నేను తలచుకుంటే.. నువ్వు, నీ అమ్మ ఉండరు: జేసీ | JC Diwakar Reddy Abusive Comments On Guthi Municipal Chairperson Son | Sakshi
Sakshi News home page

నేను తలచుకుంటే.. ఎవరూ ఉండరు: జేసీ

Published Wed, May 23 2018 10:31 AM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM

JC Diwakar Reddy Abusive Comments On Guthi Municipal Chairperson Son - Sakshi

తెలుగు దేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి (ఫైల్‌ ఫొటో)

సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి గుత్తిలో హల్‌చల్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాతో కలిసి గుత్తిలో పర్యటించిన ఆయన గుత్తి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తులసమ్మ తనయుడు శీనుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘నేను తలచుకుంటే నువ్వు, నీ అమ్మ, గుత్తి మున్సిపల్‌ కమిషనర్‌ ఉండరంటూ’ దుర్భాషలాడుతూ శీనుని జేసీ బెదిరించారు. అయితే మధుసూదన గుప్తాతో కలిసి జేసీ పర్యటించడంపై గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. టీడీపీ సభ్యత్వం లేని గుప్తాను తనకు పోటీగా తెచ్చేందుకే జేసీ ఇలా చేస్తున్నారేమోనని గౌడ్‌ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement