పరకాల : వరంగల్ జిల్లా పరకాల శివారులో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు..స్థానిక శారదా స్కూల్‌కు చెందిన బస్సు విద్యార్థులను ఎక్కించుకునేందుకు ఆర్టీసీ డిపో వద్ద ఆగింది. వెనుక నుంచి వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో బస్సులోని ముగ్గురు విద్యార్థులకు కాళ్లు విరిగాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులను మరో బస్సులో పాఠశాలకు తరలించారు. టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. స్తానికలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.