Telugu Desam MP
-
'పుష్ప 2'పై టీడీపీ ఎంపీ వివాదాస్పద పోస్ట్
నంద్యాల(రూరల్): టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌ని ఉద్దేశించి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి (టీడీపీ) 'ఎక్స్' (ట్విటర్)లో ఆదివారం వివాదాస్పద పోస్ట్ చేశారు. 'అల్లు అర్జున్ గారూ.. మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారం ఇక్కడి ప్రజలకు ఇప్పటికీ మరువలేనిది. మీరు నంద్యాలలో ముందస్తు ఎన్నికల ప్రచారంలా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మీరు నంద్యాలను సందర్శించినప్పుడు మీ సెంట్మెంట్ మాకు చాలా బాగా పనిచేసింది. ఆ సెంట్మెంట్ మాదిరిగానే మీ 'పుష్ప 2' కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం' అని పేర్కొన్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' రెమ్యునరేషన్.. ఎవరికెంత ఇచ్చారు?)వెటకారం ధ్వనించేలా ఉన్న ఈ ట్వీట్ కింద అల్లు అర్జున్ అభిమానులు విమర్శలు, కామెంట్లు చేశారు. దీంతో సరైన సమాధానం చెప్పుకోలేక ఆమె ఆ పోస్ట్‌ను తొలగించారు. కాగా, గత ఎన్నికల ముందు నంద్యాల నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలకు వచ్చారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2'పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్) -
గెటవుట్.. జేసీ దివాకర్‌రెడ్డి చిందులు
సాక్షి, అనంతపురం: బెదిరింపు రాజకీయాలతో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి రోజంతా పొలిటికల్ డ్రామాను రక్తి కట్టించారు. తనకు అలవాటైన విద్యను ప్రదర్శించి ఆంధ్రప్రదేశ్‌లో మీడియా మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో రేపు చర్చ జరగనున్న నేపథ్యంలో జేసీ రచ్చ కెక్కారు. టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నట్టుగా మీడియాకు లీకులు ఇచ్చారు. పార్టీ విప్ జారీ చేసినా పార్లమెంట్ సమావేశాలకు వెళ్లబోనంటూ నిన్నటి నుంచి ఊదరగొట్టారు. కానీ ఈరోజు సాయంత్రానికి ప్లేటు ఫిరాయించారు. రేపు ఢిల్లీ వెళ్లి పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతానని, అవిశ్వాస తీర్మానం చర్చలో పాల్గొంటానని ముక్తాయించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి మేరకు నిర్ణయం మార్చుకున్నట్టు చెప్పుకొచ్చారు. తాను బెదిరింపు రాజకీయాలకు పాల్పడటం లేదని చిర్రుబుర్రులాడారు. బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారన్న ఓ మీడియా ప్రతినిధిని ‘గేటవుట్’ అంటూ కసిరారు. పనిలో పనిగా మరో ‘డ్రామా’కు తెరతీశారు. ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు వెల్లడించారు. రాజీనామాపై తన నిర్ణయాన్ని శుక్రవారం సాయంత్రం తర్వాత ప్రకటిస్తానని తెలిపారు. రోజంతా రాజకీయ డ్రామా... రెండో రోజూ పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకుండా జేసీ దివాకర్‌రెడ్డి తనదైన శైలిలో నాటకాన్ని రక్తి కట్టించారు. టీడీపీలో తన మాట చెల్లుబాటు కానందున పార్లమెంట్‌కు హాజరుకాబోనని లీకులు వదిలారు. సొంత పార్టీలో తన ప్రత్యర్థి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి చెక్ పెట్టేందుకు ఈ సందర్భాన్ని బాగా వాడుకున్నారు. జేసీని బుజ్జగించేందుకు ప్రభాకర్ చౌదరిని తన దగ్గరకు పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడారు. వీరిద్దరి సమావేశం ముగియగానే జేసీ పట్టుసడలించారు. మరోవైపు అనంతపురంలో రోడ్ల వెడల్పునకు సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై విడుదల చేయడంతో జేసీ పూర్తిగా దిగివచ్చారు. చంద్రబాబు స్వయంగా ఫోన్ చేయడంతో రేపు పార్లమెంట్‌కు హాజరవుతానని ప్రకటించారు. అయితే రాజీనామా అస్త్రంతో రాజకీయ డ్రామాను ఆయన కొనసాగించడం కొసమెరుపు. -
అవిశ్వాసంపై చర్చ.. ఎంపీ జేసీ డుమ్మా!
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అవిశ్వాసంపై చర్చకు ఒక్క రోజు ముందే అధికార పార్టీలో చీలిక మొదలైంది. పార్లమెంట్ సమావేశాలకు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి డుమ్మా కొట్టనున్నట్లు సమాచారం. ఇవాళ లోక్‌సభలో జేసీ దివాకర్ రెడ్డి ఎక్కడా కనిపించలేదు. ఎంపీ సుజనా చౌదరి తీరుపై జేసీ అలిగినట్లు తెలుస్తోంది. అంతేకాక అవిశ్వాస తీర్మానానికి జేసీ హాజరుకానంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విప్ జారీ చేసినా శుక్రవారం నాడు లోక్ సభకు జేసీ వెళ్లనంటున్నారట. ఎంపీ జేసీ దివాకర్ బాటలో మరికొందరు టీడీపీ ఎంపీలు నడవనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ చేపడుతామని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించిన విషయం తెలిసిందే. -
‘వెంకన్న చౌదరి’పై మురళీమోహన్ మళ్లీ..
సాక్షి, హైదరాబాద్: కలియుగ దైవం తిరుమలేశుడికి కులాన్ని ఆపాదిస్తూ టీడీపీ ఎంపీ మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చల్లారలేదు. వేంకటేశ్వరుడిని ‘వెంకన్న చౌదరి’గా పేర్కొన్న వీడియో వైరల్ కావడం, పెద్ద ఎత్తున విమర్శలు రావడం, దీంతో టీడీపీ ఇరకాటంలో పడటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మురళీమోహన్ శుక్రవారం మళ్లీ ఓ వీడియోను విడుదల చేశారు. నోరు జారడం సహజంగా జరిగేదేనని, దేవుడితో కూడా ఇదే చెప్పుకున్నానని అన్నారు. టంగ్ స్లిప్ సహజమే!: ‘‘రాజమండ్రిలో ఒక మీటింగ్‌లో పొరపాటున ‘వెంకన్న చౌదరి’ అన్నాను. అప్పటిదాకా బుచ్చయ్య చౌదరి పక్కన కూర్చొని ‘చౌదరిగారూ.. చౌదరిగారూ..’ అని మాట్లాడుకున్నాం. వెంకన్న చౌదరి అనడం టంగ్ స్లిప్పే తప్ప.. దేవుడికి కులాన్ని అంటగట్టేంత తెలివితక్కువ వాడిని కాను. ఎందుకంటే అసలు నాకు కులాల మీద నమ్మకమే ఉండదు. అలాంటిది వెంకటేశ్వరస్వామికి కులం ఎలా అంటగడతాను? టంగ్ స్లిప్ అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇవాళ ఉదయం పూజ చేసేటప్పుడు కూడా దేవుడికి మొక్కుకున్నా.. ‘టంగ్ స్లిప్ అయింది స్వామి.. పొరపాటుగా అన్నాను.. కావాలని అనలేదు..’ అని దేవుడికి దండం పెట్టుకున్నా’’ అంటూ మురళీమోహన్ వివరణ ఇచ్చుకున్నారు. అసలేం జరిగింది?: బుధవారం రాజమండ్రిలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ కర్ణాటకలో బీజేపీ ఓటమికిగల కారణాలను విశ్లేషించారు. ఆ క్రమంలో మా ‘వెంకన్న చౌదరి’ వల్లే ఆ పార్టీ ఓడిపోయిందంటూ ఏకంగా దేవుడికి కులాన్ని అంటగట్టేశారు. మురళీమోహన్ వ్యాఖ్యలు పెనుదుమారం రేగడంతో టీడీపీ ఇరాకటంలో పడింది. నష్టనివారణ చర్యల్లో భాగంగానే ఇప్పుడు మురళీమోహన్ మరో వీడియోను పోస్ట్ చేశారు. -
నేను తలచుకుంటే.. నువ్వు, నీ అమ్మ ఉండరు: జేసీ
సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గుత్తిలో హల్చల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాతో కలిసి గుత్తిలో పర్యటించిన ఆయన గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ తులసమ్మ తనయుడు శీనుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘నేను తలచుకుంటే నువ్వు, నీ అమ్మ, గుత్తి మున్సిపల్ కమిషనర్ ఉండరంటూ’ దుర్భాషలాడుతూ శీనుని జేసీ బెదిరించారు. అయితే మధుసూదన గుప్తాతో కలిసి జేసీ పర్యటించడంపై గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. టీడీపీ సభ్యత్వం లేని గుప్తాను తనకు పోటీగా తెచ్చేందుకే జేసీ ఇలా చేస్తున్నారేమోనని గౌడ్ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
బాబు మోసం చేశారు..: టీడీపీ ఎంపీ
-
బాబు మోసం చేశారు.. ఏవిధంగానో మీకు తెలుసు: టీడీపీ ఎంపీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ‘‘చంద్రబాబునాయుడు గారు మోసం చేశారు. ఏ విధంగా మోసం చేశారో మీకు తెలుసు. ఇటువంటి పరిణామాలు ఎదురవుతాయి కాబట్టి ప్రజలంతా ఒకతాటిపైకి రావాలి’’ ఈ మాటలన్నది ఏ ప్రతిపక్ష పార్టీ నేతో కాదు. తెలుగుదేశం ఎంపీ మాగంటి బాబు. శనివారం ఉదయం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండు సెంటర్లో ప్రత్యేక హోదా కోరుతూ ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపైనా, ప్రధాని మోదీపైనా, బీజేపీపైనా నాయకులు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాగంటి బాబు.. చంద్రబాబు మోసం చేస్తున్నారని ఊగిపోయారు. మోదీని విమర్శిస్తున్నాను అనే ఉద్దేశంలో రెచ్చిపోయారు. దీంతో అక్కడున్న నాయకులతో పాటు ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఏమైనా మాగంటి బాబు నిజాలే చెప్పారని అక్కడికి వచ్చిన వారు అనుకున్నారు. ఏలూరులో కూడా ఓ ‘పప్పు’ బ్యాచ్ తయారయిందని సెటైర్లు వేసుకోవడం కనిపించింది. -
టీడీపీ మాజీ ఎంపీపై క్రిమినల్ కేసు
-
టీడీపీ మాజీ ఎంపీపై క్రిమినల్ కేసు
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావుపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా విడాకులిచ్చి తనతోపాటు ఉండాల్సిందిగా నామా వేధిస్తున్నారని నగరాని కి చెందిన రామకృష్ణన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో నివసించే సి.కె.రామకృష్ణన్ 1992 నుంచి అమెరికా లో ఉంటున్నారు. ఆయన భార్య సుజాత రామకృష్ణన్ అక్కడే ఉండేవారు. 2014లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. మాజీ ఎంపీ నామా తరచూ వారి ఇంటికి వస్తుండేవారు. 2017లో తరచూ తన భార్య సుజాతతో ఫోన్లో మాట్లాడేవాడని రామకృష్ణన్ తెలిపారు. తాను అమెరికాలో ఉన్నప్పుడే భార్య గత అక్టోబర్‌లో ఫోన్ చేసి నామా, ఆయన తమ్ముడు నామా సీతయ్య తనను బెదిరిస్తున్నారని, భయంగా ఉందంటూ ఫోన్ చేయడంతో ధైర్యం చెప్పానన్నారు. అప్పుడే సుజాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు పెట్టిందన్నారు. ఇటీవల వేధింపులు తీవ్రతరం 2 రోజుల క్రితం తాను హైదరాబాద్‌కు వచ్చానని, మానసిక వేదనతో బాధపడుతున్న భార్య సుజాతను ప్రశ్నించగా.. కన్నీళ్లు పెట్టుకుంటూ తనకు నామాతో 2013 నుంచి వివాహేతర సంబంధం ఉందంటూ విషయాన్ని బయట పెట్టిందన్నారు. భర్తకు విడాకులిచ్చి తనతోపాటు ఉండాల్సిందిగా నామా ఒత్తిడి తెస్తున్నాడని, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తన దృష్టికి తీసుకొచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన తమ్ముడు సీతయ్య కూడా గత కొంత కాలంగా తనను బెదిరిస్తున్నాడని ఆమె వెల్లడించారన్నారు. ఈ మేరకు రామకృష్ణన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నామా నాగేశ్వర్రావు, సీతయ్యపై ఐపీసీ సెక్షన్లు 497, 504, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పార్లమెంట్ ఆవరణలో ఎంపీ శివప్రసాద్ బుర్రకధ
-
నిప్పుతో చెలగాటమా అని నిలదీయండి..
సాక్షి, అమరావతి : పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు మంగళవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవిశ్వాస తీర్మానం చర్చకొచ్చే నేపథ్యంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. కేంద్రంపై ఎదురుదాడికి దిగాలని ఎంపీలకు సూచించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు తానని, వాళ్లకన్నా ముందుగా తాను సీఎం అయ్యానని గుర్తుచేయాలని చెప్పుకొచ్చారు. గతంలోనే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిన తనపై నిందలు వేస్తారా అని నిలదీయండని ఉద్భోదించారు. చిన్న మచ్చ కూడా లేని మా నేతపై మీ దాడి ఏంటని ప్రశ్నించండని కోరారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే ఎదురు దాడి చేయడంపై కేంద్రాన్ని నిలదీయాలని, మనల్ని విమర్శించనంత వరకూ అంశాలవారీగానే ముందుకు పోదామన్నారు. బీజేపీ నేతలు వ్యక్తిగతంగా పోతే మనం కూడా వ్యక్తిగత దాడికి వెనుకాడరాదని సూచించారు. ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నామని, రాజకీయాల్లో హుందాతనం అవసరమని విలువలు వల్లించారు. బీజేపీ నేతలు అప్పుడే మనకు కాంగ్రెస్‌తో పొత్తు అని ప్రచారం చేస్తున్నారని గతంలో ఎన్నడూ లేని విదంగా ఆ పార్టీలో కొత్త సంస్కృతి పుట్టుకొచ్చిందన్నారు. -
‘పవన్ వ్యాఖ్యలపై స్పందించను’
సాక్షి, న్యూఢిల్లీ: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించేందుకు కేంద్ర తాజా మాజీమంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి నిరాకరించారు. చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను అవినీతిప్రదేశ్‌గా మార్చారని జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధనలో టీడీపీ నాయకులు విఫలమయ్యారని, కేంద్రానికి హోదాను తాకట్టు పెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే పవన్ వ్యాఖ్యలపై తాను మాట్లాడబోనని సుజనా చౌదరి అన్నారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్లమెంట్లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆయన వాపోయారు. తన ప్రసంగ పాఠానికి ఎన్నో సవరణలు చేస్తున్నారని ఆరోపించారు. రాజీనామాల ద్వారా కదలిక వస్తుందనుకున్నామని, కానీ బీజేపీ పట్టించుకోవడం లేదని తెలిపారు. సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు రావడం లేదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబుతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని సుజనా చౌదరి చెప్పారు. కాగా, చంద్రబాబు ఆదేశాల మేరకు కేంద్రమంత్రి పదవికి సుజనా చౌదరి ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
టీడీపీ ఎంపీ కొత్త పల్లవి
సాక్షి, చిత్తూరు: తమ పార్టీ నాయకుడైన సీఎం చంద్రబాబును కేంద్ర ప్రభుత్వం అవమానిస్తోందని చిత్తూరు టీడీపీ ఎంపీ ఎన్ శివప్రసాద్ ఆరోపించారు. శనివారం చిత్తూరు గాంధీ సర్కిలో ప్రత్యేక హోదాకు మద్దతుగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలక కొట్టి శబ్దం చేస్తు కేంద్రానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశ రాజకీయాల్లోనే సీనియర్ నాయకుడైన చంద్రబాబు రాష్ట్రం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అణిగిమనిగి ఉన్నారని చెప్పారు. తమ నాయకుడితో పెట్టుకుంటే ప్రధాని నరేంద్ర మోదీకి చివరకు మిగిలేది బోడి అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. చంద్రబాబుకు సంవత్సరం పాటు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదని, తమ నాయకుడిని అవమానిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. -
జేఎఫ్సీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు
-
ఎంపీ రాయపాటి కూమారుడి డ్రైవర్ ఆత్మహత్యయత్నం
-
టీడీపీ ఎంపీలు మోదీకి ఊడిగం చేస్తున్నారు
-
ధైర్యం ఉంటే మోదీ ఇంటి ముందు ధర్నా చేయండి
-
‘ఇద్దామంటే నంది అవార్డులు కూడా అయిపోయాయి’
తూర్పుగోదావరి జిల్లా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు టీడీపీ ఎంపీలపై ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు వేసే నాటకాలకు అవార్డులు ఇద్దామంటే నంది అవార్డులు కూడా అయిపోయాయని ఎద్దేవా చేశారు. కాకినాడలో విలేకరులతో మాట్లాడుతూ..ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలంటే టీడీపీ ఎంపీలకు, మంత్రులకు భయమన్నారు. ఆస్కార్ అవార్డులు ఇద్దామంటే నాటకాలకు ఆస్కార్ అవార్డులు ఇవ్వరని అపహాస్యమాడారు. చంద్రబాబు ధర్నా చేయాల్సింది శ్రీకాకుళంలో అధికారుల ముందు కాదని, ధైర్యం ఉంటే ఢిల్లీలోని ప్రధాని మోదీ ఇంటి ముందు చేయాలని సూచించారు. ధైర్యం కావాలంటే ఓ సారి గదిలోకి వెళ్లి ఎన్టీఆర్ చిత్ర పటం చూడాలన్నారు. చంద్రబాబు నాయుడికి దిక్కుమాలిన సలహదారులు దొరికారని వ్యాఖ్యానించారు -
టీడీపీపీ భేటీకి కేంద్ర మంత్రి అశోక్ డుమ్మా
సాక్షి, అమరావతి : అత్యంత కీలకమైన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) సమావేశానికి ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేవంటూ సీఎం చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జరిగిన సమావేశానికి కేంద్ర మంత్రి అశోక్ రాకపోవడం వెనుక బలమైన కారణాలేమైనా ఉన్నాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్దికాలంగా సీఎం చంద్రబాబుతో ఆయనకు పొసగడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అశోక్ పార్టీతో, చంద్రబాబుతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన టీడీపీపీ సమావేశానికి ఆయన గైర్హాజరవడం గమనార్హం. కాగా, చైనా పర్యటనకు వెళ్లిన అశోక్ శనివారం రాత్రే రావడంతో సమావేశానికి హాజరుకాలేకపోయారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. -
బీజేపీపై మండిపడ్డ టీడీపీ ఎంపీ
సాక్షి, అమరావతి: బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోందని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు. ఇక్కడ జరుగుతున్న టీడీపీ వర్క్‌షాప్‌లో ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ ది ఎంత పాపముందో బీజేపీది కూడా అంతే ఉందన్నారు. ఇచ్చిన హామీల్లో ఏవీ అమలు చేయలేదని అన్నారు. సీఎం తన స్థాయిని తగ్గించుకుని వెళ్లి అడుగుతున్నా కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు. రాజధానికి రూ.30 వేల కోట్లు అడిగితే రూ.3 వేల కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర విద్యా సంస్థలకు రూ.11, 600 కోట్ల భూములు ఇస్తే వాటికి రూ.150 కోట్లు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇది చివరి బడ్జెట్.. ఇప్పుడు రాకపోతే మళ్లీ నిధులు ఇచ్చే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్‌కు ఎలాంటి బుద్ధి చెప్పారో బీజేపీకి కూడా అలాగే బుద్ధి చెబుతారని అవంతి అన్నారు. ఈయన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే నిధులు రావని చెప్పారు. అలాగని రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడనని, దీనిపై ఎంతవరకైనా వెళ్లానని స్పష్టం చేశారు. కాగా, అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే నిధులు రావని, అలాగని రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడబోనని చెప్పారు. ఎంతవరకు అయినా వెళ్తానని వ్యాఖ్యానించారు. -
చైనా కంపెనీ ముసుగులో ఎంపీ కుటుంబం
సాక్షి, అమరావతి : అర్హతలేని చైనా కంపెనీకి రూ.240 కోట్ల విలువైన అప్టికల్ ఫైబర్ కేబుళ్ల ప్రాజెక్టును కట్టబెట్టడానికి టీడీపీ ఎంపీ ఒకరు రంగంలోకి దిగారు. అందుకు ట్రాన్స్‌కో ఉన్నతాధికారి వత్తాసు పలుకుతున్నారు. ఇదే కాదు.. అమరావతిలో విద్యుత్తు ప్రాజెక్టులను కూడా అదే చైనా కంపెనీ పేరుతో దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు. చైనా కంపెనీ ముసుగులో ప్రాజెక్టులు దక్కించుకుని కోట్లు కొల్లగొట్టాలన్నది ఆ ఎంపీ వ్యూహం. ఇదీ ప్రాజెక్టు అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోడానికి రాష్ట్రంలో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు వేయాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. ఇందుకు 24 లేయర్లు కలిగిన ఆప్టికల్ ఫైబర్గ్రౌండ్(ఓపీజీ) వైర్లు వేయాలనేది ప్రణాళిక. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.240 కోట్లు కేటాయించింది. 18 నెలల్లో పనులు పూర్తి చేయాలని షరతు విధించటంతో ట్రాన్స్‌కో టెండర్ల ప్రక్రియకు సిద్ధపడింది. చైనా కంపెనీ ముసుగులో ఎంపీ కుటుంబం చైనాకు చెందిన ఎస్బీజీ అనే కంపెనీ వీటికి టెండర్ దాఖలు చేసింది. తాము చైనాలో ఉత్పత్తి చేస్తున్న ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లతో ఈ ప్రాజెక్టు చేపడతామని పేర్కొంది. అయితే తెరవెనుక వేరే కథ ఉంది. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే రాయలసీమకు చెందిన ఓ టీడీపీ ఎంపీ ఆ కంపెనీ పేరుతో అసలు వ్యవహారం నడుపుతున్నారు. రెండు అర్హతలు తప్పనిసరి... అమరావతిలో భారీస్థాయిలో చేపట్టే విద్యుత్తు లైన్ల ప్రాజెక్టులను చైనా కంపెనీ పేరుతో టెండర్లు దక్కించుకోవాలన్నది ఆ ఎంపీ కుటుంబం ఉద్దేశం. అందుకు తొలి అడుగుగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టుపై కన్నేశారు. విదేశీ కంపెనీలు టెండర్లలో పాల్గొనేందుకు కొన్ని విధివిధానాలున్నాయి. ఆ కంపెనీకి కచ్చితంగా భారత దేశంలో బ్యాంకు ఖాతా ఉండాలి. భారత్‌లో ఇన్‌కార్పోరేట్ కంపెనీ అయ్యుండాలి. కానీ ఈ చైనా కంపెనీకి ఆ రెండు అర్హతలు లేవు. దీంతో సదరు చైనా కంపెనీ దాఖలు చేసిన టెండరును ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు పరిశీలించకుండా పక్కనపెట్టేశారు. అనుమతించాల్సిందే... టెండర్ కట్టబెట్టాల్సిందే ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన రాయలసీమ టీడీపీ ఎంపీ.. చైనా కంపెనీని టెండర్లలో పాల్గొనేందుకు అనుమతించాలని ట్రాన్స్కోపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఆయన ఇటీవల విద్యుత్తు సౌధ కార్యాలయానికి వచ్చి చైనా కంపెనీని అనుమతించాల్సిందేనని పట్టుబట్టారు. ట్రాన్స్‌కోలో చక్రం తిప్పుతున్న ఓ ఉన్నతాధికారి అందుకు వత్తాసు పలుకుతున్నారు. ఈ ప్రయత్నాలకు ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు ససేమిరా అంటున్నారు. అర్హతలు లేని కంపెనీని అనుమతిస్తే న్యాయవివాదాలు తలెత్తి మొత్తం టెండర్ల ప్రక్రియే నిలిచిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఏడాదిన్నరలోగా ప్రాజెక్టు పూర్తి కాకపోతే కేంద్రం రూ.240 కోట్ల నిధులను వెనక్కి తీసుకుంటుందని చెబుతున్నా ఆ ఎంపీ వెనక్కి తగ్గకపోవటంతో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల టెండరు వ్యవహారం ట్రాన్స్‌కోలో ఆసక్తికరంగా మారింది. -
టీడీపీ ఎంపీ కార్యాలయంలో జూదం
-
పేకాటడెన్గా టీడీపీ ఎంపీ ఆఫీస్
-
వెలిగొండ పనులు టీడీపీ ఎంపీకి!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు కాంట్రాక్టర్లను ఇష్టానుసారంగా మార్చి వేస్తోంది. ఇటీవలే రూ.91.15 కోట్ల కొల్లంవాగు హెడ్‌రెగ్యులేటర్ పనులను పాత కాంట్రాక్టర్ల నుంచి తప్పించి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డికి చెందిన ఆర్కె ఇన్ఫ్రాకు కట్టబెట్టిన సర్కారు తాజాగా వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని టన్నెల్–1, 2 పరిధిలోని పనులను సైతం కొత్త కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. టన్నెల్–1 పనులను కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి అప్పగించనున్నారు. టన్నెల్–2 పనులను కోస్తా ప్రాంతానికి చెందిన మెగా కన్స్ట్రక్షన్స్కు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పనుల కేటాయింపుకు సంబంధించిన తంతు నేడో.. రేపో..ముగియనుంది. ఇప్పటికే ఒకమారు అంచనాలను పెంచుకొని పనులు వేగవంతం చేయని ప్రభుత్వం టన్నెల్–1,2 పనుల అంచనాలను మరోమారు భారీగా పెంచి కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు సిద్ధమైంది. పనుల అప్పగింతకు సంబంధించి ప్రభుత్వ స్థాయిలో పెద్దలకు కోట్లాది రూపాయల ముడుపులు అందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు టన్నెల్–1 పనులను ప్రసాద్, షూ, సబీర్ జాయింట్ వెంచర్ చేస్తుండగా కోస్టల్ కంపెనీ టన్నెల్–2 పనులను చేస్తోంది. టన్నెల్–1 పనులు 18.820 కిలోమీటర్ల చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ 14.755 కి.మీ మాత్రమే చేశారు. ఇక టన్నెల్–2 పనులు 18.838 కి.మీకు గాను ఇప్పటి వరకూ 10.72 కి.మీ మాత్రమే చేశారు. టన్నెల్–2 పనులు పూర్తిగా ఆగాయి. ప్రభుత్వం నిధులివ్వకపోవడంతోనే పనులు చేయలేని పరిస్థితి నెలకొందని పాత కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఇప్పటి వరకూ రూ.50 కోట్లమేర పాత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. మరోవైపు పాతరేట్లు గిట్టుబాటు కావడం లేదని, రేట్లు పెంచాలని కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయినా పట్టించుకోని సర్కార్ రేట్లు ఇబ్బడి ముబ్బడిగా పెంచి పనులను అధికార పార్టీకి చెందిన నేతలకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో కోట్లాది రూపాయల ముడుపులు చేతులు మారినట్లు సమాచారం. పనులు అధికార పార్టీకి చెందిన ఎంపీ, మరికొందరికి అప్పగించేందుకు ఇరిగేషన్ కీలక అధికారి కీలకపాత్ర పోషించగా కిందిస్థాయి అధికారులు సైతం ఇందుకు సహకరించినట్లు ఆరోపణలున్నాయి. తొలుత పనులు అప్పగించిన కాంట్రాక్టర్లకు నిధులిచ్చి పనులు వేగంగా వేయించడంలో శ్రద్ధ పెట్టాల్సిన ప్రభుత్వం దానిని గాలికొదిలింది. అవే పనులను మరోమారు కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించి కోట్లు కొల్లగొట్టేందుకే ప్రభుత్వ పెద్దలు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. పనులు స్వాధీనం చేసుకున్న కాంట్రాక్టర్లు మొబిలైజేషన్ అడ్వాన్సులతో అందిన కాడికి దండుకొని ఆ తర్వాత పనులు చేయకుండా మిన్నకుండిపోతున్నారు. కొల్లంవాగు హెడ్‌రెగ్యులేటర్ పనులను సైతం జులైలో అధికార పార్టీ నేతకు అప్పగించినా ఇప్పటికీ పనులు మొదలు పెట్టకపోవడం గమనార్హం. వెలిగొండ టన్నెల్–1 పనితో పాటు కొల్లంవాగు హెడ్ రెగ్యులేటర్ పనిని పూర్తి చేసి తొలుత 2017 నాటికే నీళ్లిస్తామని చెప్పిన సర్కారు ఇప్పుడు మాట మార్చి 2018 డిసెంబర్‌కు నీళ్లిస్తామంటూ కొత్త పల్లవి అందుకుంది. పనుల తీరు ఇలాగే కొనసాగితే మొదటి దశ పనులు ఏడాదిలో పూర్తి కావడం సాధ్యమయ్యే పని కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కాంట్రాక్టుల పేరుతో కోట్లు కొల్లగొట్టడం మాని చిత్తశుద్ధితో పని చేయాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. -
నేనో అట్టర్‌ఫ్లాప్ ఎంపీని
నా మనస్సాక్షి అదే చెబుతోంది – ప్రజలకు ఏమీ చేయలేకపోయా.. అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నా – ఈ నెల 25 లేదా 26న నేరుగా స్పీకర్‌కు రాజీనామా అందజేస్తా – దేశంలో ప్రధాని, ముఖ్యమంత్రులు మినహా ఎంపీలు, ఎమ్మెల్యేలు అలంకారప్రాయమే – ప్రధాని, ముఖ్యమంత్రికి నేరుగా ఎన్నికలు నిర్వహిస్తే సరిపోతుంది – అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సాక్షిప్రతినిధి, అనంతపురం: అనంతపురం ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జేసీ దివాకర్‌రెడ్డి ప్రకటించారు. ఈ నెల 25 లేదా 26న స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పిస్తానని ఆయన తెలిపారు. అనంతపురంలోని తన స్వగృహంలో గురువారం జేసీ విలేకరులతో మాట్లాడారు. సమావేశంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘ ప్రతి ఒక్కరికీ మనస్సాక్షి ఉంటుంది. నేను ఫెయిల్డ్ ఎంపీ అని నా మనస్సాక్షి చెబుతోంది. నేను అట్టర్‌ఫ్లాప్ ఎంపీని! నేను ఫెయిల్ అయినప్పుడు ఎందుకు ఎంపీగా కొనసాగాలి? అందుకే రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నా! రాజకీయాల నుంచే తప్పుకోవాలని మొదట భావించా! అయితే పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో కొనసాగాలని అనుకుంటున్నా! నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి నేను ఫెయిల్ అయ్యా! 9 నెలలుగా ప్రజలకు ఉపయోపడకుండా, వారికి ఏమీ చేయకుండా ఉండటం ఇదే తొలిసారి! ఫెయిల్ అయిన తర్వాత పదవిలో కొనసాగడం న్యాయం కాదు. రాజీనామా చేద్దామని స్పీకర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించా.. అందుబాటులోకి రాలేదు. అందుకే నేనే నేరుగా ఢిల్లీకి వెళ్లి స్పీకర్‌ను కలిసి రాజీనామా చేస్తా! నా కంటే బలమైన శక్తులు పనిచేస్తున్నాయని అనుమానం నాకు వచ్చింది. అవి ఏంటో మీకు(అధిష్టానానికి) నేను చెప్పాలా? ఇప్పటికే చాలాసార్లు వారితో ఈ విషయాలు చర్చించా! అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నా. ఆ బలమైన శక్తి ఏదో తెలుసుకోవాలి. ఎంపీ, ఎమ్మెల్యే పదవులు అలంకారప్రాయమే!: ‘ఈ దేశంలో ఇద్దరే మంత్రులు ఉన్నారు. ఒకరు ప్రధాని, మరొకరు ముఖ్యమంత్రి. ఎంపీలు, ఎమ్మెల్యే అలంకారప్రాయమే. నరేంద్రమోదీ మంచి పనిచేస్తే ప్రతిపక్షంలో ఉన్నవారు శభాశ్ అనే పరిస్థితి లేదు. అలాగే విపక్షంలో ఉన్న సోనియా, మన్మోహన్ ఏదైనా సూచన చెబితే పరిగణలోకి తీసుకునే పరిస్థితిలో అధికారపక్షం లేదు. ముఖ్యమంత్రి, ప్రధాని పదవులకు నేరుగా ఎన్నికలు నర్విహించాలి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మాకొద్దు. 40 ఏళ్లు చట్టసభల్లో ఉన్న వ్యక్తిగా ఈ మాటలు చెబుతున్నా. ఈ పదవులకు బై..బై.. పార్లమెంట్‌కు ఓ నమస్కారం! అరువుకొచ్చిన గాంధీలతో దేశానికి నష్టం వాటిల్లుతోంది. వీరు దేశాన్ని వదిలి మారుమూల ప్రాంతాలకు వెళ్లి, వారి పని వారు చేసుకుంటే బాగుంటుంది. రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ భ్రష్టు పట్టించింది. కాంగ్రెస్ ఏపీలో పూర్తిగా చచ్చిపోయిన పరిస్థితుల్లో మరో పార్టీలోకి మారాల్సి వచ్చింది. ప్రస్తుతం నేను అనంతపురం, తాడిపత్రిలో ఒక రైలు నిలపలేకపోతున్నా. ఇక ఎంపీగా నేను ఏం చేయగలను. తాడిపత్రికి తాగు, సాగునీరు రప్పించుకోలేకపోతున్నా. అందుకే తప్పు ఒప్పుకుంటున్నా. కేజ్రీవాల్‌ను చూసి ఇక్కడి నాయకులు ఆచరించాల్సిన అంశాలున్నాయి. ప్రజలకు ఒక మేసేజ్ ఇచ్చి దాన్ని ఆచరించి చూపిస్తున్నారు. అలాంటి మార్పులు ఇక్కడా జరగాలి. నీటి పారుదల శాఖను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉండకూడదు. ఇది మంచిది కాదు.’ అన్నారు. తాను లేవనెత్తిన డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోంటే రాజీనామా వ్యవహారంపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. -
ఎందుకు పడతాం!
విజయవాడలో టీడీపీ ఎంపీ కేసీనేని నాని నడిరోడ్డుపై సీనియర్ ఐపీఎస్ అధికారిని నిలదీసి... ఆయన గన్‌మన్‌పై చేయిచేసుకున్నారు. ఆ సంఘటన అప్పట్లో చాలా వివాదాస్పదమైంది. అంతలా కాకున్నా... విజయనగరంలో కేంద్ర మంత్రి ఏకంగా అధికారుల సమీక్షలో ఎన్హెచ్ఏఐ సూపరింటెండెంట్ ఇంజినీర్‌పై విరుచుకుపడ్డారు. అయితే ఈసారి ఆ అధికారి మౌనంగా ఉండలేదు. తిరిగి అంతే దీటుగా సమాధానమిచ్చి... అందరినీ ఆశ్చర్యపరిచారు. తప్పు చేయనపుడు ఒప్పుకోవాల్సిన అవసరం లేదంటూ తెగేసి చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం అండతో అధికారులపై విరుచుకుపడితే సహించలేరనడానికి విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరం సాక్షిగా జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. జిల్లా కేంద్రంలో రైల్వే వంతెనకు సంబంధించి అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు, జాతీయ రహదారుల శాఖ అధికారికి మధ్య జరిగిన వాగ్వివాదం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌తో సహా అనేక మంది అధికారుల సమక్షంలో జరిగిన సమావేశంలో వారి సంవాదం ప్రభుత్వాధికారుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తికి అద్దం పట్టింది. అంతేకాదు కొన్ని విషయాలు కేంద్ర మంత్రికి తెలియకుండా ఆయన కోటరీలోని కొందరు దాచిపెడుతున్నారన్న విషయం రూఢీ అయ్యింది. అసలేం జరిగిందంటే... జిల్లాలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి సుజయ కృష్ణ రంగారావు ఇక్కడి కలెక్టరేట్లో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, ఎస్పీ పాలరాజుతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అంశాల వారీగా సమీక్షిస్తున్న మంత్రి పట్టణంలో రైల్వే శాఖ రూ.13.4 కోట్లతో నిర్మిస్తున్న వంతెనకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం విషయంలో జాప్యం జరుగుతోందంటూ జాతీయ రహదారుల విభాగం(ఎన్హెచ్ఏఐ) సూపరింటెండెంట్ ఇంజినీర్ మనోహర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అధికారి కూడా అంతే దీటుగా సమాధానమిచ్చారు. తమకు ప్రతిపాదనలు తమకు అందలేదని అందితే నిర్మించడానికి, తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు. ఆ విషయాన్ని తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని మంత్రి అశోక్ గట్టిగా అడిగే సరికి అంతే తీవ్ర స్వరంతో ఇప్పటికే పలుమార్లు ఆ విషయాన్ని మీ ఓఎస్డీ అప్పలరాజుకు చెప్పామని ఆయన ఆ విషయాన్ని మీకు చెప్పకపోవడం మా తప్పు కాదని స్పష్టంచేశారు. ఓఎస్డీ నిర్వాకం వల్లే... నిజానికి రైల్వే అధికారులు సరైన క్రమంలో ప్రతిపాదనలు పంపించలేదనేది ఎన్హెచ్ఏఐ అధికారుల వాదన. ఆ విషయం తనకెందుకు చెప్పలేదనేది మంత్రి ఆగ్రహం. అయితే అసలు మూలం అప్పలరాజు దగ్గర ఉంది. తనకు అధికారులు చెప్పిన ఏ విషయాన్నీ ఆయన మంత్రికి తెలియపరచడంలేదు. విషయం తెలియక, ఎందుకు జాప్యం జరుగుతుందో అర్ధం కాక అశోక్ గజపతి తొమ్మిది జిల్లాల అధికారిని నలుగురిలో నిలదీశారు. మంత్రి వాదనకు తలవంచితే తమ వైపు తప్పున్నట్లు అంగీకరించినట్లవుతుందని భావించిన ఎస్ఈ ఏ మాత్రం తగ్గలేదు. చివరి వరకూ తన వాదనను బలంగానే వినిపించారు. ఇదే విషయాన్ని ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ చెప్పారు..మంత్రికి ఎదురు చెప్పాలనే ఉద్దేశం తనకు లేదని, అయితే చేయని తప్పుకు నలుగురిలో నిలదీస్తుంటే ఒప్పుకోలేకపోయానని ఎస్ఈ అన్నారు. రైల్వే శాఖ అధికారులు కాగితంపై మామూలుగా రాసేసి రూ.3.4 కోట్లు ఇమ్మంటున్నారని, పద్ధతి ప్రకారం అడిగితే ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఓఎస్డీకి కూడా చెప్పామని ఆయన వివరించారు. -
రంగంలోకి టీడీపీ అధిష్టానం.. జేసీతో మంతనాలు
విశాఖపట్నం: జాతీయ స్థాయిలో టీడీపీ పరువు పోయేలా వ్యవహరించిన ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వివాదంపై టీడీపీ అధిష్టానం దృష్టిసారించింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఈ వివాదం వేడి తాకింది. గూండాలాగా వ్యవహరించిన ఓ ఎంపీ విషయంలో చంద్రబాబు ఇలాంటి వైఖరేనే అనుసరించేది.. అండదండలు అందించేది అని ఆగ్రహం పెల్లుబుకుతుండటంతో నష్టనివారణ చర్యలకు పార్టీ దిగింది. ఇప్పటికే జేసీతో మరో ఎంపీ సీఎం రమేశ్ మంతనాలు జరుపుతున్నారు. ఎయిర్పోర్ట్ సిబ్బందికి క్షమాపణలు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కేసును మరోదారిలో నీరుగార్చేందుకు టీడీపీ యత్నం చేస్తోంది. ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా జేసీపై ఫిర్యాదు కూడా చేయలేదు. సిబ్బంది ఫిర్యాదు చేస్తే తాము చర్య తీసుకుంటామంటూ పోలీసులు చెబుతున్నారు. దీంతో జేసీని రక్షించేందుకు కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శివసేన ఎంపీ గైక్వాడ్ విషయంలో కఠినంగా వ్యవహరించిన ఆయన జేసీ దాడి విషయంలో మాత్రం నాన్చివేత ధోరణి అనుసరిస్తున్నారు. దీంతో సొంతపార్టీ ఎంపీకి ఒక న్యాయం, ఇతర ఎంపీలకు మరో న్యాయమా అంటూ తీవ్ర విమర్శలు ఆయనపై వస్తున్నాయి. -
'టీడీపీ ఎంపీ చర్య నిజంగా సిగ్గుచేటు'
న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో గురువారం దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. జేసీ దివాకర్‌రెడ్డి తీరుపై సివిల్ ఏవియేషన్ మాజీ డైరెక్టర్ జనరల్ కాను గోహైన్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎయిర్ లైన్స్ సిబ్బందిపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దౌర్జన్యానికి పాల్పడటం నిజంగా సిగ్గుచేటన్నారు. సెక్యూరిటీ నియమాలను జేసీ ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఎంపీలు తమ హద్దుల్లో ఉంటూ హుందాగా ప్రవర్తించాలని మాజీ డీజీసీఏ హితవు పలికారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించించిన వెంటనే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా, స్పైస్‌జెట్, గో ఎయిర్, జెట్‌ఎయిర్‌వేస్‌లు కూడా జేసీపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇండిగో విమానంలో బెంగళూరుకు వెళ్లేందుకు గురువారం ఉదయం దివాకర్‌రెడ్డి 7.30 గంటలకు ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్‌లోకిð వెళ్లారు. ఆయన వెళ్లే విమానం 7.55 గంటలకు బయలుదేరనుంది. అయితే బోర్డింగ్ పాస్ ఇవ్వాలని కౌంటర్లో సిబ్బందిని అడగగా.. విమానం బయలుదేరే సమయానికి 45 నిమిషాల ముందే బోర్డింగ్ పాసులు జారీ చేశామని, ఆ సమయం దాటిన తర్వాత వచ్చిన వారికి ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని చెప్పారు. తనకే రూల్స్ చెబుతారా అంటూ కౌంటర్లోకి చొరబడి ఓ ఉద్యోగిని మెడ పట్టుకుని గెంటేయడంతో పాటు బోర్డింగ్ పాస్‌లు జారీచేసే మెషీన్‌ను టీడీపీ ఎంపీ ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో వీఐపీ లాంజ్‌లో ఉన్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వద్దకు వెళ్లి విమాన సిబ్బంది తనన అవమానించారని చెప్పారు. కేంద్ర మంత్రి విమాన సంస్థ అధికారులను ఒప్పించి బోర్డింగ్‌పాస్ ఇప్పించగా, ఇతర ప్రయాణికులకు అలాగే బోర్డింగ్ పాస్‌లు ఇవ్వవ పోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో గన్నవరం విమానాశ్రయంలోనూ ఎంపీ జేసీ ఇదే తరహాలో దాడులకు తెగబడ్డారనీ, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్ర ఎంపీ గైక్వాడ్ విషయంలో వ్యవహరించినట్లుగానే జేసీపైనా చర్యలు తీసుకోవాలని విమానయాన సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఏపీ రవాణా శాఖ అవినీతిమయం: కేశినేని
విజయవాడ: అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన 900 బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తే ఏపీ రవాణాశాఖ ఉన్నతాధికారులకు చీమ కుట్టినట్లయినా లేదని ఎంపీ కేశినేని నాని ఘాటుగా విమర్శించారు. రవాణా శాఖ మొత్తం అవినీతిమయంగా మారిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. అక్కడ రద్దయిన బస్సులను రాష్ట్రంలో ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. ఒక ఎంపీ లేఖను గౌరవించి అరుణాచల్‌ప్రదేశ్ అధికారులు, ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ స్పందిస్తే.. రాష్ట్రంలో అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజా జీవితంలో మచ్చ ఉండకూడదన్న ఉద్దేశంతోనే తాను బస్సుల వ్యాపారాన్ని విడిచిపెట్టానని స్పష్టం చేశారు. గతంలో తాను తిప్పిన బస్సుల్లో ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసినవి లేవన్నారు. నిబంధనల ప్రకారం బస్సులు నడుపుతున్న యజమానులంతా రవాణాశాఖ అధికారుల తీరుతో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘అమరావతితో మాకు పనిలేదు’
రాయదుర్గం: వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో మాటలు విసిరారు. 2019లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని సీఎం చంద్రబాబు సమక్షంలో కుండబద్దలు కొట్టారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఏర్పాటు చేసిన సభకు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా దివాకర్‌రెడ్డి మట్లాడుతూ... అమరావతితో తమకు పనిలేదని, త్వరగా పోలవరం పూర్తి చేయాలని అన్నారు. చంద్రబాబుకు దేవుడు కూడా సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. పంటలకు గిట్టుబాట ధరం రావడం లేదని, దళారుల మాయాజాలంతో రైతులు నష్టపోతున్నారని వాపోయారు. చంద్రబాబు చెబుతున్నట్టు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2020 నాటికి పూర్తి చేయడం సాధ్యం కాదని, దానికి అదనంగా నాలుగైదేళ్లు పడుతుందని గతంలో దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
మమ్మల్నే ఫీజు అడుగుతారా?
-
మమ్మల్నే ఫీజు అడుగుతారా?
- టోల్‌ప్లాజాపై ఎంపీ నిమ్మల తనయుల వీరంగం - అనుచరులతో కలసి కంప్యూటర్లు, అద్దాలు ధ్వంసం హిందూపురం అర్బన్/ చిలమత్తూరు/ బాగేపల్లి (కర్ణాటక): తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు అంబరీష్, శిరీష్ సోమవారం ఆంధ్ర– కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్‌ప్లాజాలో వీరంగం సృష్టించారు. టోల్గేట్ వద్ద అంబరీష్ అనుచరుల కారును ఆపి గేట్ ఫీజు అడిగారన్న కోపంతో విధ్వంసానికి దిగారు. అనుచరులతో కలిసి టోల్‌ప్లాజాపై దాడి చేసి.. కంప్యూటర్లు, అద్దాలు పగులగొట్టారు. సోమవారం ఉదయం పది గంటలకు ఎంపీ పెద్ద కుమారుడు అంబరీష్ ఇన్నోవా కారు (ఏపీ02 బీడీ 1234)లో, అతని స్నేహితులు ఫోర్డ్ కారు (ఏపీ02 ఈబీ 6777)లో కర్ణాటకలోని బాగేపల్లి టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. టోల్‌ప్లాజా సిబ్బందికి ఎంపీ పాస్ జిరాక్సు కాపీ చూపించారు. దాన్ని పరిశీలించిన సిబ్బంది.. ‘ఇది వ్యాలిడిటీ అయిపోయింది. ఈ పాస్ కేవలం పార్లమెంట్ సభ్యులకు మాత్రమే ఉంటుంది. కుటుంబ సభ్యులందరికీ అనుమతి లేదు. అయినా ఎంపీ కుమారుడివి కావడంతో ఈసారి అనుమతిస్తున్నామ’ని చెప్పా రు. అయితే.. తన స్నేహితుల ఫోర్డ్ కారుకు కూడా అనుమతివ్వాలని అంబరీష్ పటు ్టబట్టాడు. ఇందుకు సిబ్బంది నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాడు. ‘ఎవరితో మాట్లాడుతున్నారో తెలుస్తోందా? తమాషా చేస్తున్నారా?’ అంటూ తీవ్ర స్థాయిలో బెదిరించాడు. టోల్‌ప్లాజా సిబ్బంది వారించినా అతను వినలేదు. వారిపై శివాలెత్తుతూనే.. గోరంట్లలోని తన తమ్ముడు నిమ్మల శిరీష్, ఇతర అనుచరులకు ఫోన్ చేసి రప్పించాడు. కొంతసేపటికి కారులో శిరీష్‌తో పాటు ఏడుగురు అక్కడికి చేరుకుని టోల్‌ప్లాజాపై దాడి చేశారు. అద్దాలు పగులగొట్టారు. రెండు కంప్యూటర్లను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన సిబ్బందిపై చేయి చేసుకున్నారు. తమతో పెట్టుకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించి బెంగళూరు వైపు వెళ్లిపోయారు. దీంతో బాగేపల్లి పోలీసులు నిమ్మల అంబరీష్, నిమ్మల శిరీష్, పాపన్న, నరేష్, లక్ష్మీపతి, మునికుమార్, శ్రీకృష్ణపై 149, 143, 147, 323, 324, 504, 427, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం వారు బాగేపల్లి పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. -
గూండాగిరి
- శ్రుతిమించిన ఎంపీ నిమ్మల కిష్టప్ప కుటుంబ సభ్యుల ఆగడాలు - ప్రశ్నించే వారిపై దౌర్జన్యాలు, దాడులు - బాగేపల్లి టోల్‌ప్లాజాలో నిమ్మల తనయుల వీరంగం - టోల్‌ఫీజు అడిగినందుకు సిబ్బందిపై దాడి - కంప్యూటర్లు, అద్దాలు ధ్వంసం - టోల్‌ప్లాజాపై దాడి చేయడం ఇది మూడోసారి హిందూపురం అర్బన్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ శ్రుతి మించుతున్నాయి. ప్రజాప్రతినిధులు మొదలుకుని కిందిస్థాయి నాయకుల వరకు దౌర్జన్యాలు, దాడులకు దిగడం అలవాటుగా చేసుకున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. న్యాయాన్యాయాలతో పనిలేకుండా వారిపై అమాంతం దాడులకు తెగబడుతున్నారు. సోమవారం టోల్‌ఫీజు అడిగారన్న కోపంతో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు అంబరీష్, శిరీష్ తమ అనుచరులతో కలిసి కర్ణాటకలోని బాగేపల్లి టోల్‌ప్లాజాలో నానా బీభత్సం సృష్టించారు. సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా అక్కడి కంప్యూటర్లు, అద్దాలు ధ్వంసం చేశారు. అనంతపురం–బెంగళూరు మార్గంలోని 44వ జాతీయ రహదారిలో ఉన్న టోల్‌ప్లాజాల వద్ద టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు దిగడం ఇదేమీ కొత్త కాదు. సిబ్బందిపై దాడి చేసిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. టోల్‌ప్లాజాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు, కొందరు అధికారులు, ప్రముఖులకు మాత్రమే ఉచిత వాహన ప్రవేశ అనుమతి ఉంటుంది. మిగిలిన వారు తప్పనిసరిగా టోల్‌ఫీజు చెల్లించాలి. అయితే.. కొందరు ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు తమ వారి పాస్ జిరాక్స్ కాపీ తీసుకెళ్లి చూపిస్తున్నారు. తమ వాహనాలను ఉచితంగా అనుమతించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నిబంధనల గురించి టోల్‌ప్లాజా సిబ్బంది వారికి చెప్పినా..ఏమాత్రం వినకుండా గొడవకు దిగుతున్నారు. నిమ్మల కిష్టప్ప పెద్ద కుమారుడు అంబరీష్ కూడా ఇదేవిధంగా గొడవకు దిగాడు. అతని ఇన్నోవా కారు (ఏపీ02 బీడీ 1234)ను టోల్‌ప్లాజా సిబ్బంది అనుమతించినప్పటికీ సంతృప్తి చెందకుండా.. అతని స్నేహితులు ప్రయాణిస్తున్న ఫోర్డ్ కారు(ఏపీ02 ఈబీ 6777)ను కూడా ఉచితంగా అనుమతించాలని డిమాండ్ చేశాడు. వారు వినకపోవడంతో తన తమ్ముడు నిమ్మల శిరీష్, కొంతమంది అనుచరులను అక్కడికి పిలిపించుకుని.. అందరూ కలిసి టోల్‌ప్లాజాపై దాడి చేశారు. ఈ దాడిలో ప్లాజా ఉద్యోగి నటరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. టోల్‌ఫీజులు నమోదు చేసే కంప్యూటర్లు, పరికరాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి బాగేపల్లి పోలీసులు నిమ్మల కిష్టప్ప కుమారులతో పాటు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. నిమ్మల కుటుంబ సభ్యులు బాగేపల్లి టోల్‌ప్లాజాలో దౌర్జన్యానికి దిగడం ఇది మూడోసారి. దీంతో వారి పేరు వినగానే అక్కడి సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. గతంలో ఎంపీ సోదరుడు నిమ్మల చంద్రశేఖర్ టోల్‌ప్లాజా సిబ్బందితో గొడవపడ్డారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప పేరు చెప్పి తన వాహనాన్ని అనుమతించాలని కోరగా..అందుకు ప్లాజా సిబ్బంది నిరాకరించడంతో వివాదం తలెత్తింది. 2015 ఏప్రిల్ 5న ఎంపీ కుమారుడు అంబరీష్ కొత్తకారులో వస్తుండగా ప్లాజా సిబ్బంది నిలిపారు. దీనికి ఆగ్రహించిన ఎంపీ నిమ్మలకిష్టప్ప నేరుగా అక్కడి చేరుకుని సిబ్బందితో తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ ఘటనపై నిమ్మల కిష్టప్పతో పాటు మరికొందరిపై కేసు నమోదయ్యింది. అయితే.. అప్పటి ప్లాజా మేనేజర్ ఈ కేసును వెనక్కు తీసుకున్నారు. అంతకుముందు ఎంపీ అనుచరుడు సుబ్బారెడ్డి కూడా ప్లాజా సిబ్బందితో గొడవ పడినట్లు సమాచారం. మూడోసారి కూడా నిమ్మల కుటుంబ సభ్యులు దౌర్జన్యానికి దిగడాన్ని కర్ణాటక పోలీసులు, టోల్‌ప్లాజా నిర్వాహకులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులై ఉండి.. ఇలా దాడులు చేయడం సరికాదని చిక్‌బళ్లాపూర్ (కర్ణాటక) ఎస్పీ కార్తీక్‌రెడ్డి హితవుచెప్పారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప కుటుంబ సభ్యులు గూండాల్లో ప్రవర్తిస్తున్నారంటూ టోల్‌ప్లాజా డైరెక్టర్ ఉదయ్కుమార్సింగ్ కాస్తంత కఠినంగానే మాట్లాడారు. ఇతర ప్రాంతాల నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చామని, కొందరు రాజకీయ నేతల కారణంగా తమకు భద్రత కరువైందని టోల్‌ప్లాజా సిబ్బంది వాపోయారు. తనపై ఎంపీ తనయులు దాడి చేయడంపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని నటరాజ్ అనే ఉద్యోగి తెలిపారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించి టీడీపీ నేతల ఆగడాలను అరికట్టాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఎంపీ కిష్టప్ప కుమారులపై కేసు నమోదు
-
టీడీపీ నేతల గూండాగిరిపై హైకోర్టు దృష్టి
- రవాణా శాఖ కమిషనర్‌పై దాడి వ్యవహారం.. - ‘సాక్షి’ కథనాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన న్యాయస్థానం - మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయం మేరకు 25 నుంచి విచారణ సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేతల గూండాగిరిపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), విజయవాడ మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, విజయవాడ కార్పొరేషన్ మేయర్ కోనేరు శ్రీధర్, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ నాగుల్ మీరా తదితరులు దూషిస్తూ బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా పరిగణించింది. టీడీపీ నేతల బరి తెగింపుపై ‘సాక్షి’లో గత నెల 26న ‘ఐపీఎస్‌పై గూండాగిరీ’ శీర్షికతో ప్రచురిత మైన కథనాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. ఇందులో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, రవాణా శాఖ కమిషనర్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్లతో పాటు కేశినేని నాని, బొండా ఉమా తదితరులను ప్రతివాదులుగా చేర్చింది. ‘సాక్షి’ కథనాన్ని చదివి తీవ్ర ఆవేదనకు గురైన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బి.శివశంకరరావు టీడీపీ నేతల దౌర్జన్యకాండను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ దృష్టికి తీసుకొచ్చారు. తన ఆవేదనను రెండు పేజీల లేఖలో పొందుపరిచి ఏసీజే ముందుంచారు. దానిని టేకెన్ అప్ పిటిషన్‌గా పరిగణించాలని కోరారు. దానిని పరిశీలించిన ఏసీజే ఆ లేఖను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన పిల్ కమిటీకి నివేదించారు. ఈ వ్యవహారాన్ని విస్తృత కోణంలో చూడాలి.. ముగ్గురు న్యాయమూర్తులు ఈ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించాలంటూ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ వ్యవహారం పిల్‌గా పరిగణించాల్సినంతది కాదని మిగతా ఇద్దరు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. పిల్‌గా పరిగణించాలన్న న్యాయమూర్తుల్లో ఒకరు తన అభిప్రాయాన్ని చాలా ఘాటుగా వ్యక్తం చేశారు. ‘ఈ మొత్తం వ్యవహారాన్ని విస్తృత కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. సమాజంలో తమ పాత్ర ఏమిటన్న దానిపై ప్రస్తుత రాజకీయ కార్యనిర్వాహకులకు అవగాహన ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయ అవినీతి, అపరిమిత అధికారం వారి నినాదాలుగా కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నా అభిప్రాయం ప్రకారం ఈ వ్యవహారాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలి. తద్వారా వక్రమార్గంలో పయనించే రాజకీయ నాయకులకు గట్టి సందేశం పంపినట్లవుతుంద’న్నారు. పిల్‌గా అవసరం లేదన్న ఓ న్యాయమూర్తి.. ఇది కేవలం దౌర్జన్యం మాత్రమేనని చెప్పారు. మెజారిటీ అభిప్రాయం మేరకు దీనిని పిల్‌గా పరిగణిస్తున్నట్లు ఏసీజే పరిపాలనపరంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో రిజిస్ట్రీ ‘సాక్షి’ కథనాన్ని పిల్‌గా మలిచింది. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. -
‘చంద్రబాబు వారందరికీ సమాధానం చెప్పండి’
హైదరాబాద్ : టీడీపీ ఎంపీ శివప్రసాద్ ప్రశ్నలకు ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓ దళితద ఎంపీ ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దళిత మంత్రులతో తిట్టించడం దారుణమన్నారు. చంద్రబాబుకు శివప్రసాద్ స్నేహితుడు, శ్రేయోభిలాషి అన్నారు. దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని స్నేహితుడు ప్రశ్నించడం తప్పా అని భూమన అన్నారు. శివప్రసాద్‌తో పాటు బోండా ఉమ, బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్, పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా ప్రశ్నిస్తున్నారని,వారికి కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నమ్మినవారిని నట్టేట ముంచడం చంద్రబాబు నైజం, ఇవ్వాల్సింది షోకాజ్ నోటీసులు కాదని, వారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, బాబు పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గం సంతోషంగా లేరని భూమన ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నది ఒక్క లోకేశ్ బాబే అని ఆయన వ్యాఖ్యానించారు. -
మీడియాతో మాట్లాడొద్దు ప్లీజ్..
ఎంపీ శివప్రసాద్‌తో మంత్రులు సుజన, అమర్నాథ్రెడ్డి రాయబారం తిరుపతి తుడా: రాష్ట్రవ్యాప్తంగా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని, ప్రభుత్వ తీరును అంబేడ్కర్ జయంతి సభావేదికపై ఎండగట్టిన టీడీపీ చిత్తూరు ఎంపీ ఎన్.శివప్రసాద్‌ను శాంతింపజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి, చిత్తూరు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అమర్నాథరెడ్డి శనివారం రాత్రి 10 గంటల తరువాత ఫోన్‌ద్వారా రాయబారం నడిపారని విశ్వసనీయ సమాచారం. ఎంపీ శివప్రసాద్ దళితుడు కాబట్టే ఏకంగా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి సస్పెండ్ చేస్తానని బెదిరించి, కబ్జా మరకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారని బాబుపై రాష్ట్రవ్యాప్తంగా దళితసంఘాలు గళం విప్పాయి. దీంతో ప్రస్తుతానికి రాయబారమే సరైందని గుర్తించి సుజనాచౌదరి, అమరనాథరెడ్డిలను ఎంపీ వద్దకు పంపాలని నిర్ణయించారు. దీంతో శనివారం రాత్రి వారిద్దరూ ఫోన్‌చేసి ఎంపీని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. దీంతో శివప్రసాద్ ‘నిజం మాట్లాడితే నన్ను సస్పెండ్ చేస్తానంటారా.. ఎలా చేస్తారో చూస్తాను, దళితులకు అన్యాయం జరుగుతున్నది నిజం కాదా.. అందుకే మాట్లాడాను, మావాళ్లకు నేనేం సమాధానం చెప్పాలి..’ అని తన ఆవేదనను వెళ్లగక్కారు. ఆయన ఎంతకీ ససేమిరా అనడంతో ఆ ఇద్దరు మంత్రులు రేపో ఎల్లుండో తిరుపతి వస్తారని తెలిసింది. -
‘అందుకే నాపై చంద్రబాబు నిందలు’
చిత్తూరు: దళితులకు జరుగుతున్న అన్యాయంపై వెనక్కితగ్గే ప్రసక్తే లేదని చిత్తూరు టీడీపీ ఎంపీ ఎన్. శివప్రసాద్ స్పష్టం చేశారు. దళితులకు న్యాయం చేయాలని తాను అడగడం తప్పా అని ప్రశ్నించారు. డీకేటీ భూముల రెగ్యులరైజేషన్ హామీ ఏమైంది, బ్యాక్ లాగ్ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదు, ఎస్సీ సబ్ ప్లాన్ కు నిధులు ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. ఈ ప్రశ్నలు అడినందుకే తనపై సీఎం చంద్రబాబు నిందలు వేస్తున్నారని వాపోయారు. కాగా, శివప్రసాద్ కు సంఘీభావం తెలిపేందుకు దళిత సంఘాల నేతలు పెద్దఎత్తున ఆయన నివాసానికి తరలివచ్చారు. చంద్రబాబు వ్యాఖ్యలపై దళిత సంఘాల నాయకులు మండిపడుతున్నారు. గడిచిన మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో దళితులకు టీడీపీ ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదని అంబేడ్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం శివప్రసాద్ చిత్తూరులో ధ్వజమెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివప్రసాద్ పై చర్యలు తప్పవని చంద్రబాబు సూచనప్రాయంగా వెల్లడించారు. -
‘మన ఎమ్మెల్యేలు దొంగలు’
కర్నూలు(టౌన్): ‘‘మంత్రిగారూ! మీకు.. మీ ముఖ్యమంత్రికి అమరావతిపై ఏమాత్రం అవగాహన లేదు’’ అని టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం కర్నూలుకు వచ్చిన మంత్రి నారాయణను ఆయన స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో కలిశారు. మంత్రితోపాటు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో మధ్యలో కలుగజేసుకున్న జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అమరావతిలో ముందుగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్లాట్లు ఇవ్వాలి. అయితే మన ఎమ్మెల్యేలు దొంగలు. ఇచ్చిన ప్లాట్లు అమ్ముకుంటారు. వాటిని అమ్ముకోకుండా టైఅప్ చేసి అభివృద్ధి చేయాలి’’ అని ఆయన అన్నారు. అసలు మీ శాఖలో మున్సిపల్ సమస్యలను ఎక్కడ పట్టించుకుంటున్నారంటూ మంత్రి నారాయణను ఆయన ప్రశ్నించారు. మంత్రి స్పందిస్తూ.. ‘సార్.. సార్.. నాలుగు నెలలు అందుబాటులో లేను. ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించాను.. సమస్యలు పరిష్కరిస్తాను’ అని జవాబిచ్చారు. -
దళితులకి న్యాయం జరగాలని కోరడం తప్పా?
-
ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలపై టీడీపీలో తర్జనభర్జన
అమరావతి: చిత్తూరు జిల్లా ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ తర్జనభర్జన పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మూడేళ్లలో రాష్ట్రంలో దళితులకు చేసిందేమీ లేదని శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఖండించలేకపోతోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీలో డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి ఇవాళ పార్టీ సీనియర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా దళితులకు ఏం చేశామో చెప్పాలంటూ సీనియర్ నేతలకు సూచనలు ఇచ్చారు. అయితే ఎంపీ శివప్రసాద్ చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఏమీ లేవని సీనియర్లు...సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది. దళితులకు పదవుల విషయంలో అన్యాయం జరిగిందని సీనియర్లు తేల్చి చెప్పినా, శివప్రసాద్ వ్యాఖ్యలను ఖండించాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచన చేయడం గమనార్హం. అంతేకాకుండా వ్యక్తిగత ఎజెండాతో శివప్రసాద్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ప్రచారం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా కనీసం స్కాలర్షిప్పుల్లో కోత పైనా చంద్రబాబు ఈ సమావేశంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. -
పార్టీ సీనియర్లతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
అమరావతి : మంత్రివర్గ విస్తరణ అనంతరం జరుగుతున్న పరిణామాలతో పాటు, సొంత పార్టీ నేతల విమర్శలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారమిక్కడ పార్టీ ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఈ సందర్భంగా నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా టీడీపీ ఎంపీ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలను పలువురు నేతలు... ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. గత కొంతకాలంగా శివప్రసాధ్ అసంతృప్తిగా ఉన్నారని, దానికి భూ వ్యవహారమే కారణమని నేతలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దళితులకు ప్రభుత్వం చేసిన మేలు ఏమిటో ప్రజలకు తెలుసని, లోక్‌సభ, అసెంబ్లీ స్పీకర్లను చేసిన ఘటన టీడీపీదే అని ... ప్రభుత్వాన్ని, పార్టీని ఇబ్బంది పెట్టి తనను లొంగదీసుకోవాలనుకోవడం సాధ్యం కాదని చంద్రబాబు వ్యాఖ్య్యానించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. హధీరాం మఠం భూములు కావాలని శివప్రసాద్ సిఫార్సు చేసినట్లు ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో నేతలతో ప్రస్తావించారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మూడేళ్లలో రాష్ట్రంలో దళితులకు చేసిందేమీ లేదని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. మంత్రి పదవుల విషయంలోనూ తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. -
రసకందాయంలో బెజవాడ రాజకీయం
-
రసకందాయంలో బెజవాడ రాజకీయం
విజయవాడ: బెజవాడ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. ట్రావెల్స్ వ్యవహారంలో ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని, మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే బోండా ఉమా... ముఖ్యమంత్రి వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. కాపుల గొంతు కోస్తున్నారంటూ బోండా ఉమా తన ఆగ్రహాన్ని బాహాటంగానే చెబుతున్నారు. ఆర్టీఏ కార్యాలయం వివాదంతో ఎంపీ కేశినేని నానీకి... ముఖ్యమంత్రికి మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ట్రావెల్స్ మూసివేత నిర్ణయం వద్దని ముఖ్యమంత్రి వారించినా నాని మాత్రం ఆయన మాటను ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఈ క్రమంలో పార్టీ కార్యక్రమాలకు కేశినేని నాని దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే...ఇటీవల చంద్రబాబు కోడలు నారా బ్రహ్మాణికి విజయవాడ ఎంపీ సీటు ఇస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. మరోవైపు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శుక్రవారం రాత్రి వెలగపూడిలో సీఎంను కలవడం ....బెజవాడ రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కేశినేని నాని గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా కేశినేని నాని పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడంతో పాటు, ఎంపీ సీటు కోసం భారీగానే మూల్యం చెల్లించారు. అవసరం ఉన్నంతవరకూ వాడుకుని, ఆ తర్వాత కూరలో కర్వేపాకులా పక్కన పడేయడం చంద్రబాబు నాయుడు అలవాటు అయిన విషయం తెలిసిందే. దీంతో తనకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారంటూ నాని అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. కాగా లగడపాటి రాజగోపాల్ కూడా భారీ ఆఫర్... ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. -
‘అందుకే కేశినేని ట్రావెల్స్ మూసివేశారు’
తిరుపతి : టీడీపీ ఎంపీ కేశినేని నానికి చెందిన కేశినేని ట్రావెల్స్ మూసివేత వెనుక పెద్ద మతలబే జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ బ్యాంకుల వద్ద నుంచి వందలకోట్ల అప్పు చేసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని అన్నారు. బ్యాంకులకు అప్పులు చెల్లించకుండా ఎగనామం పెట్టారని, కేశినేని నాని మరో విజయ్ మాల్యా అవతారం ఎత్తారని చెవిరెడ్డి విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకే ఆయన ట్రావెల్స్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారన్నారు. బస్సుల పేరుతో బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బులతో విజయవాడలో స్టార్ హోటల్ కడుతున్నారని, కేశినేని బస్సులను ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా కేశినేని ట్రావెల్స్ బస్ సర్వీసులను ఆపివేశారు. ఇటీవల రవాణ శాఖ కార్యాలయం వద్ద కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం పట్ల నాని, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు దౌర్జన్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జోక్యం చేసుకుని నానితో క్షమాపణలు చెప్పించారు. చంద్రబాబు తనతో బలవంతంగా క్షమాపణలు చెప్పించడంతో అసంతృప్తిగా ఉన్న నాని అలకబూనారు. కాగా ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా కేశినేని నాని నిధులు సమకూర్చారు. అంతేకాకుండా టీడీపీ తరఫున ఎంపీకా ఎన్నిక కావడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. ఈ నేపథ్యంలో నిర్వహణ భారంతో పాటు పోటీ పెరగడంతో నష్టాలు పెరిగాయి. దీంతో సుమారు 80 ఏళ్లుగా నిర్వహిస్తున్న కేశినేని ట్రావెల్స్‌ను మూసివేయాలని నిర్ణయించారు. 170 కేశినేని ట్రావెల్స్ బస్సులను ఇతర ట్రావెల్స్ కు అమ్మేశారు. మరోవైపు కేశినేని నాని కార్గో వ్యాపారం వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. -
కేశినేని నానికి సీఎం ఫోన్, ప్రెస్ మీట్ రద్దు
-
కేశినేని నానికి సీఎం ఫోన్, ప్రెస్ మీట్ రద్దు
విజయవాడ: బెజవాడలో కేశినేని ట్రావెల్స్ వద్ద శుక్రవారం హైడ్రామా నడిచింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని మీడియా సమావేశాన్ని అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. మీడియా సమావేశానికి విలేకరులను పిలిచిన ఆయనకు ప్రెస్‌మీట్ ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో కేశినేని నాని ప్రెస్ మీట్‌ను రద్దు చేసుకుని సీఎం నివాసానికి వెళ్లారు. కాగా ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన వ్యవహారంపై కేశినేని నాని కొంత అసంతృప్తిగా ఉన్నారు. దీంతో కేశినేని ట్రావెల్స్‌ను మూసివేసేందుకు నాని సిద్ధపడ్డారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అదే విషయాన్ని మీడియాకు చెబుతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే దీనిపై కేశినేని నాని ఏమీ చెప్పకుండానే వెళ్లిపోయారు. సీఎం దగ్గరకు వెళ్లినప్పటికీ తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన చెప్పినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ ట్రావెల్స్‌కు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని కోరారు
-
సీఎం పంచాయితీ చేయడం ఏంటి...చట్టం లేదా ?
-
టీడీపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్
-
టీడీపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్
కడప : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ శుక్రవారం జమ్మలమడుగులో హల్చల్ చేశారు. పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే అనుమతి లేదంటూ ఎంపీని పోలీసులు వెనక్కి పంపారు. మరోవైపు రాజంపేటలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. ఓటుహక్కు లేని టీడీపీ నేతలను పోలింగ్ బూత్‌లోకి అనుమతించారు. దీనిపై ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధికారులు కానీ పోలీసులు పట్టించుకోలేదు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గేందుకు అందినకాడికి ప్రలోభాలకు గురిచేస్తూ... లొంగిని వారిపై దౌర్జన్యాలకు అధికార పార్టీ తెరతీసింది. మరోవైపు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలను గాలికి వదిలేసి పలువురు మంత్రులు గత వారంగా జిల్లాల్లో తిష్ట వేసి, చక్రం తిప్పుతున్నారు. బలం లేని చోటుకూడా బలవంతంగా నెగ్గేలా కుతంత్రాలు చేస్తోంది. స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిబిరాలు పెట్టించి మరీ టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించారు. -
215 కోట్లకు ‘ముఖ్య’నేత టెండర్
మధ్య పెన్నార్ దక్షిణ కాలువ ఆధునికీకరణ టెండర్లలో గోల్మాల్ టీడీపీ ఎంపీ ఒత్తిడితో పాత కాంట్రాక్టర్లపై వేటు.. అంచనాలు భారీగా పెంపు టెండర్ నోటిఫికేషన్ జారీ.. రాజ్యసభ సభ్యుడి సంస్థకే పనులు దక్కేలా నిబంధనలు రూ. 101 కోట్లు అంచనా వ్యయం... 509.15 కోట్లు పెంచిన వ్యయం... సాక్షి, అమరావతి: మధ్య పెన్నార్ దక్షిణ కాలువ ఆధునికీకరణ పనుల్లో ఇద్దరు ఎంపీలతో కలిసి రూ.215 కోట్లు కొట్టేయడానికి ‘ముఖ్య’నేత పావులు కదుపుతు న్నారు. ‘ముఖ్య’నేత ఆదేశం మేరకు ఆయన కోటరీలోని రాజ్యసభ సభ్యుడి సంస్థకు పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి ఈ నెల 6న అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. షెడ్యూళ్ల దాఖలు గడువు ఈ నెల 20న మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. 21న టెక్నికల్ బిడ్ తెరుస్తారు. 25న ప్రైస్ బిడ్‌ను తెరిచి రాజ్యసభ సభ్యుడి సంస్థలకు పనులు కట్టబెట్టడమే మిగిలి ఉంది. అనంతపురం జిల్లాలో మధ్య పెన్నార్ ప్రాజెక్టు దక్షిణ కాలువ ఆధునికీకరణ పనులను 2007లో ప్రభుత్వం చేపట్టింది. ఇందులో 0 కి.మీ. నుంచి 40 కి.మీ. వరకూ (43వ ప్యాకేజీ) పనులను రూ.66.43 కోట్లకు ఈసీఐ–బీజేసీఎల్(జేవీ).. 40 కి.మీ. నుంచి 84 కి.మీ. వరకూ(44వ ప్యాకేజీ) పనులను రూ.50.45 కోట్లకు జీహెచ్‌ఆర్‌ఏ–కేఆర్‌సీసీ(జేవీ) చేజిక్కించుకున్నాయి. 43వ ప్యాకేజీలో రూ.8.15 కోట్లు, 44వ ప్యాకేజీలో రూ.7.07 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. 2010 తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఎంపీ కన్ను ఈ పనులపై పడింది. పనులు చేయడం లేదనే సాకు చూపి పాత కాంట్రాక్టర్లపై వేటు వేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దాంతో 43, 44 ప్యాకేజీల కాంట్రాక్టర్లపై వేటు వేశారు. వ్యూహాత్మకంగా అంచనా వ్యయం పెంపు 43వ ప్యాకేజీ కింద రూ.58.28 కోట్లు, 44వ ప్యాకేజీ కింద 43.38 కోట్లు వెరసి రూ.101.66 కోట్లు ఖర్చు చేస్తే ఆధు నికీకరణ పనులు పూర్తవుతాయి. కానీ. వీటి అంచనా వ్య యాన్ని భారీగా పెంచాలంటూ ‘ముఖ్య’నేతపై ఎంపీ ఒత్తి డి తెచ్చారు.కావాల్సిన వారికి కట్టబెట్టి, కమీ షన్లు దండు కునేలా వ్యూహం రచించారు. ఈ క్రమంలోనే రూ.101.66 కోట్లతో పూర్తయ్యే పనుల అంచనా వ్యయాన్ని రూ.509.15 కోట్లకు పెంచేస్తూ ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 20న ఉత్తర్వులు ఇచ్చింది. భూసేకరణ మినహా మిగతా పనుల వ్యయం రూ.421.87 కోట్లు. ఈ పెంపునకు ఆర్థిక శాఖ ససేమిరా అనడంతో కొత్త వ్యూహానికి పదును పెట్టారు. తిరకాసు నిబంధనలు మధ్య పెన్నార్ దక్షిణ కాలువ ఆధునికీకరణ పనుల టెం డర్లలో పెట్టిన నిబంధనలపై జలవనరుల శాఖ అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిబంధనలు ఇవీ.. టెండర్లలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సంస్థలు జాయింట్ వెంచర్‌గా ఏర్పడి షెడ్యూల్ దాఖలు చేయడానికి వీల్లేదు. హా గత ఐదేళ్లలో బ్యాంకులకు రుణాల చెల్లింపులో కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్(అప్పు ను కట్టలేక అప్పు+వడ్డీని కలిపి కొత్తగా రుణం తీసుకు న్నట్లు చూపడం), స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్(అప్పు కట్టకపోవడం వల్ల బ్యాంకులే కాంట్రాక్టు సంస్థలో వాటాలు తీసుకోవడం) వంటి వాటిని అమలు చేసిన సంస్థలు టెండర్లో పాల్గొనవచ్చు. హా 2006–07 నుంచి 2015–16 వరకూ ఏదో ఒక ఏడాది కనీసం 3,40,976 క్యూబిక్ మీటర్ల మట్టి పని, 96,406 క్యూబిక్ మీటర్ల గట్ల నిర్మాణ పనులు, 1,50,992 చ.మీ.ల కాంక్రీట్ లైనింగ్ పనులు(పేవర్ అనే యంత్రంతో చేసినవి), 1,951 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ లైనింగ్ పనులు, 13,052 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసిన సంస్థలే అర్హమైనవి. హా ఏడాదికి కనీసం రూ.50 కోట్ల విలువైన పనులు చేసి ఉండాలి. బ్యాంకుల్లో రూ.17 కోట్ల నగదు నిల్వ ఉండాలి. హా గత పదేళ్లలో ఒక ఏడాది కనిష్టంగా రూ.33.90 కోట్ల విలువైన కాలువ లైనింగ్ పనులు చేసి ఉండాలి. నిబంధనలు ఒక్కరికే అనుకూలం రాష్ట్రంలో పలు సాగునీటి ప్రాజెక్టుల పనులను జాయింట్ వెంచర్ సంస్థలే చేస్తున్నాయి. ఇటీవల పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులను బావర్–ఎల్‌అంట్‌టీ జియో(జేవీ) అనే జాయింట్ వెంచర్‌కు సబ్ కాంట్రాక్టు కింద కట్టబెట్టారు. కానీ, మధ్య పెన్నార్ ఆధునికీకరణ పనులకు జాయింట్ వెంచర్ సంస్థలకు అర్హత లేదన్నారు. ఇటీవల నిర్మాణ రంగం కుదేలవడం వల్ల పెద్ద పెద్ద కాంట్రాక్టు సంస్థలు కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్(సీడీఆర్), స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్(ఎస్డీఆర్)లను అమలు చేశాయి. కానీ, సీడీఆర్, ఎస్డీఆర్లను అమలు చేసిన సంస్థలను మధ్య పెన్నార్ ఆధునికీకరణ పనుల టెండర్లలో పాల్గొనడానికి అనర్హమైనవని నిబంధన పెట్టారు. వీటిని పరిశీలిస్తే ‘ముఖ్య’నేతకు సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడి సంస్థకు మాత్రమే పనులు దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించినట్లు స్పష్టమవుతోంది. అంచనాల పెంపులో ఆంతర్యమిదే! రూ.58.28 కోట్లతో పూర్తయ్యే 43వ ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.237.23 కోట్లకు, రూ.43.38 కోట్లతో పూర్తయ్యే 44వ ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.184.64 కోట్లకు పెంచేశారు. గతంలో పోల్చితే స్టీల్, సిమెంట్ ధరలు గణనీయంగా తగ్గాయి. డీజిల్, పెట్రోల్ ధరల్లో పెద్దగా మార్పు లేదు. ఇసుక ఉచితంగా లభిస్తోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అంచనా వ్యయంలో ఏమాత్రం మార్పు ఉండకూడదు. కానీ, రూ.101.66 కోట్లతో పూర్తయ్యే పనులకు రూ.509.15 కోట్లతో టెండర్లు పిలవడం గమనార్హం. రాజ్యసభ సభ్యుడి సంస్థకు పనులు దక్కాక ‘ముఖ్య’నేత, టీడీపీ ఎంపీలు కలిపి రూ.215 కోట్లకుపైగా పర్శంటేజీల రూపంలో పంచుకోనున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సంక్రాంతి వేడుకలో మాగంటి చిందులు
డ్యాన్సర్లతో కలసి స్టెప్పులేసిన ఎంపీ కైకలూరు: సంక్రాంతి పండుగ ముగింపు వేడుకలను అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు అట్టహాసంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టీడీపీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) కైకలూరులోని తన స్వగృహంలో పార్టీ నాయకులకు, తన అనుయాయులకు సోమవారం రాత్రి పసందైన మందు–విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి పలువురు అధికారులు సైతం హాజరయ్యారు. కోరుకున్నవారికి కోరుకున్న బ్రాండు మందును అందజేశారు. చేపల పులుసు, చికెన్, మటన్ వంటి మాంసాహారాలను వడ్డించారు. సినిమా పాటలకు యాంకర్లతో డ్యాన్సులు చేయించారు. ఎంపీ బాబు కూడా డ్యాన్సర్లతో కలసి స్టెప్పులు వేశారు. భోగి పండుగ మొదలు కైకలూరు స్వగృహంలో కోడిపందాలు వేయించిన మాగంటి.. అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. -
డ్యాన్సర్లతో కలసి టీడీపీ ఎంపీ స్టెప్పులు
-
జేసీవి దిగజారుడు రాజకీయాలు
– వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్ : ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గడికొండ సభలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో చంద్రబాబుకు మించి అభివృద్ధి చేసే నాయకుడే లేరన్నట్లు , ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడడం జేసీ నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. బూట్లు నాకింటే ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చేవారని అంటున్న జేసీ.. మరి ఇప్పుడున్న మంత్రుల్లో ఎంతమంది చంద్రబాబు బూట్లు నాకారో చెప్పాలన్నారు. అలాగే ఏడోతరగతి పాస్ కాని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. గద్వాల నుంచి వలస వచ్చిన జేసీ ..రాయలసీమ రెడ్ల గురించి మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే అన్ని నీటి ప్రాజెక్టులూ 75 శాతానికి పైగా పూర్తయ్యాయని, తక్కిన పనులు పూర్తి చేసి చంద్రబాబు తానేదో సాధించినట్లు డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల్లో వందమంది చంద్రబాబులు వచ్చి పులివెందుల నియోజకవర్గంలో నిలబడినా కనీసం డిపాజిట్టు కూడా తెచ్చుకోలేరన్నారు. సమావేశంలో వైఎసాస్సార్సీపీ నాయకులు పసుపుల బాలకృష్ణారెడ్డి, బాలనరసింహారెడ్డి, ములకనూరు గోవిందు, రాజారెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
జేసీకి మతిస్థితిమితం లేదు
అనంతపురం : ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి మతిస్థిమితం లేదని, స్వయంగా ముఖ్యమంత్రి సభలో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభంలో ప్రొటోకాల్ పాటించలేదన్నారు. స్వయంగా సీఎం జిల్లా నాయకులను పరిచయం చేయడం, అధ్యక్షత వహించడం, వ్యాఖ్యాతగా, ఉపన్యాసకుడిగా వ్యవహరించడం ఆయన నియంతృత్వ పోకడను గుర్తు చేస్తోందన్నారు. స్థానిక దళిత శాసనసభ్యుడు ఐజయ్య ప్రొటోకాల్ ప్రకారం అధ్యక్షత వహించాల్సి ఉందన్నారు. పైగా ఆయన మాట్లాడుతుంటే మైకు లాక్కోవడం దారుణమన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే మాట్లాడితే ఎందుకు భయపడ్డారని ఆయన ప్రశ్నించారు. రాయలసీమలో అన్ని ప్రాజెక్టులను ప్రారంభించింది వైఎస్ అని గుర్తు చేశారు.జలయజ్ఞం పేరిట రాష్ట్రంలో 80 ప్రాజెక్టులు ప్రారంభించి, కోటి ఎకరాలకు నీరు తీసుకురావాలని పరితపించిన మహా నేత వైఎస్ఆర్ అని అన్నారు.పోలవరం కుడికాలువ వైఎస్ హయాంలో 140 కిలో మీటర్లు తవ్వారన్నారు. హంద్రీ–నీవాలో మీ చరిత్ర ఏమిటో గుర్తు చేసుకోవాలని అన్నారు. రెండుసార్లు శంకుస్థాపన చేసి తొమ్మిదేళ్లు కాలం గడిపారన్నారు. ప్రతిపక్షం మాట్లాడుతుంటే ఎందుకు వణికిపోతున్నారని ప్రశ్నించారు. జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి వికృత ఆనందం పొందారన్నారు. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడడం ఆయన వయసుకు తగదని హితవు పలికారు.మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి మాట్లాడుతూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మాటలు అసహించుకునేలా ఉన్నాయన్నారు. వైఎస్ హయాంలో ప్రారంభమైన నీటి ప్రాజెక్టులను మిగులు పనులను ప్రారంభించి, తానే చేశానని సీఎం చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వ్యక్తిని పట్టుకుని జేసీ మాట్లాడడం చూస్తుంటే రాజకీయ నాయకులు ఎంత దిగిజారిపోయారో అర్థమవుతుందన్నారు. జేసీకి మతిస్థిమితం లేదా? లేకుండా చంద్రబాబుతో పనులు చేయించుకునేందుకు ఇలా మాట్లాడారా? అనే అనుమానం వస్తోందన్నారు. ఆయన మాటలతో రెడ్డి కులస్తులే కాదు అన్ని కులాల వారూ బాధపడుతున్నారన్నారు. ఆయన మాటల వెనుక సీఎం ఉన్నారనేది స్పష్టమవుతోందన్నారు. ఇప్పటికైనా జేసీ తన మాటలను వెనక్కు తీసుకోవాలన్నారు. లేదంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 70 ఏళ్ల వయసులో ఏం ఆశించి పార్టీ మారావని జేసీని ప్రశ్నించారు. సమావేశంలో మైనార్టీ విభాగం నాయకులు ముక్తియార్ పాల్గొన్నారు. జేసీ రాజకీయ వ్యభిచారి అనంతపురం : ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి రాజకీయ వ్యభిచారి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగం నాయకులు ధ్వజమెత్తారు. ఆయన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం స్థానిక సప్తగిరి సర్కిల్లో జేసీ దివాకర్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, నగర అధ్యక్షుడు ఎల్లుట్ల మారుతీనాయుడు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా నిత్యం ప్రజల కోసం పని చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాడుతున్నారన్నారు. ఇది జీర్ణించుకోలేని జేసీ దివాకర్‌రెడ్డి మతిభ్రమించి, తన వ్యాపారాల కోసం ముఖ్యమంత్రి వద్ద మెప్పుపొందేందుకు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, నగర అధ్యక్షుడు రఫీ, జిల్లా ప్రధానకార్యదర్శులు లోకేష్‌శెట్టి, సుధీర్‌రెడ్డి, యుజవన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర, నూర్‌బాషా, అనిల్, హరి, షారుఖాన్, యూపీ నాగిరెడ్డి, మార్కెట్మల్లి పాల్గొన్నారు. జేసీకి పిచ్చి ముదిరింది! పెనుకొండ : ఎంపీ జేసీ దివాకరరెడ్డికి పిచ్చి ముదిరిందని, ఇలాంటి వ్యక్తి పెద్దల సభకు ఎలా ఎన్నికయ్యాడో అర్థం కాలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్నూలు జిల్లా ముచ్చుమర్రి వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎంతో కలసి పాల్గొన్న ఎంపీ జేసీ.. ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఆయనకు పిచ్చి ముదిరిందనడానికి నిదర్శనమన్నారు. గౌరవహోదాను మరచి, ప్రతిపక్షనేత జగన్‌పై వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ముఖ్యమంత్రిని కాకాపట్టడానికేననిపిస్తోందన్నారు. అనంతపురంలో గతంలో ఇలానే మాట్లాడినప్పుడు మేధావులు, ప్రజలు, విద్యావంతులు జేసీ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారన్నారు. హోదాకు, వయసుకు తగ్గట్టుగా జేసీ వ్యవహరించాలని, లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. జిల్లాలో సైతం జేసీ ప్రాభవం పూర్తిగా తగ్గిపోవడంతో మానసిక సైకోగా మారాడని శంకరనారాయణ విమర్శించారు. సమావేశంలో బీసీసెల్ జిల్లా కార్యదర్శి గుట్టూరు శ్రీరాములు, మాజీ మార్కెట్‌యార్డ్ చైర్మన్ నాగలూరుబాబు తదితరులు పాల్గొన్నారు. జేసీ రాజకీయాలకు పనికిరాడు అనంతపురం సెంట్రల్ : జేసీ దివాకర్‌రెడ్డికి వయస్సు మీద పడుతోంది..ఆయనకు అపార రాజకీయ అనుభవం ఉందని అంటుంటారుగానీ బహిరంగ సమావేశాల్లో ప్రతిపక్షనేతపై ఇలా వ్యాఖ్యానించడాన్ని ప్రజలు హర్షించరు అని పీసీసీ అధికార ప్రతినిధి రమణ అన్నారు.ఇటీవల కాలంలో జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన రాజకీయాలకు పనికిరాడు అని అర్థమవుతోందన్నారు. ఎంపీ జేసీ దిష్టిబొమ్మ దహనం ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. కర్నూలు జిల్లాలో ముచ్చుమర్రి హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం వద్ద సోమవారం జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడుతూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వయసుమళ్లి, పిచ్చిముదిరి ఏమి మాట్లాడుతున్నాడో అర్థం కాని రీతిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థి విభాగం అధ్యక్షుడు భానుప్రకాష్‌రెడ్డి, క్రాంతి కిరణ్, జయచంద్రారెడ్డి, అమర్నాథ్, రాంబాబు, హేమంత్‌కుమార్, మహేంద్ర, శ్రీనివాసరెడ్డి, నాగేంద్ర, చార్లెస్, ప్రతాప్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, లోకేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
నోట్ల రద్దు బురద మాకు అంటుతోంది: టీడీపీ ఎంపీ
విజయవాడ: పెద్ద నోట్లను రద్దు చేసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ బురద అంటించుకున్నారని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఆ బురద కడిగేందుకు చంద్రబాబు నేతృత్వంలో కమిటీ వేశారన్నారు. ఆ బురద మాకు అంటుతోందని రాయపాటి వాపోయారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజల గొంతు నొక్కారని విమర్శించారు. నోట్ల రద్దు మూలంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న రాయపాటి.. ఈ సమస్య ఎన్ని రోజులకు పరిష్కారం అవుతుందో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లధనమంతా కాంగ్రెస్ వాళ్ల దగ్గరే ఉందని.. దాన్ని మార్చుకోలేకే వారు పార్లమెంట్‌ను అడ్డుకుంటున్నారని రాయపాటి విమర్శించారు. -
'టీడీపీ ఎంపీ పగటివేషాలు మానుకోవాలి'
హైదరాబాద్ : టీడీపీ ఎంపీ శివప్రసాద్ పగటి వేషాలు మానుకోవాలని బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...నోట్ల రద్దుపై ఎంపీ శివప్రసాద్ నిరసన తెలపడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని... దొంగలకు మద్దతు పలుకుతారా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు బ్యాంకులు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయాలని చెప్పారు. కేంద్రంపై కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని, స్వపక్షం అయినా విపక్షం అయినా వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. నోట్ల రద్దు విషయంలో కమ్యునిస్టుల వైఖరి స్పష్టంగా తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. నల్ల డబ్బు విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. రాజకీయ పార్టీలను లిమిటెడ్ కంపెనీలుగా మార్చారని విష్ణువర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ నెల 26న తాడేపల్లిగూడెంలో బీజేపీ రైతు మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతారని చెప్పారు. -
రేపు ఎంపీ జేసీ నిరసన దీక్ష
అనంతపురం న్యూసిటీ : పాతూరు తిలక్‌రోడ్డు, గాంధీ బజార్ రోడ్డు విస్తరణ జాప్యంపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ నెల 21న నగరపాలక సంస్థ కార్యాలయం ముందు నిరవధిక నిరసన దీక్ష చేపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుపడుతున్నారనే నేపథ్యంలో దీక్షకు సిద్ధమైనట్లు తెల్సింది. సీఎం విస్తరణ కోసం రూ. 60 కోట్లు మంజూరు చేసినా ఆ ప్రజాప్రతినిధులు అడ్డు తగులుతున్నారని ఎంపీ గతంలోనే ఆరోపించారు. ఎంపీ దీక్ష చేపడుతుండడం నగరంలో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఆందోళనలకు చేపడుతాం : ఇటీవల ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శస్త్ర చికిత్స చేయించుకున్నారని, నిరసన దీక్షలో ఆయన ఆరోగ్యానికి ఏమైనా జరిగితే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని అనంత నగరాభివృద్ధి వేదిక అధ్యక్షుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి అధికార పార్టీ నేతలను హెచ్చరించారు. ఆ తర్వాత జరగబోయే పరిణామాలకు వారే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఈ నిరవధిక నిరసన దీక్షకు నగరాభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. -
నీటి శుద్ధి పథకాలను ప్రారంభించాలి
కేంద్ర మంత్రులకు రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ లేఖ సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ అభియాన్ మిషన్ కింద గ్రామాలలో మురికి నీటి శుద్ధి వ్యవస్థ ఏర్పాటుకు సంబంధిత పథకాన్ని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్ గౌడ్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియాలకు దేవేందర్ గౌడ్ గురువారం వేర్వేరుగా లేఖలు రాశారు. గ్రామాలలో మురికి నీటి శుద్ధి వ్యవస్థ లేకపోవడం వల్ల మురికి నీరు చెరువులు, బావులలోకి చేరి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్నారు. పలు ప్రాంతాలలో ఇప్పటికీ తాగు నీటి కోసం ప్రజలు భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారన్నారు. కాబట్టి గ్రామాలలో మురికి నీటి శుద్ధి పథకాలను ప్రారంభించాలని దేవేందర్ గౌడ్ కోరారు. -
బాధ్యతలు విస్మరించిన ఎంపీ జేసీ
గుంతకల్లు : గుంతకల్లులో రైల్వే జోన్ ఏర్పాటు కోసం కృషి చేయాల్సిన ఎంపీ దివాకర్‌రెడ్డి బాధ్యతలను విస్మరించి మురికి కాలువలు శుభ్రం చేసే కార్యక్రమంలో నిమగ్నం కావడం దురదృష్టకరమని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుంతకల్లులోని ఎఫ్‌సీఐ గోడౌన్ , హెచ్పీసీ డిపోలు మూడపడినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. రైల్వేజోన్ ఏర్పాటు విశాఖపట్నంలో సాధ్యం కాదని మరోచోట ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సముఖత చూపుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. గుంతకల్లు రైల్వేజోన్ కేంద్రంగా పెట్టాలని ఎంపీ జేసీ.దివాకర్‌రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది మరిచి మేయర్ చేయాల్సిన పనిని ఎంపీ చేయడంమేంటని ఆయన ప్రశ్నించారు. రైల్వేజోన్ సాధనకు ఈ నెల 5 న రాజ్యసభ సభ్యుడు టీజీ. వెంకటేష్‌ను కలువనున్నామని తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో ఢిల్లీకి వెళ్లి రైల్వేజోన్ అంశంపై రాయలసీమలోని ఎంపీలందరికి నివేదిస్తామన్నారు. -
తేల్చుకుందాం రా..!
- అభివృద్ధి చేయాలని చూస్తే కర్రపెత్తనమా..? – మరువవంక శుభ్రం చేయిస్తా .. చేతనైతే రా..! – ఎమ్మెల్యే వైకుంఠంపై ఎంపీ జేసీ ఫైర్ అనంతపురం న్యూసిటీ : 'పందులను బయటకు పంపిస్తే కర్రపెత్తనమా..ప్లాస్టిక్ వాడొద్దని ప్రచారం చేస్తే కర్రపెత్తనమా.. షాపుల నుంచి చెత్త వేయవద్దని చెబితే కర్రపెత్తనమా.. దోమలు వద్దురా అంటే కర్రపెత్తనమా, రోడ్లు వెడల్పు చేస్తామంటే కర్రపెత్తనమా.. బ్రిడ్జ్ కావాలంటే కర్రపెత్తనమా...రారా నీయబ్బా రేపు అక్కడ (మరువవంక) పని చేయిస్తా కర్రపెత్తనమో... మంచి పెత్తనమో తేలుస్తా' అంటూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిపై పరోక్షంగా సవాల్ విసిరారు. మంగళవారం నగరంలోని జేసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'వాట్ ఈజ్ దిస్ ఎవరో ఒకరు నవ్వపెట్టుకుని ముందుకొచ్చాడు. కంపు తొలగిస్తామని బుర్రలేని మాటలు మాట్లాడుతున్నాడు. చూద్దాం అనే ఆలోచనే లేదు. పేదోళ్లను బాధపెట్టడమే తెలుసా? బ్రిడ్జ్ వద్ద రైటర్లకు రాంనగర్ పార్క్‌లో స్థలం కేటాయించాలని నిర్ణయించా. అందుకు మేయర్, కమిషనర్ అంగీకరించారు. ఎవరో బుద్ధిలేనోడు ఆరడుగుల స్థలం ఉంది వేసుకోవచ్చని చెప్పాడంట. కుక్క తోక వంకర అన్న తరహాలో సామాన్యులను బాధిస్తున్నారు. అసూయ ద్వేషాలు తప్ప మరొకటి చేయడం లేదు. ఐ యామ్ ఏ డాక్టర్. ఐ విల్ ఆపరేట్. పేషంట్‌కు నొప్పి అంటే నేనేమి చేయలేను. నొప్పి భరించాల్సిందే. పందుల తరలింపు, ప్లాస్టిక్ నిషేధం, రోడ్డు విస్తరణ చేసేటప్పు నొప్పి మామూలే. ముందుకు బాగుంటుంది. మరువ వంక పూడికతీతను బుధవారం నుంచి మొదలుపెట్టి దశలవారీగా శుభ్రం చేయిస్తా'. అంతకుముందు ప్లాస్టిక్‌ను వాడమని ముందుకొచ్చిన వ్యాపారస్తులను ఎంపీ అభినందించారు. మరువ వంకను పరిశీలించిన ఎంపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరువవంకను పరిశీలించారు. సంగమేశ్వర్ సర్కిల్, రాజా, రమణ థియేటర్, సూర్యనగర్ సర్కిల్, కృష్ణ థియేటర్, ఆర్టీసీ బస్టాండ్ వరకు మరువవంక పూడికతీతపై అధికారులతో మాట్లాడారు. త్రివేణి థియేటర్ వద్ద మురుగు నిల్వ ఉండకూడదని అందుకేమి చేయాలని ఎస్ఈ సురేంద్రబాబు, ఈఈ రామ్మోహన్ రెడ్డిని ప్రశ్నించగా కల్వర్టు వేయించాలన్నారు. అందుకు ఎంపీ రూ కోటి అయినా ఇస్తానని పనులు మొదలుపెట్టాలన్నారు. -
నిమ్మల భూ కిరికిరికి రెవెన్యూ చెక్
గోరంట్ల : హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు అక్ర మ మార్గంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రయత్నించిన భూమిని రెవెన్యూ అధికారులు తిరిగి బాధిత రైతు మల్లేశప్ప పేరిట అడంగల్‌లో నమోదు చేయించారు. ‘ నిమ్మల భూ కిరికిరి’ శీర్షికన 15 వతేదీ సాక్షిలో వార్తాకథనం ప్రచురితమైన విషయం విదితమే. అలాగే బాధిత రైతు మల్లేశప్ప జిల్లా కలెక్టర్, ఎస్పీని మీ కోసం కార్యక్రమంలో కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని విన్నవించుకున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 18న స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో 2011లో భూమి కొనుగోలు చేసిన వ్యక్తులతో పాటు బాధిత రైతు మల్లేశప్ప తహశీల్దార్ ఎదుట హాజరై తమ వాంగ్మూలంతో పాటు భూములకు సంబంధించిన పక్కా రికార్డులను సమర్పించారు. ఈ మేరకు ఆమె పంపిన నివేదిక ఆధారంగా మల్లేశప్ప పేరిట అడంగల్ ను య«థాస్థానంలో ఉంచాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారని స్థానిక తహశీల్దార్ హసీనాసుల్తానా సాక్షికి ఫోన్ ద్వారా తెలిపారు. -
పాక్‌తో యుద్ధం వద్దు
ప్రధానికి దేవేందర్ గౌడ్ లేఖ సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో ఆర్థికాభివృద్ధి పురోగమనంలో ఉన్న దశలో యుద్ధం సంభవిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఉడీ ఘటన, భారత సైన్యం మెరుపుదాడుల అనంతరం పాకిస్తాన్ భారత్‌తో యుద్ధానికి ఉవ్విళ్లూరుతోందని, మనం యుద్ధానికి సిద్ధపడకుండా పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరిని చేయాలని ఆయన ప్రధానిని కోరారు. -
టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఎన్నడూలేనంత అవినీతి, అక్రమాలు: ఎంపీ రాయపాటి వినుకొండ టౌన్ : తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నడూ లేనంత అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా వినుకొండలో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తనపై అక్షింతలు వేస్తున్నారంటూ నవ్వుతూనే.. మరోసారి పార్టీ నాయకుల అవినీతి, ఆగడాలపై వ్యాఖ్యలు చేశారు. ఎన్నడూ లేనంత అక్రమాలు, అవినీతి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల చిట్టా చంద్రబాబు వద్ద ఉందని, జిల్లాలో దాదాపు అందరూ మైనస్ గ్రేడ్లలోనే ఉన్నారని చెప్పారు. ప్రతి ఒక్కరి అవినీతి చిట్టా చంద్రబాబు తెప్పించుకున్నారన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ కావటం కష్టమని, అన్ని వసతులున్న గుంటూరుకు జోన్‌గా మార్పు చేయటం సులభమని పలుమార్లు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినా ఆయన ‘గమ్మునుండు..’ అంటున్నాడన్నారు. విశాఖకు ఏ విధంగా రైల్వే జోన్ వస్తుందని, వారి పోరాటం వృథా అవుతుందని చాలా సందర్భాల్లో సీఎం దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పుకొచ్చారు. -
పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి, ఎంపీ రహస్య భేటీ
భూ సమీకరణకు వ్యతిరేకంగా ఫారం-2 ఇస్తున్న రైతులు వారికి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వని అధికారులు టీడీపీ ముఖ్యనాయకులతో మంత్రి, ఎంపీ రహస్య సమావేశం అధికారపార్టీ నాయకులతో నాలుగు కమిటీలు భూసమీకరణను వ్యతిరేకిస్తే తరిమికొడతామన్న మంత్రి కొల్లు పోతేపల్లి, కోన గ్రామాల్లో ఎంఏడీఏ అధికారుల నిర్భందం మచిలీపట్నం : బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్ పేరిట ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణకు అనుకూలంగా టీడీపీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారు. నయానో, భయానో రైతులను భూసమీకరణకు ఒప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరో వైపు గ్రామాల్లో రైతుల నుంచి అభ్యంతర, అంగీకార పత్రాలు తీసుకుంటున్న ఎంఏడీఏ (మడా) అధికారులు తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. భూసమీకరణకు వ్యతిరేకంగా ఫారం-2 ఇస్తున్న రైతులకు అందుకు తగిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలేదు. కోన గ్రామంలో భూసమీకరణకు తమ భూములు ఇచ్చేది లేదని అభ్యంతర పత్రాలు ఇచ్చిన రైతులు ఆ మేరకు ధ్రవీకరణ పత్రంపై సంతకం చేసి ఇవ్వమంటే అధికారులు నిరాకరిస్తున్నారు. ఫారం-2 ఇచ్చిన రైతులకు ఆ పత్రం అందినట్లు సంతకం చేసి ఇవ్వాలని ఎక్కడా లేదని, ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని కోన డెప్యూటీ కలెక్టర్ సుబ్బరాజు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని కోన గ్రామానికి వెళ్లి ఎంఏడీఏ అధికారులతో మాట్లాడారు. ఫారం-2 ఇచ్చినట్లుగా సంతకం చేయాలని కోరగా తన వద్ద స్టాంపు లేదని మంగళవారం సంతకాలు చేస్తానని సుబ్బరాజు బదులిచ్చారు. అయితే సంతకాలు చేసిన తరువాతే గ్రామం నుంచి కదలాలని పంచాయతీ కార్యాలయం వద్ద సుబ్బరాజు, ఇతర సిబ్బందిని రైతులు నిర్భందించినంత పనిచేశారు. పోతేపల్లిలో రైతులు ఇచ్చిన అభ్యంతర ఫారాలు అందినట్లు డెప్యూటీ కలెక్టర్ బదులుగా తాను సంతకం చేస్తానని వీఆర్వో ప్రసాద్ చెప్పడంతో ఆగ్రహించిన రైతులు ఆయన్ను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. పేర్ని నాని అక్కడకు వెళ్లి రైతులతో మాట్లాడి వీఆర్వోను బయటకు తీసుకువచ్చారు. వెలువడని గడువుపెంపు ఉత్తర్వులు భూసమీకరణకు సంబంధించి అభ్యంతరాలు, అంగీకార పత్రాలు తీసుకునే గడువును నవంబర్ 4వ తేదీ వరకు పెంచినట్లు ప్రకటించినా సోమవారం సాయంత్రానికి కూడా అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. డీఆర్డీఏ కార్యాలయంలో ఎంఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటి వరకు అధికారులు, పాలకులు ప్రకటించారు. సోమవారం డీఆర్డీఏ కార్యాలయం కాదు, జిల్లా వ్యవసాయశాఖ కోసం నూతనంగా నిర్మించిన భవనంలో ఎంఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ బాబు.ఎ అధికారులకు సూచించారు. గ్రామాల్లో పర్యటిస్తాం టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు విలేకరులతో మాట్లాడారు. తాను, ఎంపీ కొనకళ్ల నారాయణరావు నెల రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి రైతులను ఒప్పిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. భూసమీకరణకు అడ్డుపడే వారిని తరిమికొడతామన్నారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ పోర్టు, పారిశ్రామిక కారిడార్ నిర్మాణం జరగకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందన్నారు. భూసమీకరణ ద్వారా భూములను ఇచ్చిన రైతులకు మెగా టౌన్షిప్లో ప్లాట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఒక్కొక్క ప్లాట్ విలువ కోటి రూపాయలు ఉంటుందన్నారు. రైతులు భూసమీకరణకు సిద్ధంగానే ఉన్నారని ఎంపీ చెప్పారు. టీడీపీ నేతలతో రహస్య భేటీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు సోమవారం మచిలీపట్నం నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నాయకులతో ఆర్అండ్బీ అతిథిగృహంలో రహస్య సమావేశం నిర్వహించారు. భూసమీకరణకు రైతులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వారిని ఒప్పించే బాధ్యతను కీలకమైన నాయకులకు అప్పగించారు. ఇందుకు మండలంలో నాలుగు కమిటీలను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్‌నాయుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్‌తో కమిటీలను ఏర్పాటు చేసి వారికి కొంత మంది నాయకులను అప్పగించారు. ఈ కమిటీల ద్వారా ఆయా సామాజిక వర్గాలు ఉండే గ్రామాలను ఎంపిక చేసుకుని రైతులను భూసమీకరణకు ఒప్పించేందుకు ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. రైతులు భూసమీకరణకు అంగీకరించడం లేదని, భూమి కోల్పోతే తమ బతుకులు రోడ్డున పడతాయని వారు భావిస్తున్నారని, అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీ సక్రమంగా లేదని ఎంపీ, మంత్రి దృష్టికి ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు టీడీపీ నాయకులు తీసుకెళ్లారని సమాచారం. -
'హోదాపై ఉద్యమాలు చేసినా ఉపయోగం లేదు'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేసినా ఉపయోగం లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. అనంతపురంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ప్రత్యేక హోదా రాదని చెప్పిన తన మాటే నిజమైందన్నారు. రెయిన్ గన్స్‌తో పంటలను కాపాడటం ప్రయోగమేనన్నారు. -
విశాఖ ఎయిర్‌పోర్టులో టీడీపీ ఎంపీ హల్చల్
విశాఖపట్టణం : విశాఖ ఎయిర్‌పోర్టులో టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ హల్చల్ సృష్టించాడు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ను ఐడీ కార్డు చూపించాలని విశాఖ ఎయిర్‌పోర్టు సిబ్బంది అడిగారు. దీనిపై అవంతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నన్నే ఐడీ కార్డు అడుగుతారా అంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది మిన్నకుండిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చెక్‌బౌన్స్ కేసులో టీడీపీ ఎంపీ కోడలు ఆరెస్ట్
-
ఆ ముగ్గురికి కులగజ్జి పట్టుకుంది
అనంతపురం : అనంతపుం జిల్లా టీడీపీ నాయకుల్లో ఉన్న విబేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. అనంతపురంలో ప్రబలిన విషజ్వరాలపై స్థానిక టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆదివారం స్పందించారు. ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి విఫలమయ్యారని ఆరోపించారు. ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్‌కు కులగజ్జి పట్టుకుందని విమర్శించారు. అనంతలో పారిశుద్ధ్యం పడకేసిందని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని జేసీ దివాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను అభివృద్ధి చర్యలు ప్రారంభిస్తే.. దానికి సైతం వారు అడ్డుపడ్డారని ఎంపీ జేసీ మండిపడ్డారు. -
హోదా తాకట్టుకు దక్కిన తొలి ‘ప్యాకేజీ’
-
హోదా తాకట్టుకు దక్కిన తొలి ‘ప్యాకేజీ’
టీడీపీ ఎంపీ రాయపాటికి భారీ లబ్ధి చేకూర్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు * పోలవరం హెడ్‌వర్క్స్ అంచనా వ్యయం రూ.1,481 కోట్లు పెంపు * 7న పోలవరం బాధ్యతలు రాష్ట్ర సర్కార్‌కు అప్పగించిన కేంద్రం * 24 గంటలు గడవక ముందే అంచనా వ్యయం పెంచుతూ ఉత్తర్వులు * అంతా పక్కా ప్రణాళికతో నడిపించిన చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: ఐదు కోట్ల మంది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టినందుకు గానూ ఏపీ ప్రభుత్వ పెద్దలకు దక్కిన మొదటి ‘ప్యాకేజీ’ ఇది. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను అప్పగించి 24 గంటలు కూడా గడవక ముందే.. ఆ ప్రాజెక్టు హెడ్‌వర్క్స్(ప్రధాన పనులు) కాంట్రాక్టర్ అయిన టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు ఏపీ ప్రభుత్వం రూ.1,481 కోట్ల భారీ లబ్ధి చేకూర్చింది. కేంద్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకుంటే కమీషన్లు కొట్టేసే అవకాశం ఉండదని, అందుకే చంద్రబాబు సర్కారు ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపిందనడానికి ఇదొక నిదర్శనం. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం(7న) రాత్రి ప్యాకేజీ ప్రకటించగానే.. గురువారం(8న) పోలవరం హెడ్‌వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.5,535.41 కోట్లకు పెం చుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు(జీవో 96) జారీ చేసింది. ఐదు కోట్ల మంది ఆంధ్రుల స్వప్నం పోలవరం ప్రాజెక్టు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టు పనులను చేపట్టి, వేగంగా పూర్తి చేసేందుకు రెండేళ్లుగా మొగ్గుచూపని ప్రభుత్వం.. ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి మాత్రం మొదటి నుంచీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. పోలవరం హెడవర్క్స్ పనుల అంచనా వ్యయం రూ.4,717 కోట్లు కాగా, టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్.. రష్యా, ఒమన్లకు చెందిన జేఎస్సీ, యూఈఎస్లతో జట్టుకట్టి, 14.05 శాతం తక్కువ ధరలకు అంటే రూ.4,054 కోట్లకు పోలవరం హెడ్ వర్క్స్ పనులు చేజిక్కించుకుంది. ఈ పనులు 60 నెలల్లో పూర్తి చేసేలా 2013, మార్చి 2న కాంట్రాక్టర్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. నాడు తస్మదీయుడు.. నేడు అస్మదీయుడు అయితే పోలవరం హెడ్ వర్క్స్ పనులు చేసే సత్తా ట్రాన్స్ట్రాయ్కు లేదని.. ఆ సంస్థపై అనర్హత వేటు వేయాలని, పనులు అప్పగించొద్దంటూ అప్పట్లో ఎస్ఎస్ఎల్సీ(స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ) నివేదిక ఇచ్చింది. రాయపాటి అప్పట్లో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు. దీంతో పోలవరం హెడ్‌వర్స్ పనులు రాయపాటికి ఎలా అప్పగిస్తారంటూ అప్పటి విపక్ష నేతగా చంద్రబాబు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అనంతరం రాయపాటి సైకిలెక్కారు. దీంతో చంద్రబాబుకు రాయపాటి సన్నిహితుడిగా మారిపోయారు. కేవలం ప్రాజెక్టులు పనులు కొట్టేసేందుకే ఎంపీ రాయపాటి రష్యా, ఒమన్ దేశాలకు చెందిన సంస్థల సహకారం తీసుకోవడంతో క్షేత్రస్థాయిలో ఆ సంస్థల చిరునామా కన్పించలేదు. 2015, అక్టోబర్ 10 వరకూ అంటే.. 32 నెలల్లో కేవలం రూ.232.42 కోట్ల విలువైన పనులే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పనుల ప్రగతిపై పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) పదే పదే అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే కాంట్రాక్టర్‌కు పనులు చేసే సత్తా లేదని, తక్షణమే తొలగించాలని ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ కూడా సూచించింది. కానీ ఈ కమిటీ నివేదికను బుట్టదాఖలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాయపాటికి భారీ ఎత్తున దోచిపెట్టేందుకు పావులు కదుపుతూ వచ్చారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలంటూ కేంద్రానికి పదే పదే లేఖలు రాస్తూ వచ్చారు. పీపీఏని నామమాత్రంగా మార్చి, రాయపాటితో కలసి నిధులు కొల్లగొట్టాలన్నది ఆ లేఖల ఎత్తుగడగా తెలుస్తోంది. ఏపీకి అప్పగించగానే దోపిడీపర్వం.. పనులు వేగవంతం చేయాలంటే తాజా(2015-16) ఎస్ఎస్ఆర్ మేరకు అంచనా వ్యయాన్ని పెంచాలని, హెడ్‌వర్క్స్ పనులు సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించాలని, వారిని కూడా ప్రధాన కాంట్రాక్టరే ఎంచుకోవచ్చంటూ రాయపాటి సాంబశివరావుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లమాలిన ప్రేమ కురిపించారు. ఆ మేరకు 2015, అక్టోబర్ 10న కేబినెట్‌తో ఆమోదముద్ర వేయించారు. సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించే సమయంలో ఒప్పందం చేసుకోవాలని, ‘ఎస్క్రో’ అకౌంట్‌ను ఏర్పాటు చేసి బిల్లులు చెల్లించాలని కేబినెట్ షరతు విధించింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు అంచనా వ్యయాన్ని పెంచుతూ పోలవరం ఈఎన్సీ ఏప్రిల్ 30న మొదటి సారి, ఆగస్టు 9న రెండో సారి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను తొక్కిపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించగానే వాటిపై ఆమోదముద్ర వేసేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలవరం హెడ్‌వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.5,767.83 కోట్లకు పెంచారు. ఇందులో 2015, అక్టోబర్ 10 వరకు పూర్తి చేసిన పనుల విలువ కేవలం రూ.232.42 కోట్లు కాగా, మిగతా పనుల విలువ రూ.5,535.41 కోట్లు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే హెడ్‌వర్క్స్ అంచనా వ్యయం ఒకేసారి రూ.1,481.41 కోట్లు పెంచినట్లు స్పష్టమవుతోంది. -
హోదా తెస్తే పవన్‌కు అనుచరుడిగా మారతా
ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానంటే ఎంపీలంతా టీడీపీకి రాజీనామా చేసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంటే నడుస్తామని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సవాల్ చేశారు. తామంతా ఏం చేయాలో, ఎలా చేయాలో చెబితే అలాగే నడుచుకుంటామన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హోదా తీసుకొస్తే పవన్‌కు అనుచరుడిగా మారిపోతానని వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం స్పష్టమైన వైఖరితో రావాలని పవన్‌కు సూచించారు. అంతే కాని నోరు ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. తమకు హిందీ రాకపోవచ్చు గానీ, ఇంగ్లిష్ వచ్చని అన్నారు. మూర్ఖపు కేంద్ర ప్రభుత్వం తమ మాట విననంత మాత్రాన తమని నిందించడం తగదన్నారు. ఏపీ ఎంపీలంతా రాజీనామా చేసినా నరేంద్ర మోదీకి ఏమీ కాదని చెప్పారు. హోదా విషయంలో మోదీ పట్టుదలతో ఉన్నారు.. ఏపీ పట్ల వ్యతిరేకత స్పష్టంగా చూపిస్తున్నారని ఆరోపించారు. మోదీకి దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలని కోరారు. దేశానికి ద్రోహం చేసింది గాంధీ, నెహ్రూలే: దేశానికి అత్యంత ద్రోహం చేసింది మహాత్మాగాంధీ, నెహ్రూయేనంటూ జేసీ దివాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రధానమైన తప్పిదం పాకిస్తాన్‌ను విభజించడానికి ఒప్పుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'పవన్‌కు తిక్కైతే నాకు పిచ్చి'
విశాఖపట్నం: సినీనటుడు పవన్ కల్యాణ్ కు తిక్క ఉంటే తనకు పిచ్చి ఉందని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు. తిరుపతి సభలో పవన్ టీడీపీ ఎంపీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఆదివారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన అనకాపల్లి ఎంపీ.. జనసేన అధినేతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'పవన్ ఏమంటాడు?.. మేం సార్.. సార్.. అని అడుక్కుంటున్నామా? మరి ప్రధాన మంత్రి గారిని 'సార్' అనకుంటే ఏమనాలి? ఎదుటివారికి నీతులు చెబుతున్న పవన్ తానేం చేస్తున్నాడు? ఆయనకు తిక్క ఉంటే నాకైతే పిచ్చి ఉంది' అని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు ఇప్పటివరకు 23 సార్లు ఢిల్లీకి వెళ్లారని గుర్తుచేశారు. నీతులు వల్లించడం మాని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజల తరఫున పోరాడాలని పవన్ కల్యాణ్ కు సూచించారు. శనివారం తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. టీడీపీ అధ్యక్షుణ్ని, పార్టీ విధానాలను కాకుండా కేవలం ఒకరిద్దరు ఎంపీలను మాత్రమే టార్గెట్ చేయడంపై ఆ పార్టీ పార్లమెంటేరియన్లు గుర్రుగా ఉన్నారు. అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో అడుగు ముందుకేసి.. పవన్ ఏదేదో మాట్లాడుతున్నారని, అసలు తనకు ఎంపీ పదవి వెంట్రుకతో సమానం అని జనసేన అధినేతకు ఘాటుగా సమాధానం చెప్పిన సంగతి తెలిసిందే. -
'హోదా తెస్తే పవన్‌కు అనుచరుడిగా మారతా'
-
మహిళల హక్కులు పరిరక్షించాలి
అనంతపురం టౌన్ : మహిళల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. గురువారం అనంతపురం శివారులో మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటైన ఉజ్వల హోంను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అత్యాచారం, వేధింపులు, బాల్య వివాహాలు తదితర కారణాలతో ఆశ్రయం పొందుతున్న బాధితులతో మాట్లాడారు. స్వయం ఉపాధి శిక్షణపై ఆరా తీశారు. బాధితులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. చట్టంలో ఉన్న కొన్ని లొసుగుల వల్ల మహిళలకు అన్యాయం జరిగిన సంఘటనల్లో నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి బెయిల్ మంజూరు చేయకుండా సామాజికంగా వారికి శిక్ష విధించాలన్నారు. -
నేడు నన్నపనేని రాక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి గురువారం అనంతపురానికి రానున్నారు. బంధువుల ఇంట జరగనున్న వివాహానికి విచ్చేస్తున్న ఆమె, శుక్రవారం మధ్యాహ్నం డీఎంఏ హాలులో జరిగే మహిళా సాధికారత సదస్సులో పాల్గొననున్నారు. ఆమెతో పాటు ఐసీడీఎస్ అధికారులు, మహిళలు కూడా సదస్సులో పాల్గొంటారు. -
'దేవుడికి, మోదీకి మాత్రమే తెలుసు'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై అనంతపురం ఎంపీ, టీడీపీ నాయకుడు జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వస్తుందో ? లేదో ? తెలియదన్నారు. కానీ దేవుడికి, ప్రధాని మోదీకి మాత్రమే తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి విలేకర్లలో మాట్లాడుతూ... ఇతర రాష్ట్రాల కంటే ఏపీకి ఎక్కువ లబ్ది చేకూరుస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు. చంద్రబాబు తన రెండు రోజుల పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలో ప్రధానితోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలసి... కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ప్రధానితో చంద్రబాబుతోపాటు టీడీపీ ఎంపీలు కూడా భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రధాని ప్రత్యేక హోదా ఇస్తున్నారా ? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు జేసీ దివాకర్ రెడ్డి పై విధంగా స్పందించారు. -
'అందుకే చంద్రబాబు అంటే మోదీకి భయం'
-
'అందుకే చంద్రబాబు అంటే మోదీకి భయం'
విజయవాడ : బీజేపీతో టీడీపీ విడిపోవాల్సిందేనని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చినాటికి విడిపోతే మంచిదని ఆయన స్పష్టం చేశారు. శనివారం విజయవాడలో జేసీ దివాకర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ప్రధాని మోదీకి చంద్రబాబు ప్రధాన శత్రువుగా కనబడుతున్నారన్నారు. ఏపీకి ప్రత్యేకే హోదా ఇవ్వాలనే ఉద్దేశ్యం బీజేపీకి లేదని వ్యాఖ్యానించారు. అందుకే రూల్స్ పేరు చెప్పి ఆ పార్టీ తప్పించుకుంటోందని ఆరోపించారు. ప్రధానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే రూల్స్ ఏమీ అడ్డంకి కాదని దివాకర్‌రెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మోదీకి ప్రాంతీయ పార్టీల సహకారం అవసరమన్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేది చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమారు అని ఆయన చెప్పారు. అందుకే చంద్రబాబు అంటే మోదీకి భయం అని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఏడాది క్రితమే బీజేపీతో విడిపోవాలని చంద్రబాబుకు చెప్పానని జేసీ దివాకర్‌రెడ్డి గుర్తు చేశారు.