Municipal Commissioners
-
సచివాలయ ఉద్యోగులను దూషించిన కమిషనర్
-
కమిషనర్ పులి శ్రీనివాసులు అక్రమాలకు పాల్పడ్డారు: మనోహర్ నాయుడు
-
మీటింగ్‌కు కమిషనర్ డుమ్మా.. గుంటూరు మేయర్ సంచలన వ్యాఖ్యలు
గుంటూరు, సాక్షి: మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ పులి శ్రీనివాసులు డుమ్మా కొట్టడంపై మేయర్ కావట్టి మనోహర్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరద సహాయం పేరుతో ఖర్చుపెట్టిన నిధులకు లెక్క చెప్పాల్సి వస్తుందని కారణంతోనే కమిషనర్ సమావేశాలకు రావట్లేదని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ..మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు(Puli Srinivasulu) ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు. మేయర్ నిర్ణయించిన తర్వాత ఖచ్చితంగా సమావేశం నిర్వహించాల్సిందే. ఈనెల 4వ తేదీన జరిగిన సమావేశంలో విజయవాడ వరదల సహాయం కింద ఖర్చుపెట్టి అంశం మీద ప్రశ్న లేవనెత్తాం. ఆ సమావేశం నుంచి ఆయన అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అప్పటి నుంచి కమిషనర్ సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నారు. నగర వరద బాధితుల సహాయం పేరుతో కార్పొరేషన్ సొమ్మును9 కోట్ల 24 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఎంతెంత సాయం చేశారన్నదానిపై మంత్రులు, ఎమ్మెల్యేలకే క్లారిటీ లేకుండా పోయింది. మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసరావు 9 కోట్ల 24 లక్షలు దోచేశారు. పైగా ఖర్చులకు సంబంధించిన తప్పుడు నివేదిక అందించారు. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు ఖాతాలో కోటి రూపాయలు జమ చేశారు. కనీసం ఎవరెవరికి ఎంత చెల్లించారో కూడా కమిషనర్ చెప్పటం లేదు. ప్రజల సొమ్మును దోచేసిన కమిషనర్ పై వెంటనే విచారణ చేయాలని ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి లేఖలు రాస్తా. మున్సిపల్ కమిషనర్(Municipal Commissioner) కు ఓపిక, సహనం ఉండాలి. నేనొక ఐఏఎస్‌ని.. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే కుదరదు. ప్రజలకు ఆయన జవాబుదారిగా వ్యవహరించాలి. పది రోజుల క్రితం కౌన్సిల్ జరుగుతుండగా మధ్యలో అర్ధాంతరంగా కమీషనర్ పులి శ్రీనివాస్ వెళ్లిపోవడం మంచి పద్ధతి కాదు. పులి శ్రీనివాస్ కేవలం మేయర్‌ను, కార్పొరేటర్లను మాత్రమే కాదు.. 11 లక్షల మంది జనాల్ని అవమానించారు. ఆయన మేయర్, డిప్యూటీ మేయర్ ఉన్న సిబ్బందిని కూడా ఏకపక్షంగా తొలగించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు.ఇవాళ కౌన్సిల్ సమావేశం నిర్వహించమని ఎనిమిదో తారీకు కమిషనర్ పులి శ్రీనివాసులుకు లెటర్ రాశాను. అయినా ఆయన రాలేదు. ఎక్కడ తాను చేసిన అవినీతి చెప్పాల్సి వస్తుందోనని కమిషనర్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల పేరుతో సమావేశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ప్రజల సొమ్మును దోచేసిన కమిషనర్ సమాధానం చెప్పకుండా తప్పించుకోలేరు.. అని మేయర్ కావట్టి మనోహర్ నాయుడు అన్నారాయన. -
గుంటూరు మున్సిపల్ కమిషనర్ తీరుపై డిప్యూటీ మేయర్ ఫైర్
-
‘ఇందిరమ్మ’లో కదలిక
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. లబ్ధిదారులను గుర్తించేందుకు వీలుగా ఇందిరమ్మ కమిటీల విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినా, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరించింది. మూడు నెలల తర్వా త ఈ పథకాన్ని భద్రాచలంలో మంత్రులందరితో కలిసి సీఎం ప్రారంభించారు. కానీ లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఏడున్నర నెలల తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇళ్ల నిర్మాణానికి వీలుగా కసరత్తు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒక్కోటి రూ.5 లక్షల వ్యయంతో నియోజకవర్గానికి మూడున్నర వేలు చొప్పున ఇళ్ల నిర్మా ణానికి ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. సొంత స్థలం ఉండి, పక్కా ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తారు. ప్రస్తుతానికి సొంత జాగా ఉన్నవారికే.. గ్రామ, పట్టణ స్థాయి (వార్డు/డివిజన్లవారీగా)లో ఏర్పాటయ్యే ఈ కమిటీలే ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో కీలకంగా వ్యవహరించనున్నాయి. లబ్ధిదారుల ఎంపిక మొదలు, సోషల్ ఆడిట్ వరకు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. గ్రామ స్థాయి కమిటీలను ఎంపీడీవోలు, వార్డు స్థాయిలో మున్సిపల్ కమిషనర్లు నామినేట్ చేస్తారు. ప్రస్తుతానికి సొంత జాగాలు ఉన్నవారినే పరిగణనలోకి తీసుకుంటారు. సొంత జాగా లేని వారికి ఇళ్లను మంజూరు చేయరు. సొంత జాగాలో కచ్చా ఇల్లు ఉన్నవారు, పక్కా ఇల్లు ఉన్నవారెవరన్న విషయంలో జాగ్రత్తగా వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది.కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి భారీగా నిధులు రాబట్టే ప్రయత్నంలో రాష్ట్రప్రభుత్వం ఉంది. అనర్హులను లబ్ధిదారులుగా గుర్తిస్తే నిధులు ఇవ్వబోమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారుల గుర్తింపులో జాగ్రత్త అవసరమని రాష్ట్రప్రభుత్వం కలెక్టర్లకు స్పష్టం చేసింది. కాగా కమిటీ సభ్యులు లబ్ధిదారుల వివరాలను సేకరించి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా ప్రభుత్వానికి సమర్పిస్తారు. కొత్త దరఖాస్తులు తీసుకుంటారా? ప్రజాపాలన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పది నెలల క్రితం సంక్షేమ పథకాల లబ్ధి కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అప్పట్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షలకు పైగా దరఖాస్తులందాయి. వాటిల్లో ప్రాథమిక స్థాయి వడపోత తర్వాత 50 లక్షల దరఖాస్తులు మిగిలాయి. వీటిల్లో అర్హమైనవి ఎన్ననే విషయం క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. కాగా పాత దరఖాస్తులే పరిగణనలోకి తీసుకుంటారా? కొత్తవి కూడా స్వీకరిస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఎంపికకు సుదీర్ఘ సమయం! లబ్ధిదారుల ఎంపికకు చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రజాపాలన దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకున్నా.. ఒక్కో దరఖాస్తు ఆధారంగా క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి అర్హతను తేల్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం జాబితాను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ తర్వాతే నిధుల విడుదల ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హడ్కో నుంచి ఇళ్ల కోసం దాదాపు రూ.3 వేల కోట్ల రుణం పొందింది. కేంద్రం నుంచి మరో రూ.8 వేల కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. లబ్ధిదారులకు మొదటి విడత రూ.లక్ష చెల్లించి మిగతా విడతలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లించనున్నారు. మొదటి విడతలో మంజూరు చేసే ఇళ్లకు రూ.20 వేల కోట్లు అవసరమవుతాయి. గ్రామస్థాయి కమిటీ: సర్పంచ్/ పంచాయితీ ప్రత్యేక అధికారి చైర్మన్‌గా ఉండే కమిటీలో స్వయం సహాయక బృందాలకు చెందిన ఇద్దరు మహిళలు, గ్రామ పురోగతికి పాటుపడే ముగ్గురు స్థానికులు (వీరిలో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ/ఎస్టీ విధిగా ఉండాలి) సభ్యులుగా, పంచాయితీ కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. పట్టణ స్థాయి కమిటీ: వార్డు కౌన్సిలర్/కార్పొరేటర్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఇద్దరు స్వయం సహాయక బృంద సభ్యులు, స్థానికంగా అభివృద్ధి పనులకు సహకరించే ముగ్గురు స్థానికులు (వీరిలో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ/ఎస్టీ విధిగా ఉండాలి) సభ్యులుగా, వార్డు అధికారి కన్వీనర్‌గా ఉంటారు. -
లేటు ఎందుకని అడిగితే.. ప్రజావాణిలో అధికారుల మధ్య లొల్లి
-
ముగ్గురు మున్సిపల్ కమిషనర్ల బదిలీ
సాక్షి, అమరావతి: పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ముగ్గురు కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ ఎన్.ప్రమోద్‌కుమార్‌ను ధర్మవరం కమిషనర్‌గా బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న వి.మల్లికార్జునను ప్రొద్దుటూరుకు మార్చారు. ఇప్పటి వరకు ప్రొద్దుటూరు కమిషనర్‌గా ఉన్న జి.రఘునాథరెడ్డిని బాపట్ల కమిషనర్‌గా నియమించారు. ఈ స్థానంలో పనిచేస్తున్న వి.నిర్మల్ కుమార్‌ను కేంద్ర ఆరి్థక శాఖ (సీసీఏఎస్)కు పంపారు. -
ధర్మవరంలో నెగ్గేదెవరూ? తగ్గేదెవరు?!
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు తమ స్వేచ్ఛను కోల్పోయారు. నిజాయితీతో పని చేస్తూ నిక్కచ్చిగా వ్యవహరించే అధికారులు తమకు అవసరం లేదంటూ స్థానిక టీడీపీ నాయకులు తమ అధినేత బాటలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ఇందుకు ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున వ్యవహారం నిలువుటద్దమైంది. విధులకు హాజరైతే చొక్కా పట్టుకుని బయటకు గెంటేస్తానంటూ కార్యకర్తల సమావేశంలో పరిటాల శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చి అహంకారాన్ని ప్రదర్శించగా... ప్రభుత్వం తనని నియమించింది కాబట్టి విధులను నిజాయితీతో నిర్వర్తించి తీరుతానంటూ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ప్రతిగా స్పందించారు. ఎవరికి వారే పంతం పట్టడంతో వీరిద్దరిలో నెగ్గేదెవరు? తగ్గేదెవ్వరూ? అన్నది ప్రస్తుతం ధర్మవరంలో హాట్ టాపిక్‌గా మారింది.పరిటాలకు మింగుడు పడని అంశం..ధర్మవరం మున్సిపాలిటీకి నూతన కమిషనర్‌గా మల్లికార్జునను 15రోజుల క్రితం ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే సదరు కమిషనర్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ ధర్మవరం మున్సిపాలిటి కమిషనర్‌గా పనిచేశారు. కరోనా వంటి విపత్కర సమయంలో ఎంతో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించి అందరి మన్ననలు పొందారు. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ పరిధిలో గతంలో పని చేసిన అనుభవం ఉండడంతో ఆయన పర్యవేక్షణలో ధర్మవరం మరింత అభివృద్ధి చెందుతుందని భావించిన కూటమి ప్రభుత్వం ఇటీవల ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్గా ఉన్న పరిటాల శ్రీరామ్‌కు మింగుడు పడలేదు. కమిషనర్‌గా మల్లికార్జున బాధ్యతలు స్వీకరించక ముందే పరిటాల శ్రీరామ్ టీడీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మల్లికార్జున కమిషనర్‌గా బాధ్యతలు చేపడితే చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లి బయటకు గెంటేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా మల్లికార్జున కార్యాలయానికి రాకుండా ఉండేలా టీడీపీ నాయకులు, కార్యకర్తలను పంపి అల్లర్లకు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ నాయకులు తిష్ట వేసి నిరసన తెలుపుతుండటంతో పోలీసులు ఇరుకున పడ్డారు. తమను మున్సిపల్ కార్యాలయం వద్ద భద్రతకు కేటాయిస్తే రోజువారీ డ్యూటీలు ఎలా చేయాలంటూ వారిలో వారు మదన పడుతున్నారు.అమ్మో ధర్మవరమా?మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారడంతో ధర్మవరానికి బదిలీపై వెళ్లాలంటే అధికారులు హడలెత్తుతున్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చి అధికార పార్టీకి తొత్తుగా పనిచేయడం తమ వల్ల కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ధర్మవరానికి పోస్టింగ్ అయిన అధికారులు సైతం తమను మరో ప్రాంతానికి బదిలీ చేయించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఓ ముఖ్య అధికారి సైతం ఇక్కడ పని చేయలేక వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి టీడీపీ నేతల వైఖరితో ధర్మవరం వాసులు బెంబేలెత్తిపోతున్నారు. పట్టణ అభివృద్ధిలో కీలకమైన అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్న నేతల తీరుపై మండిపడుతున్నారు. -
పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె.. కమిషనర్
సాక్షి, చెన్నై: తిరువారూర్ జిల్లాకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె అదే జిల్లాలోని ఓ మునిసిపాలిటీకి కమిషనర్ అయ్యారు. తన తాత, తండ్రి పారిశుద్ధ్య కార్మికులుగా జీవనం సాగించగా, చిన్నతనం నుంచి కష్టపడి చదివి గ్రూప్–2 ఉత్తీర్ణతతో తిరుత్తురైపూండి మునిసిపాలిటీ కమిషనర్‌గా దుర్గ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. వివరాలు.. తిరువారూర్ జిల్లా మన్నార్ కుడి పుదుపాలం గ్రామం సత్యమూర్తి నగర్ చెందిన శేఖర్, సెల్వి దంపతులకు దుర్గ ఏకైక కుమార్తె. శేఖర్ మన్నార్ కుడి కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసేవారు. తండ్రి పడే కష్టాన్ని చిన్నతనంలోనే ప్రత్యక్షంగా చూసిన దుర్గా ఏదో ఒక రోజు తాను ఉన్నత స్థితిలో నిలబడాలని ఆకాంక్షించింది. మన్నార్‌కుడి ప్రభుత్వ ఎయిడెడ్ బాలికల మహోన్నత పాఠశాలలో ప్లస్–2 వరకు చదవింది. ఆ తర్వాత అతి కష్టంతో మన్నార్ కుడి రాజగోపాల స్వామి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి ఎంతో కష్ట పడి తనను చదివించినా, చివరకు 2015లో మదురాంతకంకు చెందిన నిర్మల్ కుమార్‌తో అనూహ్యంగా వివాహం చేసేయడం ఆమెను కలవరంలో పడేసింది. అయితే, తండ్రి స్థానంలో భర్త నిర్మల్ ఆమెకు సహకారం అందించాడు. 2019 నుంచి పట్టువదలని విక్రమార్కుడి తరహాలో టీఎన్పీఎస్సీ పరీక్షలు దుర్గ రాస్తూ వచ్చింది. 2023 గ్రూప్ –2 లో మెరిట్ సాధించింది. ఈ ఏడాది జరిగిన ఇంటర్వ్యూలలోనూ 30కు 30 మార్కులు సాధించారు. తొలుత పోలీసు విభాగంలో లోని స్పెషల్ బ్రాంచ్ సీఐడీలో పనిచేసే అవకాశం వచ్చినా, తన తండ్రి కారి్మకుడిగా పనిచేసిన మునిసిపాలిటీకి కమిషనర్ కావాలని తాపత్రయం పడింది. పరిస్థితులు అనుకూలించడంతో తిరువారూర్ జిల్లా పరిధిలోని మన్నార్‌కుడి మునిసిపాలిటికీ పొరుగున ఉన్న తిరుత్తురైపూండికి కమిషనర్ అయ్యే అవకాశం దక్కింది. సోమవారం సీఎం స్టాలిన్ నుంచి ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందుకున్న దుర్గా మంగళవారం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తన తండ్రి పేరును కాపాడటమే కాకుండా, పారిశుద్ధ్య కార్మికులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ముందుకెళ్తానని దుర్గా పేర్కొన్నారు. అయితే, తన కుమార్తె కమిషనర్‌గా మునిసిపాలిటీలోకి అడుగు పెట్టినా, కనులారా చూసే భాగ్యం తండ్రి శేఖర్‌కు దక్కలేదు. గత ఏడాది అనారోగ్యంతో ఆయన మరణించడం గమనార్హం. -
బల్దియాలో బదిలీలు నై?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ విభాగాల్లో బదిలీలు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీలోనూ బదిలీల పర్వం ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపు పదిమంది మున్సిపల్ కమిషనర్లు, ఇతర త్రా విభాగాల్లో ఒకరో, ఇద్దరివో బదిలీలు మాత్రమే జరిగాయి తప్ప కీలక విభాగాల్లో ఉన్న వారివి జరగలేదు. వారితో పాటు సీనియర్లుగా ఎంతోకాలంగా ఇక్కడే పాతుకుపోయిన ఉన్నతస్థాయిల్లోని వారి బదిలీలూ జరగలేదు. వారిలో చాలా మంది తామిక్కడే ఉంటామని, తమనెవరూ కదల్చలేరని సన్నిహితుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం మున్సిపల్ శాఖలో తమ హోదాకు తగిన పోస్టులు రాష్ట్రంలో ఇతర కార్పొరేషన్లలో ఖాళీ లేనందున తమను ఎక్కడికీ పంపలేరని చెబుతున్నారు. రాష్ట్రంలోని పెద్ద కార్పొరేషన్లకు ఐఏఎస్ అధికారులు కమిషనర్లుగా ఉన్నందున, తమను ఎక్కడికీ ఎవరూ కదల్చలేరని భరోసాగా ఉన్నారు. అంతేకాదు బదిలీలు 40 శాతానికి మించి జరగరాదనే నిబంధనతోనూ అన్ని స్థాయిల పోస్టులను పరిగణనలోకి తీసుకొని తమను కదల్చలేరని పదేళ్లకుపైగా పని చేస్తున్నవారు సైతం నమ్మకంగా ఉన్నారు. వారే కాదు.. ఎంటమాలజీ వంటి విభాగాల్లోని వారిది సైతం అదే ధీమా. సీనియర్ ఎంటమాలజిస్టు పోస్టు లు రాష్ట్రంలో చాలా స్వల్పంగా మాత్రమే ఉన్నందున తాము ఇక్కడే ఉంటామని ధీమాగా ఉన్నారు. కదలరు అంతే.. జీహెచ్ఎంసీలో దాదాపు రెండేళ్లు పనిచేసినా చాలు ఎవరైనే సరే ఇక్కడినుంచి ఇంకెక్కడికీ కదలరు. అందుకు కారణం ఇక్కడ లభించే సదుపాయాలు, పై ఆదాయాలు ఇంకెక్కడా లభించవు. అందుకే పదోన్నతులను సైతం కాదనుకొని ఇక్కడే ఉంటున్నవారు. ఉండేందుకు ప్రయతి్నస్తున్న వారూ ఉన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో కమిషనర్ స్థాయి వారికి, క్షేత్రస్థాయి పర్యటనలు ఉండేవారికి మాత్రమే వాహన సదుపాయం ఉంటుంది. ఇక్కడైతే సూపరింటెండెంట్లకు, అంతకంటే దిగువ స్థాయి వారికి సైతం వాహన సదుపాయం ఉంటుంది. అంతేకాదు.. కార్యాలయం నుంచి కాలు బయట పెట్టని వారికి సైతం వాహన సదుపాయం ఉంటుంది. దాన్ని మరోలా వినియోగించుకొని నెలవారీ ఆదాయం పొందుతున్న వారూ తక్కువేం లేరు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా వివిధ వై¿ోగాలకు అవకాశం ఉన్నందున, వాటికి అలవడిన వారు ఇక్కడి నుంచి కదలడం లేదు. వచ్చేవారే.. వెళ్లేవారు లేరు ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యుటేషన్లపై బల్దియాకు వచ్చిన వారు సైతం ఇక్కడి నుంచి కదలనే కదలరు. డిప్యుటేషన్లు ముగిసినా, ఏళ్లకేళ్లుగా తిష్టవేసిన ఎందరో ఉన్నారు. యూసీడీ విభాగం నుంచి మొదలు పెడితే ఇలాంటి వారికీ లెక్కేలేదు. బదిలీల సమయంలో సైతం వారిని కదల్చలేకపోతున్నారంటే వారి ‘పవర్’ ఏమిటో అంచనా వేసుకోవచ్చు. మున్సిపల్ శాఖకు చెందిన వారు ఎందరో కొందరు బదిలీ అవుతున్నప్పటికీ, ఇతర విభాగాల వారు మాత్రం కావడం లేదంటే వారి హవా ఎంతో ఊహించుకోవచ్చు. ఏళ్లకేళ్లుగా.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ హోదాలో కొనసాగుతున్న వారు ఎందరో ఉన్నారు. వీరిలో ఇరవయ్యేళ్లకుపైగా ఇక్కడే ఉంటున్నవారు ఎందరో ఉన్నారు. అంతేకాదు.. 30 నుంచి 40 ఏళ్లుగా నగరంలోనే ఉంటున్నవారు కూడా ఉన్నారంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. సీనియర్లయిన తమను ఎక్కడకూ పంపలేరని భావిస్తున్న వారు ఇతర ప్రాంతాల్లో తమ హోదాకు తగ్గ పోస్టుల్లేవంటున్నారు. కానీ.. ఇతర విభాగాల నుంచి ఇక్కడికి డిప్యుటేషన్‌పై వస్తుండగా లేనిది మున్సిపల్ శాఖ నుంచి ఇతర విభాగాలకు ఎందుకు డిప్యుటేషన్లపై వెళ్లడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. అన్నింటికీ ఒకటే సమాధానం. సదుపాయాలు.. పై ఆదాయం. ప్రత్యేక చాంబర్లు. అందుకే వచ్చేవారు తప్ప వెళ్లేవారు కనబడటం లేదు. గతంలో ఇద్దరు ముగ్గురు అధికారులు మాత్రం అలా ఇతర విభాగాలకు వెళ్లారు. అలా మిగతా వారెందుకు వెళ్లరో వారితోపాటు ఉన్నతాధికారులకే తెలియాలి. బల్దియాకు భారం.. స్టాఫింగ్ ప్యాటర్న్‌పై ప్రసాదరావు కమిటీ సిఫార్సుల మేరకు జీహెచ్ఎంసీలో ఆరుగురు అడిషనల్ కమిషనర్లు మాత్రమే ఉండాలి. కానీ ప్రస్తుతం డజను మంది ఉన్నారు. గతంలో ఐదారుగురు అడిషనల్ కమిషనర్లు మాత్రమే అన్ని విభాగాలనూ నిర్వహించేవారు. ప్రస్తుతం అధికారులు పెరిగారు. పనులు తగ్గాయి. పనులు తగ్గినందున సమర్థంగా పని చేస్తున్నారా అంటే అదీ లేదు. ఎస్టేట్స్, అడ్వర్టయిజ్‌మెంట్స్, ట్రేడ్‌లైసెన్స్‌ల వంటి విభాగాల ద్వారా జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయంలో ఇరవై శాతం కూడా రావడం లేదంటే పరిస్థితిని అంచనా వేసుకోవవచ్చు. సీనియర్లు, పెద్ద హోదాల వల్ల వారి జీతభత్యాలు, సదుపాయాల కల్పనతో జీహెచ్ఎంసీకి ఆర్థిక భారం పెరుగుతోంది. అయినా.. మేమింతే. ఇక్కడే ఉంటామంటున్న వారిని ఎవరైనా కదల్చగలరా? వేచి చూడాల్సిందే! ప్రసాదరావు కమిటీ సిఫారసుల మేరకు సర్కిల్ కార్యాలయాలను 12 నుంచి 30కి పెంచారు. అయిదు జోన్లను ఆరుగా చేశారు. ప్రధాన కార్యాలయంలో 11 మంది అడిషనల్ కమిషనర్లను 6కు తగ్గించాలని సిఫారస్ చేస్తే ప్రస్తుతం డజను మంది ఉన్నారు. బదిలీలపై వచ్చేవారితో ఈ సంఖ్య ఇంకా పెరగనుంది. టౌన్ న్‌ప్లానింగ్, రెవెన్యూ, హెల్త్, ఎస్టేట్స్, అడ్వర్టయిజ్‌మెంట్స్ తదితర విభాగాలను బలోపేతం చేయాల్సి ఉందని కమిటీ సూచించింది. కానీ మెరుగవలేదు. -
YSRCP ఆఫీసు కూల్చివేతపై అధికారులకు హైకోర్టు మొట్టికాయలు
-
తాడేపల్లి వైఎస్సార్సీపీ ఆఫీస్ కూల్చివేత కేసులో హైకోర్టు కీలక నోటీసులు
-
మిర్యాలగూడ: కునుకు తీస్తూ కమిషనర్ ఇలా..
సాక్షి, నల్గొండ జిల్లా: ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విధులు నిర్వహించాల్సిన వారు పట్టపగలే కార్యాలయంలో కుర్చీలో కునుకు తీస్తున్నారు.తాజాగా, పని వేళల్లో దర్జాగా ఆఫీసులో నిద్రపోతున్న మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ యూసఫ్ అలీ తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. టేబుల్‌పై కాళ్లేసి మరీ కమిషనర్ గాఢ నిద్రలోకి జారుకున్నారు. నిద్రపోతున్న కమిషనర్ ఫొటో వైరల్‌గా మారింది. కమిషనర్ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. పనులను పక్కన పెట్టి కార్యాలయంలోనే కునుకు తీయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
తెలంగాణ భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ భారీగా మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది. నిన్న(మంగళవారం) 40 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వలు జారీ చేయగా, కాగా తాజాగా బుధవారం మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా పురుపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో కూడా ప్రభుత్వం భారీగా బదిలీలు చేసింది. రూరల్ డెవలప్మెంట్ శాఖలో 105 మందిని బదిలీ చేసింది. సీఈవో, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో, డీపీవోలను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు, తెలంగాణ ఆబ్కారీశాఖలో 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఉప కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున తహశీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 132 మంది తహశీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్ల(ఆర్డీవో)ను బదిలీ చేసింది. -
ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్ రజిత
జనగామ : జనగామ మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కారు. ఇంటి నిర్మాణానికి మార్టిగేజ్ చేసిన స్థలం రిలీజ్ కోసం లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, రాజు విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. లింగాలఘణపురం మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన చిట్టిపల్లి రాజు జిల్లా కేంద్రంలోని సూర్యాపేటరోడ్డు కెమిస్ట్రీ భవనం ఎదురుగా 2022 జూన్‌లో జీ ప్లస్–3 భవన నిర్మాణం చేపట్టారు. నిర్మాణ సమయంలో నిబంధనల మేరకు 10 శాతం స్థలం మున్సిపల్ పేరిట మార్టిగేజ్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా నిర్మాణ పనులు పూర్తి కావడంతో, మార్టిగేజ్ స్థలం రిలీజ్ చేయాలని దరఖాస్తు చేయగా, కమిషనర్ రూ.40వేలు నగదు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రాజు సహాయంతో ఫోన్ సంభాషణల రికార్డులను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, సోమవారం కమిషనర్‌ను ట్రాప్ చేసేందుకు జనగామకు వచ్చారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రాజు కమిషనర్‌కు ఫోన్ చేసి డబ్బులు తీసుకు వచ్చానని చెప్పడంతో ఇంటి వద్ద ఉన్న ఆమె ఆఫీసుకు చేరుకున్నారు. రాజు కమిషనర్‌కు నగదు ఇచ్చే ప్రయత్నం చేయగా ఆమె తీసుకోకుండా, కారు డ్రైవర్ నవీన్‌కు ఇవ్వాలని చెప్పారు. అదే సమయంలో టౌన్ ప్లానింగ్‌లో ఓ అధికారి లేకపోవడంతో డబ్బులను డ్రైవర్‌కు ఇవ్వగా, అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు.. వల పన్ని డ్రైవర్ వద్ద ఉన్న రూ.40వేల నగదును స్వాధీనం చేసుకుని విచారించారు. కమిషనర్ రజిత ఆదేశాల మేరకు రాజు వద్ద డబ్బులు తీసుకున్నానని నవీన్ ఒప్పుకొని తమకు వాంగ్మూలం ఇచ్చినట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. కమిషనర్‌తో పాటు డ్రైవర్ నవీన్‌ను కస్టడీలోకి తీసుకుని, నేడు(మంగళవారం) హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ కోర్టులో రిమాండ్ చేస్తామన్నారు. కాగా జనగామలో కమిషనర్ ఉంటున్న అద్దె ఇంటితో పాటు ఆమెకు సంబంధించిన పలు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేసినట్టు సమాచారం. తరువాయి.. టౌన్ ప్లానింగేనా? జనగామ పురపాలికలో లంచాలకు అడ్డు లేకుండా పోతుందనే విమర్శలు లేకపోలేదు. భవన నిర్మాణ అనుమతి, పునర్నిర్మాణం, ఎక్స్ టెన్షన్ ఇలా ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి, లబ్ధిదారుల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటి నిర్మాణానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి చిన్న కారణాలతో తిరస్కరిస్తూ, ఖద్దర్ దుస్తులు వేసుకున్న ఇద్దరు.. పైరవీల పేరిట ముడుపుల పేరిట అనుమతులు ఇప్పిస్తున్నారని ప్రచారం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలకు సైతం వీరిని సంప్రదిస్తే.. గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే అంటూ పుకార్లు ఉన్నాయి. లంచాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన మున్సిపల్ బాగోతంలో కమిషనర్ ఏసీబీకి ట్రాప్ కావడంతో.. మిగతా భాగస్వామ్యులకు భయం పట్టుకుంది. కాగా టౌన్ ప్లానింగ్‌లో అనేక అక్రమాలు జరుగుతున్నట్లు ప్రచారంతో ఏసీబీ ఇందులో పనిచేస్తున్న ఓ అధికారిపై ఆరా తీసినట్టు సమాచారం. రూ.60వేలు డిమాండ్ చేశారు మార్టిగేజ్లో ఉన్న స్థలం రిలీజ్ కోసం కమిషనర్ రజిత మొదటగా రూ.60వేలు డిమాండ్ చేశారు. తన వద్ద అంత డబ్బు లేదని బతిమిలాడడంతో బంపర్ ఆఫర్‌గా రూ.40వేలకు సెటిల్ చేశారు. భవన నిర్మాణ సమయం నుంచి తనను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయగా, ఏసీబీని కలిసి, ఇక్కడ జరుగుతున్న అవినీతి, అక్రమాల బాగోతంపై చెప్పాను. ఏసీబీ అధికారుల సూచనల మేరకు కమిషనర్ రజిత, డ్రైవర్ నవీన్ పట్టుబడ్డారు. – చిట్టిపల్లి రాజు, బాధితుడు -
ఏసీబీ వలలో భీమవరం మున్సిపల్ కమిషనర్.. రూ.60 కోట్ల మేర అక్రమాస్తులు
పశ్చిమ గోదావరి : కోట్లలో అక్రమాస్తులు కూడబెట్టిన భీమవరం మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.60 కోట్ల మేర అక్రమాస్తులు గుర్తింపు - చెత్త సేకరణ మొదలు, కారుణ్య నియామకాల వరకు అంతా అవినీతే - వసూళ్ల కోసం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకున్న శివరామకృష్ణ - అక్రమ సంపాదనతో విదేశీ పర్యటనలు చేసినట్లు ఏసీబీ గుర్తింపు - శివరామకృష్ణ ఇళ్లు, ఆఫీసుల్లో ఏకకాలంలో సోదాలు - ఇవాళ కూడా కొనసాగనున్న సోదాలు -
భీమవరం మున్సిపల్ కమిషనర్ ఆస్తులపై ఏసీబీ దాడులు
భీమవరం(ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కమిషనర్ సబ్బి శివరామకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఫిర్యాదుతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు విజయవాడ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం వేకువజామున భీమవరంలోని మున్సిపల్ కమిషనర్ ఇల్లు, కార్యాలయం, మున్సిపల్ ఉద్యోగి(ఆర్ఐ) కృష్ణమోహన్ ఇంట్లో, తణుకు, ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామం, పాలకొల్లు, బాపట్ల, విజయవాడలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణకు సంబంధించి రూ.10 కోట్ల దాకా అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో 3.03 ఎకరాల భూమి, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జీప్లస్ 1 భవనం, తణుకులో రెండు జీప్లస్ 1 భవనాలు, పాలకొల్లులో జీప్లస్ భవనం, ఒక ఖాళీ నివాస స్థలం, విజయవాడలో రెండు అపార్ట్మెంట్లు, ఇంట్లో నగదు రూ.20 లక్షలు, 500 గ్రాముల బంగారం, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనంతో పాటు విలువైన పత్రాలను స్వాదీనం చేసుకున్నట్టు చెప్పారు. అలాగే విజయవాడలో ఒక అపార్ట్‌మెంట్‌కు సంబంధించి సోదాలు కొనసాగించాల్సి ఉందని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. కమిషనర్‌ను అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరు పరుస్తామన్నారు. -
రాజకీయ క్రీడలో ప్రభుత్వ అధికారి ఔట్.. ఇక్కడ ఇంతే!
సాక్షి,మేడ్చల్(హైదరాబాద్): మేడ్చల్ మున్సిపాలిటీలో చైర్పర్సన్, కౌన్సిలర్లు ఆడిన రాజకీయ క్రీడలో కమిషనర్ అవుట్ అయ్యారు. చైర్పర్సన్ లక్ష్యంగా సాగిన ఈ రాజకీయ క్రీడలో కౌన్సిలర్ల బంతికి చైర్పర్సన్ కాకుండా కమిషనర్ చిక్కాడు. ఆరు నెలలుగా మేడ్చల్ మున్సిపాలిటీలోని అధికార పార్టీలో 16 మంది కౌన్సిలర్లు, చైర్పర్సన్ దీపికా నర్సింహా రెడ్డిల మధ్య రాజకీయ అగాధం ఏర్పడింది. 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్పర్సన్, కమిషనర్ అహ్మద్ షఫిఉల్లా కుమ్మక్కై అభివృధ్ధి చేయకుండా అవినితీకి పాల్పడుతున్నారని విమర్శిస్తూ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. ఆరు నెలలుగా మేడ్చల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా వీడి జోరుగా రాజకీయాలు చేస్తున్నారు. కొందరు వైస్ చైర్మన్ గ్రూపుగా, మరి కొందరూ చైర్పర్సన్ గ్రూపుగా మారారు. చైర్‌పర్సన్‌పై అవిశ్వాస నోటీసులు ఇవ్వగా రెండో డిమాండ్ కింద కమిషనర్‌ను బదిలీ చేయాలని పట్టుబట్టారు. కమిషనర్ చైర్‌పర్సన్‌తో కుమ్మక్కై తమను ఖాతరు చేయడం లేదని, ఆయన్ను బదిలీ చేయాలని అధిష్టానం వద్ద పట్టుబట్టి కూర్చున్నారు. మంత్రి ఇంట్లో సమావేశంతోనే.. మేడ్చల్ మున్సిపాలిటీలో సమావేశాలు నిర్వహిస్తే తరుచూ రచ్చ చేస్తున్నారని, మీడియా ముంగిట అసమ్మతి వెల్లగక్కుతున్నారని మంత్రి మల్లారెడ్డి చైర్పర్సన్, అధికారులు, కమిషనర్, అధికార పార్టీ కౌన్సిలర్లతో తమ ఇంట్లో రెండు రోజుల క్రితం రహస్య సమావేశం నిర్వహించారు. అవిశ్వాస విషయం చట్ట పరిధిలో ఉండటంతో అది పక్కన పెట్టి అసమ్మతి కౌన్సిలర్ల వాదనను మంత్రి విన్నారు. తమకు విలువ ఇవ్వని కమిషనర్ అహ్మద్ షఫిఉల్లాను బదిలీ చేయాలని గట్టిగా వాదించడం, ఒక్కసారిగా బదిలీ చేసే అధికారం లేకపోవడంతో మంత్రి మల్లారెడ్డి ఇక్కడ రాజకీయం ప్రదర్శించారు. కౌన్సిలర్ల డిమాండ్ మేరకు కమిషనర్ అహ్మద్ షఫిఉల్లా వెళ్లిపోవాలని మంత్రి ఆదేశించినట్లు సమాచారం. బదిలీకి వెంటనే ఆస్కారం లేకపోవడంతో కమిషనర్ 15 రోజుల పాటు దీర్ఘకాలికంగా సెలవు పెట్టి వెళ్లిపోయారు. చట్టం చెప్పే కమిషనర్... సెలవులపై వెళ్లిన కమిషనర్ అహ్మద్ షఫిఉల్లా ముక్కుసూటిగా మాట్లాడే అధికారిగా మేడ్చల్‌లో తన ముద్ర వేశారు. ప్రతి విషయంలో తాను చట్టం ప్రకారంగా ఉంటూ పనులను ఆ ప్రకారంగానే చేస్తానని బల్ల గుద్ది చెప్పేవాడు. ఎవరికి అనుకూలంగా ఉండకుండా తన దైన శైలిలో పనిచేసి ఆఖరుకు సెలవు పెట్టే వరకు తెచ్చుకున్నాడు. తనపై ఆరోపణలు చేసిన కౌన్సిలర్లకు ఆయన గతంలో మున్సిపల్ కార్యాలయంలోనే నాపై ఆరోపణలు చేసిన వారికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ఏది ఉన్నా తాను ఉన్నతాధికారులకు చెప్పుకుంటానని మీడియా ముందు తేల్చి చెప్పాడు. అధికార పార్టీ నాయకులు, కౌన్సిలర్లకు అండగా ఉండకపోవడంతో ప్రభుత్వ అధికారి తనకు ఇష్టం, అవసరం లేకున్నా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాల్సి వచ్చింది. రాజకీయ నాయకుల క్రీడలో ఓ అధికారి సెల్ఫ్ అవుట్ అవ్వడం స్థానిక ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చదవండి యజమాని భార్యతో డ్రైవర్ వివాహేతర సంబంధం.. చివరికి షాకింగ్ ట్విస్ట్ -
తల్లి కాటికి.. తండ్రి కటకటాల్లోకి.. ఒంటరిగా మిగిలిన చిన్నారులు
సాక్షి, మంచిర్యాల: ఏం జరిగిందో తెలియదు గానీ ఆ తల్లి ఉరేసుకుని ఊపిరి తీసుకుంది. కన్నపిల్లలపై మమకారాన్ని చంపుకుని కాటికి చేరింది. తండ్రిపై కేసు నమోదు కావడంతో కటకటాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. తల్లిని కోల్పోయి.. తండ్రికి దూరమైన ఇద్దరు చిన్నారులు ఒంటరిగా మిగిలారు. తల్లి మృతదేహం వద్ద దిగాలుగా నిలబడిన పిల్లలను చూసి అక్కడున్నవారు చలించిపోయారు. మంచిర్యాల మున్సి పల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి (32) మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బుధవారం ప్రభుత్వ ఆస్పత్రిలో జ్యోతి మృతదేహం వద్ద బంధువులు రోదిస్తుండగా.. ఆమె పిల్లలు రిత్విక్(8), భవిష్య(6) బిక్కుబిక్కుమంటూ అమాయకపు చూపులు చూస్తుండడం అక్కడున్న వారిని కలిచివేసింది. జ్యోతి ఆత్మహత్యకు భర్త బాలకృష్ణ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మంగళవారం రాత్రి 12గంటల ప్రాంతంలో జ్యోతి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాలకృష్ణపై వరకట్న వేధింపులు 498(ఏ), ఆత్మహత్యకు ప్రేరేపణ 306 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని మంచిర్యాల కోర్టులో హాజరుపర్చగా 14రోజుల రిమాండ్ విధించారు. పోస్టుమార్టం అడ్డగింత మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా ఆమె తల్లిదండ్రులు, బంధువులు అడ్డుకున్నారు. ఆత్మహత్యకు కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టా రు. దీంతో పోలీసులు జ్యోతి భర్త బాలకృష్ణ, అతడి తండ్రి నల్లమల్ల మురళి, తల్లి కన్నమ్మ, తమ్ముడు హరికృష్ణ, అక్కాచెల్లెలు కృష్ణకుమారి, జ్యోతిపై కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టానికి మృతురాలి అంగీకరించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని బాలకృష్ణ స్వగ్రామం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవపురం తరలించారు. అక్కడ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. పిల్లలతో జ్యోతి(ఫైల్) మెసేజ్ చేసి డిలీట్ జ్యోతి ఆత్మహత్యకు ముందు వాట్సాప్‌లో ఓ మెసేజ్ చేసి డిలీట్ చేసిందని బాలకృష్ణ రోదించడం, ఉదయం 9.30గంటలకు తన తల్లికి ఫోన్ చేసిన జ్యోతి చనిపోయే ముందు ఏదైనా చెప్పాలనే ప్రయత్నం చేసి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లిన సమయంలో బాలకృష్ణతోపాటు ఇంటి పక్కన ఉండే అతడు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో ఆధారాలు కనిపించకుండా చేసి ఉండొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు ముందు రోజు రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు, జ్యోతిని బాలకృష్ణ కొట్టిన తీరును కూతురు భవిష్య మంచిర్యాల సీఐ నారాయణ్‌నాయక్‌కు వివరించింది. దర్యాప్తు కోసం పోలీసులు జ్యోతికి సంబంధించిన రెండు ఫోన్లు, బాలకృష్ణ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అమ్మమ్మ చెంతకు చిన్నారులు.. బాలకృష్ణను రిమాండ్‌కు తరలించడంతో ఇద్దరు చిన్నారులు రిత్విక్, భవిష్యలను అమ్మమ్మ గంగవరం రవీంద్రకుమారి, తాత రాంబాబు చెంతకు చేరారు. తల్లి మృతదేహంతో మంచిర్యాల నుంచి వెళ్లిపోయారు. కాగా, ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని స్థానిక బీజేపీ నాయకుడు తులా మధుసూదన్‌రావు డిమాండ్ చేశారు. ఆమె మృతిలో అనుమానాలెన్నో ! ఆరు నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవ చివరికి ఓ నిండు ప్రాణం బలి తీసుకుంది. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య జ్యోతి(32) మరణం వెనక రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘అమ్మా నన్ను చంపేసేలా ఉన్నాడు’ అని మృతురాలు తన తల్లితో చనిపోయే రోజే బాధగా ఫోన్లో చెప్పడం, ‘నాన్న అమ్మను తరచూ కొడుతూ, తిడుతున్నారని’ చిన్నారి భవిష్య చెప్పడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. వీటితోపాటు గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలపై పంచాయతీలు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. మృతురాలి తల్లితండ్రులు పలుమార్లు కమిషనర్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. ఇతర మహిళలతో సంబంధాలు నెరపడంపైనా ఆరోపణలు ఉన్నాయి. గతంలో నిర్మల్ పని చేసినప్పుడు కంటే మంచిర్యాలకు వచ్చాక, ఆర్థికంగా బలపడినట్లుగా చెబుతున్నారు. మొదట కానిస్టేబుల్ ఉద్యోగంతో మొదలై, గ్రూప్ వచ్చి కమిషనర్ స్థాయికి చేరడంతో తన హోదాకు తగిన భార్య కాదని, అతనితోపాటు కుటుంబీకులు కూడా మృతురాలిపై ఆరోపణలు చేయడం పట్ల ఆత్మహత్యనా? లేక హత్యనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఓ ఉన్నతాధికారి భార్య మరణం కావడంతో పోలీసు ఉన్నతాధికారులు సైతం ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించారు. సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని, కాల్‌డేటా, వాట్సాప్ చాట్, చనిపోవడానికి ముందు రోజు జరిగిన వాటిపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఆత్మహత్యకు ప్రేరేపణ, వరకట్న వేధింపుల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని స్థానికులు కోరుతున్నారు. -
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య ఆత్మహత్య
ఆదిలాబాద్: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి(32) మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పట్టణంలో సంచలనం సృష్టించింది. బాలకృష్ణ స్థానిక ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో భార్య, కుమారుడు రిత్విక్, కూతురు భవిష్యలతో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం విధుల్లోకి వెళ్లిన కమిషనర్ మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంటి తలుపు లోపల గడియ పెట్టి ఉంది. అనుమానంతో తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా బెడ్రూమ్లో జ్యోతి ఫ్యానుకు చున్నితో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. జ్యోతి మృతదేహాన్ని కిందకు దింపి పోలీసులకు సమాచారం అందించాడు. మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏసీపీ తిరుపతిరెడ్డి, ఎస్సైలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ భార్య కావడంతో చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఆత్మహత్య కాదు.. హత్యే..! జ్యోతి తల్లిదండ్రులు గంగవరపు రవీంద్రకుమారి, రాంబాబు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆందోళనకు దిగారు. ఉదయం తమ కూతురు వీడియో కాల్ చేసి మాట్లాడిందని, చంపేసేలా ఉన్నాడని రోదించిందని ఆరోపించారు. ఖమ్మం జిల్లా కేశవపురానికి చెందిన బాలకృష్ణ కానిస్టేబుల్ ఉద్యోగం చేసేవాడని, 2014, ఆగస్టు 15న పెద్దల సమక్షంలో వివాహం జరిగిందని, మూడెకరాల పొలం, రూ.2 లక్షల విలువైన బంగారం అందజేసినట్లు తెలిపారు. కమిషనర్‌గా ఎంపికైన తర్వాత నుంచి గొడవలు మొదలయ్యాయని, తాను కమిషనర్‌నని, ఎక్కువ కట్నం వచ్చేదంటూ వేధించేవాడని ఆరోపించారు. పలుమార్లు కుటుంబ పెద్దల సమక్షంలో మందలించినట్లు తెలిపారు. జ్యోతి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని వేడుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ నారాయణ్‌నాయక్ తెలిపారు. అమ్మా.. ఏమైంది..! మంచిర్యాలటౌన్: ఉన్నత ఉద్యోగి భార్య.. కుమారుడు, కూతురుతో హాయిగా జీవితం సాగిపోతోంది. ఉదయాన్నే ఇద్దరు పిల్లలను రోజూ మాదిరిగా సిద్ధం చేసి, టిఫిన్ బాక్సు పెట్టి నవ్వుతూ టాటా చెప్పి బడికి పంపించింది. ఏం జరిగిందో గానీ మధ్యాహ్నం వరకు ఆ తల్లి విగతజీవిగా మారింది. ఈ దృశ్యాన్ని చూసిన చిన్నారులు రిత్విక్, భవిష్య ‘‘అమ్మా.. ఏమైంది..’’ అంటూ విలపించిన తీరు అక్కడున్న వారిని కదిలించింది. ‘‘అమ్మా లే అమ్మా... ఏమైంది అమ్మా.. ఎందుకు లేస్తలేవు..’’ అంటూ తల్లి మృతదేహం వద్ద విలపించారు. -
అఫిడవిట్ ఇస్తేనే భవన నిర్మాణానికి అనుమతా?
సాక్షి, అమరావతి: విజయవాడ మెట్రో కారిడార్‌కు ఎలాంటి అభ్యంతరం తెలపకుండా, ఎలాంటి పరిహారం కోరకుండా భూమిని ఉచితంగా అందజేస్తానంటూ అఫిడవిట్ ఇస్తేనే భవన నిర్మాణానికి అనుమతినిస్తామని 2016లో అప్పటి విజయవాడ మునిసిపల్ కమిషనర్ షరతు విధించడంపై హైకోర్టు మండిపడింది. అంతేకాకుండా అందుకు అంగీకరించకపోవడంతో మునిసిపల్ కమిషనర్ భవన నిర్మాణానికి అనుమతిని నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేసింది. మునిసిపల్ కమిషనర్ ఉత్తర్వులను చట్ట విరుద్ధమని, ఏకపక్షమని, అహేతుకమని ప్రకటించింది. అంతేకాకుండా అప్పటి విజయవాడ మునిసిపల్ కమిషనర్ రూ.25 వేలను ఖర్చుల కింద పిటిషనర్‌కు చెల్లించాలని ఆదేశించింది. పరిహారం కోరకుండా ఉచితంగా స్థలం ఇవ్వాలని కోరడం పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ఆస్తి హక్కును హరించడమే అవుతుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ ఇటీవల తీర్పు వెలువరించారు. అప్పటి కమిషనర్ ప్రస్తుతం ఇతర పోస్టులో ఉన్నా, పదవీ విరమణ చేసినా కూడా ఆయనకు ఈ తీర్పు కాపీని పంపాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. పిటిషనర్ భవన నిర్మాణానికి అనుమతినిచ్చే విషయాన్ని తాజాగా పరిశీలించాలని విజయవాడ మునిసిపల్ అధికారులకు న్యాయమూర్తి సూచించారు. విజయవాడ బందరు రోడ్డులో 346 చదరపు గజాల స్థలాన్ని వేణుగోపాలరావు అనే వ్యక్తి నుంచి బొమ్మదేవర వెంకట సుబ్బారావు అనే వ్యక్తి కొనుగోలు చేశారు. ఈ స్థలంలో భవన నిర్మాణం అనుమతినివ్వాలంటే మెట్రో కారిడార్ నిర్మాణం కోసం భూమి అవసరమైనప్పుడు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా, ఎలాంటి పరిహారం కోరకుండా భూమిని ఉచితంగా ఇస్తానని అఫిడవిట్ ఇవ్వాలని కమిషనర్ 2016లో ఉత్తర్వులు ఇచ్చారు, ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
వ్యక్తిపూజకు నేను దూరం: కేటీఆర్
హైదరాబాద్/బెల్లంపల్లి: ‘రాజకీయాల్లోకానీ, పాలనలో కానీ వ్యక్తిపూజను ప్రోత్సహించేవారిలో నేను చివరి వ్యక్తిని. నా జన్మదిన వేడుకలకు హాజరుకాలేదంటూ అత్యుత్సాహం కలిగిన ఓ మున్సిపల్ కమిషనర్ ఉద్యోగులకు మెమో జారీ చేసిన వార్త నా దృష్టికి వచ్చింది. అసంబద్ధ వైఖరి ప్రదర్శించిన కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని పురపాలక శాఖ కమిషనర్(సీడీఎంఏ)ను ఆదేశించా’ అని కేటీఆర్ శుక్రవారం ట్విట్టర్లో వెల్లడించారు. ఈ నెల 24న కేటీఆర్ బర్త్‌డే వేడుకలకు హాజరుకాలేదని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ నలుగురు సిబ్బందికి మెమోలు జారీ చేసిన విషయం తెలిసిందే. మెమోల జారీపై ఈ నెల 27న ‘సాక్షి’లో ప్రచురితమైన వార్త కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో ట్విట్టర్లో స్పందించారు. గంగాధర్ విధుల్లో చేరిన 50 రోజుల్లోనే సస్పెండ్ కావడం గమనార్హం. కాగా, ‘కేంద్రంలోని ఎన్పీయే(నిరర్థక) ప్రభుత్వానికి కనీస ప్రణాళిక లేనందునే దేశీయంగా బొగ్గుకొరత ఏర్పడింది. దీంతో పది రెట్లు ఎక్కువ ధర పెట్టి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి భవిష్యత్తులో విద్యుత్ బిల్లులు పెరిగితే ఎవరికి కృతజ్ఞతలు తెలపాలో మీకు తెలుసు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే భారతదేశంలో వచ్చే వంద ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి’అని కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. -
మా ఫ్లెక్సీలు తొలగిస్తావా?
పుత్తూరు రూరల్: మా ఫ్లెక్సీలనే తొలగిస్తావా? అంటూ టీడీపీ నేతలు మున్సిపల్ కమిషనర్‌పైకి దూసుకెళ్లారు. పుత్తూరులో జరిగిన ఈ ఫ్లెక్సీల రాద్ధాంతం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మున్సిపల్ సిబ్బంది వైఎస్సార్ సర్కిల్ నుంచి ఫ్లెక్సీలను తొలగిస్తూ వస్తున్నారు. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద టీడీపీ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడానికి ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి వచ్చి మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్నారు. కొంతసేపు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అదే సమయానికి అక్కడికి వచ్చిన మున్సిపల్ కమిషనర్ కె.వెంకట్రామిరెడ్డిని టీడీపీ నాయకులు తమ ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. అయినా 15 రోజులుగా గడువిచ్చామని, నేడు తొలగించాలని చెప్పారు. దీనిపై ఆగ్రహించిన టీడీపీ నేతలు కమిషనర్‌పైకి దూసుకెళ్తూ దుర్భాషలాడారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అయినా కమిషనర్ అక్కడే నిలబడడంతో, కొంతసేపటికి టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు జీవరత్నంనాయుడు తమ ఫ్లెక్సీలకు చలానాలను కట్టి అనుమతి తీసుకుంటామని, అంత వరకు ఫ్లెక్సీలు యథాస్థానంలో ఉండాలని కోరారు. ఇందుకు కమిషనర్ సమ్మతించడంతో పరిస్థితి సద్దుమణిగింది. డీఎస్పీ యశ్వంత్ నేతృత్వంలోని పోలీస్ సిబ్బంది టీడీపీ నాయకులను అక్కడి నుంచి వాహనాల్లో ఎక్కించి పంపించేశారు. ఆ తర్వాత మున్సిపల్ సిబ్బంది అనుమతులు లేని ఫ్లెక్సీలను తొలగించారు. -
మదనపల్లె మున్సిపల్ కమిషనర్‌గా ప్రమీల
మదనపల్లె సిటీ: మదనపల్లె మున్సిపల్ కమిషనర్‌గా కె. ప్రమీలను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈమె సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆమె మదనపల్లె మున్సిపల్ కమిషనర్‌గా రానున్నారు. మదనపల్లె మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్న రఘనాథరెడ్డి కర్నూలు జిల్లా ఆదోనికి బదిలీ అయ్యారు. -
ఆ కమిషనర్ రూటే సెపరేటు?
స్థానిక మున్సిపాలిటీలో పాలకవర్గానికి, అధికారులకు మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ మ్యాకల శిరీష అధ్యక్షతన ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతోపాటు అధికార పార్టీ కౌన్సిలర్లు సైతం బహిష్కరించడంతో వివాదం మరోమారు బహిర్గతమైంది. కోస్గి: ప్రజలచే ఎన్నుకోబడిన కౌన్సిలర్లకే సమాచారం లేకుండా అధికారులు అజెండాలు తయారు చేయడం, కౌన్సిల్ ఆమోదించిన పనులు చేపట్టకపోవడం, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కమిషనర్‌పై పాలక సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి పనితీరుపై కౌన్సిలర్లు పలుమార్లు జిల్లా కలెక్టర్‌తోపాటు రాష్ట్ర మున్సిపల్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ పేరుతో జిల్లా అధికారులు రావడం, కమిషనర్ బదిలీ అంటూ కౌన్సిలర్లు సంబరపడటం తప్పా నేటికీ కమిషనర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్రమ వసూళ్లకు పాల్పడిన పలువురు సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకున్న అధికారులు కమిషనర్‌ను మాత్రం పట్టించుకోకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పట్టణానికి చెందిన పలువురు వ్యక్తుల నుంచి పనులు చేయడానికి కమిషనర్ డబ్బులు వసూ లు చేశారనే విషయమై గతంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి బాధితుల సమక్షంలోనే విచారణ చేశారు. కార్యాలయ ఖర్చుల నిమిత్తం తీసుకున్నట్లు కమిషనర్ సమాధానం ఇవ్వడం బాధితులతోపాటు కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులను విస్మయానికి గురి చేసింది. అన్నీ అక్రమాలే.. పట్టించుకునేవారు కరువు స్థానిక మున్సిపల్ కార్యాలయం అక్రమాలకు అడ్డగా మారింది. కొత్తగా ఏర్పడిన మున్సిపల్లో ఇంటి పేర్లు మార్చుకునేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక అనుమతులు ఇచ్చిన నేటికీ అమలు చేయకుండా డబ్బులు ఇచ్చిన వారి పేర్లు మాత్రమే మారుస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న వేతనాల కంటే తక్కువ వేతనం అందిస్తు కార్మికులను వేధిస్తున్నారనేది బహిరంగ సత్యం. కార్మికుల వేతనాలు, నియామకాల్లో అక్రమాలకు సంబంధించి ఫిర్యాదుల నేపథ్యంలో గతంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి విచారణ జరిపారు. అక్రమాలు వెలుగులోకి వచ్చినప్పటికీ చర్యలు మాత్రం శూన్యం. అనుమతులు లేకుండా భవన నిర్మాణాల కు అనాధికారిక అనుమతులు ఇస్తూ మున్సిపల్ అధికారులు అందినంత దండుకుంటున్నారు. ఇలా ఒక్కటి కాదు టెండర్ నిర్వహించిన నర్సరీల్లో మున్సిపల్ కార్మికులతో పనులు చేయించడం, చేయని పనులకు బిల్లులు చేయడం, చేసిన బిల్లులకు కమీషన్ వసూలు చేయడం, ఆన్లైన్ విధానాన్ని పక్కన పెట్టి సగానికి పైగా పనులు నేటికీ కాగితాలపైనే చేయడం వంటి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. -
కుర్చీ నాది.. కాదు నాది
మణుగూరు టౌన్: భద్రాద్రి జిల్లా మణుగూరు మున్సిపాలిటీలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘటనతో అటు ఉద్యోగులు, ఇటు పనుల కోసం వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోయారు. కమిషనర్ కుర్చీ నాదంటే నాదేనని ఇద్దరు అధికారులు వాదించు కోవడంతో గందరగోళంలో పడిపోయారు. గతంలో మణుగూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన వెంకటస్వామిని వైరా కమిషనర్‌గా బదిలీ చేశారు. మణుగూరు కమిషనర్‌గా నాగప్రసాద్‌ను నియమించారు. అయితే మున్సిపల్ ఉన్నతాధికారులు మణుగూరు మున్సిపల్ కమిషనర్‌గా తిరిగి వెం కటస్వామిని నియమిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెంటస్వామి సోమవారం కార్యాలయానికి వచ్చి కమిషనర్ సీటులో కూర్చు న్నారు. కాసేపటికి వచ్చిన నాగప్రసాద్ తనను రిలీవ్ చేస్తూ ఆదేశాలు రానందున తానే కమిషన ర్‌నని వాదించారు. సీటులో తననే కూర్చోనివ్వా లని సూచించారు. తనకు సీడీఎంఏ నుంచి ఉత్త ర్వులు వచ్చినందున తానే కమిషనర్‌నని, కలెక్టర్ ను కలిసి రిలీవ్ ఉత్తర్వులు తెచ్చుకోవాలని వెంక టస్వామి అన్నారు. ఈ విషయమై సాయంత్రం వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. -
సిద్దిపేట బల్దియాకు లీడర్షిప్ అవార్డు
సిద్దిపేటజోన్: వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛబడి పేరిట ప్రజల్లో చెత్త పునర్వినియోగంపై అవగాహన ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు సిద్దిపేట మున్సిపాలిటీకి జాతీయ పురస్కారం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో నెట్వర్క్ కలిగి, కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖకు అనుబంధంగా పనిచేసే ఎర్త్ డే ఆర్గనైజేషన్, సిద్దిపేట మున్సిపాలిటీ లీడర్షిప్ అవార్డు ప్రకటించింది. రాష్ట్రంలో ఒక్క సిద్దిపేటకే ఈ అవార్డు రావడం విశేషం. సిద్దిపేటతో పాటు కోయంబత్తూరు, భువనేశ్వర్, చండీగఢ్, వాడి, జమ్మూ, రాజ్‌కోట్, బెంగళూరు తదితర పట్టణాలకు సైతం ఈ పురస్కారం లభించింది. సోమవారం సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. -
వైరా మున్సిపాలిటీలో ఏడాదికి ముగ్గురు కమిషనర్లు బదిలీ
-
ఊరంతా చెత్త.. ఎమ్మెల్యేకు మండింది.. కమిషనర్ ఇంటికెళ్లి
బెంగళూరు: ఆయనో నియోజకవర్గానికి ఓ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో అన్నీ పనులు దగ్గరుండి చూసుకోవాలి. తాను నివసించే పట్టణంలో శుభ్రంగా చూసుకునే బాధ్యత ఆయనకు ఉంది. అయితే తాను ఆదేశాలు ఇస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పట్టణమంతా ఎక్కడ చూసినా చెత్త ఉంటుండడంతో ఆయనకు మండింది. దీంతో వెంటనే ఓ ట్రాక్టర్ చెత్త తీసుకుని వెళ్లి మున్సిపల్ కమిషనర్ ఇంటి ముందు వేశాడు. ఈ సంఘటన స్థానికంగా హట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని బెళగావి జిల్లా దక్షిణ బెళగావి ఎమ్మెల్యే అభయ్ పాటిల్ (బీజేపీ). బెళగావి పట్టణంలో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో వీధులు దర్శనమిస్తున్నాయి. వీటిని చూసిన ఎమ్మెల్యేకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. బెళగావి పట్టణ మున్సిపల్ (బీసీసీ) అధికారులకు బుద్ధి చెప్పేందుకు ఓ ట్రాక్టర్ తీసుకుని చెత్త వేసుకుని ఆయనే స్వయంగా నడుపుతూ విశ్వేశ్వరనగరలోని మున్సిపల్ కమిషనర్ కేహెచ్ జగదీశ్ ఇంటికి వెళ్లాడు. చెత్తనంతా ఇంటిముందు కుమ్మరించాడు. వాస్తవ పరిస్థితులు ఏమిటో కమిషనర్‌కు చెప్పేందుకే తాను ఈ నిరసన చేపట్టినట్లు ఎమ్మెల్యే అభయ్ పాటిల్ మీడియాకు తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే డిప్యూటీ కమిషనర్ ఇంటి ముందు కూడా ఇలాగే చేస్తామనని ఎమ్మెల్యే హెచ్చరించాడు. మరి ఇప్పటికైనా అధికారులు మారుతారో లేదో. ఈ బీజేపీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ గతంలో పలు వింత కార్యక్రమాలతో వార్తల్లో నిలిచాడు. కరోనా పోవాలని పట్టణంలో యాగం నిర్వహించడమే కాక నగరమంతా సామ్రాణి వేయించారు. Garbage full of tractor was dumped infront of City corporation commissioner K.H Jagadish's house today. Three month ago corporation officials were warned to maintain cleanliness in the city but there was no improvement, garbage is at every corner of city. pic.twitter.com/tv7ndkQw9T — Abhay Patil (@iamabhaypatil) July 25, 2021 -
పట్టణ ప్రాంతాల్లో ప్రస్ఫుటమైన మార్పే లక్ష్యంగా క్లాప్ కార్యక్రమం
విజయవాడ : పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, పారిశుధ్ద్య నిర్వహణను ప్రణాళికా బద్దంగా నిర్వహిస్తూ రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) గా తీర్చిదిద్దాలని పురపాలక కమిషనర్లను మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలందరూ పరిశుభ్ర వాతావరణంలో జీవించేలా ప్రస్ఫుటమైన మార్పులు కనిపించాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా కమిషనర్లందరూ సమగ్రమైన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి నిర్లిప్తత వద్దని , ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. వంద రోజుల ప్రణాళికతో జూలై నెలలో ప్రారంభం కానున్న క్లాప్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం నాడు పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లతో విజయవాడలోని ఎఎంఆర్ డీఎ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, కార్యదర్శి రామమనోహర్, సిడిఎంఎ ఎం.ఎం.నాయక్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి సంపత్, ఎపియుఐఎఫ్ డిసి ఎండి బసంత్ కుమార్, టిడ్కో ఎండి శ్రీధర్, మెప్మా ఎండి విజయలక్ష్మి, ఇంజనీరింగ్ ఛీప్ చంద్రయ్య తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పురపాలక కమీషనర్లందరూ ఉదయమే క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని తద్వారా పౌరులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పట్టణాల్లోని నివాస , వాణిజ్య ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్ధాల సేకరణ, తరలింపు కోసం త్వరలో 3100 ఆటోలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు. ఈ ఆటోల ద్వారా వ్యర్ధాల తరలింపునకు అవసరమైన రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకోవాలన్నారు. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పాలసీ తదితరాలకు అనుగుణంగా అమలు చేయాల్సిన కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఇందుకోసం ఆయా మున్సిపాలిటీల్లో కొన్ని వార్డులను ఎంపిక చేసుకోవాలన్నారు. క్లాప్ కార్యక్రమం తాలూకు లక్ష్యాలు, ఉద్దేశ్యాలు కలిగే ప్రయోజనాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించడంలో కమిషనర్లు కీలక భూమిక వహించాలన్నారు. చదవండి: మూడు రాజధానులు మా విధానం : మంత్రి బొత్స -
కర్నూలు జిల్లాలో కరోనా కట్టడికి అధికారుల చర్యలు
-
స్వయంగా రంగంలోకి దిగిన మున్సిపల్ కమిషనర్
-
నైట్ క్లబ్‌లపై దాడులు.. పోలీసుల అదుపులో 275 మంది
సాక్షి, ముంబై: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న నైట్ క్లబ్బులపై బీఎంసీ అధికారులు సోమవారం రాత్రి ఆకస్మిక దాడులు చేశారు. ఇందులో పట్టుబడిన నాలుగు క్లబ్బులకు షోకాజ్ నోటీసులు జారీచేయడమే గాకుండా ఓ క్లబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చర్యల్లో భాగంగా నాలుగు క్లబ్‌ల యజమానుల నుంచి రూ.43,200 జరిమానా వసూలు చేశారు. కోవిడ్ నియమాలు తుంగలో తొక్కి నైట్ క్టబ్బులు నడిపితే కఠిన చర్యలు తప్పవని, క్లబ్ యాజమాన్యాలు తమ వైఖరి మర్చుకోకుంటే అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు కర్ఫ్యూ విధిస్తామని ఇదివరకే బీఎంసీ కమిషనర్ ఇక్బాల్‌సింగ్ చహల్ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ క్లబ్ యాజమాన్యాలలో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. అందులో పార్టీలు చేసుకునే కస్టమర్లు ముఖాలకు మాస్క్‌లు ధరించడం లేదు. సామాజిక దూరాన్ని పాటించడం లేదు. కస్టమర్ల నిర్లక్ష్యం వల్ల కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదముంది. నియమాలు కచ్చితంగా పాటించాల్సిందేనని చహల్ సూచించారు. కఠిన చర్యలు తీసుకుంటాం: బీఎంసీ కమిషనర్. కొన్ని క్లబ్బుల యజమానులు కోవిడ్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నట్లు బీఎంసీ కమిషనర్ చహల్ దృష్టికి వచ్చింది. దీంతో నగరంతోపాటు ఉప నగరాలలో అర్ధరాత్రి దాటిన ఆకస్మిక దాడులు చేపట్టారు. అందులో దాదర్‌లోని ప్రీతం హోటల్లో, తూర్పు బాంద్రా, మలాడ్, కాందివలిలోని నైట్ క్లబ్బుల్లో నియమాలు ఉల్లంఘించి పార్టీ చేసుకోవడం, డ్యాన్స్‌లు చేస్తున్నట్లు బీఎంసీ అధికారుల దృష్టికి వచ్చింది. ఒక్కో నైట్ క్లబ్లో 50 మందికే అనుమతి ఉంది. కానీ, 100–150 పైనే అందులో కస్టమర్లు ఉన్నారు. అనేక మంది మాస్క్ ధరించలేదు. సామాజిక దూరమైతే పటాపంచలైంది. దీంతో 275 మందిని అదుపులోకి తీసుకుని క్లబ్ యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులతోపాటు జరిమానా విధించారు. చదవండి: (సోదరిపై ప్రేమతో అతడు చేసిన పని ఇప్పుడు హాట్‌టాపిక్..) ప్రస్తుతం ముంబై, ఉప నగరాలలో కరోనా వైరస్ అదుపులోకి వస్తున్నప్పటకీ ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. మరికొద్ది రోజులు ముఖాలకు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటి పనులు చేయాల్సి ఉంది. కానీ, కొందరి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల కరోనా మళ్లీ పడగలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ లేకుండా తిరుగుతున్న వారికి బీఎంసీ సిబ్బంది జరిమానా విధిస్తున్నారు. కానీ, నైట్ క్లబ్బుల్లో తొంగిచూసే నాథుడే లేకపోవడంతో అక్కడ విచ్చల విడిగా నియమాల ఉల్లంఘన జరుగుతోంది. దీంతో కరోనా వైరస్ పూర్తిగా సద్దుమణిగే దాకా రాత్రి వేళ్లలో దాడులు ఇలాగే కొనసాగిస్తామని చహల్ హెచ్చరించారు. క్లబ్ యజమానుల్లో మార్పు రాని పక్షంలో చర్యలు మరింత కఠినం చేస్తామని హెచ్చరించారు. -
ఆధునాతన పారిశుధ్య యంత్రాల ప్రారంభం
సాక్షి, విజయవాడ : అధునాతన పారిశుధ్య యంత్రాలను మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విఎంసీ తరుపున కొత్త టెక్నాలజీతో ఏడు కొత్త వాహనాలను కొనుగోలు చేశామని ప్రసన్న వెంకటేష్ తెలిపారు. వీటి ద్వారా కాలువల పూడికలను సులువుగా తీయోచ్చని పేర్కొన్నారు. జెసిబీలో మూడు మినీ వాహనాలు, కొత్తగా మూడు నాళామేన్ వాహనాలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. మూడు క్లీనింగ్ యంత్రాలను సైతం అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. ఈ కొత్త యంత్రాల వల్ల పని వేగవంతమవుతుందని, సమయం కూడా ఆదా అవుతుందన్నారు. (మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామి కన్నుమూత) -
30 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా భవిష్యత్ ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. 40 శాతానికి పైగా రాష్ట్ర జనాభా పట్టణాల్లో నివసిస్తోందని, ఐదారేళ్లలో రాష్ట్రంలోని మెజారిటీ జనాభా పట్టణాల్లో నివసించే అవకాశముందని చెప్పారు. అత్యధిక శాతం పట్టణ జనాభా గల రాష్ట్రంగా త్వరలో తెలంగాణ మారుతుందన్నారు. పెరుగుతున్న పట్టణీకరణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణం రానున్న 30 ఏళ్లలో ఏర్పడనున్న అవసరాలను తెలుసుకుని, ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ప్రారంభించాలని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లు, హైదరాబాద్ పరిసర మున్సిపాలిటీల కమిషనర్లు, జిల్లా అదనపు కమిషనర్లకు ఎంసీఆర్‌హెచ్చార్డీలో నిర్వహించిన రెండ్రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో బుధవారం మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఆదాయ పెరుగుదలకు వినూత్న పద్ధతులు.. హైదరాబాద్ చుట్టుపక్కల పురపాలికల్లో, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ పట్టణీకరణ వేగంగా జరుగుతుందని, అక్కడ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతను పెంచాల్సిన అవసరం ఉందని కేటీఆర్ తెలిపారు. ప్రతి పురపాలిక తన ఆదాయ వనరుల విషయంలో ప్రత్యేక ఆడిట్ చేపట్టి రానున్న సంవత్సరాల్లో ఆదాయ పెరుగుదలకు సంబంధించిన వినూత్నమైన పద్ధతులను ఎంచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో తొలుత మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా కేటీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి ఒక ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరించారు. పరిపాలన వికేంద్రీకరణ సాధనంగా.. పెరుగుతున్న జనాభాకు అవసరమైన సేవలను అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని.. ఈ మేరకు పరిపాలన వికేంద్రీకరణ ఒక సాధనంగా ఎంచుకుందని కేటీఆర్ చెప్పారు. జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, గ్రామాల సంఖ్యను పెద్ద ఎత్తున పెంచి ప్రజల వద్దకు పరిపాలన తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. -
మానవత్వం ప్రదర్శించిన మున్సిపల్ కమిషనర్
రాయచోటి అర్బన్ : పట్టణంలోని ఓ వృద్ధుడు తీవ్ర జ్వరంతో బాధ పడుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతదేహాన్ని తరలించేందుకు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్, తన తోటి అధికారులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాలలోకి వెళితే.. బీహార్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ అఫ్జల్ (65) మాసాపేటలోని ఒక మసీదులో మౌజన్‌గా పని చేస్తున్నాడు. వారం రోజులుగా జ్వరంతో బాధ పడుతూ స్థానిక ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నాడు. శనివారం జ్వరం తీవ్రం కావడంతో ఓ విలేకరి విషయాన్ని మున్సిపల్, రెవెన్యూ అధికారులకు తెలిపారు. దీంతో మున్సిపల్ కమిషనర్ రాంబాబు, తహసీల్దార్ సుబ్రమణ్యంరెడ్డి మాసాపేటకు వెళ్లి వృద్ధుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కోవిడ్–19 లక్షణాలున్నట్లు వైద్యుడు అనుమానించి కడప రిమ్స్‌కు పంపాలంటూ అధికారులకు సూచించారు. రాత్రి కావడంతో ఉదయమే కడపకు తరలి స్తామని, ప్రస్తుతం వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. వృద్ధుడిని వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతో.. అతను రాత్రికి రాత్రే తిరిగి మాసాపేటలోని మసీదుకు వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం కడపకు తరలించేందుకు 108 అంబులెన్స్‌తో మున్సిపల్ అధికారి మల్లికార్జున మసీదు వద్దకు వెళ్లి.. వృద్ధుడికి పీపీఈ కిట్ అందించారు. పీపీఈ కిట్ ధరిస్తూ ఉండగానే కుప్పకూలిపోయాడు. వైద్యం కోసం అంబులెన్స్‌లోకి చేర్చేందుకు 108 సిబ్బంది ముందుకు రాలేదు. మున్సిపల్ అధికారి మల్లికార్జున స్వయంగా రంగంలోకి దిగి.. మరో యువకుడితో కలిసి ఎలాగోలా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కరోనాతో మరణించాడన్న అనుమానంతో మృతదేహాన్ని ఖననం చేసేందుకు పారిశుద్ధ్య సిబ్బంది ముందుకు రాలేదు. దీంతో కమిషనర్ రాంబాబు, మున్సిపల్ అధికారి మల్లికార్జున, సంఘ సేవకుడు మైనుద్దీన్, ప్రభుత్వ చీఫ్ విప్ పీఏ నిస్సార్ అహమ్మద్, మున్సిపల్ సిబ్బంది దర్బార్ మానవత్వంతో వ్యవహరించారు. పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో మాసాపేట శ్మశాన వాటికకు చేర్చారు. అక్కడ కోవిడ్ – 19 కరోనా ప్రొటోకాల్ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. -
ఆ సమయంలో చాలెంజింగ్‌గా పనిచేశాం..
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పీఎస్ గిరీషా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు విశేషంగా కృషి చేశారు. లాక్డౌన్ సమయంలో కరోనా కట్టడికి ఆదర్శవంతంగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో సఫలీకృతులయ్యారు. బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. – తిరుపతి తుడా కోవిడ్ ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కొన్నారు..? సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించి ఆ దిశగా పరుగులు పెట్టే సమయంలో కరోనా ఉపద్రవంగా వచ్చిపడింది. సుమారు 3నెలల పాటు మరో పనిలేకుండా చేసింది. కరోనా కట్టడిలో తిరుపతి కార్పొరేషన్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. స్వచ్ఛ సర్వేలోనూ నగరం అగ్రస్థానంలో నిలవడం గర్వకారణం. విదేశాల నుంచి వచ్చిన వారి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాం. వారి ఇళ్లకు రెడ్ నోటీసులు, చేతికి స్టాంప్ వేయడం వంటివి సత్ఫలితాలు ఇచ్చాయి. కూరగాయల మార్కెట్‌ను వికేంద్రీకరించి, తొమ్మిది ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం. స్పెషల్ రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ల ద్వారా ప్రత్యేకంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాం. హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయడం, రెడ్ జోన్ల అమలు వంటి కీలక నిర్ణయాలు కరోనా కట్టిడికి దోహదపడ్డాయి. తిరుపతిలో నాలుగు లక్షలకుపైగా జనాభా ఉండగా లాక్ డౌన్ సమయంలో కేవలం తొమ్మిది పాజిటివ్ కేసులకే కట్టడి చేశామంటే సమష్టి కృషితోనే సాధ్యమైంది. అభివృద్ధిలో మీ మార్క్..? కరోనా కట్టిడికి 3 నెలలు, వార్డు సచివాలయాల ఏర్పాటుకు మరో మూడు నెలలు సమయం గడిచిపోయింది. మిగిలిన ఆరు నెలల్లో అభివృద్ధికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకుని వాటిని పరుగులు పెట్టించాం. పద్మావతి, ప్రకాశం పార్కులను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాం. గరుడ వారధికి నిధులు సమకూర్చి పనులకు ఆటంకం లేకుండా చేశాం. అమృత్ స్కీమ్ ద్వారా 90 శాతం పనులు పూర్తి చేశాం. 15 ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణం పూర్తి చేశాం. సుమారు రూ.21 కోట్లతో వినాయక సాగర్‌కు అనుమతులు తీసుకుని పనులను ప్రారంభించాం. విలీన పంచాయతీల్లో రూ.16 కోట్లతో తాగునీటి సౌకర్యం, రోడ్లు, కాలువలు, యూడీఎస్ అందించేలా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతున్నాం. డీబీఆర్, కరకంబాడి–రేణిగుంట రోడ్లను కలిపే చెన్నగుంట లింక్ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయడంతో కమిషనర్‌గా నా మార్కు కనిపించడం ఆనందంగా ఉంది. చదవండి: పలమనేరులో నువ్వా- నేనా..? ఇళ్ల పట్టాల పంపిణీపై..? పట్టణాల్లో ఇళ్లు లేని ప్రజలకు బహుళ అంతస్తులు నిర్మించి ఇవ్వడం ఇప్పటి వరకు చూశాం. దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడం నిజంగా చారిత్రాత్మక నిర్ణయం. ఈ అపురూప ఘట్టం నా చేతుల మీదుగా జరుగుతుండడం జీవితంలో మరచిపోలేను. నగరంలో 23 వేల మంది అర్హులకు జూలై 8న ఇంటి పట్టాలు పంపిణీ చేస్తాం. ఏడాది పాలన ఎలాఉంది...? తిరుపతిలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఇదివరకు జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసినా ఇప్పుడు తిరుపతి కార్పొరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించడం ప్రత్యేకమనే చెప్పాలి. బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో అనేక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ప్రభుత్వం నిర్థేశించిన లక్ష్యాలను సకాలంలో అధిగమించాం. పథకాల అమలులో రాష్ట్రంలోనే తిరుపతి ముందుంది. ఏడాది పాలన విజయవంతంగా పూర్తిచేసుకోవడం సంతోషంగా ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 మొదలైందా..? స్వచ్ఛ సర్వేక్షణ్ 2020ను విజయవంతంగా పూర్తిచేశాం. కరోనా కారణంగా ర్యాంకులను ఇప్పటి వరకు ప్రకటించకపోయినా గతంలో కంటే మెరుగైన స్థానంలో ఉంటామని ఆశిస్తున్నాం. సాలిడ్ వేస్టు మేనేజ్మెంట్లో దేశవ్యాప్తంగా ఏ నగరం కూడా మనకు సాటి రాదు. సుమారు రూ. 40 కోట్లతో బయోమైనింగ్, తడి చెత్త ద్వారా దేశంలోనే అతిపెద్ద బయో గ్యాస్ ప్లాంట్, భవన వ్యర్థాల ద్వారా ఉత్పత్తులు, ఇలా చెత్త నిర్వహణ చేపట్టాం. ఇదే స్ఫూర్తితో 2021 పోటీలకు సన్నద్ధమయ్యాం. మీకు చాలెంజింగ్‌గా అనిపించినవి ..? ప్రజలకు సులభంగా.. తొందరగా.. అవినీతిరహితంగా సేవంలదించాలనే సంకల్పంతో వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే మాకు ఇదో పెద్ద టాస్క్. ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు గత ఏడాది జూలై లోపు నగరంలో 102 సచివాలయాలను ఏర్పాటు చేశాం. భవనాల ఎంపిక, మౌలిక వసతుల కల్పన సమస్యలను అధిగమించాం. రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన సచివాలయాలను నగరంలో ఏర్పాటు చేయడం, ప్రజల ఇంటికే సంక్షేమ పథకాలను అందించడం, సుమారు 3 వేల మంది వార్డు వలంటీర్లను ఎంపిక చేయడం, కరోనా కట్టడి వంటివి చాలెంజింగ్‌గా తీసుకుని పనిచేశాం. అర్జీలను పరిశీలిస్తున్న జాయింట్ కలెక్టర్ మార్కండేయులు (ఫైల్) సేవలో విలక్షణ శైలి అంచెలంచెలుగా ఎదిగి ఐఏఎస్ అధికారి స్థాయికి చేరుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్‌గా రెవెన్యూ పాలనలో తన మార్క్ వేస్తున్నారు. భూ బకాసురులపై కొరడా ఝళిపిస్తున్నారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల స్వా«దీనానికి చర్యలు చేపట్టారు. పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజల ప్రశంసలు అందుకున్నారు. బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది పూర్తి చేసుకుంటున్న జేసీ (రెవెన్యూ) డి.మార్కండేయులుపై ప్రత్యేక కథనం. – చిత్తూరు కలెక్టరేట్ జిల్లా పాలనలో తనదైన మార్క్ వేసుకున్నారు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డి.మార్కండేయులు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సమర్థవంతగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాల పంపిణీకి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ప్రజలకు అనువైన ప్రాంతాల్లో స్థలాలు కేటాయించేందుకు కిందిస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కింది స్థాయి నుంచి ఐఏఎస్‌గా ఎదిగిన ఆయన గతంలో డీఆర్ఓగా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికలసంఘం జాయింట్ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. 2019 జూన్ 24 న జాయింట్ కలెక్టర్‌గా జిల్లాకు వచ్చారు. ఆయన బాధ్యతలు స్వీకరించి నేటితో ఏడాది పూర్తవుతోంది. భూఆక్రమణలపై ప్రత్యేక దృష్టి జాయింట్ కలెక్టర్ మార్కండేయులు బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలోని పలు ప్రాంతాల్లో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ముందుగా వాటిని గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకున్నారు. ఏడాదిలో సుమారు 225.12 ఎకరాల భూమిని ప్రభుత్వ పరం చేశారు. వెదురుకుప్పం మండలం అల్లమడుగు గ్రామంలో 86.38 ఎకరాలు, ఎస్ఆర్పురం మండలంలోని జీఎంఆర్ పురంలో 9.00 ఎకరాలు, పెనుమూరు మండలం గుంటిపల్లిలో 35 ఎకరాలు, నారాయణమండలం బొప్పరాజుపాళ్యంలో 36.97 ఎకరాలు, వరదయ్యపాళెం మండలం చిన్నపాండూరులో 10.29 ఎకరాలను ప్రభుత్వానికి స్వా«దీనం చేశారు. అలాగే శ్రీకాళహస్తి మండలంలోని రామానుజపల్లిలో సర్వే నంబర్ 1లో 903.63 ఎకరాలు, సోమల మండలంలోని పెద్దఉప్పరపల్లిలో 269/7 సర్వే నంబర్లో 1.58 ఎకరాల గుట్టపోరంబోకును సర్కార్ ఆధీనంలోకి తీసుకువచ్చారు. ఎస్టేట్ అబాలి‹Ùమెంట్ యాక్ట్ 1948 ప్రకారం 11 కేసులకు గాను 92.10 ఎకరాల భూ సమస్యలను పరిష్కారించారు. 22ఏ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం 166 కేసులకు గాను 314.70 ఎకరాల భూ సమస్యలకు తెరదించారు. 32 చుక్కల భూముల కేసులకు గాను 28.41 భూ సమస్యలకు పరిష్కారం చూపించారు. చదవండి: మాతృదేవతా మన్నించు! స్పందన సమస్యల పరిష్కారం స్పందన కార్యక్రమంలో అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి వహించారు. ఏడాది కాలంలో భూ సమస్యలపై ప్రజలిచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో తహసీల్దార్ల ద్వారా పరిష్కారం చేయించారు. హైవే విస్తరణ సమస్యలకు చెక్ జిల్లాలో జరుగుతున్న ఎన్‌హెచ్–140 హైవే పనుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. భూ విరాళదాతలకు వెంటనే పరిహారం అందించేందుకు కృషి చేశారు. ముఖ్యంగా కుక్కలపల్లి, కాణిపాకం, పూతలపట్టు, పి.అగ్రహారం, కొత్తకోట, పాకాల, గాదంకి, చంద్రగిరి ప్రాంతాల్లో భూ సమస్యలను పరిష్కరించారు. ఈ పనులకు రూ.21,11,66,852ల నష్టపరిహారం పంపిణీ చేశారు. అదేవిధంగా బెంగళూరు– చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే పనులకు 1,57,113.70 చదరపు అడుగుల భూమిని కేటాయించి రూ. 84.80 కోట్ల పరిహారం అందించారు. జిల్లాలో పనిచేయడం అదృష్టం చిత్తూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీకి సాగుతున్న కసరత్తును నిరంతరం పర్యవేక్షిస్తున్నా. ఆక్రమణకు గురైన భూములను తిరిగి ప్రభుత్వం పరం చేయడం సంతృప్తినిచ్చింది. కలెక్టర్ నారాయణభరత్‌గుప్తా సహకారంతో రెవెన్యూ సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తున్నాం. – మార్కండేయులు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) -
పలమనేరులో నువ్వా- నేనా..?
సాక్షి, పలమనేరు: తాతపోతే బొంతనాదన్నట్టు తయారైంది పలమనేరు మున్సిపాలిటీలో పరిస్థితి. మరో మూడునెలల్లో ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి పదవీ విరమణ చెందనున్నారు. దీంతో ఆ పోస్టుపై ఇదే కార్యాలయానికి చెందిన కొందరి కన్ను పడింది. దీంతో పక్కాగా ఓ వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం వారి ప్రయత్నాల్లో వారు తలమునకలైనట్లు సృష్టమవుతోంది. నిబంధనలు ఇలా.. సాధారణంగా కమిషనర్ బదిలీ గానీ రిటైర్డ్ గానీ అయితే ఆ పోస్టుకు రెగ్యులర్ కమిషనర్‌ను నియమించాల్సి ఉంటుంది. అయితే వీలుగాని పక్షంలో అదే కార్యాలయంలోని గెజిటెడ్ హోదా కలిగిన ఇంజినీరింగ్ డీఈ, లేదా మేనేజర్‌ను ఇన్చార్జ్ లేదా ఎఫ్ఏసీగా రెగ్యులర్ కమిషనర్ వచ్చే దాకా నియమించుకోవచ్చు. అయితే ఇన్చార్జ్ ఇస్తే పవర్ ఉండదు. అందుకే ఎవరు ఈ పోస్టుకొచ్చినా ఎఫ్ఏసీనే కోరుకుంటారు. ఈ తంతు స్థానిక రాజకీయ నేతలు, అధికారుల పలుకుబడిని బట్టి జరిగే అవకాశాలుంటాయి. ఇక్కడ సాగుతున్న తంతు మరోలా.. ఇదే కార్యాలయంలో ఇంజినీరింగ్ విభాగం ఏఈగా పనిచేస్తున్న ఉద్యోగి కరోనాకు ముందు డీఈగా పదోన్నతి బదిలీపై వచ్చారు. ప్రాముఖ్యతను బట్టి కమిషనర్ లేనపుడు డీఈకి ఇన్చార్జ్ లేదా ఎఫ్ఏసీ కమిషనర్ చాన్స్ ఉంటుంది. ఇదే ఆశతో సదరు అధికారి ఇప్పటికే స్థానిక నాయకులను ప్రసన్నం చేసుకుని బెర్తు తనకేనని సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అయితే ఇన్చార్జ్ లేదా ఎఫ్ఏసీ కమిషనర్ అవకాశం మేనేజర్‌కు దక్కే అవకాశాలు లేకపోలేదు. దీన్ని గమనించిన ఇక్కడి మేనేజర్ తన సత్తా ఏంటో చూపింది. గత ఐదేళ్లుగా ఇక్కడే పనిచేస్తూ తాజాగా గ్రేడ్–3 నుంచి గ్రేడ్–2 మేనేజర్‌గా ప్రమోషన్ పొందారు. అయితే ప్రమోషన్‌తో పాటు ట్రాన్స్ఫర్ వస్తుందని అందరూ భావించారు. కానీ చక్రం తిప్పిన ఆ మేనేజర్ ప్రమోషన్ పొంది ఇక్కడికే రిటైన్ చేయించుకున్నారు. ఈ తతంగం వెనుక బడాహస్తమే ఉన్నట్టు స్థానిక కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. లాంగ్ స్టాండిగ్‌లో ఉన్న మేనేజర్ మళ్లీ ఇక్కడికే బదిలీ చేయించుకోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. దీన్నంతా గమనిస్తున్న రాయదుర్గం మున్సిపల్ మేనేజర్ తన పలుకుబడిని ఉపయోగించి పలమనేరు మేనేజర్‌గా బదిలీకి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు ఆయన పెద్దనేతల చుట్టూ తిరుగుతున్నట్టు సమాచారం. చదవండి: మార్పు వైపు మరో అడుగు రెగ్యులర్ కమిషనర్ వస్తే అన్నిటికీ చెక్.. మున్సిపాలిటీలో సాగుతున్న ఎత్తులు, పైఎత్తులను స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ ఇప్పటికే పసిగట్టినట్టు తెలిసింది. గత కొన్నాళ్లుగా మున్సిపాలిటీలో గాడితíప్పిన పాలనపై తన షాడోల ద్వారా సమాచారాన్ని సేకరించిన ఆయన కొందరు అధికారులకు గట్టిగా హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. పలమనేరు పట్టణంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 55,373 జనాభా ఉన్నారు. ఇప్పుడది 60 వేలకు మించింది. గత ఐదేళ్లుగా పురపాలకసంఘంలో సాగిన వ్యయ, ఆదాయాల మేరకు ప్రస్తుతం గ్రేడ్–3లో ఉన్న మున్సిపాలిటీని గ్రేడ్–2గా మార్చే అవకాశాలను ఎమ్మెల్యే పరిశీలిస్తున్నారు. ఇలాంటి సమయంలో మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే రెగ్యులర్ కమిషనర్‌ను నియమించేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. చదవండి: అందరి ఆరోగ్యంపై 90 రోజుల్లో స్క్రీనింగ్ -
ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్
అబ్దుల్లాపూర్‌మెట్ (పెద్దఅంబర్‌పేట): మరో మూడు నెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన తరుణంలో ఓ మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపల్ కమిషనర్ రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఓ ఇంటి నిర్మాణం విషయంలో ప్రవాస భారతీయుడిని కమిషనర్, టౌన్‌ప్లానింగ్ అధికారి కలసి రూ.2.5 లక్షలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కమిషనర్ రూ.1.5 లక్షలు తీసుకోగా.. తన వాటాను మధ్యవర్తికి ఇవ్వాలని చెప్పి టీపీఓ లిప్తపాటు కాలంలో తప్పించుకున్నాడు. కుంట్లూర్ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు సురభి వెంకట్‌రెడ్డికి తన తండ్రి నుంచి సంక్రమించిన 300 గజాల స్థలంలోని పాత ఇంటిని తొలగించి దాని స్థానంలో కొత్త ఇల్లు నిర్మాణం చేస్తుండగా మున్సిపల్ కమిషనర్ రవీందర్రావు, టీపీఓ రమేశ్ పనులు నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారు. కుంట్లూర్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి తమకు ఫిర్యాదు చేశారంటూ పలుమార్లు నోటీసులు పంపించి సిబ్బందితో పనులు అడ్డుకున్నారు. దీంతో బాధితుడు కమిషనర్ రవీందర్రావు, టీపీఓ రమేశ్‌ను సంప్రదించగా రూ.2.5 లక్షలు (కమిషనర్‌కు రూ.1.5 లక్షలు, టీపీఓకు రూ.లక్ష) ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వెంకట్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం పెద్దఅంబర్‌పేట కార్యాలయంలోనే వెంకట్‌రెడ్డి నుంచి కమిషనర్ రవీందర్రావు రూ.1.5 లక్షల లంచం తీసుకుంటుండగా అప్పటికే మాటేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. టీపీఓ తన వాటాను మధ్యవర్తి అయిన లైసెన్స్డ్ ప్లానర్ ఆదినారాయణ రూ.లక్ష తీసుకుంటుగా అతడిని కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కమిషనర్ రవీందర్రావుతోపాటు ఆదినారాయణపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ అనంతరం ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. -
విజయనగరంలో మేస్త్రీ నిర్వాకం..
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రజారోగ్య పరిరక్షణకు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాల్సిన సిబ్బంది అక్రమార్జనలకు అలవాటు పడి అడ్డంగా దొరికిపోయిన అవినీతి భాగోతం బట్టబయలైంది. రూ.1.50లక్షలు సొమ్ము కోసం బిల్లు కలెక్టర్‌గా వేషం మార్చి.. ఏకంగా కార్పొరేషన్ కమిషనర్ పేరిట దొంగ సంతకం చేయడంతో పాటు దొంగ స్టాంపులు వేయటం సంచలనం సృష్టించింది. డబ్బులిచ్చిన వ్యక్తి ఫిర్యాదుతో స్పందించిన కమిషనర్ తన సంతకం చేయలేదని తేల్చటంతో అసలు విషయం బట్టబయలైంది. తదుపరి సొమ్ములు తీసుకున్న ఉద్యోగిపై చట్టపరమైన క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజారోగ్య విభాగంలో సార్జెంట్ (పీహెచ్ మేస్త్రీ)గా ఎం.ఎల్లారావు పని చేస్తున్నారు. అక్రమార్జనకు అలవాటు పడిన ఎల్లారావు అడ్డగోలుగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పట్టాడు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్లో రెవెన్యూ విభాగంలోని విధులు నిర్వహించాల్సిన బిల్లు కలెక్టర్ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు. బిల్లు కలెక్టర్లు మాదిరి నగరంలోని కార్పొరేషన్‌కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లో అద్దెకు ఉంటున్న వారి వద్దకు వెళ్లి షాపుల రెన్యువల్ చేయించుకునేందుకు చలానా రూపంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ షాపింగ్ కాంప్లెక్స్‌లో 18, 21, 22, 23 షాపులు లీజుకు తీసుకున్న రేగాన ఆదినారాయణ అనే వ్యక్తి రూ.1.50 లక్షల మొత్తాన్ని ఎల్లారావుకు చెల్లించారు. ఈ మేరకు ఎల్లారావు కమిషనర్ సంతకం, స్టాంపులు ఉన్న కొన్ని కాగితాలను ఆదినారాయణకు ఇచ్చారు. రెండు నెలలు గడుస్తున్నా రెన్యువల్‌కు సంబంధించిన పత్రాలు ఇవ్వకపోవటంతో ఆదినారాయణ కార్పొరేషన్ ఉద్యోగి ఎల్లారావుపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఎల్లారావు రూ.50,000 నగదుకు సంబంధించి అగ్రిమెంట్స్ వస్తాయని సమాధానమిచ్చారు. అనుమానం వచ్చిన ఆదినారాయణ నేరుగా కార్పొరేషన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఎల్లారావు ఇచ్చిన కాగితాలను పరిశీలించిన కమిషనర్ ఆ కాగితాలపై ఉన్నవి తన సంతకాలు కావని తేల్చారు. ఎల్లారావు దొరికిపోయింది ఇలా...? అచ్చం కమిషనర్లానే సంతకాలు చేశానని అనుకుంటున్న మేస్త్రీ ఎం.ఎల్లారావు ఆ సంతకం చేయటంలో దొర్లిన తప్పిదంతో అడ్డంగా దొరికిపోయాడు. వాస్తవానికి కమిషనర్ వర్మ ప్రతి ఫైల్‌పై తన పూర్తి పేరు ఎస్.సచ్చిదానంద వర్మ పేరిట సంతకం చేస్తారు. అయితే ఎల్లారావు బిల్లు కలెక్టర్‌గా మాయ చేసిన విషయంలో ఎస్ఎస్.వర్మ అంటూ సంతకం చేశాడు. సదరు పత్రాలను కమిషనర్ పరిశీలించిన సమయంలో ఎస్ఎస్ వర్మ అంటూ ఆ పత్రాలపై ఉండటంతో ఇవి తన సంతకాలు కాదని, మీరు మోసపోయారంటూ ఫిర్యాదుదారుడు రేగాన ఆదినారాయణకు వివరించారు. దీంతో అవాక్కయిన ఆదినారాయణ ఈ విషయంలో మీరే న్యాయం చేయాలంటూ లబోదిబోమంటున్నాడు. ఎల్లారావుపై ఫిర్యాదు కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి రూ1.50లక్షలు అక్రమార్జనకు పాల్పడిన ఎల్లారావుపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పాటు చట్టపరంగా క్రమశిక్షణా చర్యలకు ఆదేశించినట్టు కమిషనర్ ఎస్ఎస్.వర్మ సాక్షికి తెలిపారు. అక్రమార్జనకు పాల్పడిన ఎల్లారావును 24 గంటల్లోగా విధుల నుంచి తొలగించాలని ప్రజారోగ్య విభాగాధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఇటువంటి తప్పిదాలు ఎవ్వరు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సీఎం జగన్ ఏడాది పాలన సందర్బంగా ప్రత్యేక సదస్సులు
-
సహజీవనం చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ‘ఇప్పట్లో కరోనా మనల్ని వదిలిపెట్టి పోయే అవకాశం లేదు. పూర్తిస్థాయి వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా వైరస్‌తో సహజీవనం చేయాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల ఉపయోగం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వినియోగం వంటి నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలి.’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా ఇప్పట్లో వదిలిపెట్టదని, అందుకే దీని కట్టడికి అవసరమైన మార్గదర్శకాలను ఆరోగ్యశాఖతో కలిసి పురపాలక శాఖ విడుదల చేస్తోందన్నారు. వైరస్ కట్టడికి మున్సిపల్ కమిషనర్లు తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలో దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేయనున్నారని, ఆ తర్వాత కూడా కరోనా వ్యాప్తికి అవకాశాలున్న నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. పట్టణాల్లో ప్రవేశపెట్టిన సరి, బేసి సంఖ్యల విధానంలోనే దుకాణాలు తెరిచేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పట్నుంచే సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు వచ్చే వర్షాకాలంలో డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని, గతంలో చేపట్టిన తరహాలోనే యాంటీ లార్వా కార్యక్రమాలను ఆదివారం నుంచి తిరిగి ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆరోగ్య శాఖతో కలసి పురపాలక శాఖ తయారు చేసిన సీజనల్ వ్యాధుల క్యాలెండర్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని కోరారు. డెంగ్యూ నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే ఉద్దేశంతో ఆదివారం నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. ప్రతి పట్టణంలోని మురికి కాలువలను శుభ్రం చేసి ఆ చెత్తను తరలించే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు. ప్రతి పట్టణంలోని మ్యాన్ హోల్ మరమ్మతులు పూర్తి చేయాలని తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బంది రక్షణ కవచాలైన మాస్కులు, గ్లౌజులు లేకుండా పని చేయరాదన్నారు. ఒకవేళ పారిశుద్ధ్య కార్మికులు ఇవి లేకుండా కార్య క్షేత్రంలో కనిపిస్తే పూర్తి బాధ్యత మున్సిపల్ కమిషనర్లదే అవుతుందని హెచ్చ రించారు. పారిశుద్ధ్య కార్మికులకు వారానికోసారి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం పట్టణాల్లో తాగునీటి కొరత పెద్దగా లేదని మున్సిపల్ కమిషనర్లు మంత్రికి తెలియ జేశారు. ఇప్పటిదాకా పట్టణాలకి పట్టణ ప్రగతి కార్యక్రమం కింద రూ.830 కోట్లను విడుదల చేశామని, ఈ నిధులతో చేపట్టిన కార్యక్రమాలపైన ఒక నివేదికను రూపొందించి వెంటనే మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు పంపించాలని కేటీఆర్ ఆదేశించారు. నేటి నుంచి కొత్త కార్యక్రమానికి శ్రీకారం ‘ప్రతి ఆదివారం 10 గంటలకు–10 నిమిషాలు’పేరిట సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమానికి పురపాలక శాఖ నేటి నుంచి శ్రీకారం చుట్టబోతోంది. ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవం తం చేయాలని మున్సిపల్ కమిషనర్లను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అంద రూ కూడా తమ తమ ఇళ్లలో ఈ కార్యక్రమంలో పాల్గొని, నీళ్లు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే ఉండి దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. -
ఎస్ఈసీతో మున్సిపల్ కమిషనర్, డీజీపీ భేటీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ కనగరాజ్‌ను శనివారం మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల యథాతథ స్థితిపై ఎస్ఈసీకి నివేదించారు. నగర పాలకసంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రస్తుత స్థితి గురించి ఆయన వివరించారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంపై నివేదికను అందజేశారు. (ఏపీ ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్) ఎస్ఈసీని మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ కనగరాజ్‌ను డీజీపీ గౌతమ్ గౌతం సవాంగ్ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్ఈసీతో సుమారు అరగంట పాటు భేటీ అయిన డీజీపీ.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఎస్ఈసీ కనగరాజ్‌ను వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. -
మా భర్తలను అనుమతించండి
వేములవాడ: వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో శనివారం పట్టణ ప్రగతిపై ఏర్పాటు చేసిన సమీక్షలో గందరగోళం నెలకొంది. సమావేశానికి తమ భర్తలను అనుమతించాలని మహిళా కౌన్సిలర్లు చేసిన డిమాండ్‌ను కమిషనర్ అంగీకరించలేదు. దీంతో కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో ఈ పరిస్థితి చోటుచేసుకుంది. వేములవాడలో 5 రోజులుగా పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతోంది. దీని సమీక్షలో మహిళా కౌన్సిలర్ల భర్తలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే.. ‘ఇది అధికారిక సమావేశం.. కౌన్సిలర్ల భర్తలు బయటికి వెళ్లిపోవాలి’అని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. దీనికి చైర్పర్సన్ సహా మిగిలిన కౌన్సిలర్లు అభ్యంతరం తెలుపుతూ వాకౌట్ చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి.. అసంతృప్తితో ఉన్న చైర్పర్సన్ సహా కౌన్సిలర్లందరినీ ఆహ్వానించారు. అనంతరం సమావేశం కొనసాగింది. ఈ విషయంపై కమిషనర్‌ను వివరణ కోరగా, అధికారిక కార్యక్రమాల్లో కేవలం కౌన్సిలర్లు మాత్రమే హాజరు కావాలి కదా అని బదులిచ్చారు. రెండోసారి కమిషనర్ కౌన్సిలర్లను ఆహ్వానించినప్పుడు మహిళా కౌన్సిలర్ల భర్తలు కూడా హాజరయ్యారు. అనంతరం సమావేశం సజావుగా సాగింది. -
ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై స్పందించని ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌పై కఠిన చర్యలు తీసుకోవా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీసీ హాస్టల్ భవన నిర్మాణం కోసం 1975లో కేటాయిం చిన స్థలంలో ఆదిలాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నా మున్సిపల్ కమిషనర్ చర్య లు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ కు చెందిన గొట్టిముక్క ల వీఆర్‌ఆర్‌జీ రాజు వేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని గురువారం హైకోర్టు విచారించింది. ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌పై కఠిన చర్యలు తీసుకోవాల ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఇక కలెక్టర్.. ‘పవర్ఫుల్’
సాక్షి, హైదరాబాద్: పురపాలనలో కలెక్టర్లకు సంపూర్ణ అధికారాలు ఇక సంక్రమిస్తున్నాయి. ఇప్పటికే మున్సిపల్ చట్టంలో వారి అధికారాలను ప్రభుత్వం స్పష్టం చేయగా, ఏ అంశంలో ఎలాంటి అధికారాలున్నాయనే దానిపై మున్సిపల్ శాఖ చట్టంలోని అంశాలను ఉటంకిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటివరకు మున్సిపల్ వ్యవహారాల్లో కలెక్టర్ల పాత్ర, జోక్యం నామమాత్రంగానే ఉండగా, ఇక నుంచి పట్టణ పాలనలో వారే కీలకం కానున్నారు. వీరి కనుసన్నల్లోనే బడ్జెట్ తయారీ నుంచి ప్రభుత్వ పథకాల అమలు, విధాన నిర్ణయాలు జరగనున్నాయి. ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థలను తమ నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు పట్టణాభివృద్ధికి చెందిన అన్ని కీలకాంశాల్లోనూ కలెకర్లే సూపర్‌బాస్‌లుగా వ్యవహరించనున్నారు. భవన నిర్మాణ అనుమతుల నుంచి... పట్టణ ప్రాంతాల్లో ముఖ్య సమస్యలైన భవన నిర్మాణం, లేఅవుట్ల ఏర్పాటు, అనధికార భవనాల గుర్తింపు, ట్రాఫిక్ నిర్వహణ లాంటి అంశాల్లో టౌన్‌ప్లానింగ్ విభాగం ఇప్పటివరకు కీలకంగా వ్యవహరిస్తోంది. ఇక నుంచి వీటన్నింటిలో కలెక్టర్లు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోనున్నారు. భవన నిర్మాణ అనుమతులకు గాను వారే స్వీయ నిర్ధారిత అఫిడవిట్ ద్వారా నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన జరపనున్నారు. గతంలో 500 చదరపు మీటర్ల వైశాల్యం, 10 చదరపు మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉండే భవన నిర్మాణాల కోసం మున్సిపాలిటీతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలకు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, ఇప్పుడు సింగిల్‌విండో విధానంలో 21 రోజుల్లో అనుమతులిచ్చే అధికారం కలెక్టర్లకు దఖలు పడుతోంది. కలెక్టర్లు చైర్మన్లుగా ఉండే కమిటీ ఈ అనుమతుల విధానాన్ని టీఎస్ఐపాస్ తరహాలో పరిశీలించనుంది. ఇక, అనధికార భవన నిర్మాణాలపై కలెక్టర్లకు గతంలో స్పష్టమైన అధికారాలు లేకపోగా, ఇక నుంచి వాటిని గుర్తించి కూల్చివేయడం, సదరు యజమానికి పెట్టుబడిలో 25 శాతం జరిమానా విధించే అధికారాన్ని సెక్షన్ 180 ద్వారా కలెక్టర్లకు ఇచ్చారు. వారి నేతృత్వంలో ఏర్పాటయ్యే జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ ఈ అంశాలను పర్యవేక్షించనుంది. పుర పౌరుల నుంచి ఫిర్యాదులు వచ్చిన ఏడు రోజుల్లోపు అనధికార భవన నిర్మాణాలపై చర్యలు తీసుకునే అధికారం సెక్షన్ 174(5) ద్వారా కలెక్టర్లకు దఖలు పరిచారు. కమిషనర్ల విధులన్నీ పర్యవేక్షించాల్సిందే పురపాలనకు సంబంధించి మున్సిపల్ కమిషనర్లు నిర్వహించే విధులన్నింటినీ పర్యవేక్షించడంతో పాటు వాటినీ సంపూర్ణంగా కలెక్టర్లే నియంత్రించనున్నారు. మున్సిపాలిటీలు, ఇతర పట్టణ స్థానిక సంస్థల అన్ని విధులను కూడా పర్యవేక్షించడంతోపాటు ప్రతి పట్టణాన్ని మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దే బాధ్యత కలెక్టర్లదే. పాలకవర్గాలు చేసే ప్రతి తీర్మానాన్ని పరిశీలించడం, పాలకవర్గ సభ్యుల ప్రవర్తనను బట్టి వారిని సస్పెండ్ చేయడం, మున్సిపాలిటీల చైర్పర్సన్లకు సూచనలు, సలహాలివ్వడం, మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవడం, గతంలో పాలకవర్గాలు చేసిన ఏదైనా చర్యను పునఃసమీక్షించడం, చైర్పర్సన్లు, కమిషనర్లను వివరణలు కోరడం, మున్సిపాలిటీలిచ్చిన లైసెన్సులను రద్దు చేయడం. స్క్వాడ్ల ఏర్పాటు లాంటి అన్ని అంశాల్లో కలెక్టర్లకు విశేష అధికారాలిచ్చారు. వీటన్నిటినీ మున్సిపల్ చట్టంలోనే పేర్కొన్నప్పటికీ ప్రస్తుత చట్టం ద్వారా ఎలాంటి అధికారాలు సంక్రమించాయనే దానిపై అంశాల వారీ నివేదికను తాజాగా తయారు చేసింది. ఆ అంశాలనే ఇటీవల పురచట్టం–పట్టణ ప్రగతిపై ఎంసీఆర్హెచ్ఆర్డీలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ కూడా వివరించారు. -
తెలంగాణలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 35 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. వారి వివరాలు.. ⇒ కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్‌గా జకీర్ అహ్మద్ ⇒బెల్లంపల్లి కమీషనర్‌గా ఆకుల వెంకటేశ్ ⇒లక్స్‌ట్టిపేట్ కమిషనర్‌గా త్రియంబకేశ్వర్‌రావు ⇒నాగర్‌కర్నూల్ కమిషనర్‌గా గోనే అన్వేశ్ ⇒జగిత్యాల కమిషనర్‌గా జయంత్‌కుమార్‌రెడ్డి ⇒నిర్మల్ కమిషనర్‌గా నల్లమాల బాలకృష్ణ ⇒అమీన్పూర్ కమిషనర్‌గా సుజాత ⇒హాలియా కమిషనర్‌గా వేమనరెడ్డి ⇒తెల్లాపూర్ కమిషనర్‌గా వెంకట మణికరణ్ ⇒షాద్‌నగర్ కమిషనర్‌గా లావణ్య ⇒సంగారెడ్డి కమిషనర్‌గా శరత్చంద్ర ⇒GHMCలో డిప్యూటీ కమిషనర్‌గా ప్రశాంతి ⇒తాండూరు కమిషనర్‌గా శ్రీనివాస్‌రెడ్డి ⇒శంషాబాద్ కమిషనర్‌గా సబీర్ అలీ ⇒నర్సంపేట కమిషనర్‌గా విద్యాధర్ ⇒పరకాల కమిషనర్‌గా యాదగిరి ⇒పెద్దపల్లి కమిషనర్‌గా చదల తిరుపతి ⇒వేములవాడ కమిషనర్‌గా మట్టా శ్రీనివాస్‌రెడ్డి ⇒సత్తుపల్లి కమిషనర్‌గా కె.సుజాత ⇒ఇల్లందు కమిషనర్‌గా వీరేందర్ ⇒మందమర్రి కమిషనర్‌గా గద్దె రాజు ⇒వనపర్తి కమిషనర్‌గా మహేశ్వర్‌రెడ్డి ⇒GHMCలో డిప్యూటీ కమిషనర్‌గా రజనికాంత్‌రెడ్డి ⇒సదాశివపేట కమిషనర్‌గా స్పందన ⇒యెల్లారెడ్డి కమిషనర్‌గా అహ్మద్ ⇒హుజూర్నగర్ కమిషనర్‌గా బట్టు నాగిరెడ్డి ⇒కామారెడ్డి కమిషనర్‌గా గంగాధర్ ⇒యాదగిరిగుట్ట కమిషనర్‌గా జంపాల రజిత ⇒నందికొండ కమిషనర్‌గా పల్లారావు ⇒చిట్యాల కమిషనర్‌గా ప్రభాకర్ ⇒GHMC డిప్యూటీ కమిషనర్‌గా త్రిలేశ్వర్ ⇒GHMC డిప్యూటీ కమిషనర్‌గా ముకుంద్ రెడ్డి ⇒ఆమనగల్లు కమిషనర్‌గా శ్యాంసుందర్ -
24 ఏళ్లకే ఐఏఎస్.. మున్సిపల్ కమిషనర్‌గా
సాక్షి, కరీంనగర్: దేశంలో చిన్న వయస్సులో ఐఏఎస్ సాధించిన వారిలో వెల్లూరి క్రాంతి కూడా ఒకరు. 24 ఏళ్లకే ఐఏఎస్ సాదించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే గర్వకారణంగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాకు చెందిన వల్లూరి రంగారెడ్డి, లక్షి్మలకు ఇద్దరు కుమార్తెలు నీలిమా, క్రాంతి ఉన్నారు. క్రాంతి తల్లిదండ్రులు, అక్క అందరూ వైద్యులే. తల్లిదండ్రులు కర్నూల్లో వైద్యులుగా స్థిరపడగా, అక్క నీలిమా అమెరికాలో ఉంటున్నారు. ఇంట్లో అందరూ వైద్యులుగా ఉండడంతో క్రాంతిని చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేసే సర్వీసులో ఉండాలని, అందుకోసం ఐఎఎస్ సాధించాలని తండ్రి రంగారెడ్డి చెప్పేవారు. 10వ తరగతి వరకూ కర్నూల్లో, ఇంటర్ హైదరాబాద్‌లో పూర్తి చేయగా ఐఐటీ సీట్ రావడంతో ఢిల్లీ ఐఐటీలో చేరారు. అక్కడి నుంచి ఐఏఎస్ కావాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆరునెలలపాటు శిక్షణ పొందుతూ ప్రిపరేషన్ ప్రారంభించారు. 2013లో మొదటిసారి సివిల్స్ రాసి మొదటి ప్రయత్నంలోనే 562 ర్యాంక్ సాధించారు. ఐఆర్టీఎస్(ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్)లో జాయిన్ అయి వడోదర, లక్నోల్లో శిక్షణ కూడా పొందారు. 2014లో రెండవసారి మళ్లీ సివిల్స్ పరీక్షలు రాశారు. ఈసారి 230 ర్యాంక్ సాధించారు. ఐఆర్ఎస్(ఇండియన్ రెవెన్యూ సర్వీస్) వచ్చింది. 2015లో మళ్లీ సివిల్స్ రాశారు. 2016లో ప్రకటించిన తుది ఫలితాల్లో 65 ర్యాంక్‌తో ఐఏఎస్ సాధించారు. ఇలా 24 ఏళ్లకే ఐఏఎస్ సాధించి రికార్డ్ సృష్టించారు. శిక్షణ అనంతరం క్రాంతిని తెలంగాణ క్యాడర్‌కు కేటాయించారు. అలా మొదట నిర్మల్ జిల్లాలో పని చేశారు. అనంతరం ప్రత్యేకాధికారిగా మహబూబ్‌నగర్‌లో 15 నెలలపాటు పని చేయగా తాజాగా జరిగిన బదిలీల్లో కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా వచ్చారు. ఆటలన్నా.. పాటలన్నా ఇష్టం... వల్లూరి క్రాంతికి ఆటలన్నా పాటలన్నా చాలా ఇష్టమని పలు సందర్భాల్లో వెల్లడించారు. చిన్నపుడు బాస్కెట్‌బాల్ ప్లేయర్ అయిన క్రాంతి తర్వాత టెన్నిస్, బ్యాడ్మింటన్ బాగా ఆడుతారు. ప్రముఖుల బయోగ్రఫీ పుస్తకాలు ఇష్టంగా చదువుతారు. వీటితోపాటు తెలంగాణ పాటలను బాగా ఇష్టపడుతారు. ముఖ్యంగా ఉద్యమ నేపథ్యం, సంస్కృతిపైన వచ్చిన పలు జానపదాలను ఇష్టంగా వింటారు. బతుకమ్మ పండుగను బాగా ఇష్టపడుతారు. -
ఏపిలో 12మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు మున్సిపల్ ఉన్నతాధికారులను పురపాలక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్లో ఆర్‌ఎండీఏ జి.శ్రీనివాసరావును రాష్ట్ర మున్సిపల్ కమిషరేట్‌లో జాయింట్ డైరెక్టరేట్‌గా బదిలీ చేశారు. ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ కె.వెంకటేశ్వర్లును గుంటూరు మున్సిపల్కార్పోరేషన్ ఆర్‌ఎండీఏగా నియమించారు. అదే విధంగా రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు,ఇతర అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఎన్నికల కోడ్ నిబంధనలపై కమీషనర్లకు నాగిరెడ్డి సూచనలు
-
పరకాల కమిషనర్‌పై వేటు
పరకాల: వార్డుల పునర్విభజన డాక్యుమెంటేషన్ అందించడంలో జరిగిన జాప్యంపై పరకాల పురపాలక సంఘం కమిషనర్ బి.శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కొత్త కమిషనర్‌గా పురపాలక శాఖ ఆడిట్ విభాగం సీనియర్ అధికారి ఎల్.రాజాకు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం సీడీఎంఏ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 17న అందించిన వార్డుల పునర్విభజన, మ్యాప్ వంటి డాక్యుమెంటేషన్ లో జరిగిన పొరపాట్లపై వివరణ కోరేందుకు సీడీఎంఏ ప్రయత్నించగా కమిషనర్ అందుబాటులో లేకపోవడం.. పైగా ఫోన్ చేసినా స్పందిం చకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మార్పులు చేసిన డాక్యుమెంటేషన్‌ను మరుసటి రోజు కమిషనర్ శ్రీనివాస్ కార్యాలయంలో అందజేయకుండా కింది స్థాయి అధికారులతో పంపడాన్ని క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణి స్తూ ఆయనను విధుల నుంచి తొలగిస్తూ సీడీ ఎంఏ అధికారి శ్రీదేవి ఆదేశాలు జారీ చేశారు. -
డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలు! : మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకుచ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. గురువారం విజయవాడలో మున్సిపల్ కమిషనర్ల వర్క్‌షాప్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన బొత్స మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒకేసారి నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయలేదని, జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షల ఉద్యోగాలను ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తున్నారని గుర్తు చేశారు. సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. చాలా మంది అధికారులు ప్రజలు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదని, స్పందన కార్యక్రమంపై అధికారులు రాజీ పడడానికి వీల్లేదన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిచ్చి డ్రైనేజీ వ్యవస్థ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పట్టణాల్లో నీటి కొరత రాకుండా చూడాల్సిన అవసరముందన్నారు. వచ్చే ఉగాదికి ఇళ్ల పట్టాలివ్వాలని సీఎం నిర్ణయించినందున ఈ కార్యక్రమం కోసం వార్డు వలంటీర్లు, గ్రామ సచివాలయం అధికారుల సేవలను మున్సిపల్ అధికారులు వినియోగించుకోవాలన్నారు. చాలామంది కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయమని అడుగుతున్నారనీ, ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశముందని బొత్స పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు మున్పిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
ఇన్‌చార్జ్‌లతో డిశ్చార్జ్
సాక్షి, తాండూరు: తాండూరు పురపాలక సంఘంలో పాలన స్తంభించింది. మున్సిపల్ కార్యాలయంలో కీలక పోస్టులన్నీ ఖాళీగా మారాయి. అధికారులు లేకపోవడంతో ఇన్చార్జిల పెత్తనమే కొనసాగుతోంది. దీంతో పౌరసేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, పారిశుధ్యం క్షీణించి జనం రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా సిబ్బంది కొరత మున్సిపాలిటీని వేధిస్తోంది. తాండూరు మున్సిపల్‌ను ఆదర్శంగా నిలబెడతామని అధికారులు, ప్రజా ప్రతినిధుల అంటున్న మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. మున్సిపల్ కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో సిబ్బంది అవినీతికి తెరలేపారు. తాండూరు మున్సిపల్ కార్యాలయ నిర్వహణ పూర్తిగా స్తంభించింది. అందుకు కారణం కార్యాలయంలో కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్, మేనేజర్, రెవెన్యూ అ«ధికారుల వంటి కీలక పొస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా మున్సిపల్ కార్యాలయం పరిధిలో 160 మంది సిబ్బంది టౌన్‌ప్లానింగ్, శానిటరీ, రెవెన్యూ, ఇంజినీరింగ్, అడ్మిస్ట్రేషన్ సెక్షన్లతోపాటు పలు విభాగాలలో విధులను నిర్వహించేందుకు సిబ్బంది అవసరం కాగా కేవలం 60 మంది మాత్రమే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా 100 మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో తాండూరు ప్రజలకు మున్సిపల్ సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. 5 నెలలుగా ఇన్చార్జ్ కమిషనర్ పాలన మున్సిపల్ కార్యాలయంలో 5 నెలలుగా ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్లు కొనసాగుతున్నారు. గతంలో పరిగి కమిషనర్ తేజిరెడ్డికి తాండూరు మున్సిపల్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. పక్షం రోజుల క్రితం తేజిరెడ్డి స్థానంలో తాండూరు ఆర్డీఓ వేణుమాధవరావుకు మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. వేణుమాధవరావుకు బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి కార్యాలయంలో గడిపిన సందర్భాలు కనిపించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. డిప్యూటేషన్‌పై వెళ్లిన పారిశుధ్య అధికారి తాండూరు మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహించే శానిటరీ ఇన్స్పెక్టర్ విక్రంసింహారెడ్డి ఏడాదిన్నర క్రితం జహీరాబాద్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 వార్డులలో నిత్యం పారిశుధ్య పనులను పర్యవేక్షించే శానిటరీ ఇన్స్పెక్టర్ లేక పోవడంతో పారిశుధ్యం అధ్వాన్నంగా మారింది. ఎక్కడపడితే అక్కడ మురుగుమయంగా మారడంతో పాటు తాగునీరు సరిగా సరఫరా కావడం లేదు. మురుగుతో కూడిన కలుషిత నీరు సరఫరా కావడంలో పట్టణ ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. పక్షం రోజులుగా పట్టణంలోని ఆసుపత్రులలో జనాలు బారులు తీరుతున్నారు. తాండూరు డీఈఈకి 4 మున్సిపాలిటీల బాధ్యతలు తాండూరు మున్సిపల్ డీఈఈకి మూడు జిల్లాల్లోని నాలుగు మున్సిపాలిటీలకు ఇన్చార్జ్ బా ధ్యతలు అప్పగించారు. నాటి నుంచి తాండూరు మున్సిపల్‌కు ఉన్నతాధికారులు వచ్చిన సమ యంలో తప్ప మిగతా సమయంలో కనిపించిన దాఖలాలు లేవనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఫ్రీజర్లలో కిలోల కొద్దీ మురిగిపోయిన మాంసం..
చికెన్ – 65.. తందూరీ చికెన్.. చికెన్ టిక్కా..లాలిపప్.. పెప్పర్ చికెన్.. మొఘలాయ్ చికెన్.. చికెన్ మంచూరియా.. ధమ్ బిరియానీ.. రొయ్యల ఫ్రై, చేపల పులుసు .. హోటళ్లలో మెనూ చూస్తే నోరూరాల్సిందే. అయితే వీటిని తింటే మాత్రం మంచమెక్కాల్సిందే. రంగురంగుల్లో ఉన్న చికెన్ ముక్కను తిన్నారంటే రోగాన్ని కొనితెచ్చుకున్నట్టే. వారం రోజులుగా జిల్లాలో అధికారులు చేస్తున్న తనిఖీల్లో ఫ్రీజర్లలో కిలోల కొద్దీ నిల్వ ఉంచి మురిగిపోయిన మాంసం వెలుగు చూస్తోంది. ఫలితంగా హోటళ్లకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. చిన్న హోటళ్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకూ ఎందులో చూసినా అంతా కల్తీనే. కల్తీరాయుళ్లపై కలెక్టర్ శేషగిరిబాబు కన్నెర్ర చేశారు. నాణ్యత పెరిగే వరకు అధికారులు దాడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: హైదరాబాద్ తర్వాత నాన్‌వెజ్‌ను అమితంగా ఇష్టపడే ప్రాంతాల్లో నెల్లూరు ఒకటి. జాతీయ రహదారిని ఆనుకొని నగరం ఉండటంతో నిత్యం నగరంలోని వినియోగదారులతో పాటు ఇతర జిల్లాల వాసులు పెద్ద సంఖ్యలో ఇక్కడి హోటళ్లకు వస్తుంటారు. అయితే అన్నిట్లో నాసిరక మాంసాహారం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నగరంలో నాణ్యతను పాటించడంలేదని ప్రాథమికంగా నిర్ధారించుకొని ఐస్‌క్రీమ్ షాపుల మొదలుకొని బార్ల వరకు తనిఖీలు నిర్వహించి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలతో ఫుడ్ కంట్రోల్ విభాగాధికారులు, మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి వరుస తనిఖీలు నిర్వహించి భారీగా కేసులు నమోదు చేసి హోటళ్ల నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడుతున్న యజమానులు కొందరు హోటళ్ల యజమానులు కాసులకు కక్కుర్తిపడి చెడిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. వేడిపై మాంసం తినడంతో చెడిపోయిందా లేదాననేది గుర్తించడం కష్టమే. దీన్ని అదునుగా చేసుకొని కొందరు హోటళ్ల యజమానులు వారాల తరబడి నిల్వచేసిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. నగరంలో దాదాపు 80 హోటళ్ల వరకు ఉండగా, ప్రధానమైన హోటళ్లు 20 నుంచి 30 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 1100 హోటళ్లు ఉన్నాయి. చాలా మంది యజమానులు అధిక మొత్తంలో మాంసాహారం కొనుగోలు చేస్తే ధర తగ్గుతుందనే ఉద్దేశంతో భారీగా కొనుగోలు చేస్తున్నారు. విక్రయాల్లో ఆలస్యమైతే మాంసాహారాన్ని ఫ్రీజర్లలో నిల్వ చేస్తారు. వారాల తరబడి ఫ్రీజర్లలో నిల్వ ఉండటంతో అప్పటికే మాంసం మురిగిపోతోంది. నగరంతో పాటు కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, ఆత్మకూరు, తదితర పట్టణాల్లో నిర్వహించిన వరుస దాడుల్లో ఫ్రీజర్లలో మురుగుతున్న కిలోల కొద్దీ మాంసాన్ని గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో కళ్లిపోయి.. దుర్వాసన వస్తున్న మాంసాన్ని కూడా కనుగొన్నారు. హోటళ్ల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసి జరిమానాలు విధించారు. ఇలా చేసే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడంతో పాటు గుర్తించిన మాంసాన్ని వెంటనే ధ్వంసం చేయించారు. కలెక్టర్ ఆదేశాలతో దాడులు ఈ నెల 25న కలెక్టర్ శేషగిరిరావు కార్పొరేషన్, ఫుడ్ కంట్రోల్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నెల్లూరులో ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారం అందజేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. కార్పొరేషన్ హెల్త్, ఫుడ్ కంట్రోల్ శాఖలు సంయుక్తంగా దాడులు చేపట్టాలని ఆదేశించారు. నిల్వ చేసిన ఆహారాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, ముందుగా జరిమానాలు విధించి హెచ్చరికలు జారీ చేయాలన్నారు. హోటళ్ల యజమానుల్లో మార్పు రాకపోతే సీజ్ చేసేందుకు కూడా వెనుకాడొద్దని హెచ్చరించారు. నాణ్యత పెరిగేంత వరకూ దాడులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించాలని ట్రెయినీ కలెక్టర్లను ఆదేశించారు. రూ.ఐదు లక్షలకు పైగా జరిమానా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు ఈ నెల 26న పది హోటళ్లపై దాడులు చేశారు. మద్రాస్ బస్టాండ్ వద్ద ఓ హోటల్లో చెడిపోయిన మాంసాన్ని భారీగా గుర్తించారు. దాడుల నేపథ్యంలో నగరంలోని హోటళ్ల యజమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శుక్రవారం ఒక్కరోజే రూ.1.7 లక్షల జరిమానాలు విధించారు. పరిశుభ్రత పాటించని కొన్ని హోటళ్లకు జరిమానాలు వేశారు. సోమవారం మూడు బార్ అండ్ రెస్టారెంట్లు, ఆరు హోటళ్లపై దాడులు చేసి రూ.2.5 లక్షల జరిమానా విధించారు. గూడూరు, కావలి, ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట మునిసిపాలిటీల్లోనూ హోటళ్లపై దాడులు ముమ్మరం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దశలవారీగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ల దుకాణాలు, ఇతర తినుబండారాల విక్రయాలు జరిపే హోటళ్లపై కూడా దాడులు జరపాలన్నారు. హోటళ్లపై నిరంతర తనిఖీలు నెల్లూరు(పొగతోట): జిల్లాలోని హోటళ్లు, దుకాణాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు, వస్తువులను అందించాలని కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశించారు. తన క్యాంప్ కార్యాలయం నుంచి మునిసిపల్ అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. నగరంలోని అనేక హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణంలో వంటశాలలు, ఆహారపదార్థాలు తనిఖీల్లో బయటపడ్డాయన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, దుకాణాలపై అపరాధ రుసుమును విధించాలని సూచించారు. ఆర్ఓ ప్లాంట్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి సరఫరా అవసరమైన ప్రాంతాలకు సంబంధించి ప్రతిపాదనలను పంపించాలని సూచించారు. కార్పొరేషన్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు. అధికారులపై ఆగ్రహం సూళ్లూరుపేట: సూళ్లూరుపేట పట్టణంలో ట్రయినీ కలెక్టర్ కల్పనాకుమారి మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై చివాట్లు పెట్టారు. తొలుత ఆలె చేపల మార్కెట్లో అక్కడే కోయడం, అక్కడే చెత్తా చెదారం వేయడంతో వస్తున్న దుర్వాసన దారుణంగా ఉన్న విషయం మీకు కనిపించలేదా? అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికోన్నత పాఠశాలలోకి వెళ్లి సమస్యలేమైనా వున్నాయా అని విద్యార్థులను అడగడంతో స్కూల్ ముందే పెద్ద మురుగునీటి కాలువ వుంది. అక్కడే అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుండడంతో దుర్వాసన భరించలేకపోతున్నామని విద్యార్థులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం బాపూజీ వీధిలోని గోమతి స్వీట్‌స్టాల్‌లో తినుబండారాలను పరిశీలించి అక్కడ ప్లాస్టిక్ కవర్లు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్న భవనానికి అనుమతి ఉందా? అని ప్రశ్నించారు. లేదని చెప్పడంతో అనుమతి తీసుకోకుండా భవనాన్ని నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారు.. నోటీలు ఇవ్వలేదా అని అధికారులను నిలదీశారు. పట్టణంలో అనుమతి లేని భవనాలు ఎన్ని ఉన్నాయో చెప్పాలని ఆదేశించారు. అనంతరం రాజధాన్ని హోటల్లోకి వెళ్లి అక్కడ మురిగిపోయిన చికెన్, రొయ్యలను గుర్తించి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. రహదారికి పక్కనే చెత్తడంపింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పట్టణంలోని పరిస్థితిపై నివేదికను కలెక్టర్ శేషగిరిబాబుకు అందజేస్తానని చెప్పారు. ఆమెతో పాటు కమిషనర్ నరేంద్ర, ఇతర సిబ్బంది వున్నారు. హోటళ్లలో కొనసాగుతున్న తనిఖీలు నెల్లూరు(సెంట్రల్): నగరంలోని హోటళ్లు, సినిమా థియేటర్లలో ఫుడ్ కంట్రోల్ అధికారులు, కార్పొరేషన్ హెల్త్ అధికారులు మంగళవారం దాడులు కొనసాగించారు. నగరంలోని సిరి మల్టీప్లెక్స్, అమరావతి బార్ అండ్ రెస్టారెంట్, ఎస్ – 2 సినిమా హాల్లో ఆహారం తయారు చేసే ప్రాంతాలు, రామలింగాపురం వద్ద ఉన్న పంజాబీ దాబాను పరిశీలించారు. అమరావతి బార్ అండ్ రెస్టారెంట్లో కొంత మేర లోపాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఎస్ – 2లో అన్ని లైసెన్స్‌లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ కంట్రోల్ గెజిటెడ్ అధికారి శ్రీనివాస్ మాట్లాడారు. కొన్ని రోజులుగా ఆహార తయారీ కేంద్రాలపై దాడులు చేస్తున్నామని, ప్రస్తుతం కొంత మార్పు కనిపిస్తోందని చెప్పారు. ఎక్కడైనా ఫుడ్ లైసెన్స్‌లు లేకుండా, నిల్వ చేసిన ఆహారాన్ని ఉంచితే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కార్పొరేషన్ హెల్త్ అధికారి వెంకటరమణ మాట్లాడారు. హోటళ్లలో అపరిశుభ్రత, నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగిస్తే జరిమానాలు విధిస్తామని, అప్పటికీ తీరులో మార్పు రాకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం : బొత్స
-
మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం : బొత్స
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవినీతి రహిత పాలనకు నడుం బిగించారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని.. అధికారులు ప్రజాప్రతినిధులను కలుపుకుపోవాలన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ల వర్క్‌షాప్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలపై ప్రభుత్వం తొలి రోజు నుంచే దృష్టి సారించిందని గుర్తుచేశారు. త్వరలో వార్డు సేవకులను ప్రభుత్వం నియమించబోతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో వార్డు సేవకులను ఎలా వినియోగించుకోవాలనే దానిపై చర్చించడమే ఈ వర్క్‌షాప్ ఉద్దేశమని పేర్కొన్నారు. అదేవిధంగా సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చించాలని అధికారులకు సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మంచి పాలన అందించాలని కోరారు. మంచి నీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పరిస్థితులపై పూర్తిగా అధ్యయనం చేయాలని.. ఇబ్బందులను దాచిపెట్టకుండా, ఉన్నది ఉన్నట్టు చెప్పాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. -
నేర చరితులు ఏజెంట్లుగా అనర్హులు
తిరుపతి అన్నమయ్య సర్కిల్: నేరచరిత్ర గల వ్యక్తులను ఏజెంట్లుగా నియమించవద్దని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వో, మున్సిపల్ కమిషనర్ వి.విజయరామరాజు తెలిపారు. స్థానిక తిరుపతి అర్బన్ మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం బరిలో వున్న అభ్యర్థులు, జనరల్ ఏజెంట్లతో కౌంటింగ్ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తిరుపతి అసెంబ్లీ బరిలో వున్న అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్ల జాబితాను అందించి పాసులు పొందాలన్నారు. అదేవిధంగా ఎంపికైన ఏజెంట్లు రెండు అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలు, ఐడీ కార్డుతో ఈ నెల 23న ఉదయం 6గంటలకు చిత్తూరులోని ఆర్వీఎస్ నగర్, ఎస్వీసెట్ కళాశాల కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఎటువంటి నేరచరిత్ర లేనివారిని మాత్రమే ఏజెంట్లుగా నియమించాలని సూచించారు. అభ్యర్థులు అందించిన ఏజెంట్ల వివరాలను ఎస్పీ పరిశీలించనున్నట్లు తెలిపారు. తిరుపతి నియోజకవర్గంలో 261 పోలింగ్ కేంద్రాలు ఉన్నందున కౌంటింగ్ ప్రక్రియ కోసం 20టేబుల్స్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దీంతో పాటు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం మరో 2 టేబుల్స్ అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద సమస్యలు వుంటే ఆర్వోకు తెలపాలని సూచించారు. క్రమశిక్షణ పాటించాలని లేనిపక్షంలో కౌంటింగ్ కేంద్రాలనుంచి బయటకు పంపిస్తామని హెచ్చరించారు. కౌంటింగ్ రోజున ఉదయం 7గంటలకు అబ్జర్వర్, ఆర్వో, బరిలో వున్న అభ్యర్థుల సమక్ష్యంలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ను తెరవడం జరుగుతుందన్నారు. అనంతరం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, 8.30గంటల నుంచి కంట్రోల్ యూనిట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. కంట్రోల్ యూనిట్ల లెక్కింపు పూరైన తర్వాత అబ్జర్వర్ రాండమైజేషన్‌తో 5వీవీ ప్యాట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఒక్కో వీవీ ప్యాట్ లెక్కింపునకు 45 నిమిషాలు సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో తిరుపతి ఏఆర్వో, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసులు, బరిలో వున్న వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, పార్టీల ఏజెంట్లు పాల్గొన్నారు. కౌంటింగ్ విధుల్లో అప్రమత్తంగా ఉండాలి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ విధుల్లో నోడల్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తిరుపతి అసెంబ్లీ ఆర్వో, నగర పాలక కమిషనర్ వి విజయరామరాజు సూచించారు. గురువారం స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో కౌంటింగ్ ప్రక్రియపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో నోడల్ అధికారులే కీలకమని తెలిపారు. ఈ నెల 22న ఎస్కార్ట్‌తో పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్నట్లు చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం విధులు కేటాయించిన సిబ్బంది జిల్లా కేంద్రానికి చేరుకోవాలన్నారు. దీంతో 23న ఉదయమే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవచ్చని సూచించారు. అసెంబ్లీ పరిధిలోని పార్లమెంట్ ఓట్ల లెక్కింపు స్థల ప్రభావంతో 14టేబుల్స్‌పై జరుగుతుందన్నారు. ఇందులో డేటా ఎంట్రీ ఎక్సెల్ షీట్ నోడల్ అధికారులు టేబుల్ వారీగా వచ్చిన ఫలితాలను నమోదు చేస్తారని తెలిపారు. ఎక్సెల్ ఫార్ములా కీలకం అని అప్రమత్తంగా వుండాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ అధికారులు, రో ఆఫీసర్లు, ఈవీఎమ్‌ల నోడల్ అధికారులు తమ విధుల నిర్వహణలో జాగ్రత్త వహించాలన్నారు. త్వరలో జరిగే శిక్షణా తరగతులకు అందరూ తప్పక హాజరుకావాలని సూచించారు. ఈ సమావేశంలో నగరపాలక అసిస్టెంట్ కమిషనర్ హరిత, ఏఆర్వో శ్రీనివాసులు, కౌంటింగ్ విధులకు హాజరయ్యే నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు
-
రోడ్డు ప్రమాదంలో మున్సిపల్ కమిషనర్ సహా నలుగురి దుర్మరణం
రాయదుర్గంటౌన్/రూరల్: అనంతపురం జిల్లా కణేకల్లు మండలం నల్లంపల్లి–వీరాపురం గ్రామాల మధ్య బసయ్యతోట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ సహా మరో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ షేక్ ఇబ్రహీం సాహెబ్ ఎన్నికల విధుల్లో భాగంగా మంగళవారం ఉదయం తన సొంత కారులో అనంతపురం వెళ్లారు. ఆయన వెంట మున్సిపల్ ఆర్వో అమీర్‌బాషా, ఆర్ఐ దాదా ఖలందర్ తదితరులు ఉన్నారు. విధులు ముగించుకుని రాత్రి 9,30 గంటల ప్రాంతంలో రాయదుర్గం తిరిగి వస్తుండగా అటువైపు నుంచి ఎదురుగా వస్తున్న చెన్నైకి చెందిన కారు వీరి కారును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మున్సిపల్ కమిషనర్‌తో పాటు ఆర్వో అమీర్‌బాషా, ఆర్ఐ దాదా ఖలందర్, డ్రైవర్ ఎర్రిస్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆర్ఐ సత్యనారాయణతో పాటు మరో కారులోని ప్రభు, మురుగన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్‌కు తరలించారు. శోకసముద్రంలో మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది మరో 14 కిలోమీటర్లు ప్రయాణిస్తే రాయదుర్గం చేరుకుంటారనగా మృత్యువు వీరిని కబళించింది. నలుగురు ఉద్యోగులు దుర్మరణం చెందడంతో రాయదుర్గం మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది, కౌన్సిల్ సభ్యులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పలువురు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, అధికారులు రాయదుర్గం ఆస్పత్రికి పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. -
అవినీతి శంకరం
బుధవారం ఉదయం 6.30 గంటలు.. నర్సీపట్నంలో మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకర్రావు బస చేసిన ప్రైవేట్ లాడ్జి.. ఏసీబీ అధికారులు తలుపు కొట్టారు.. నిద్ర కళ్లతో తలుపు తీసిన కమిషనర్ అవాక్కయ్యారు.. ఆయనను మున్సిపల్ కార్యాలయానికి తీసుకువెళ్లి ఏసీబీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. ఇలా.. విశాఖ ఎంవీపీ కాలనీలోని శంకరరావు ఇల్లు, మధురవాడలోని ఆస్తులు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని అతని బంధువుల ఇళ్లు, ఆస్తులను.. మొత్తం 14 చోట్ల తనిఖీలు చేశారు. ఇప్పటి వరకు గుర్తించిన అక్రమాస్తుల విలువ మార్కెట్ ధర ప్రకారం రూ.20కోట్లపైనే ఉంటుందని ఏసీబీ అధికారులు చెప్పారు. సీతమ్మధార (విశాఖ ఉత్తరం)/నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ శంకరరావు ఐదు రోజుల క్రితమే బదిలీపై వచ్చారు. ఎన్నికల నిబంధనల మేరకు బొబ్బిలి నుంచి బదిలీపై వచ్చిన ఆయన ఈ నెల 15న విధుల్లో చేరారు. అంతలోనే ఏసీబీ దాడులు జరగడం నర్సీపట్నంలో కలకలం సృష్టించింది. విశాఖలోని ఆయన ఇల్లు, ఆస్తులు.. అలాగే శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అతని తండ్రి, పలాస మండలం బ్రాహ్మణతర్లాలో అతని మామగారిళ్లలోనూ సోదాలు జరిగాయి. బొబ్బిలిలో ఓ ప్రైవేటు వ్యక్తిని నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఉదయాన్నే నర్సీపట్నం చేరుకున్నారు. శంకరరావును మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లి... అక్కడ కమిషనర్‌కు సంబంధించిన రికార్డులు, బ్యాంకు పాస్ పుస్తకాలను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. 1988లో పురపాలికశాఖలో హెల్త్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరిన శంకరరావు తదనంతరం పదోన్నతిపై శానిటరీ ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. 2008లో గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్‌గా నెల్లిమర్ల, బొబ్బిలిలో విధులు నిర్వహించారు. నర్సీపట్నంలో ఐదు రోజుల క్రితమే విధుల్లో చేరారు. ఆయన నివసిస్తున్న లాడ్జిలో ఎప్పటి నుంచి ఉంటున్నది, అడ్వాన్స్‌గా ఎంత చెల్లించారని లాడ్జి మేనేజర్‌ను ప్రశ్నించారు. ఈ మేరకు మేనేజర్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అదే సమయంలో కమిషనర్‌కు టిఫిన్ తీçసుకొచ్చిన మధును కూడా ప్రశ్నించారు. అనంతరం ఏసీబీ సీఐ గణేష్ విలేకరులతో మాట్లాడుతూ కమిషనర్ శంకరరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినల్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ తనిఖీలు చేపట్టామన్నారు. నర్సీపట్నంలో జరిపిన తనిఖీల్లో పలు డాక్యుమెంట్లు, బ్యాంకు పాస్ పుస్తకాలు ఇతర రికార్డులు లభించాయన్నారు. కమిషనర్ శంకరరావును కస్టడీలోకి తీసుకుని విశాఖపట్నం తరలించారు. అతడిని అరెస్ట్ చేసి గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఎంవీపీ కాలనీలోని హనుమంతు శంకరరావు సొంత ఇల్లు వుడా కాలనీలో సోదాలు పీఎం పాలెం(భీమిలి): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకరరావు ఆస్తులపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా మిథిలాపురి ఉడా కాలనీలో గల మూడంతుస్తుల భవనం మొదటి ఫ్లోర్లో శంకరరావు బంధువు కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆ ఇంటిలో సుమారు 5గంటలపాటు సోదాలు జరిపారు. పలు ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఏసీబీ సీఐ పుల్లారావు, సిబ్బంది పాల్గొన్నారు. బొబ్బిలిలో.. బొబ్బిలి: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల మేరకు విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ శంకరరావు ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈనెల 14న బొబ్బిలి నుంచి బదిలీపై వెళ్లిన మున్సిపల్ కమిషనర్ హెచ్.శంకరరావు జిల్లా కేంద్రంలోని పూల్‌బాగ్ పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో నివశిస్తున్నారు. ఆయన కుటుంబం జిల్లా కేంద్రంలోనే ఉండడంతో ఏసీబీ డీఎస్పీ డీవీఎస్ నాగేశ్వరరావు నేృతృత్వంలోని సిబ్బంది బుధవారం ఉదయం 8 గంటల నుంచి తనిఖీలు ప్రారంభించారు. అయితే తనిఖీలకు కమిషనర్ భార్య ముందు ఒప్పుకోకపోగా.. డీఎస్పీ నాగేశ్వరరావు నచ్చజెప్పారు. తనిఖీల్లో కీలకమైన పత్రాలు సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సీఐలు సతీష్, జి. అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు. గుర్తించిన అక్రమాస్తులివీ... ♦ విశాఖపట్నం ఎంవీపీ కాలనీ, సెక్టార్ – 4లో 207 గజాల విస్తీర్ణంలోని ఇల్లు భార్య హనుమంతు ఈశ్వరీబాయి పేరున 2017లో కొనుగోలు చేశారు. ♦ మధురువాడ వాంబేకాలనీలో 236 గజాల విస్తీర్ణంలో మూడు అంతస్తుల భవనం తండ్రి పేరున కొనుగోలు. ♦ భీమిలి, సంగివలస, నేరెళ్లవలసలో 60 సెంట్ల భూమి కొనుగోలు చేశారు. ♦ భీమిలి సమీప కుమ్మరిపాలెంలో భార్య హనుమంతు ఈశ్వరీబాయి పేరు మీద 266.6 గజాల స్థలం 2002లో కొనుగోలు చేశారు. ♦ 100 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి వస్తువులు గుర్తించారు. ♦ స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా చిట్టివలస, భీమిలి బ్రాంచిల్లోని లాకర్లలో రూ.5.20 లక్షల నగదు గుర్తించారు. ♦ బొబ్బిలిలోని కరూర్ వైశ్య బ్యాంకులో రూ.2.50లక్షల విలువ గల బంగారం తనఖాలో ఉన్నట్లు గుర్తించారు. ♦ ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం గుర్తించి వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కలకలం టెక్కలి/కాశీబుగ్గ: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకరరావుపై ఏసీబీ దాడులు నిర్వహించిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపారు. టెక్కలి గోపినాథపురంలో శంకరరావు తండ్రి నర్సింగరావు పేరుతో ఉన్న ఇంటికి ఉదయం 8 గంటలకే ఏసీబీ అధికారులు చేరుకున్నా ఎవరూ అందుబాటులో లేకపోవడంతో మధ్యాహ్నం వరకు వేచి చూసి పక్కనే అద్దెకు ఉంటున్న వారి నుంచి వివరాలు తీసుకున్నారు. కమిషనర్ శంకరరావు అత్తామామలు కణితి సావిత్రి, సూర్యనారాయణలు పలాస మండలం బ్రాహ్మణతర్లాలో నివాసముంటున్నారు. సూర్యనారాయణ డ్రిల్‌మాస్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో విశాఖ ఏసీబీ సీఐ మహేశ్వరరావు ఆధ్వర్యంలో సూర్యనారాయణ ఇంట్లో అణువణువూ శోధించారు. ఉదయం ఏడు గంటల నుంచి బీరువాలు, పెట్టెలు తనిఖీ చేశారు. బ్యాంకు పాస్‌పుస్తకాలు, పలు వస్తువులు క్షుణ్నంగా పరిశీలించారు. శంకరరావు పెద్ద బావమరిది చక్రధర్ విశాఖపట్నంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, చిన్న బావమరిది భువనేశ్వర్ హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. ఏసీబీ దాడుల నేపథ్యంలో చక్రధర్ విశాఖ నుంచి బ్రాహ్మణతర్లా చేరుకున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో ఏసీబీ సిబ్బంది రాము, మాధవరావు, కాశీబుగ్గ షీటీం పోలీసులు మాధవి తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కమిషనర్ ఇంట్లో ఏసీబీ దాడులు
-
ఉద్యోగినిని లోబరుచుకునేందుకు విందు..!
సాక్షి, కరీంనగర్ : చొప్పదండి మున్సిపల్ కమిషనర్ నిత్యానంద్ వింతప్రవర్తన వివాదాస్పదంగా మారింది. మహిళా ఉద్యోగిని లోబరుచుకునేందుకు విందు ఏర్పాటు చేశారని స్థానికంగా విమర్శలున్నాయి. తొలుత ఫోన్లో ఆమెను లోబర్చుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో విందు భోజనం పేరుతో ఉద్యోగులందరినీ ఆయన ఇంటికి పిలిచారని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులను విందుకు ఆహ్వానించారని సమాచారం. ఈ తతంగం నచ్చని ఓ మహిళా ఉద్యోగి మీడియాకు సమాచారం ఇచ్చారు. అక్కడికి మీడియా వెళ్ళడంతో కమిషనర్ పరార్ అయ్యారు. ఇటీవలనే మున్సిపాలిటిగా ఏర్పడిన చొప్పదండికి కమిషనర్‌గా 15రోజుల క్రితం హైదరాబాద్ నుంచి నిత్యానంద్ బదిలీపై వచ్చారు. అప్పటి నుంచే మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ క్రింద పనిచేసే మహిళా ఉద్యోగులపై కన్నేశాడని సమాచారం. ఈ క్రమంలోనే మహిళా ఉద్యోగినిలకు గిఫ్ట్‌లు ఇచ్చేవారని తెలుస్తోంది. ఆ గిఫ్ట్‌లను నిరాకరిస్తే పలు రకాలుగా వేధించేవారని విమర్శలున్నాయి. నిత్యానంద్ మహిళలను టార్గెట్ గా చేసుకొని వింతగా ప్రవర్తిస్తున్నారని విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
వివాదాస్పదంగా చొప్పదండి మునిసిపల్ కమిషన్ తీరు
-
తెలుగు అమలుపై నిర్లక్ష్యమేల?
చిత్తూరు కలెక్టరేట్ : నగరాల్లోని దుకాణాల పేర్లు తెలుగులోనే ఉండేలా అమలుచేయాలని మాతృభాషా దినోత్సవం రోజున ఆదేశిస్తే ఇప్పటివరకు ఎందుకు ఆచరించలేదని మునిసిపల్ కమిషనర్లపై కలెక్టర్ ప్రద్యుమ్న ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కలెక్టరేట్లో మునిసిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ నగరాల్లో తెలుగులో దుకాణాల బోర్డులు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మునిసిపాలిటీ పోస్టర్ ఫ్రీ (పోస్టర్లు ఉండని) సిటీగా తయారయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. వీధి విక్రయదారులను గుర్తించి వారికి గుర్తింపుకార్డులను అందజేసి సంఘాలుగా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ నెల 20న వీధి విక్రయదారులకు రుణమేళా నిర్వహించి రూ.5కోట్ల రుణాలను పంపిణీ చేయాలని ఆదేశించారు. స్వైన్‌ఫ్లూ నివారణకు రెండు రోజుల్లోగా ఇంటింటికీ హోమియో మం దులు పంపి ణీ చేయాలని చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల కు అవగాహన కల్పించాలన్నారు. ఇంటి కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించండి నగరాల్లో మాఇంటి కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించేలా కమిషనర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ చెప్పారు. ఖాళీ స్థలాల్లో కూరగాయల తోటలు పెంచుకునే విధంగా నగర ప్రజల ను ప్రోత్సహించాలన్నారు. ఇంటికూరగాయల్లో 70 శాతం పోషకాలుంటాయనే విషయాన్ని ప్రచారం చేయాలన్నారు. మలనాడు గిద్దలు సంప్రదాయ ఆవులని, అవి కర్ణాటక లోని షిమోగా ప్రాంతానివని చెప్పారు. ఆవు ధర రూ.18 వేలని, పాలు రోజుకు 2 నుంచి 3 లీటర్లు ఇస్తాయని తెలిపారు. ఈ పాలు చాలా ఆరోగ్యవంతమైనవని, రోగనిరోధకమని చె ప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసి అలవాటు చేయగలిగితే ఆరోగ్యవంతులుగా ఉంటారని సూచించారు. చిత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె, తిరుపతిలో పేదల కోసం నిర్మించిన గృహాలకు ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ఎంపికచేయాలన్నా రు. జిల్లాలో రాత్రి బస గృహాలు మదనపల్లెలో ఈ నెల 20కి, శ్రీకాళహస్తిలో ఈ నెల 12న, నగరి, చిత్తూరులో ఈనెలాఖరుకు పనులు పూర్తిచేసి వాడుకలోకి తీసుకురావాలన్నారు. జేసీ–2 చంద్రమౌళి, చిత్తూ రు నగర కమిషనర్ ఓబులేసు, తిరుపతి నగర పాల క డెప్యూటీ కమిషనర్ పణిరామ్, శ్రీకాళహస్తి, పుంగనూరు మునిపల్ కమిషనర్లు రమేష్‌బాబు, వర్మ, మెప్మా పీడీ జ్యోతి, మెప్మా సిటీ మిషన్ మేనేజర్లు గోపి, మధుసూదన్‌రెడ్డి, పెంచలయ్య పాల్గొన్నారు. -
మున్సిపల్లో కౌన్సిలర్ వీరంగం
సాక్షి, నిర్మల్: సమాచారం ఇవ్వకుండా ఓ దుకాణాన్ని తొలగించారంటూ నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ అలీమ్ సోమవారం వీరంగం సృష్టించారు. మున్సిపల్ కార్యాలయంలోని కంప్యూటర్లను ధ్వంసం చేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని మౌసిన్ అనే వ్యక్తికి సంబంధించిన దుకాణాన్ని సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారంటూ అలీమ్ టీపీఎస్ ఉదయ్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో ఆయన టేబు ల్పైన ఉన్న కంప్యూటర్ను కింద పడేశారు. అనంతరం బయట గదిలో సిబ్బంది ఉపయోగిస్తున్న కంప్యూటర్‌నూ కింద పడేశారు. దీంతో రెండు కంప్యూటర్లూ దెబ్బతిన్నట్లు సిబ్బంది తెలిపారు. ఆక్రమణల తొలగింపులో భాగంగా.. ఇటీవల జిల్లాకేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. ఈక్రమంలో రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. బైల్‌బజార్ నుంచి కంచెరోని చెరువు వరకు ఉన్న ఫుట్‌పాత్ దుకాణాలను, తోపుడు బండ్లను తీయించేస్తున్నారు. ఎన్టీఆర్ మినీస్టేడియం వద్ద ఉన్న ఆక్రమణలను ఇటీవల తొలగించి, రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు. దీనిపై స్థానిక వ్యాపారులు హైకోర్టుకు వెళ్లారు. సదరు స్థలంలో ఎలాంటి పనులు చేపట్టకుండా యథాస్థితిని కొనసాగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధం లేకుండా శనివారం రాత్రి వ్యాపారులు మళ్లీ తమ దుకాణాలను అదే స్థలంలో వేసుకున్నారు. కోర్టు యథాస్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసినా మళ్లీ దుకాణాలను పెట్టుకోవడంపై మున్సిపల్ అధికారులు స్పందించారు. సోమవారం ఉదయం ఆక్రమణలను తొలగించి, చెట్లను నాటారు. ఆక్రమణల తొలగింపులో భాగంగా బస్టాండ్ ఇన్‌గేట్ పక్కనే ఖాళీగా ఉన్న టేలాను మున్సిపల్ సిబ్బంది తీసేశారు. తనకు సంబంధించిన వ్యక్తి టేలాను తొలగించడంతో కౌన్సిలర్ అలీమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కంప్యూటర్లను ధ్వంసం చేసినట్లు మున్సిపల్ సిబ్బంది పేర్కొన్నారు. జరిగిన ఘటనపై టీపీఎస్ ఉదయ్‌కుమార్ ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి కౌన్సిలర్ అలీమ్‌ను తీసుకెళ్లారు. అనంతరం ఇన్చార్జి కమిషనర్ సంతోష్ ధ్వంసమైన కంప్యూటర్లను పరిశీలించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. -
అన్న క్యాంటీన్లో ఉద్రిక్తత
-
అన్న క్యాంటీన్ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, ఎమ్మిగనూరు : అన్నక్యాంటీన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకుంది. సామాన్య ప్రజలపై మున్సిపల్ కమిషనర్ దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో గురువారం చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో జనం రావడంతో సిబ్బంది కంట్రోల్ చేయలేకపోయ్యారు. దీంతో కమిషనర్ వచ్చిన వారిపై అసహనం వ్యక్తం చేశారు. భోజనం చేయడానికి వచ్చిన వారిపై మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి చేయి చేసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ తీరును జనం తప్పుబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ అన్న క్యాంటీన్లను ప్రారంభించి విషయం తెలిసిందే. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అన్నక్యాంటీన్ వద్ద మున్సిపల్ కమిషనర్ దౌర్జన్యం
-
నేను తలచుకుంటే.. నువ్వు, నీ అమ్మ ఉండరు: జేసీ
సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గుత్తిలో హల్చల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాతో కలిసి గుత్తిలో పర్యటించిన ఆయన గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ తులసమ్మ తనయుడు శీనుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘నేను తలచుకుంటే నువ్వు, నీ అమ్మ, గుత్తి మున్సిపల్ కమిషనర్ ఉండరంటూ’ దుర్భాషలాడుతూ శీనుని జేసీ బెదిరించారు. అయితే మధుసూదన గుప్తాతో కలిసి జేసీ పర్యటించడంపై గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. టీడీపీ సభ్యత్వం లేని గుప్తాను తనకు పోటీగా తెచ్చేందుకే జేసీ ఇలా చేస్తున్నారేమోనని గౌడ్ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఆస్తులకూ ఆధార్
సాక్షి,ఆదిలాబాద్: ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చిన దానికి లబ్ధి పొందాలంటే ఆధార్ కార్డు ఉండాలి. ప్రతీ దానికి ఆధార్‌ను అనుసంధానం చేస్తున్న ప్రభుత్వం మున్సిపాలిటీల్లోని ఆస్తులకూ ఆధార్ తప్పనిసరి చేసింది. గతంలోనే ఈ ప్రక్రియ ప్రారంభించినా మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో రెండు రోజుల క్రితం దీనిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీడీఎంఏ శ్రీదేవి పన్ను చెల్లించే ప్రతీ ఆస్తికి ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలని ఆదేశించారు. బల్దియాలో ఆస్తులకు ఆధార్ అనుసంధానం చేయాలని ఏడాది కిందటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో గతేడాది జూన్‌లో ఈ ప్రక్రియ ప్రారంభించారు. మధ్యలోనే ఈ కార్యక్రమం ఆగిపోయింది. మొదట్లో ఇంటింటి సర్వే నిర్వహించిన అధికారులు ఇతర పన్నుల వసూళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ లక్ష్యం నెరవేరలేదు. బల్దియాలో 9 వేలు పూర్తి.. జిల్లాలో ఆదిలాబాద్ ఒక్కటే మున్సిపాలిటీ ఉంది. ఆదిలాబాద్ బల్దియాలో 36 వార్డులు ఉన్నాయి. 2011 జనాభాల లెక్కల ప్రకారం 1.17 లక్షల జనాభా ఉంది. 20.65 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. మొత్తం 26 వేల ఆస్తులు ఉన్నాయి. గతేడాది ప్రారంభించిన ఆస్తులకు ఆధార్ అనుసంధానం ప్రక్రియలో ఇప్పటి వరకు 9 వేల ఆస్తులకు ఆధార్ పూర్తి చేశారు. సీడీఎంఏ ఆదేశాలతో ఈ ఆధార్ నమోదు కసరత్తు ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపాదికన క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా 8 బృందాలతో ఇంటింటికీ సర్వే నిర్వహిస్తున్నారు. ఆస్తి పన్నుకు ఆధార్‌తో పాటు సెల్‌ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారు. దీని ద్వారా బల్దియా అధికారులకు పన్నుకు సంబంధించిన ఏదైనా సమాచారం అవసరం ఉంటే నేరుగా వారికే ఫోన్ చేసి తెలుసుకునే వెసులు బాటు ఉంటుంది. అక్రమాలకు అడ్డుకట్ట.. బల్దియాలో ఆస్తిపన్నును ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. సెల్‌ఫోన్ నెంబర్లు సైతం తీసుకుంటుండడంతో ఏదైనా సమాచారాన్ని వెంటనే యజమానికి చేరవేసేలా వీలు కలుగుతుంది. పన్నుల మదింపు సమయంలో వ్యత్యాసాలను గుర్తించేందుకు ఉన్నత స్థాయిలో విచారణ చేపట్టవచ్చు. సదరు యజమానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఆధార్ అనుసంధానం పూర్తి అయిన తర్వాత ఎవరి పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనేది తెలుస్తుంది. దీని ద్వారా అక్రమంగా సంపాధించిన ఆస్తులు బయట పడే అవకాశం ఉంటుంది. అనుంధానం కొనసాగుతోంది.. ఆదిలాబాద్‌లో ఆస్తులకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 వేలు పూర్తిచేయడం జరిగింది. ఈ నెలాఖరులో మొత్తం ఆస్తులకు అనుసంధానం చేస్తాం. ప్రత్యేక బృందాలు ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ఆధార్‌తోపాటు సెల్‌ఫోన్ నెంబర్లు అనుసంధానించాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. ఇది పారదర్శకంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. – మారుతి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ -
అంతఃకరణ శుద్ధితో పనిచేయండి
తిరుపతి తుడా: నా తిరుపతి.. నా పని.. అని ఇష్టం తో కష్టం లేకుండా ప్రతి ఉద్యోగి అంతఃకరణశుద్ధితో పనిచేయాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమి షనర్ వీ. విజయరామరాజు సూచించారు. కార్పొరేషన్ కమిషనర్‌గా, తుడా వీసీగా శనివారం ఆయన ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ కే.మాధవీలత నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన వివిధ శాఖల విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతన కమిషనర్ మాట్లాడుతూ తన పాలనలో పనిచేసేవారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఉద్యోగులకు కొలమానం చిత్తశుద్ధితో పనిచేయడమేనన్నారు. అవినీతి, నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ఉద్యోగులకు అంతర్గతంగా టెలిగ్రామ్ యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులుంటే తనను నేరుగా కలిసి చెప్పుకోవచ్చన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి, శానిటేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖలు, సీనియర్ సిటీజన్లను సమన్వయపరుచుకుని స్మార్ట్‌సిటీ అభివృద్ధిని వేగవంతం చేస్తానని చెప్పారు. తుడా మాస్టర్ ప్లాన్‌పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నట్టు తెలిపారు. తుడా సెక్రటరీ మాధవీలత, ఈఈ ప్రభాకర్‌రెడ్డి, పీఓ కృష్ణారెడ్డి, ఏఓ హరినాథరెడ్డి, వీసీ పీఎస్ వెంకట్æరెడ్డి పాల్గొన్నారు. -
సాగనంపేందుకేనా..!
ప్రొద్దుటూరు టౌన్: అధికారులు అవినీతికి పాల్పడితే నేరుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి పట్టించవచ్చు. లేదంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇదీ సాధారణ పద్ధతి. అయితే ఇందుకు భిన్నంగా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నను ఇక్కడి నుంచి సాగనంపాలనే ఉద్దేశంతో కరపత్రాలు వేసి కొత్త సంస్కృతికి అధికారపార్టీ వారు తెరతీశారు. కొద్దిరోజుల కిందట ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నను బదిలీపై వెళ్లాలని అధికారపార్టీ నేతలు హెచ్చరించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, మీకు ఇష్టం లేకపోతే బదిలీ చేయించుకోమని కమిషనర్ ఆ నేతలకు చెప్పినట్లు తెలిసింది. తాను మాత్రం బదిలీపై వెళ్లనని, సెలవుపెట్టనని చెప్పినట్లు సమాచారం. ఇందుకోసం అధికారపార్టీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పైస్థాయిలో కమిషనర్‌కు పట్టు ఉండటంతో అధికారపార్టీ నేతల మాటలు చెల్లుబాటు కాలేదు. ఈ కారణంగానే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వరదరాజులరెడ్డికి ముఖ్య అనుచరుడైన మాజీ కౌన్సిలర్ ఎర్రన్న మున్సిపల్ కమిషనర్ అవినీతికి పాల్పడ్డారని కరపత్రాలు వేసి పంచిపెట్టారు. ఒక దళిత అధికారిపై మరో దళిత నాయకుడు కరపత్రాలు వేయడం గమనార్హం. ఎలాగైనా మున్సిపల్ కమిషనర్‌ను సాగనంపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలే ఇలాంటి చర్యలకు పాల్పడటం విడ్డూరంగా ఉందని పట్టణంలో చర్చ నడుస్తోంది. పింఛన్లే ముఖ్య కారణమా! మార్చి నెలకు సంబంధించి మిగతా మున్సి పాలిటీల్లోలాగే ప్రొద్దుటూరుకు 1000 పింఛన్లు మంజూరయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని 40వార్డులకుగానూ 18 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఎన్నిక కాగా కొందరు పార్టీ మారడంతో ప్రస్తుతం 9మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ వైపు ఉన్నారు. ఈ లెక్కన పూర్తి అర్హులైన 130 మందికి పింఛన్లు ఇవ్వాలని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. నిబంధనల ప్రకారం వీరికి పింఛన్ ఇవ్వాల్సిందేనని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కమిషనర్ టీడీపీకి చెందిన 870తోపాటు, వైఎస్సార్సీపీకి చెందిన 130మందితో పింఛన్ల నివేదిక పంపారు. ఈ విషయంపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పలుమార్లు జిల్లా అధికారులతో చర్చించారు. ఇది అధికారపార్టీ నేతలకు నచ్చలేదు. కమిషనర్ వాస్తవ పరిస్థితిని ఎంత వివరించినా ఆయన మాట వినకుండా ఆయనను బదిలీ చేయించాలని నిర్ణయించారు. వైఎస్సార్సీపీ సూచించిన వారి పేర్లను పింఛన్ల జాబితాలో చేర్చారని అధికారపార్టీ నేతలు జిల్లా స్థాయిలో అధికారులపై ఒత్తిడి తెచ్చి పింఛన్లు పంపిణీ చేయకుండా నిలిపేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేయగా, ప్రొద్దుటూరులో మాత్రం పెండింగ్‌లో పడ్డాయి. ఈ కథ ఎప్పుడు కంచికి చేరుతుందో చెప్పలేం. ముగ్గురు కమిషనర్లు.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రొద్దుటూరులో నాలుగేళ్లకు ముగ్గురు కమిషనర్లు మారారు. çకమిషనర్లు సంక్రాంతి వెంకటకృష్ణ, ప్రమోద్‌కుమార్, వెంకటశివారెడ్డి బదిలీపై వెళ్లగా ఎంఈ సురేంద్రబాబును కూడా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. ప్రస్తుతం నాలుగో కమిషనర్‌గా బండి శేషన్న పనిచేస్తున్నారు. ఈ బదిలీల ప్రభావంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ విధంగా టీడీపీ నేత తన మాట వినని అధికారులను పరోక్షంగా వేధించడాన్ని అధికారపార్టీలోని మరో వర్గం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. -
ఇన్చార్జిగానే మున్సిపల్ కమిషనర్!
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ : గతంలో పని చేసిన మున్సిపల్ కమిషనర్ భూక్యా దేవ్‌సింగ్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేసిన అనంతరం ఆ స్థానంలో నియమించిన ఫారెస్టు సెటిల్మెంట్ డిప్యూటీ కలెక్టర్ బి.రాంచందర్ ఇన్చార్జిగా మాత్రమే కొనసాగుతున్నారు. దీంతో మున్సిపాలిటీ ముఖ్యమైన వ్యవహారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రజల పెండింగ్ ఫిర్యాదులు, వినతి పత్రాలపై సరై న నిర్ణయం తీసుకోవడం, వివిధ పద్దుల కింద బిల్లులు, ఇతర చెల్లింపులు చేసే అధికారం ఇన్చార్జి కమిషనర్‌కు లేకపోవడంతో పలుఇబ్బందులు ఏర్ప డుతున్నాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీంతో జనవరి వేతనాలు అందక పారిశు ద్ధ్య సిబ్బంది, కాంట్రాక్టు వర్కర్లు ఇబ్బందిపడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలురావడం తగ్గింది.కౌన్సిలర్లు సైతం రావడానికి నిరాసక్తిగా ఉన్నారు. చేసిన పనులకు బిల్లులు రావడంలేదని పలువురు కాంట్రాక్టర్లు ఆం దోళన చెందుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే మున్సి పల్ కార్యాలయం బోసిపోయి దర్శనమిస్తున్నది. ఇక్కడికి వచ్చేందుకు ఇష్టపడని అధికారులు ఎప్పుడూ వివాదాలకు నెలవుగా ఉంటుందన్న భావనతో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీకి కమిషనర్‌గా రావడానికి అధికారులు ఇష్టపడడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ లేదా మున్సిపల్ ఇంజనీర్లకు కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇన్చార్జి కమిషనర్‌ను నియమించడంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. -
నగరాభివృద్ధికి ‘నుడా’
వినాయక్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): నిజామాబాద్ నగరాభివృద్ధిలో భాగంగా నిజామాబాద్ నగరాభివృద్ధి సంస్థ (నుడా) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నుడా పరిధిలో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న మొత్తం 61 గ్రామాలు ఉంటాయి. నుడా ఏర్పాటుకు మున్సిపల్ పరిపాలన శాఖ నుంచి ఉత్తర్వులు (జీఓనెం.271) జారీ అయ్యాయి. నుడాకు పాలకవర్గాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో నగరంతో పాటు నగర పరిసర గ్రామాల్లో అభివృద్ధి ఊపందుకోనుంది. ఈ నేపథ్యంలో నగర మున్సిపల్ కమిషనర్ జాన్ సాంసన్‌ను ‘సాక్షి’ ఇంటర్వూ్య చేసింది. నుడా ఏర్పాటుతో అభివృద్ధి ఎలా ఉండబోతోంది? కమిషనర్ : నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో నగరంతో పాటు నిజామాబాద్ చుట్టు పక్కల ఉన్న 61 గ్రామాల్లో అభివృద్ధి ఊపందుకుంటుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అందాల్సి ఉంది. నుడా ఏర్పాటుతో ప్రణాళిక బద్ధమైన అభివృద్ధితో పాటు ఆయా గ్రామాల్లో భూముల ధరలు పెరిగుతాయి. నగర సుందరీకరణ, అభివృద్ధి పనులు ఊపందుకుంటాయి. నగరాభివృద్ధికి మంజూరైన నిధులతో చేపట్టబోయే పనులు ఎలా పూర్తి చేస్తారు? కమిషనర్ : నగరాభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరయ్యాయి. వీటిని ప్రాధాన్యత క్రమంలో వినియోగిస్తాం. తొలుత రోడ్లు, అంతర్గత రోడ్ల పనులు చేపడతాం. తర్వాత డ్రెయిన్ల పనులు, అహ్మదీ బజార్ మాంస విక్రయ భవన సముదాయాల పనులు చేపడతాం. నిర్ణీత సమయంలో పనులు చేపట్టేందుకు అధికారులను సమన్వయ పరుస్తాం. పారిశుధ్య నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు? కమిషనర్ : పారిశుధ్య నిర్వహణ మెరుగుపర్చడానికి సిబ్బంది గైర్హాజరు కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బందికి పూర్తి స్థాయిలో సేఫ్టీ మెటీరియల్ అందుబాటులో లేదు. పారిశుధ్య పరికరాలు, యూనిఫాం, షూస్, సేఫ్టీ మెటీరియల్ అందించడంపై దృష్టి సారిస్తున్నాం. సిబ్బంది సహకారంతో శానిటేషన్ మెరుగుపరుస్తాం. మున్సిపాలిటీలో సిబ్బంది కొరత ఉందా? కమిషనర్ : నగర పాలక సంస్థలో సిబ్బంది కొరత లేదు. మున్సిపాలిటీలో మొత్తం 720 మంది సిబ్బంది ఉన్నారు. వీరితో ప్రస్తుతం సేవలను కొనసాగిస్తున్నాం. అవసరమనుకుంటే సిబ్బందిని నియమిస్తాం. చెత్త సేకరణ వాహనాల కొరత ఉందా? కమిషనర్ : చెత్త సేకరణ వాహనాల కొనుగోలుకు రూ.8కోట్లు మంజూరయ్యాయి. చెత్త సేకరణకు అవసరమైన వాహనాల జాబితాను ప్రభుత్వానికి పంపించి కొనుగోలు చేస్తాం. పబ్లిక్ హెల్త్ శాఖకు బాధ్యతలు అప్పగించాం. శానిటరీ సిబ్బందిపై కొరడా ఝులిపిస్తున్నారు.. వేరే శాఖల అధికారులు బయోమెట్రిక్ చేసి వెళ్లిపోతున్నారనే ఆరోపణలున్నాయి? కమిషనర్ : ప్రభుత్వ ఆదేశాల మేరకే సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నాం. ఎవరు క్రమశిక్షణ అతిక్రమించినా చర్యలు తీసుకుంటాం. ఎంతటి వారైనా సక్రమంగా విధులు నిర్వర్తించాల్సిందే. బయోమెట్రిక్ చేసి విధుల్లో నుంచి వెళ్తే ఉపేక్షించం. అలాంటి వారిపై పకడ్బందీ చర్యలు తీసుకోవడంపై దృష్టి సారిస్తాం. యూజీడీ పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? కమిషనర్ : యూజీడీ పనులు సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తాం. పనుల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు నగరాభివృద్ధికి సహకరించాలి. -
మిగులు సొమ్ము మింగేశారు
♦ పింఛన్ల డబ్బులు కాజేసిన మున్సిపల్ కమిషనర్ ♦ నిలదీసిన కౌన్సిలర్లకు సమాధానం చెప్పలేక పరుగులు ♦ మున్సిపల్ సమావేశ మందిరంలో గందరగోళం కాశీబుగ్గ: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు అందించే పింఛన్ల సొమ్ములో అవినీతి జరిగింది. మున్సిపల్ కమిషనరే పింఛన్ల సొమ్మును కాజేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం బయట పడడంతో లెక్కలు చెప్పాల్సిన కమిషనర్ పరుగులు పెట్టారు. నిండు సమావేశంలో లెక్కలు చెప్పాల్సి రావడంతో చెప్పలేక అక్కడ నుంచి జారుకున్నారు. ఉద్యోగులు, కౌన్సిలర్లు ఉండమంటున్న ఉండకుండా కమిషనర్ సమావేశ మందిరం నుంచి తలుపుతీసి పరుగున వెళ్లిపోయారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో చోటుచేసుకున్న ఈ పరిణామంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు అధ్యక్షతన ఉద్యోగుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో పింఛన్ల పంపిణీపై జరిగిన చర్చలో మున్సిపల్ కమిషనర్ పిల్ల జగన్మోహన్రావు అవినీతి భాగోతం బయటపడింది. ఎన్టీఆర్ భరోసా పేరుతో పలాస మున్సిపాలిటీ పరిధిలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు 2701 మందికి జూన్‌లో పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే సుమారు 450 మందికి పింఛన్లు పంపిణీ చేయలేదు. ఇందులో 262 మందికి వేలుముద్రలు పడలేదు. ఈ తరుణంలో రూ. 46.39 లక్షలకు, రూ. 1.39 లక్షలు విత్‌డ్రా చేయలేదు. మిగిలిన నిధులు డ్రాచేశారు. దీంతో పాటుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో వీఆర్ఏ శారద పింఛన్లు పంపిణీ చేసి రూ. 15 వేలు మిగులు పింఛన్ డబ్బులను కమిషనర్ సమక్షంలో జగ్గం శ్రీనుకు అప్పగించగా, మహేష్‌కు రూ. 5 వేలు ఇవ్వమని కమిషనర్ తెలిపారు. ఇంకో పింఛన్ పంపిణీదారురాలు మోనీస నుంచి రూ. 5 వేలు కమిషనర్ తీసుకున్నారు. అలాగే మెప్మా విభాగం కో–ఆర్డినేటర్ స్వప్న రూ. 30 వేలు మిగులు పింఛన్ సొమ్మును కమిషనర్‌కు అందజేశారు. ఇలా మొత్తం రూ. 50 వేలు మిగులు పింఛన్ డబ్బులు బ్యాంకులో వేసినట్టు చెప్పి, రూ. 25 వేలకు సంబంధించిన రశీదు మాత్రమే చూపిస్తున్నారు. మిగిలిన రూ. 25 వేలు ఏమయ్యాయని ఉద్యోగులు, కౌన్సిలర్లు సమావేశంలో కమిషనర్‌ను నిలదీయగా రెవెన్యూ సిబ్బంది జగ్గం శ్రీనుకు అందజేశానని తెలిపారు. జగ్గం శ్రీను వెంటనే లేచి నాకు ఇవ్వలేదని, ఇది పచ్చి అబద్ధమని తెలపడంతో కమిషనర్ మాటమార్చి మెప్మా సీవో స్వప్నకు అందజేశానన్నారు. మెప్మా సీవో స్వప్న వెంటనే లేచి నాకు ఇవ్వలేదని, నా పేరు అనవసరంగా చెబుతున్నారని, మిగులు పింఛన్ డబ్బులు నేనెప్పుడో చెల్లించానని ఆమె తెలిపింది. దీంతో చేసేది లేక, రూ. 25 వేలుకు లెక్కలు చెప్పలేక అక్కడున్న డైరీలు, పుస్తకాలు పట్టుకొని కమిషనర్ సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, కౌన్సిలర్ పాతాళ ముకుందరావు, కౌన్సిలర్ ప్రతినిధులు బడగల బాలచంద్రుడు, బళ్ల శ్రీనివాసరావు, బుల్లు ప్రధాన్, కోఆప్సన్ సభ్యులు భానుమూర్తి, కౌన్సిలర్ చంద్రవతి వెళ్లవద్దని కమిషనర్‌ను కోరుతున్నప్పటికీ సభ మధ్యలో సభ్యులను తిరస్కరించి తలుపు తీసి పరుగులు తీశారు. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ. 2.40 లక్షలు మిగులు పింఛన్ డబ్బులు తిరిగి జమ కాలేదని, పింఛన్లు అందక 25వ వార్డు నుంచి 26 మంది వితంతు, వికలాంగులు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పలువురు కౌన్సిలర్లు సభలో ప్రస్తావించారు. -
మున్సిపల్ కమిషనర్‌పై టీడీపీ నాయకుల దాడి!
► చొక్కా చించి.. ముఖం వాచేలా కొట్టారంటూ కమిషనర్ ఆవేదన ► చైర్మన్, ఇద్దరు కౌన్సిలర్లపై పోలీసులకు ఫిర్యాదు కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ పి.జగన్మోహనరావుపై చైర్మన్, ఇద్దరు కౌన్సిలర్లు దాడికి తెగబడ్డారు. చొక్కా చించి, ముఖం వాచేలా పిడిగుద్దులు గుద్దారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ జగన్మోహనరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొన్ని పనులకు సంబంధించి బిల్లుల ఫైళ్లపై సంతకాలు చేయాలని పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, 18వ వార్డు కౌన్సిలర్ పాతాళ ముకుంద, 12వ వార్డు కౌన్సిలర్ ప్రతినిధి బల్లా శ్రీనివాస్‌లు కమిషనర్‌పై ఒత్తిడి చేశారు. అయితే, ఆ పనులకు సంబంధించి బిల్లులు సక్రమంగా లేకపోవడంతో కమిషనర్ నిరాకరించారు. బుధవారం రాత్రి కమిషనర్.. మున్సిపల్ కార్యాలయంలోని డీఈ చిరంజీవులు గదిలో ఉండగా చైర్మన్‌తోపాటు, ముకుంద, శ్రీనివాస్ అక్కడకు చేరుకున్నారు. సంతకాలు చేయాలని బలవంతం చేస్తూ, కమిషనర్‌పై దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో తన షర్టు చింపి, ముఖంపై పిడుగుద్దులు గుద్దారని కమిషనర్ జగన్మోహనరావు వాపోయారు. అనంతరం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స పొందారు. తనపై దాడి జరిగిందంటూ సీఐ అశోక్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే శివాజీ చేయించారేమో.. : చైర్మన్ ఇదే విషయమై మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావును వివరణ కోరగా.. ఎమ్మెల్యే టికెట్ తనకిచ్చేస్తారని ఆందోళనతో స్థానిక ఎమ్మెల్యే శివాజీ ఇదంతా చేయించారని ఆరోపించారు. తనకేమీ తెలియదని చెప్పారు. -
టీడీపీ కౌన్సిలర్లపై ఫిర్యాదు
ప్రొద్దుటూరు టౌన్: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా శనివారం కౌన్సిల్ హాల్లో జరిగిన విధ్వంసంపై మున్సిపల్ కమిషనర్ వెంకటశివారెడ్డి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌కు వచ్చిన 27వ వార్డు టీడీపీ కౌన్సిలర్ తలారి పుల్లయ్య, 31వ వార్డు కౌన్సిలర్ గణేష్‌బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ జబీవుల్లా అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌన్సిల్ హాల్లోకి వచ్చి వీరు టేబుళ్లను, కుర్చీలను పగులగొట్టారని వివరించారు. తలారి పుల్లయ్య కౌన్సిల్ మినిట్స్ పుస్తకాన్ని ఎన్నికల అధికారి టేబుల్ పైనుంచి తీసుకుని దానిని చించే ప్రయత్నం చేయగా పోలీసులు పట్టుకుని మున్సిపల్ కమిషనర్‌కు అప్పగించారని తెలిపారు. ఇందులో కొన్ని పేజీలు చినిగిపోయాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల అధికారికి, జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. వీరి వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిందని తెలిపారు. ఆదివారం జరిగే చైర్మన్ ఎన్నికకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఫిర్యాదును డీఎంఏ, ఆర్డీ, ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారులకు పంపారు. -
పన్నులు చెల్లిస్తారా? జప్తు చేయమంటారా?
స్కిట్ కళాశాల బకాయిలపై మున్సిపల్ కమిషనర్ శ్రీకాళహస్తి: స్కిట్ కళాశాల యజమాన్యం 2011 నుంచి రూ.60లక్షల ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉందని..నోటీసులిచ్చినా పట్టించుకోవడంలేదని మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య ఆ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డికి తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కళాశాల వద్దకు వెళ్లి ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డితో పన్నుల బకాయిలపై చర్చించారు. పన్ను చెల్లించకపోతే కళాశాలను సైతం జప్తు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో స్పందించిన ప్రిన్సిపాల్ 2013 నుంచి మాత్రమే పన్నులు చెల్లించాల్సి ఉందని, అది కూడా రూ.26లక్షల లోపే ఉందని సమాధానమిచ్చారు. ఏప్రిల్ 1వతేదీలోపు బకాయిలు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పి వెళ్లిపోయారు. మరో తలపోటుగా పన్నుల భారం స్కిట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు లేవు. మొన్నటి వరకు స్కిట్‌ను అనంతపురం జేఎన్టీయూకి, కర్ణాటకలోని మఠాలకు లీజుకు ఇవ్వనున్నట్లు ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాలతో లీజుపై స్కిట్ యాజమాన్యం వెనక్కు తగ్గింది. ఈనేపథ్యంలో మున్సిపాలిటి పన్నుల భారం కళాశాల యాజమాన్యానికి మరో తలపోటుగా పరిణమించింది. -
పిచ్చికుక్కల దాడిలో 22 మందికి గాయాలు
నలుగురిని హైదరాబాద్‌కు తరలింపు తాండూరు టౌన్: తాండూరులో ఆదివారం పిచ్చికుక్కలు బీభత్సం సృష్టించాయి. 22 మందిపై దాడి చేసి గాయపర్చాయి. స్థానికులు కుక్కలను తరిమేందుకు యత్నించగా వారినీ వదలలేదు. ఒక మహిళ వేసుకున్న స్వెట్టర్‌ను పట్టుకుని రోడ్డుపై లాక్కుంటూ కొద్దిదూరం వరకు తీసుకెళ్లాయి. గాయపడిన వారిని తాండూరు ఆస్పత్రిలో చేర్పించగా.. తీవ్రంగా గాయపడిన నలుగురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితులతో మాట్లాడారు. అయితే, తాండూరులోని వంతెన సమీపంలో కొందరు వేస్తున్న జంతు కళేబరాలను తిన్న కుక్కలు పిచ్చిగా ప్రవర్తిస్తున్నాయని, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
ఇదే చివరి అవకాశం...
- అలసత్వం ప్రదర్శిస్తే విధుల నుంచి తొలగిస్తాం - మునిసిపల్ కమిషనర్లకు మంత్రి కేటీఆర్ హెచ్చరిక - శిథిల భవనాలు కూలితే కమిషనర్లదే బాధ్యత సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ కమిషనర్ల పనితీరుపై పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పినా కొంత మంది విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, వారిపై వారంలోగా చర్యలుంటాయన్నారు. ఇదే చివరి అవకాశమని, ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా అలసత్వం ప్రదర్శిస్తే విధుల నుంచి తొలగించడం ఖాయమన్నారు. నిర్లక్ష్యం వహిస్తున్న వారి జాబితాను తయారు చేసి తనకు పంపించాలని పురపాలక శాఖ డెరైక్టర్ దానకిశోర్‌ను మంత్రి ఆదేశించారు. ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల మునిసిపల్ కమిషనర్లతో సోమవారం సచివాలయం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో శిథిల భవనాలను వెంటనే గుర్తించి, కూల్చేయాలని గతంలో పలు మార్లు ఆదేశించినా మునిసిపల్ కమిషనర్లు దాన్ని అమలు చేయకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. శిథిల భవనాలను తక్షణమే కూల్చేయాలని, వర్షాలతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. ఒకవేళ భవనాలు పడిపోయి ప్రాణనష్టం జరిగితే కమిషనర్లనే బాధ్యులను చేస్తామని హెచ్చ రించారు. కమిషనర్లందరూ ఉదయాన్నే విధుల్లో ఉండాలన్నారు. ఇకపై నిరంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షిస్తానన్నారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, డెరైక్టర్ దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ కట్టడాలు కూల్చేయండి... ‘నగరాలు, పట్టణాల్లో వరదలకు దారితీస్తున్న కారణాలను గుర్తించాలి. ప్రతి మునిసిపాలిటీ పరిధిలో జల వనరులు, చెరువుల వివరాలను డిజిటలైజ్ చేయాలి. అన్ని చెరువులు, నాలాల మ్యాపులను సిద్ధం చేసుకోండి. వీటిపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చి వేయండి. ఎంతటి వారైనా ఉపేక్షించవద్దు’ అని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. కూల్చివేతల్లో పేదవారినే టార్గెట్ చేయకుండా ముందుగా కమర్షియల్ అవసరాల కోసం కట్టిన కట్టడాలను కూల్చేయాలన్నారు. ఇరుకుగా మారిన నాలాలను వెడల్పు చేయాలన్నారు. ఈ పనుల కోసం రెవెన్యూ, సాగునీటి శాఖ అధికారులతో జారుుంట్ వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల అనంతరం ఆరోగ్య సమస్యలు రాకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాడైన రోడ్లకు మరమ్మతులు, ఇతర మౌలిక వసతులు వెంటనే కల్పించాలన్నారు. ఒకటి నుంచి నీటి మీటర్ లేకుంటే రెట్టింపు బిల్లు గ్రేటర్‌లోని గృహ, వాణిజ్య నల్లా కనెక్షన్లకు నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోని పక్షంలో అక్టోబర్ ఒకటి నుంచి రెట్టింపు బిల్లులు వసూలు చేయాలని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్ జలమండలిని ఆదేశించారు. మహానగరంలో మొత్తం 8.75 లక్షల నల్లా కనెక్షన్లకు గాను సుమారు 5 లక్షల నల్లాలకు మీటర్లు లేనందున బోర్డు ఆదాయానికి భారీగా గండి పడుతుండడంతో ఈ నిర్ణయం అమలు చేయాలని సూచిం చారు. సోమవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించిన సందర్భంగా జలమండలి పథకాలను ఆయన సమీక్షించారు. నగరంలో దెబ్బతిన్న, పురాతన పైపులైన్ల నాణ్యత, మన్నికపై నిపుణుల కమిటీతో తక్షణం అధ్యయనం చేయాలన్నారు. పదేళ్లకు పైబడిన పైపులైన్లను నిరంతరం పర్యవేక్షించేందుకు కెమెరా ఆధారిత సెన్సర్లను ఏర్పాటు చేయాలన్నారు. అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవడం, సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించడం ద్వారా బోర్డు ఆదాయం నెలకు వంద కోట్ల మేర సాధించాలని ఆదేశించారు. నగరంలోని 4 లక్షల మ్యాన్‌హోళ్లను జియోట్యాగింగ్ చేయాలని, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, జలమండలి ఎండీ దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
కమిషనర్లు, అధికారులకు కేటీఆర్ క్లాస్
హైదరాబాద్ : మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం కార్పొరేషన్లు, మున్సిపాలిటీ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కమిషనర్లు, అధికారులకు క్లాస్ తీసుకున్నారు. అధికారులు సరిగా పని చేయకపోవడం వల్ల ప్రభుత్వం ఇబ్బందులు పడాల్సి వస్తుందని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఒక్క అధికారి అయినా ఉదయం పూట ఫీల్డ్‌లోకి వెళ్తున్నారా? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌తో సహా పట్టణ ప్రాంతాల్లో నాలాల ఆక్రమణలపై కఠినంగా ఉండల్సిందేనని కేటీఆర్ సూచించారు. అధికారులు తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. -
హమ్మయ్య.. కమిషనరొచ్చారు!
తొమ్మది నెలల తర్వాత రెగ్యులర్ కమిషనర్ సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా రవీందర్రావు జోగిపేటలో సస్పెన్షన్.. ఇక్కడ పోస్టింగ్ ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేనా? సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపల్ రెగ్యులర్ కమిషనర్‌గా రవీందర్రావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మున్సిపల్ చెర్ పర్సన్ విజయలక్ష్మి ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. రెండు నెలల క్రితం తెలంగాణ హరితహారం కార్యక్రమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని జోగిపేట-అందోల్ నగర పంచాయతీ కమిషనర్‌గా పనిచేసిన రవీందర్రావును కలెక్టర్ జూల్12న సరెండర్ చేశారు. అదే అధికారి జిల్లా కేంద్రానికి కమిషనర్‌గా వచ్చారు. దీంతో ఏ మేరకు సమస్యలు పరిష్కారం అవుతాయోనన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు తొమ్మిది నెలల పాటు ఇన్చార్జి కమిషనర్లతో పాలన కుంటుపడిందని సర్వత్రా ఆరోపణలు వినవస్తున్నాయి. దీనికి తోడు ప్రధానంగా ఇంటి అనుమతుల సమస్య తీవ్రంగా ఉంది. గత ఆరు నెలలుగా ఇంటి నిర్మాణల కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కాని అనుమతులు ఇవ్వ లేదు. దీని కోసంగ గత ఇనచార్జి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఏజేసీపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినా నిబంధనల ప్రకారమే అనుమతులు ఇస్తానని తేల్చి చెప్పేవారు. దీంతో పాలకవర్గ సభ్యులు కొందరు అధికార పార్టీ కౌన్సిలర్లు, చైర్‌పర్సన్‌తో కలిసి మంత్రి పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇన్చార్జి కమిషనర్ బాధ్యతల నుంచి ఏజేసీని తప్పించి రెగ్యులర్ కమిషనర్‌ను నియమించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుల వద్దకు పలు మార్లు వెళ్లినట్లు తెలిసింది. దీంతో జోగిపేటలో సస్పెండ్‌కు గురైన జోగిపేట నగర పంచాయతీ కమిషనర్‌ను సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. విమర్శల వెల్లువ నగర పంచాయతీకి విధులు నిర్వహిస్తున్న కమిషనర్‌ను గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్‌గా పోస్టింగ్ ఇవ్వడంపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలో గ్రేడ్-1 అధికారిని నియమించాల్సి ఉంది. కాని నగర పంచాయతీకి కమిషనర్‌గా, ఆపై సస్పెండ్ అయిన అధికారిని ఎలా గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తారని స్వయంగా ఆ శాఖకు చెందిన ఉన్నత స్థాయి ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. -
ఆ ముగ్గురికి కులగజ్జి పట్టుకుంది
అనంతపురం : అనంతపుం జిల్లా టీడీపీ నాయకుల్లో ఉన్న విబేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. అనంతపురంలో ప్రబలిన విషజ్వరాలపై స్థానిక టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆదివారం స్పందించారు. ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి విఫలమయ్యారని ఆరోపించారు. ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్‌కు కులగజ్జి పట్టుకుందని విమర్శించారు. అనంతలో పారిశుద్ధ్యం పడకేసిందని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని జేసీ దివాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను అభివృద్ధి చర్యలు ప్రారంభిస్తే.. దానికి సైతం వారు అడ్డుపడ్డారని ఎంపీ జేసీ మండిపడ్డారు. -
నేడు మెగా ప్లాంటేషన్
సదాశివపేట: ప్రభుత్వం ప్రటిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం రెండో విడత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఎవరెస్ట్ ఎన్‌క్లెవ్‌లో, 11 గంటలకు సిద్దాపూర్ కాలనీలో శ్రీకృష్ణ మందిరం వద్ద, 11.15 సిద్దాపూర్ కాలనీలోని పాత కమ్యూనిటి హాల్ వద్ద, 11.30 గంటలకు సిద్దాపూర్ రోడ్డులోగ సాయినగర్ కాలనీలో మెగా ప్లాంటేషన్ చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ ఇస్వాక్‌ఆబ్‌ఖాన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని, ప్రజాప్రతినిధులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. -
రోడ్డున పడేసి రంజాన్ తోఫా ఇస్తారా..?
ఒంగోలు టౌన్ : ‘ఒంగోలు నగరంలోని బండ్లమిట్ట సెంటర్లో ఆరు దశాబ్దాలకుపైగా పద్దెనిమిది పేద ముస్లిం కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. చేతివృత్తులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నాయి. పదహారేళ్ల క్రితం ఆ ప్రాంతంలో ఉంటున్న మిగిలిన వారితో కలిపి ముస్లింలకు కూడా ఇళ్ల పట్టాలిచ్చారు. కానీ, రంజాన్ పవిత్ర మాసంలో ప్రార్థనలు చేసుకుంటూ సంతోషంగా గడుపుతున్న ముస్లిం కుటుంబాలను పోలీసులు, రెవెన్యూ సహకారంతో మున్సిపల్ కమిషనర్ చిన్నాభిన్నం చేశారు. వారి ఇళ్లను కూలగొట్టారు. ముందస్తుగా ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా పొక్లెయిన్‌తో ధ్వంసం చేశారు. ముస్లిం కుటుంబాలను రోడ్డున పడేసి రంజాన్ తోఫా ఇస్తారా’ అని ముస్లిం మతపెద్ద సయ్యద్ హమీద్ ప్రశ్నించారు. బండ్లమిట్టలోని ముస్లిం బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించుకుని అధిక సంఖ్యలో ముస్లింలు కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జేసీ హరిజవహర్‌లాల్‌కు సమస్యను వివరించి న్యాయం కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సయ్యద్ హమీద్ మాట్లాడుతూ బండ్లమిట్టలోని ముస్లింలకు జరిగిన అన్యాయాన్ని చూసి జిల్లావ్యాప్తంగా ఉన్న ముస్లింలు తమకు అన్యాయం జరిగినట్లుగా భావించి రోడ్డు మీదకు వచ్చారన్నారు. ని బంధనల మేరకు పట్టాలు ఇచ్చినప్పటికీ పథకం ప్రకారం తమ వారికి చెందిన ఇళ్లు, దుకాణాలను ధ్వంసం చేశారన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ముందుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పొక్లెయిన్‌తో నేరుగా వచ్చి పడగొట్టేందుకు సిద్ధపడ్డారన్నారు. రంజాన్ మాసాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు రోజులు గడువు కావాలని కోరినా వినిపించుకోలేదన్నారు. అక్కడి ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు మసీదుకు వెళ్లగానే మానవత్వం అనేది లేకుండా పొక్లెయిన్‌తో పడగొట్టించారన్నారు. మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేసుకునేందుకు వీలులేకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయించారన్నారు. వారంతా చీకట్లోనే ప్రార్థనలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క కుటుంబానికి లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకు నష్టం జరిగిందన్నారు. అక్కడే ఉన్న మసీదుకు సంబంధించి హామీ ఇచ్చినట్లుగా బాధిత ముస్లింలకు కూడా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులను శంకించాల్సి వస్తోంది : ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం పొందిన తరువాతనే 18 మంది ముస్లింలకు పట్టాలు ఇచ్చారని, మిగిలిన వాటిని కాకుండా వాటినే తొలగించడం చూస్తుంటే అధికారులను శంకించాల్సి వస్తోందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్డీ సర్దార్ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంతోపాటు నష్టపరిహారం చెల్లించకుంటే జిల్లావ్యాప్తంగా ముస్లింలను సమీకరించి పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. - ఎస్డీ సర్దార్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలి : తమకు ముందస్తుగా ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఇళ్లు, దుకాణాలు కూలగొట్టించిన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని ఎస్కే బుజ్జి అనే వెల్డింగ్ అండ్ ఐరన్ వర్క్ దుకాణాదారుడు డిమాండ్ చేశాడు. 300 మంది పోలీసులతో వచ్చి తమ వాటిని కూలదోస్తున్న సమయంలో కమిషనర్‌ను బతిమిలాడినా వినిపించుకోలేదన్నాడు. తాము ఉద్యోగాలు అడగలేదు, రుణాలు అడగలేదు, స్వశక్తితో పనిచేసుకుంటుంటే అక్రమంగా తొలగించేశారని, తమకు న్యాయం చేయాలని కోరాడు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు షేక్ సంధాని, షేక్ హమీద్, షేక్ బుజ్జి, ఆయూబ్ తదితరులు పాల్గొన్నారు. - ఎస్కే బుజ్జి, బాధితుడు -
రుయా రోడ్లకు మోక్షం
సాక్షి కథనంపై స్పందించిన అధికారులు రూ.24.65 లక్షలతో లింకు రోడ్ల ఏర్పాటు రోగులకు తప్పనున్న పాట్లు తిరుపతి మెడికల్: తిరుపతి రుయా ఆసుపత్రిలోని లింకు రోడ్లకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. గుంతలమయంగా మారి, కంకర తేలి రోగుల పాలిట నరకంగా మారిన రోడ్ల దుస్థితిపై అధికారులు కరుణించారు. ఈనెల 1వ తేదిన సాక్షి జిల్లా ప్రధాన సంచికలో ‘కుట్లు తెగిపోతున్నాయ్..’ శీర్షికతో రుయా రోడ్ల దయనీయతపై కథనం ప్రచురించిన విషయం విదితమే. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సిద్దార్థ్ జైన్ తక్షణం లింకు రోడ్లను అభివృద్ధి చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్‌చంద్‌ను ఆదేశించారు. దీంతో నగర పాలక సంస్థ నిధులు రూ.24.65 లక్షలతో వెంటనే తారు రోడ్ల నిర్మాణం ప్రారంభించారు. గతంలో ఆర్థో విభాగం నుంచి ఆపరేషన్ రోగులను స్ట్రెచర్‌పై పడుకో బెట్టుకుని గుంతలమయమైన కంకర రోడ్డుపై దాదాపు అర్ధ కిలోమీటరు దూరంలోని ఆరోగ్య శ్రీ వార్డువరకు తీసుకొచ్చేవారు. ఆ సమయంలో రోగికి కుట్లు తెగిపోవడం, ఆపరేషన్ చేసిన భాగాలు పక్కకు తొలగిపోవడం వంటివి జరిగేవి. దీంతో పాటు పాడైన రోడ్లపై వాహనదారులు, పాదచారుల రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారేది. తొలి రోజు నాలుగు లింకు రోడ్లను కలుపుతూ రోడ్లను ఏర్పాటు చేశారు. -
ఒకట్రెండు రోజుల్లో మున్సిపల్ కమిషనర్ల బదిలీ !
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల కమిషనర్లు బదిలీ కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కోదాడ మున్సిపల్ కమిషనర్ మాలోజీ నాయక్ బెల్లంపల్లి కమిషనర్‌గా, మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకన్న.. మిర్యాలగూడ కమిషనర్‌గా, మిర్యాలగూడ కమిషనర్ అమరేందర్‌రెడ్డి కోదాడ కమిషనర్‌గా, సత్తుపల్లి కమిషనర్ శ్రీనివాస్, దేవరకొండ మున్సిపల్ కమిషనర్‌గా, దేవరకొండ కమిషనర్ స్వామి.. సత్తుపల్లి కమిషనర్‌గా బదిలీ కానున్నారు. వీరి బదిలీలకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆమోదించిన వెంటనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. -
రోడ్లపై ఉమ్మినా, చెత్త వేసినా జరిమానా
ఉప్పల్ (హైదరాబాద్) : రోడ్డుమీద ఉమ్మేస్తున్నారా జాగ్రత్త. ఇక నుండి హైదరాబాద్ నగర వ్యాప్తంగా రోడ్లపై ఉమ్మినా, చెత్త వేసినా జరిమానా విధిస్తామని గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు. గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఆయన మంగళవారం పర్యటించారు. గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే భాగంలో చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా నగరంలోని చాలావరకు చెత్త ఓపెన్ పాయింట్లు దాదాపు తొలగించినట్లు తెలిపారు. వంద రోజులు ముగిసేనాటికి రోడ్లపై ఎక్కడా ఓపెన్ చెత్త కనబడకుండా చేస్తామన్నారు. ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఉమ్మేసినా మూత్ర విసర్జన చేసినా, గోడలపై రాసినా, ఎక్కడ పడితే అక్కడ బ్యానర్లు కట్టినా జరిమానా విధిస్తామని తెలిపారు. చిన్నరావులపల్లిలో ఏర్పాటు చేయనున్న.. చెత్త నుండి విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం కాప్రా, ఉప్పల్ సర్కిల్ పరిధిలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రతి కార్మికుడు ఇంటింటికి వెళ్లి తడి,పొడి చెత్తపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. విద్యార్థులను సైతం ఇన్వాల్వ్ చేయనున్నట్లు తెలిపారు. తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరించేందుకు, ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు పరచడం తదితర అంశాలలో వచ్చే నెల 2వ తేదీన ఎస్ఎఫ్ఏలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉత్తమ సేవలందించిన పారిశుద్ద్య కార్మికులకు, అధికారులకు, గుర్తింపునిచ్చే విధంగా పూలదండలు వేసి సన్మానం చేస్తామని తెలిపారు. ఉప్పల్ సర్కిల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను జోనల్ కమిషనర్ రఘు ప్రసాద్, డీసీ విజయకృష్ణ, ఈఈ నాగేందర్‌లతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఉప్పల్ కూరగాయల మార్కెట్, మండే మార్కెట్లలోని మోడల్ మార్కెట్ల భవనాన్ని పరిశీలించారు. సర్కిల్ కార్యాలయం ఆవరణలోని షటిల్ కోర్టును, ఉప్పల్ బస్ బే, సిటీజన్ సెంటర్, బిల్ కలెక్టర్లు పనిచేసే విధానం తదితర అంశాలను పరిశీలించారు. ఉద్యోగులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిటిజన్ సర్వీస్ సెంటర్ తనిఖీ.. ఎర్లీబర్డ్ ఆఫర్‌కు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలోని సిటిజన్ సర్వీస్ సెంటర్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి తనిఖీ చేశారు. ఏరియాలకు సంబంధించిన బిల్ కలెక్టర్లను ఆస్తి పన్ను చెల్లింపు అంశాలపై ఆరా తీశారు. అవసరమైతే అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. -
ఏం తమాషాగా ఉందా...!
♦ ప్రతి సమావేశానికి ఆలస్యంగా వస్తున్నావ్ ♦ ఆఫీసర్లు అంటే అంత చులకనా.. ♦ వికారాబాద్ మున్సిపల్ కమిషనర్‌పై మండిపడిన సబ్ కలెక్టర్ వికారాబాద్ : ఆఫీసర్లు అంటే అంత లోకువా.. ఏందీ విషయం.. ప్రతి మీటింగ్‌కు ఆలస్యంగా వస్తావ్.. కొన్ని మీటింగ్‌లకు హాజరే కావు.. వచ్చినా ఎలాంటి నివేదికలు ఉండవు.. అసలు నీ ఉద్దేశం ఏమిటంటూ స్థానిక మున్సిపల్ కమిషనర్ ఎంకేఐ అలీపై వికారాబాద్ సబ్ కలెక్టర్ శ్రుతిఓజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతి మంగళవా రం సమీక్ష సమావేశం ఉంటుందనే సమాచారం నీకు తెలియదా.. తెలిస్తే ఎందుకు రాలేదు.. ఫోన్ చేస్తేనే మీటింగ్‌కు వస్తావా.. ఎం తమాషాగా ఉందా.. పద్ధతి మార్చుకోకుంటే ఫలితం అనుభవించక తప్పదని తనదైన శైలిలో హెచ్చరించారు. మంగళవారం వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి సబ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి మున్సిపల్ కమిషనర్ హాజరుకాకపోవడంతో ఫోన్ చేసి పిలిపించారు. ప్రతి వారం మున్సిపాలిటీ లో నిర్వహించే సమావేశానికి సైతం మున్సిపల్ అధికారులు హాజరుకాకపోవడంతో ఈసారి సమావేశాన్ని మండల పరిషత్‌కు మార్చినట్లు తెలిపారు. తీరుమార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా సమావేశానికి అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో హాజరు కావాలని ఆదేశించారు. మొక్కుబడిగా వచ్చినా శాఖా పరమైన చర్యలు తప్పవన్నారు. వేసవి దృష్ట్యా ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పశువుల దాహార్తిని తీర్చేందుకు వీలుగా నీటి తొట్లు నిర్మించాలన్నారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాం తాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ పనితీరును మరింత మెరుగు పడాల న్నారు. అర్హులైన వారికి కార్పొరేషన్ రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశానికి ఎంపీడీఓ సత్తయ్య, తహసీల్దార్ గౌతంకుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. -
కడప కమిషనర్‌పై టీడీపీ నాయకుల దౌర్జన్యం
వైఎస్సార్ జిల్లా: కడపలో ప్రభుత్వ అధికారులపై టీడీపీ నాయకులు వీరంగం సృష్టించారు. కడప మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళేశ్వర్రెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ మల్లికార్జునపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. టీడీపీ నాయకులు లక్ష్మిరెడ్డి, మోహన్‌రెడ్డి సోమవారం కమిషనర్ ఛాంబర్‌కు వెళ్లి... కమిషనర్, ఎస్ఈలను అసభ్య పదజాలంతో దూషించారు. అనంతరం ఎస్ఈని కొట్టేందుకు ప్రయత్నించబోగా అక్కడున్న వారు అడ్డుకున్నారు. తమకు కాంట్రాక్టులు కేటాయించడం లేదంటూ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై టీడీపీ నాయకులు ప్రవర్తించిన తీరుతో అందరూ విస్తుపోయారు. -
దేశం మార్కు బ(ది)లీ !
మాట వినకుంటే బదిలీ. క్లర్క్ అయినా కమిషనర్ అయినా ఒకటే. తమ అడుగులకు మడుగులొత్తే వారైతే చాలు. ముక్కు సూటిగా పనిచేస్తూ గుంటూరు నగరాభివృద్ధి కోసం కృషి చేసే కమిషనర్లంటే కంటగింపు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులపై టీడీపీకి చెందిన ఓ ఎంపీ కన్నెర్ర చేస్తూ రాజ‘కీ’య బదిలీలకు తెరతీస్తున్నారు. ఏడాదిలో గుంటూరు కార్పొరేషన్‌కు ఐదుగురు కమిషనర్లు తొమ్మిది నెలల వ్యవధిలో కన్నబాబు, అనురాధలకు స్థానచలనం ముక్కుసూటిగా పనిచేసే ఉన్నతాధికారులపై అధికారపార్టీ కన్నెర్ర ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సీఎం వద్ద చక్రం తిప్పిన ఓ ఎంపీ..! కమిషనర్ మార్పుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ మాజీ కార్పొరేటర్లు ముఖ్యమంత్రి వద్ద తేల్చుకునేందుకు సిద్ధమైన ఓ మంత్రి, ఎమ్మెల్యే గుంటూరు : రాజధాని నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థకు అధిక ప్రాధాన్యం వచ్చింది. దీంతో నగర కమిషనర్‌గా సమర్థంగా పనిచేసే వారిని నియమించాలని మొదట్లో ప్రభుత్వం భావించినప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం అడ్డుతగులుతూనే ఉన్నారు. ఇంత పెద్ద నగరాన్ని అభివృద్ధి చేయాలంటే సమర్థుడైన అధికారి కావాలనే ఉద్దేశంతో మొదట విశాఖపట్నం జేసీగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ను నియమించారు. అయితే ఇక్కడకు వచ్చేందుకు ఆయన ఆసక్తి కనబరచలేదు. దీంతో కమిషనర్‌గా ఉన్న నాగవేణిని 2014 డిసెంబర్ 13వ తేదీన బదిలీ చేసి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న శ్రీధర్‌కు ఫుల్ అడిషనల్చార్జి (ఎఫ్ఏసీ) ఇచ్చి ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆయన నలభై రోజులపాటు పనిచేసిన అనంతరం ఈ ఏడాది జనవరి 22న కర్నూలు జేసీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కన్నబాబును నూతన కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన సమర్థంగా పనిచేస్తూ, నగరాభివృద్ధిపై తనదైన ముద్ర వేసుకుంటున్న తరుణంలో ఐదు నెలలకే అంటే జూలై 8న ఎంఏయూడీ డెరైక్టర్‌గా బదిలీ చేశారు. నగర కమిషనర్‌గా మునిసిపల్ రీజినల్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న చల్లా అనురాధను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. అనురాధ సైతం ఈ నాలుగు నెలల కాలంలో పలు అభివృద్ధి పనులు చేయడంతోపాటు, నగరపాలక సంస్థలో అవినీతి, అసమర్థ అధికారులపై ఉక్కుపాదం మోపారు. ముక్కుసూటిగా పనిచేస్తూ అందరి మన్ననలూ పొందగలిగారు. అయితే అధికారపార్టీ ప్రజాప్రతినిధుల మాట వినకపోవడం వారికి కంటగింపుగా మారింది.దీంతో కమిషనర్‌ను బదిలీ చేయించేందుకు టీడీపీ ఎంపీ కొద్ది రోజులుగా సీఎం పేషీలో పావులు కదిపినట్టు సమాచారం. ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకుని నిజాయతీని నమ్ముకున్న అధికారుల కంటే తామే గొప్పని నిరూపించగలిగారు. సొంతపార్టీ నుంచి వ్యతిరేకత ... కమిషనర్ బదిలీ వ్యవహారం అధికార పార్టీలో అగ్గి రాజేసింది. నగరపాలక సంస్థ వ్యవహారాలు చూస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేకు కూడా తెలియకుండా ఈ బదిలీ జరగడంతో మంత్రి తో కలిసి సీఎం వద్ద తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఐదునెలలు కూడా గడవక ముందే కమిషనర్‌ను మార్చడంపై అధికారపార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. నగరంపై పట్టు సాధిస్తున్న సమయంలో వారిని మార్చడం వల్ల అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయనేది వారి వాదన. నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఇలాగైతే తాము ఏ మొహం పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాలంటూ వారు ప్రశ్నించినట్లు సమాచారం. ఎక్కడి నుంచో వచ్చిన వారికి ఈ నగరాభివృద్ధిపై ఎందుకు శ్రద్ధ ఉంటుందంటూ సదరు ఎంపీని ఉద్దేశించి కొందరు మండిపడినట్లు తెలిసింది. మరోవైపు సమర్థత గల కమిషనర్లను బదిలీ చేయడం పట్ల నగర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తపవుతోంది. -
వీరపాండియన్ వచ్చేశారు
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ గురువారం నగరానికి చేరుకున్నారు. గత నెల 28న సెలవుపై సొంత ఊరు మధురై వెళ్లారు. ఈ నెల 8 వరకు సెలవు పెట్టిన ఆయన సెలవును రద్దుచేసుకుని వచ్చి విధుల్లో చేరారు. కమిషనర్ సెలవు కార్పొరేషన్‌లోని ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపిన విషయం విదితమే. -
గుమాస్తానగర్‌లో శివలింగం ప్రత్యక్షం!
రోడ్డు పనులను అడ్డుకోవడానికే: మున్సిపల్ కమిషనర్ తాండూరు: పట్టణంలోని గుమాస్తానగర్ (29వ వార్డు)లో రాత్రికి రాత్రే శివలింగం ప్రత్యక్షమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గుమాస్తానగర్‌లోని శివాలయానికి సుమారు పది అడుగుల దూరంలోని రోడ్డు వద్ద ఆకస్మాత్తుగా శివలింగం ప్రత్యక్షమైంది. సంఘటనా స్థలాన్ని అర్బన్ ఎస్ఐ నాగార్జున సందర్శించి వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా.. మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఈనెల 28వ తేదీన మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులు చేపట్టామన్నారు. ఈ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. అయితే రోడ్డు పనులను అడ్డుకోవడానికే గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు వద్ద శివలింగాన్ని ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు అర్బన్ సీఐ వెంకట్రామయ్యకు ఫిర్యాదు చేశామని, ఈ ఘటనపై విచారణ జరపాలని కోరినట్లు కమిషనర్ వివరించారు. అయితే శివాలయానికి చెందిన స్థలంలో మున్సిపల్ అధికారులు రోడ్డు పనులు చేపట్టడంపై ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
సెలవుపై కలకలం
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ ఆకస్మికంగా సెలవుపై వెళ్లారు. అక్టోబర్ 8 వరకు ఆయన సెలవు పెట్టారని సమాచారం. బదిలీలో భాగంగానే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. చీఫ్ సెక్రటరీ ఆదివారం రాత్రి ఫోన్ చేసి సెలవు పెట్టాల్సిందిగా ఆదేశించారని, అందులో భాగమే ఈ ఆకస్మిక పరిణామమని ప్రచారం జరుగుతోంది. జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడుకు ఆయన స్థానంలో ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు నగరపాలక సంస్థకు చేరుకున్న ఆయన వివిధ శాఖాధిపతులతో సాయంత్రం ఆరు గంటల వరకు సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రతి సెక్షన్ కలియతిరిగారు. శాఖల వారీగా అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే వీరపాండి యన్ తిరిగి వచ్చే అవకాశం లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. విసిగి‘పోయారు’... గత కొద్ది రోజులుగా కమిషనర్ జి.వీరపాండియన్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కింది సిబ్బందిని గాడిలో పెట్టడం కత్తిమీద సాములా తయారైంది. వివిధ విభాగాల్లో పాతుకుపోయిన అవినీతి అనకొండలు పెద్ద సవాల్‌గా తయారయ్యాయి. రాజధాని నేపథ్యంలో నగర సుందరీకరణ, రోడ్ల విస్తరణ, కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం తదితర అభివృద్ధి పనులతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో కమిషనర్ వీరపాండియన్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు భోగట్టా. దీంతో విసుగుచెందిన ఆయన సాధ్యమైనంత త్వరలో ఇక్కడ నుంచి బదిలీపై వెళ్లిపోవాలనే ఆలోచనకు వచ్చినట్లు ప్రచారం సాగింది. ఆకస్మికంగా సెలవుపై వెళ్లడం బదిలీ ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది. సొంత పనులపై కమిషనర్ స్వగ్రామమైన మధురై వెళ్లారని, తిరిగి వస్తారని పేషీ వర్గాలు చెబుతున్నాయి. -
ప్చ్..!
టీడీపీ గ్రూపు రాజకీయాలతో తలనొప్పి సీఎం క్లాస్‌తో మున్సిపల్ కమిషనర్ మనస్తాపం బదిలీపై వెళ్లే యోచన విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో అసంతృప్తి సెగలు బుసలు కొడుతున్నాయి. ‘మీరు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. హుషారుగా పనిచేయించాలి, అభివృద్ధి పరవళ్లు తొక్కాలి. ఇక్కడ అలాంటి వాతావరణం కనిపించడం లేదు.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్‌కు క్లాస్ తీశారు. కమిషనర్ పనితీరు బాగోలేదని టీడీపీ ప్రజాప్రతినిధులు ఫిర్యాదుచేసిన మేరకే సీఎం ఇలా మాట్లాడారనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలతో కమిషనర్ వీరపాండియన్ మనస్తాపానికి గురైనట్లు సమాచారం. సాధ్యమైనంత త్వరలో ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోవాలనే యోచనలో ఉన్నారనిప్రచారం సాగుతోంది. బలవుతున్న అధికారులు టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య కుమ్ములాటతో అధికారులు నలిగి పోతున్నారు. మేయర్ కోనేరు శ్రీధర్, టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నగరపాలక సంస్థపై పట్టుకోసం పంతాలకు పోతున్నారు. దీంతో ఎవరు చెబితే పనిచేయాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం.. చందంగా పరిస్థితి తయారవ్వడంతో కమిషనర్ ఆచీతూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్తగా ఏర్పాటుచేసిన ఈ-ఆఫీస్‌పై ఉద్యోగుల్లో పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో కొంత ఇబ్బందిగా మారింది. సీఎం, ప్రిన్సిపల్ సెక్రటరీల సమీక్షలు, రాజధాని నేపథ్యంలో విదేశీ పర్యటనలతో కాలం గిర్రున తిరుగుతోంది. కమిషనర్ కుర్చీలో కూర్చుని పనిచేసేందుకు తీరిక దొరకని పరిస్థితి ఏర్పడింది. సి‘ఫార్సులు’ ఎన్టీఆర్ పార్కింగ్ సెల్లార్ లీజు బకాయిల విషయంలో కమిషనర్ తీవ్రంగా స్పందించారు. రూ.45 లక్షలకు గానూ రూ.16 లక్షలు మాత్రమే చెల్లించిన ఓ టీడీపీ నేత బినామీ పేరుతో సెల్లార్‌ను లీజుకు తీసుకున్నారు. ఇచ్చిన ఏడు చెక్కులు బౌన్స్ కావడంతో పార్కింగ్ సెల్లార్‌ను స్వాధీనం చేసుకుని ఎస్టేట్స్ అధికారులు క్రిమినల్ కేసు పెట్టారు. తిరిగి సెల్లార్‌ను అప్పగించాల్సిందిగా ఓ టీడీపీ ఎమ్మెల్యే చేసిన సిఫార్సుల్ని కమిషనర్ పక్కన పడేశారు. దీంతో అలిగిన ఎమ్మెల్యే జిల్లా ఇన్చార్జి మంత్రికి కమిషనర్ బాగా పనిచేయడం లేదంటూ ఫిర్యాదు చేశారు. నగరంలోని 17 పుష్కర మరుగుదొడ్లను రూ.10.33 లక్షలకు లీజుకు ఇచ్చేందుకు స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. నగరంలోని ఓ టీడీపీ ఎమ్మెల్యే ఒత్తిడి మేరకే స్టాండింగ్ కమిటీ అంత తక్కువ మొత్తానికి లీజు ఖరారు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఫైల్‌పై కమిషనర్ సంతకం చేయకుండా పక్కన పెట్టారు. స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపినా లీజును ఎందుకు ఆమోదించ లేదంటూ టీడీపీ పాలకులు ఒత్తిళ్లకు దిగుతున్నట్లు భోగట్టా. టీడీపీలోని అంతర్గత కలహాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మేయర్ ఎవరికివారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలు నేరుగా కమిషనర్‌కు ఫోన్‌చేసి ఫలానా పనులు చేయాలంటూ సూచిస్తున్నారు. మేయర్ ప్రతిపాదనలను పక్కన పెట్టి ఎమ్మెల్యేలు చెప్పిన పనులు చేయాల్సి రావడంతో కమిషనర్ ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. -
టౌన్‌ప్లానింగ్‌కు బ్యాండ్ బాజా!
- సెల్టవర్ల ముసుగులో అవినీతి బిజినెస్ - ‘చక్రం’తిప్పిన అధికారి - మున్సిపల్ కమిషనర్‌కు మరో మస్కా - ఏసీబీ తనిఖీలతో టెన్షన్ విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో బదిలీ అయిన అధికారులకు బాండ్ల ‘బ్యాండ్’ పడింది. బాండ్ల జారీలో జరిగిన కిరికిరిపై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)కి స్పష్టమైన ఫిర్యాదులు అందడంతో వారు రంగంలోకి దిగారు. ఈ పరిణామాలతో టౌన్‌ప్లానింగ్ విభాగంలో గతంలో పనిచేసి బదిలీ అయిన ముఖ్య అధికారి లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. అవినీతి డొంక కదిలింది.. ట్రాన్స్‌ఫర్‌బుల్ డెవలప్మెంట్ బాండ్స్ ఇప్పిస్తామంటూ భారీగా కలెక్షన్లు చేశారు. సెల్టవర్ల ఏర్పాటుకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. కమిషనర్‌కు మస్కా కొట్టి ఫైల్‌పై సంతకాలు చేయించారు. టీడీఆర్ బాండ్ల పేరుతో టౌన్‌ప్లానింగ్, సర్వే విభాగాల్లోని ముగ్గురు అధికారులు మెగా బిజినెస్ చేసినట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి. టౌన్‌ప్లానింగ్‌లోని అధికారులు ఇద్దరు బదిలీ అవుతున్న సందర్భంగా బాండ్లు ఇస్తామంటూ స్థల యజమానుల నుంచి భారీగానే వసూళ్లకు పాల్పడ్డారు. వీరి మాయలోపడి లక్షలు సమర్పించుకున్న స్థల యజమానులు న్యాయం చేయాలంటూ మేయర్ కోనేరు శ్రీధర్‌ను ఆశ్రయించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. రోడ్ల విస్తరణ, నగరపాలక సంస్థ అవసరాల దృష్ట్యా ప్రైవేటు స్థలాలను సేకరిస్తే ఆస్థానే నష్టపరిహారంగా ట్రాన్స్‌ఫర్‌బుల్ డెవలప్మెంట్ బాండ్లను టౌన్‌ప్లానింగ్ విభాగం జారీ చేస్తుంది. ఇందులో భారీగా అవినీతి జరిగిందనే విమర్శలు ఉన్నాయి. అర్హులకు బాండ్లు జారీ చేయకుండా, అడ్డదారిలో అనర్హులకు కట్టబెట్టారని తెలుస్తోంది. బదిలీ అయిన ముఖ్య అధికారి, టీపీఎస్ సర్వం తామై వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. బాండ్ల జారీపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిగితే అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది. చక్రం తిప్పారు సెల్టవర్ల ఏర్పాటులో ‘చక్రం’తిప్పిన అధికారి కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 11 సెల్టవర్ల ఏర్పాటుకు అడ్డగోలుగా అనుమతులిచ్చారు. నగరపాలక సంస్థకు చెందిన వాటర్ ట్యాంకు స్థలాల్లో సెల్ టవర్ల ఏర్పాటుకు నెలకు రూ.2,300 అద్దె చెల్లిస్తే చాలంటూ ఆర్డరు ఇచ్చేశారు. నిబంధనల ప్రకారం అసిస్టెంట్ సిటీప్లానర్ (ఏసీపీ) సంతకం ఉండాల్సి ఉన్నప్పటికీ తోసిపుచ్చారు. కమిషనర్‌తో గప్‌చుప్‌గా సంతకం చేయించారు. ప్రైవేటు స్థలంలో కనీసం రూ.10వేల చొప్పున సెల్ టవర్ కంపెనీలు అద్దె చెల్లిస్తున్నాయి. ఈ విషయం మేయర్ చెవిన పడటంతో విచారణ చేపట్టాల్సిందిగా కమిషనర్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో కమిషనర్ పాత ఫైల్‌ను తెప్పించి పరిశీలించారు. ఇప్పుడేం చేయాలనే దానిపై కమిషనర్ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. టెన్షన్ టెన్షన్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో 2013 నుంచి పనిచేసిన అధికారులు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల జాబితాను ఏసీబీ అధికారులు సేకరించారు. ఇటీవల విడతలవారీగా జరిగిన బదిలీల్లో 95 శాతం మంది బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, టీపీఎస్‌లు బదిలీ అయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో ప్రస్తుతం వారు విధులు నిర్వర్తిస్తున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించినట్లు పత్రికల ద్వారా సమాచారం తెలుసుకున్న వీరిలో కొందరు కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. టౌన్‌ప్లానింగ్‌లో ఏం జరిగిందనే దానిపై ఆరా తీసే పనిలో వారంతా నిమగ్నమయ్యారు. మొత్తంమీద ఏసీబీ తనిఖీలు టౌన్‌ప్లానింగ్‌లో టెన్షన్ పుట్టించాయి. -
మహిళల పట్ల కమిషనర్ అసభ్య ప్రవర్తన
బద్వేలు అర్బన్: వైఎస్ఆర్ జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడంటూ మున్సిపల్ కమిషనర్ శంకరరావుపై శుక్రవారం యూనియన్ నేతలు దాడికి యత్నించారు. చాంబర్లో ఉన్న ఆయన్ను బలవంతంగా బయటకు లాక్కొచ్చి వెళ్లిపోవాల్సిందిగా ఆందోళన నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. బద్వేలు మున్సిపల్ కమిషనర్‌గా ఎ.శంకరరావు జూన్30న బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో ముగ్గురు కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులు అటెండర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తమను కమిషనర్ వేధిస్తున్నారని వారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ), సీపీఐ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వారు యూనియన్, సీపీఐ నేతలతో కలిసి వచ్చి కమిషనర్‌తో గొడవకు దిగారు. ఉద్యోగుల పట్ల ప్రవర్తించే తీరు సరిగా లేదని నేతలు కమిషనర్‌ను చాంబర్ నుంచి బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. ఆయనతో తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేస్తూ దాడికి యత్నించారు. ఇంతలో అక్కడికి చేరుకున్న చైర్మన్ సోమేసుల పార్థసారథి, పలువురు కౌన్సిలర్లు యూనియన్ నేతలను మందలించి కమిషనర్‌ను లోపలికి తీసుకెళ్లారు. కొద్ది రోజులు సెలవుపై వెళ్లాల్సిందిగా మున్సిపల్ చైర్మన్.. కమిషనర్‌కు సూచించారు. కాగా, సక్రమంగా విధులు నిర్వర్తించమన్నందుకే తనపై నిందలు వేస్తున్నారని కమిషనర్ శంకరరావు పేర్కొన్నారు. కార్యాలయంలో ఒకరు ఉండి.. మిగతా ఇద్దరు పారిశుద్ధ్య పనులకు వెళ్లాలని చెప్పడం వల్లే ఇలా గొడవ చేస్తున్నారన్నారు. ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయక పోవడంతో కేసు నమోదు కాలేదు. -
మున్సిపల్ కమిషనర్‌పై ఉద్యోగుల దాడి
బద్వేలు : వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణ మునిసిపల్ కమిషనర్‌పై మహిళా ఉద్యోగులు శుక్రవారం దాడి చేశారు. మునిసిపల్ కమిషనర్ ఎ.శంకరరావు కొంత కాలంగా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా ప్రవరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సీపీఐ నాయకులతో కలసి ఉద్యోగినులు కమిషనర్‌ను ఆయన చాంబర్ నుంచి బయటకు లాక్కొచ్చి దేహశుద్ధి చేశారు. కాగా, సెలవుపై వెళ్లిపోవాలని కమిషనర్‌ను పురపాలక సంఘం చైర్మన్ పార్థసారధి కోరారు. -
నేనింతే
‘తప్పుచేస్తే దండన ఉంటుందనే భయం ఉండాలి. అందుకే యాక్షన్‌లోకి దిగా. వారం రోజుల వ్యవధిలో ఆరుగురు ఉద్యోగుల్ని సస్పెండ్ చేశా. పనిచేయని అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చా. ఇదంతా మార్పు కోసమే. అధికారుల్లో స్పీడ్ పెరగాలి. నా స్పీడ్ ఇలాగే ఉంటుంది. నగరపాలక సంస్థను గాడిలో పెట్టే వరకు ఇక్కడే ఉంటా..’ అంటూ మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ తన మనో గతాన్ని వెల్లడించారు. నగర పాలనపై పట్టుబిగించిన ఆయన బాధ్యతలు చేపట్టి మంగళవారానికి అర్ధసంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు.. - విజయవాడ సెంట్రల్ - తప్పుచేస్తే సస్పెండ్ అవుతామనే భయం ఉండాలి - కార్పొరేషన్ గాడిలో పడే వరకూ ఇక్కడే ఉంటా.. - త్వరలో మళ్లీ సమగ్ర సర్వే - ‘సాక్షి’తో మునిసిపల్ కమిషనర్ వీరపాండియన్ - పాలనలో అర్ధ సంవత్సరం పూర్తి సాక్షి : ఇటీవలి కాలంలో స్పీడ్ పెంచినట్టున్నారు. ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? కమిషనర్ : నేనెప్పుడూ ఇంతే. వచ్చిన కొత్తలో పరిస్థితుల్ని అవగాహన చేసుకున్నా. తప్పులు చేయొద్దని హెచ్చరించా. కొందరు ఉద్యోగుల్లో మార్పు రాలేదు. అందుకే యాక్షన్‌లోకి దిగా. తప్పు చేస్తే సస్పెండ్ అవుతామనే భయం ఉండాలి. అప్పుడే పరిస్థితులు చక్కబడతాయి. సాక్షి : విభాగాధిపతుల నుంచి సహకారం ఎలా ఉంది. మీకు స్పీడ్ ఎక్కువైందన్న కామెంట్స్ వస్తున్నాయి? కమిషనర్ : వాళ్ల సహకారం బాగుంది. కొందరు అధికారులు స్లోగా ఉన్నారు. అలా ఉంటే పాలన సాగదు. స్పీడ్‌గా పనిచేయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు. సాక్షి : బదిలీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది? కమిషనర్ : అలాంటి ఆలోచనలేమీ లేదు. నగరపాలక సంస్థను గాడిలో పెట్టే వరకు ఇక్కడే ఉంటా. ఒక్కరోజు సెలవు పెట్టాలన్నా మనసు ఒప్పడం లేదు. ఉన్నతస్థాయి కాన్ఫరెన్స్‌లు అవైడ్ చేస్తున్నా. రోజూ భోజనం చేసే సరికి సాయంత్రం 4 అవుతోంది. దృష్టాంతా పాలనపైనే. సాక్షి : బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) కొంచెం స్లోగా నడుస్తున్నట్టుంది? కమిషనర్ : ఇప్పుడే వేగం పెరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ స్థాయికి చేరుకున్నాం. 529 దరఖాస్తులు అందాయి. మరో 5,400 లెసైన్స్డ్ సర్వేయర్ల దగ్గర ఉన్నాయి. 21,100 దరఖాస్తులు బీపీఎస్ ద్వారా రావాలన్నది లక్ష్యం. తద్వారా వంద కోట్ల ఆదాయం వస్తోంది. సాక్షి : సమగ్ర సర్వే మధ్యేలోనే ఆపేశారే? కమిషనర్ : మళ్లీ ప్రారంభిస్తాం. సర్కిల్-3లో 90 శాతం, సర్కిల్-2లో 20 శాతం పూర్తయింది. రూ.8కోట్ల ఆదాయం పెరిగింది. ఇతరత్రా పనిఒత్తిళ్లు పెరగడంతో సర్వేకు బ్రేక్ ఇచ్చాం. త్వరలోనే తిరిగి మొదలుపెడతాం. సాక్షి : మొండి బకాయిల వసూళ్ల వ్యవహారం ఎంతవరకు వచ్చింది? కమిషనర్ : చర్చలు సాగిస్తున్నాం. 90 శాతం మేర బకాయిలు చెల్లిస్తే పదిశాతం రాయితీ ఇస్తామంటున్నాం. ఐవీ ప్యాలెస్ చర్చలు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వస్త్రలత బకాయిలు రూ.11 కోట్లు ఉండగా, రూ.4 కోట్లు మాత్రమే చెల్లిస్తామంటున్నారు. వడ్డీని పూర్తిగా మాఫీ చేయడం కుదరదు. కాబట్టి ఆ ప్రతిపాదనను తిరస్కరించం. సాక్షి : కీలక విభాగాలకు సంబంధించి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కమిషనర్ : యూసీడీ పీవో, ఎస్టేట్స్, ప్రాజెక్ట్స్, రెవెన్యూ వంటి 12 పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇటీవలే లేఖ రాశా. డెప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు కనీసం ముగ్గురు కావాల్సి ఉందని అందులో పేర్కొన్నా. ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. సాక్షి : గుణదల ప్లాట్ల వ్యవహారం ఎంతవరకు వచ్చింది? కమిషనర్ : ఉద్యోగులకే కేటాయిస్తాం. అయితే, ఉన్న ప్లాట్ల కంటే పదింతల దరఖాస్తులు వచ్చాయి. ఎలాంటి వివాదం తలెత్తకుండా ప్లాట్లు విక్రయించాలి. ఆ బాధ్యతను చీఫ్ ఇంజినీర్‌కు అప్పగించా. సాక్షి : భవిష్యత్ ప్రణాళికలు కమిషనర్ : ప్రతి సర్కిల్‌కు రెండు చొప్పున హ్యాపీ స్ట్రీట్లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశాం. సర్కిల్-3లో గురునానక్ రోడ్డులో శ్రీకారం చుట్టాం. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై సర్వే చేస్తున్నాం. నగరంలో ఎల్ఈడీ బల్బుల్ని ఏర్పాటు చేస్తున్నాం. మరో నెలన్నరలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. -
వసతుల కల్పనకు కృషి
తణుకు : తణుకు పట్టణంలోని అజ్జరం రోడ్డులోని ఇందిరమ్మ కాలనీ వాసులు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారు. వారి అవస్థలను తెలుసుకునేందుకు మునిసిపల్ ఇన్చార్జి కమిషనర్ పి.శ్రీకాంత్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. కాలనీలోని వీధుల్లో తిరుగుతూ స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ : ఇక్కడ ఇబ్బందులైమైనా ఉన్నాయా. వెంకటరమణ: మంచినీటి సమస్య ఉంది సార్. బోరు వేసినప్పటికీ ఈ నీళ్లు తాగేందుకు పనికి రావడం లేదు. నాలుగు కిలోమీటర్లు వెళ్లి నీళ్లు కొనుక్కుని తెచ్చుకుంటున్నాం. కమిషనర్ : గోదావరి జలాలను తరలించే క్రమంలో పైప్లైన్ల విస్తరణకు రూ.2 కోట్లు కేటాయించాం. పట్టణానికి ఈ ప్రాంతం చాలాదూరంగా ఉండటంతో విస్తరణకు కొన్నాళ్లు సమయం పడుతుంది. వెంకటరమణ : ఇక్కడ దాదాపు 600 కుటుంబాల వారుంటున్నారు. రేషన్ డిపో ఇక్కడ ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నాం. కమిషనర్ : ఈ విషయం ఎమ్మెల్యే దృష్టిలో ఉంది. త్వరలోనే పరిష్కారం లభిస్తుంది. అక్కడి నుంచి మరో వీధిలోకి వెళ్లిన కమిషనర్ రమేష్ అనే వ్యక్తితో మాట్లాడారు. రమేష్ : కరెంటు సమస్య ఉంది సార్. సామర్థ్యానికి సరిపడా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రి సమయాల్లో లైట్లు కాలిపోతున్నాయి. కమిషనర్ : రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసికెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను. దుర్గాప్రసాద్ : బైపాస్ రోడ్డు నుంచి కాలనీ వరకు వీధి దీపాలు లేవు. రాత్రి సమయాల్లో రావడానికి భయపడుతున్నాం. కమిషనర్ : విద్యుత్ దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. అన్నపూర్ణ : ఇటీవల దోమల ఉధృతి పెరిగిపోవడంతో చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కమిషనర్ : దోమల నివారణకు తక్షణమే చర్యలు తీసుకుంటాను. రూ. 2 కోట్లతో పైప్‌లైన్ విస్తరణ ఇందిరమ్మ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక చేపట్టాం. ప్రధానంగా తాగునీటి సమస్యను అధిగమించడానికి చర్యలు తీసుకుంటాం. గోదావరి జ లాలు సరఫరా చేసేందుకు పైపులైన్ల విస్తరణకు రూ.2 కోట్లు కేటాయించాం. ఇందులో భాగంగా ఇంది రమ్మ కాలనీకి గోదావరి జలాలు తరలించడానికి ప్రణాళికలు చేస్తున్నాం. దూరం అయినప్పటికీ ఇక్కడకు కూడా పైపులైన్లు విస్తరించి గోదావరి జలాలు అందిస్తాం. కాలనీలో రూ.28 లక్షలతో బీటీ రోడ్లు నిర్మాణం చేయడానికి ప్రతిపాదనలు చేశాం. ప్రస్తుతం రూ.10 లక్షలు వెచ్చించి గ్రావెల్‌తో మెరక చేయిస్తున్నాం. - పి.శ్రీకాంత్, ఇన్చార్జి కమిషనర్, తణుకు -
కలెక్టర్‌కు చెప్పినా వినిపించుకోలేదు
-ఎమ్మెల్యే రోజా నగరి : నగరి మున్సిపల్ కమిషనర్ బాలాజీనాథ్ యాదవ్ వల్ల అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని, తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారని, జిల్లా కలెక్టర్‌కు చెప్పినా వినిపించుకోలేదని నగరి ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ క మిషనర్ వల్లే నగరి మున్సిపాలిటీలోని 27వ వార్డు ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత పదేళ్లలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని, తాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కాల్సిన దుస్థితి కమిషనర్ వల్లే వచ్చిందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు తన కనుసైగలో పని చేసే కమిషనర్‌ను ఉద్ధేశపూర్వకంగా నియమించుకుని నగరి ప్రజలను ఇబ్బంది పాలుచేస్తున్నారని విమర్శించారు. కమిషనర్ బాధ్యతలు చేపట్టి 5 నెలలైనా ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదన్నారు. టీడీపీ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్న వ్యక్తిని కమిషనర్‌గా నియమిస్తే ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మదనపల్లెలో క మిషనర్‌ను సరండ్ చేసినట్లు నగరి కమిషనర్‌ను ఎందుకు సరండ్ చేయలేదని, కలెక్టర్ వెంటనే కమిషనర్‌ను సరండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నగరి మున్సిపల్ అభివృద్ధికి సహకరించే కమిషనర్‌ను నియమించి ప్రజలను న్యాయం చేయాలని కోరారు. -
అంతా టౌన్‌ప్లానింగ్
- లేఅవుట్ రిలీజ్లో పైరవీలు - ప్రిన్సిపల్ సెక్రటరీ సి‘ఫార్సు’లపై చర్చ - నివేదిక కోరిన మున్సిపల్ కమిషనర్ - అధికారుల వైఖరిపై సీరియస్ విజయవాడ సెంట్రల్ : శ్రీకనకదుర్గ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ లేఅవుట్ సెగ కార్పొరేషన్‌లోని టౌన్ప్లానింగ్నూ తాకింది. ఈ విషయంలో కొందరు అధికారుల వైఖరిపై మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ సీరియస్‌గా ఉన్నారు. వివాదాస్పదంగా మారిన ఈ ఫైల్‌పై ఆయన నివేదిక కోరారు. దీనిపై గురువారం రాత్రి 10 గంటల వరకు బంగ్లాలో సిటీప్లానర్ ఎస్.చక్రపాణితో ఆయన చర్చించినట్టు సమాచారం. పెద్దమొత్తంలో ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు భుజాలు తడుముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేఅవుట్ రిలీజ్‌కు సంబంధించి ఎన్జీవో సంఘ మాజీనేత పైస్థాయిలో పైరవీ సాగించారనే బలమైన ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీతో లేఅవుట్ రిలీజ్ చేయమని సి‘ఫార్సు’ ఇచ్చినట్టు తెలిసింది. అసలు ఫైల్ కౌన్సిల్‌కు ఎందుకు వచ్చినట్టు? శ్రీకనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ 1982లో 12.96 ఎకరాల్లో ఇళ్ల ప్లాట్లు వేసి సొసైటీ సభ్యులకు రిజిస్టర్ చేసి ఇచ్చింది. 1994లో సొసైటీ సభ్యులు యూఎల్పీ నంబర్ 3/94పై లేఅవుట్ పొందారు. దీని ప్రకారం నగరపాలక సంస్థకు పదిశాతం ఖాళీ స్థలాన్ని అప్పగించాలి. అయితే, నిబంధనలకు విరుద్ధంగా పదిశాతం స్థలంలో 16.5 సెంట్లు (798 చ.గ.) ఇళ్ల ప్లాట్లుగా విభజించి విక్రయాలు సాగించారు. దీంతో లేఅవుట్ రెగ్యులరైజేషన్‌కు బ్రేక్ పడింది. ఈ తగ్గిన స్థలాన్ని.. ప్లాట్ యజమానులు ఇంటి ప్లాన్‌కు దరఖాస్తు చేసుకున్నప్పుడు నగదు రూపంలో చెల్లించాలని, అలాగే, రోడ్డు ఫార్మెట్ ఖర్చులు, మాస్టర్‌ప్లాన్ ప్రకారం బిల్డింగ్ ప్లాన్ అప్లయ్ చేసినపుడు 40 అడుగుల రోడ్డుకు ఇరువైపులా మూడున్నర అడుగుల వెడల్పు చొప్పున వదిలేస్తే లేఅవుట్ రిలీజ్ చేస్తామని గత జనవరి 17న సొసైటీకి ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఫిబ్రవరి 9న జరిగిన కౌన్సిల్లో ఈ అంశం ప్రస్తావనకు రాలేదు. ఈనెల 7న జరిగిన కౌన్సిల్లో ఆఖరి క్షణంలో ప్రత్యక్షమై పాలక, ప్రతిపక్ష సభ్యుల్ని గందరగోళానికి గురిచేసింది. నగరంలో మిగిలిన లేఅవుట్లకు ఇవ్వని వెసులుబాటు ఈ సొసైటీకి ఎందుకు ఇచ్చారన్నది ప్రశ్న. పదిశాతం స్థలం తగ్గితే లేఅవుట్ అంశం కౌన్సిల్‌కు వచ్చిన సందర్భం లేదని సీనియర్ రాజకీయవేత్తలు చెబుతున్నారు. దీంతో టౌన్‌ప్లానింగ్ అధికారుల పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. నేడు వైఎస్సార్ సీపీ స్థల పరిశీలన సొసైటీ భూములను పరిశీలించి వాస్తవాలు తేల్చాలని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు నిర్ణయించారు. ఆ పార్టీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు నగరంలోని శ్రీకనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ స్థలాన్ని పరిశీలించనున్నారు. కౌన్సిల్లో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే అదనపు కమిషనర్‌కు వారు వినతిపత్రం సమర్పించారు. ఏ విచారణకైనా సిద్ధం లేఅవుట్ రిలీజ్ వ్యవహారంలో అవకతవకలు జరగలేదని శ్రీకనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షుడు బి.నారాయణరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అంశాలను పూర్తిచేసి కాలనీని అభివృద్ధి చేశామన్నారు. రూ.20 కోట్ల విలువైన స్థలాన్ని నగరపాలక సంస్థకు అప్పగించామని చెప్పారు. తాము ఎవరికీ ముడుపులు ఇవ్వలేదని, దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నార -
కొట్టుకున్నారంట..!
కోదాడటౌన్: కోదాడ మున్సిపాలిటీ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి.. ఓ కౌన్సిలర్‌కు మధ్య అగ్గిరాజుకుంది. ఏమైం దో తెలియదు కానీ.. తనపై కౌన్సిలర్ దాడిచేశాడని డీఈ పోలీసులకు ఫిర్యా దు చేయగా.. కాదు. కాదు డీఈనే తనపై దాడి చేశాడని కౌన్సిలర్ అంటున్నారు.. ఈ సంఘటన జరిగిన సమయంలో మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్ ఇద్దరు అందుబాటులో లేకపోవడంతో సమస్య పోలీస్‌స్టేషన్‌కు చేరిం ది. వివరాలు.. కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో ఇటీవల రూ.లక్షతో డ్రెయినేజీ నిర్మాణ పనుల ను పూర్తి చేశారు. వాస్తవానికి కాంట్రాక్టర్ పనులు చేయాల్సి ఉండగా ఆయ న పేరు మీద అదే వార్డు కౌన్సిలర్ పనులు చేసినట్లు సమాచారం. ఈ క్ర మంలో పనులు పరిశీలించి ఎంబీ రికా ర్డు చేసి బిల్లు చెల్లించాలని కౌన్సిలర్ డీఈని కొంత కాలంగా కోరుతున్నట్లు తెలిసింది. కానీ డ్రెయినేజీ లోపభూయిష్టంగా ఉందని, వార్డుకు చెందిన కొందరు తనకు ఫిర్యాదు చేశారని, దీ నిని సరి చేస్తేనే ఎంబీ చేస్తానని డీఈ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ క్రమంలో కౌన్సిలర్ తనపై దాడి చేసి చొక్కా చింపివేశాడని, అసభ్య పదజాలంతో దూషిం చాడని డీఈపురుష్తోతం అంటున్నారు. ఉద్యోగుల విధుల బహిష్కరణ ప్రభుత్వ ఉద్యోగిపై దాడిచేసిన కౌన్సిలర్ కెఎల్ఎన్ ప్రసాద్‌పై చర్య తీసుకోవాలని డిమాం డ్ చేస్తూ మున్సిపల్ ఉద్యోగులు బుధవారం విధులు బహిష్కరించారు. కార్యాలయం నుంచి నేరుగా పోలీస్‌స్టేషన్ వరకు నడుచుకుంటూ వెళ్లి సదరు కౌన్సిలర్‌పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధ్య త గల ప్రజాప్రతిని ధిగా ఉంటూ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై దాడి చేసిన కౌన్సిలర్‌ను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. విపక్షాల ఖండన విధి నిర్వహణలో ఉన్న మున్సిపల్ డీఈపై కౌన్సిలర్ కెఎల్ఎన్ ప్రసాద్ దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఆర్ఎస్, టీడీపీ, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు పేర్కొన్నారు. దాడి విషయం తెలుసుకున్న వారు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి డీఈని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ బాధ్యత మరచి ప్రవర్తించిన కౌన్సిలర్‌ను ఆ పదవి నుంచి తొలగించడంతో పాటు వెంటనే అరె స్టు చేసి కఠినంగా శిక్షించాలని టీఆర్ఎస్ కౌన్సిలర్లు పారా సీతయ్య, నయీ ం, వీరారెడ్డి, షఫీ టీడీపీ కౌన్సిలర్ దండాల వీరభద్రం, ఎస్కె.ఖాజాగౌడ్, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ తుమ్మలపల్లి భాస్కర్ కోరారు. డీఈనే దాడి చేశాడు: కెఎల్ఎన్ ప్రసాద్, కౌన్సిలర్ డ్రెయినేజీ బిల్లు విషయంలో తాను వివరాలను అడిగేందుకు వెళ్లగా డీఈ ఇబ్బంది పెట్టాడని, ఇదేమిటని అడిగితే తనపై దాడి చేశాడని కౌన్సిలర్ కెఎల్ఎన్ ప్రసాద్ ఆరోపించారు. తాను డీఈపై దాడిచేయలేదన్నారు. -
పనిచేసే చోటు అత్తగారిళ్లు కాదు
మున్సిపల్ శాఖ ఆర్డీ మురళీకృష్ణగౌడ్ కర్నూలు(జిల్లా పరిషత్): రీజియన్ పరిధిలో కొందరు మున్సిపల్ కమిషనర్లు స్థానికంగా నివాసం ఉండటం లేదని, అత్తగారింటికి వచ్చినట్లు విధులకు వస్తున్నారని మున్సిపల్ శాఖ ఆర్డీ మురళీకృష్ణగౌడ్ మండిపడ్డారు. కొందరు కమిషనర్లు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జీపీఎస్ విధానంతో అందరిపై నిఘా ఉంటుందన్నారు. దొరికితే ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. శనివారం ఆయన కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 38 మున్సిపాలిటీల కమిషనర్లు, రెవెన్యూ, హెల్త్, ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా గత ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లపై సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రీజియన్ పరిధిలో ఆస్తి పన్ను 90 శాతం వసూలు చేశామన్నారు. పన్నులు బాగా వసూలు చేసిన మున్సిపాలిటీల్లో టాప్‌టెన్‌లో ఏడు మున్సిపాలిటీలు మనవేనన్నారు. అందులో స్టేట్ ఫస్ట్, స్టేట్ లాస్ట్ కూడా మనదేన్నారు. నగరి 23 శాతం మాత్రమే వసూలు చేసి ఆఖరులో స్థానంలో నిలిచిందన్నారు. 34 మున్సిపాలిటీలు 90 శాతం, 3 మున్సిపాలిటీలు 85 నుంచి 87 శాతం, ఒకటి మాత్రం 23 శాతం వసూలు చేశాయన్నారు. మున్సిపాలిటీల అకౌంట్స్‌కు వార్షిక ఆడిట్ పూర్తయిందన్నారు. అన్ని మున్సిపాలిటీలకు 4జీ ఇంటర్నెట్ కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. నాలుగు జిల్లాల్లో 1.30లక్షలు వ్యక్తిగత మరుగుదొడ్లు, 263 కమ్యూనిటీ మరుగుదొడ్లు మంజూరయ్యాయన్నారు. చికెన్, మటన్‌లను అద్దాల పెట్టెలో ఉంచి అమ్మాలని, ఈ మేరకు కమిషనర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. మాంసం విక్రయ దుకాణానికి తప్పనిసరిగా మున్సిపల్ కమిషనర్ అనుమతి తీసుకోవాలన్నారు. కుక్కలు, పందుల విషయంలో నిర్ణీత పద్ధతిలో చర్యలు తీసుకుంటామన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.212కోట్లలో రూ.68కోట్లు బకాయి ఉండిందని, అది కూడా వచ్చేసిందన్నారు. 2014-15 సంవత్సరానికి అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించానమ్నారు. మున్సిపాలిటీల్లో ఉపాధ్యాయులకు జీపీఎఫ్ అకౌంట్ ప్రారంభించామన్నారు. రీజియన్ పరిధిలో గుర్తింపులేని మురికివాడలను గుర్తిస్తున్నామన్నారు. స్మార్ట్‌వార్డులను కౌన్సిలర్లు దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని చెప్పారు. తాను కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని 41వ వార్డును దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. సమావేశంలో కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, మెప్మా పీడీ రామాంజనేయులు, ఎస్ఈ సుధాకర్‌రావు, అనంతపురం మున్సిపాలిటీ కమిషనర్ నాగవేణి పాల్గొన్నారు. -
‘అధికార’ ఆక్రమణలు
► మిషనర్ ఇంటిని ఆక్రమించుకున్న టీడీపీ నాయకుడు ► అదేబాటలో పలువురు తెలుగు తమ్ముళ్లు ► రాజీవ్‌నగర్‌లో బలవంతుడిదే రాజ్యం శ్రీకాళహస్తి : పట్టణంలోని రాజీవ్‌నగర్‌లో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. మున్సిపల్ కమిషనర్ నిర్మించుకున్న ఇంటిని(పెద్దభవనం) పట్టణంలోని ఒక ప్రధాన నాయకుడి అనుచరుడు ఆక్రమించుకుని అద్దెకు ఇచ్చాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సదరు అధికారి గతంలో శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న సమయంలో రాజీవ్‌నగర్‌లో ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వడమేగాక ప్రభుత్వ నిధులతో రోడ్లు ఏర్పాటు చేశారు. అదే తరుణంలో ఆ అధికారి మూడు పట్టాలు స్వాధీనం చేసుకుని మూడు ఇళ్లు నిర్మించుకున్నారు. రెండు ఇళ్లు బినామీ పేర్లతో, ఒకటి మాత్రం ఆయన పేరుతోనే పెద్ద భవంతి నిర్మించుకున్నారు. ఆయన కమిషనర్‌గా ఉన్నంత కాలం ఎవరూ వాటి జోలికి పోలేదు. బదిలీ అయిన తర్వాత బినామీ పేర్లతో ఉన్న ఇళ్లను ఇద్దరు టీడీపీ నాయకులు ఆరు నెలల క్రితం ఆక్రమించారు. కమిషనర్ పలువురు కాంగ్రెస్ నాయకులకు మొరపెట్టుకున్నా అధికారం టీడీపీ వాళ్లదే కావడంతో ఏమీ చేయలేకపోయారు. తాజాగా ఆయన పేరుతో ఉన్న పెద్ద భవంతిని సైతం టీడీపీ ప్రధాన నాయకుడి అనుచరుడు ఆక్రమించుకుని అద్దెకు ఇచ్చారు. కమిషనర్ అప్పట్లో అక్రమంగా పట్టాలు పొందడమేగాక రోడ్డు ఏర్పాటు చేసే సమయంలో కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లతో ఇళ్లు నిర్మించారనే ఆరోపణలున్నాయి. కమిషనర్ చేసింది తప్పే..అయితే టీడీపీ నాయకులు చేస్తున్నది ఒప్పా అంటూ సామాన్యులు బాహా టంగానే విమర్శలు చేస్తున్నారు. ప్రధాన నాయకులే అలా చేస్తుండడంతో పలువురు తెలుగు తమ్ముళ్లు అదే బాటలో నడుస్తున్నారు. ఈ విషయంలో అవసరమైతే టీడీపీ నాయకుడిపై కేసు పెట్టేపనిలో కమిషనర్ ఉన్నట్లు తెలుస్తోంది. -
మునిసిపల్ కమిషనర్లు కావలెను!
మొత్తం 166 పోస్టుల్లో పనిచేస్తున్నది 48 మందే ⇒ రాష్ట్రంలో మూడొంతులకు పైగా పోస్టులు ఖాళీలే ⇒ 48మంది కమిషనర్లతో సహా పురపాలికల్లో 333 పోస్టుల భర్తీ! ⇒ ప్రభుత్వానికి ప్రతిపాదించిన పురపాలక శాఖ ⇒ టౌన్ ప్లానింగ్‌లో మరో 138 పోస్టులకు ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడొంతులకు పైగా మునిసిపల్ కమిషనర్ పోస్టులు ఖాళీగా వున్నాయి. రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో మొత్తం 166 మంది మునిసిపల్ కమిషనర్లు పనిచేయాల్సి ఉండగా, కేవలం 48 మంది మాత్రమే ఉన్నారు. సరిపడా సంఖ్యలో కమిషనర్లు లేకపోవడంతో ప్రభుత్వం చాలా మునిసిపాలిటీలకు మునిసిపల్ ఇంజనీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేనేజర్లను ఇన్చార్జి కమిషనర్లుగా నియమించింది. సమర్థులైన అధికారులు లేకపోవడంతో చాలా పురపాలికల్లో వ్యవహారాలు గాడితప్పాయి. మునిసిపల్ కమిషనర్ పోస్టులే కాదు.. అకౌంటెంట్లు, బిల్ కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ తదితర కేటగిరీల పోస్టుల్లో సైతం సగానికి పైగా ఖాళీలే వున్నాయి. మునిసిపాలిటీల్లో ఖాళీగా వున్న పోస్టుల్లో తొలి విడత కింద 48 కమిషనర్ పోస్టులతో సహా మొత్తం 333 ఇతర పోస్టులను భర్తీ చేయాలని పురపాలక శాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఇందుకు అనుమతించాలని కోరుతూ ఆర్థిక శాఖకు పురపాలక శాఖ లేఖ రాసింది. ఆ ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. టౌన్ ప్లానింగ్‌లో 138 ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు.. మునిసిపాలిటీల్లో ఖాళీగా వున్న 138 పట్టణ ప్రణాళికా విభాగం ఉద్యోగాల భర్తీకి అనుమతి కోరుతూ డెరైక్టరేట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్(డీటీసీపీ) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అందులో 119 బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పోస్టులుండగా.. మిగిలిన పోస్టులు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, ఆర్కిటెక్చర్ డ్రాఫ్ట్‌మెన్ పోస్టులున్నాయి. డీటీసీపీ నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో వున్నాయి. -
ఏసీబీకి చిక్కిన మానుకోట మున్సిపల్ కమిషనర్ రాజలింగు
♦ రూ.50 వేలు తీసుకుంటూ దొరికాడు ♦ ఇంటి నిర్మాణ అనుమతి కోసం లంచం ♦ ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు ఓంజీ ♦ ఏసీబీ కోర్టుకు కమిషనర్ తరలింపు మున్సిపల్ కమిషనర్ రాజలింగు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. మానుకోటకు చెందిన ఓంజీ తన ఇంటి నిర్మాణం అనుమతి విషయంలో రాజలింగును కలిశాడు.. రూ.1.50 లక్షలు ఇస్తే అనుమతి ఇస్తానని తెలిపాడు. ఓంజీ ఏసీబీ అధికారులను ఆశ్రరుుంచాడు. పక్కా ప్రణాళికతో శుక్రవారం ఏసీబీ అధికారులు ఓంజీ నుంచి రూ.50 వేలు కమిషనర్ డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. మహబూబాబాద్ : ఏసీబీ వలకు పెద్ద చేప చిక్కింది. మానుకోటకు చెందిన ఓ వ్యక్తి వద్ద ఇంటి నిర్మాణ అనుమతి విషయంలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ మునిసిపల్ కమిషనర్ రాజలింగు రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. కొన్నాళ్లుగా ఈయన అవినీతి వ్యవహారంపై పట్టణంలో చర్చ సాగుతున్నప్పటికీ.. ఈ ఘటనతో అతడి బాగోతం బట్టబయలైంది. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. మానుకోటకు చెందిన భూక్య ఓంజీ నాయక్ పట్టణ శివారు కురవి రోడ్డు సర్వే నంబర్ 307/2లో 240 గజాల స్థలంలో 3 గదుల నిర్మాణం చేపట్టాడు. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం రెండేళ్లుగా మునిసిపాలిటీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అరుుతే అధికారులు మాత్రం ఆ స్థలం ఎఫ్టీఎల్లో ఉందని, అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పడంతో ఓంజీ తన వద్ద ఉన్న డాక్యుమెంట్లతో హైకోర్టును ఆశ్రయించాడు. అందుకు హైకోర్టు నుంచి సంబంధిత అధికారులకు నోటీసులు వచ్చాయి. దీంతో మునిసిపల్ కమిషనర్ టి.రాజలింగు, టీపీఓ ఖుర్షిద్ ఒత్తిడి మేరకు అతడు కోర్టులో కేసు విత్‌డ్రా చేసుకున్నాడు. హైకోర్టులో కేసు విత్‌డ్రా చేసుకుంటే ఇంటి నిర్మాణానికి అనుమతిస్తామన్న మునిసిపల్ అధికారుల హామీతోఓంజీ ఆరు నెలల క్రితం ఇంటి నిర్మాణ పనులు చేపట్టాడు. స్లాబ్ వరకు భవనం నిర్మాణం జరిగింది. అరుుతే అధికారులు మాట తప్పి మళ్లీ పనులు నిలిపివేయడంతో అతడు కమిషనర్‌ను కలిశాడు. ఆయన రూ.30 వేలు డిమాండ్ చేయగా, వెంటనే రూ.25 వేలు ఇచ్చాడు. పనులు మొదలు పెట్టిన కొద్దిరోజులకే మళ్లీ అధికారులు వచ్చి ఆపేశారు. అదే రోడ్డులో మరో వ్యక్తి ఇంటి అనుమతి కోసం లక్షా 50 వేలు ఇచ్చాడని, నువ్వు కూడా అంతే ఇవ్వాలని కమిషనర్ డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని చెప్పడంతో రూ.75 వేలు తీసుకొని రమ్మని గురువారం ఓంజీకి చెప్పాడు. గత రెండేళ్లుగా ఇబ్బందులకు గురవుతున్న ఓంజీ విసిగి వేసారి చివరికి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కమిషనర్ చెప్పిన విధంగానే శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు డబ్బులు తీసుకుని కార్యాలయానికి వెళ్లాడు. అప్పుడు జనం ఉండడంతో కమిషనర్ సూచన మేరకు 10 నిమిషాలు ఆగి మళ్లీ వెళ్లాడు. ఒంటరిగా ఉన్న కమిషనర్‌కు డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులను కమిషనర్ తన టేబుల్ డెస్కులో వేసుకోగానే అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ డీఎస్పీ సాయిబాబా, సీఐలు రాఘవేందర్రావు, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, సిబ్బంది ఆ చాంబర్లోకి వెళ్లి ఆ డెస్కులోని డబ్బులను తీసి కమిషనర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కమిషనర్ రాజలింగుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఓంజీ దరఖాస్తు చేసుకున్న పత్రాలు, ఆఫీసులోని ఇతరత్రా రికార్డులను తనిఖీ చేశారు. కార్యాలయంలో తని ఖీలు నిర్వహిస్తున్న సమయంలోనే కమిషనర్ మానుకోటలో అద్దెకు ఉంటున్న ఇంట్లో, ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని ఆయన నివాస గృహంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిసింది. కమిషనర్ దగ్గరి నుంచి రూ.50 వేలు రికవరీ చేశామని, ఆయనను హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సారుుబాబా తెలిపారు. నిజమైన ఆరోపణలు.. కొంతకాలంగా మునిసిపల్ కమిషనర్ టి.రాజలింగుపై సీపీఎం పలు ఆరోపణలు చేస్తోంది. కమిషనర్ అవినీతికి పాల్పడుతున్నాడని, లక్షలాది రూపాయలు గడించాడని విలేకరుల సమావేశంలోనూ వెల్లడించారు. కొంతకాలంగా మునిసిపాలిటి అవినీతిపై జరుగుతున్న ప్రచారానికి నేడు ఏసీబీ దాడుల్లో కమిషనర్ చిక్కడంతో తెరపడినట్లయింది. కాగా రాజలింగు 2014, ఫిబ్రవరిలో మునిసిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. -
ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్
వరంగల్ : వరంగల్ జిల్లా మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ ఏసీబీకి చిక్కారు. ఇంటి నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యక్తి నుంచి శుక్రవారం రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. వివరాలు..మహబూబాబాద్ కు చెందిన ఓంజీ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం అనుమతి ఇవ్వాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు దరఖాస్తు పెట్టుకున్నాడు. అనుమతి కావాలంటే రూ. 50 వేలు లంచం ఇవ్వాలని కమిషనర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం గత ఆరు నెలలుగా సాగుతున్నట్లు సమాచారం. దీంతో విసుగు చెందిన ఓంజీ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం వేసిన ఏసీబీ అధికారులు కమిషనర్ కార్యాలయంలో ఒంజీ నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా రాజలింగ్ నుపట్టుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (మహబూబాబాద్) -
ఇక కొత్త డోర్ నంబర్లు
పెలైట్ ప్రాజెక్టుగా నాలుగు డివిజన్లు ఎంపిక ఎనిమిది డిజిట్లతో నంబర్ల కేటాయింపు కమిషనర్ వీరపాండియన్ ప్రత్యేక దృష్టి విజయవాడ సెంట్రల్ : నగరంలో అడ్డదిడ్డంగా ఉన్న డోర్ నంబర్ల క్రమబద్ధీకరణపై మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ దృష్టి సారిం చారు. స్మార్ట్‌సిటీ నేపథ్యంలో జిప్పర్ కోడ్ విధానంలో కొత్త డోర్ నంబర్లు కేటాయించి ఇంటికి ఒక యూనిక్ ఐడీ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. పెలైట్ ప్రాజెక్ట్ కింద 13, 17, 18, 21 డివిజన్లను ఎంపికచేశారు. క్రమబద్ధీకరణ బాధ్యతను జిప్పర్ కన్సల్టెంట్‌కు అప్పగించారు. శుక్రవారం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించేం దుకు వీలుగా సంస్థ ప్రతినిధులకు అథరైజేషన్‌తో పాటు ఐడీ కార్డులు మంజూరు చేశారు. ఇక ఎనిమిది అంకెలే.. ఇప్పటివరకు ఒకే డోర్ నంబర్ వేర్వేరు గృహాలకు ఉండటంతో తరచూ ఇబ్బందులు ఏర్పడేవి. ఈ విధానానికి చెక్ పెట్టాలన్నది కమిషనర్ ఆలోచన. నాలుగు ఆంగ్ల అక్షరాలు, నాలుగు న్యుమరికల్ నంబర్లు (ఎనిమిది డిజిట్లతో) యూనిక్ ఐడీని కేటాయించి జిప్పర్కోడ్కు అనుసంధానం చేస్తారు. ఇలా రూపొందించిన జిప్పర్ కోడ్‌ను మొబైల్ యాప్‌లో ఎంటర్ చేయగానే, ఆ ఇంటి చిరునామా మ్యాప్‌తో సహా కనిపిస్తుంది. గృహాలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, ఇతర సంస్థల చిరునామాలను ఆన్లైన్లో చిటికెలో కనుక్కోవచ్చు. ఈ సమాచారం ఇవ్వాలి జిప్పర్ కోడ్ విధానంలో పూర్తి సమాచారం కావాలంటే గృహ యజమానులు తమ కరెంట్ మీటర్ సర్వీస్, నీటి కుళాయి కనెక్షన్, గ్యాస్ కనెక్షన్ల నంబర్లు, ఆస్తి, వాణిజ్య పన్నులు, రేషన్, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, ఓటర్ గుర్తింపు కార్డుల వివరాలను జిప్పర్ కన్సల్టెంట్ సిబ్బందికి అందించి సహకరించాల్సిందిగా కమిషనర్ కోరారు. అంతా ఆన్లైనే.. నాలుగేళ్ల కిందట జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో డోర్ నంబర్ల కేటాయింపు ప్రక్రియను నాటి అధికారులు చేపట్టారు. క్యాడ్ఇన్ఫో సంస్థకు ఆ బాధ్యతల్ని అప్పగించారు. మాన్యువల్ విధానంలో డోర్ నంబర్లను కేటాయించారు. నిధులలేమి కారణంగా మధ్యలోనే ఈ ప్రక్రియకు బ్రేక్‌పడింది. స్మార్ట్‌సిటీ నేపథ్యంలో డోర్ నంబర్ల క్రమబద్ధీకరణతో పాటు గృహాలకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఆన్లైన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడతగా ఎంపిక చేసిన నాలుగు డివిజన్లలో ఆశించిన ఫలితం సాధిస్తే నగరం మొత్తం ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. -
మున్సిపాలిటీలలో ప్రతిరోజూ తాగునీరు
కడప కార్పొరేషన్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రతిరోజూ తాగునీరందించేలా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ రీజనల్ డెరైక్టర్ మురళీకృష్ణ గౌడ్ ఆదేశించారు. కడప నగరపాలక సంస్థలోని కమిషనర్ ఛాంబర్లో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలం సమీపించనున్న నేపథ్యంలో తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి ఇప్పటి వరకూ మొదలుకాని పనులను రద్దు చేసి,త్రాగునీటికి ఖర్చు చేయాలని సూచించారు. నీటిఎద్దడి సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకూ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఆస్తిపన్ను వసూలు, ఆధార్ సీడింగ్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపాలిటీల వారీగా తాగునీటికి సంబంధించిన పనులు, సమస్యలపై సమీక్ష చేశారు. కడప కార్పొరేషన్ ఇన్చార్జి ఎస్ఈ మల్లికార్జున రావు మాట్లాడుతూ ఇటీవలే అలగనూరు నుంచి పెన్నానదికి నీరు వదిలారని, రెండురోజుల్లో ఆ నీరు చేరే అవకాశముందన్నారు. పెన్నాలో నీరుంటే బోర్లన్నీ చార్జ్ అవుతాయని చెప్పారు. ప్రొద్దుటూరులో తాగునీటికి సమస్య రాకుండా మైలవరం నుంచి నీరు విడుదల చేయించామని పబ్లిక్ హెల్త్ ఈఈ నగేష్‌బాబు తెలిపారు. రాజంపేటలో తాగునీటి సమస్య లేదని కమిషనర్ ఫజులుల్లా చెప్పారు. రాయచోటిలో విద్యుత్ సమస్య ఉందని, కొన్ని చోట్ల పైపులైన్లకు ఇంటర్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని, కొత్తగా పైపులైన్లు వేయాల్సి ఉందని ఆ మున్సిపాలిటీ ఇంజినీర్ తెలిపారు. బద్వేలులో గతం కంటే పరిస్థితి మెరుగైందని, ఇప్పుడు రెండు రోజులకొకసారి ఇస్తున్నట్లు పబ్లిక్‌హెల్త్ ఈఈ చెప్పారు. మైదుకూరు పరిధిలో ఎర్రచెరువుకు ఎస్ఆర్-2 నుంచి నీటిని విడుదల చేయిస్తే సమస్య తీరుతుందని చెప్పారు. ఎర్రగుంట్లలో లీకేజీలను అరికట్టాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కడప కమిషనర్ చల్లా ఓబులేసు, ఇతర మున్సిపాలిటీల కమిషనర్లు, ఇంజినీర్లు ఆర్కే శ్రీనివాసులు, వేణుగోపాల్, ఎంహెచ్ఓ డాక్టర్ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి
విజయనగరం కంటోన్మెంట్: కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల మధ్యన జనావాసాల్లో పశువులను వధించేందుకు అనుమతి మంజూరు చేసిన మున్సిపల్ కమిషనర్ సోమనారాయణ, హెల్త్‌ఆఫీసర్ రాజులపై చర్యలు తీసుకోవాలని ఏపీ గోసంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ఎన్సీఎస్ రోడ్డులోని పంచముఖాంజనేయస్వామి ఆలయంలో వారు విలేకరలతో మాట్లాడారు. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 500 మంది సభ్యులున్న జమాతేఖురేషి అసోసియేషన్ వారికి ఆవులు, గేదెలతో పాటు పొలం దున్నే ఎద్దులను వ ధించేందుకు అనుమతులు ఇవ్వడం దారుణమన్నారు. మున్సిపాలిటీ తీర్మానం కూడా లేదన్నారు. కమిషనర్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి. జిల్లా మంత్రికి, కలెక్టర్ ఎంఎం నాయక్‌కు ఫిర్యాదు చేశామన్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు మద్దిల సోంబాబు, ఇతర సభ్యులు గుగ్గిలం రామారావు, శ్రీమాన్ నారాయణ స్వామి, ఎం. అప్పారావు, జి. పైడితల్లి, ఐవీఆర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులూ.. బాధ్యతలు మరవొద్దు
భవానీపురం : ప్రతి ఉపాధ్యాయుడు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ చెప్పారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధన కోసం నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్ట్ టీచర్స్తోతుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షలు దగ్గర పడుతున్న కీలక సమయంలో ప్రతి ఉపాధ్యాయుడు ఎవరి బాధ్యతను వారు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు అండగా తల్లిదండ్రులు కన్నా ఉపాధ్యాయులే ఎక్కువగా ఉండి పిల్లలను ప్రోత్సహించాలని చెప్పారు. పబ్లిక్ పరీక్షల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణుడు అయ్యేలా చదివించాలని, ఆ దిశగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమష్టి కృషి చేయాలని సూచించారు. వివిధ సబ్జెక్ట్‌లకు సంబంధించి ఉపాధ్యాయులు రానున్న పరీక్ష విధానంలో విద్యార్థులను ఏ విధంగా తయారు చేయాలి, చివరి నిమిషం అయినప్పటికీ వెనుకబడిన వారిని ప్రోత్సహించి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కమిషనర్ (జనరల్) జి. నాగరాజు, డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కె. దుర్గాప్రసాద్, స్కూల్స్ సూపర్వైజర్ ఎం.వి. వెంకటేశ్వరరావు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పన్నుల వసూలుకు పది సూత్రాలు
సాక్షి, రాజమండ్రి : మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో పన్నుల వసూలులో చోటు చేసుకుంటున్న అలసత్వంపై ప్రభుత్వం ఆలస్యంగా కళ్లు తెరిచింది. ‘ఆదాయం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయి. పన్నుల వసూలు సమర్థంగా లేకపోతే పరిపాలన ముందుకు సాగదు’ అంటూ పురపాలక శాఖ తాజాగా మున్సిపల్ కమిషనర్లకు మార్గ దర్శకాలు జారీ చేసింది. మీరు లక్ష్యాలు నిర్దేశించుకోండని హితబోధ చేస్తోంది. లక్ష్యాలు చేరక పోతే నిధుల్లో కోత పెడతామని హెచ్చరిస్తోంది. క్షేత్రస్థాయి సిబ్బందిని పరుగులు పెట్టించి పన్నులు వసూలు చేయాల్సిన బాధ్యత కమిషనర్లదేనంటూ కొత్తగా సర్కారు ఇప్పుడు జ్ఞాపకం చేస్తోంది. సిబ్బందిలో అలసత్వం, పారదర్శకత లోపం వంటి కారణాలను సరిచేసేందుకు పురపాలక శాఖ పది సూత్రాల ప్రణాళికలను ఆమలు చేస్తోంది. వీటిని కమిషనర్లు ఆచరించి ఈ ఏడాదైనా నూరు శాతం పన్నులు వసూలు చేయాలని సర్కారు సూచిస్తోంది. ఇలా వసూలు చేయండి.. మున్సిపాలిటీల్లో నూరు శాతం పన్నులు వసూలు చేసే డ్యూటీ కమిషనర్లదే. వారే పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. పన్నుల వసూలు విభాగాల్లోని కార్యాలయ, క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రత్యేకంగా కమిటీలు వేయాలి. వారికి రోజువారీగా లక్ష్యాలు నిర్దేశించి, ఏ రోజుకారోజు నూరుశాతం వసూళ్లు చేసేలా ఆదేశించాలి. వార్డులు, డివిజన్లలో మైకులతో అనౌన్సుమెంట్లు చేస్తూ, సినిమాల్లో స్లైడ్లు ప్రదర్శిస్తూ, ఎక్కడికక్కడ బ్యానర్లు కట్టి ప్రజలు పన్నులు తక్షణం చెల్లించేలా ప్రచారం చేయాలి. వసూలైన పన్నులు మరుసటి రోజు సంబంధిత అకౌంట్లకు జమచేయాలి. వాటిని వెంటనే రికార్డులకు ఎక్కించాలి. ప్రతి బిల్లు కలెక్టర్ పరిధిలోని టాప్ -500 బకాయిదారుల జాబితా తయారు చేసి, వాటిని చూపి ఒత్తిడి తెచ్చి బిల్లులు రాబట్టే ఏర్పాటు చేయాలి. బకాయిలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సిబ్బందికి అత్యవసరమైతే కాని సెలవులు ఇవ్వకూడదు. బకాయిల్లో 85 శాతం బిల్లు కలెక్టర్లు వసూలు చేయాల్సిందే. 10 శాతం బిల్లులు అంటే కరడుకట్టిన బకాయిదారుల జాబితాలతో సూపర్వైజర్, మున్సిపల్ ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఒక పర్యవేక్షక బృందంగా ఏర్పడి వసూళ్లకు వెళ్లాలి. ఐదు శాతం వసూళ్లు అంటే మరీ భారీగా పెరిగిపోయిన బకాయిల వసూలుకు మున్సిపల్ కమిషనర్లు పూనుకోవాలి. జిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో పన్ను వసూళ్లపై రీజనల్ డెరైక్టర్ ప్రతి రోజూ సమీక్ష చేయాలి. మున్సిపల్ కమిషనర్లు మొండి బకాయిలపై నేరుగా జోక్యం చేసుకుని మాటలతో వసూలు కాని పక్షంలో చట్టపరమైన చర్యలకు పూనుకోవాలి. మేజర్ బకాయిదారుల చరాస్తులు కూడా జప్తు చేయాలి. ఈమేరకు ముందుగా నోటీసులు ఇవ్వాలి. ప్రత్యేక వాహనాలు పెట్టి జప్తు చేసిన ఆస్తిని నగరపాలక సంస్థ కార్యాలయానికి తరలించాలి. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టం 1965 ప్రకారం 85 శాతం కూడా పన్నులు వసూలు చేయలేని మున్సిపాలిటీలకు విడుదల అయ్యే నిధులకు కూడా కోత పెట్టే అధికారం ప్రభుత్వానికి ఉందని కమిషనర్లు గమనించాలి. ఈ నిబంధనలు పాటిస్తూ 2014-15 ఆర్థిక సంవత్సర వసూళ్లు నూరు శాతం చేసి తీరాలన్న ఆదేశాలతో కూడిన లేఖలను అందరు కమిషనర్లకు పురపాలక శాఖ డెరైక్టర్ వాణీమోహన్ రెండు రోజుల క్రితం జారీ చేశారు. జిల్లాలో బకాయిల వసూలు ఇలా ఉంది.. జిల్లాలో మున్సిపాలిటీలకు ప్రధాన ఆధారమైన ఆస్తిపన్నుల వసూళ్లు ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి.. నగరపాలక సంస్థల్లో 45 నుంచి 55 శాతం వరకూ వసూలు అయ్యాయి. మున్సిపాలిటీల్లో ఈ వసూళ్లు 45 శాతం అయ్యాయి. నీటి పన్ను కూడా చాలా మున్సిపాలిటీల్లో 60 శాతం దాటలేదు. ఖాళీ స్థలాల పన్ను కూడా ఎక్కడా 50 శాతం దాటిన దాఖలాలు లేవు. ఇక వ్యాపార ప్రకటనలపై వచ్చే ట్యాక్స్ ఎక్కడా 40 శాతం దాటలేదు. ఈ ఆర్థిక సంవత్సరం మరోనెలలో ముగియనుండగా ఈ వ్యవధిలో వంద శాతం వసూళ్లు ఎలా చేస్తారు, ఈ మార్గ దర్శకాలు ఎంత వరకూ ఫలితాలనిస్తాయి అన్నది వేచి చూడాల్సిందే. -
సంబురాన్ని చూస్తుండిపోయి.. సస్పెండయ్యాడు..
వరంగల్ అర్బన్ : విధులను కొద్దిసేపు పక్కన పెట్టి వేతన ఫిట్మెంట్ సంబురాల్లో మునిగి తేలిన ఓ డ్రైవర్ చివరకు సస్పెండ్‌కు గురయ్యారు. మహానగర పాలక సంస్థ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ శుక్రవారం మధ్యాహ్నం ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో బల్దియా ఎదుట జేఏసీ నాయకులు, ఉద్యోగులు వేతన ఫిట్‌మెంట్‌పై సంబురాలు జరుపుకునే పనిలో నిమగ్నమయ్యారు. కమిషనర్ చాంబర్లో పవ ర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుందనే విష యం తెలిసి ఆటంకం కలుగుతుందని గంట న్నరపాటు వేచిచూశారు. సమావేశం పూర్తికాగా నే బాణాసంచా పేల్చి, స్వీట్లు పంపిణీలు చేసుకున్నారు. సంబురాల్లో కమిషనర్ వాహన డ్రైవ ర్, డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దొడ్డిపాటి శేఖర్ కూడా ఉన్నారు. సమావేశం పూర్తికాగానే కమిషనర్ నేరుగా తన వాహనం ఎక్కి కూర్చున్నారు. 10 నిమిషాలపాటు వాహనంలో వేచి చూశారు. సీసీ, అటెండర్లు ఫోన్ చేయగా నెమ్మదిగా శేఖర్ అక్కడికి చేరుకోగానే ‘ఏంటి ఆలస్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ తన క్యాంపు కార్యాలయం హన్మకొండకు చేరిన తర్వాత డ్రైవర్ శేఖర్‌ను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించగా.. ఉత్తర్వులు జారీ చేశారు. -
కాకినాడ పోర్టు ఆఫీసర్ గా రవికుమార్
తూర్పుగోదావరి: కాకినాడ పోర్టు అధికారిగా రవికుమార్ నియమితులయ్యారు. ఆయనను ఈ పదవిలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయన కాకినాడ మున్సిపల్ కమిషనర్, డీఆర్ డీఏలో పీడీగా విధులు నిర్వర్తించారు. -
మున్సిపల్ కమిషనర్‌కు అస్వస్థత
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ బి.రాము అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని పాదగయ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం శ్రీ కుక్కుటేశ్వర ఆలయంలో సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న కమిషనర్ రాము సమావేశం అనంతరం స్పృహ తప్పి పడిపోయారు. ఆయనను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
నగరాభివృద్ధే లక్ష్యం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్ హార్డ్వర్క్తోనే మెరుగైన పాలన రాజధాని నిర్మాణంలో ప్లానింగ్ కీలకం సుందరీకరణపై ప్రత్యేక దృష్టి ఆస్తిపన్ను పెంపుపై స్టడీ చేస్తున్నానని వెల్లడి సాక్షి : సింగపూర్ ట్రిప్ ఎలా సాగింది. శిక్షణలో ఏం నేర్చుకున్నారు. కమిషనర్ : చాలా బాగా సాగింది. రాజధాని నగరం ఎలా ఉండాలి... రిసోర్స్, ఇంప్లిమెంటేషన్ తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రాజధాని నిర్మాణంలో ప్లానింగ్ చాలా ముఖ్యమనే విషయం స్పష్టంగా అర్థమైంది. సాక్షి : నగర సుందరీకరణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? కమిషనర్ : రాజధాని నేపథ్యంలో నగరాన్ని సుందరీకరించాల్సిన అవసరం ఉంది. దేశ, విదేశాల నుంచి వీఐపీలు వచ్చి వె ళుతున్నారు. ఈక్రమంలో సుందరీకరణపై ప్రధానంగా దృష్టిసారించాం. కాల్వలు, సహజవనరులు నగరంలో పుష్కలంగా ఉన్నాయి. వీటిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలి. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డెరైక్టర్ శ్రీధరన్, జీఎంఆర్ ఎక్స్‌పర్ట్స్‌తో త్వరలోనే చర్చిస్తాం. ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో ఖర్చు చేయాలనే దానిపై ఒక అవగాహనకు వచ్చాక సుందరీకరణ పనులు చేపడతాం. సాక్షి : స్మార్ట్ వార్డుల ఏర్పాటుకు ప్రణాళిక ఎంతవరకు వచ్చింది? కమిషనర్ : మౌలిక వసతులు, అందరికీ జీవనోపాధి, డ్రాప్ అవుట్స్ లేకపోవడం వంటి 20 లక్ష్యాలతో స్మార్ట్ వార్డులను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, వీఐపీల భాగస్వామ్యం అవసరం. ఎంపీ, ఎమ్మెల్యేలు, మేయర్, కార్పొరేటర్లతోపాటు నగరంలోని సెలబ్రిటీలు, వ్యాపార ప్రముఖులు, సినిమా నటులను భాగస్వాములను చేయాలని నిర్ణయించాను. వీరితో చర్చలు ప్రారంభించాము. ఒక్కోవార్డును ఒక్కొక్కరికి ద త్తత ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందించాను. సాక్షి : ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదన ఎంతవరకు వచ్చింది? కమిషనర్ : నగరంలో ఆస్తిపన్ను పెంపునకు సంబంధించి వివిధ వర్గాల వారి నుంచి అభిప్రాయ సేకరణ చేయాల్సి ఉంటుంది. గతంలో కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నాన్ రెసిడె న్షియల్ టాక్స్‌కు సంబంధించి 2007లో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆస్తిపన్ను పెంపుపై ఒక నిర్ణయం తీసుకుంటాం. పరిస్థితులను స్టడీ చేస్తున్నా. సాక్షి : డంపింగ్‌యార్డు స్థల సేకరణ సమస్య ఎప్పటిలోగా పరిష్కరిస్తారు? కమిషనర్ : నగరపాలక సంస్థలో ఇది ప్రధాన సమస్య. స్థల సేకరణకు ఏర్పాట్లుచేస్తున్నాం. జి.కొండూరు మండలం కడియం పోతవరం గ్రామంలో భూమిని పరిశీలించాను. ఎకరం కోటి రూపాయలు చెబుతున్నారు. రైతులతో సంప్రదింపులు జరపాలని తహశీల్దార్‌తో చెప్పాను. నున్న ప్రాంతంలో స్థలాన్ని త్వరలోనే పరిశీలిస్తాను. నెల రోజుల్లో స్థలాన్ని సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాను. సాక్షి : గడువులోపు జేఎన్ఎన్యూఆర్ఎం పనులు పూర్తిచేయగలరా? ఇళ్ల కేటాయింపుపై ఏం నిర్ణయం తీసుకున్నారు. కమిషనర్ : మార్చి 31వ తేదీలోపు జేఎన్ఎన్యూఆర్ఎం పనులను పూర్తి చేయాల్సి ఉంది. పెండింగ్ పనులు, రావాల్సిన నిధులపై ఫిబ్రవరి 2న సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటుచేశా. సాధ్యమైనంతవరకు గడువులోపు పనుల్ని పూర్తిచేస్తాం. అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్లు కేటాయిస్తాం. సాక్షి : నగరపాలక సంస్థలో ఆడిట్, కోర్టు కేసులు పెండింగ్ ఉన్నాయి. బడ్జెట్ తయారీలో జాప్యం జరుగుతోంది. దీనికి కారణం ఏమంటారు? కమిషనర్ : మీరు చెప్పింది నిజమే. 255 కేసులో కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఆడిట్ అప్డేట్గా జరిగితేనే పాలన పారదర్శకంగా ఉంటుంది. వీటిపై ప్రత్యేక దృష్టిస్తా. బడ్జెట్ రూపొందించడంలో జాప్యం జరిగింది. అధికారులు ప్రస్తుతం బడ్జెట్ తయారు చేసేపనిలో నిమగ్నమయ్యారు. త్వరలోనే బడ్జెట్‌ను అప్రూవల్ కోసం స్టాండింగ్ కమిటీకి పంపుతాం. సాక్షి : ఉదయం 5.30 గంటలకే నగర పర్యటనకు వెళ్తున్నారు. దీనికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? కమిషనర్ : ఉంది. ఐఏఎస్ శిక్షణలో ఉన్న సమయంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎలా వ్యవహరించాలనే దానిపై గుల్జార్ శిక్షణ ఇచ్చారు. ఉదయం 5.30 గంటలకు రోడ్డుపైకి వెళితేనే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని ఆయన చెప్పారు. ఆ స్ఫూర్తితోనే హార్డ్‌వర్క్ చేస్తున్నా. జాబ్ ఏం డిమాండ్ చేస్తే అది చేయాలన్నది నా అభిప్రాయం. సాక్షి : రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా మీపైన ఉన్నాయా? కమిషనర్ : ఇప్పటివరకు అలాంటివి ఏమీ లేవు. అర్బన్ లోకల్ బాడీలో ఎలా పనిచేయాలనే దానిపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడం కోసం కృషిచేస్తా. నగరాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా. -
ఏపీలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. ఇటీవల సాధారణ బదిలీలపై సడలింపు నిచ్చి బదిలీలు చేపట్టినా రాష్ట్రంలో ఓటర్ల గణన జరుగుతున్న కారణంగా ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో బదిలీలన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు ఆర్థికశాఖ, ముఖ్యమంత్రి అనుమతితో గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 మంది ఈ బదిలీ అయ్యారు. పేరు ప్రస్తుత స్థానం బదిలీ అయిన స్థానం జి.సుశీలమ్మ అసిస్టెంట్ కమిషనర్(ప్రొద్దుటూరు) మున్సిపల్ కమిషనర్, చీరాల ఎం.జశ్వంత్‌రావు కమిషనర్, చీరాల మున్సిపాలిటీ హైదరాబాద్ సీడీఎంఏకు రిపోర్టు ఎం.రమేష్‌బాబు మున్సిపల్ కమిషనర్, కనిగిరి మున్సిపల్ కమిషనర్, బాపట్ల జి.సాంబశివరావు బాపట్ల మున్సిపల్ కమిషనర్ కమిషనర్, సత్తెనపల్లి సి.సత్యబాబు సత్తెనపల్లి మున్సిపల్ కమిషనర్ హైదరాబాద్ సీడీఎంఏకు రిపోర్టు పి.శ్రీనివాసరావు మేనేజర్, మచిలీపట్నం మున్సిపాలిటీ కమిషనర్, తాడేపల్లి బి.శివారెడ్డి మున్సిపల్ కమిషనర్, తాడేపల్లి హైదరాబాద్ సీడీఎంఏకు రిపోర్టు సీఎంఏ నయీమ్ అహ్మద్ రెవెన్యూ ఆఫీసర్, నంద్యాల మున్సిపాలిటీ కమిషనర్, కనిగిరి నగర పంచాయతీ ఎన్.ప్రదీప్‌కుమార్ మున్సిపల్ కమిషనర్, ధర్మవరం కమిషనర్, ఆదోని బి.రామ్మోహన్ అసిస్టెంట్ కమిషనర్, ధర్మవరం కమిషనర్ (ఎఫ్ఏసీ), ధర్మవరం కె.క్రిష్ణమూర్తి కమిషనర్, ఆత్మకూరు నగర పంచాయతీ కమిషనర్, గుత్తి ఎస్.ఇబ్రహీం సాహెబ్ కమిషనర్, గుత్తి మున్సిపాలిటీ కమిషనర్, ఆత్మకూరు నగర పంచాయతీ జి.శ్రీనివాసులు మేనేజర్, ఆత్మకూరు నగర పంచాయతి కమిషనర్, మైదుకూరు ఎం.మల్లయ్య మున్సిపల్ కమిషనర్, మైదుకూరు హైదరాబాద్ సీడీఎంఏకు రిపోర్టు పి.భవాని ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ గూడూర్ కమిషనర్, యర్రగుంట్ల నగర పంచాయతీ ఎం.ఎస్.ప్రభాకర్‌రావు కమిషనర్, యర్రగుంట్ల హైదరాబాద్ సీడీఎంఏకు రిపోర్టు ఎల్.రమేష్‌బాబు పంచాయతీ సెక్రటరీ, కర్నూలు గ్రేడ్1 కమిషనర్, గూడూర్ నగరపంచాయతీ పి.రవివర్మ శానిటరీ ఇన్స్పెక్టర్, కాకినాడ కమిషనర్, ముమ్మడివరం నగరపంచాయతీ జి.లక్ష్మీరాజ్యం కమిషనర్, ముమ్మడివరం కమిషనర్, జమ్మలమడుగు బీజేఎస్పి రాజు కమిషనర్, జమ్మలమడుగు కమిషనర్, మదనపల్లె బి.దేవ్ సింగ్ కమిషనర్, మదనపల్లె కమిషనర్, నరసరావుపేట బి,సాల్మన్‌రాజు రెవెన్యూ ఆఫీసర్, నూజివీడు మున్సిపాలిటీ కమిషనర్, జంగారెడ్డిగూడెం వి.నటరాజ్ కమిషనర్ జంగారెడ్డి గూడెం హైదరాబాద్ సీడీఎంఏకు రిపోర్టు డి.రవీంద్ర శానిటరీ ఇన్స్పెక్టర్, మంగళగిరి కమిషనర్, నూజివీడు సీహెచ్ శ్రీనివాస్ కమిషనర్, నూజివీడు కమిషనర్, అమలాపురం టి.నాగేశ్వరరావు పీడీ, మెప్మా, విశాఖ కమిషనర్, రామచంద్రాపురం సీహెచ్ సత్యనారాయణ శానిటరీ ఇన్స్పెక్టర్, బొబ్బిలి కమిషనర్, ఇచ్చాపురం కె.వై.రత్నరాజు కమిషనర్, ఇచ్చాపురం కమిషనర్, పమిడి నగరపంచాయతీ ఎన్.మల్లికార్జున్ కమిషనర్, పమిడి నగరపంచాయతీ హైదరాబాద్ సీడీఎంఏకు రిపోర్టు ఎ.ప్రసాద్ మేనేజర్, నగిరి మున్సిపాలిటీ కమిషనర్, నాయుడుపేట నగర పంచాయితీ ఎన్.వెంకటేశ్వర్లు కమిషనర్, నాయుడు పేట హైదరాబాద్ సీడీఎంఏకు రిపోర్టు టీఎన్ విజయసింహారెడ్డి రెవెన్యూ ఆఫీసర్, పలమనేరు మున్సిపాలిటీ కమిషనర్, పులివెందుల ఎన్వీ నాగేశ్వరరావు కమిషనర్, పులివెందుల హైదరాబాద్ సీడీఎంఏకు రిపోర్టు ఎన్వీవీ నూకేశ్వరరావు మేనేజర్, నంద్యాల మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్, శ్రీకాకుళం మున్సిపాలిటీ పి.క్రిష్ణమూర్తి వెయిటింగ్ ఫర్ పోస్ట్ డిప్యూటీ కమిషనర్, అనంతపురం కార్పొరేషన్ -
నిద్రమత్తు వదిలించారు
ఒకటో డివిజన్లో ఉదయం 5.30 గంటలకే కమిషనర్ పర్యటన చెట్టు కిందే అధికారులతో సమీక్ష పన్ను వసూళ్లపై దృష్టిపెట్టాలని ఆదేశం విజయవాడ సెంట్రల్ : మంగళవారం ఉదయం 5.30 గంటలు... ఇంకా మంచుతెరలు వీడలేదు... కానీ, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్ ఒకటో వార్డుకు చేరుకున్నారు. డివిజన్లో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ పి.శివరంజని వచ్చి కారులో వెళదామని చెప్పినా, తిరస్కరించి రెండు గంటలపాటు నడుచుకుంటూ డివిజన్ మొత్తం కలియతిరిగారు. సిద్ధార్థనగర్, ఊర్మిళానగర్, గుణదల ప్రాంతాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేశారు. మర్రిచెట్టు కిందే అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు. డివిజన్లో స్థితిగతులపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఏం చేయాలి.. ఎప్పటిలోపు పూర్తిచేయాలనే విషయాలపై పలు సూచలు, సలహాలు ఇచ్చారు. ఎన్నడూ లేనివిధంగా తెల్లవారక ముందే డివిజన్ పర్యటనకు శ్రీకారం చుట్టిన కమిషనర్ అధికారులకు నిద్రమత్తు వదిలించారు. మీ సమస్యలు చెప్పాలని ప్రజల నుంచే నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరులోపు పన్నులు వసూలు చేయాలని ఆదేశం ఖాళీ స్థలాల వివరాల గురించి రెవెన్యూ అధికారులను ఆరా తీశారు. వెయ్యి ఖాళీ స్థలాలు ఉన్నాయని, ఇప్పటివరకు 500 స్థలాలకు సంబంధించి మాత్రమే పన్ను వసూలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. మిగిలిన వాటి నుంచి ఎందుకు వసూలు చేయలేదని కమిషనర్ ప్రశ్నించారు. నీళ్లు నమిలిన అధికారులు వచ్చే నెల 5వ తేదీలోపు వసూలు చేస్తామని బదిలిచ్చారు. ఈ నెలాఖరులోపు మొత్తం పన్నులు వసూలుచేయాని కమిషనర్ ఆదేశించారు. రికార్డులను పరిశీలించారు. ఖాళీ స్థలాలు, ఆస్తిపన్ను వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. చెత్తపై అవగాహన కల్పించాలి కాల్వల్లో చెత్త, వ్యర్థాలను వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి కమిషనర్ సూచించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కాల్వగట్లపై పర్యటించాలని ప్రజారోగ్య విభాగం సిబ్బందిని ఆదేశించారు. కార్పొరేటర్ సహకారంతో సమావేశాలు ఏర్పాటుచేసి చెత్త వేయవద్దని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు. గృహనిర్మాణాల ప్లాన్లు త్వరగా మంజూరుచేయాలని టౌన్‌ప్లానింగ్ అధికారులకు సూచించారు. ఏలూరురోడ్డు, బీఆర్టీఎస్రోడ్డు, జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. రైల్వేట్రాక్ సమీపంలో ఉంటున్న 60 కుటుంబాలకు మంచినీటి కనెక్షన్లు ఇవ్వాలని కార్పొరేటర్ కోరగా, సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. బుడమేరు వంతెనపై రెయిలింగ్ ఏర్పాటుకు నివేదిక సిద్ధం చేయాలని చెప్పారు. ఊర్మిళానగర్ ప్రాంతంలో రోడ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా, కమిషనర్ సానుకూలంగా స్పందించారు. కార్పొరేటర్ పి.శివరంజనీ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్, డెప్యుటీ కమిషనర్ (రెవెన్యూ) డి.వెంకటలక్ష్మి, ఈఈ ధనుంజయ, సిటీప్లానర్ ఎస్.చక్రపాణి, ఏసీపీ వి.సునీత, ఏఎంహెచ్ఓ పి.రత్నావళి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల చెంతకు..
ఏలూరు.. జిల్లాలోనే ఏకైక నగరం. కలెక్టర్‌తోపాటు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు ఇక్కడే ఉంటారు. ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్ వంటి ముఖ్య ప్రజాప్రతినిధులు ఉండేది ఈ నగరంలోనే. అలాంటి ప్రాంతం జిల్లాకే తలమానికంగా.. అభివృద్ధిలో మార్గదర్శకంగా ఉంటుందని ఎవరైనా అనుకుంటారు. కానీ.. ఈ నగరంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడి ప్రధాన సమస్యలను తెలుసుకునేం దుకు నగరపాలక సంస్థ కమిషనర్ యర్రా సాయి శ్రీకాంత్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. కబాడీ గూడెం, ప్రధాన చేపల మార్కెట్లో పర్యటించారు. వీధుల్లో సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. పేదలు ఎదుర్కొం టున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. గుర్తించిన సమస్యల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కమిషనర్ నిర్వహించిన వీఐపీ రిపోర్టర్ కార్యక్రమం ఇలా సాగింది. నగరంలోని మురికివాడల్లో ఒకటైన కబాడీ గూడెంలో అడుగుపెట్టిన కమిషనర్‌కు రోడ్డు పక్కన పాత దుస్తులతో ఏర్పాటు చేసుకున్న స్నానపు గదులు కనిపించాయి. అక్కడ ఉన్న యందం మార్తమ్మను ‘ఏంటమ్మా.. పాత బట్టలతో ఇలా కట్టుకున్నారు’ అని కమిషనర్ ప్రశ్నించారు. యందం మార్తమ్మ: మాకు మరుగుదొడ్లు లేవు సార్. స్నానాలు చేయడానికి వీటిని కట్టుకున్నాం. కమిషనర్ : ఏమ్మా.. ఇక్కడ మంచినీళ్లు వస్తున్నాయా. మాండ్రు మార్తమ్మ : వస్తున్నాయ్ సార్. అందరికీ ఒకే కుళాయి ఉంది. కమిషనర్ : రూ.200 కడితే కుళాయి మంజూరు చేస్తాం. అందరూ దరఖాస్తు చేసుకోండి. ప్రతి ఇంటికీ కుళాయి వచ్చే ఏర్పాటు చేస్తాను. అక్కడి నుంచి ముందుకెళ్లిన కమిషనర్‌కు రోడ్డుమీదే పొరుు్య కనిపించింది. అక్కడి ఇంట్లో ఉంటున్న మహిళను పిలిచిన కమిషనర్ ‘ఏమ్మా.. ఇలా రోడ్ల మీదే పొరుు్య పెడితే ఎలా. ఇలా చేయడం మంచిది కాదు. ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. ఇకనుంచి ఇలా చేయకండి’ అని సూచించి ముందుకు కదిలారు. తేళ్ల ప్రసాదరావు : సార్.. వర్షాకాలంలో నీళ్లు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయ్. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మురుగు ఎక్కువగా ఉండటంతో దోమలు పట్టపగలే చంపేస్తున్నాయ్. కమిషనర్ : మురుగు నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకుంటాం. మీరు కూడా డ్రెరుునేజీల్లో చెత్తాచెదారం వేయకుండా సహకరించాలి. కమిషనర్ : ఏమ్మా.. మీ సమస్యలేంటి. చౌటపల్లి కుమారి : పందులు ఎక్కువగా తిరుగుతున్నాయి. వాటివల్ల పిల్లలు రోగాల బారిన పడుతున్నారు. కమిషనర్ : తగిన చర్యలు తీసుకుంటాం. దోమల బారినుంచి రక్షించుకోవడానికి దోమ తెరలు వాడండి. కమిషనర్ : ఇక్కడ కమ్యూనిటీ హాలు ఉంది కదా. వాడుతున్నారా. దాసరి వెంకటేశ్వరమ్మ : వాడటం లేదు. ఎప్పుడూ మూసే ఉంటోంది. దానిలో కూడా ఎటువంటి సౌకర్యాలూ లేవు. కమిషనర్ : ఏమ్మా.. మీకూ మరుగుదొడ్లు లేవా. చౌటపల్లి సువర్ణ : లేవు సార్. కట్టించుకోవడానికి స్థలం కూడా లేదు. కమిషనర్ : అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పబ్లిక్ టాయిలెట్లు నిర్మిస్తాం. అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. వి.రత్నకుమారి : ఉన్నాయి సార్. వాటినే వినియోగిస్తున్నాం. కమిషనర్ : మీ ఇల్లు బాగానే ఉందా. నాగమణి : లేదు సార్. వర్షం నీరు కారుతోంది. కమిషనర్ : ఇల్లు కట్టుకోవడానికి రుణాలు వచ్చే ఏర్పాటు చేస్తాం. మీరంతా మీ పిల్లలను బాగా చదివించి అభివృద్ధిలోకి తీసుకురావాలి. అక్కడి నుంచి కమిషనర్ పక్కవీధిలోకి వెళ్లారు. పలువురు మహిళలు ఆయన వద్దకు వచ్చి తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. సావధానంగా విన్న కమిషనర్ వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దాసరి వెంకటేశ్వరమ్మ : మాకు ఇళ్లు లేవండి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలిప్పిస్తే ఇళ్లు కట్టుకుంటాం. కమిషనర్ : తప్పకుండా. మీరంతా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారా.. రుణాలు తీసుకున్నారా. దాసరి వెంకటేశ్వరమ్మ : ఎన్నికలకు ముందే రుణాలకు కాయితం పెట్టుకున్నాం సార్. ఓట్లు అడగడానికి వచ్చిన వారంతా రుణాలిప్పిస్తామన్నారు. ఇప్పటివరకూ మా మొహాలు చూసిన వారే లేరు. ఖాజా : ఇళ్ల మీదుగా కరెంటు తీగలు వెళుతున్నాయ్. అప్పుడప్పుడూ తెగి ఇళ్లపై పడుతున్నాయ్. స్థానిక చేపల మార్కెట్‌ను సందర్శించిన కమిషనర్ వ్యాపారులు, వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ : ఏమ్మా.. ఇక్కడ ఇన్ని షాపులు కట్టాం. నువ్వు బయట చేపలు అమ్ముతున్నావేంటి. నీలం వరలక్ష్మి : వాటిలో నాకు షాపు ఇవ్వలేదు సార్. అందుకే బయట అమ్ముతున్నాను. కమిషనర్ : ఏమ్మా.. నీకు షాపు ఉందా.. లేదా నూతిపిల్లి దుర్గమ్మ: దుకాణాలు బాగా ఎత్తుగా కట్టారు సార్. పైగా లైట్లు లేవు. నీరు రాదు. అసలు ఎటువంటి సౌకర్యాలూ లేవు. కమిషనర్ : కొనుగోలు చేయడానికి వచ్చేవారికి ఇబ్బందులు కలిగించవద్దు. మీకు సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తా. అక్కడి నుంచి ముందుకెళ్లిన కమిషనర్‌ను అరటి పండ్లు అమ్ముకుంటున్న మహిళలు ‘నమస్తే సార్’ అంటూ పలకరించారు. కమిషనర్ : బాగున్నారా. మీ సమస్యలేంటి. లొట్టి లక్ష్మి : మాకెవరికీ దుకాణాలు లేవు సార్. ఇక్కడ వ్యాపారం చేసుకుంటేనే నాలుగు డబ్బులొస్తాయ్. ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఒక చోట వ్యాపారాలు చేసుకుంటాం. ఇక్కడివారంతా మమ్మల్ని వెళ్లిపొమ్మని గదమాయిస్తున్నారు. మేమెలా బతకాలి సార్. కమిషనర్ : సమగ్ర సర్వే చేయిస్తాం. కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం పథకం ప్రవేశ పెట్టింది. ఆ పథకం మీకు వర్తింప చేయడానికి కృషి చేస్తా. అనంతరం పి.వెంకటేశ్వరరావు అనే వినియోగదారునితో మాట్లాడుతూ ‘ఈ మార్కెట్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయ్. ఇంకా ఏమైనా సౌకర్యాలు కల్పించాల్సి అవసరం ఉందా’ అని అడిగారు పి.వెంకటేశ్వరరావు : సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి సార్. సైకిళ్లు, మోటార్ సైకిళ్లపై వచ్చేవారికి పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. కమిషనర్ : ఓకే.. దృష్టి పెడతా. ఇంతలో ఉండవల్లి జయలక్ష్మి అనే మహిళ ఇంటిపన్ను కాగితాలతో వచ్చింది. కమిషనర్ : ఏమ్మా.. ఇంటిపన్ను కాగితాలు పట్టుకుని తిరుగుతున్నారేమిటి. ఉండవల్లి జయలక్ష్మి : నా భర్త మిలటరీలో పనిచేసి రిటైరయ్యారు. కొంతకాలానికి చనిపోయారు. మాజీ సైనికుల కుటుంబాలకు ఇంటి పన్ను మినహాయింపు వస్తుందని తెలిసి మీ ఆఫీసుకే వస్తున్నాను. ఈలోపు మీరే ఇక్కడ కనిపించారు. కమిషనర్ : మాజీ సైనికుల కుటుంబాలకు ఇంటిపన్ను మినహాయింపు ఉంటుంది. మా కార్యాలయ సిబ్బందిని కలవండి. మురికి వాడల అభివృద్ధికి కృషి చేస్తాం నగరంలోని మురికివాడల్లో నివశిస్తున్న ప్రజల జీవనం ఎంతో దుర్భరంగా ఉండటాన్ని గమనిం చాం. మురికి వాడల్లో సౌకర్యాల కల్పన, అభివృ ద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తాం. అక్కడి ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటిం చాలి. మరుగుదొడ్లు లేనివారికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తాం. ఖాళీ స్థలం లేనిపక్షంలో పబ్లిక్ టాయిలెట్స్ కట్టిస్తాం. అక్కడి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వృత్తి విద్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. మురికివాడల్లో నివాసాన్ని ఆనందమయం చేసుకోవడానికి అనువైన జీవన విధానాలపై అవగాహన కల్పించడానికి అక్కడి ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తాం. పందులు, కుక్కల బెడద నివారణకు చర్యలు చేపడతాం. రూ.3 కోట్లతో నిర్మించిన చేపల మార్కెట్లో సౌకర్యాలు లేవు. సౌకర్యాలు మెరుగుపరిచి మార్కెట్‌ను వ్యాపారులకు అందుబాటులోకి తీసుకువస్తాం. వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా మార్కెట్‌ను తీర్చిదిద్దుతాం. - యర్రా సారుుశ్రీకాంత్, కమిషనర్ -
పచ్చ చొక్కాలకు పనుల పందేరం!
⇒నామినేషన్‌పై మున్సిపాలిటీల్లో రూ. 5 లక్షల లోపు పనులు ⇒కార్పొరేటర్, కౌన్సిలర్, వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో కమిటీలు సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో అధికార పార్టీ కార్యకర్తలకు పనులు అప్పగించి నిధులు పందేరం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు పురపాలక శాఖ పరిధిలో లక్ష రూపాయలు దాటిన పనులకు టెండర్లు పిలిచి కేటాయించారు. తాజాగా నిబంధనలు మార్చి రూ.5 లక్షల వరకు నామినేషన్ ప్రాతిపదికన కట్టబెట్టేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పురపాలకశాఖ శాఖ ముఖ్యకార్యదర్శి ఎ.గిరిధర్ జీవో జారీ చేశారు. కొద్ది రోజుల క్రితమే పంచాయతీరాజ్ విభాగంలో పనులను నామినేషన్ కిందకు తెచ్చారు. ఇప్పుడు మున్సిపాలిటీల వంతు వచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని ప్రాంతంతో పాటు వివిధ మేజర్ మున్సిపాలిటీల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల పనులు జోరుగా జరగనున్నాయి. హడ్కో నుంచి నిధులు అందనున్న నేపథ్యంలో నామినేషన్ పనులకు రూ.5 లక్షల వరకూ పెంచేలా రాజకీయ ఒత్తిళ్లు తెచ్చారు. వార్డ్ లెవల్ కమిటీలు, స్థానిక కార్పొరేటర్ లేదా వార్డ్‌మెంబర్, కౌన్సిలర్లకే బాధ్యతలు అప్పగించటంతో నామినేషన్ పనులు పూర్తిగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరగనున్నాయి. మున్సిపాలిటీల్లో ప్రజారోగ్యం, పట్టణాభివృద్ధి, ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో రూ.5 లక్షల లోపు పనుల కేటాయింపుపై ప్రభుత్వం బుధవారం జారీ చేసిన మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు.. ⇒ గుర్తింపు పొందిన కాంట్రాక్టర్లు, స్వయం సహాయక బృందాలు, వార్డ్లెవల్ కమిటీలకు కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పనులు అప్పగించనున్నారు. ⇒ సంబంధిత స్థానిక సంస్థ పనులపై తీర్మానం చేస్తుంది. ⇒ పనుల కేటాయింపును వార్డ్ స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీకి వార్డ్ సభ్యుడు లేదా కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్మన్‌గా ఉంటారు. ఎస్‌హెచ్‌జీ లీడర్లు, బిల్ కలెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు. ⇒ వార్డు స్థాయి కమిటీ లేదా కాలనీ సంక్షేమ సంఘానికి చెందిన వారిలో నైపుణ్యం ఉన్న వారిని నియమిస్తారు. ఎస్హెచ్జీకి చెందిన ఒక మహిళ సభ్యురాలిగా ఉంటుంది. పైన పేర్కొన్న కమిటీ సభ్యులు కూడా ఉంటారు. ⇒ వార్డు స్థాయి కమిటీ లేదా కాలనీ సంక్షేమ సంఘం సకాలంలో కమిటీలను నియమించటంలో విఫలమైతే మున్సిపాలిటీ కమిషనరే కమిటీని నిర్ణయించి పనులను కేటాయిస్తారు. ⇒ పనులు జరిగే చోట స్థానికులనే కూలీలుగా నియమించుకోవాలి. ⇒ పని ప్రారంభానికి ముందు ఒకసారి, పనులు జరిగే సమయంలో ఒకసారి, పనుల పూర్తయ్యాక మరోసారి మూడు దఫాలుగా సమావేశాలు నిర్వహించి వివరాలతో రికార్డు నిర్వహించాలి. ⇒ నాణ్యతా ప్రమాణాలు పాటించడంతోపాటు పనులకు సంబంధించిన ఫొటోలు పరిశీలించి సంబంధిత శాఖ ఇంజనీర్లు తగిన చర్యలు తీసుకోవాలి. -
కర్నూలు జేసీ హరికిరణ్
కన్నబాబు పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్(జేసీ)గా చెవ్వూరు హరికిరణ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. ఈయనను మొదటిసారిగా కర్నూలు జేసీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని పర్లాకిమిడి ఈయన స్వగ్రామం. ఈయన తండ్రి వైద్యుడు, తల్లి లెక్చరర్. 2009 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినకు ఈయన 2010-11 వరకు కృష్ణా జిల్లా ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం ఏడాదిపాటు భద్రాచలం సబ్ కలెక్టర్‌గా, 2012-13 చిత్తూరు జిల్లాలోని మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు. 2013 అక్టోబరు 29న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి 14 నెలలపాటు విధులు నిర్వహించారు. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. కార్పొరేషన్ అప్పుల్లో కూరుకుపోవడంతో ఆయన హయాంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారనే వాదన ఉంది. కానీ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో మాత్రం ముందుండేవారన్న పేరుంది. ప్రభుత్వం బదిలీ చేయడంతో సంక్రాంతి పండుగలోపు బాధ్యతలు చేపట్టనున్నట్లు ‘సాక్షి’కి హరికిరణ్ వెల్లడించారు. కన్నబాబు బదిలీ కర్నూలు జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. 2012 నవంబరు 30న జేసీగా బాధ్యతలు చేపట్టి రెండేళ్ల పాలనలో తనదైన ముద్ర వేశారు. మైనార్టీ భూముల రక్షణకు చర్యలు చేపట్టారు. ఇసుక, ఖనిజం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. ఆధార్ అనుసంధాన ప్రక్రియలో జిల్లా ముందుండేలా కృషి చేశారు. రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గుర్తించిన విలువైన భూములకు కంచెలు ఏర్పాటు చేయించి ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టారు. -
వారం రోజులే...
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని ప్రతి కుటుంబానికి నెలరోజుల్లో బ్యాంకు అకౌంట్లు ఇప్పిస్తామని చెప్పిన కలెక్టర్ టి. చిరంజీవులు ఆ దిశగా చర్యలను వేగవంతం చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న కుటుంబాలన్నింటికీ కచ్చితంగా బ్యాంకు అకౌంట్ ఇవ్వాలని, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద ఈ ప్రకియ్రను వారం రోజుల్లో పూర్తిచేసి, తమ పరిధిలోని అన్ని కుటుంబాలకు బ్యాంకు అకౌంట్లున్నాయని పేర్కొంటూ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆయన ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఎంపీడీ ఓ కార్యాలయాల్లో సర్పంచ్‌లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, మునిసిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించనున్నారు. జిల్లాలో ఇప్పటికే 95శాతం కుటుంబాలకు బ్యాంకు అకౌంట్లున్న నేపథ్యంలో మిగిలిన 5 శాతం మందికి వారంరోజుల్లో సమీప బ్యాంకుల్లో అకౌంట్లు ఇప్పించేందుకు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించనున్నారు. రేషన్‌కార్డులు, పింఛన్ల పంపిణీలో జరుగుతున్న అవకతవకలను నివారించే విషయంపై కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే సిద్ధమైన తుదిజాబితాల్లో నుంచి అనర్హులను వెంటనే తీసివేయాలని, ఎవరైనా అర్హులకు పింఛన్లు, రేషన్‌కార్డులు రాకపోతే వారి పేర్లను చేర్చాలని అధికారులు నిర్ణయించారు. దీంతో పాటు ఇటీవలే కబ్జా స్థలాల క్రమబద్ధీకరణపై రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలోని పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గురించి కూడా స్థానిక యంత్రాంగానికి అవగాహన కల్పించనున్నారు. ఈ అంశాలపై మునిసిపాలిటీల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ యోచిస్తున్నారు. ఇందుకోసం మునిసిపాలిటీల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి కౌన్సిలర్లను ఇందులో భాగస్వాములను చేయనున్నారు. అందులో భాగంగా బుధవారం నల్లగొండ మునిసిపల్ కౌన్సిలర్లతో ఆయన సమావేశం కానున్నారు. -
అమ్మో... నల్లగొండ
ఈ ఒత్తిడి నేను భరించలేను * సెలవుపై మునిసిపల్ కమిషనర్ * మరోసారి ఇన్చార్జ్ పాలన * సిమ్‌తో సహా ఇచ్చి వెళ్లిపోయిన వేణుగోపాల్‌రెడ్డి నల్లగొండ టూటౌన్ : రాష్ట్రంలో ఒక పార్టీది అధికారం ... మునిసిపాలిటీలో మరోపార్టీ వారిది అధికారం ... కరవమంటే కప్పకు కోపం..విడవమంటే పాముకు కోపం..అధికారం మాదే మేము చెప్పిందే వినాలని ఒకరు.. మునిసిపాలిటీలో అధికారం మాది మేము ఏది చెప్పితే అదే ఫైనల్ చేయాలంటూ మరొకరు... ఇలా ఇరుపార్టీల నేతలు చేస్తున్న ఒత్తిళ్లకు ఇప్పుడు అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ‘‘ఈ ఒత్తిడి తట్టుకోలేను బాబు ఇక్కడ పనిచేస్తే లేని పోని రోగాలు వస్తాయి... ఇక ఇక్కడ నేను పని చేయలేను’’ అని నల్లగొండ మునిసిపల్ కమిషనర్ జి.వేణుగోపాల్‌రెడ్డి సెలవులో వెళ్లిపోయారు. కలెక్టర్ తొలుత అనుమతించకపోయినా, తన ఆవేదనను అర్థం చేసుకోమని చెప్పి తన ఫోన్ సిమ్‌కార్డు మరీ ఇచ్చేసి 15 రోజులు సెలవుపై వెళ్లిపోయారాయన. ఆయన సెలవు పెట్టేందుకు అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణమని ప్రచారం జరుగుతోంది. ఇటీవల కొంత మంది కౌన్సిలర్లు చిన్నచిన్న విషయాలకు కూడా కమి షనర్‌తో ఘర్షణకు దిగుతుండడంతో ఆయన ఇక్కడి నుంచి వెళ్లి పోవడానికే నిర్ణయించుకున్నుట్లు తెలుస్తోంది. మునిసిపల్ లీజు షాపుల వేలం ఆపడానికేనా ...? మునిసిపాలిటీకి చెందిన 238 దుకాణాలు, స్థలాలను బహిరంగవేలం ద్వారా లీజుకు ఇచ్చేందుకు గత నెలలో జరిగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం కోసం పెట్టారు. కాగా దీనిని ఆపడానికి తెర వెనుక కొంతమంది నాయకులు తీవ్రంగానే ప్రయత్నించినా, కమిషనర్ హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని ఎవరి ఒత్తిళ్లకు లొంగలేదని అప్పట్లోనే చర్చించుకున్నారు. ఈ నెలాఖరులోగా ఎలాగైనా ఆ స్థలాలు, దుకాణాలను వేలం వేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కమిషనర్ ఇక్కడి నుంచి పోతేనే తమకు నచ్చిన అధికారిని పెట్టుకొని పనులు చక్కబెట్టుకోవచ్చనే ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. ముక్కుసూటిగా వెళ్లడమే... వేణుగోపాల్‌రెడ్డి ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం కూడా కొంతమంది నేతలకు రుచించడంలేదని సమాచారం. తాము చెప్పింది చేయాలి కానీ నిబంధనలు తమకెందుకు అనేరీతిలో కొంతమంది మాట్లాడిన తీరుపై కమిషనర్ తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిసింది. ఎవరు ఏ పని చేయమన్నా, తానుమాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే చేస్తాను అని ఖరాఖండిగా చెప్పి ముక్కుసూటిగా వ్యవహరించిన తీరు కూడా ఇరుపార్టీల నాయకులకు నచ్చలేదని సమాచారం. ఆసరా పింఛన్ల జాభితాపై కూడా కాంగ్రెస్ నాయకులు కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిక్కచ్చిగా వ్యవహరించి అర్హులైన వారికి పింఛన్లు ఇస్తున్నా, తనపైనే ఏ అధికారం లేని వ్యక్తి పెత్తనం చెలాయించడం ఏంటని ఉన్నతాధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదేవిధంగా కార్యాలయంలో ఇటీవల అధికారుల సెక్షన్ల మార్పు కూడా కమిషనర్ సెలవు పెట్టడానికి కారణమైనట్లు తెలుస్తుంది. అధికారులను పనిచేయించుకోవాల్సిన తాను చెప్పిన విధంగా కాకుండా దానిని కూడా రాజకీయం చేయాలని చూడడం ఆయనకు నచ్చలేదు. దీంతో ఆయన వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. మరోసారి ఇన్చార్జ్ పాలన... నల్లగొండ మునిసిపాలిటీలో విధులు నిర్వహించాలంటేనే అధికారులు, ఉద్యోగులు హడలిపోయే పరిస్థితి వ చ్చింది. గతంలో దాదాపు మూడు సంవత్సరాల పాటు ఇన్చార్జ్ పాలన కొనసాగింది. ప్రత్యేకాధికారి పాలన ఉన్న రోజులలో పట్టణ ప్రజలు చిన్న పనులకు కూడా అనేక అవస్థలు పడ్డారు. మళ్లీ మరోసారి ఇన్చార్జ్ పాలనకు దారితీసింది. మునిసిపల్ ఈఈగా పనిచేస్తున్న రాజయ్యకు (ఎఫ్ఏసీ ) అదనపు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ డీఎంఏ కార్యాలయం నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరి ఈయన ఎలా నెట్టుకొస్తారో, ఈయన పట్ల అధికార పార్టీ నేతలు ఎలా వ్యవహరిస్తారోననే చర్చ మునిసిపల్ వర్గాల్లో జరుగుతోంది. -
రెండో రోజూ అంతంతే!
ప్రగతినగర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పథకం లబ్ధిదారులకు రెండవ రోజు కూడా చేదు అనుభవం మిగిల్చింది. జాబితాలో తమ పేర్లు లేవంటూ పలువురు ఆందోళనకు దిగారు. మరికొందరు పంచాయతీ, మండల కార్యాలయాలను ముట్టడించారు. సాంకేతిక కారణాలతోపాటు బ్యాంకుల నుంచి రూ. పది లక్షల పైబడి డబ్బులు డ్రా చేయని పరిస్థితి, సిబ్బంది కొరత తదితర కారణాలతో రెండవ రోజూ మొక్కుబడిగా పింఛన్ల పంపిణీ కొనసాగింది. నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్ కమ్యూనిటీ హాలులో అసలు అధికారులే రాక పింఛన్‌దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోటగల్లి పద్మశాలి సంఘంలో పేర్లు ఉన్నవారికీ పింఛన్లు అందించలేకపోయారు. 50వ డివిజన్లో సాయంత్రం వరకు అదికారులు చేరుకోలేకపోయారు. నిజామాబాద్ మండలంలో పలు గ్రామాల ప్రజలు గ్రామ పంచాయతీ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. పింఛన్ రానివారు ఆందోళనకు దిగారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో బాధితులు ధర్నా చేసి మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు. మామిడిపల్లి, అమ్రాద్ గ్రామస్తులు ఎంపీడీఓఓ వద్ద కార్యాలయం ధర్నా చేసారు. బాన్సువాడ నియోజకవర్గంలో వర్ని, కోటగిరి మండలం చిక్కడ్పల్లి గ్రామాలలో వృద్ధులు, సిరికొండ మండలంలో వృద్ధులు, వికలాంగులు ధర్నా నిర్వహించారు. అర్హులందరికీ పింఛన్లు వచ్చే వరకు పంపిణీ చేయవద్దని సర్పంచ్ సాయన్నను, వీఆర్ఓను వెనక్కు పంపించి వేశారు. బోధన్ పట్టణంలో పోలీసు బందోబస్తు మధ్య ఫించన్ల పంపిణి జరిగింది. నవీపేట మండల కేంద్రంలో ఒక్కసారిగా లబ్ధిదారులు ఎగబడటంతో పరిస్థితి గందరగోళంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని క్యూ పద్ధతిలో కొనసాగించారు. కామారెడ్డి పట్టణంలో అర్హుల పేర్లు జాబితాలో లేవని బస్టాండ్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. రెండో రోజు ఇదీ పరిస్థితి రెండవ రోజు అధికారులు పింఛన్లను మొక్కుబడిగా అందించారు. మొదటి రోజు కేవలం 21.157 మందికే పింఛన్లు అందాయి. గురువారం 60,007 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. రెండు రోజులలో 81,164 మంది లబ్ధిదారులకు 17.10 కోట్లు పంపిణి చేశారు. -
మునిసిపల్ కమిషనర్ల బదిలీ
కర్నూలు జిల్లా పరిషత్ : జిల్లాలో మునిసిపల్ కమినషనర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సాంబశివరావు ఉత్తర్వులు జారీ చేశారు. నందికొట్కూరు మునిసిపల్ కమిషనర్‌గా కేఎల్ఎన్.రెడ్డిని నియమించారు. ఈయన కర్నూలు మునిసిపల్ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-1గా పని చేస్తున్నారు. నందికొట్కూరు మునిసిపల్ కమిషనర్ గా ఉన్న ఎ.శంకర్రావును హైదరాబాద్‌లోని పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆదోని మునిసిపల్ కమిషనర్‌గా ఉన్న వివి.కన్యాకుమారిని మందపేట మునిసిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. అదే విధంగా గతంలో నంద్యాల మునిసిపల్ కార్యాలయంలో మేనేజర్‌గా ఉండి ఆముదాలవలసకు బదిలీయైన ఎన్వివిఎస్.నూకేశ్వరరావును తిరిగి మళ్లీ నంద్యాల మునిసిపల్ కమిషనర్ కార్యాలయంలో మేనేజర్‌గా నియమించారు. అయితే ఆదోని మునిసిపాలిటీకి కొత్త కమిషనర్‌ను నియమించలేదు. -
పోరాడి సాధించుకుందాం...
ఈ వార్డుల్లో సామాజిక మరుగుదొడ్ల సమస్యతో పాటు చాలా సమస్యలు మున్సిపల్ కమిషనర్ పరిష్కరించవలసినవే. ఎమ్మెల్యే నిధుల నుంచి నేను మంజూరు చేసిన పెలైట్వాటర్ స్కీంలు పాడైపోతే... ఆ వార్డు వాసులను సొంత డబ్బులతో బాగుచేసుకోమంటే ఎలాగ ? బంగారమ్మకాలనీలో గిరిజనులకు ఇళ్లపట్టాలు ఇవ్వకుండా ఇచ్చినట్టు చెబుతుండడం విచారకరం. ఈ విషయమై తహశీల్దార్‌తో మాట్లాడతాను. ఇళ్ల స్థల పట్టాలు పొందని గిరిజనులందరికీ న్యాయం జరిగేలా చేస్తాను. 11వ వార్డు చిన్నవీధిలో సామాజిక మరుగుదొడ్లు మూడేళ్లకిందట నిర్మిస్తే కేవలం ఒక నెలమాత్రమే వినియోగంలో ఉన్నాయి, మోటారు పాడైపోవడంతో నిరుపయోగంగా మారాయి. మోటారుకు మరమ్మతులు జరిపేలా చేస్తాను. మురుగుకాలువకు ఆనుకుని రిటర్నింగ్‌వాల్ నిర్మించాల్సివుంది. అన్నింటికీ మించి అన్ని అర్హతలున్న వారికి పింఛన్లు ఉద్దేశపూర్వకంగా తొలగించారు. అర్హులందరికీ పింఛన్లు పునరుద్ధరించేందుకు తొలుత లోకాయుక్తను ఆశ్రయిస్తాం, ఆపై అవసరమైతే బాధితుల తరఫున న్యాయ స్థానాన్ని ఆశ్రయించి న్యాయం జరిగేలా చేస్తాను. అవి సాలూరు మున్సిపాలిటీ శివారు మురికివాడలైన 11, 14 వార్డులు. ఇక్కడ దళితులు, గిరిజనులు, నిరుపేదలు ఇలా అన్ని వర్గాల వారు సమస్యలతో సహజీవనం సాగిస్తున్నారు. తాగునీరందక, సీసీరోడ్లు, సామాజిక మరుగుదొడ్లు లేక, మురుగు కాలువలు పాడై, పింఛన్లు కోల్పోయి ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలోని మురుగు నీరంతా 11వ వార్డులో చిన్నవీధిని ఆనుకుని ఉన్న ప్రధాన కాలువ గుండా ప్రవిహ స్తోంది. దాని నుంచి వచ్చే దుర్గంధంతో వార్డు వాసులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కాలువకు ఆనుకుని ఉన్న గృహాలు నిత్యం కోతకు గురవుతున్నాయి. ఆయా వార్డుల్లో నివసిస్తున్న పేదల కష్టాలు, అవస్థలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. పేదలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమస్యలపై పోరాడి గెలుద్దామని వారికి ధైర్యం చెప్పారు. రాజన్నదొర : నాపేరు పీడిక రాజన్నదొర. సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేను. మీ సమస్యలు తెలుసుకునేందుకు సాక్షి తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మీవద్దకు వచ్చా ను. రాజన్న : చెప్పమ్మా... నీ పేరేంటి? ముగదమ్మ : నాపేరు జంగం ముగదమ్మ బాబు. భర్త చనిపోయాడు. సెంటు భూమిలేదు. రాజన్న : ఏంటి నీ సమస్య? ముగదమ్మ : నాకు ఐదు ఎకరాల భూమి ఉందని వచ్చే పింఛన్‌ను ఆపేశారు బాబు. నాకు భూమైనా ఇప్పించండి, లేపోతే పింఛనైనా ఇప్పించండి బాబు. రాజన్న: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పింఛన్లు ఇచ్చారు. నేడు వాటిని తొలగించేశారు. లేని భూమిని ఎలాగూ ఇప్పించలేం. న్యాయంగా రావాల్సిన పింఛన్ వచ్చేలా చేసేందుకు తహశీల్దార్, కలెక్టర్‌ను కలిసి మంజూరయ్యేలా కృషిచేస్తాను. రాజన్న : నీపేరేంటి? అప్పయ్యమ్మ: నాపేరు అప్పయ్యమ్మ బాబూ. రాజన్న: పెద్దావిడా చెప్పునీసమస్య ఏంటి ? అప్పయ్యమ్మ: నాకు గంజిపోసే వారే లేరుబాబు. రాజన్న: పింఛన్ వస్తోందా? అప్పయ్యమ్మ: ఆపీశారు బాబు. ఆధార్‌కార్డులో నావయసు 26సంవత్సరాలని ఉందట, అందుకే ఆపీశారట. రేషన్‌కార్డులో 60 ఏళ్లుగా వుందట. రాజన్న: అదేంటీ నిన్ను చూస్తేనే 70 ఏళ్లుంటాయని తెలుస్తోంది కదా. రాజన్న: పెద్దాయనా చెప్పు నీ సమస్య ఏంటి ? డోల లక్ష్మణ : నాపేరు డోల లక్ష్మణ. చిన్నవీధి పక్కగుండానే పెద్ద మురుగుకాలువ వెళ్తోంది. చాలా ఇళ్లు మురుగుకాలవను ఆనుకుని వున్నాయి. వర్షం పడితే ఇళ్లు కోతకు గురౌతున్నాయి. రాజన్న: ఏంచేస్తే ఇళ్లు పాడవకుండా ఉంటాయి? లక్ష్మణ : ఇళ్లు కోతకు గురవకుండా గ్రావెల్ వేసి, రిటైనింగ్ వాల్‌ను ఎత్తుగా కట్టాలి. రాజన్న: ముసలమ్మా, నీపేరేంటమ్మా? నీకొచ్చిన కష్టమేంటి? సామాలమ్మ; నాపేరు బిరుసు సామాలమ్మ. నా భర్త పోయాడు. పింఛన్ ఆపేశారు బాబూ. రాజన్న: వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి కదా... అంతేగాక భర్త చనిపోవడంతో వితంతు పింఛన్‌కు అర్హురాలివే. తప్పక మంజూరయ్యేలా ప్రయత్నిస్తాను. రాజన్న:అమ్మానీపేరేంటి?సమస్య చెప్పు. పైడిరాజు :నాపేరు పైడిరాజు.మొన్నటి తుపానుకు ఇంటి గోడ పడిపోయింది. రాజన్న: ప్రభుత్వం ఆదుకుందా? పైడిరాజు: పైసాఇవ్వలేదు సార్. కూలిచేసుకు బతేకేవాళ్లం. రాజన్న: నీపేరేంటమ్మ? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? పార్వతి: నాపేరు డోల పార్వతి బాబు. ఇళ్లు కట్టుకోమన్నారు. లోన్ ఇస్తామన్నారు. బిల్లు ఇవ్వడంలేదు. అప్పులపాలైపోయాను. రాజన్న: నీలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. గృహనిర్మాణ రుణాల బిల్లు ల విషయమై శాసనసభలో మాట్లాడాను. మంత్రి నుంచి గానీ, సీఎం నుంచిగానీ సరైన సమాధానం రాలే దు. రానున్న శాసనసభా సమావేశాలలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. రాజన్న: అమ్మా నీపేరేంటి? వ్యాపా రం ఎలాగుంది? గంగమ్మ: నాపేరు గంగమ్మ సార్. కాయగూరలు వ్యాపారంలో అప్పుడప్పుడూ నష్టం వస్తోంది. రాజన్న: ఎస్సీ కార్పొరేషన్ లోన్ వచ్చిందా? లేకపోతే సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నావా? గంగమ్మ: నాకు 45ఏళ్లు వచ్చేశాయని లోన్ ఇవ్వమనేశారు సార్. రాజన్న: ప్రభుత్వం అలాంటి రూల్స్ పెడుతోంది మరి. రాజన్న: మరియమ్మా బాగున్నావా? మరియమ్మ: ఏం బాగు బాబూ. దీపావళికి సరదాగా బాణసంచా తయారుచేస్తున్నపుడు పేలిననాబిడ్డ అనీల్ ప్రాణాలు పోయాయి. మీకు తెలుసుకదా. రాజన్న: అధికారులు వచ్చి పరామర్శించారా?, ఆదుకున్నారా? మరియమ్మ: మీరు తప్ప ఏఒక్కళ్లూ రాలేదు సార్. దళితులమై పుట్టడమే మేం చేసిన పాపమా?, పేదలం కావడమే మేం చేసిన నేరమా? రాజన్న:ఆదుకోవాలని కలెక్టర్‌కు, సీఎంకు, విపత్తులశాఖకు లేఖలు రాశాను. అనంతరం ఇదే ప్రమాదంలో ఒక బిడ్డను పోగొట్టుకుని, మరో బిడ్డ రెండు చేతులు తీసేయాల్సి వచ్చిన బిరుసు కళావతి ఇంటికి వెళ్లారు. రాజన్న: అమ్మా కళావతి బాబుకు ఇప్పుడు ఎలావుంది? కేజీహెచ్‌లో చికిత్స చేస్తున్నారుకదా? ఎందుకు తీసుకువచ్చేశారు? కళావతి: అక్కడ డాక్టర్లు స్ట్రైక్ చేస్త్తున్నారట బాబూ, పంపేశారు. రాజన్న: బాబు(కామేశ్వరరావు) మాట్లాడుతున్నాడా? కళావతి: మాట్లాడలేక పోతున్నాడు. రాజన్న: సరే మరోమారు సీఎం దృష్టికి తీసుకువెళ్లి వాకతిప్ప ఘటనలో బాధిత కుటుంబాల మాదిరిగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తాను. రామమందిరం వద్దకు వెళ్లగానే పలువురు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆయన్ను చుట్టుముట్టారు. రాజన్న; ఏమ్మా!, మీ అందరి పింఛన్లు ఆపేశారా? పింఛన్ పోగొట్టుకున్న వారంతా: అవునుబాబు. రాజన్న : అర్హులందరికీ గతంలో లాగ పింఛన్లు ఇవ్వాలని కోరుతున్నాను. నావంతు ప్రయత్నిస్తాను. మీరు కౌన్సిలర్ అప్పారావును కలసి దరఖాస్తులు ఇవ్వండి. రోడ్డుపై రిక్షాలో చతికిలబడిన వృద్ధ వికలాంగురాలును పలకరిస్తూ... రాజన్న: అమ్మా నీపేరేంటి? కృష్ణమ్మ: నాపేరు గొంప కృష్ణమ్మ బాబూ. పింఛన్ ఆపేశారు. రాజన్న: నీకు పింఛన్ ఎప్పటినుంచి వస్తోంది? కృష్ణమ్మ: మీరే మంజూరు చేశారు బాబూ... నడవలేను,( అంతలో ఆమె భర్త ఆమె వికలాంగ ధ్రువీకరణ పత్రాలను చూపారు).60శాతం వికలాంగత్వం వున్నా, వయసు 70ఏళ్లు పైబడినా పింఛన్ ఆపేయడం దారుణమైన విషయమన్నారు. రాజన్న: అమ్మా నీపేరేంటి? రోజమ్మ: రివకల రోజమ్మ బాబూ రాజన్న: నా భార్యపేరు, నా తల్లి పేరుకూడా రోజమ్మే.(అక్కడున్నవారంతా మనసారా నవ్వుకున్నారు) రాజన్న: చెప్పు ఎలావుంది ఇడ్లీల వ్యా పారం? రోజమ్మ: రోజుకు 20రూపాయలు లాభం వస్తుంది. వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు లోన్ ఇవ్వమంటే వయసై పోయిందంటున్నారు. రాజన్న: అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడుతూ.., ఏమ్మా, పిల్లలకు ఆహారంగా ఏం పెడతున్నారు ? అంగన్వాడీ కార్యకర్తలు : 11గంటలకు గుడ్లు, 12గంటలకు భోజనం, 3గంటలకు కుర్కురే, శనగలు ఇస్తున్నాం. రాజన్న: ఏమైనా సమస్యలున్నాయా? అంగన్వాడీ కార్యకర్తలు : పిల్లలకు రోజూ పప్పు అన్నం పెడుతున్నారని వారి తల్లిదండ్రులు అడుగుతున్నార్ సార్, మాకు అధికారులు అవే ఇస్తున్నారు మరి. అలాగే అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి అవసరమైన స్థలం అందుబాటులో ఉంది. భవనం మంజూరయ్యేలా చేయండి సార్. పిల్లలు ప్లేట్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. సెంటర్‌కు ప్లేట్లు మంజూరు చేస్తే బాగుంటుంది సార్. రాజన్న: భవనం మంజూరయ్యేలా తప్పకుండా చేద్దాం. ఈవిషయమై తహశీల్దార్, కలెక్టర్‌తో మాట్లాడతాను. అక్కడినుంచి సామాజిక మరుగుదొడ్ల దగ్గరకు మహిళలతో వెళ్లారు. రాజన్న: ఏంటి మీసమస్య? మహిళలు: మూడేళ్ల కిందట సామాజిక మరుగుదొడ్లను కట్టారు. ఒక్క నెలే ఉపయోగపడింది. మోటారు పాడైందని వదిలేశారు. బాగుచేయండని మున్సిపాలిటీవారిని అడిగితే మీరే ఇంటికి 100రూపాయల చొప్పు న వసూలు చేసుకుని బాగుచేసుకొమ్మంటున్నారు. గెడ్డఒడ్డున కాలకృత్యాలను తీర్చుకోడానికి ఆడాళ్లం వెళ్లడం కష్టంగాఉంటోంది. రాజన్న: సామాజిక మరుగుదొడ్లను నిర్వహించడం ప్రభుత్వం బాధ్యత. నిరుపేదలైన దళితులను... మీరే బాగుచేసుకోండని అధికారులు చెప్పడం సరైందికాదు. అక్కడి నుంచి పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు.. రాజన్న: ఏమ్మా నీకేమైంది?, నీపేరేంటి, నీఊరేంటి? రాధ: నాపేరు కొర్ర రాధ. మా ఊరు ములగవలస, పాము కరిచింది. అందుకే ఇక్కడకు వచ్చాను. రాజన్న: నొప్పి తగ్గిందా? రాధ: బాధ తగ్గలేదు. పక్కనేవున్న డాక్టర్ రామ్మూర్తిని పిలిచి సరిగా చూసుకోండని ఆదేశించారు. రాజన్న: నీకేమయింది? నీపేరేంటి? మల్లేశ్వరి: నాపేరు మల్లేశ్వరి, మా ఊరు నెలిపర్తి. అక్కడే ఉన్న డాక్టర్ రామమూర్తి కలుగుజేసుకుంటూ నిమోనియాతో బాధపడుతోంది సార్. ఊపిరితిత్తుల్లో చీము చేరిందని అనుమానం. వైద్యం చేస్తున్నామన్నారు. రాజన్న: డాక్టర్.. చిన్నచిన్న విషయాలకు రిఫర్ చేసేయకండి. డాక్టర్ రామ్మూర్తి: పంపడం లేదుసార్. రాజన్న: ఎస్పీహెచ్ఓ గారూ.... ఏమైనా సమస్యలున్నాయా..? ఎస్పీహెచ్ఓ: ఆస్పత్రిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత వుంది. బెడ్స్ సప్లైలేదు. ప్రహరీ కూలిపోవడంతో ఇబ్బందిగావుంది. రాజన్న: ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను. రోగులకు ప్రయోజనం కలిగేలా., ఆస్పత్రి అభివృద్ధి చెందేలా కృషి చేస్తాను. అక్కడి నుంచి నేరుగా బంగారమ్మకాలనీలోని గొడగలవీధి చేరుకున్నారు... రాజన్న: ఏమ్మా నీపేరేంటి?, ఏమైనా సమస్యలున్నాయా? ఈశ్వరమ్మ: నాపేరు ఈశ్వరమ్మ. కుళాయినీరు చిన్నధార వస్తోంది. చాలడంలేదు. మీరు కట్టించిన పెలైట్ వాటర్ స్కీం పాడైంది. బోరింగు పాడైంది. రాజన్న: మున్సిపాలిటీవారు కావాలనే లేని సమస్యలు సృష్టిస్తున్నట్టుగా ఉం ది. తాగునీటి సమస్య తలెత్తకుండా పెలైట్ వాటర్ స్కీంలు మంజూరు చేస్తే మరమ్మతులు జరపకుండా వాటిని వదిలేస్తున్నారు. ఎమ్మెల్యే అభివృద్ధి నిధులు ఆపేశారు. ఆ నిధులు వస్తే కేటాయిస్తాను. ఈవిషయమై మున్సిపల్ కమిషనర్, కలెక్టర్‌తో మాట్లాడతాను. కాలనీలోని ఎరుకల వీధికి వెళ్లారు... రాజన్న: నీపేరేంటమ్మ? సామాలమ్మ: నాపేరు దాసరి సామాలమ్మ. మాలో చాలామందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేశారని మళ్లీ పట్టాలు ఇవ్వడం లేదు సార్. మాకు ఇళ్ల పట్టాలు ఎప్పడిచ్చారో మాకే తెలియడం లేదు. ఆఫీసర్లేమో ఇచ్చీసామనిచెప్పి, ఇవ్వడంలేదు. అందుకే పాకలలో మగ్గుతున్నాం. మీరే న్యాయం చేయాలి. రాజన్న: ఇళ్ల స్థల పట్టాలవిషయంలో తహశీల్దార్, కలెక్టర్‌తో మాట్లాడతాను. ప్రయోజనం కలిగేలా కృషిచేస్తాను. పక్కనే ఉన్న కాలనీ నాయకుడు దాసరి భాస్కరరా వును కాలనీ ప్రతినిధిగా సమస్యలు తెలపాలని కోరారు. భాస్కరరావు: కాలనీలో ఇళ్లస్థల పట్టాల సమస్యతోపాటు మరుగుదొడ్ల సమస్య, తాగునీటి సమస్య ఉన్నాయి సార్. కాలువల్లో పూడికలను సక్రమంగా తీయడం లేదు. మీరు మంజూరు చేసిన నాలుగు పెలైట్ వాటర్ స్కీంలలో రెండు పాడయ్యాయి. వాటిని మున్సిపాలిటీవారు బాగుచేయడంలేదు. రాజన్న: సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు పోరాడదాం. ధైర్యంగా ఉండండి. వస్తాను...!!మళ్లీ కలుద్దాం... -
మునిసిపల్ కమిషనర్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ సంఖ్యలో మునిసిపల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. గత మూడు రోజుల్లో నలుగురు మునిసిపల్ కమిషనర్లు బదిలీ కాగా..గురువారం ఒక్క రోజే 10 మంది కమిషనర్లను బదిలీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్తి పన్నుల వసూళ్లు, 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పన్నుల్లో పురోగతితోపాటు వ్యక్తిగత వ్యవహార ైశె లిని పరిగణలోకి తీసుకుని ఈ బదిలీలను చేపట్టనట్లు అధికార వర్గాలు తెలిపాయి. గత నాలుగు రోజుల్లో 14 మంది బదిలీ కాగా, వారిలో ఐదుగురు కమిషనర్లకు తదుపరి పోస్టింగ్ కేటాయించకుండా పురపాలకశాఖ డెరైక్టరేట్‌కు సరెండర్ చేయడం గమనార్హం. గతంలో హుస్నాబాద్ నగర పంచాయతీ కమిషనర్‌గా పనిచేసిన పి.ప్రభాకర్‌ను అందోల్-జోగిపేట కమిషనర్‌గా బదిలీ చేస్తూ పురపాలక శాఖ డెరైక్టర్ బి.జనార్దన్‌రెడ్డి సర్క్యులర్ జారీ చేశారు. మునిసిపల్ కమిషనర్ల బదిలీలు ఇలా ఉన్నాయి. -
‘అభయహస్తం’పై రాజకీయ క్రీనీడ
పలమనేరు: అధికార పార్టీ పింఛన్ల పరిశీలన కమిటీ తీరు అభయహస్తం లబ్ధిదారులకు భస్మాసుర హస్తంగా మారింది. కమిటీ పరిధిలో లేని ఈ పథకంలోనూ రాజకీయం ప్రదర్శించారు. ఒక సంతకంతో అన్ని పింఛన్లనూ రద్దు చేసేశారు. జన్మభూమి గ్రామసభల్లో అధికారులను మహిళలు నిలదీస్తుండడంతో పొరపాటు జరిగిందని తిరిగి ఆ పింఛన్లు ఇస్తామంటూ మభ్యపెట్టేందుకు నానా యాతన పడుతున్నారు. ఇదిగో సాక్ష్యం పలమనేరు పురపాలకసంఘ పరిధి లో 151 మందికి వైఎస్ఆర్ అభయహస్తం ద్వారా ప్రతినెలా రూ.500 పింఛన్ ఇచ్చేవారు. డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలు బీమా చేసుకుని, 60 ఏళ్లు నిండాక అభయహస్తం పింఛన్ తీసుకుంటున్నారు. ఇది పూర్తిగా గ్రూ పుల నిర్వహణలో సభ్యుల డబ్బుతో జరిగే కార్యక్రమం. ఇదేమీ పట్టించుకోని పింఛన్ల పరిశీలన కమిటీ సభ్యు లు మున్సిపాలిటీలోని అభయహస్తం లబ్ధిదారులందరినీ జాబితా నుంచి తొలగించేశారు. ఈ పథకం ద్వారా పలమనేరులో 151 మంది రూ. 3,650 ప్రీమియంగా చెల్లించారు. వీరి కి అప్పటి ప్రభుత్వం అంతే మొత్తం జమ చేసింది. దీంతో వీరు ప్రతి నెలా రూ.500 పింఛన్ తీసుకుంటున్నారు. ఇప్పుడేం జరిగిందంటే అభయహస్తం పింఛన్లపై అవగాహన లేని ఈ కమిటీ సభ్యులు ఏకపక్షంగా లబ్ధిదారులకు 65 ఏళ్లు నిండలేదనే సాకుతో జాబితా నుంచి తొలగించారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 1,600 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆయా ప్రదేశాల్లో కూడా ఇదే పరిస్థితి చోటుచేసుకుందని తెలుస్తోంది. మండలాల్లో దాదాపు 9 వేల మంది అభయహస్తం పింఛన్దార్లలో ఏడు వేల మందిని తొలగించినట్టు సమాచారం. పొరపాటు జరిగిందంటున్న అధికారులు అభయహస్తం పింఛన్ల జోలికి వెళ్లొద్ద ని సాక్షాత్తు సీఎం ఆదేశించినా కమిటీ సభ్యులు ఏకపక్షంగా వ్యవహరించా రు. వైఎస్ఆర్ అభయహస్తం పథకం లో ఎంపికైన వారంతా వైఎస్ఆర్సీపీ కి చెందిన వారని తొలగించినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై పలమనేరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావ్ను వివరణ కోరగా మాకు కూడా తెలియకుం డానే జాబితాలో అభయహస్తం పింఛన్లన్నీ తొలగించారన్నారు. ఈ విషయమై డీఆర్డీఏ పీడీతో సంప్రదించామని తెలిపారు. వారందరికీ తిరిగి పింఛన్లు వచ్చేలా చూస్తామన్నారు. -
వానొస్తే వరదొచ్చినట్టే...!
- అధికారులు, నేతల నిర్లక్ష్య ఫలితం - చిన్నపాటి వర్షానికే ఒంగోలు జలమయం - నగరం నడిబొడ్డునా అదే పరిస్థితి - శివారు ప్రాంతాల్లో నరకమే ఒంగోలు అర్బన్: ఒంగోలు నగరంలోని రహదారులపై పొంగిపొర్లుతున్న నీళ్లు చూస్తే భారీ వర్షం పడిందనుకుంటే పొరపాటే. బుధవారం కురిసిన కొద్దిపాటి వర్షానికే నగరం నరకంగా మారింది. నగరపాలక పాలనా తీరును, ఉన్నతాధికారులు, రాజకీయ నేతల నిర్లక్ష్యాన్ని మరోసారి ఎండగట్టింది. ఎప్పటికప్పుడు ఇలా ఇబ్బందులు తలెత్తుతున్నా సమస్య తీవ్రతను గుర్తించకపోవడంతో నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడుతోందని నగరవాసుల విమర్శిస్తునానరు. స్థానిక పి.వి.ఆర్. బాలుర పాఠశాల వద్ద మురుగు కాలువల్లోకి వర్షపు నీరు వచ్చి చేరటంతో ఆ నీరంతా రోడ్లపైకి పరుగులు తీసింది. దాని పక్కనే ఉన్న కేంద్రీయ విద్యాలయం రోడ్డు, భాగ్యనగర్ రోడ్లపై వర్షపునీటితోపాటు మురుగు కాలువలు పొంగి ఇళ్లల్లోకి వెళ్లాయి. పాత మార్కెట్ సెంటర్లోని సెయింట్ థెరిస్సా పాఠశాల, నెల్లూరు బస్టాండ్ ప్రాంతంలోని బధిరుల పాఠశాలల్లో విద్యార్థులు తీవ్ర ఇక్కట్టకు గురయ్యారు. శివారు కాలనీలైన ఏకలవ్యనగర్, కేశవరాజు కుంట, మిలటరీ కాలనీ, ఇందిరా నగర్లలోని లోతట్టు ప్రాంత ఇళ్ళల్లో మురుగు నీరే పారింది. కొత్తపట్నం బస్టాండ్ దగ్గర ఉన్న ఫ్లై ఓవర్ వర్షపు తాకిడికి దెబ్బతిని వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. పోతురాజు కాలువపై ఉన్న చప్టాలకు పలుచోట్ల సరైన రెయిలింగ్ లేకపోవడంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయోందోళనకు గురవుతున్నారు. వర్షానికి ఇబ్బందులున్న ప్రాంతాల్లో చర్యలు తీసుకుంటున్నాం... - సిహెచ్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జలమయమైన కాలువలు, రోడ్లను గుర్తించాం. ఆయా ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించాం. -
చెప్పేదొకటి..చేసేదొకటా..?
శ్రీకాకుళం సిటీ : ఒకటి చెబుతూ..ఒకటి చేస్తున్నారంటూ..రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి జెడ్పీ సమావేశ మందిరంలో మూడు జిల్లాల మున్సిపల్ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు సు మారు 20 మున్సిపాల్టీల్లో పర్యటించానని, అం దులో శ్రీకాకుళం మున్సిపాల్టీతో సహా 15 మున్సిపాల్టీల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. శ్రీకాకుళంలో ప్రత్యేకాధికారికి, కమిషనర్‌కు బా గా గ్యాప్ ఉందన్న విషయం స్పష్టమవుతోందన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. శ్రీకాకుళంలో అనధికార లేఅవుట్లు, నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అధిక ము న్సిపాల్టీల్లో సిబ్బంది కొరత ఉందని, ఈనెలాఖరుకల్లా సిబ్బంది నియామకాలను చేపడతానని హామీ ఇచ్చారు. పారిశుద్ధ్యం మెరుగుపడాలని, డంపింగ్ యార్డుల నిర్వహణ, చెత్త సేకరణ అంశాల్లో రాష్ట్రంలోనే సాలూరు, బొబ్బిలి మున్సిపాల్టీలు ఆదర్శంగా పనిచేస్తున్నాయని, అక్కడికి వెళ్లి అక్కడి అధికారుల పనితీరును పరిశీలించాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. ఈసమావేశంలో మున్సిపల్ శాఖ కమిషనర్ వాణీ మో హన్, ఈఎన్సీ పాండురంగారావు, టౌన్ ప్లా నింగ్ డైరక్టర్ తిమ్మారెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ పాలనలో ప్రజలకు భాగస్వామ్యం శ్రీకాకుళం: మున్సిపల్ పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామని మంత్రి పి. నారాయణ చెప్పారు. వారం రోజుల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి వస్తుందన్నారు. జిలా ్లకు వచ్చిన ఆయన బుధవారం స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సాఫ్ట్వేర్ వచ్చిన తరువాత ప్రజలు తమ సమస్యను ఫోటో తీసి తమకు అప్లోడ్ చేస్తే వెంటనే దానిని సంబంధిత మున్సిపాలిటీకి పంపిస్తామన్నారు. 48 గంటల్లోగా సమస్యను పరిష్కరించి.. తిరిగి ఫోటో తీసి తమకు పంపిస్తే ఆ ఫోటోను ఫిర్యాదుదారునికి పంపిస్తామని చెప్పా రు. కార్మికశాఖామంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి వేసిన పలు ప్రశ్నలకు అధికారులు సరైన జవాబు చెప్పలేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం వరకు 20 నుంచి 30 శాతం పనులకే పరిమితమైన అధికారులు సీఎం వస్తుండడంతో 60 శాతం పూర్తి చేశారని..ఇదే పద్ధతి కొనసాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశం అనంతరం డం పింగ్యార్డును అత్యంత సుందరంగా తీర్చిదిద్ది అదే ప్రాంతంలో తన కుమార్తె వివాహం చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరును నమోదు చేసుకునేలా పనిచేసిన సాలూరు మున్సిపల్ కమిషనర్‌ను మంత్రులు ఘనంగా సత్కరించి అభినందలు తెలియజేశారు. సమావేశంలో ఇ చ్ఛాపురం శాసనసభ్యుడు బెందాళం అశోక్, రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ వాణీమోహన్, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్లో వ్యాపారుల మధ్య వాగ్వాదం రిమ్స్‌క్యాంపస్: మంత్రి నారాయణ పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్‌ను పరిశీలించారు.ఈ సందర్భంగా రెల్లి కులానికి చెందిన వ్యాపారు లు, వైశ్య కులానికి చెందిన వ్యాపారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమకు అన్యా యం చేస్తున్నారంటూ రెల్లి కులానికి చెందిన వ్యాపారులు వైశ్య కులస్థులపై ఫిర్యాదు చేశారు. అనంతరం తమ వాదన వినాలంటే..లేదు తమ వాదనే వినాలంటూ..ఇరు వర్గాలు ఒత్తిడి చేశారు. ఒక దశలో స్వల్పంగా తోపులాట జరి గింది. మార్కెట్లో మేడపై దుకాణాలు నిర్మిం చడం వల్ల నిరుపయోగంగా మారాయని మం త్రి దృష్టికి తెచ్చారు. షాపుల కేటాయింపులో బినామీల రాజ్యం నడుస్తోందని తొలగించాలని కోరారు. అనంతరం జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలో మంత్రి పర్యటించారు. ఆయనతో పాటు ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ వాణీమోహన్, జాయింట్ కలెక్టర్ జి.వీరపాండ్యన్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మెప్మా పీడీ మునుకోటి సత్యనారాయణ, ప్ర ణాళికా డెరైక్టర్ సుబ్బారావు, పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయండి శ్రీకాకుళం: శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ.. టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి వెంకటరమణ మాదిగ మంత్రికి వినతిపత్రం అందజేశారు. సముచిత స్థానం కల్పించాలని కోరారు. తెలగకులస్తులను బీసీల్లో చేర్చండి శ్రీకాకుళం అర్బన్: తెలగ కులస్తులను బీసీ జాబితాలో చేర్చేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆ సంఘ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి నారాయణను శ్రీకాకుళం ము న్సిపల్ కార్యాలయంలో కలిసి..వినతిపత్రం అందజేశారు. జిల్లాల వారీగానే నీటి నిల్వలు శ్రీకాకుళం సిటీ: రాష్ట్రంలో 2044 వరకు అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు పరిశ్రమలకు నీటిని సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల శాఖాధికారులతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుతో కలిసి ఆ యన సమీక్షించారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..వంశధార, నాగావళి నదుల నుంచి సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకుంటే.. ఇక్కడ కూడా గ్రిడ్ సక్సెస్ అవుతుందన్నారు. సమావేశంలో ప్ర భుత్వ విప్ కూన రవికుమార్, జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, మూడు జిల్లాల అధికారులు శ్రీకాకుళం ఎంపీ పాల్గొన్నారు. ఆదిత్యుని సన్నిధిలో.. అరసవల్లి: ప్రత్యక్ష దైవం ఆరోగ్యప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని మం త్రి పి.నారాయణ బుధవారం దర్శించుకున్నా రు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీర్వచనాలు పొందారు. మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయండి రిమ్స్‌క్యాంపస్: మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరుతూ మున్సిపల్ మంత్రి నారాయణను భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.బి.జి.నాయుడు కోరా రు. ఈ మేరకు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. -
48 గంటల్లో...సాధ్యమేనా!
విజయనగరం మున్సిపాలిటీ : రాష్ర్ట మున్సిపల్ శాఖ సోమవారం నుంచి ప్రారంభించనున్న మున్సిపల్ పోర్టల్‌లో ఫిర్యాదుదారుడు సమస్యకు సంబంధించిన ఫొటో తీసి అధికారులకు మెయిల్ చేయూల్సి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో అధికారి కంగా ప్రారంభంకానున్న పోర్టల్ లో రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలో సమస్యపైనైనా.. ఫిర్యాదు చేయవచ్చు. కేవలం మెయిల్ ద్వారా మాత్రమే పంపించే ఫిర్యాదును పోర్టల్ నిర్వాహకులు పరిశీలించి వాటిని సంబంధిత మున్సిపల్ కమిషనర్‌కు పంపిస్తారు. వారు 48 గంటల్లోనే సమస్యను పరిష్కరించి సంబంధిత ఫొటోలను హైదరాబాద్‌కు మెయిల్ చేయూల్సి ఉంటుంది. ఇలా రోజులో ఎన్ని ఫిర్యాదులు వస్తే అన్ని సమస్యలను పరిష్కరించిన అనంతరం ఫొటోల ద్వారానే నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇదే విషయూన్ని సదరు ఫిర్యాదుదారుని ఫోన్‌కు మెసేజ్ రూపంలో తెలియజేస్తారు. ఇలా చేయడం ద్వారా పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించి పాలనలో పారదర్శకత తీసుకురావాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ పోర్టల్ సేవలను త్వరలోనే అన్ని మున్సిపాలిటీలకు విస్తరించనున్నట్టు సమాచారం. వచ్చిన ఫిర్యాదులపై స్పందించని మున్సిపల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారని వినికిడి. అధికారులకు కత్తి మీద సామే... జిల్లాలో విజయనగరం, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలు ఉండగా అందులో 129 వార్డులున్నాయి. వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో సమస్యలు పెద్ద మొత్తంలోనే పేరుకుపోయాయి. ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగు నీరు, వీధి దీపాలపై అధికంగా సమస్యలు వస్తుంటాయి. ఈ తరహా సమస్యలను పరిష్కరించాలని ఆయా మున్సిపాలిటీల్లో నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌తో పాటు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదులు కోకొల్లలుగా ఇప్పటికే వస్తున్నాయి. అయితే వాటిని పరిష్కరించేందుకు అవసరమైన సిబ్బంది లేకపోవటంతో సమస్యల పరిష్కారంలో జాప్యం నెలకొంటున్నట్లు అధికారిక వర్గాల నుంచి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించే విధానాన్ని మున్సిపల్ శాఖ ప్రవేశపెట్టడం అధికారులకు మింగుడుపడటం లేదు. ఓ వైపు సిబ్బంది కొరతను తీర్చాల్సిన అంశాన్ని పక్కన పెట్టి సమస్యలు పరిష్కరించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలపై ఆందోళన చెందుతున్నారు. అవసరమైన సిబ్బంది లేకుండా ఇటువంటి సేవలు అందించడానికి ప్రభుత్వం పూనుకోవడం కేవలం ఒక తంతుగానే మిగులుతుందని పలువురు పెదవి విరుస్తున్నారు. సమస్యల నడుమ ప్రారంభిస్తున్న మున్సిపల్ పోర్టల్‌తో పాలనలో ఎంత మేర దక్షత లభిస్తుందో వేచి చూడాలి మరి. -
ఆమదాలవలసకు కమిషనర్ సెలవ్!
ఆమదాలవలస:జిల్లాలో అధికార యంత్రాంగంపై అధికార పార్టీ ఒత్తిళ్లు నానాటికీ తీవ్రతరమవుతున్నాయి. దీనివల్ల ప్రశాంతంగా విధులు నిర్వహించలేక పలువురు పలాయన మంత్రం పఠిస్తున్నారు. ఆమదాలవలస మున్సిపల్ కమిషనర్ ఉదంతమే దీనికి నిదర్శనం. మున్సిపల్ కమిషనర్ ఎన్.నూకేశ్వరరావు సెలవుపై వెళ్లిపోయారు. ఆయన 15 రోజులు మెడికల్ లీవ్ పెట్టినప్పటికీ.. ఇక తిరిగి రారని తెలుస్తోంది. తాను నివాసం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసేయడం, ప్రభుత్వం ఇచ్చిన సిమ్ కార్డును కూడా వాపసు ఇచ్చేయడం తిరిగి వచ్చే ఉద్దేశం ఆయనకు లేదని స్పష్టమవుతోంది. వాస్తవానికి వ్యక్తిగత వినతిపైనే ఆయన ఆమదాలవలస కమిషనర్‌గా వచ్చారు. గతంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో గ్రేడ్-2 మేనేజర్‌గా పని చేసిన ఆయన అక్కడి నుంచి నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో గ్రేడ్-1 మేనేజర్‌గా పదోన్నతిపై వెళ్లారు. ఆమదాలవలస కమిషనర్ పోస్టు ఖాళీ కావడంతో వ్యక్తిగత వినతి పెట్టుకుని గత ఏడాది జూన్‌లో ఇక్కడికి వచ్చారు. ఏడాదిపాటు చక్కగా విధులు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి పాలకవర్గం ఏర్పాటు చేయడంతో కష్టాలు మొదలయ్యాయని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. టీడీపీ పట్టణ, నియోజకవర్గ నాయకులు ఆయనపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చి తాము చెప్పినట్లు చేయాలని పీక మీక కత్తి పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానిక కూరగాయల మార్కెట్ కూల్చివేత వివాదం ఈ ఒత్తిళ్లకు పరాకాష్టగా మారింది. కౌన్సిల్ తీర్మానం లేకుండా, వర్తకులకు నోటీసులు ఇవ్వకండా, కొందరు హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని కూడా పట్టించుకోకుండా అర్ధరాత్రి కూరగాయల మార్కెట్‌ను కూలగొట్టించే విషయంలో టీడీపీ నేతలు వ్యవహరించిన తీరుతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు. దీనికితోడు మున్సిపాలిటీలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో వర్తకుల పక్షాన నిలిచి తీవ్ర ప్రతిఘటించడంతోపాటు కమిషనర్‌ను పలుమార్లు నిలదీసింది. ఈ ఉదంతంతో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అపవాదు కూడా మూటగట్టుకున్నారు. దీంతో ఇరకాటంలో పడిన కమిషనర్ ఈ పరిస్థితుల్లో ఇక్కడ పని చేయలేనని భావించి, సెలవు పేరుతో వెళ్లిపోయారు. ప్రస్తుతం శానిటరీ ఇన్స్పెక్టర్ పోలారావుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కాగా కమిషనర్‌గా తమకు అనుకూలంగా ఉండే అధికారిని నియమించుకునేందుకు అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారని తెలిసింది. -
లైంగిక నేరాలపై అవగాహన
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా మహిళలు, శిశువులపై లైంగిక నేరాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా పెద్ద ఫలితం మాత్రం ఉండడం లేదు. ఈ విషయంలో తమ వంతు సహకారం అందించేందుకు గణపతి మండళ్లు నడుం బిగించాయి. గణేశ్ ఉత్సవాలను పుస్కరించుకొని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ), పోలీసులు, పలు గణేశ్ మండళ్లు సంయుక్తంగా లైంగిక నేరాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు కంకణం కట్టుకున్నాయి. ఇందుకు గణేశ్ మండళ్లను వేదికగా చేసుకుంటున్నాయి. మహిళలు, శిశువులపై జరుగుతున్న నేరాలు, వాటి నివారణ చర్యలను వివరించే పోస్టర్లును మండళ్ల వేదికల వద్ద అంటించనున్నారు. గణేశుడిని సందర్శించేందుకు వచ్చిన భక్తులకు వీటితో కొంతైన అవగాహన ఏర్పడుతుందని మండళ్ల నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ‘లైంగిక నేరాల నియంత్రణ అత్యంత కీలక అంశం. గణపతి ఉత్సవాలను పురస్కరించుకొని వేల సంఖ్యలో భక్తులు మండళ్లను సందర్శిస్తుంటారు. దీంతో వీరందరినీ లైంగిక నేరాలపై చైతన్యవంతులను చేసేందుకు ఇదే మంచి అవకాశం. మేం ఈ సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి పోస్టర్లను అంటిస్తాం’ అని బీఎంసీ అధికారి ఒకరు తెలిపారు. అడిషనల్ మున్సిపల్ కమిషనర్ ఎస్వీఆర్ శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గణేశుణ్ని సందర్శించడానికి వచ్చే భక్తులకు అవగాహన కల్పించాలన్న ఆలోచన హర్షణీయమని అన్నారు. ఇదిలా వుండగా పోలీసులు ఇందుకు సంబంధించిన 10 వేల పోస్టర్లను ప్రచురించారు. వీటిని త్వరలోనే మండళ్లకు పంపిణీ చేయనున్నారు. లాల్బాగ్ చా రాజా మండలి వద్ద కూడా వీటిని అంటించనున్నారు. -
కమిషనర్ శివనాగిరెడ్డి అరెస్టు
అమలాపురం టౌన్ :ఏసీబీకి పట్టుబడిన అమలాపురం మున్సిపల్ కమిషనర్ ఎ.శివనాగిరెడ్డిని గురువారం అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. బుధవారం ఆయనను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు సాయంత్రం విచారణ జరిపారు. అక్కడ నుంచి రాత్రి రాజమండ్రికి తరలించారు. అక్కడ కూడా విచారణ చేసి రాజమండ్రి త్రీ టౌన్ పోలీసు స్టేషన్లో అప్పగించారు. గురువారం ఉదయం విజయవాడ కోర్టుకు తీసుకువెళ్లారు. కమిషనర్‌ను అరెస్ట్ చేసి కోర్డులో హాజరు పరుస్తున్నట్లు ఏసీబీ సీఐ రాజశేఖర్ ధ్రువీకరించారు. పనుల ఫైళ్లను తనిఖీ చేసిన ఆర్డీ కమిషనర్ ఏసీబీకి పట్టుబడటంతో రాజమండ్రి మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ (ఆర్డీ) రవీంద్రబాబు బుధవారం రాత్రి అమలాపురం మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. కమిషనర్ శివనాగిరెడ్డిని ఏసీబీకి పట్టించిన మున్సిపల్ కాంట్రాక్టరు అరిగెల బాబి మున్సిపాలిటీలో చేపట్టిన, చేపడుతున్న పనుల ఫైళ్లను పరిశీలించారు. ఇంజనీరింగ్ విభాగంలోని మొత్తం ఫైళ్లను తనిఖీ చేశారు. కాంట్రాక్టర్ తాను చేపట్టిన డ్రెయిన్ పనికి బిల్లు ఇవ్వటంలో కమిషనర్ ఇబ్బంది పెట్టడంతోపాటు లంచం అడిగారని, అందుకే ఏసీబీని ఆశ్రయించానని చెబుతున్న క్రమంలో ఆర్డీ రవీంద్రబాబు ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంలో ఆ పని తాలూకు ఫైలు కోసం ఆరా తీశారు. అది గల్లంతైనట్లు గుర్తించారు. ఇంజినీరింగ్ విభాగంలో లోపాలు ఉన్నాయని ఆయన గమనించినట్లు తెలిసింది. రిమార్కుతోనే బిల్లు నిలిపేశారా? డ్రెయిన్ పని ఫైలు గల్లంతులో ఇంజనీర్లదే తప్పిదంగా కనిపిస్తోంది. ఆ ఫైలును అటెండర్ ద్వారా గతంలో కమిషనర్‌కు పంపినప్పుడు తాను వెనకాలే ఉన్నానని కాంట్రాక్టరు చెబుతున్నారు. ఆ ఫైలుపై ఇంజనీర్లు రిమార్కు రాసినందువల్లే బిల్లు ఇవ్వటంలో జాప్యం చేశానని కమిషనర్ అంటున్నారు. కాంట్రాక్టరు బిల్లు కోసం కమిషనర్ వద్దకు పదే పదే తిరుగుతున్నప్పుడే ఆ ఫైలు కనిపించటంలేదని తేలింది. ఒక ఫైలు కనిపించకుండా పోవడానికి ఇంజనీరింగ్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ఇంజనీర్లు మాత్రం ఆ ఫైలును కమిషనర్ వద్దకు గతంలోనే పంపించేశామని చెబుతున్నారు. ఆర్డీ తన విచారణలో ఫైలు గల్లంతవడం ఇంజనీర్ల బాధ్యతారాహిత్యం గానే గుర్తించారు. దీనిపై పురపాలక శాఖ కమిషనర్ (డీఎంఏ)కు నివేదిక పంపించారు. -
ఏసీబీ వలలో ‘కమీష’నర్
అమలాపురం టౌన్ : అమలాపురం మున్సిపల్ కమిషనర్ ఎ.శివనాగిరెడ్డి బుధవారం తన చాంబర్లో ఓ కాం ట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. నాగిరెడ్డి మున్సిపల్ కాంట్రాక్టర్ అరిగెల బాబి నుంచి రూ.15 వేలు తీసుకుంటుం డగా రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ ఎన్.వెంకటేశ్వరరావు, సీఐ రాజశేఖర్ దాడి చేసి పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మున్సిపాలిటీలోని 17వ వార్డులో కాంట్రాక్టరు బాబి రూ.3 లక్షలతో డ్రెయిన్ నిర్మిస్తున్నారు. ఈ పనికి సంబంధించిన అప్పటికే పూర్తై పనికి రూ.1.90 లక్షలు మున్సిపాలిటీ చెల్లించింది. అయితే ఇంకా రూ.29 వేలు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం ఇవ్వటానికి కమిషనర్ రూ.20 వేలు లంచం డిమాండు చేశారన్నది కాంట్రాక్టరు బాబి అభియోగం. దీనిపై ఆయన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దానితో వారు కమిషనర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు పథకం పన్నారు. బుధవారం ఉదయం కాంట్రాక్టర్ బాబి నుంచి కమిషనర్ నాగిరెడ్డి రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాంట్రాక్టర్‌ను కమిషనర్ రూ.20 వేలు లంచం డిమాండ్ చేస్తున్నప్పుడు వారి మధ్య సంభాషణలను ఈ నెల 22, 25 తేదీల్లో రికార్డు చేశామన్నారు. బుధవారం ఉదయం కాంట్రాక్టర్ నుంచి కమిషనర్ రూ.15 వేలు ఇస్తుండగా ప్రత్యక్షంగా పట్టుకున్నామని చెప్పారు. లంచంగా ఇచ్చిన నోట్లపై ముందుగా తాము రాసిన రంగు కమిషనర్ చేతికి అంటుకున్నట్టు గుర్తించామన్నారు. అంతేకాక కాంట్రాక్టరు ఇచ్చిన సొమ్ములను కమిషనర్ తీసుకుని తన జేబులో పెట్టుకున్నట్లు కూడా గమనించామని చెప్పారు. ఈ ఆధారాలతో కమిషనర్‌పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కాంట్రాక్టరు బాబి అమలాపురం మున్సిపాలిటీలో గత పదేళ్లుగా సివిల్ కాంట్రాక్టరుగా ఉన్నారని తెలిపారు. కాగా తాను చేసిన పనికి సంబంధించిన ఫైలును కమిషనర్ తొక్కిపెట్టుకుని అది ఏమైందో తెలియదంటూ, మిగిలిన బిల్లు ఇవ్వకుండా తిప్పించుకోవటమే కాక లంచం అడగడంతోనే ఏసీబీని ఆశ్రయించానని కాంట్రాక్టర్ అరిగెల బాబి విలేకరులకు తెలిపారు. కమిషనర్ సచ్ఛీలుడన్న కౌన్సిలర్లు కమిషనర్ శివనాగిరెడ్డి అమలాపురం కమిషనర్‌గా డిప్యుటేషన్‌పై రావడానికి ముందు హైదరాబాద్ సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారిగా ఉన్నారు. ఆరు నెలల కిందట పంచాయతీరాజ్ శాఖను వీడి, పురపాలక శాఖకు వచ్చి అమలాపురం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. కాగా కమిషనర్‌పై ఏసీబీ దాడి జరుగుతోందన్న సమాచారం తెలుసుకుని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్లందరూ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కమిషనర్ అవినీతిపరుడు కాదని, ఆయనపై కొందరు కాంట్రాక్టర్లు కుట్ర పన్ని, పథకం ప్రకారం ఇలా ఇరికించారని ఏసీబీ డీఎస్పీకి చెప్పారు. -
ఇదో రకం..పంచాయితీ!
శ్రీకాకుళం, పాలకొండ రూరల్: పాలకొండ పట్టణం నగర పంచాయతీగా మారి సుమారు ఏడాది అవుతోంది. ఇటీవలే ఎన్నికలు జరిగి కౌన్సిల్ పాలకవర్గం కూడా ఏర్పాటైంది. కానీ ఇప్పటికీ ఇక్కడ పంచాయతీ పాలనే కొనసాగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి ప్రధాన మార్కెట్లోని షాపుల లీజుల వ్యవహారం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఏళ్ల తరబడి పట్టణ ఆదాయానికి గండి కొడుతున్న ఈ వ్యవహారం నగర పంచాయతీగా మారిన తర్వాత కూడా కొనసాగుతుండటం విస్మయం కలిగిస్తోంది. ఏడాది క్రితం వరకు పంచాయతీగా ఉన్న పాలకొండలోని ప్రధాన మార్కె ట్లో సుమారు 28 ఏళ్ల క్రితం నిర్మించిన షాపులకు ఇప్పటికీ నామమాత్రపు అద్దెలే వసూలు చేస్తున్నారు. 36 పెద్ద, 10 చిన్న షాపులు ఉండగా.. పెద్ద షాపులకు రూ.700, చిన్నవాటికి రూ.550 అద్దె వసూలవుతున్నట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. దీని వల్ల పాలకొండ గత పంచాయతీ, ప్రస్తుత నగర పంచాయతీ లక్షల్లోనే ఆదాయం కోల్పోయింది. స్థాయి పెరిగిన తర్వాత కూడా.. నిబంధనల మేరకు అద్దె ఎందుకు పెంచలేదన్నది పక్కన పెడితే నగర పంచాయతీగా మారిన తర్వాత దాని పరిధిలోని షాపులు, ఇతరత్రా లీజులను టెండర్లు పిలిచి మున్సిపల్ కమిషనర్ ఖరారు చేయాల్సి ఉంటంది. అద్దెలను కూడా నగర పంచాయతీ స్థాయికి తగినట్లు పెంచాలి. కానీ ఇక్కడ మాత్రం జిల్లా పంచాయతీ కార్యాలయంలోని కొందరి అండదండలతో పాలకొండ పంచాయతీ అధికారులే ఆ పని కానిచ్చేశారు. మున్సిపల్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆగమేఘాల మీద పాత రేట్లకే లీజులు రెన్యూవల్ చేసేశారు. స్పెషల్ అధికారి దృష్టికి గానీ, కమిషనర్ దృష్టికి గానీ తీసుకువెళ్లక పోవడంతో అక్రమాలు జరగాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇందుకు గాను ఒక్కో షాపు నుంచి వేలల్లో దండుకున్నారని తెలుస్తోంది. పైగా తమ అక్రమాలను కప్పిపుచ్చుకొనేందుకు లీజు కాలపరిమితి పెంచినట్లు ఆయా అధికారుల సంతకాలతోనే ధ్రువపత్రాలు సృష్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ధ్రువపత్రాలు చూపేందుకు అటు సిబ్బంది.. ఇటు షాపుల నిర్వాహకులు అంతగా సుముఖత చూపకపోవడంతో అధికారుల సంతకాలు ఫోర్జరీ అయ్యాయన్న అనుమానాన్ని కొందరు వ్యక్తపరుస్తున్నారు. సొంత షాపుల్లా చెలామణీ పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ప్రధాన మార్కెట్లో ఉన్న ఈ 46 షాపులను ఏళ్ల తరబడి అనుభవిస్తున్న వర్తకులు వీటిని తమ సొంత షాపుల్లా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. వీటిలో వస్త్రాలు, కిరాణా, సిమెంట్, ఐరెన్ వంటి హోల్‌సేల్ దుకాణాలతో పాటు కూరగాయలు, పండ్లు వంటి చిరు వ్యాపారాలు చేస్తున్నవారూ ఉన్నారు. ప్రతి మూడేళ్లకోసారి లీజు గడువును పొడిగించుకుంటూ నామమాత్రపు అద్దెలు చెల్లిస్తున్నారు. తాజాగా 2014-15 సంవత్సరానికి గాను ఈ షాపుల రెన్యూవల్ ఇటీవలే జరిగింది. అయితే అద్దెలు మాత్రం పంచాయతీ హయాంలో చెల్లిస్తున్న రేట్లే చెల్లిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కాగా లీజుకు తీసుకున్న ఈ షాపుల్లో కొన్నింటిని లీజుదారులు వేరే వ్యక్తులకు ఇచ్చి అధిక అద్దెలు వసూలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇదే విషయమై నగర పంచాయతీ కమిషనర్ టి.కనకరాజు వద్ద ప్రస్తావించగా ఏళ్ల తరబడి ఉన్న వ్యాపారస్తులు మూడేళ్లకోసారి షాపుల రెన్యూవల్‌కు దరఖాస్తు చేస్తున్నారని, తాజాగా మార్చి నెలలో ఈ షాపుల లీజు రెన్యూవల్ చేసిన సమయంలో 33.13 శాతం అద్దె పెంచినట్లు చెప్పడం విశేషం. ఫైళ్లు చూపించడం లేదు:డీపీవో ఈ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా వ్యవహారం తన దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత ఫైల్ తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించానని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆ ఫైల్‌ను తనకు చూపించలేదని ఎక్కడ ఉందో కూడా తెలియడంలేదన్నారు. దాంతో తనకూ కూడా అనుమానం కలుగుతోందన్నారు. నగర పంచాయతీగా మారిన తర్వాత లీజు పొడిగింపు అధికారం పంచాయతీ అధికారులకు ఉండదన్నది వాస్తవమేనని అంగీకరించారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని చెప్పారు. -
కాటేస్తున్న...
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లా కేంద్రమైన కడపలోని గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్లో సుబ్రమణ్యం క్రాప్ట్ టీచర్. విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. మానవ హక్కుల వేదిక పోరాటం ఫలితంగా విచారణ చేపట్టారు. ఆరోపణలు వాస్తవమే.. చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు విద్యాశాఖ సిఫారసు చేసింది. ఇంక్రిమెంటు మాత్రమే కట్ చేశారు. ప్రస్తుతం సుబ్రమణ్యం అదే పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన ఓ యూనియన్‌కు నాయకుడు కూడా.. నాగేశ్వరనాయక్.. పుల్లంపేట మండలం వత్తలూరులో టీచర్. ఓ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. విషయం తెలిసి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు.. పోలీసులు కేసు నమోదు చేశారు. సస్పెండ్ కూడా అయ్యారు. ప్రస్తుతం మళ్లీ పనిచేస్తున్నారు. వనిపెంటలో రెడ్డయ్యనాయుడు టీచర్. విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురిచేస్తుండటంతో గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు స్టేషన్లో రాచమర్యాదలు పొందారు. కొన్నాళ్లు సస్పెండ్ అయి మళ్లీ విధులు నిర్వర్తిస్తున్నారు. బాల ఓబయ్య.. పోరుమామిళ్ల ఉర్దూహైస్కూల్లో హెడ్మాస్టర్. తొమ్మిదోతరగతి విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. ప్రజా సంఘాలు, పత్రికలు ఈ విషయమై నినదించాయి. విద్యాశాఖను దుమ్మెత్తి పోశాయి. ఆరు నెలలపాటు సస్పెండ్‌కు గురయ్యాడు. కౌన్సెలింగ్‌లో అదే పాఠశాలకు పోస్టింగ్ ఇచ్చారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు తరుచూ వెలుగు చూస్తున్నా నియంత్రించడంలో విద్యాశాఖ విఫలమవుతోంది. ఇటువంటి సంఘటనలతో సమాజంలో గురువులకు తలవంపులు తెస్తున్నారు. ఇటువంటివారిపట్ల కఠినంగా వ్యవహరించకపోవడం విద్యాశాఖ ప్రథమ తప్పుగా పలువురు భావిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుల ప్రలోభాలకు లొంగిపోయి తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో విద్యార్థినులపై లైంగిక వేధింపులు కొనసాగుతునే ఉన్నాయి. ప్రైవేటు కళాశాల కరెస్పాండెంట్ పద్మనాభరెడ్డి మొదలు, హెడ్మాస్టర్ బాలఓబయ్య, జంక్షన్ నాయక్, రెడ్డెప్పనాయుడు, నాగేశ్వరరావునాయక్, సుబ్రమణ్యం, బోయనపల్లె ఉపాధ్యాయుడు ఆర్థర్ వరకు లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు పునరావృతం అవుతునే ఉన్నాయి. గౌరవం కోల్పోతున్న గురువులు .... ఆచార్య దేవోభవా! అనే పదానికి కాలదోషం పడుతోంది. తల్లి, తండ్రితర్వాత స్థానంలో ఉపాధ్యాయులను చూడాలన్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. గురువుల చూపుల్లోని తేడాలు పసిబుగ్గలపై పురుగుల్లా పారాడుతున్నాయి. ఉపాధ్యాయ సహచరులు సైతం తమకెందుకులే అన్న భావనతో ఉండడం వల్ల మళ్లీ మళ్లీ ఇలాంటివి పునరావృతం అవుతున్నాయి. అభం శుభం తెలియని విద్యార్థినుల పట్ల నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్న గురువులపై క్రిమినల్ కేసులతోపాటు, నిర్భయ చట్టం అమల్లోకి తెచ్చి, ఉద్యోగం కోల్పొయేలా చర్యలుంటే తప్ప ఇలాంటి ఘటనలను నియంత్రించే అవకాశం లేదని పలువురు భావిస్తున్నారు. పోలీసు రిక్రూట్మెంట్లో వ్యక్తిగత ప్రవర్తనతోపాటు కుటుంబ చరిత్రను పరిగణలోకి తీసుకునే నిబంధన ఉంది. ఆ విధంగా ఉపాధ్యాయుడిని కూడా కుటుంబ నేపధ్యాన్ని వ్యక్తిగత ప్రవర్తనపై విచారించి నియమించుకోవాలనే నిబంధన ఉంది. అయితే మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ)లో పాసైతే ఉద్యోగం రెడీ అవుతోంది. నైతిక ప్రవర్తన మీద ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం లేదు. ఫలితంగా ఒకరి తర్వాత మరొకరు వక్రబుద్ధి గురువుల జాబితాలో చేరుతున్నారు. ఢిల్లీ నిర్భయ తరహాలో ఉద్యమిస్తేనే.... దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నత చదువు చదువుతున్న విద్యార్థిని నిర్భయ అత్యాచారం పట్ల ఉద్యమించినట్లుగా ప్రజానీకం చైతన్యవంతులయ్యేంత వరకు ఉపాధ్యాయుల నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయని విశ్లేషకుల అభిప్రాయం. తమ చిన్నారి లైంగిక వేధింపులకు గురైందని తెలిసినా సమాజానికి బయపడి తల్లిదండ్రులే ఆ ఘటనను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అత్యాచార ఘటనలను తీవ్రంగా తప్పుబట్టాల్సిన పై అధికారులు తేలికగా పరిగణిస్తున్నారు. దీంతోనే రాజంపేట ఎంఈఓ కృష్ణకుమార్‌ను గ్రామస్తులు చితకబాదారు. విద్యార్థినులపై అఘాయిత్యాలకు పాల్పడే గురువులపై నిర్భయ చట్టం అమలు చేయాలని ఈ సందర్భంగా పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
మమ్మల్ని సెలవుల్లో పంపండి...
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో చైర్మన్, కౌన్సిలర్ల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. దాంతో ఇరువురి అంతర్గత విభేదాలతో తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను సెలవుల్లో పంపాలని ఆయన రీజనల్ జాయింట్ డైరెక్టర్ కి లేఖ రాశారు. మున్సిపల్ కమిషనర్ బాటలోనే ఇతర ఉద్యోగులు సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా మున్సిపల్ సమావేశంలో మంగళవారం సభ్యుల మధ్య గొడవకు దారి తీసింది. చైర్పర్సన్ ఆదేశాల మేరకు కమిషనర్ మల్లారెడ్డి...అధికారులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. షెడ్యూల్ ప్రకారం బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ సునీతారాణి నిన్న సాయంత్రం భేటీ అయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు కార్యాలయానికి చేరుకొని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చైర్మన్, కౌన్సిలర్ల మధ్య విభేదాలు అధికారులకు తలనొప్పిగా మారాయి. -
ఆయన తీరు బాలే..!
విజయనగరం మున్సిపాలిటీ : ‘ఆయను తీరు బాగోలేదు సార్... చీటికీమాటికీ మన పని తీరును పరీక్షిస్తున్నారు.. తెగ చీవాట్లు పెడుతున్నారు. ఏదో ఒకటి చేసి ఆయన చిత్తశుద్ధిని చెత్తలో కలిపేయకుంటే ... వామ్మో! ఉద్యోగం చేయటం చాలా కష్టం సార్..!’ ఇవీ విజయనగరం మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణ గురించి ప్రజారోగ్య శాఖకు చెందిన కొంత మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు, పలువురు సార్జెంట్లు ఎంహెచ్ఓ యు.అప్పలరాజు ఎదుట సంధించిన అసంతృప్తి అస్త్రాలు. ఇటీవల ఓ సాయంత్రం మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో గల పాలాస్పత్రి వద్ద వీరంతా సమావేశమైనట్లు భోగట్టా. ఇన్స్పెక్టర్లు, సార్జెంట్లలో కొంత మంది మున్సిపల్ కమిషనర్ వ్యవహారశైలి తమకు నచ్చలేదంటూ ఎంహెచ్ఓ ఎదుట అక్కసు వెల్లగక్కారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి తమదైన నిర్లక్ష్యంతో విధి నిర్వహణను మమః అనిపించేస్తూ కాలాన్ని నెట్టుకొచ్చేస్తున్న పలువురు సిబ్బంది.. కమిషనర్ తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. విధి నిర్వహణలో విషయంలో కమిషనర్ చిత్తశుద్ధిని వారంతా జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. పారిశుద్ధ్య కార్మికుల పని తీరును పరీక్షించే బాధ్యత డ్వాక్రా గ్రూపులకు అప్పగించడం ఎంత వరకు సమంజసమని కొంత మంది సార్జెంట్లు ఎంహెచ్ఓను ప్రశ్నించారు. ప్రజారోగ్య శాఖ విభాగాధిపతిగా మున్సిపల్ హెల్త్‌ఆఫీసర్ గానీ, మున్సిపాలిటీ హెడ్‌గా కమిషనర్‌గానీ పర్యవేక్షించాలే తప్ప.. ఎటువంటి అర్హతాలేని వారు పెత్తనం చేలాయిస్తే ఎలా సహించగలమంటూ ప్రశ్నించినట్లు తెలిసింది. ఇంత మంది కమిషనర్లు వచ్చిపోయూరు గానీ.. ఎవరూ ‘యూనిఫారాలు ధరించండి. గుర్తింపు కార్డులు తగిలించుకోండి..’ అంటూ కార్మికులను, ఉద్యోగులను వేధించలేదంటూ కమిషనర్ పనితీరును ఎత్తిచూపినట్లు సమాచారం. దీనిపై స్పందించిన ఎంహెచ్ఓ... ‘ముందు మనలో లోపాలను అధిగమించాల్సిన అవసరం ఉంది. ఆ పని చేయండి.’ అంటూ అసంతృప్తులకు తిరిగి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ, బయోమెట్రిక్ హాజరు విధానం సక్రమంగా అమలు చేస్తే కమిషనర్ ఏ ఒంపు పెట్టి ఉద్యోగాలను నిందించగలరని అందరికీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఇంతలోనే పలువురు సిబ్బంది కల్పించుకుని ప్రజారోగ్య శాఖలో చోటు చేసుకుంటున్న అక్రమాలను ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తున్నారని, సదురు ఉద్యోగిని హెచ్చరించాలని కోరారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న తర్వాత గానీ ఎవరిపైనా చర్యలు తీసుకోవటం కుదరదని ఎంహెచ్ఓ సర్దిచెప్పి అక్కడి నుంచి వారిని పంపించేశారని సమాచారం. ఏదేమైనప్పటికీ మున్సిపల్ కమిషనర్‌గా సోమన్నారాయణ వచ్చిన తర్వాత పరిపాలనపరంగా ఎన్నోమార్పులు సంభవించారుు. సిబ్బంది పనితీరు కూడా మెరుగుపడింది. మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలపై కూడా పూర్తిస్థారుులో దృష్టి సారించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారన్న కితాబు కూడా ఆయనపై ఉంది. అటువంటి వ్యక్తిపై ప్రజారోగ్య శాఖ సిబ్బంది తిరుగుబాటుకు దిగడం గమనార్హం. -
ప్లీజ్... ఫోన్ చేయండి!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:లంచం అడిగిన మున్సిపల్ కమిషనర్ని అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టిచ్చేందుకు 70 ఏళ్ల వృద్ధుడు సాహసించాడు. చదువురాని గ్రామస్తులు మరో అవినీతి అధికారిని పట్టించారు. ఏసీబీ అధికారులు కోరుకుంటున్న చైతన్యం ఇదే. కానీ జిల్లాలో వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. లంచం తీసుకోవడమే కాదు.. ఇవ్వడమూ నేరమే. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్న వారూ కటకటాలు లెక్కించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రజలు చేయాల్సిందల్లా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు ఫిర్యాదు చేయడమే. ఈ విషయంలో జిల్లా ప్రజల్లో ఇంకా కావలసినంత చైతన్యం లేదని వారు బాధపడుతున్నారు. ఏసీబీ అధికారులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా, ఫిర్యాదు చేయాలని కోరుతున్నా అనుకున్న స్పందన మాత్రం కొరవడుతోంది. ఫిర్యాదుచేస్తే అధికారులు, కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తుందనో, డబ్బు ఖర్చవుతుందనో వారు వెనుకడుగు వేస్తున్నారు. వాస్తవానికి అటువంటి భయం అక్కర్లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఎంత చిన్నమొత్తం లంచం డిమాండ్ చేసినా మమ్మల్ని గుర్తుంచుకోవాలని, అడిగిన వ్యక్తి పనిపడతామని ఏసీబీ అధికారులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఫిర్యాదీలకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడకుండా ఒకేరోజు సాక్ష్యాల సేకరణ, ఫిర్యాదుకు సంబంధించిన లిఖిత పూర్వక అంశాలన్నీ పూర్తి చేస్తామని చెబుతున్నారు. నిందితుల నుంచి బెదిరింపులు రాకుం డా కూడా తాము అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. ఇదీ పరిస్థితి: జిల్లాలో 2012లో ఓ లంచం కేసు నమోదైంది. 2013లో 9 లంచం కేసులు, ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఒకటి నమోదైంది. పాలకొండ, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్లపై నమోదు చేసిన కేసులు సంచలనం సృష్టించాయి. ఇక 2012 డిసెంబర్లో నమోదైన మద్యం సిండికేట్ల కేసు జిల్లాలో సంచలనమే అయింది. దీనికి సంబంధించి అధికారులు చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు పెద్ద సం ఖ్యలో అధికారుల్ని కేటాయించడంతో మిగిలిన కేసులపై దృష్టిసారించలేకపోవడం వాస్తవమేనని శాఖాధికారులే అంగీకరిస్తున్నారు. ఇటీవల కాలంలో నమోదైన కేసుల్లో గత ఏడాది నలుగురికి శిక్ష పడగా, ఈ ఏడాది మరో ముగ్గురికి పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది ఇప్పటి రెండు లంచం కేసులు నమోదయ్యాయి. ప్రత్యేక డీఎస్పీ ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒకే డీఎస్పీ బాధ్యతలు నిర్వహించే వారు. దీంతో సీఐ స్థాయి అధికారే ఇక్కడి కేసులు పర్యవేక్షించే వారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఏసీబీకి ప్రత్యేక డీఎస్పీ కేటాయించే అవకాశం ఉంది. సిబ్బంది సంఖ్యను పెంచడంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇక తమకు పని చెప్పాల్సింది ప్రజలేనని అధికారులంటున్నారు. మిస్డ్ కాల్స్ సమస్య ఏసీబీ అధికారుల్ని మిస్డ్ కాల్స్ సమస్య వేధిస్తోంది. ప్రజల్ని చైతన్య పరిచేందుకు పోస్టర్లు, స్టీక్కర్లను బస్సులు, రైళ్లతోపాటు పలు చోట్ల గోడలకు అతికిస్తున్నారు. అందులో ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్లు ఇస్తున్నారు. ఈ నంబర్లకు మిస్డ్ కాల్స్ ఇస్తున్నారని, తిరిగి చేస్తే ఇది మీ నంబరో, కాదో తెలుసుకునేందుకు చేశామని చెబుతున్నారని అధికారులు వాపోతున్నారు. ఇక మరికొందరు ప్రైవేటు వ్యక్తులపై దాడులు చేయాలని కోరుతున్నారని, తాము ఉన్నది ప్రభుత్వ అధికారులపై నిఘాకు మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. కొందరు ఫిర్యాదు చేసినా లిఖిత పూర్వకంగా ఇచ్చేందుకు ముందుకు రాకపోవడం కూడా సమస్యవుతోందంటున్నారు. -
కమిషనర్‌పై సీఎంకు ఫిర్యాదు చేస్తా
ఖమ్మం కార్పొరేషన్: ఖమ్మంనగరంలోని త్రీటౌన్‌లో ఉన్న ఆంధ్రా బాలిక పాఠశాల కూల్చివేత ఘటనపై ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తామని రాజ్యసభ సభ్యులు వీ హనుమంతరావు తెలిపారు. ఆ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకుల కోరిక మేరకు శుక్రవారం ఆయన పాఠశాల స్థలాన్ని పరిశీలించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దుర్గాదేవి, విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ కొందరు వ్యాపారులతో కుమ్మక్కై ఎటువంటి నోటీసులు కానీ, ముందస్తు సమాచారం కానీ ఇవ్వకుండా పాఠశాల భవనాన్ని కూల్చివేశారని విద్యార్థులు తెలిపారు. దీనిపై పోలీస్ కేసు కూడా పెట్టామని, ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదని తెలిపారు. తప్పు జరిగిందని కమిషనర్ కూడా అంగీకరించారని, ఇప్పుడు మాత్రం పట్టించుకోవడం లేదని ఆయనకు తెలిపారు. అనంతరం ఎంపీ విలేకరులతో మాట్లాడారు. రాజకీయ చైతన్యం గల జిల్లాలో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, దేశానికి స్వాతంత్య్ర రాక ముందే స్థానిక నాయకులు పీ. రాములు మహిళలు చదువుకునేందుకు పాఠశాల ఏర్పాటుకు స్థలం దానం చేశారని అన్నారు. కానీ కొంతమంది స్వార్థపరులు దీనిని కబ్జా చేసేందుకు యత్నించడం బాధాకరమని అన్నారు. కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా ఒక భవనాన్ని కూల్చి వేయాలంటే ముందు ఆర్కియాలజీ(ఇంజనీరింగ్ విభాగం) వారి అనుమతి తీసుకోవాలని, ఆ తర్వాతే నోటీసులు ఇవ్వాలని, ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే కూల్చివేయాలని అన్నారు. కానీ ఇక్కడి అధికారులు ఈ పద్ధతులేవీ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన భవన నిర్మాణానికి రూ. 10లక్షల మంజూరు.. ఆ స్థలంలో నూతన భవనాన్ని నిర్మించేందుకు తన ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు వీ హనుమంతరావు ప్రకటించారు. రెండు మూడు నెలల్లో ఈ మొత్తాన్ని అందజేస్తానని తెలిపారు. మరో ఎంపీతో మాట్లాడి మరి కొన్ని నిధులు వచ్చేలా ప్రయత్నిస్తానని అన్నారు. ఎమ్మెల్యే పువ్వాడ ఆజయ్కూడా కొన్ని నిధులు ఇస్తారని, కార్పొరేషన్ అధికారులు కలెక్టర్‌ను కలిసి యుద్ధ ప్రాతిపదికన భవన నిర్మాణం చేపట్టి ఈ సంవత్సరం చివరి వరకు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ ఆజయ్‌కుమార్, మాజీ కౌన్సిలర్ కూల్‌హోం ప్రసాద్, తాళ్ళూరి హన్మంతరావు, ఉపాధ్యయ సంఘం నాయకులు శేఖర్, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రదీప్ పాల్గొన్నారు. -
మాట వినకుంటే వేటే!
సాక్షి, రాజమండ్రి :అధికారులూ... మాకు సలాం కొట్టి గులాం అంటే సరే.. లేదా మీరు తట్టా బుట్టా సర్దేసుకోవడం బెటర్.. మున్సిపాలిటీల్లో అధికారుల పట్ల తెలుగు తమ్ముళ్ల తీరిది. ప్రస్తుతం విధుల్లో ఉన్న మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగాల అధికారులు తమకు అనుకూలంగా పనిచేయని వాళ్లు ఉంటే వాళ్లని తక్షణం సాగనంపేందుకు కొత్త ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. ఈ నెల 19 తర్వాత ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక సలాం కొట్టని అధికారులను సాగనంపి.. తమ వారిని రప్పించుకునేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒత్తిళ్లు ప్రారంభం తమకు అనుకూలంగా పనిచేసేవారిని తెచ్చుకునేందుకు రాజమండ్రి, ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేయించాలని తెలుగు తమ్ముళ్లు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజమండ్రిలో కమిషనర్ తమకు అనుకూలంగా లేరని టీడీపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే పుష్కరాల్లో అంతా తమకు అనుకూలంగా ఉండాలని చూస్తున్న టీడీపీ నేతలు కమిషనర్‌పై ముందుగా గురి పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే కన్నా తానే సిటీలో పట్టు సాధించాలని చూస్తున్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఈ దిశగా అప్పుడే పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే బుచ్చయ్య పుష్కరాల ఏర్పాట్ల వంకతో తన నియోజకవర్గంలో కన్నా అర్బన్‌లో తిరుగుతూ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవహారం బీజేపీ నేతల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నా పైకి చెప్పుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. పుష్కరాల సందర్భంగా చేపట్టే పనులు పూర్తిగా తన కనుసన్నల్లోనే జరగాలని భావిస్తున్న ఈ సీనియర్ నేత వివిధ శాఖల్లో ఉన్న అధికారుల పనితీరును కూడా సమీక్షిస్తున్నారు. కలిసిరాని అధికారులను బదిలీ చేయించి, తలాడించే వారిని రప్పించుకోవాలని ఆయన ఇప్పటి నుంచే తహతహలాడుతున్నారు. ఎన్నికలే వేదికగా ఏలేశ్వరం నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి డివిజన్లలో మెజారిటీ లభించినా రిజర్వేషన్ ప్రకారం చైర్మన్ అభ్యర్థి గెలవలేదు. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు గాలం వేసిన నేతలు చైర్మన్ ఎన్నికల్లో తమకు కమిషనర్ పూర్తిగా సహకరించాలని భావిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జారీ చేసే విప్ల విషయంలో పూర్తిగా తమకు కమిషనర్ అనుకూలంగా వ్యవహరించని పక్షంలో అధికారిని బదిలీ చేయించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి అయిన చినరాజప్ప నియోజకవర్గంలోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీల్లో కమిషనర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని తెలుస్తోంది. సామర్లకోట కమిషనర్ స్వయంగా బదిలీపై వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తలాడించకపోతే బదిలీయే : జిల్లాలోని నలుగురు కమిషనర్లు స్థానిక ఎమ్మెల్యేలు ఎలా చెబితే అలా సర్దుకుపోయేందుకు రాజీ పడ్డట్టు తెలుస్తోంది. మరో మూడుచోట్ల కమిషనర్లు మున్సిపల్ ఎన్నికలకు ముందే బదిలీలపై వచ్చారు. ఈ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం అనంతరం ఈ అధికారులు తాము చెప్పినట్టు తలాడించకపోతే బదిలీ వేటు వేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
‘ఆర్మూర్’ఎక్స్అఫీషియో మెంబర్‌గా కవిత
తన సమ్మతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్‌కు ఫ్యాక్స్ చేసిన ఎంపీ ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్స్ అఫీషియో మెంబర్‌గా కొనసాగడానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన సమ్మతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ రాజుకు ఫ్యాక్స్ ద్వారా శుక్రవారం పంపించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు ఆర్మూర్, బోధన్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒక్క మున్సిపాలిటీలో మాత్రమే ఎంపీ ఎక్స్ అఫీషియో మెం బర్గా కొనసాగడానికి అవకాశం ఉంది. దీంతో ఆర్మూర్ మున్సిపాలిటీలో1965 మున్సిపల్ చట్టం ప్రకారం ఎక్స్ అఫీషియో మెంబర్‌గా కొనసాగడానికి తన సమ్మతి పత్రాన్ని అందజేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక నేపథ్యంలో ఎక్స్ అఫీషియో మెంబర్‌గా సమ్మతించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో 23 వార్డులుండగా చైర్ పర్సన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వు చేయబడింది. కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలను, టీఆర్ఎస్ 10 స్థానాలను, టీడీపీ, బీజేపీ చెరొక కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకున్నాయి. చైర్ పర్సన్ పీఠాన్ని టీఆర్ఎస్ వశం చేసుకోవడానికి బలం పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఎంపీ కవిత ఆర్మూర్‌లో ఎక్స్ అఫీషియో మెంబర్‌గా తన అంగీకారాన్ని తెలిపారు. ఇకపై ఆర్మూర్ మున్సిపాలిటీలో నిర్వహించే అధికారిక వ్యవహారాలన్ని ఎంపీకి కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. చైర్ పర్సన్ ఎన్నిక కంటే ముందే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సైతం మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో కొనసాగడానికి సమ్మతి పత్రం అందజేయాల్సి ఉంది. దీంతో మున్సిపాలిటీలో టీఆర్ఎస్ బలం 12కు చేరగా బీజేపీ కౌన్సిలర్ ద్యాగ ఉదయ్ కుమార్ ఇప్పటికే టీఆర్ఎస్కు మద్దతు తెలపడంతో టీఆర్ఎస్ బలం 13కు చేరింది. ఆర్మూర్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేయడానికి ఎంపీ, ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో మెంబరు ్లగా సమ్మతించడం కలిసి వచ్చే అంశంగా మారింది. ఎంపీ కవిత మెయిల్ చేసిన లేఖ తనకు అందినట్లు మున్సిపల్ కమిషనర్ రాజు నిర్దారించారు. కమిషనర్‌తోపాటు పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం, కమిషనర్, డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లకు, రీజినల్ డెరైక్టర్ కం. అప్పిలేట్ కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణకు సమ్మతి పత్రాల ప్రతులను పంపించారు. -
లక్షలు వెచ్చించారు..గాలికొదిలేశారు
చీరాల, న్యూస్‌లైన్: పోతేపోనీ జనం సొమ్మేకదా..అనే ధోరణిలో ఉంది చీరాల మున్సిపల్ యంత్రాగం. లక్షలాది రూపాయలు వెచ్చించి చేపట్టిన నిర్మాణాలు నిరుపయోగంగా ఉంటున్నాయి. ప్రజల అవసరాలు, పట్టణాభివృద్ధిపై పాలకులు శ్రద్ధ చూపడంలేదు. మున్సిపాలిటీ నిధులు 13 లక్షలతో అన్ని హంగులతో నిర్మించిన స్కేటింగ్ కోర్టును 2008లో ప్రారంభించారు. మొదట్లో కొంతకాలం పెద్ద ఎత్తున యువకులు, చిన్నారులు వచ్చి ఇక్కడ స్కేటింగ్ నేర్చుకునేందుకు అలవాటు పడ్డారు. వివిధ కళాశాలలకు చెందిన యువకులు ఎక్కువగా వస్తుండటంతో ఒక కోచ్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ అధికారులు అప్పట్లో ప్రయత్నించారు. అయితే ఆ తర్వాత కాలంలో స్కేటింగ్ నేర్పించేందుకు వచ్చిన ఓ మాజీ కౌన్సిలర్ కోర్టుకు రావడం మానివేయడంతో అప్పటి నుంచి అది మూతపడింది. దీంతో స్కేటింగ్ నేర్చుకునేందుకు ఆసక్తిగా వచ్చిన యువకులు, చిన్నారులు మెల్లగా రావడం మానేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ కమిషనర్ గానీ, ఇతర అధికారులు కానీ స్కేటింగ్ కోర్టు గురించి పట్టించుకోలేదు. కోచ్‌ను ఏర్పాటు చేస్తే అందుకు అవసరమైన జీతం తాము భరిస్తామని నేర్చుకునేందుకు వచ్చిన యువకులు, చిన్నారులు ముందుకొచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. వారి ప్రతిపాదనను ఆలకించేవారు లేకపోవడంతో మూడేళ్ల నుంచి స్కేటింగ్ కోర్టు నిరుపయోగంగా మారింది. లక్షలాది రూపాయలతో నిర్మించిన స్కేటింగ్ కోర్టును మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
‘అడ్వాన్సు’గా మెక్కేశారు
కడప కార్పొరేషన్ అధికారులకు మున్సిపల్ ఎన్నికలు వరంగా మారాయి. ఎన్నికల నిర్వహణపేరుతో అందినకాడికి దోచుకుని కార్పొరేషన్ ను ఖాళీ చేశారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత ఎవరు ఎక్కడ ఉంటారోననే ఉద్దేశంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే యత్నంలో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. లక్షలకు లక్షలు మింగేసి నింపాదిగా కూర్చున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఖర్చు వివరాలపై సమగ్ర దర్యాప్తు జరిపితే అక్రమార్కుల గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది. కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికలు కొందరు అధికారులకు వరంగా మారాయి. ఇచ్చేవాడుంటే చచ్చేవాడూ లేచి వస్తాడనే సామెత చందాన మున్సిపల్ ఎన్నికల సమయంలో కొందరు అధికారులు విచ్చలవిడిగా అడ్వాన్సులు తీసుకొని కడప నగరపాలక సంస్థను నిలువునా ముంచారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రూ.35 లక్షలు ఖర్చుచేయమంటే కడప కార్పొరేషన్లో మాత్రం దానికి నాలుగింతలు అంటే రూ. 1.35కోట్లు ఖర్చు చేశారు. దీన్ని బట్టే మన అధికారులు ఎన్నికలను ఎంత ‘కాస్ట్లీ’గా నిర్వహించారో తెలుస్తోంది. కడప నగరపాలక సంస్థ పరిధిలోని 246 పోలింగ్ స్టేషన్లలో టేబుళ్లు ఉన్నాయి, అయినా అధికారులు ఇష్టారాజ్యంగా కొత్త టేబుళ్లు, ర్యాక్‌లు కొన్నారు. అన్నికేంద్రాలకు విద్యుదీకరణ ఉంది. మంచినీరు, బారికేడ్లు కట్టడానికి ఇంజనీరింగ్ అధికారులు లక్షలకు లక్షలు అడ్వాన్సులు తీసుకొన్నారు. అందరు ఇంజినీర్లకు సమానంగా పోలింగ్ స్టేషన్లు కేటాయించినందున ఇంచుమించు అందరికీ సమానంగా ఖర్చు కావాలి. కానీ కొందరికి లక్ష, రెండు లక్షలే ఖర్చుకాగా మరికొందరికి మాత్రం ఐదారు లక్షలు ఖర్చు అయ్యింది. ఒక చేయి తిరిగిన ఇంజినీరింగ్ అధికారైతే అత్యధికంగా రూ. 6లక్షలు అడ్వాన్సు తీసుకోవడమే గాక ఆఫీసులో కొత్త ఛాంబర్ల ఏర్పాటు, కార్పొరేషన్ గోడలకు, బారికేడ్లకు పెయింటింగ్‌ల పేరుతో అందినకాడికి వెనకేసుకొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్లో రెండు జిరాక్స్ మిషిన్లు ఉన్నాయి. అదనంగా ఒక పెద్ద జిరాక్స్ మిషిన్‌ను బాడుగకు తెచ్చారు. ఎన్నికలు జరిగినన్నిరోజులు దీనికి ఇచ్చిన బాడుగతో ఒక కొత్త జిరాక్స్ మిషినే కొనవచ్చు. దీనిప్రకారం కార్పొరేషన్లో మొత్తం మూడు జిరాక్స్ మెషీన్లు ఉండగా కొందరు మాత్రం జిరాక్స్ చేయించినట్లు బిల్లులు పెట్టడం గమనార్హం. ఇంకొందరైతే కంప్యూటర్లకు మరమ్మతులు చేయించామని బిల్లులు చేసుకొన్నట్లు తెలిసింది. ఈవీఎం మిషన్లపై అతికించే సుమారు 500 బ్యాలెట్ పేపర్లను తీసుకురావడానికి కర్నూలుకు వెళ్లేందుకు మిగిలిన కార్పొరేషన్ల అధికారులు రూ. 5 వేల నుంచి 10వేలు తీసుకుపోతే మన కార్పొరేషన్ అధికారులు మాత్రం రూ. 30వేలు తీసుకుపోయినట్లు సమాచారం. ఈ బ్యాలెట్ పేపర్లను ప్రభుత్వమే ఉచితంగా ముద్రించి ఇస్తుంది. ఈ మొత్తమంతా కేవలం ప్రయాణచార్జీలు, బస చేసినందుకే. కోడ్ ఆఫ్ కండక్ట్‌కు సంబంధించి వాల్‌రైటింగ్స్ ఉన్న చోట సున్నం కొట్టే పనిని కార్పొరేషన్ సిబ్బందితో చేయించి బిల్లులు మాత్రం లక్షల్లో చేసుకొన్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల సమయంలో నోటిఫికేషన్ వెలువడిన మార్చి 10వ తేదీనుంచి 18వ తేదీ వరకూ 8 నామినేషన్ కేంద్రాలలో ఆర్వోలు, ఏఆర్ఓలు, వారికి సహాయంగా 5 మంది కార్పొరేషన్ సిబ్బందిని నియమించారు. అంటే మొత్తం 40 మంది 8 రోజుల పాటు పనిచేశారు. వీరికి తోడు మరో 60 మంది పనిచేశారనుకొన్నా రోజుకు 100 మంది అవుతారు. వీరికి 8 రోజులకు రూ. 150లతో లెక్కేస్తే రూ. 1.20 లక్షలు. అలాగే పోలింగ్‌కు ముందురోజు, పోలింగ్‌రోజు రెండు రోజుల పాటు సుమారు 2వేల మంది చొప్పున విధులు నిర్వహించారు. ఈ లెక్కన రెండు రోజులకు నాలుగు వేలమందికి రూ. 6.00లక్షలు. మొత్తం 7.20 లక్షలు కావాలి. ఎంత దుబారాగా ఖర్చుపెట్టినా భోజనాల ఖర్చు రూ. 30 లక్షలు దాటదు. అయతే కార్పొరేషన్లో రిఫ్రెష్మెంట్స్ కోసం రూ. 44 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. నగరపాలక ఉన్నతాధికారి మంచితనం, ఉదారస్వభావాన్ని ఆధికారులు తమకు అనుకూలంగా మలుచుకొన్నట్లు దీన్నిబట్టి స్పష్టంగా అర్థమవుతోంది. ఈ అవినీతి వ్యవహారంపై చాలామంది సమాచార హక్కు చట్టం ద్వారా కూపీ లాగాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ దుబారా ఖర్చుపై కొత్త పాలకవర్గం కూడా కఠిన చర్యలు తీసుకొనే అవకాశాలు లేకపోలేదు. మున్సిపల్ కమిషనర్ వివరణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన నిధుల దుర్వినియోగంపై కడప కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసును న్యూస్‌లైన్ వివరణ కోరగా అదంతా అవాస్తవమన్నారు. ఖర్చు చేసిన మొత్తానికి సరిపడే బిల్లులు సిబ్బంది తెచ్చిఇచ్చారన్నారు. ఇది తప్పుడు సమాచారమని ఆయన కొట్టి పారేశారు. కాగా, ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. 20 రోజుల్లో రూ. 44 లక్షలు తిన్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పనిచేసిన వారికి ఒక రోజుకు రిఫ్రెష్మెంట్స్ కోసం రూ. 150 వరకూ ఖర్చు చేసే సౌలభ్యం ఉంది. అయితే మనవాళ్లు అంతకు రెట్టింపు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఉదయం ఇడ్లీ, వడ, పూరి, పొంగల్, మధ్యాహ్నం బిర్యానీ, రాత్రి బిర్యానీలు తెప్పించుకొని కార్పొరేషన్‌ను కాల్చుకుతిన్నారు. నామినేషన్ల సమయంలో వేళాపాళా లేకుండా తెచ్చిన భోజనం తిని చాలామందికి విరేచనాలు అయ్యాయి. దీంతో చాలామంది అప్పట్లో ఆ భోజనం తినలేదు. పోలింగ్‌కు ముందురోజు వాటర్ క్యాన్లకు డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందని కనీవినీ ఎరుగని రీతిలో వాటర్ప్యాకెట్లు తెచ్చి పనికానిచ్చారు. -
వేడెక్కిన గ్రామీణం
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరో 24 గంటల్లో ప్రారంభం కానుంది. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఫలితాలను వాయిదా వేసింది. ఈనెల 7న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో 13న ఉదయం 8 గంటలకు ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చర్చనీయాంశమైంది. అధికారులు ఈ రికార్డులను చిత్తు కాగితాలుగా పేర్కొంటున్నా.. నిజానిజాలు కొత్త పాలకవర్గం ఏర్పాటుతో వెల్లడి కానుంది. సోమవారం కర్నూలు నగరంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో నంద్యాల మున్సిపల్ కమిషనర్‌తో పాటు కీలక సిబ్బంది ఆ విధుల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఆదివారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయ ఆవరణ నుంచి పొగలు వస్తుండటంతో స్థానికులు గుర్తించి కార్యాలయ కింది స్థాయి సిబ్బందికి సమాచారం చేరవేశారు. వెంటనే వారు అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి చేరుకునే సరికి పలు రికార్డులు కాలిపోగా.. మరికొన్ని మంటలను ఆర్పేందుకు వినియోగించిన నీటితో ఎందుకూ పనికిరాకుండాపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే పాత రికార్డు గదికి విద్యుత్ సరఫరాను నిలిపేశారు. చిమ్మచీకట్లో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందిపడ్డారు. పోలీసులు, ఎలక్ట్రానిక్ మీడియా లైటింగ్‌తో మంటలను అదుపులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా అగ్ని ప్రమాదం వెనుక గత పాలకవర్గాల కుట్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2005 నుంచి 2010 సంవత్సరాల మధ్య కౌన్సిల్లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష పార్టీకి చెందిన కౌన్సిల్ సభ్యులు విచారణ చేపట్టాలని కోరినా అప్పటి మున్సిపల్ చైర్మన్ కైప రాముడు, వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్ అంగీకరించలేదు. తాజాగా ఏర్పాటయ్యే పాలకవర్గం అప్పటి అక్రమాలపై ఎక్కడ విచారణకు ఆదేశిస్తుందోననే భయంతోనే ఇలా చేసి ఉంటారా? అని పలువురు అనుమానిస్తున్నారు. కాలింది చిత్తు కాగితాలే: రామచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ అగ్ని ప్రమాదంలో కాలిపోయింది చిత్తు కాగితాలు మాత్రమే. ఆ గదిలో కీలక రికార్డులేవీ లేవు. 2009లో సంభవించిన వరదల్లో పూర్తిగా పనికిరాకుండాపోయిన పలు పేపర్లను ఆ గదిలో భద్రపరిచాం. గత పది సంవత్సరాలకు సంబంధించిన రికార్డులన్నీ సురక్షితంగానే ఉన్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నాం. కౌంటింగ్ ముగిసిన వెంటనే ప్రమాదానికి కారణాలను తెలుసుకుంటాం. -
మున్సిపల్ కౌంటింగ్‌కు అంతా సిద్ధం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నిర్వహించే కౌంటింగ్ కోసం నల్లగొండ పట్టణ శివారులోని సాగర్‌రోడ్డులో గల డాన్‌బోస్కో స్కూల్లో చేసిన ఏర్పాట్లను ఆదివారం రాత్రి కలెక్టర్ చిరంజీవులు, ట్రైనీ జేసీ సత్యనారాయణ, ఇతర అధికారులు పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లు, టేబుళ్లతో పాటు ఆరుబయట టెంట్లు, కుర్చీలు పరిశీలించారు. కౌంటింగ్ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం మీడియా సెంటర్‌ను పరిశీలించారు. ఏర్పాట్లు పక్కాగా ఉన్నాయంటూ నల్లగొండ మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డిని అభినందించారు. అభ్యర్థులు, ఏజెంట్లకు ఇబ్బంది కలుగకుండా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ వెంకట్రావు,తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్ : పురపాలక సంఘం ఎన్నికల కౌంటింగ్ కోసం అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. కౌంటింగ్ కోసం అవసరమైన సదుపాయాలు కల్పించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 12న కౌంటింగ్ చేపట్టడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. నల్లగొండ పురపాలక సంఘం ఓట్ల లెక్కింపునకు 7టేబుళ్లు, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి, కోదాడ పురపాలక సంఘాలు, దేవరకొండ, హుజూర్నగర్ నగర పంచాయతీలకు 5 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలు, నగరపంచాయతీల ఎన్నికల కౌంటింగ్‌ను నల్లగొండ పట్టణ సమీపంలోని ఎస్ఎల్బీసీ దగ్గర ఉన్న డాన్ బోస్కో స్కూల్లో నిర్వహిస్తారు. ప్రతి పురపాలక సంఘానికి ఒక ఒక ఆర్డీఓను ఎన్నికల అబ్జర్వర్‌గా కలెక్టర్ నియమించారు. నల్లగొండకు ట్రైనీ ఐఏఎస్ సత్యనారాయణ, కోదాడకు అదనపు జేసీ వెంకట్రావు, హుజూర్‌నగర్‌కు జేడీఏ నర్సింహారావును అబ్జర్వర్లుగా నియమించారు. మిగతా వాటికి ఆయా పరిధిలో ఉన్న ఆర్డీఓలు అబ్జర్వరులుగా వ్యవహరించనున్నారు. నల్లగొండ పురపాలక సంఘానికి సంబంధించి 7టేబుళ్లలో ఏడు వార్డుల కౌంటింగ్ మొదలు పెట్టనున్నారు. మితగా వాటిలో 5 టేబుళ్లలో ఒకేసారి 5 వార్డుల కౌంటింగ్ మొదలు పెట్టడానికి నిర్ణయించారు. ఒక వార్డులో ఉన్న పోలింగ్ కేంద్రాలు దాదాపు 10 నుంచి 15 నిమిషాలలో కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఒక టేబులుకు ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించారు. కౌంటింగ్‌ను జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు, జేసీ హరిజవహర్‌లాల్ పర్యవేక్షంచనున్నారు. ఉదయం 7.30 గంటలకు మొదట కౌంటింగ్ చేపట్టే వార్డుల సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తరువాత ఈవీఎంల ఓట్లను లెక్కించడానికి ప్రణాళిక తయారు చేశారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించే సమయంలో కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు ఒక ఏజంటును లోపలికి అనుమతిస్తారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు సమయంలో ఒక ఏజంటును మాత్రమే లోపలికి అనుమతి ఇస్తారు. వార్డుల ఫలితాలను ప్రకటించడానికి మైకులు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా స్కూల్ బయట బారికేడ్లు ఏర్పాటు చేసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఒక్కో మున్సిపాలిటీ వారిగా టెంట్లు ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల లోపు మొత్తం కౌంటింగ్ పూర్తి కానుంది. ఏర్పాట్లు చేస్తున్నాం : వేణుగోపాల్‌రెడ్డి, నల్లగొండ మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ ఆదేశాల మేరకు పురపాలక సంఘం ఎన్నికల కౌంటింగ్‌కు నల్లగొండ పట్టణ సమీపంలో ఉన్న డాన్‌బోస్కో స్కూల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అభ్యర్థులతో పాటు వచ్చే వారి కోసం కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. కేంద్రం వద్ద బారీకేడ్లు, తాగునీటి సౌకర్యం ఇతర అన్ని వసతులు కల్పించడానికి చర్యలు చేపట్టాం. పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
మున్సిపోల్ ప్రశాంతం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు, ఆరు మున్సిపాలిటీల్లో ఆదివారం జరిగిన పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో ప్రతి మున్సిపాలిటీలో 90 శాతానికి పైగా పోలింగ్ నమోదు చేయించాలని ఎన్నికల అధికారులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న గందరగోళం కారణంగా వేలాది మంది తమ ఓటు ఎక్కడుందో కనుక్కోలేక నెల్లూరులో పోలింగ్ అత్యల్పంగా నమోదైంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహించి సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఎన్నికల్లో ఆత్మకూరులో అత్యధికంగా 79.71 శాతం, నెల్లూరులో అత్యల్పంగా 60.32 శాతం పోలింగ్ నమోదైంది. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీకాంత్ నేతృత్వంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. జిల్లా పోలీసు అధికారి నవదీప్ సింగ్ గ్రేవాల్ పర్యవేక్షణలో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు నెల్లూరు సహా అన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఎండ వేడిమి కారణంగా ఉదయం 11 గంటల తర్వాత నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ కేంద్రాలు జనం లేక బోసిపోయాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థులు ఆటోలు, ఇతర వాహనాల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకుని వచ్చి ఓట్లు వేయించుకోవడానికి నానా పాట్లు పడ్డారు. కొన్ని పోలింగ్ స్టేషన్లలో అభ్యర్థులు నేరుగా ప్రచారం చేయడంతో ప్రత్యర్థులు అడ్డు చెప్పడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. మూడు గంటలు ఆగిన పోలింగ్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓటర్ల జాబితాలో గందరగోళం ఏర్పడింది. అధికారులు ఆన్లైన్లో ఉంచిన ఓటర్ల జాబితాలో 4 లక్షల 17వేల మందే ఓటర్లు ఉన్నట్లు చూపారు. పోలింగ్ సిబ్బందికి, రాజకీయ పార్టీలకు అందించిన ఓటర్ల జాబితాల ప్రకారం 4 లక్షల 47వేల మంది ఓటర్లు నమోదయ్యారు. ఇందులో కూడా అనేక రకాల అవకతవకలు జరిగాయి. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం 16వ డివిజన్లో నివాసం ఉంటున్నారు. ఆయనకు అదే డివిజన్లో ఓటు రాగా, ఆయన సతీమణికి వేరే డివిజన్లో ఓటు చేర్చారు. ఒకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు రెండు డివిజన్లలో ఓట్లెలా నమోదయ్యాయో అధికారులకే తెలియాలి. ఎన్నికలకు ముందే రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితాలోని తప్పుల తడకపై ఆందోళన వ్యక్తం చేశాయి. జిల్లా ఎన్నికల అధికారి శ్రీకాంత్ ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దాలని ఆదేశించారు. అయినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఎవరికి ఎక్కడ ఓటుందో? ఏ పోలింగ్ స్టేషన్లో చేర్చారో అర్థం కాక వేలాది మంది ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారు. నెల్లూరు 54వ డివిజన్లో అధికారులు, రాజకీయ పార్టీలు ఓటర్లకు ఇచ్చిన స్లిప్‌లకు పోలింగ్ స్టేషన్లకు సరఫరా చేసిన ఓటర్ల జాబితాల కు సంబంధమే లేక పోవడంతో పోలింగ్ స్టేషన్లలో ఓటర్ల గొడవకు దిగారు. దీంతో ఇక్కడ పోలింగ్ ప్రారంభమైన 15 నిమిషాలకే నిలిపి వేసి మళ్లీ ఉదయం 10-30 గంటలకు పోలింగ్ ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో తప్పులపై ఇప్పుడు తామేమీ చేయలేమని పోలింగ్ సిబ్బంది నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల నడుమ తమ ఓటు ఎక్కడుందో వెతికి పట్టుకునే ఓపిక లేక వేలాది మంది తీవ్ర నిరసన వ్యక్తం చేసి వెనక్కు వెళ్లారు. ఓటరు జాబితాల తయారీపై అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వీరి తప్పుల కారణంగానే నగరంలో కనీసం 20 శాతం పోలింగ్ తగ్గినట్లు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. కావలి, గూడూరు మున్సిపాలిటీల్లో కూడా ఓటర్ల జాబితాలోని తప్పుల వల్ల అనేక మంది పేర్లు గల్లంతయ్యాయి. పోలింగ్ స్టేషన్ల వద్ద జనం ఎన్నికల సిబ్బందితో గొడవకు దిగారు. ఎన్నికల సంఘం ఆగ్రహం నెల్లూరు నగరంలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న గందరగోళంపై రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహించినట్లు సమాచారం. ఓటర్ల జాబితా ఇంత గందరగోళంగా మారి వేలాది మంది ఓటు హక్కు వినియోగించుకోలేక పోవడానికి కారకులెవరో సంజాయిషీ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆయన్ను ఆదేశించింది.