![Case Filed against Nannapaneni Rajakumari - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/12/Nannapaneni-Rajakumari.jpg.webp?itok=jTLswfvZ)
సాక్షి, గుంటూరు : దళిత మహిళా ఎస్‌ఐని దూషించిన కేసులో టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారిపై మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఎస్‌ఐ అనురాధ ఫిర్యాదుతో 303, 506,509 r/w 34 ఐపీసీ సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నిన్న చలో ఆత్మకూరు సందర్భంగా ‘ఈ దళితుల వల్లే మాకీ దరిద్రం’ అంటూ నన‍్నపనేని దూషించిన విషయం తెలిసిందే. దీంతో విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ అనురాధతో పాటు సిబ్బందిపై అసభ్య పదజాల దూషణ, విధులకు ఆటంకం కలిగించినందుకు ఆమెతో పాటు టీడీపీ మహిళ నాయకురాలు సత్యవాణిలపై కేసు నమోదు చేశారు.
చదవండి: నోరు పారేసుకున్న నన్నపనేని
మరోవైపు ఐపీఎస్ అధికారి విక్రాంత్ పాఠిల్‌పై ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అనుచిత ప్రవర్తనపై ఎస్‌ఐ కోటయ్య ఫిర‍్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే వైఎస్సార్ నాయకుల ఫిర్యాదుతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment