
సాక్షి, అమరావతి: పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ముగ్గురు కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ ఎన్.ప్రమోద్‌కుమార్‌ను ధర్మవరం కమిషనర్‌గా బదిలీ చేశారు.
ఇక్కడ పనిచేస్తున్న వి.మల్లికార్జునను ప్రొద్దుటూరుకు మార్చారు. ఇప్పటి వరకు ప్రొద్దుటూరు కమిషనర్‌గా ఉన్న జి.రఘునాథరెడ్డిని బాపట్ల కమిషనర్‌గా నియమించారు. ఈ స్థానంలో పనిచేస్తున్న వి.నిర్మల్ కుమార్‌ను కేంద్ర ఆరి్థక శాఖ (సీసీఏఎస్)కు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment