
పరకాల: వార్డుల పునర్విభజన డాక్యుమెంటేషన్ అందించడంలో జరిగిన జాప్యంపై పరకాల పురపాలక సంఘం కమిషనర్ బి.శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కొత్త కమిషనర్‌గా పురపాలక శాఖ ఆడిట్ విభాగం సీనియర్ అధికారి ఎల్.రాజాకు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం సీడీఎంఏ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 17న అందించిన వార్డుల పునర్విభజన, మ్యాప్ వంటి డాక్యుమెంటేషన్ లో జరిగిన పొరపాట్లపై వివరణ కోరేందుకు సీడీఎంఏ ప్రయత్నించగా కమిషనర్ అందుబాటులో లేకపోవడం.. పైగా ఫోన్ చేసినా స్పందిం చకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మార్పులు చేసిన డాక్యుమెంటేషన్‌ను మరుసటి రోజు కమిషనర్ శ్రీనివాస్ కార్యాలయంలో అందజేయకుండా కింది స్థాయి అధికారులతో పంపడాన్ని క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణి స్తూ ఆయనను విధుల నుంచి తొలగిస్తూ సీడీ ఎంఏ అధికారి శ్రీదేవి ఆదేశాలు జారీ చేశారు.