సాక్షి, పల్నాడు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపులతో రెచ్చిపోతున్నారు. సామాన్య ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ఉద్యోగులను ఎవరినీ వదలకుండా వేధింపులకు తెగపడుతున్నారు. తాజాగా పచ్చ నేతల వేధింపులకు పల్నాడులో ఓ ఉద్యోగి బలి అయ్యారు. పల్నాడు జిల్లాలోని అన్నారం సొసైటీ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని టీడీపీ సానుభూతిపరులు దొప్పలపూడి శ్రీనివాసరావు, సురేంద్రబాబులు వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
అధికారులు సైతం శ్రీనివాస్ రెడ్డికి రెండు నెలల నుంచి జీతం ఆపేశారు. ఉద్యోగం మానేయాలని ఆ ఉద్యోగంలో తమ వారిని ఎంపిక చేసుకుంటామని ఆయన్ను టీడీపీ నేతలు వేధించారు. వారి వేధింపులు భరించలేక శ్రీనివాస్ రెడ్డి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆయన్ను నరసరావుపేట ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందారు. శ్రీనివాస్‌రెడ్డి మృతికి టీడీపీ నేతల వేధింపులు కారణమని కుటుంసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment