అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి గురువారం అనంతపురానికి రానున్నారు. బంధువుల ఇంట జరగనున్న వివాహానికి విచ్చేస్తున్న ఆమె, శుక్రవారం మధ్యాహ్నం డీఎంఏ హాలులో జరిగే మహిళా సాధికారత సదస్సులో పాల్గొననున్నారు. ఆమెతో పాటు ఐసీడీఎస్ అధికారులు, మహిళలు కూడా సదస్సులో పాల్గొంటారు.