోటీ చేస్తున్న ఈ ఎన్నిక హుజూర్నగర్ ఆత్మ గౌరవ ఎన్నిక’అని ఉత్తమ్ అన్నారు. ఈ ఎన్నికల్లో 40 వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందన్నారు. హుజూర్నగర్.. కాంగ్రెస్‌కు అడ్డ అని పేర్కొన్నారు. ఆరేళ్ల పాలనలో ఒక్క పనిచేయని టీఆర్ఎస్ నాయకులు.. ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతున్నారని ప్రశ్నించారు. -
బెదిరించి టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారు
చింతలపాలెం (హుజూర్నగర్): హుజూర్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను, నాయకులను బెదిరించి, భయపెట్టి టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ నేతల ఒత్తిడి ఎక్కువైందని అన్నారు. తాము కూడా 10 సంవత్సాలు అధికారంలో ఉన్నామని, అయితే ఇలా చేయలేదని, బలవంతంగా కండువాలను కప్పడం పద్ధతి కాదన్నారు. పెద్ద పదవిలో ఉన్న వారు ప్రజాస్వామ్యాన్ని, పద్ధతులను గౌరవించాలని కోరుకుంటున్నామని ఉత్తమ్ చెప్పారు. కండువాలు కప్పడం గొప్ప కాదని, ప్రజల మనసులను గెలవడం గొప్పని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేతల బెదిరింపులకు భయపడి పార్టీ మారిన కాంగ్రెస్ నాయకులు తిరిగి రావాలని ఉత్తమ్ పిలుపునిచ్చా రు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి 30 వేల మెజారిటీతో గెలుస్తుందని పేర్కొన్నారు. -
సీనియారిటీ కాదు..సిన్సియారిటీ ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో అనుభవంకన్నా చిత్తశుద్ధి ముఖ్యమని, హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్, అసెంబ్లీ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ నైతిక విలువలను పాటించే నేతలను మాత్రమే ప్రజలు అనుసరిస్తారని, వెన్నుచూపి పారిపోయి విలువల గురించి మాట్లాడేవాళ్లను పట్టించుకోరని ఉత్తమ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటమి పాలైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన ఆయన.. ఆ తర్వాత మాట నిలబెట్టుకోలేదన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఉత్తమ్ దుష్ప్రచారం చేస్తున్నారని కర్నె, జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు. శాసన మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డిపై ఫిర్యాదు చేస్తామంటూ ఉత్తమ్ చేసిన ప్రకటనలను పబ్లిసిటీ స్టంట్‌గా కొట్టిపారేశారు. -
అధ్యయనం చేశాకే హామీలు
సాక్షి, హైదరాబాద్: తాము అసాధ్యపు హామీలను ఇవ్వడం లేదని, అన్ని వివరాలను అధ్యయనం చేసిన తర్వాతే ఎన్నికల హామీలు ఇస్తున్నామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ చెపుతున్నట్టు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అసాధ్యమేమీ కాదని, నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.300 కోట్లు కేటాయించడం కష్టమేమీ కాదని వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి మహ్మద్‌సలీం, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌తో కలసి ఆయన మాట్లాడారు. నిరుద్యోగ భృతి విషయంలో సీఎం కేసీఆర్ వ్యక్తం చేసిన అనుమానాలు సరైనవి కావన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున భృతి ఇవ్వడానికి కేవలం రూ.300 కోట్లు అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు నికరంగా రూ.10,500 కోట్ల ఆదాయం వస్తోందని సీఎం స్వయంగా చెప్పారని, అలాంటప్పుడు నిరుద్యోగులకు రూ.300 కోట్లు కేటాయించలేమా అని ప్రశ్నించారు. ఉపాధి కల్పన కార్యాలయాల్లో నమోదు చేసుకున్న నిరుద్యోగులకు భృతి ఇచ్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు మేం రెడీ.. ఎన్నికలు ముందస్తు జరిగినా, షెడ్యూల్ ప్రకారం జరిగినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఉత్తమ్ చెప్పారు. సెప్టెంబర్‌లో తాము కూడా అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. భావసారూప్య పార్టీలతో ఎన్నికల పొత్తు కుదుర్చుకునే విషయాన్ని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. రాహుల్‌నుద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చిల్లర మాటలని పీసీసీ చీఫ్ అన్నారు. కేటీఆర్ రాజకీయ అవగాహన లేని చిన్న పిల్లాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లు దిగజారి మాట్లాడుతున్నారని, సూర్యుని మీద ఉమ్మి వేస్తే వారి మీదే పడుతుందన్న విషయాన్ని వారు గ్రహించాలని హితవు పలికారు. టీఆర్ఎస్ కంటే భారీ సభ... అనంతరం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. తాము అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించాకే ప్రజలకు హామీలిస్తున్నామని ఉత్తమ్ చెప్పారు. సెప్టెంబర్‌లో టీఆర్ఎస్ నిర్వహించే సభ కన్నా భారీ సభను తామూ నిర్వహిస్తామన్నారు. త్వరలో బస్సుయాత్ర ప్రారంభిస్తామని, సెప్టెంబర్‌లో కూడా రాహుల్ రాష్ట్రానికి వస్తారని చెప్పారు. అభ్యర్థుల ప్రకటన కోసం త్వరలోనే ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు వేస్తామన్నారు. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాల పట్ల రాహుల్ చాలా సంతృప్తిగా ఉన్నారని, ఈ విషయా న్ని ఆయనే స్వయంగా చెప్పారని వెల్లడించారు. రాహుల్ టూర్ సక్సెస్ రాహుల్‌గాంధీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన అద్భుతంగా సాగిందని, ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు ఊహించిన దాని కన్నా ఎక్కు వ మంది వచ్చారని, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ముఖ్యంగా విద్యార్థులు, యువతలో ఉన్న ఆగ్రహానికి ప్రతీకగా ఈ సభ నిలుస్తుందని చెప్పారు. రాహుల్ టూర్‌తో కేసీఆర్‌కు దడ పుట్టిందని, అందుకే మహిళా సంఘాలకు ఉన్న బకాయిల్లో రూ.960 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారని తెలిపారు. మహిళా సంఘాలకు ఇచ్చిన ప్రతి హామీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. పోలింగ్ బూత్ స్థాయిలోని కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ పట్ల రాహుల్ సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. సెటిలర్లకు ఇచ్చిన హామీలను కూడా చిత్తశుద్ధితో నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. -
కాంగ్రెస్ పింఛన్ పంచ్
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ పింఛన్ పంచ్ విసిరింది. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ఆ పార్టీ పంద్రాగస్టును పురస్కరించుకుని రాష్ట్రంలోని పింఛన్ దారులకు మరో కీలక హామీనిచ్చింది. అధికారంలోకి వస్తే సామాజిక పింఛన్ల సొమ్మును రెట్టింపు చేస్తా మని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న నెలకు రూ.1000 పింఛన్‌ను రూ.2 వేలకు పెంచుతామని వెల్లడించారు. పింఛన్ పొందేందుకు ప్రస్తుతమున్న 65 ఏళ్ల వయసు అర్హతను 58 ఏళ్లకు కుదిస్తామని తెలిపారు. వికలాంగులకు రూ.1500 చొప్పున ఇస్తున్న పింఛన్‌ను నెలకు రూ.3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని తెలిపారు. ఈ మేరకు పార్టీ తరఫున ఆయన అధికారిక ప్రకటన చేశారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కమిటీ సిఫారసు చేసిన ప్రకారం పించన్ నగదును రెట్టింపు చేస్తున్నామని, 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పక్షాన రాష్ట్ర ప్రజలకు ఈ హామీలిస్తున్నట్టు చెప్పారు. అధికార పార్టీ కంటే ముందే.. ఆరు నెలల ముందు ఎన్నికలు జరిగితే ముందస్తు కాదని, తాము సెప్టెంబర్‌లోనే పార్టీ అ«భ్యర్థులను ప్రకటిస్తామని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లినట్టు కనిపిస్తోంది. దీనిలో భాగంగానే అధికార పార్టీ కంటే ముందే టీపీసీసీ చీఫ్ పింఛన్‌దారులకు వరాలు ప్రకటించారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తాము అధికారంలోకి వస్తే పింఛన్‌దారులకు ఇస్తున్న నగదును రెట్టింపు చేస్తామని చెప్పిన ఉత్తమ్ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే ప్రజలకు హామీలిస్తున్నామని, ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని ప్రకటించడం గమనార్హం. సెప్టెంబర్ 2వ తేదీన టీఆర్ఎస్ నిర్వహించనున్న ప్రగతినివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకట్రెండు ఎన్నికల హామీలు ఇచ్చే అవకాశముందనే సమాచారం తమకుందని, అందుకే పింఛన్‌దారులకు ఇప్పుడే కాంగ్రెస్ తరఫున భరోసా ఇచ్చామని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు పేర్కొనడం గమనార్హం. -
కేసీఆర్ పాలనలో తెలంగాణ అధోగతి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా పాలి స్తూ తెలంగాణను అధోగతిపాలు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తెలం గాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగుతోందన్నారు. బుధవారం ఇక్కడి గాంధీభవన్‌లో పరకాల మున్సిపల్ చైర్మన్ మార్తిరాజు భద్రయ్య తన అనుచరులతో కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు ఉత్తమ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరికలే ఇందుకు సాక్ష్యాలని అన్నారు. టీఆర్ఎస్ తప్పుడు విధానాలకు విరక్తి చేందే పరకాల చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరారని, టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు ఆగ్రహంతో కాంగ్రెస్‌కు పట్టం కడతారని పేర్కొన్నారు. -
గిరిజనులను మోసం చేసిన కేసీఆర్
సాక్షి, ఆసిఫాబాద్: గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. గిరిజనులపై సీఎం కు చిత్తశుద్ధి ఉంటే ఒక్కో కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇవ్వా లని డిమాండ్ చేశారు. బుధవారం ప్రజా చైతన్య బస్సుయాత్ర సందర్భంగా కుమురం భీం జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మద్దతు ధర అడిగిన పాపానికి ఖమ్మంలో రైతులకు బేడీలు వేశారని, భూపాలపల్లిలో పోడు భూము లు చేసుకుంటున్న గిరిజనుల్ని చెట్టు కట్టేసి కొట్టారన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన నిధుల్లో పది వేల కోట్ల రూపాయలు దారి మళ్లించినట్టు కాగ్ ఆక్షేపించిందని గుర్తుచేశారు. ఎన్నికల హామీల్లో ఒక్క దానిని కూడా నెరవేర్చలేదని, పైగా గిరిజనుల భూములు లాక్కుంటోం దని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే గిరిజనులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడటం లో ఆదివాసీ, సింగరేణి కార్మికుల త్యాగాలు మరువలేనివని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. సిం గరేణి వారసత్వ ఉద్యోగాలను కారు ణ్య నియామకాలుగా మార్చార న్నా రు. కాంగ్రెస్ ప్రారంభించిన అనేక పథకాలను టీఆర్ఎస్ ప్రభు త్వం నిలిపివేసిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు. -
ఇంటికో ఉద్యోగం ఏమైంది?
లక్షన్నర ఖాళీలున్నా నోటిఫికేషన్లు ఏవీ? సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్న దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఇంటికో ఉద్యోగం ఇస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని టీపీసీసీ అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు న్యాయం జరగాలంటే తెలంగాణ కావాలన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నాడని నిల దీశారు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగమిస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ 10 నెలల్లో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చాడన్నారు. ఈ 10 నెలల్లో ఇంటికో ఉద్యోగం కాదు, ఊరికో ఉద్యోగం కూడా రాలేదని ఉత్తమ్ విమర్శించా రు. ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం రాష్ట్రంలో 1,07,722 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వాస్తవానికి లక్షన్నర పోస్టులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. మండలి ఎన్నికలు ప్రతిష్టాత్మకం : అనుబంధ సంఘాల సమావేశంలో ఉత్తమ్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. పార్టీ అనుబంధసంఘాల అధ్యక్షులు, పార్టీ ముఖ్యనేతలతో గాంధీభవన్‌లో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. అనుబంధ సంఘాల అధ్యక్షులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే గెలుపు సాధ్యమన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి(యువజన కాంగ్రెస్), ఆకుల లలిత(మహిళా కాంగ్రెస్), ఎం.కోదండరెడ్డి(కిసాన్ సెల్), చిత్తరంజన్‌దాస్(ఓబీసీ విభాగం), సిరాజుద్దీన్ (మైనారిటీ సెల్), ప్రకాశ్‌గౌడ్ (కార్మిక విభాగం), జగన్‌లాల్ (ఎస్టీ సెల్), ప్రేమలతా అగర్వాల్ (లింగ్విస్టిక్ సెల్), పార్టీ ఉపాధ్యక్షులు నాగయ్యతోపాటు వివిధ జిల్లాల ముఖ్యనేతలు హాజరయ్యారు. ఎస్టీ విభాగం ఆధ్వర్యంలో సమావేశం కూడా జరిగింది. వ్యూహాత్మకంగా ఉంటే గెలుస్తాం: భట్టి శాసనమండలి ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పనిచేస్తే గెలుస్తామని ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ముఖ్యులతో గాంధీభవన్‌లో వీరు సమావేశమయ్యారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడంతో పట్టభద్రుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ఈ ఎన్నికల్లో పనిచేస్తే.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ ఉపయోగపడుతుందన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు షబ్బీర్ అలీ, గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షులు దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, మండలి అభ్యర్థి రవికుమార్‌గుప్తా, మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి, ముఖ్యనేతలు పాల్గొన్నారు.