ప్రపంచ శాంతి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు రాజీవ్‌: ఉత్తమ్‌  | Congress Leaders Celebrated Rajiv Gandhi Death Anniversary At Gandhi Bhavan | Sakshi
Sakshi News home page

ప్రపంచ శాంతి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు రాజీవ్‌: ఉత్తమ్‌ 

Published Fri, May 22 2020 2:57 AM | Last Updated on Fri, May 22 2020 2:57 AM

Congress Leaders Celebrated Rajiv Gandhi Death Anniversary At Gandhi Bhavan - Sakshi

గాంధీభవన్‌లో ఉగ్రవాద వ్యతిరేక ప్రతిజ్ఞ చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ శాంతి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాజీవ్‌గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా గురువారం గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్‌ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ..రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. రాజీవ్‌ను హత్య చేసిన మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటించాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు ఉగ్రవాద వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమ కుమార్, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, టీపీసీసీ ముఖ్య నేతలు చిన్నారెడ్డి, మర్రి శశిధర్‌ రెడ్డి, సంపత్‌ కుమార్, అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement