సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అవిశ్వాసంపై చర్చకు ఒక్క రోజు ముందే అధికార పార్టీలో చీలిక మొదలైంది. పార్లమెంట్ సమావేశాలకు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి డుమ్మా కొట్టనున్నట్లు సమాచారం. ఇవాళ లోక్‌సభలో జేసీ దివాకర్ రెడ్డి ఎక్కడా కనిపించలేదు. ఎంపీ సుజనా చౌదరి తీరుపై జేసీ అలిగినట్లు తెలుస్తోంది.
అంతేకాక అవిశ్వాస తీర్మానానికి జేసీ హాజరుకానంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విప్ జారీ చేసినా శుక్రవారం నాడు లోక్ సభకు జేసీ వెళ్లనంటున్నారట. ఎంపీ జేసీ దివాకర్ బాటలో మరికొందరు టీడీపీ ఎంపీలు నడవనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ చేపడుతామని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment