
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో మతం ప్రస్తావన అనవసరమని, మతం రంగు పులిమి ప్రచారం చేయడం తగదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలకు తావు లేకుండా ఈ మహమ్మారిని ఐక్యంగా ఎదుర్కోవాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా దేశానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. గాంధీభవన్ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌తో పాటు ఫేస్‌బుక్ లైవ్‌లో ఆదివారం ఉత్తమ్ మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో రాష్ట్రంలోని ప్రజలు, పేదలను ఆదుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.