Nannapaneni Rajakumari
-
‘వాళ్ల వైఖరి మారకుంటే భవిష్యత్‌లో టీడీపీ ఉండదు’
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేతల దౌర్జన్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శుక్రవారం రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. దళితులపై టీడీపీ నేతల దౌర్జన్యాలను ఎమ్మెల్యే ఆర్కే ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు వివరించారు. టీడీపీ నేతలు కూన రవికుమార్, అచ్చెన్నాయుడు,నన్నపనేని రాజకుమారిలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. డీజీపీని కలిసిన అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. ‘అధికారం కోల్పోయినా టీడీపీ నేతలకు కనువిప్పు కలగడం లేదు. ఎవరినీ లెక్క చేయం అనే ధోరణిలోనే ఉన్నారు. పోలీసులు, దళితులంటే లెక్క లేదు. అసలు చట్టాల పట్ల టీడీపీ నేతలకు గౌరవం లేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దళిత మహిళా ఎస్ఐ పట్ల టీడీపీ నేతలు చేసిన దారుణమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. తమ వ్యాఖ్యలపై ఇప్పటికైనా టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు...టీడీపీ నేతలను పిలిచి బుద్ధి చెప్పాలి. వారి వైఖరి మారకుంటే భవిష్యత్‌లో టీడీపీ ఉండదు.’ అని వ్యాఖ్యానించారు. కాగా అంతకు ముందు ఎస్ఐ అనురాధను కులం పేరుతో దూషించిన నన్నపనేని రాజకుమారిని అరెస్ట్ చేయాలంటూ ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో మంగళగిరిలో వైఎస్సార్ సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. దళిత మహిళా ఎస్ఐతో దురుసుగా ప్రవర్తించిన నన్నపనేనిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
టీడీపీ నాయకులకు దళితులంటే అలుసా!
దళితులపై తమకు ఉన్న చిన్నచూపును టీడీపీ నేతలు పదేపదే బయటపెడుతున్నారు. నలుగురిలోనూ వారిని దూషిస్తూ, హేళనగా మాట్లాడుతూ చులకన చేస్తున్నారు. దళితులు దేవుడి దగ్గరకు వస్తే దేవుడు మైలపడతాడంటూ ఎమ్మెల్యే శ్రీదేవిని ఇటీవల అడ్డుకున్నారు. రెండు రోజుల క్రితం దళితుల వల్లే ఈ దరిద్రం అంటూ దళిత మహిళా ఎస్ఐని మహిళా చైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేని రాజకుమారి దూషించారు. ఇలా దళితులను కులం పేరుతో దూషించడం టీడీపీ నాయకులకు పరిపాటిగా మారింది. సాక్షి, గుంటూరు : ‘దళితులు దేవుడి దగ్గరకు వస్తే దేవుడు మైలపడతాడు.. దళితులు దరిద్రులు..’ ఇవీ టీడీపీ శ్రేణులకు దళితులపై ఉన్న అభిప్రాయాలు ఇవి. అధికారులంటే వారికి చులకన.. దళితులంటే చిన్న చూపు. ఆధునిక సమాజంలో బతుకుతున్నామన్న కనీస జ్ఞానాన్ని కూడా టీడీపీ నాయకులు విస్మరిస్తున్నారు. నేటికీ కులం పేరుతో ఎస్సీ, ఎస్టీలను దూషిస్తుండటమే కాకుండా వారిని కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన హోదాలో ఉన్నామన్న ఇంగితాన్ని మరిచి అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. టీడీపీ బుధవారం చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఐపీఎస్ అధికారి విక్రాంత్ పాటిల్‌పై దౌర్జన్యానికి పాల్పడి, యూజ్లెస్ ఫెలో అని దూషించారు. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న గుంటూరు అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కోటయ్యపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు దౌర్జన్యానికి పాల్పడ్డారు. విక్రాంత్ పాటిల్, ఎస్ఐ కోటయ్యతో పాటు పలువురు పోలీసులను దూషించారు. ‘ఎవర్రా మీకు పోలీస్ ఉద్యోగాలు ఇచ్చింది’ అంటూ విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై ఎస్ఐ కోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పట్టణ పోలీసులు అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేశారు. దళితులంటే దరిద్రులా.. టీడీపీ మహిళా నేత, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మహిళా ఎస్ఐ అనురాధను కులం పేరుతో దూషించారు. ‘దళితులు దరిద్రులు.. మీ వల్లే మాకు ఈ పరిస్థితి పట్టింది’ అని కించపరిచారు. సాటి మహిళ అని కూడా చూడకుండా ఎస్ఐ అనురాధను నన్నపనేని రాజకుమారి కులం పేరుతో దూషించడంపై మహిళా, దళిత, ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని టీడీపీ నాయకులు కులం పేరుతో దూషించి ఘోరంగా అవమానించిన ఘటన చోటు చేసుకున్న వారం రోజులకే మరో దళిత మహిళా అధికారిపై టీడీపీ నాయకులు అగ్రకుల అహంకారం చూపించారు. ఎస్ఐ అనురాధను కులం పేరుతో దూషించిన ఘటనలో టీడీపీ మహిళా నాయకురాళ్లు నన్నపనేని రాజకుమారి, సత్యవాణిపై మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదివారికి కొత్తేమీ కాదు.. దళితులను కులం పేరుతో దూషించడం, అధికారులను చులకనగా చూడటం టీడీపీ నాయకులకు కొత్తేమీ కాదు. టీడీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అనేక మంది అధికారులపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అక్రమంగా ఇసుక తరలిస్తున్న సమయంలో అడ్డుకున్నందుకు చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు మహిళా తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేశారు. రవాణా శాఖ కమిషనర్‌గా పనిచేసిన బాలసుబ్రహ్మణ్యం పై విజయవాడ ఎంపీ కేశినేని నాని, బొండా ఉమా, బుద్ధా వెంకన్న దౌర్జన్యానికి పాల్పడ్డారు. 2017లో గుంటూరు జిల్లా ముట్లూరులో జరిగిన వినాయక ఉత్సవాల్లో పాల్గొనేందుకు మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు గ్రామంలోకి వెళ్లగా అక్కడ టీడీపీలోని ఓ వర్గం వారు అతన్ని వేడుకల్లో పొల్గొనకుండా అడ్డగించి అవమానపరిచింది. చేసేదేమీ లేక మంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఆయన వెనుతిరిగి వచ్చారు. అప్పట్లో దళిత సంఘాలు అగ్రకులాల అహంకారాన్ని తప్పుపడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. 2019 జనవరి ఒకటిన అదే గ్రామంలో దళితులపై అగ్రకులాలకు చెందినవారు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించమే కాకుండా ప్రశ్నించారనే కారణంగా దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలు కేంద్ర ఎస్సీ కమిషన్ దృష్టికి వెళ్లడంతో కమిషన్ సభ్యులు రాములు స్వయంగా గ్రామంలోకి వెళ్లి విచారణ జరిపారు. వాస్తవాలను తెలుసుకున్న అనంతరం నిందితులను అరెస్టు చేయకపోవడంపై అప్పటి పోలీస్ అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు ఉన్నాయి. -
నన్నపనేని వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు
సాక్షి, అమరావతి: దళితుల వల్లే దరిద్రం అని అహంకారంగా మాట్లాడిన రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న చినకాకాని మహిళా ఎస్సై అనూరాధను ఉద్దేశించి అహంకారంగా మాట్లాడం సిగ్గుచేటన్నారు. గతంలో కూడా అనేక మంది ప్రజా ప్రతినిధులు దళితులపై రకరకాల పేరుతో అవమానకర వ్యాఖ్యలు చేశారని, వ్యంగ్యంగా మాట్లాడినా చర్యలు తీసుకున్న సందర్భాలు లేనందునే ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయన్నారు. ఎస్సైకి తగిన రక్షణ కల్పించి, భవిష్యత్‌లో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దిష్టిబొమ్మల దగ్ధం తెనాలి : దళిత ఎస్ఐ విధులను ఆటంకపరుస్తూ ‘దళితుల వలన ఈ దరిద్రం పట్టింది’ అంటూ దళితులను కించపరచేలా మాట్లాడిన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యలకు నిరసనగా, దీనిని ఖండించని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆలపాటి రాజేంద్రప్రసాద్ దిష్టిబొమ్మలను పట్టణ గాంధీచౌక్‌లో గురువారం దహనం చేశారు. టీడీపీ పల్నాడులో హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం, న్యాయవిభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిరసన జరిగింది. జిల్లాలోని పెదకాకాని ఎస్ఐ అనూరాధ విధుల్లో ఉండగా, నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి వనితలు పరుష పదజాలంతో దూషించి దళితుల మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని ఆరోపించారు. అనంతరం వినతిపత్రాన్ని మండల తహసీల్దార్, తెనాలి ఆర్డీవో కార్యాలయాల్లో అందజేశారు. పార్టీ ఎస్సీ విభాగం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు కనపర్తి అనిల్, రాష్ట్ర కార్యదర్శి కె.దేవయ్య, లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేఎం విల్సన్, డి.మల్లికార్జునరెడ్డి, జె.ఎలిజబెత్ రాణి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసాదరావు, కొమ్ము రాయల్ పాల్గొన్నారు. దళితులకు క్షమాపణ చెప్పాలి తెనాలి టౌన్ : దళిత ఎస్ఐ విధులకు ఆటకం కలిగిస్తూ ఆమెను కించపరిచే విధంగా మాట్లాడిన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మాదిగ కార్పొరేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రావూరి రవిబాబు (జెవీఆర్) గురువారం ఒక ప్రకటనలో చెప్పారు. రాజకుమారి దళితులకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి దేవయ్య డిమాండ్ చేశారు. రాజకుమారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మహిళా ఎస్ఐని అవమానించిన మహిళా కమిషన్ రాష్ట్ర మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కంతేటి యలమందరావు డిమాండ్ చేశారు. గురువారం పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో సీఐ యు.శోభన్‌బాబును కలసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్ఐపై రాజకుమారి బృందం వేలు చూపిస్తూ అవమానకరంగా మాట్లాడారని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం ప్రతినిధులు కుక్కల రాంప్రసాద్, కూరపాటి సరస్వతి, బెజ్జం గోపి, బండి ప్రసాద్, బండ్లమూడి బానుకిరణ్, పాటిబండ్ల విల్సన్‌బాబు తదితరులు ఉన్నారు. ఆళ్లమూడిలో నిరసనలు భట్టిప్రోలు: నన్నపనేని రాజకుమారి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భట్టిప్రోలు మండలం ఆళ్లమూడి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతర రాజకుమారి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం కార్యదర్శి పంతగాని బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. సాటి మహిళ అని చూడకుండా పెదకాకాని మహిళా ఎస్ఐ అనూరాధపై దుర్భాషలాడటం విచారకరమన్నారు. కార్యక్రమంలో నాంచారయ్య, ప్రవీణ్‌కుమార్, వెంకట్రావు, అశోక్, ప్రశాంత్‌రాజ్, చంటి పాల్గొన్నారు. పెదపులివర్రు పంచాయతీ పరిధిలోని కోళ్లపాలెం అంబేడ్కర్ విగ్రహం వద్ద గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో నాగరాజు, చీకటి నాగేశ్వరరావు, బుస్సా మణేశ్వరరావు, ఎన్ నాగరాజు, దోవా సంసోన్, సూర్యచంద్రరరావు పాల్గొన్నారు. రాజకుమారి ఇలా మాట్లాడటం సరికాదని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మహిళా ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించడం శోచనీయమన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. (చదవండి: నోరు పారేసుకున్న నన్నపనేని) -
నన్నపనేని వ్యాఖ్యలపై దళితుల ఆగ్రహావేశాలు
సాక్షి, కాకినాడ సిటీ : దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారిని తక్షణం అరెస్ట్ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద శిక్షించాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ ఆధ్వర్యంలో దళితులు గురువారం ఆందోళన చేశారు. నగరంలో ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. నన్నపనేని దిష్టిబొమ్మను ర్యాలీగా తీసుకెళ్లి ఇంద్రపాలెం వంతెన సమీపం వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా దహనం చేశారు. నన్నపనేని దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు దళితులను కించపరచడం, దళితుల మధ్య చిచ్చు పెట్టడం అలవాటుగా మారిపోయిందని ఆయన విమర్శించారు. గతంలో దళితుల్ని తీవ్రంగా అవమానించిన చంద్రబాబు, పల్నాడులో దళితుల కోసం పోరాడుతున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ చింతమనేని ప్రభాకర్ దళితులను ఎలా కించపరిచారో అందరికీ తెలిసిందేనన్నారు. గత ఐదేళ్లుగా టీడీపీ పాలనలో దళితులు కనీసం ధర్నా కూడా చేయనీయలేదన్నారు. పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించింది చంద్రబాబు కాదా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు దళితులపై తప్పుడు కేసులు, రౌడీషీట్లు పెట్టి వేధింపులకు గురి చేశారని, కనీసం ఇప్పుడైనా చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకొని దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి బీఎన్ రాజు, హరిబాబు, శ్యామ్ దయాకర్, బోను దేవా, బాబీ, శ్రీను తదితరులు నాయకత్వం వహించారు దిష్టిబొమ్మతో ర్యాలీ.. జీజీహెచ్ వద్ద ఉన్న పూలే విగ్రహం నుంచి కలెక్టరేట్ మీదుగా ఇంద్రపాలెం వంతెన వద్ద అంబేడ్కర్ విగ్రహం వరకు చేశారు. -
ఎస్ఐ అనురాధ ఫిర్యాదు, నన్నపనేనిపై కేసు
సాక్షి, గుంటూరు : దళిత మహిళా ఎస్ఐని దూషించిన కేసులో టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారిపై మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఎస్ఐ అనురాధ ఫిర్యాదుతో 303, 506,509 r/w 34 ఐపీసీ సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నిన్న చలో ఆత్మకూరు సందర్భంగా ‘ఈ దళితుల వల్లే మాకీ దరిద్రం’ అంటూ నన్నపనేని దూషించిన విషయం తెలిసిందే. దీంతో విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ అనురాధతో పాటు సిబ్బందిపై అసభ్య పదజాల దూషణ, విధులకు ఆటంకం కలిగించినందుకు ఆమెతో పాటు టీడీపీ మహిళ నాయకురాలు సత్యవాణిలపై కేసు నమోదు చేశారు. చదవండి: నోరు పారేసుకున్న నన్నపనేని మరోవైపు ఐపీఎస్ అధికారి విక్రాంత్ పాఠిల్‌పై ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అనుచిత ప్రవర్తనపై ఎస్ఐ కోటయ్య ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే వైఎస్సార్ నాయకుల ఫిర్యాదుతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
ఓడినా.. టీడీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు..
సాక్షి, అమరావతి: దళిత మహిళా ఎస్ఐను దూషించడం.. టీడీపీ అగ్రకుల దురహంకారానికి నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మండిపడ్డారు. టీడీపీ సీనియర్ మహిళా నేత నన్నపనేని రాజకుమారి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆమె తీవ్రంగా ఖండించారు. మంత్రి తానేటి వనితతో కలసి ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ..గతంలో చంద్రబాబు నాయుడు, ఆదినారాయణరెడ్డిలు కూడా దళితులను ఇలానే అవమానించారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో అవమానించి కన్నీళ్లు పెట్టించారని..ఇప్పుడు దళిత ఎస్ఐను కులం పేరుతో దూషించడం దారుణమన్నారు. ఓడినా.. ఇంకా బుద్ధి రాలేదు.. గతంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేని రాజకుమారి..దళిత మహిళా ఎస్ఐని అవమానించడం సిగ్గుచేటని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. దళితులను టీడీపీ నేతలు దూషించడం దారుణమన్నారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని గతంలో చంద్రబాబు అవమానిస్తే..ఇప్పుడు దళితులు దరిద్రమంటూ నన్నపనేని చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. టీడీపీ నేతలకు దళితల పట్ల వివక్షత తగదని హితవు పలికారు. ఎన్నికల్లో టీడీపీ ఓడినా.. ఆ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
త్వరలోనే ఖాళీలన్నీ భర్తీ చేస్తాం : హోంమంత్రి
సాక్షి,అమరావతి : పోలీస్‌శాఖలోని సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, జైలు వార్డన్స్ కానిస్టేబుళ్ల ఫలితాలను గురువారం విడుదల చేసినట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. మొత్తం 2623 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికవగా, అందులో 500 మంది మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే శిక్షణ ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం త్వరలోనే భారీ రిక్రూట్మెంట్ చేపట్టి పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలన్నింటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పోలీస్‌శాఖలో అమలు చేస్తున్న వీక్లీఆఫ్ వలన కొత్తగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఎస్సై ఫిర్యాదు చేస్తే చర్యలు పల్నాడు ఘటనపై స్పందించిన సుచరిత... టీడీపీ స్వార్థ రాజకీయాలు పల్నాడులో పని చేయలేదని విమర్శించారు. టీడీపీ చేపట్టదలిచిన 'చలో ఆత్మకూరు'లో పెయిడ్ ఆర్టిస్ట్‌లు ఉన్నారు కాబట్టే వాళ్ల శిబిరం నుంచి కార్యకర్తలు వెళ్లిపోయారని మండిపడ్డారు. దళితుల పట్ల అమితమైన ప్రేమ కురిపిస్తోన్న చంద్రబాబు వారి ప్రభుత్వ హయాంలో ఐపీఎస్ అధికారిణి వనజాక్షిపై జరిగిన దాడిపై ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. విధి నిర్వహణలో భాగంగా ఎస్సైగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తోన్న మహిళను నన్నపనేని రాజకుమారి కులం పేరుతో ధూషించడం తగదని హెచ్చరించారు. ఎస్సై ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి స్పష్టం చేశారు. దళితులను అవమానిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సుచరిత పేర్కొన్నారు. -
దళితుల వల్లనే దరిద్రం..
-
నోరు పారేసుకున్న నన్నపనేని
సాక్షి, అమరావతి: ‘చలో ఆత్మకూరు’ సందర్భంగా టీడీపీ నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ రాజధాని ప్రాంతంలో హల్చల్ చేస్తూ ఉద్రిక్తతలు పెంచుతున్నారు. అడ్డుకుంటున్న పోలీసులపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నారు. సాటి మహిళ అని కూడా చూకుండా టీడీపీ మహిళా నాయకులు దూషణకు దిగడంతో మహిళా ఎస్ఐ ఒకరు మనస్తాపం చెంది విధుల నుంచి వెళ్లిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘దళితుల వల్లనే దరిద్రం’ అంటూ అక్కడే విధుల్లో ఉన్న దళిత మహిళా ఎస్ఐ అనురాధపై నన్నపనేని నోరు పారేసుకున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలతో కలత చెందిన ఎస్ఐ అనురాధ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేని ఎలా మాట్లాడడం సరికాదని అన్నారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకురాళ్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. అంతకుముందు చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు పోలీసు ఉన్నతాధికారిని దుర్భాషలాడారు. కాగా, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా మహిళా ఎస్ఐతో దురుసుగా ప్రవర్తించారు. (చదవండి: మహిళా పోలీసుపై అఖిలప్రియ జులుం) -
రెచ్చిపోయిన అచ్చెన్నాయుడు
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు పోలీసు ఉన్నతాధికారిపై నోరు పారేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పోలీసులపై చిందులు తొక్కారు. ‘ఛలో ఆత్మకూరు’ పిలుపు నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తుగా 144 సెక్షన్ విధించారు. బుధవారం చంద్రబాబు నివాసానికి వచ్చిన అచ్చెన్నాయుడు, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిలను పోలీసులు అడ్డుకున్నారు. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున లోపలకు వెళ్లనీయబోమని వారికి ఎస్పీ విక్రాంత్ పటేల్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రెచ్చిపోయిన ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు.. ‘ఏయ్ ఎగస్టా చేయొద్దు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు’ అంటూ పోలీసులపై ఒంటికాలిపై లేచారు. ఎస్పీ విక్రాంత్ పటేట్‌ను ‘యుజ్‌లెస్ ఫెలో’ అని తిట్టారు. పోలీసులు ఆపుతున్నా వినకుండా తోసుకుంటూ ముందుకు సాగిపోయారు. సీఎం ఇంటికి వెళ్లనీయరా!: నన్నపనేని ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓడినా టీడీపీ నాయకులు మాత్రం ఇంకా అధికారంలోనే ఉన్నట్టు భ్రమ పడుతున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి బుధవారం చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. 144 సెక్షన్ అమల్లో ఉండటంతో చంద్రబాబు నివాసం వద్ద ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ‘సీఎం ఇంటికి వెళ్లడానికి అభ్యంతరం ఏంటి’ అని పోలీసులను ఆమె ప్రశ్నించడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. పాపం.. ఆవిడ ఇంకా టీడీపీ అధికారంలో ఉన్నట్టుగానే భావిస్తున్నారని జనాలు జోకులు వేసుకుంటున్నారు. అధికారం కోల్పోయి చంద్రబాబు పదవి పోయినా ‘పచ్చ’ నాయకులకు మాత్రం ఆయన సీఎంగానే కన్పిస్తుండటం విడ్డూరంగా ఉందని ప్రజలు నవ్వుకుంటున్నారు. (చదవండి: బాబు నివాసం వద్ద టీడీపీ నేతల ఓవరాక్షన్) -
ఏయ్ ఎగస్టా చేయొద్దు..
-
నన్నపనేని రాజకుమారి రాజీనామా
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కి అందచేశారు. అనంతరం నన్నపనేని మాట్లాడుతూ...‘ప్రభుత్వం మారింది కాబట్టి నైతిక బాధ్యతగా రాజీనామా చేశాను. మూడేళ్ల వార్షిక నివేదికను గవర్నర్‌కు అందచేశా. నా నివేదికను చూసి గవర్నర్ అభినందించారు. రెండు నెలల ఆలస్యానికి మూడేళ్ల నివేదిక అడ్డంకిగా మారింది. నా హయాంలో బాధిత మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలిచా. వసతి గృహాల్లో భద్రత పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థను పటిష్టపరచాలి.’ అని అన్నారు. -
మహిళా కమిషన్ చెంతకు యువతులు
రాజమహేంద్రవరం రూరల్: అక్రమ రవాణా అనుమానంతో ముంబాయి వెళుతున్న రైలు నుంచి దించేసిన యువతులను ఒడిశా మహిళా కమిషన్ చెంతకు పంపించారు. ఈమేరకు సోమవారం సాయంత్రం బొమ్మూరులోని మహిళాప్రాంగణంలోని స్వధారహోమ్ నుంచి 17మంది యువతులను ప్రత్యేక పోలీసుఎస్కార్ట్ వాహనంలో ఐసీడీఎస్, రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో పంపించారు. ఒడిశా రాష్ట్రంలో బరంపూర్‌జిల్లాకు చెందిన ముగ్గురు, గంజాజిల్లాకు చెందిన ఏడుగురు, కాండుజొరోజిల్లాకు చెందిన ఆరుగురు, బలుగర్‌జిల్లాకు చెందిన ఒక యువతి మొత్తం 17మంది యువతులు ఈనెల 27న కోణార్క్ఎక్స్ప్రెస్లో ఒడిశా నుంచి ముంబయి రైల్లో వెళుతున్నారు. చైల్డ్‌లైన్ ఫోన్ నంబర్‌కు ఒక ప్రయాణికురాలు ఫోన్ చేయడంతో సామర్లకోట రైల్వేస్టేషన్లో చైల్డ్‌లైన్‌స్టాఫ్ దించే ప్రయత్నం చేశారు. అక్కడ దిగకపోవడంతో రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లో ఆ యువతులను జీఆర్పీ పోలీసుల సహాయంతో రైలు నుంచి దించేసి టుటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ చైల్డ్‌లైన్ ప్రతినిధులు విచారణలో చేపలసీడ్ శుభ్రం చేసే పనికి వెళుతున్నట్టు తేలింది. దీంతో ఆయువతులను బొమ్మూరులోని స్వధార్‌హోమ్‌కు తరలించారు. ఆదివారం రాష్ట్రమహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, సభ్యురాలు డాక్టర్ శిరిగినీడిరాజ్యలక్ష్మి సందర్శించి ఆ యువతులను సురక్షితంగా ఒడిశా పంపించేందుకు పోలీసు, ఐసీడీఎస్ అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. సోమవారం రాష్ట్రమహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి , చైరపర్సన్ నన్నపనేని రాజ్యకుమారి ఆదేశాల మేరకు ఐసీడీఎస్ అధికారులతో కలిసి ఒడిశా మహిళాకమిషన్‌తో చర్చించారు. అయితే ముందు ఒడిశా మహిళాకమిషన్ సభ్యులు తామే వచ్చి ఆ యువతులను తీసుకుని వెళతామని చెప్పారు. అయితే వారు వచ్చేందుకు సమయం పడుతుంది కావున, ఇక్కడి నుంచే యువతులను తీసుకుని వచ్చి అప్పగిస్తామని చెప్పారు. దీంతో అర్బన్ జిల్లా ఎస్పీ షిమోషిబాజ్‌పాయ్ ఆ యువతులను తరలించేందుకు పోలీస్ ఎస్కార్ట్ వాహనం సమకూర్చి నలుగురుసిబ్బందిని ఏర్పాటు చేవారు. ఐ సీడీఎస్ ప్రాజెక్టు అధికారి సుఖజీవన్‌బాబు ఆదేశాల మేరకు ఏపీడీ మణెమ్మ ఒక్కొక్క యువతికి భోజనాలు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.500 అందజేశారు. ఆ యువతుల వెంట జిల్లా చైల్డ్ ప్రోగ్రాం ఆఫీసర్ వెంకట్రావు, సఖిమహిళాసభ్యులు, చైల్డ్‌లైన్ సిబ్బంది వెళ్లారు. ఈసందర్భంగా రాష్ట్ర మహిళాకమిషన్ సభ్యురాలు డాక్టర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఆయువతులను సురక్షితంగా ఒడిశా మహిళాకమిషన్‌కు అప్పగిస్తారని, అనంతరం అక్కడి నుంచి వారు ఆ యువతులను స్వస్థలాలకు పంపిస్తారని తెలిపారు. మహిళాప్రాంగణం మేనేజర్ పి.వెంకటలక్ష్మి, చైల్డ్‌లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆ యువతులను సురక్షితంగా పంపిస్తాం
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం రూరల్: అక్రమ రవాణా అనుమానంతో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి రాజమహేంద్రవరం స్టేషన్లో దించేసిన యువతులను ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి సురక్షితంగా వారి స్వస్థలాలకు పంపిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు. ఆమె ఆదివారం మధ్యాహ్నం ఆ యువతులు ఆశ్రయం పొందిన బొమ్మూరు మహిళా ప్రాంగణం ఆవరణలోని స్వధారహోమ్ను సందర్శించారు. ఆ 17మంది యువతులు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళుతున్నారు? పనికి వెళుతున్నారా? అనే విషయాలను ట్రాన్స్‌లేటర్, రైల్వే ఉద్యోగి లాజర్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని బరంపూర్ జిల్లాకు చెందిన ముగ్గురు, గంజాం జిల్లాకు చెందిన ఏడుగురు, కాండుజొరో జిల్లాకు చెందిన ఆరుగురు, బలుగర్ జిల్లాకు చెందిన ఒక యువతి ఉన్నట్టు గుర్తించారు. ఒడిశా నుంచి వారు ముంబాయి రైల్లో వెళుతుండగా చైల్డ్‌లైన్ ఫోన్ నెంబరుకు ఒక ప్రయాణికురాలు ఫోన్ చేయడంతో సామర్లకోట రైల్వేస్టేషన్లో చైల్డ్‌లైన్ స్టాఫ్ సాయిలక్ష్మి, లక్ష్మి వారిని దించే ప్రయత్నం చేశారు. అయితే ఆ యువతులు అక్కడ దిగకపోవడంతో రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లో వారిని జీఆర్పీ పోలీసుల సహాయంతో రైలు నుంచి దించేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ చైల్డ్‌లైన్ ప్రతినిధుల విచారణలో చేపలసీడ్ శుభ్రం చేసే పనికి వారు వెళుతున్నట్లు తేలింది. దాంతో ఆయువతులను బొమ్మూరులోని స్వధార్ హోమ్‌కు తరలించారు. వారిలో ఒక యువతి సోదరుడికి కాలువిరగడంతో ఆస్పత్రికి వెళుతుండగా, ఇంకో యువతి తల్లిదండ్రుల వద్దకు వెళుతోందని తేలింది. యువతులను విచారణ జరిపిన అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజకుమారి అర్బన్‌జిల్లా ఎస్పీ షీమోషిబాజ్పేయ్, ఇతర పోలీసుఅధికారులతో ఫోన్లో మాట్లాడి ఆ యువతులు సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరేవరకు పూర్తిరక్షణ కల్పించాల్సిందిగా కోరారు. అనంతరం రాజకుమారి విలేకరులతో మాట్లాడుతూ యువతులు ఏరాష్ట్రానికి చెందినవారైనా వారి మానప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వారిపై అనుమానాలు ఉన్నప్పటికీ సురక్షితంగా వారు ఇళ్లకు చేరేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌తో మాట్లాడిస్తామని తెలిపారు. ఆయువతులు ముంబాయిలోని పనికి వెళుతున్నామని చెబుతున్నారని, వారి వద్ద కనీసం రూపాయి కూడా లేదన్నారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయువతులను అప్పగిస్తామన్నారు. అనంతరం ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సుఖజీవన్‌బాబు, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ బి.శ్రీనివాసరావులతో అర్బన్‌జిల్లా మహిళాపోలీస్స్టేషన్ డీఎస్పీ పి.మురళీధరన్, టూ టౌన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్సై వి.వెంకటేశ్వరరావు, ధవళేశ్వరం ఎస్సై వెంకయ్య, పీఎస్సై అమీనాబేగం మాట్లాడారు. రాష్ట్ర మహిళా కమిషన్ ద్వారా ఒడిశా రాష్ట్ర మహిళా కమిషన్‌కు లేఖ రాసి ఆయువతులను పోలీస్ఎస్కార్ట్తో వారి స్వస్థలాలకు తరలించేలా చర్చించారు. ఆ యువతులను సోమవారం ఒడిశాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్‌బాబు తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి, ఐసీడీఎస్ రాజానగరం సీడీపీవో పి.సుశీలకుమారి, మహిళాప్రాంగణం మేనేజర్ పి.వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
‘అత్తకూడా అదే మార్గంలోనా.. ఎంత దుర్మార్గం’
పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణం): భర్త, అత్త చేతిలో దాడికి గురై విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రాజేశ్వరిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. గురువారం కేజీహెచ్‌కు వచ్చిన ఆమె రాజేశ్వరితో పాటు వివిధ కేసుల్లో చికిత్స పొందుతున్న పలువురు మహిళలను పరామర్శించారు. (అయ్యయ్యో.. ఎంత కష్టం!) ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ ఈ లోకంలో మహిళగా పుట్టడమే నేరమా అని ప్రశ్నించారు. ఆస్పత్రిలో ఉన్న మూడు కేసులను చూసేందుకు వస్తే అవి ఐదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి విజయనగరంలో జరగగా, మిగిలినవి విశాఖపట్నంలో జరిగాయని చెప్పారు. నిండు గర్భిణిగా ఉన్న రాజేశ్వరిని శారీరకంగా, మానసికంగా హింసించిన ఆమె భర్త దామోదర్, అత్త లలితను కఠినంగా శిక్షించినప్పుడే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త ఆమెపై భౌతికదాడికి దిగగా, ఆమె అత్తకూడా అదే మార్గంలో నడవడం దుర్మార్గమన్నారు. ఇటువంటి మానవ మృగాలకు సమాజంలో తిరిగే హక్కులేదని, తక్షణమే న్యాయవిచారణ జరిపి త్వరగా శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. నిందితులకు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, న్యాయవాదులు ఎటువంటి సహకారం అందించవద్దని విజ్ఞప్తి చేశారు. రాజేశ్వరి కోలుకున్న తర్వాత ఆమెకు ఉపాధి కల్పించడంతో పాటు పుట్టిన బిడ్డను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు శ్రీవాణి, మణికుమారి, మహిళా సంక్షేమ శాఖ అధికారులు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి పాల్గొన్నారు. -
‘కోడ్ నుంచి నాకు మినహాయింపు ఇవ్వండి’
అమరావతి: బాధితులకి సహాయం చేయాలంటే ఎన్నికల కోడ్ అడ్డు తగులుతోందని, వారికి సహాయం చేసేందుకు వీలుగా కోడ్ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపునేని రాజకుమారి ఎన్నికల కమిషన్‌ను కోరారు. గురువారం చిత్తూరు జిల్లా కుప్పం, విశాఖ జిల్లా గాజువాకల్లో మహిళలపై జరిగిన దాడులపై ఏపీ సీఈసీ గోపాలకృష్ణ ద్వివేదికి నన్నపనేని రాజకుమారి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని, ప్రత్యేకంగా పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు. మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని విన్నవించారు. రాజకీయ పార్టీలతో తనకు సంబంధం లేదని, మహిళలని ఓటు కోసం ఎవరు వేధించినా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
అమాత్య... అన్న పిలుపేదీ?
సాక్షి, గుంటూరు : జిల్లాలో గతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య పనర్విభజనతో 19 నుంచి 17కు తగ్గిపోయింది. అయితే ఇప్పటి వరకూ మూడు నియోజకవర్గాలకు మంత్రి పదవి దక్కలేదు. వాటిలో ఒకటి రద్దయిన దుగ్గిరాల నియోకవర్గంకాగా మిగిలిన రెండు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని గురజాల, మాచర్ల. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని సత్తెనపల్లికి కేవలం నెలరోజులే మంత్రి పదవి దక్కింది. దుగ్గిరాల నియోజకవర్గం నుంచి గుదిబండి వెంకటరెడ్డి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి మాత్రం దక్కలేదు. మాజీ మంత్రి ఆలపాటి ధర్మారావు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందినప్పటికీ మంత్రి పదవి దక్కలేదు. అనంతరం వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంత్రి అయ్యారు. సత్తెనపల్లిది విచిత్ర పరిస్థితి. 1983లో ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన నన్నపనేని రాజకుమారి ఎమ్మెల్యేగా గెలుపొంది నాదెండ్ల భాస్కరరావు మంత్రి వర్గంలో నెలపాటు మంత్రిగా కొనసాగారు. ఆ నెల మినహా సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇప్పటి వరకు మంత్రి పదవి దక్కలేదు. సత్తెనపల్లి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్యకు సైతం మంత్రి పదవి దక్కలేదు. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు 924 స్వల్ప మెజార్టీతో గెలిచినా శాసన సభ స్పీకర్ పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో 2014 వరకు మంత్రి పదవి దక్కలేదు. 2014లో మాత్రం మొట్టమొదటిసారిగా ప్రత్తిపాటి పుల్లారావు అమాత్యుడిగా ప్రమాణం చేశారు. పల్నాడు ప్రాంతంలో ఉన్న గురజాల నియోజకవర్గం నుంచి ఇంత వరకు ఒక్కరు కూడా మంత్రి పదవి పొందలేదు. అయితే గురజాల వాసి అయిన డొక్కా మాణిక్యవరప్రసాదరావు తాడికొండ నియోజకవర్గం నుంచి విజయం సాధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా కొనసాగారు. అయితే ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడూ రెండు సార్లుకంటే ఎక్కువ సార్లు గెలవకపోవడంతో మంత్రి పదవులు దక్కలేదని చెప్పుకోవచ్చు. మాచర్ల నియోజకవర్గం నుంచి కూడా ఇంత వరకు ఒక్కరు కూడా మంత్రి పదవిని పొందలేకపోయారు. ఈ నియోజకవర్గం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనర్హత వేటుకు గురై 2012 ఉప ఎన్నికల్లో రెండో సారి గెలిచి రికార్డు సృష్టించారు. 2014 ఎన్నికల్లో సైతం విజయం సాధించి పల్నాడు ప్రాంతంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ రికార్డు సృష్టించారు. ఆయన మినహా మిగిలిన ఎవరూ రెండు సార్లు గెలవలేదు. -
విజ్ఞుల మాట..వినుకొండ
సాక్షి, వినుకొండ : అది రావణుడు సీతా దేవిని అపహరించుకుని వెళ్తున్న సమయం. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న జటాయువు చూసి రావణబ్రహ్మతో పోరాడి ప్రాణాలు విడిచిన స్థలం విన్నకొండ కాలక్రమంలో వినుకొండగా పేరుగాంచింది. వినుకొండలో అనేక మంది కవులు కళాకారులు, రాజకీయ ఉద్ధండులు నడయాడారు. బ్రిటీష్ పాలకుల కాలంలో నిర్మించిన భవనాల్లోనే నేటికీ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అలాగే ఆధ్మాత్మికం ప్రాంతంగా కూడా పేరు ప్రఖ్యాతులు గాంచింది. వినుకొండ కొండపైన వెలసిన రామలింగేశ్వరుని దేవాలయం శ్రీరాముని కాలంలో ప్రతిష్టించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. పట్టణంలోని గుంటి ఆంజనేయస్వామి దేవాలయం, పాతశివాలయం, కమఠేశ్వరాలయం, గమిడి ఆంజనేయస్వామి దేవాలయాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. విశ్వనరుడు గళమెత్తిన కొండ.. ప్రపంచంలో ఏమూల కవుల ప్రస్తావన వచ్చినా గుర్రం జాషువా పేరు వినపడగానే వినుకొండ గుర్తుకు రావటం సహజం. గుర్రం జాషువా వినుకొండ పక్కనే ఉన్న చాటగడ్డపాడులో జన్మించారు. సమాజంలోని అస్పృశ్యత, అంటరానితనంపై ఉద్యమించి కవిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సత్యహరిశ్చంద్ర నాటకంలో కాటిసీను పద్యాలు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిపొందాయి. అంతటి ఘన చరిత్ర కలిగిన గుర్రం జాషువా ఈ ప్రాంత నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడం విశేషం. నల్లమలను ఆనుకుని.. నియోజకవర్గంలో బొల్లాపల్లి మండలం నల్లమల అడవిని ఆనుకుని ఉంది. ఇది జిల్లాలోనే చాలా వెనుకబడిన మండలం. ఇక్కడ దాదాపు 50కిపైగా సుగాలి తండాలున్నాయి. తాగునీరు, సాగునీరు సౌకర్యాలు లేక ఎన్నో ఏళ్ల తరబడి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వరికపూడిసెల ప్రాజెక్టు నిర్మించాలని గతంలో ప్రభుత్వాలు శంకుస్థాపనలు చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఎక్కువగా వ్యవసాయ కూలీలు, నిరక్షరాస్యులు ఉండటంతో ఈ మండలం అభివృద్ధికి నోచుకోలేదు. నక్సల్స్ ప్రాబల్యం.. గతంలో బొల్లాపల్లి మండలంలో నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో ఇక్కడి గ్రామాల్లో అధికారులు సైతం పనిచేసేందుకు వెనుకంజ వేసేవారు. ప్రస్తుతం నక్సల్స్ ఆనవాళ్లు లేనప్పటికీ అభివృద్ధి మాత్రం జరగలేదు. బండ్లమోటు గ్రామంలో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ మైనింగ్ ఉంది. ప్రస్తుతం అది కాస్తా మూతపడటంతో అక్కడ ఉద్యోగులు వలస వెళ్లిపోయారు. నేడు ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు లేకపోవటంతో ఉపాధి కరువైంది. ఎవరినైనా ఆదరించే తత్వం.. వినుకొండ నియోజకవర్గ ప్రజల్లో మొదటి నుంచి రాజకీయ చైతన్యం ఉంది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఏ ఒక్కరూ రెండుసార్లకు మించి గెలిచిన దాఖలాలు లేవు. అలాగని సామాన్య రాజకీయ చరిత్ర ఉన్న వారిని కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించిన ఘనత ఇక్కడి ప్రజలకే దక్కుతుంది. ఇక్కడ గ్రామస్థాయి నుంచి లీడర్‌గా ఎదిగిన మక్కెన మల్లికార్జునరావు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందిన వారే. వైద్య వృత్తిలో ఉన్న వీరపనేని యల్లమందరావు కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్థానికేతర అభ్యర్థులైన భవనం జయప్రద, నన్నపనేని రాజకుమారిలను కూడా గెలిపించి గౌరవించారు. వినుకొండ నియోజకవర్గంలో 1972 భవనం జయప్రద మంత్రిగా ఒకటిన్నరేళ్లు పని చేశారు. తర్వాత కాలంలో నన్నపనేని రాజకుమారి ప్రభుత్వ చీఫ్ విప్‌గా క్యాబినెట్ హోదాలో కొనసాగారు. లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టు.. నియోజకవర్గంలో సుమారు లక్ష ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. ఇందులో 50 శాతం సుబాబుల్, జామాయిల్ సాగు చేస్తున్నారు. మిగతా విస్తీర్ణంలో మిరప, పొగాకు, కంది, వరి ప్ర«ధానమైన పంటలుగా సాగవుతున్నాయి. ఈ ప్రాంతంలో పాల పరిశ్రమపై ఎక్కువ మంది ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. వినుకొండ భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తే తూర్పున గొర్రెపాడు వద్దనున్న సంగం, నరసరావుపేట సమీపంలో ఉన్న సంతమాగులూరు, పడమర ఉమ్మడివరం, దక్షిణం కెల్లంపల్లి గ్రామాలు ప్రకాశంజిల్లా సరిహద్దుల్లో ఉంది. గ్రామ పంచాయతీలు : 105 జనాభా : 3,08,145 ఓటర్లు : 2,33,297 పురుషులు : 1,16,306 స్త్రీలు : 1,16,971 పెరిగిన ఓటర్లు : 36,352 పోలింగ్ బూత్‌ల సంఖ్య : 299 కమ్యూనిటీ వారీగా ఓటర్లు కమ్మ : 45,000 రెడ్డి : 19,000 కాపు : 22,000 ఆర్యవైశ్యులు : 16,000 ముస్లింలు : 18,000 బీసీలు : 62,000 ఎస్సీలు : 40,000 ఎస్టీలు : 35,000 ఇతరులు : 6,000 -
శ్రీధరణి హత్యకేసులో పురోగతి ఏదీ
ఏలూరు టౌన్ : శ్రీధరణి హత్య కేసులో పోలీసు అధికారుల పురోగతి కనిపించటంలేదని, కేసు దర్యాప్తులో అలసత్వం వహిస్తే పోలీసులపైనా చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో ఇటీవల హత్యకు గురైన శ్రీధరణి కేసుకు సంబంధించి బుధవారం రాజకుమారి భీమడోలు మండలం ఎంఎం పురం గ్రామంలోని శ్రీధరణి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంత రం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ఘటనలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న నవీన్‌కుమార్‌ను ఆమె పరామర్శించారు. తలకు తీవ్రగాయాలెన నవీన్ నుంచి వైద్యుల సమక్షంలో వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. తనకేమీ గుర్తురావటంలేదని, పోలీసులకు ముం దు నుంచి చెప్పే సమాధానమే రాజకుమారికీ అతడు చెప్పాడు. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నవీన్ కూడా నేరస్తుడే అనంతరం మహిళా కమిషన్ చైర్మన్ రాజకుమారి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు నవీన్కుమార్పైనా అనుమానాలు ఉన్నాయని, ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడని అనుకుంటున్నట్టు తెలిపారు. శ్రీధరణిని అక్కడకు తీసుకువెళ్లాడు కాబట్టి నవీన్ కూడా నేరస్తుడే అవుతాడన్నారు. ఘటన జరిగి నాలుగురోజులు కావస్తున్నా నేరస్తులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. ఆడపిల్లలు కూడా తమ హద్దుల్లో ఉండాలని, గుడ్డిగా ప్రేమపేరుతో నమ్మి మోసపోవద్దని హితవుపలికారు. పర్యాటక కేంద్రమైన బౌద్ధారామాల వద్ద భద్రత, రక్షణ లేకపోవటం దారుణమన్నారు. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వాసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్, న్యూరోసర్జన్ డాక్టర్ వి జయప్రసాద్, ఐసీడీఎస్ జేడీ విజయకుమారి, మహిళా కమిషన్ డైరెక్టర్ డాక్టర్ రాజ్యలక్ష్మి, ఏలూరు డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఉన్నారు. శ్రీధరణి కుటుంబాన్ని ఆదుకుంటాం భీమడోలు: తెర్లి శ్రీధరణి అనే యువతి దారుణ హత్యకు గురికాగా ఆమె కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. పూళ్ల పంచాయతీ శివారు ఎంఎం పురంలో శ్రీధరణి కుటుంబాన్ని బుధవారం ఆమె పరామర్శించారు. ఈసందర్భంగా శ్రీధరణి తల్లిదండ్రులు అప్పారావు, అలివేలు మంగ చైర్పర్సన్ రాజకుమారి కాళ్లపై çపడి తమకు న్యాయం చేయాలని కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కుటుంబానికి వచ్చిన కష్టం మరో ఆడబిడ్డ కుటుంబానికి రాకూడదంటూ బోరుమన్నారు. గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బా«ధిత కు టుంబాన్ని చైర్పర్సన్ రాజకుమారి ఓదార్చారు. ప్రభుత్వ పరంగా పక్కా ఇల్లు అందిస్తామని, ఆర్థిక సాయం చేస్తామన్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకూ పె చ్చుమీరుతున్న అఘాయిత్యాలను తీవ్రంగా ఖండించారు. తెనాలి, తాడేపల్లిలో ఘటనలు, ఏలూరులో తాజా ఘటన బా«ధిస్తున్నాయన్నారు. ఇలాంటి ఘటనలను కమిషన్ సహించేది లేదన్నారు. దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించమని హెచ్చరించారు. దోషులను 24 గంటల్లో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించారు. బెయిల్ రాకుండా చూడాలన్నారు. నిందితుడికి నెల రోజుల్లో శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కళాశాలలు, వసతి గృహల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని యాజమాన్యాలను ఆదేశిం చామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మరింత ని ఘా పెంచుతామన్నారు. రాష్ట్ర కమిషన్ సభ్యురా లు రాజ్యలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ కె.విజయకుమారి, కమిషన్ అధికారులు సూయజ్, డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సీఐ ఎస్‌సీహెచ్ కొండలరావు, ఎస్సై ఐ.వీర్రాజు, పీఓ ఏలూరు తులసి తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలపై చైతన్యం కలిగించాలి
ఒంగోలు టౌన్: ఆడపిల్లలను చదివించకుండా చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేసి తల్లిదండ్రులు తమ భారం తొలగించుకుంటున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆందోళన వ్యక్తం చేశారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలను యువత ప్రజలకు తెలియజేసి చైతన్యవంతులను చేయాలని ఉద్బోధించారు. రాష్ట్ర మహిళా కమిషన్, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ సంయుక్తంగా స్థానిక రైజ్ ఇంజినీరింగ్ కళాశాల సహకారంతో కళాశాల ఆవరణలో బుధవారం సాయంత్రం బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబం లోని ఆర్థిక పరిస్థితులు, ఆడపిల్లనే అభద్రతా భావం, మూఢ నమ్మకాలు వంటి అనేక కారణాల వల్ల అభం శుభం తెలియని బాలికలకు చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేస్తున్నారన్నారు. దీనిని రూపుమాపేందుకు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చిన్న వయస్సులోనే వివాహాలు చేయడం వల్ల గర్భం దాల్చిన సమయంలో తల్లితో పాటు బిడ్డ ప్రాణానికి కూడా అపాయం కలుగుతుందన్నారు. బాలికలు, మహిళల పరిరక్షణ కోసం మహిళా కమిషన్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. లింగ వివక్షత వెంటాడుతోంది సాంకేతికంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న తరుణంలో బాలికల పట్ల లింగ వివక్షత ఇంకా వెంటాడుతూనే ఉందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి టీ రాజావెంకటాద్రి పేర్కొన్నారు. బాల్య వివాహక నిరోధక చట్టం–2006 ప్రకారం ఆడపిల్లకు 18, మగపిల్లాడికి 21 సంవత్సరాలు నిండకుండా వివాహం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బాల్య వివాహం చేస్తే మత పెద్దలకు, వివాహానికి హాజరైనవారికి రెండేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ డైరెక్టర్ సూయజ్ మాట్లాడుతూ యువత చదువుతో పాటు సామాజిక అంశాలపై ప్రజలకు మేలు కలిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. మహిళా నాయకురాలు టీ అరుణ మాట్లాడుతూ అధిక శాతం యువత టీవీలు, సెల్ఫోన్ల ప్రభావంతో చిన్న వయస్సులోనే ప్రేమ పేరుతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. యువత మంచి మార్గంలో నడిచి వారి కుటుంబాలకు, సమాజానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. కొమరోలు బాలికకు అభినందనలు కొమరోలులో గత ఏడాది ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికకు వారి తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలు సాగిస్తున్న తరుణంలో విషయం తెలుసుకొని పోలీసు స్టేషన్‌కు వెళ్లి వివాహాన్ని ఆపించిన బాలికను సమావేశానికి ప్రత్యేకంగా పిలిపించి అభినందించారు. ఆ బాలిక తన స్నేహితుల సహాయంతో ధైర్యంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి బాల్య వివాహ ప్రయత్నాన్ని తిప్పికొట్టడంపై చైర్‌పర్సన్‌తో పాటు మిగిలిన అధికారులు ఆ బాలికను ప్రశంసించారు.రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు టీ రమాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ సీహెచ్ భారతి, మహిళా శిశు సంక్షేమశాఖ ఏపీడీ జీ విశాలాక్షి, హెల్ప్ పారాలీగల్ వలంటీర్ బీవీ సాగర్, డీసీపీఓ జ్యోతిసుప్రియ, రైజ్ కళాశాల ప్రిన్సిపాల్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
జంధ్యాల మార్క్ కామెడీతో.
హాస్యనటుడు అలీ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. (వీడు ఫోటో తీస్తే పెళ్లి అయిపోద్ది) అన్నది ట్యాగ్‌లైన్. రిషిత కథానాయికగా నటిస్తున్నారు. దిలీప్ రాజా దర్శకత్వంలో పెదరావూరు ఫిల్మ్ స్టూడియో పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రం గుంటూరు జిల్లా తెనాలిలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ క్లాప్ ఇవ్వగా, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు. దిలీప్ రాజా మాట్లాడుతూ– ‘‘హాస్యానికి, అపహాస్యానికి రెండు అక్షరాలు మాత్రమే తేడా. దీన్ని గమనించే పూర్తిస్థాయి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులతో మా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. హాస్యంలో జంధ్యాలగారి, దర్శకత్వంలో బాలచందర్‌గారి ప్రభావం నాపై ఉంటుంది. అందుకే దేవుళ్లను మొక్కకుండా వారికే మొక్కాను. ఈ సినిమా జంధ్యాల మార్క్ కామెడీగా ఉంటుంది’’ అన్నారు. ‘‘కథ చాలా బాగుంది. ఇళయరాజాగారి వద్ద పనిచేసిన యాజమాన్య సంగీతంలో, శ్రేయా ఘోషల్ పాడిన పాటలు ప్రేక్షకులని మెప్పిస్తాయి. చాలా కాలం తర్వాత ఫుల్ కామెడీ సినిమా చేస్తున్నాను. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అని అలీ అన్నారు. ప్రదీప్ రావత్, జీవ, సుధ, దేవిశ్రీ, ‘చిత్రం’ శ్రీను, టీనా చౌదరి, ‘జబర్దస్త్’ రాము తదితరులు నటిస్తున్నారు. -
గౌతమి హత్య కేసా.. తెలీదే ! : నన్నపనేని
సాక్షి, ఏలూరు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంఘటన గౌతమి హత్య. పోలీసులు తమకు న్యాయం చేయట్లేదంటూ గౌతమి తల్లిదండ్రలు పోరాడటంతో కేసును విచారించిన సీఐడీ సంచలన విషయాలను వెల్లడించింది. కేసులను తప్పుదారి పట్టించబోయిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు సిద్దమైనట్లు జోరుగా వార్తలు సైతం వచ్చాయి. అయితే ఈ సంఘటన గురించి మహిళా కమీషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారికి తెలియదంట. గౌతమి హత్యకు గురౌందన్న విషయం తనకు ఇప్పటి వరకూ తెలియదని నన్నపనేని అనడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం ఆమె ఏలూరు పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికి జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఆమె విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మహిళలపై జరుగుతున్న దారుణాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే విలేకర్లు గౌతమి హత్య గురించి ప్రస్తావించగా ఆమె చెప్పిన విషయం అందరినీ విస్మయ పరిచింది. పైగా ఏం జరిగిందంటూ నన్నపనేని తిరిగి వాళ్లనే ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉన్నవాళ్లు ఒక్కసారిగా విస్తుపోయారు. మీడియా ప్రతినిథులు విషయాన్ని వివరించడంతో స్పందించిన ఆమె.. ఇప్పటికైనా ఎవరైనా ఫిర్యాదు చేస్తే కచ్చితంగా విచారణ చేస్తామని, లేని పక్షంలో ఎవరూ ఏమీ చేయలేరంటూ చేతులెత్తేశారు. -
నిందితునికి మద్దతు సరికాదు..నన్నపనేని
కృష్ణాజిల్లా : చందర్లపాడు (మం) తోటరావులపాడు గ్రామంలో తండ్రిచేతిలో దారుణ హత్యకు గురైన చంద్రిక కుటుంబాన్ని మహిళా కమీషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. చంద్రిక ప్రేమించిన వ్యక్తితో ఫోన్ మాట్లాడుతుండగా సహించలేని తండ్రి దారుణంగా హతమార్చాడు. అలాంటి వ్యక్తిని చంద్రిక తల్లి, చెల్లి చాలా మంచివాడని, విడిపించాలని అడగటం ఆశ్చర్యంగా ఉందని నన్నపనేని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడికి వారు వత్తాసు పలకడం నచ్చలేదని, చట్టంముందు ఎవరైనా ఒకటేనని అన్నారు. పోలీసులు సరైన సాక్ష్యాలు సేకరించి తొండపు కోటయ్యకు కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నానన్నారు. -
నన్నపనేని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పురుషుల రక్షణ కోసం ఒక కమిషన్ ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు. రాజకుమారి బుధవారం మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలోని విజయనగరంలో భర్తను చంపించిన భార్య ఘటన, శ్రీకాకుళం జిల్లాలో భర్తపై హత్యాయత్నం వంటి సంఘటనలు విస్తుగొలిపాయని అన్నారు. మహిళల బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని ఆమె తెలిపారు. శ్రీకాకుళంలో భార్య చేతిలో దాడికి గురైన వ్యక్తికి అండగా ఉంటామన్నారు. టీవీ సీరియల్స్ల ప్రభావం వల్లనే మహిళల్లో నేర ప్రవృత్తి పెరుగుతోందని పేర్కొన్నారు. సీరియల్స్ మీద సెన్సార్ పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళల నుంచి పురుషులకు రక్షణ కోసం పురుష కమిషన్ ఏర్పాటు చేయాలని నన్నపనేని డిమాండ్ చేశారు. -
బాల్య వివాహం చేస్తే జైలుకే..
పెదపాడు: బాల్య వివాహం నేరమని.. అలా చేసిన తల్లిదండ్రులను జైలుకు పంపిస్తామని రాష్ట్ర మహిళా విభాగం చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. పెదపాడు మండలం వట్లూరులోని ఆర్టీసీ కాలనీలో ఓ బాలికకు వివాహం చేస్తున్నారని తెలియడంతో బుధవారం నన్నపనేని రాజకుమారి పిల్లల కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికకు తల్లిదండ్రులు లేరని తాము పెంచుకుంటున్నామని పెద్దమ్మ, పెద్దనాన్న ప్రతాప వైదేహీ, లక్ష్మీనారాయణ ఆమెకు చెప్పారు. బాలికకు వివాహం చేయలేదని తమ కుటుంబంలో ముందుగా నిశ్చయించుకుని మైనార్టీ తీరిన తర్వాత వివాహం చేస్తామని లక్ష్మీనారాయణ దంపతులు సమాధానమిచ్చారు. ఈరోజుల్లో అలాంటివి ఎక్కడా చేయడం లేదని, 18 ఏళ్లు నిండేవరకు వివాహం చేయరాదని నన్నపనేని వారిని హెచ్చరించారు. బాలికను చదివించలేని పక్షంలో తాము ప్రభుత్వ హస్టల్స్ లేదా మహిళా హాస్టల్లో ఉంచి చదివిస్తామని చెప్పారు. బాలిక అభిప్రాయం కోరగా పెదనాన్న వద్ద ఉంటానని, పాఠశాలకు వెళ్తానని సమాధానమిచ్చింది. బాలుడు తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికకు మైనార్టీ తీరందని చెప్పి తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తప్పవన్నారు. బాలిక కుటుంబం పురోభివృద్ధికి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సాయమందేలా చర్యలు తీసుకుంటామని నన్నపనేని రాజకుమారి హామీఇచ్చారు. ఇరువర్గాలనుంచి మైనార్టీ తీరేవరకూ వివాహం చేయమంటూ రాతపూర్వక హామీని తీసుకోవాలని ఏలూరు డీఎస్పీ శ్రీనివాసరావును ఆదేశించారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి, సెక్షన్ ఆఫీసర్ విజయలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ విజయకుమారి, సీడీపీఓ గిరిజ పాల్గొన్నారు. -
‘నా అనుభవం అంతలేదు ఆమె వయస్సు’
సాక్షి, గుంటూరు : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అశ్లీల నృత్యాల ఘటనను ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై నన్నపనేని మాట్లాడుతూ.. ‘భీమవరం ఘటన జుగుప్సాకరంగా ఉంది. ఎక్కడా అలాంటి డాన్సులకు అనుమతించం’ అని స్పష్టం చేశారు. కాగా భీమవరం యూత్ క్లబ్ వార్షికోత్సవ కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సుల నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొనటంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీపై నన్నపనేని రాజకుమారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను సురభి నాటకాల కంపెనీ ఆర్టిస్టులతో పోల్చడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. నా అనుభవం అంతలేదు ఆమె వయస్సు. అన్ని పార్టీలవారు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నా పనితీరును అభినందిస్తున్నారు. పద్మశ్రీకి దమ్ము, ధైర్యం ఉంటే తనతో బహిరంగ చర్చకు రావాలి. విశాఖ జిల్లా పెందుర్తిలో దళిత మహిళపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. ఆమెను పరామర్శించి, ప్రభుత్వ హామీ అమలు జరిగేలా చర్యలు తీసుకుంటా’ అని తెలిపారు. -
మగాళ్లు సీతాకోక చిలుకలు.. !
చిత్తూరు : ‘మగాళ్లు సీతాకోక చిలుకల్లాంటి వారు. ఆడపిల్లలు పూబంతులు. వీరిని ఆకట్టుకోవడానికి సీతాకోక చిలుకలు రంగు రంగుల ఆకర్షణలతో రకాల వేషాలు వేస్తుంటారు. అలాంటి వారి ఆకర్షణకు మహిళలు లోనుకావద్దు. మాన, ప్రాణ, ఆత్మరక్షణ కోసం అవసరమైతే అంతం చేస్తాం.. అని ఎదురుతిరగాలి. అలాగని మగాళ్లందరూ చెడ్డవారు కాదు.’ అని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు. పిల్లలు, యువతను పెడదోవ పట్టిస్తున్న అశ్లీల వెబ్సైట్లు, యూ ట్యూబ్‌ల్లోని వీడియోలను కేంద్రం తొలగించాలన్నారు. తమ డిమాండ్‌ను కేంద్రానికి రాతపూర్వకంగా అందిస్తామన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన భార్గవి, తిరుమల, నాగరత్న, నిర్మల అనే నలుగురు మహిళా కానిస్టేబుళ్లు గత 45 రోజులుగా 1200 కిలో మీటర్ల పాటు సైకిల్‌పై తిరుగుతూ మహిళల్లో ఆత్మస్థైర్యం నింపే కార్యక్రమాన్ని చేపట్టారు. చిత్తూరులో గురువారం జరిగిన ఈ ముగింపు కార్యక్రమానికి నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫేస్బుక్, యూ ట్యూబ్, వాట్సప్లను అవసరాలకు కాకుండా అనవసర విషయాలకు నేటి యువత ఎక్కువగా వినియోగిస్తోందన్నారు. దీనికి తోడు టీవీల్లో వచ్చే కొన్ని సీరియల్స్ మహిళల్ని చులకనగా చూపించడం, నేర ప్రవృత్తిని రెచ్చగొట్టేలా ఉండటం, అసభ్యంగా చూపడం వల్ల సమాజంలో మహిళల పట్ల ఎక్కువగా వేధింపులు, దాడులు జరుగుతున్నాయన్నారు. ఆడ పిల్లలు తల్లితండ్రుల కంటే ఎక్కువ సమయం ఉపాధ్యాయుల వద్దే ఉంటున్నారని, వారిని చదువులకే పరిమితం చేయకుండా సమాజం ఎలా పోతోంది, సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలనే విషయాలను సైతం నేర్పించాల్సిన బాధ్యత టీచర్లు, అధ్యాపకులపై ఉందన్నారు. -
సిబ్బంది కొరతా..? మీ మంత్రులనడగండి
అనంతపురం న్యూసిటీ: ‘సర్వజనాస్పత్రిలో సిబ్బంది కొరత ఉంటే..మీ మంత్రులు, చీఫ్ విప్‌లనే అడగండి. మీ జిల్లాకు పదవులు ఎక్కువగా వచ్చాయ్. వారినడిగితే బాగుంటుంది’ అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. గురువారం సర్వజనాస్పత్రిలోని రోగులకందుతున్న సేవలపై విలేకరులడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందించారు. సర్వజనాస్పత్రిలోని సమస్యలను తనవంతుగా సీఎం చంద్రబాబు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కరువు జిల్లా ‘అనంత’లో మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో భ్రూణహత్యలు తగ్గుముఖం పట్టాయని, అందుకు సర్వజనాస్పత్రిలో జరిగే ప్రసవాలే ఉదాహరణ అన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రజల్లో చైతన్యం కల్గించేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తల్లీబిడ్డకు మెరుగైన వైద్యం అందించేందుకు పీజీ చేసిన గైనిక్, చిన్నపిల్లల, మెడిసిన్ వైద్యులు రెండేళ్ల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రస్తుతం కేటాయించిన పడకలు చాలడం లేదని, నూతన భవనాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అంతకుముందు ఆమె ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని గైనిక్, ఎస్ఎన్సీయూలను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. గైనిక్ వార్డులో ఓ మహిళ అప్పుడే పుట్టిన పాపను తీసుకురాగా... ఆ పాపను చేతుల్లోకి తీసుకున్న నన్నపనేని ‘అమరావతి’ అని నామకరణం చేశారు. చైర్పర్సన్ వెంట మహిళా కమిషన్ సభ్యురాలు పర్వీన్‌భాను, సర్వజనాస్పత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర రావు, ఆర్ఎంఓ డాక్టర్ లలిత, ఐసీడీఎస్ పీడీ వెంకటేశం, తదితరులున్నారు. -
‘భార్యా బాధితులే ఎక్కువ’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం భార్యా బాధితుల ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. మహిళా కమిషన్‌కు మహిళలపై జరిగే గృహహింస కేసుల కన్నా ‘భార్యా బాధితులవే’ ఎక్కువయ్యాయని ఆమె అన్నారు. అసెంబ్లీ లాబీల్లో శుక్రవారం ఆమె మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మహిళలపై గృహహింసకు సంబంధించి తమకు వస్తున్న ఫిర్యాదుల్లో కొన్ని తప్పుడు ఫిర్యాదులు కూడా ఉంటున్నాయని అన్నారు. తమపై కూడా తమ భార్యలు హింసకు దిగుతున్నారని, తమకు న్యాయం చేయాలంటూ పలువురు పురుషుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. తమది మహిళా కమిషన్ కనుక వాటిని స్వీకరించి విచారించే అధికారం తమకు లేదని చెబుతున్నా పలువురు తమ గోడు వెళ్లబోసుకొనేందుకు కమిషన్ వద్దకు వస్తున్నారన్నారు. తాము తిరస్కరిస్తున్న ఫిర్యాదులను తిరిగి వారి తల్లి ద్వారానో, చెల్లెల ద్వారా ఇప్పిస్తున్నారని తెలిపారు. తమ కుమారుడిని భార్య వేధిస్తోందని వారితో ఫిర్యాదులు చేయిస్తున్నారని చెప్పారు. మహిళల ద్వారా అందుతున్న ఆ ఫిర్యాదులను నిబంధనల ప్రకారం స్వీకరించి విచారిస్తున్నామని చెప్పారు. ఇటీవల ఓ మహిళ తమ కమిషన్‌ను కలసి తనను భర్త వేధిస్తున్నాడని, తన చేతులపై గాయాలు చేశారని చూపించింది. తాము ఫిర్యాదును స్వీకరించి విచారిస్తే ఆమె చేతులకు ఉన్న గాయాలను తనకు తాను గాజులను పగులగొట్టుకోవడం వల్ల అయ్యాయని తేలిందని నన్నపనేని రాజకుమారి తెలిపారు. తమకు మాత్రం తన భర్తే తన రెండు చేతులను కొట్టి గాయపర్చినట్లు ఆమె ఫిర్యాదు చేసిందన్నారు. అయితే ఆమె కుమార్తె స్వయంగా తన తల్లే గాజులు పగులగొట్టుకున్నట్లు తెలిపిందని వివరించారు. మరో కేసులో ఎన్ఆర్ఐ భర్త తనను వేధించాడని ఒక మహిళ ఫిర్యాదు చేసింది. కానీ, ప్రాథమిక విచారణ చేయించి కేసు పెట్టించామని, దాంతో అతను అరెస్టు అయ్యాడన్నారు. తరువాత లోతుగా విచారస్తే ఆమె వైపు నుంచే పొరపాట్లు ఉన్నాయని తెలిపారు. అయితే అప్పటికే అరెస్టు అవ్వడంతో ఆయన తిరిగి తన ఉద్యోగం చేస్తున్న దేశానికి వెళ్లే పరిస్థితి లేకుంగా పోయిందన్నారు. ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు కూడా అందుతున్న నేపథ్యంలో తాము గృహహింస కేసుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నన్నపనేని రాజకుమారి అభిప్రాయపడ్డారు. -
అత్యాచారాన్ని చిత్రీకరించిన వారిపై చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నంలో మతిస్థిమితం సరిగా లేని మహిళపై పట్టపగలు ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడుతుంటే అడ్డుకోవాల్సిందిపోయి సెల్ఫోన్లతో చిత్రీకరించినవారిపై చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. బుధవారం ఆమె ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపడానికి విశాఖ వెళ్లి పోలీస్ కమిషనర్‌తో మాట్లాడతానని చెప్పారు. మహిళలను విలన్లుగా చిత్రీకరించి, అసభ్యంగా చూపిస్తున్న టీవీ సీరియళ్లపై నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె ప్రధానికి, పలువురు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. సమావేశంలో ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు ఎన్.పర్వీన్ బాను పాల్గొన్నారు. -
ఆ పాస్టర్‌ను కఠినంగా శిక్షించండి
-
ఆ పాస్టర్‌ను కఠినంగా శిక్షించండి
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి): మాయమాటలతో మహిళలను మోసం చేస్తున్న పాస్టర్ ఎబినైజర్ను కఠినంగా శిక్షించాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పోలీసు అధికారులను కోరారు. తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురం గ్రామంలో బుధవారం రాజకుమారి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మద్దూరులో నివాసం ఉంటున్న ఎబినైజర్ ను తక్షణమే అరెస్ట్ చేసి అతని దగ్గర బందీలుగా ఉన్న మహిళలను విడిపించాలని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ను ఫోన్లో ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి తిరిగివచ్చిన అనంతరం ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం చేస్తానన్నారు. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎబినైజర్ పరారీలో ఉన్నాడు. -
మోసపోవడం వల్లే మహిళలు ఆత్మహత్యలు
గుంటూరు(నగరంపాలెం): క్యారెక్టర్ లేని వారితో స్నేహాలు, ఫేస్బుక్ పరిచయాల ద్వారా మోసపోవడం వల్లే విద్యార్థినులు, మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. మంగళవారం గుంటూరులోని మహిళా కమిషన్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకూ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులెవరూ యాజమాన్యం ఒత్తిడి వల్లే మరణిస్తున్నామంటూ సూసైడ్ నోట్ రాయలేదన్నారు. నారాయణ విద్యాసంస్థల్లో తరుచూ ఆత్మహత్యలు చోటుచేసుకోవడానికి కారణం.. అక్కడ ఎక్కువ మంది విద్యార్థులు చదవడమేనని చెప్పుకొచ్చారు. ఒత్తిడి ఉంటే చదువు మానేయాలే గానీ ఆత్మహత్య చేసుకోవడం సరికాదన్నారు. -
కనిగిరి ఘటన దురదృష్టకరం: నన్నపనేని
సాక్షి, అమరావతి : కనిగిరిలో అత్యాచారయత్నానికి గురైన యువతితో పాటు ఆమె తల్లిదండ్రుల్ని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, సీఎం చంద్రబాబు నాయుడి వద్దకు తీసుకువచ్చారు. సీఎంతో ఈ విషయంపై చర్చించిన అనంతరం విలేకరులతో రాజకుమారి మాట్లాడుతూ.. ఇటీవల కనిగిరిలో జరిగిన ఘటన ఈ దురదృష్టకర సంఘటన అని పేర్కొన్నారు. ముగ్గురు అబ్బాయిలు ఈ అత్యాచార చర్యకు పాల్పడ్డారని చెప్పారు. ఈ సంఘటన మూలాల సేకరణకై సీఎం ఆదేశించారని తెలిపారు. పథకం ప్రకారమే ఆ అమ్మాయిపై అత్యాచార యత్నం చేశారని వెల్లడించారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఘటనకు కారణమైన ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. బాధితురాలు చదువుకునేలా పూర్తి ఏర్పాట్లు చేస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. రూ.10 లక్షలు బ్యాంక్ డిపాజిట్, ఒక ఇల్లు, బాధితురాలు సహా ఆమె తమ్ముడి చదువుకయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఇలాంటి ఘటనలు ఎక్కడ పునరావృతం కాకుండా చట్టాలు కఠినతరం చెయ్యాలన్నారు. -
‘అయేషా దోషులకు శిక్ష పడేవరకు పోరాటం’
విజయవాడ: అయేషా మీరా కేసును రీ ఓపెన్ చేయడం ఊరట కలిగించింది. ఈ కేసులో అసలైన దోషులను పట్టుకోవడానికి ఇది మంచి అవకాశమని మహిళ కమిషన్ చైర్మెన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఆమె ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ కేసు విషయంలో ఆయేషా తల్లిదండ్రులకు ప్రభుత్వం, మహిళా కమిషన్ సపోర్టుగా ఉంటుంది. అసలైన దోషులకు శిక్ష పడేవరకు పోరాటం చేస్తామన్నారు. ఆనాడు పోలీసులు అసలు నిందితులను తప్పించి అమాయకుడైనా సత్యంబాబు జీవితాన్ని నాశనం చేశారని ఆమె అన్నారు. ఈ కేసులో విషయంలో సీపీ గౌతమ్ సవాంగ్ మొదట నుంచి వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా అలా మాట్లాడటం తగదని ఆమె తెలిపారు. ఈ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు కమిషనర్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షన వద్దని ఎవరైనా మంచి మహిళ అధికారిని నియమించాలన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఆయేషా హత్య కేసులో నిందితుడు సత్యంబాబును ఇటీవల హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అంతేకా అతడికి లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని తెలిపింది. కేసులో తగిన ఆధారాలు లేకుండా సత్యం బాబాను ఎనిమిదేళ్ల పాటు జైలు జీవితం అనుభవించాడు. పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం కూడా సత్యం బాబు నిర్దోషి అని, అసలు నిందితులైన కోనేరు రంగారావు బంధువులను వదిలిపెట్టి ఇతడిని ఇరికించారని అప్పట్లోనే తెలిపింది. ఈ విషయంపై సత్యం బాబు విడుదలైనా తరువాత సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పటి పరిస్థితుల్లో గత్యంతరం లేక నేరాన్ని అంగీకరించినట్టు చెప్పాడు. -
మళ్లీ అదే చెబుతున్నా: నన్నపనేని
అరసవిల్లి (శ్రీకాకుళం): ఆత్మ, మాన రక్షణ కోసం మహిళలు రోకలి బండైనా, కత్తినైనా ఆయుధంగా చేసుకొని మృగాళ్లను ఎదిరించాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి సూచించారు. శ్రీకాకు ళంలో గురువారం ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకీ అత్యాచారాలు పెరిగి పోతున్నాయని, వీటిని నియంత్రించేందుకు అన్ని విధాలు గా తమ కమిషన్ చర్యలు చేపడుతోందన్నారు. గతంలో తాను మహిళలకు కత్తులు వెంటబెట్టుకొని వెళ్లండని చెప్పడంపై కొందరు విమర్శలు గుప్పించారని, అయినా తాను మళ్లీ అదే విషయాన్ని గట్టిగా చెబుతున్నానన్నారు. ప్రస్తుతం అన్ని వర్గాలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్న సెల్ఫోన్లు, ఇంటర్నెట్లపై నియంత్రణ అవసరం అని, దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు. ఇక సినిమాల్లో లాగానే టీవీ సీరియళ్లకూ సెన్సార్ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇక రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల చింతపల్లి ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేశారని, మరో ఇద్దరిని కూడా వెంటాడుతామని స్పష్టం చేశారు. -
కళాకారుల్లోని ప్రతిభను గుర్తించాలి
► రాష్ట్ర మహిళా కమిషన్ చైన్పర్సన్ నన్నపనేని రాజకుమారి ► పలువురికి ఎన్టీఆర్ పురస్కారాల ప్రదానం విజయవాడ కల్చరల్: కళాకారులలోని ప్రతిభను గుర్తించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైన్ పర్సన్ నన్నపనేని రాజకుమారి సూచించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఎన్టీఆర్ పురస్కారాల సభను శ్రీసోమనాథ కల్చరల్ ఆర్ట్స్, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, దేశికా ఆర్ట్స్, అక్కినేని ఫౌండేషన్ సంస్థలు దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నిర్వహించాయి. ముఖ్య అతిథి రాజకుమారి మాట్లాడుతూ సాంస్కృతిక సంస్థలు కళాకారులలోని ప్రతిభను ప్రోత్సహించాలని సూచించారు. శాసనసభ్యుడు గద్దే రామ్మోహనరావు మాట్లాడుతూ సుదీర్ఘకాలం సినీ రంగంలో అద్భుతాలు సృష్టించిన ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సభకు సీనియర్ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు అధ్యక్షత వహించారు. రీకనక దుర్గాసేవాసమితి వ్యవస్థాపకుడు కోగంటి సత్యం, దేశికా ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు మాసాబత్తుల శ్రీనివాస్, విద్యావేత్త డాక్టర్ ఎంసీ.దాస్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అచ్చిరెడ్డి, సినీనటులు(లవకుశ ఫేమ్) నాగరాజు, నాగ సుబ్రహ్మమణ్యం, కొమ్మినేని భావన్నారాయణ, ప్రభల శ్రీనివాస్, తల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, శింగంశెట్టి పెదబ్రహ్మం, మల్లాది రామకృష్ణ, అల్లూరి సత్యనారాయణరాజు, వెలిశెట్టి వెంకటేశ్వర్లు, మిమిక్రీ కళాకారుడు చందు, చప్పిడి సత్యనారాయణ తదితరులకు ఎన్టీఆర్ పురస్కారాలను ప్రదానం చేశారు. ఘంటసాల పవన్‌కుమార్ బృందం కూచిపూడి అంశాలను, మధిర రోజా ప్రసన్న ఈల ద్వారా పలు తెలుగు, హిందీ చిత్రగీతాలను ఆలపించారు. చందు మిమిక్రీతోనూ, ఆదినారాయణ శాస్త్రి పద్యాలతోనూ అలరించారు. కార్యక్రమాలను శ్రీసోమనాథ్ కల్చరల్ ఆర్ట్స్ వ్యవస్థాపకులు బోలిశెట్టి రాధాకృష్ణ పర్యవేక్షించారు. -
గుత్తా జిగేల్
శోభాయమానంగా సిల్క్‌మార్క్ పోటీలు సంప్రదాయాలకు పట్టం కట్టి నిర్వహణ నన్నపనేనికి జీవన సాఫల్య పురస్కారం క్రీడాకారిణి గుత్తా జ్వాల, గాయని సునీతలకు అవార్డులు విశాఖ–కల్చరల్ : పట్టుచీరల మిలమిలలు.. అలంకరణల కళకళలు.. హŸయల తళతళలు.. చూపరులను మంత్రముగ్థులను చేసే ముద్ద మందారాల.. స్నిగ్థ సింగారాల సోయగాలు. ఇవీ ‘వైజాగ్ శ్రీమతి సిల్క్ మార్క్’ పోటీల వేదికపై ఆవిష్కతమైన సౌందర్యాల సరాగాలు. సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సాగిన కార్యక్రమంలో విరబూసిన సొగసులే కాదు.. వారి విభిన్న ప్రతిభా విశేషాలు వేదికపై తళుక్కుమన్నాయి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వి–టీమ్ సంస్థ వుడా చిల్డ్రన్స్ థియేటర్లో ఆదివారం రాత్రి నిర్వహించిన మార్వ్లస్ మహిళ–2017 కార్యక్రమంలో భాగంగా జరిగిన పోటీలు అతివల బాహ్య, అంతర్గత సొగసులకు, వ్యక్తిత్వానికి, ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టాయి. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన మహిళలకు ఇచ్చిన పురస్కారాలు వారి సత్తాను చాటాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ప్రారంభించిన ఈ కార్యక్రమం కనులవిందుగా సాగింది. మొదట నన్నపనేని రాజకుమారికి మంత్రి గంటా జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. విభిన్న రంగాలలో స్ఫూర్తి ప్రదాతలైన మహిళలకూ ఆయన పురస్కారాలను అందజేశారు. సుప్రసిద్ద బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలను అత్యంత ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి బిరుదుతో, ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని సునీతను లతామంగేష్కర్ స్వీట్ వాయిస్ అవార్డుతో సత్కరించారు. ముగ్థ మందారాలు వివాహిత మహిళలకు నిర్వహించిన వైజాగ్ శ్రీమతి సిల్క్‌మార్క్ పోటీ నేత్రపర్వంగా సాగింది. గత ఆదివారం వుడా సెంట్రల్ పార్కులో నిర్వహించిన వడపోత ద్వారా 65 మందిని ఎంపిక చేసి వారికి తుది పోటీ నిర్వహించి మళ్లీ 25మందిని ఎంపిక చేశారు. వీరి నుంచి ఫైనల్ విజేతను నిర్ణయించారు. శ్రీమతి వైజాగ్ సిల్క్ మార్క్ విజేతలకు, ఫైనల్లో తలబడిన మహిళలకు నన్నపనేని రాజకుమారి, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ తార జ్వాలా గుత్తా, సినీ నేపథ్య గాయని సునీత, కలెక్టర్ సతీమణి శోభనాస్మతి, వీరుమామ బహుమతులు అందించారు. మెజిషియన్ రవిశంకర్ ఫ్లాష్ యాక్ట్ ప్రతిభ సంభ్రమాశ్చర్యాలు కలిగించింది. -
మహిళలపై వేధింపులు సహించం
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి నరసరావుపేట టౌన్: సమాజంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా అకృత్యాలు పెచ్చరిల్లుతున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపునేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ‘కూతురిపై తండ్రి అఘాయిత్యం’ అన్న శీర్షికన ఇటీవల పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించి శనివారం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు వచ్చి బాధితురాలిని పరామర్శించారు. మహిళలను వేధించినా, వారిపై అఘాయిత్యాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుడికి బెయిలు ఇవ్వడం సమంజసం కాదన్నారు. రాజకీయంగా సిఫారసులు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు ఆమె వివరించారు. బాలికల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బాధితురాలు చదువుకుంటానంటే ఆమెను గుంటూరులోని బాలికా సంరక్షణ గృహంలో ఉంచి చదివిస్తామన్నారు. గ్రామాల్లో కౌన్సెలింగ్ సెంటర్లు, సెమినార్లు నిర్వహించి మహిళలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట డ్వామా పీడీ సుఖజీవన్‌బాబు, సీడీపీవో స్వర్ణలక్ష్మి, ఎఎల్డీపీవో నాగకోటేశ్వరరావు, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ మోహనశేషు ప్రసాద్ ఉన్నారు. -
నన్నపనేని కారు ఢీ : వ్యక్తికి తీవ్ర గాయాలు
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్, టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ప్రయాణిస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు, బాధితుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నందివెలుగు రోడ్డులోని బాలాజీ నగర్లో నివసించే బసవయ్య, ధనలక్ష్మిల కుమారుడు అన్నం గరటయ్య (27) బీఏటీ పొగాకు కంపెనీలో ముఠా పనిచేసి జీవనం సాగిస్తుంటాడు. నెల రోజుల క్రితం తమ్ముడు అనారోగ్యంతో మృతిచెందడం, తండ్రి పక్షవాతంతో మంచంలో ఉండడంతో తల్లికి సహాయంగా ఇంటి వద్దే ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం ఇంట్లోని గేదెలకు దాణా తెచ్చేందుకు ద్విచక్రవాహనంపై తక్కెళ్లపాడు బయలుదేరాడు. తక్కెళ్లపాడు వైపు నుంచి రాజకుమారి ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ముందు వెళ్తున్న ఆటోను ఓవర్టేక్ చేసి అతి వేగం కారణంగా అదుపుతప్పి రోడ్డుకు కుడి వైపు వచ్చి గరటయ్య ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో గరటయ్య తీవ్ర గాయాలపాలయ్యాడు. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడం వలన కారులోని వారంతా క్షేమంగా బయటపడ్డారు. వెంటనే గమనించిన స్థానికులు గరటయ్యను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో పీజీ విద్యార్థులే గరటయ్యకు వైద్యం చేస్తుండడం.. ప్రత్యేక విభాగం వైద్యులు ఎవరూ పట్టించుకోకపోవడంతో బంధువులు ఆందోళనకు దిగారు. నన్నపనేని రాజకుమారి కనీసం ఫోన్లోనైనా పరామర్శించకపోవడంపై బంధువులు నిరసనకు దిగారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆస్పత్రికి వచ్చి వైద్యులతో చర్చించారు. అనంతరం అతన్ని ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని ఎమ్మెల్యే సూచించారు. -
మహిళల హక్కులు పరిరక్షించాలి
అనంతపురం టౌన్ : మహిళల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. గురువారం అనంతపురం శివారులో మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటైన ఉజ్వల హోంను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అత్యాచారం, వేధింపులు, బాల్య వివాహాలు తదితర కారణాలతో ఆశ్రయం పొందుతున్న బాధితులతో మాట్లాడారు. స్వయం ఉపాధి శిక్షణపై ఆరా తీశారు. బాధితులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. చట్టంలో ఉన్న కొన్ని లొసుగుల వల్ల మహిళలకు అన్యాయం జరిగిన సంఘటనల్లో నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి బెయిల్ మంజూరు చేయకుండా సామాజికంగా వారికి శిక్ష విధించాలన్నారు. -
నేడు నన్నపనేని రాక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి గురువారం అనంతపురానికి రానున్నారు. బంధువుల ఇంట జరగనున్న వివాహానికి విచ్చేస్తున్న ఆమె, శుక్రవారం మధ్యాహ్నం డీఎంఏ హాలులో జరిగే మహిళా సాధికారత సదస్సులో పాల్గొననున్నారు. ఆమెతో పాటు ఐసీడీఎస్ అధికారులు, మహిళలు కూడా సదస్సులో పాల్గొంటారు. -
నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది
గుంటూరు (నగరంపాలెం) : రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన తర్వాత కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులు వైదొలిగినా తప్పు లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్ పార్టీ మట్టికొట్టుకు పోతే విభజనలో బాగస్వామి అయిన బీజేపీ నవ్యాంధ్ర ప్రజల ఆశలపై నీళ్లు జల్లాలని చూస్తే సహించేది లేదన్నారు. నిధులు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. -
నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది
గుంటూరు (నగరంపాలెం) : రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన తర్వాత కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులు వైదొలిగినా తప్పు లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్ పార్టీ మట్టికొట్టుకు పోతే విభజనలో బాగస్వామి అయిన బీజేపీ నవ్యాంధ్ర ప్రజల ఆశలపై నీళ్లు జల్లాలని చూస్తే సహించేది లేదన్నారు. నిధులు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. -
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నన్నపనేని
గుంటూరు: టీడీపీ సీనియర్ నాయకురాలు, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. హోంమంత్రి చినరాజప్ప మంగళవారం ఆమెను పరామర్శించారు. ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నన్నపనేని త్వరగా కోలుకోవాలని చినరాజప్ప ఆకాంక్షించారు. కాగా శ్వాసకు సంబంధించిన సమస్యతో నన్నపనేని బాధపడుతున్నారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది ఉంది. -
లైంగికదాడి యత్నంపై నన్నపనేని విచారణ
వేగివాడ(పెదవేగి రూరల్) : వేగివాడలో ముగ్గురు చిన్నారులపై ఓ వ్యక్తి లైంగికదాడికి యత్నించిన ఘటనపై మహిళా కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి జిల్లా స్త్రీశిశు సంక్షేమశాఖ అధికారుల సమక్షంలో గురువారం విచారణ చేపట్టారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా నిందితుని వికృతచేష్టలు వెలుగుచూశాయి. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. వేగివాడ ఎస్సీకాలనీలో కడిమి మరియన్న అలియాస్ (ఠాగూర్) ఈనెల 23న మంగళవారం ఓ చిన్నారిని సీఎస్ఐ చర్చి వెనుకవైపునకు తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆ చిన్నారి కేకలు వేస్తూ పారిపోయింది. అదేరోజు మధ్యాహ్నం మూడో తరగతి చదువుతున్న మరో చిన్నారిపై అఘాయిత్యానికి యత్నించాడు. బట్టలు తీసి ఫొటోలు తీస్తుండగా, ఆ చిన్నారి కేకలు వేస్తూ పారిపోయింది. పొద్దున్నే కూలిపనికి వెళ్లి సాయంత్రం వచ్చిన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఠాగూర్ వికృతచేష్టలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఇద్దరిలానే ఈనెల 21న మరో బాలికపైనా మొక్కజొన్నతోటలోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడని, దుస్తులు తీసివేసి వికృతచేష్టలకు పాల్పడ్డాడని బాధితులు విమర్శించారు. ఎవరికైనా చెబితే చంపేస్తానని ఈ ముగ్గురు చిన్నారులను భయపెట్టాడని బాధితులు నన్నపనేనికి వివరించారు. వివరాలన్నీ సావధానంగా విన్న నన్నపనేని కంటతడిపెట్టారు. అనంతరం బాధిత చిన్నారులు, వారి తల్లిదండ్రులతో రహస్యంగా మాట్లాడారు. ఎస్సై వి.రామకోటేశ్వరరావు ఘటనా ప్రదేశాలను పరిశీలించారు. కార్యక్రమంలో మహిళా స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆర్జేడీ ఆర్.సూఈజ్, పీడీ జి.చంద్రశేఖర్, తహశీల్దార్ ఎం.ఇందిరాంగాంధీ, పెదపాడు ప్రాజెక్టు సీడీపీవో పి.హానుశ్రీ, ఏలూరు అర్బన్ సీడీపీవో జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నన్నపనేని విలేకరులతో మాట్లాడుతూ.. నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత పిల్లలను హోమ్‌లో పెట్టి చదివించాలని, ఇందులో ఓ పాపకు తండ్రి చనిపోయాడని, ఆమె తల్లికి జీవోనోపాధి మార్గం చూపిస్తామని వివరించారు. చిన్నారులకు ఇన్ఫెక్షన్ సోకకుండా వైద్యపరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్టు వివరించారు. -
మహిళల్లో మనోధైర్యమే నా కర్తవ్యం
* ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి * నేడు చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ తెనాలి : మహిళల్లో మనోధైర్యం నింపడ మే నా కర్తవ్యమని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియ మితులైన నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా మహిళల సమస్యలపై పనిచేస్తానని ‘సాక్షి’కి ఇచ్చి న ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. మహిళలపై దురాచారాలకు పాల్పడేవారికి గుణపాఠం చెప్పేలా వ్యవహరిస్తా. ఇందుకోసం పరిశ్రమలు, వ్యవసాయం, గ్రామాలు, మురికివాడల్లోని మహిళల స్థితిగతులపై అధ్యయనం చేస్తా. పేదలపై వేధింపులే కాదు, పబ్‌లు, పార్టీల పేరుతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న సంపన్న కుటుంబాల్లోని వ్యక్తుల గురించి మా దృష్టికి వస్తే చర్యలు తప్పవు. వరకట్నం, గృహహింస కేసుల్లో గుడ్డిగా కాకుండా ఆచితూచి పరిశీలన చేయాలని భావిస్తున్నా. అన్ని కోణాల్లోనూ విచారించి ప్రలోభాలకు లోబడి, డబ్బుకాశపడి లేదా కక్షసాధింపు కోసం అమాయకులపై ఫిర్యాదులు చేస్తే మద్దతు పలకను. సమస్యలు-పరిష్కారాలపై మహిళలకు అవగాహన కల్పించేందుకు ముం దుగా రాష్ట్రవ్యాప్తంగా సదస్సుల నిర్వహించాలని ఆలోచిస్తున్నా. మార్చిలో విజయవాడలో భారీసదస్సు ఏర్పాటుచేసి, సీఎంను ఆహ్వానించాలనుకున్నా. తర్వాత జిల్లాలవారీగా సదస్సులు పెట్టి, మండలాలకు విస్తరించాలనుకుంటున్నా. వివిధ అంశాలపై మహిళలకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నా. -
ఎన్జీ రంగా పాఠాలే పెద్ద బాలశిక్ష
తమిళనాడు గవర్నర్ రోశయ్య తెనాలి : ఆచార్య ఎన్జీ రంగా పాఠాలే రాజకీయంగా తనకు పెద్ద బాలశిక్ష అని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య చెప్పారు. ప్రఖ్యాత పార్లమెంటేరియన్, రైతునాయకుడు ఆచార్య ఎన్జీ రంగా స్మారక అవార్డును ఆదివారం సాయంత్రం హోటల్ గౌతమ్ గ్రాండ్ హోటల్లో జరిగిన ప్రత్యేక సభలో కొణిజేటి రోశయ్యకు శాసనమండలి చైర్మన్ చక్రపాణి చేతుల మీదుగా బహూకరించారు. నన్నపనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు ట్రస్ట్ నిర్వాహకురాలు, శాసనమండలి మాజీ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి స్వాగతం పలికారు. రోశయ్య మాట్లాడుతూ రాజకీయాల్లో తన వాక్పటిమ రంగా రాజకీయ పాఠశాలలో అలవడిందేగానీ, ఏ పండితుల శిక్షణలోనూ అభ్యాసం చేసింది కాదన్నారు. అందరూ ఆపాదిస్తున్న ఘనతకు తాను అర్హుడిని కాదని చెబుతూ, రంగాగారు, నాకు మార్గదర్శకులైన పెద్దలకే ఆ ఔన్నత్యం దక్కాలన్నారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ చట్టసభల గౌరవాన్ని కాపాడిన రోశయ్య నుంచి, రాష్ట్ర శాసనమండలి కార్యక్రమాల పద్ధతి, పాటించాల్సిన సంప్రదాయాలను అలవరచుకొన్నట్టు చెప్పారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రైతాంగ ఉద్యమ నిర్మాత ఎన్జీ రంగా సాహసోపేతమైన నేతగా చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, పొన్నూరు చైర్పర్సన్ సజ్జా హైమావతి, మాజీ ఎంపీ సింగం బసవపున్నయ్య, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు. స్వాతంత్య్రయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య, ఏఎస్ఎన్ విద్యాసంస్థల అధిపతి అన్నాబత్తుని శివకుమార్, జడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి, మాజీ చైర్పర్సన్ ఆలమూరి విజయలక్ష్మి, మాణిక్యవేల్, ట్రస్ట్ ప్రతినిధులు కొసరాజు వెంకట్రాయుడు, ఆలపాటి మాధవరావు, జెట్టి అంకినీడు, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, అయినాల మల్లేశ్వరరావు మాట్లాడారు. -
తహశీల్దార్‌పై దాడిని ఎవరూ సమర్థించరు
నన్నపనేని రాజకుమారి తిరుమల: కృష్ణా జిల్లాలో మహిళా తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేయడాన్ని ఎవరూ సమర్థించరని శాసనమండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు. శుక్రవారం ఆమె తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ దాడి చేయడం మంచి పద్ధతి కాదని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ విచారం వ్యక్తం చేశారు. గతంలో తనపై కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు వస్తుంటాయన్నారు. ఈ ఘటనపై తాను కూడా వ్యక్తిగతంగా క్షమాపణ చెబుతున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు. రాష్ట్ర నూతన రాజధాని అమరావతి త్వరగా పూర్తి కావాలని కోరుకున్నానన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా టీటీడీ తనవంతుగా సంపూర్ణం సహకారం అందిస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండేలా చూడాలని శ్రీవారిని కోరుకున్నానని చెప్పారు. -
హాయ్..నేను జ్యోతిలక్ష్మిని..
తాను ఎక్కడికి వెళ్లినా జ్యోతిలక్ష్మి వచ్చిందంటున్నారని, ఇది తనకెంతో ఆనందంగా ఉందని కథానాయిక చార్మి పేర్కొన్నారు. బుధవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హల్లో వంశీ ఇంటర్నేషనల్-వంశీ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ‘ జ్యోతిలక్ష్మీ’ చిత్ర యూనిట్‌కు అభినందన సభ నిర్వహించారు. ఇందులో హీరోయిన్ చార్మి మాట్లాడుతూ.. మహిళలను తోటి మహిళ గౌరవించే సంస్కృతి వస్తే మిగతా వారు గౌరవిస్తారన్నారు. పురుషుడి అండ ఉంటే మరింత ప్రగతి సాధిస్తారన్నారు. ఈ సందర్భంగా చార్మి, హీరో సత్య, చిత్ర బృందంపై పూలవాన కురిపించారు. నిర్మాత సి.కల్యాణ్, సమాచార హక్కు చట్టం కమిషనర్ పి. విజయబాబు, టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి, రచయిత్రి కేబీ లక్ష్మి, జీవీఎల్ఎన్ రాజు, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్, వంశీ సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ తెన్నేటి సుధాదేవి, ప్రధాన కార్యదర్శి సుంకరపల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు. - సాక్షి,సిటీబ్యూరో -
మేమేంటో చూపిస్తాం : నన్నపనేని
-
రాయపూడి రైతుల తిరుగుబాటు
మంత్రివర్గ ఉప సంఘాన్ని అడ్డుకున్న అన్నదాతలు తుళ్ళూరు : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలో శనివారం రైతుల అభిప్రాయ సేకరణకు ఏర్పాటు చేసిన సమావేశం రణరంగంగా మారింది. రాజధానికోసం భూములు ఇచ్చేది లేదంటూ రైతులంతా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తొలుత సమావేశంలో రాజధాని ఏర్పాటు ఆవశ్యకతను, అందుకు భూములు ఇవ్వాల్సిన అవసరాన్ని రైతులకు వివరించారు. అనంతరం శాసనమండలిలో ప్రభుత్వ విప్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతుండగా ప్రసంగం మధ్యలోనే రైతులు ఆందోళనకు దిగారు. ప్రసంగాలు వినటానికి తాము రాలేదని, నెలల తరబడి ప్రభుత్వం చేస్తున్న రోజుకో వాగ్దానం.. పూటకో ప్రకటనవల్ల తామంతా హడలెత్తిపోతున్నామని, నిద్రాహారాలు మాని కుటుంబసమేతంగా రోదిస్తున్నామని, తమ గోడు వినాలని రైతులు ఆందోళనకు దిగారు. దీనికి శాసనసభ్యుడు శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ... రైతుల వేదన వినటానికే వచ్చానని, మాట్లాడే వారి పేర్లు తహశీల్దారుకు చెప్తే ఆర్డర్లో పిలుస్తానని చెప్పారు. ఈ లోగా ఓరైతు ఏది చెప్పినా ప్రభుత్వానికి భూములు ఇవ్వమని చెప్పడంతో పోలీసులు సభావేదికపై నుంచి నెట్టివేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు మాట్లాడేందుకు వచ్చిన రైతులపై దౌర్జన్యం చేస్తారా? అంటూ ఆగ్రహిస్తూ కుర్చీలను విరగ్గొట్టి ఆందోళనకు దిగారు. మాట్లాడేందుకు వచ్చిన రైతుల గొంతులు నులుముతారా? మీ ప్రసంగాలు, మీకు అనుకూలంగా ఉన్నవారి మాటలు మాత్రమే వింటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ చిన్న గ్రామంలో రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇంతమంది పోలీసులతో రావాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. రైతుల గోడు వినటానికి వచ్చే అధికారులు మేళతాళాలతో, భాజభజంత్రీలతో రావడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కార్యక్రమం నిర్వహిస్తున్న తీరుకు నిరసనగా కొంతమంది రైతులు విజయవాడ-అమరావతి కాలచక్ర రహదారిపై బైఠాయించారు. అనంతరం భూములు ఇవ్వబోమంటూ రాయపూడి గ్రామ రైతులు చేసిన తీర్మాన ప్రతులను ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు ఇచ్చి, స్వీకరించినట్లు సంతకాలు పెట్టించుకున్నారు. -
నన్నపనేనిని వరించనున్న పదవి
హైదరాబాద్: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసన మండలి చీఫ్ విప్‌గా నన్నపనేని రాజకుమారిని నియమించనున్నారు. మండలి విప్‌గా అంగర రామమోహన్ను నియమించనున్నారు. రాజకుమారి గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందినవారు కాగా, రామమోహన్ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందినవారు. వీరిద్దరూ టిడిపిలో సీనియర్ నాయకులే. ** -
కన్నాకు బుల్లెట్ ప్రూఫ్ కారు తొలగింపు
-
కన్నాకు బుల్లెట్ ప్రూఫ్ కారు తొలగింపు
గుంటూరు : మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కుదించింది. మొత్తం 39మంది గన్మెన్లను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు బుల్లెట్ ప్రూఫ్ కారు తొలగించింది. కాగా టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారికి మాత్రం ప్రస్తుతం ముగ్గురు గన్మెన్లు ఉండగా, మరో గన్‌మెన్‌ను ప్రభుత్వం కేటాయించటం గమనార్హం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావుకు ఎస్కార్ట్ తొలగించింది. దీనికి నిరసనగా ఆయన గన్మెన్లను నిరాకరించారు. -
YSRCP నేత లతీష్ రెడ్డికి గాయాలు
-
కారు బోల్తా, నన్నపనేని అల్లుడికి గాయాలు
హైదరాబాద్ : హైదరాబాద్ కొత్తగూడ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నన్నపనేని సుధా భర్త లతీష్ రెడ్డి గాయపడ్డారు. కారు అదుపు తప్పి బ్రిడ్జిని ఢీకొని పైనుంచి కిందకు పడిపోయింది. లతీష్ రెడ్డి విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం సమీప ప్రయివేటు ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్ కూడా గాయపడ్డాడు. నన్నపనేని సుధా...టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కుమార్తె. ప్రమాద వార్త తెలుసుకున్న నన్నపనేని హుటాహుటీన ఆస్పత్రికి వెళ్లారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చిరునవ్వు ఆమెకో వరం
శోభా నాగిరెడ్డి నా కోడలు. శోభా నాగి రెడ్డితో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు. శోభ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. నేను 1983లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సమ యంలో శోభ తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి కర్నూలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్. ఆయనే ‘మీ అత్త’ అంటూ నన్ను శోభకు పరి చయం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నేను ఎక్కడ కనిపించినా అత్తయ్యా బాగున్నారా అని ఆత్మీయంగా పలకరించేది. నా భర్త గురించి అడిగేది. సుబ్బారెడ్డి 1989లో కాం గ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అపుడు నేను కూడా ఎమ్మెల్యేనే. శోభ భర్త భూమా నాగిరెడ్డి, బావ వీర శేఖరరెడ్డి కూడా నాతో పాటు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. దీంతో శోభతో సాన్నిహిత్యం మరింత పెరి గింది. ఆ తరువాత నేను టీడీపీలో చేరాను. అప్పటి నుంచి మరింత సన్నిహితంగా మెలిగే వాళ్లం. శోభ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. నేను తెలు గుమహిళ అధ్యక్షురాలిగా పనిచేశాను. ఈ సమయంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చేపట్టాల్సిన ఆందోళన కార్యక్ర మాలు, ప్రభుత్వ పరంగా మహిళల సంక్షే మం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చిం చుకునే వాళ్లం. శోభా నాగిరెడ్డి అక్క కుమార్తె, ప్రస్తుతం గుంటూరు జిల్లా వినుకొండ అసెం బ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా కుమార్తె నన్నపనేని సుధ బెంగళూరు వైద్య కళాశాలలో సహధ్యాయులు. ఈ విధంగా కూడా మా మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది. నేను నిర్వహించే ప్రతి ఎగ్జిబిషన్‌కు శోభ హాజర య్యేది. రాజకీయాల్లోకి మహి ళలు రావటం తక్కువ. వచ్చినా రాణించిన వారు ఇంకా తక్కువ. ఇక రాయలసీమలో మహిళలు రాజకీయాల్లో రాణించటమంటే కత్తిమీద సామే. అలాంటిది శోభ బాగా రాణించింది. ఆమెది కష్టపడే తత్వం. మంచి వక్తగా పేరు తెచ్చుకుంది. ఎపుడూ నవ్వుతూ, సంప్రదాయబద్ధంగా కనపడేది. చిరునవ్వే శోభకు వరం. స్నేహానికి ప్రాణమిచ్చేది. శోభ మరణం బాధాకరం. (వ్యాసకర్త ఎమ్మెల్సీ) -
బీజేపీతో పొత్తా...అయితే మేం ఒప్పకోం
రానున్న ఎన్నికలలో బీజేపీతో పొత్తును టీడీపీలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొంత మంది సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చిన బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకుంటామంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని ఆ పార్టీలోని సీనియర్ నాయకులు నన్నపనేని రాజకుమారి, కోడెల శివప్రసాద్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణకు అనుకూలంగా రెండు సార్లు లేఖలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ పలు ఇబ్బందుల్లో పడిందని,అట్లాంటి పార్టీ మళ్లీ విభజనకు సహకరించిన బీజేపీతో పొత్తు అంటే మరిన్ని కష్టాలు కొని తెచ్చుకోవడమే అని ఆ సదరు నేతలు చంద్రబాబుకు తలంటినట్లు తెలిసింది. బీజేపీతో పొత్తు పెట్టుకునే క్రమంలో...ప్రజలకు మనం ఏలాంటి సందేశం ఇస్తున్నామో ఓ సారి సమీక్షించుకోవాలని ఆ ముగ్గురు నేతలు చంద్రబాబుకు హితవుపలికారు. బీజేపీతో టీడీపీ పొత్తు తమకు సుతరాము ఇష్టం లేదని నన్నపనేని, కోడెల, సోమిరెడ్డిలు చంద్రబాబు వద్ద కుండబద్దలు కోట్టినట్లు సమాచారం. -
సీమాంధ్రులు... క్షమించండి: నన్నపనేని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు చేసిన 'సమైక్యాంధ్ర పోరాటం'లో టీడీపీ ఓడిపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకురాలిగా సీమాంధ్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానంలో తమ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర విభజన వద్దని తమ పార్టీ కొనసాగించిన పోరాటాన్ని ఆమె ఈ సందర్భంగా విశదీకరించారు. విభజన బిల్లు తప్పులు తడఖ అని అటు విధాన సభ, ఇటు విధాన మండలి రాష్ట్రపతికి తిప్పి పంపామని, అయిన పార్లమెంట్ ఉభయ సభలలో ఆ బిల్లు ఆమోదం పొందిందని ఈ సందర్భంగా నన్నపనేని కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిపై నిప్పులు చెరిగారు. -
'సోనియాతో చేతులు కలిపిన సుష్మా'
న్యూఢిల్లీ: సుష్మా స్వరాజ్‌ను లోక్‌సభ ప్రతిపక్ష నేత హోదా నుంచి తొలగించాలని టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లుకు 'చిన్నమ్మ' మద్దతు తెలపడాన్ని ఆమె తప్పుబట్టారు. సోనియా-సుష్మా చీకటి ఒప్పందంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలన్నారు. మూటలు తీసుకుని, మాటలు కలిపి సీమాంధ్రను ముంచుతారా అని ప్రశ్నించారు. సోనియా గాంధీ ప్రధాని అయితే గుండు గీయించుకుంటానన్న సుష్మా ఇప్పుడు ఆమెతో ఎందుకు చేతులు కలిపారని అడిగారు. సుష్మా స్వరాజ్.. ఏ విధమైన ప్రలోభాలకు లోనయ్యారో బీజేపీ విచారణ జరపాలని సూచించారు. -
రెండో రోజూ నన్నపనేని దీక్ష
టీడీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల సంఘీభావం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టవద్దన్న డిమాండ్‌తో టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి చేపట్టిన 48 గంటల దీక్ష బుధవారం రెండో రోజు శాసనమండలి ఆవరణలో కొనసాగింది. మంగళవారం అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయంలో దీక్ష మొదలుపెట్టిన ఆమెను రాత్రికి పోలీసులు బలవంతంగా ఇంటికి తరలించినప్పటికీ, తిరిగి బుధవారం ఉదయం టీడీఎల్పీ కార్యాలయంలో దీక్షకు కూర్చున్నారు. దీక్ష స్థలం నుంచే మండలి సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే వాయిదాపడడంతో మీడియాపాయింట్‌కు వచ్చి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విషయంలో కేంద్రం వైఖరిని తప్పుపట్టారు. తర్వాత తిరిగి మండలి ప్రవేశ ద్వారం దగ్గర దీక్ష మొదలుపెట్టారు. దీక్షకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, ఆదిరెడ్డి అప్పారావు, నారాయణరెడ్డి, తిప్పారెడ్డి సంఘీభావం తెలిపారు. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నన్నపనేనికి మద్దతుగా కొద్దిసేపు దీక్షలో కూర్చున్నారు. కాగా మండలి సమావేశాలు వాయిదా పడిన తరువాత నన్నపనేనిని పోలీసులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. -
నిమ్స్‌కు నన్నపనేని
హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ రెండో రోజు దీక్ష చేపట్టిన టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆరోగ్యం క్షీణించటంతో ఆమెను నిమ్స్‌కు తరలించారు. నన్నపనేని బీపీ లెవల్స్ తగ్గటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ నన్నపనేని రాజకుమారి శాసనసభ ఆవరణలోని టిడిఎల్పి కార్యాలయం ఎదుట మంగళవారం సాయంత్రం మెరుపు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. విభజన అంశంపై మీడియాతో మాట్లాడతానని ఆహ్వానించిన నన్నపనేని, అకస్మాత్తుగా విభజనను నిరసిస్తూ 48 గంటల దీక్ష చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న పోలీసులు నన్నపనేనిని అదుపులోకి తీసుకుని ఆమె ఇంటి వద్ద వదిలేసారు. అయితే పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసినప్పటికీ నన్నపనేని పట్టు వీడలేదు. బుధవారం ఉదయం అసెంబ్లీలోని టీడీఎల్పీలో మరోసారి దీక్ష చేపట్టారు. రాష్ట్ర శాసనసభ, శాసన మండలి తిరస్కరించిన విభజన బిల్లును రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ తిరస్కరిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న సీమాంధ్ర ప్రజల ఆశలను అడియాశలు చేసారని ఆమె విమర్శించారు. -
మరోసారి కంటతడి పెట్టిన నన్నపనేని
హైదరాబాద్ : తెలుగుదేశం ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మరోసారి కంటతడి పెట్టుకున్నారు. విభజన బిల్లుపై చర్చించేందుకు మరింత సమయం ఇవ్వాలని రాష్ట్రపతిని కోరుతూ ఆమె గురువారమిక్కడ కన్నీరుమున్నీరయ్యారు. రాష్ట్రం విడిపోయే పరిస్థితులు దాపురించినా...సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు ఎక్కడున్నారంటూ నన్నపనేని శాపనార్థాలు పెట్టారు. తెలంగాణ ప్రాంత నేతలను చూసి అయినా నేర్చుకోవాలని హితవు పలికారు. కోట్లాది తెలుగు ప్రజలను విభజించటం అన్యాయమని అన్నారు. అంతకు ముందు శాసనమండలిలో రెండు ప్రాంతాలకు చెందిన సభ్యులు పోటాపోటీగా ఆందోళనకు దిగారు. బిల్లుపై ఓటింగ్ వద్దంటూ తెలంగాణ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. సభను సజావుగా సాగేందుకు వీలుగా మండలి చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఏసీలో తమకు ప్రాతినిధ్యంలేదంటూ వారంతా నిరసనలు చేపట్టారు. కౌన్సిల్ ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. సభ్యులు పెద్ద ఎత్తున తెలంగాణ నినాదాలు చేశారు. దీనికి దీటుగా సీమాంధ్ర ఎమ్మెల్సీలు కూడా ఆందోళనకు దిగారు. సమైక్యంధ్రా తీర్మానం ప్రవేశపెట్టాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారి కౌన్సిల్ ప్రధాన ద్వారం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో సభ వాయిదా పడింది. అనంతరం సి.రామచంద్రయ్య ఇచ్చిన తీర్మానం నోటీసును మండలి తిరస్కరించింది. -
రాజ్యసభకు పంపండి
చంద్రబాబుకు నన్నపనేని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తనకూ ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్సీ, అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి పార్టీ అధినేత చంద్రబాబును కోరారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో ఆమె బాబును కలిశారు. తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు నియోజకవర్గం లేదు కనుక రాజ్యసభకు వెళ్లే అవకాశమివ్వాలని కోరారు. వీలుకాకుంటే గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం, లే దా నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్నారు. -
అత్తారింటికి దారేది అంటున్న పెద్దల సభ
-
శాసన మండలిలో అత్తారింటికి దారేది?
హైదరాబాద్ : శాసనమండలిలో మంగళవారం అత్తారింటికి దారేదీ.. అంటూ ఆసక్తికర చర్చ జరిగింది. వినేందుకు విడ్డూరంగా ఉన్నా.. పెద్దల సభలో.. కాసేపు.. నన్నపనేని రాజకుమారి సందడి చేశారు. దీంతో.. సభలో కాసేపు నవ్వులు పూసాయి. రాష్ట్ర విభజన బిల్లుపై జరిగిన ఆ సరదా సంభాషణను అందరూ నవ్వుతూ ఆస్వాదించారు. రాజకుమారి మాట్లాడుతూ తెలంగాణ-సీమాంధ్ర ప్రాంతాల్లో బంధుత్వాలు కొనసాగుతున్నాయని... బంధాలు బంధుత్వాల్లో భేదం చూపించలేదని.... మరి ఇప్పుడు రాష్ట్ర విభజన ఎందుకు కోరుకుంటున్నారో చెప్పాలన్నారు. ఈ సందర్బంగా ఆమె నేతల బంధుత్వాలను గుర్తు చేశారు. -
'నన్నపనేని ఇబ్బంది పడితే పశ్చాతాప పడుతున్నా'
హైదరాబాద్ : తన వల్ల నన్నపనేని రాజకుమారి ఇబ్బంది పడితే పశ్చాతాపం చెందుతున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ అన్నారు. అనుకోకుండా జరిగిన సంఘటనతో నన్నపనేని కిందపడిపోయారని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. కాగా శాసనమండలి మీడియా పాయింట్ వద్ద జరిగిన తోపులాటలో నన్నపనేని కిందపడిపోయిన విషయం తెలిసిందే. కాగా స్వామిగౌడ్‌పై శాసనమండలి ఛైర్మన్ చక్రపాణికి ఫిర్యాదు చేసినట్లు నన్నపనేని రాజకుమారి తెలిపారు. మండలి ఆవరణలోనే రక్షణ లేదని...ఇక తెలంగాణ ఏర్పడ్డాక తమ ప్రాంత ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందన్నారు. స్వామిగౌడ్‌పై చర్య తీసుకోవాలని ఛైర్మన్‌ను కోరినట్లు చెప్పారు. -
మహిళలకు రక్షణ లేదా: నన్నపనేని
-
మహిళలకు రక్షణ లేదా: నన్నపనేని
ఆంధ్రప్రాంత మహిళలకు సమైక్య రాష్ట్రంలో రక్షణ లేదని ఎమ్మెల్సీలు మండిపడ్డారు. సాక్షాత్తు మండలి ప్రాంగణంలో్నే సభ్యులమీదనే ఇలాంటి దాడులు జరుగుతుంటే రేపు పరిస్థితి ఏంటని నన్నపనేని రాజకుమారి కంటనీరు పెడుతూ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదా అని ఆమె ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులుగా తమ మనోభావాలు చెబుతుంటే ఇక్కడ దౌర్జన్యం, దాడి జరిగితే ఇక బయటి పరిస్థితి ఏంటన్నారు. దాడికి పాల్పడిన తెలంగాణ ప్రాంత సభ్యులను, ఇతరులను వెంటనే అరెస్టు చేయాలని, అక్కడే పో్లీసులు ఉన్నా కూడా వారు ప్రేక్షక పాత్ర పోషిస్తూ, తమనే తోసేశారు తప్ప వారిని నియంత్రించేందుకు ఏమాత్రం ప్రయత్నించ లేదని ఆమె అన్నారు. అప్పుడే వాళ్లకు అధికారం వచ్చేసినంతగా పోలీసులు ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక పద్ధతిలో తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నిస్తుంటే తమపై దౌర్జన్యం చేయడం ఏంటని ప్రశ్నించారు. తన పక్కనే ఉన్న దళిత మహిళపై కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దాడి చేశారని ఆమె ఆరోపించారు. -
నన్నపనేనిని తోసేసిన స్వామిగౌడ్
హైదరాబాద్ : శాసనమండలిలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్సీలు ఆ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండలి మీడియా పాయింట్ వద్ద సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీల మధ్య తోపులాట జరిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన సతీష్ రెడ్డి, నన్నపనేని రాజకుమారి తదితరులు బిల్లు తప్పులు తడకలుగా ఉందని, ఇలాంటి బిల్లును కనీసం చూసుకోకుండా ఎలా ప్రవేశపెడతారని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని మండిపడుతూ మీడియా పాయింట్లో మాట్లాడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వారు అక్కడ ఉండగానే టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్వామిగౌడ్, మరికొందరు ఎమ్మెల్సీలు, కపిలవాయి దిలీప్ కుమార్ తదితరులు కూడా అక్కడకు వచ్చారు. సీమాంధ్ర ఎమ్మెల్సీలను మాట్లాడనివ్వకుండా వారిని అడ్డుకుంటూ తెలంగాణ నినాదాలు చేయసాగారు. ఈ సందర్భంగా ఇరు ప్రాంతాల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా సతీష్ రెడ్డి, నన్నపనేనిలపై చేయి చేసుకుని వారిని తోసేశారు. దీంతో నన్నపనేని రాజకుమారి కింద పడిపోయారు. ఇద్దరు ఎమ్మెల్సీలు ఆమెను చేతులు పట్టుకుని పైకి లేవదీయాల్సి వచ్చింది. ఈ సంఘటన తర్వాత ఎదురుగా ఉన్న టేబుల్ మీదకు నన్నపనేని ఎక్కి, ఆవేశంగా మాట్లాడుతూ, నినాదాలు చేస్తుండగా, స్వామిగౌడ్ కూడా ఆమెకు పోటీగా టేబుల్ మీదకు ఎక్కి మాట్లాడటం, నినాదాలు చేయడం మొదలుపెట్టారు. పెద్దల సభ అన్న గౌరవం కూడా ఉంచకుండా తోటి సభ్యుల మీద చేయి చేసుకోవడం, తోసేయడం లాంటి చర్యలు పాల్పడ్డారు.