Bank employee
-
కూతురంటే ఎంత ప్రేమో.. 70ఏళ్ల వయస్సులో ఎంబీబీఎస్
భువనేశ్వర్ : ఉద్యోగ విరమణకాగానే ‘కృష్ణా రామా’ అనుకుంటూ కాలం గడపాలనుకునేవాళ్లనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈయన అలా కాదు. కన్నబిడ్డ దూరమై మిగిల్చిన విషాదం ముందు.. వయసు మీదపడి ఓపిక తగ్గే తరుణంలో ఉరకలేసే ఉత్సాహంతో నీట్ యూజీ 2020 ఫలితాల్లో ర్యాంక్‌ను సాధించారు. ఎంబీబీఎస్ విద్యార్థిగా పాఠాలు నేర్చుకుంటున్నారు. త్వరలో డాక్టర్‌గా విధులు నిర్వహించనున్నారు.ఒడిశాకు చెందిన 64ఏళ్ల జే కిషోర్ ప్రధాన్ ఎస్బీఐ బ్యాంక్‌లో ఉన్నత ఉద్యోగం. ఇద్దరు కవలలు. అందమైన కుటుంబం. ఏచీకూ చింతాలేదు. ఎందుకో ముచ్చటైన ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది.మలిదశలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండాలనుకున్న కుమార్తెను దూరం చేసింది. ఆ తల్లిదండ్రుల కలలను కల్లలు చేసింది. ఇంటి వెలుగులను ఒకేసారి ఆర్పేసి చీకట్లు మిగిల్చింది.అదుగో అప్పుడే తనలాగే మరో ఆడబిడ్డ తండ్రికి గుండె కోత మిగిల్చకూడదనుకున్నారు. డాక్టర్‌గా సేవలందించాలని దీక్షబూనారు. ఎస్బీఐ అసిస్టెంబ్ బ్యాంక్ మేనేజర్‌గా పదవీ విరమణ చేసినా డాక్టర్‌గా సేవలందించాలనే తన చిరకాల వాంఛను నెరవేర్చుకునే పనిలో పడ్డారు. దృఢ సంకల్పంతో ఓ వైపు విద్యార్థి, మరోవైపు కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే పెద్దగా ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తన కలల ప్రయాణాన్ని ప్రారంభించారు.కుటుంబ వ్యవహారాలు, ఒత్తిళ్లు ఉన్నప్పటికీ దేశంలోనే అత్యంత కఠినమైన నీట్ పరీక్షల్లో ఉత్తర్ణీత సాధించాలనే లక్ష్యం ముందు అవి చిన్నవిగా కనిపించాయి. ముందుగా నీట్ యూజీ 2020 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు పోటీ పడ్డారు. ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యారు. మొక్కవోని దీక్షతో అనేక సవాళ్లను అధిగమించారు. చివరికి అనుకున్నది సాధించారు.నీట్ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. వీర్ సురేంద్ర సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (VIMSAR)లో ఎంబీబీఎస్ చదివేందుకు అర్హత సాధించారు. ప్రస్తుతం ఆయన ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. వచ్చే ఏడాది డాక్టర్‌గా ప్రజా సేవ చేయనున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు డబ్బు మీద ఆశలేదు. దూరమైన నా కుమార్తె కోసం నేను బతికి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను’అని వ్యాఖ్యానించారు. ‘దేశ వైద్య విద్యా చరిత్రలో ఇదొక అరుదైన సంఘటన. ఇంత వయస్సులో వైద్య విద్యార్థిగా అర్హత సాధించి ప్రధాన్ ఆదర్శంగా నిలిచారు’ అని విమ్స్‌ఆర్ డైరెక్టర్ లలిత్ మెహెర్ ప్రధాన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.👉చదవండి : ‘మేం ఏపీకి వెళ్లలేం’ -
కొట్టేసిన బంగారం విలువ మినహా మిగతా డబ్బు ఇచ్చేయండి!
సాక్షి, అమరావతి: పదవీ విరమణకు ముందు ఖాతాదారుని లాకరు నుంచి బంగారం చోరీ చేసినట్లు ఆరోపణలు ఉన్న యూనియన్ బ్యాంకు ఉద్యోగికి చోరీకి గురైన బంగారం విలువ మినహా మిగతా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆయనపై శాఖాపరమైన విచారణ మూడు నెలల్లో ముగించాలని, ఆలోగా ముగియకపోతే నిలిపివేసిన సొమ్మునూ ఇచ్చేయాలని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది.పల్నాడు జిల్లా నర్సరావుపేట యూనియన్ బ్యాంకులో 2019 మార్చి 5న ఓ ఖాతాదారుడి లాకర్ నుంచి బంగారం సంచి మాయమైంది. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన బ్యాంకు అధికారులు ఆ బంగారాన్ని ఆ శాఖ ఉద్యోగి నాయక్ చోరీ చేశారని నర్సరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నాయక్‌పై కేసు నమోదు చేశారు. అదే నెల 31న నాయక్ పదవీ విరమణ చేశారు. ఆ ఏడాది డిసెంబరు 3న బ్యాంకు అధికారులు నాయక్‌పై శాఖాపరమైన విచారణ ప్రారంభించారు.పదవీ విరమణ అనంతరం నాయక్‌కు రావాలి్సన రిటైర్మెంట్ ప్రయోజనాల డబ్బు ఆయన ఖాతాలో జమ చేసినప్పటికీ, క్రిమినల్ కేసు, శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉండటంతో వాటిని బ్యాంకు అధికారులు జప్తు చేశారు. ప్రొవిజినల్ పెన్షన్ మినహా మిగిలిన ప్రయోజనాలని్నంటినీ నిలిపేశారు. ఖాతాల జప్తుపై నాయక్ 2022లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బంగారం చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తప్పుడు సమాచారం ఆధారంగా కేసు పెట్టారని తెలిపారు. సింగిల్ జడ్జి బ్యాంకు వాదనను కూడా విన్నారు. శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉన్న నెపంతో పదవీ విరమణ ప్రయోజనాలను నిలిపేయడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. ఆయనకు రావాలి్సన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నింటినీ విడుదల చేయాలని బ్యాంకు యజమాన్యాన్ని ఆదేశించారు.సింగిల్ జడ్జి ఆదేశాలపై యూనియన్ బ్యాంకు హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌పై సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం విచారణ జరిపింది. యూనియన్ బ్యాంకు తరఫు సీనియర్ న్యాయవాది డాక్టర్ కె.లక్ష్మీనరసింహ వాదనలు వినిపిస్తూ.. శాఖాపరమైన విచారణ పూర్తయ్యేంత వరకు ఆ వ్యక్తి పదవీ విరమణ ప్రయోజనాలను ఆపే అధికారం తమకుందన్నారు.ఆ ఉద్యోగి బంగారం కాజేయడం వల్ల బ్యాంకుకు ఎంత నష్టం వాటిల్లిందని ధర్మాసనం ప్రశ్నించగా.. రూ.4.42 లక్షలు నష్టం వాటిల్లిందని లక్ష్మీనరసింహ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. నాయక్ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను నిలిపేయడాన్ని, బ్యాంకు ఖాతాల జప్తును తప్పుపట్టింది. చోరీకి గురైన బంగారం విలువ రూ.4.42 లక్షలు మినహా మిగతా సొమ్మంతా విడుదల చేయాలని, బ్యాంకు ఖాతాల నిర్వహణకు నాయక్‌కు అనుమతినివ్వాలని బ్యాంకును ఆదేశించింది. శాఖాపరమైన విచారణకు సహకరించాలని నాయక్‌ను ఆదేశించింది. -
ప్రైవేట్ బ్యాంకుల్లో తగ్గుతున్న ‘అట్రిషన్’
దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగుల అట్రిషన్(ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం)రేటు తగ్గింది. 2023 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా 31-51 శాతం పెరిగిన ఈ రేటు 2024 ఆర్థిక సంవత్సరంలో తగ్గినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్‌లో ప్రధానంగా హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకుల్లో నియామకాలు పెరగడం, తమ కెరియర్ కోసం యువత ఎక్కువగా బ్యాంకింగ్ రంగాన్ని ఎంచుకోవడం ఇందుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.కొవిడ్ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ నెమ్మదిగా నష్టాల్లోకి జారుకుంది. లాక్డౌన్ కారణంగా లోన్లు ఇవ్వడం ఆగిపోయింది. ఆ సమయంలో నెలవారీ ఈఎంఐలు చెల్లించేందుకు ఆర్థికశాఖ గడువు ఇచ్చింది. ఫలితంగా బ్యాంకింగ్ నిర్వహణ భారంగా మారింది. దాంతో చాలామంది ఉద్యోగులు ఇతర సంస్థల్లో చేరడం, ఉద్యోగాలు మానడం వంటివి జరిగాయి. గత మూడు త్రైమాసికాల నుంచి బ్యాంకులు మెరుగైన పలితాలు విడుదల చేస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో 2023 ఆర్థిక సంవత్సరంలో అట్రిషన్ రేటు 31-51 శాతంగా ఉంది. 2023లో ఎంప్లాయి టర్నోవర్ రేటు(ఉద్యోగుల ద్వారా వచ్చే ఆదాయం) 25-45%గా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ , ఐసీఐసీఐ బ్యాంక్ , కోటక్ మహీంద్రా బ్యాంక్ , యాక్సిస్ బ్యాంక్ , బంధన్ బ్యాంక్ , ఇండస్ఇండ్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్‌లు కలిసి మార్చి చివరి నాటికి సుమారు 7,30,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్నాయి. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం వరకు ఉద్యోగుల అట్రిషన్ రేటు గతంలో కంటే 4.5-14 శాతం పడిపోయింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో 2023లో 34.2 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు 2024లో 26.9%కి చేరింది. ఐసీఐసీఐ బ్యాంకులో 2023లో 30.9% నుంచి 2024లో 24.5%కు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో 2023లో 45.9% నుంచి 2024లో 39.6%కి పడిపోయింది.ఇదీ చదవండి: సెప్టెంబర్ 1 నుంచి ఆ మెసేజ్‌లు, కాల్స్ నిలిపివేత!గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో బ్యాంకులు తమ శాఖల విస్తరణకు పూనుకున్నాయి. దాంతో నియామకాలపై దృష్టి సారించాయి. లోన్ల జారీ క్రమంగా పెరుగుతోంది. యువత తమ కెరియర్ అభివృద్ధికి బ్యాంకింగ్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. దాంతో టాప్ బ్యాంకుల్లో చేరుతున్న ఉద్యోగులు సంస్థలు మారడం లేదని, క్రమంగా అట్రిషన్రేటు తగ్గుతుందని చెబుతున్నారు. -
టీడీపీ నేతల వేధింపులకు పల్నాడు ఉద్యోగి బలి
సాక్షి, పల్నాడు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపులతో రెచ్చిపోతున్నారు. సామాన్య ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఉద్యోగులను ఎవరినీ వదలకుండా వేధింపులకు తెగపడుతున్నారు. తాజాగా పచ్చ నేతల వేధింపులకు పల్నాడులో ఓ ఉద్యోగి బలి అయ్యారు. పల్నాడు జిల్లాలోని అన్నారం సొసైటీ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని టీడీపీ సానుభూతిపరులు దొప్పలపూడి శ్రీనివాసరావు, సురేంద్రబాబులు వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అధికారులు సైతం శ్రీనివాస్ రెడ్డికి రెండు నెలల నుంచి జీతం ఆపేశారు. ఉద్యోగం మానేయాలని ఆ ఉద్యోగంలో తమ వారిని ఎంపిక చేసుకుంటామని ఆయన్ను టీడీపీ నేతలు వేధించారు. వారి వేధింపులు భరించలేక శ్రీనివాస్ రెడ్డి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆయన్ను నరసరావుపేట ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందారు. శ్రీనివాస్‌రెడ్డి మృతికి టీడీపీ నేతల వేధింపులు కారణమని కుటుంసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. -
‘వాట్సాప్ గ్రూప్‌లో సూటిపోటి మాటలు.. భరించలేకపోతున్నా!’
ఢిల్లీ: ఆమె ఓ ప్రముఖ బ్యాంకులో ఉద్యోగిణి. కానీ, పని చేసే చోట ఏదో ఒకరూపంలో వేధింపులు ఎదుర్కొంది. వేసుకునే దుస్తుల దగ్గరి నుంచి.. ఆమె తినే తీరు, మాట్లాడే విధానం.. ఇలా తోటి ఉద్యోగులు అన్నింటా ఆమెను హేళన చేస్తూ వచ్చారు. అది పరిధి దాటి వాట్సాప్ గ్రూపుల్లో ఆమెను ట్రోలింగ్ చేసే స్థాయికి చేరుకుంది. భరించలేక లేఖ బలవన్మరణానికి పాల్పడిందామె.నోయిడా యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో రిలేషన్షిప్ మేనేజర్‌గా పనిచేసే శివాని త్యాగి ఆత్మహత్య ఘటన ఇప్పుడు యూపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఘజియాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిందామె. ఆరు నెలలపాటు ఆఫీస్‌లో తోటి ఉద్యోగులు ఆమెను వేధించారని, అది భరించలేకే అఘాయిత్యానికి పాల్పడిందని శివాని కుటుంబం ఆరోపిస్తున్నారు. వీటికి తోడు..ఆమె గదిలో దొరికిన సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘సూటిపోటి మాటలతో అన్నింటా అవమానిస్తూ వస్తున్నారు.. ఆఫీస్ వాట్సాప్ గ్రూప్‌లోనూ అది కొనసాగింది. భరించలేకపోతున్నా. తమ్ముడూ.. అమ్మానాన్న, చెల్లి జాగ్రత్త’ అని సూసైడ్ నోట్ రాసిందామె. లేఖలో మృతురాలు ఐదుగురి పేర్లు ప్రస్తావించింది. పని ప్రాంతంలో ఆమె వేధింపులు ఎదుర్కొందన్న విషయం లేఖ ద్వారా స్పష్టమైంది అని ఘజియాబాద్ డీసీపీ గ్యానన్‌జయ్ సింగ్ మీడియాకు కేసు వివరాల్ని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఆమెను ట్రోలింగ్ చేసేందుకే ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్లు గుర్తించినట్లు తెలిపారాయన.వేధింపులపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదు. వేధింపులు భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆమె చాలాసార్లు ప్రయత్నించింది. కానీ, పైఅధికారులు ఆమెను ఆపుతూ వచ్చారు. అయితే ఓ సహోద్యోగిణితో వాగ్వాదంలో శివాని ఆమెపై చెయ్యి చేసుకుంది. ఆ ఘటన తర్వాత ఆమెకు తొలగింపు నోటీసులు ఇచ్చారు. శివాని అది తట్టుకోలేకపోయింది అని ఆమె సోదరి మీడియాకు చెబుతూ కంటతడి పెట్టింది. -
గుండెపోటుతో బ్యాంక్‌లోనే కుప్పకూలిన ఉద్యోగి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువవుతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సడెన్ హార్ట్ ఎటాక్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. ఈ మరణాలు యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా మరో 30 ఏళ్ల యువకుడు ఆకస్మిక గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగుచూసింది.మహోబాలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో 30 ఏళ్ల అగి జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ తన ల్యాప్ టాప్‌లో పనిచేస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా తన కుర్చీపై కుప్పకూలిపోయాడు. పక్కన కూర్చున్న అతని సహచరులు ఇతరులను అప్రమత్తం చేసి, అతన్ని అతని డెస్క్ నుండి బహిరంగ ప్రదేశంలోకి మార్చారు. వారు అతని ముఖం మీద నీరు చల్లి, మేల్కొలిపే ప్రయత్నం చేశారు. యువకుడికి సీపీఆర్ ఇచ్చేందుకు సైతం యత్నించారు. కానీ ఫలితం లేకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే యువకుడు బ్యాంక్‌లో కుప్పకూలిన వీడియో అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.खौफनाक...लैपटॉप पर काम करते करते कुर्सी पर ही HDFC Bank मैनेजर की मौत हो गई।38 साल उम्र थी। कुछ सेकंड पहले तक कीबोर्ड पर हाथ चला रहे थे। अगले पल कुर्सी पर ही जान निकल गई।यूपी के महोबा ब्रांच में थे।#mahoba#covidvaccines #covid #heartattack #hdfc #uttarpradesh pic.twitter.com/xXuw9Ndhnu— Sunil Yadav B+ (@sunilyadav21) June 26, 2024 -
భర్త వేధింపులతో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య
అనకాపల్లి: మాకవరపాలెం మండలం కె.వెంకటాపురానికి చెందిన ఎస్బీఐ ఉద్యోగి సిహెచ్. హేమ అరుంధతి (36) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రూరల్ ఎస్సై ధనుంజయనాయుడు వివరాల ప్రకారం.. నర్సీపట్నం ఎస్బీఐ(బజార్)లో పనిచేస్తున్న ఆమె భర్త వేధింపులతో మనస్తాపానికి గురైంది. శుక్రవారం సాయంత్రం పెదబొడ్డేపల్లి సెయింట్ ఆన్స్ స్కూల్ వెనుక జీడితోటల్లోకి స్కూటీపై వెళ్లింది. అక్కడ స్కూటీ పార్కు చేసి, తన శవాన్ని చూసిన వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలంటూ తెల్లకాగితంపై ఫోన్ నంబరు రాసింది. తన దగ్గర చున్నీతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె మొదటి భర్త చనిపోవడంతో రాజమహేంద్రవరానికి చెందిన సహాంత్‌ను రెండో వివాహం చేసుకుంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అతడి వేధింపులు భరించలేక గతేడాది నవంబర్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించింది. మృతురాలికి మూడేళ్ల బాబు, తల్లిదండ్రులు ఉన్నారు. సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య
శ్రీకాకుళం క్రైమ్: నగరంలోని పీఎన్‌కాలనీలో నివాసముంటున్న ఓ బ్యాంకు ఉద్యోగిని ఎలుకల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. శ్రీకాకుళం రెండో పట్టణ ఎస్ఐ కె.లక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. పీఎన్‌కాలనీ మొదటి లైన్ సాయిసత్య అపార్ట్మెంట్లో ఉరిటి స్వప్నప్రియ(39) తల్లి సరళ, సోదరుడు కిరణ్బాబులతో కలిసి నివాసముంటోంది. స్వప్నప్రియ గార మండలం స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచి ఆఫీసులో డిప్యూటీ మేనేజరు/అకౌంటెంట్‌గా , కిరణ్‌బాబు శ్రీకాకుళం ఎస్బీఐ రీజియన్‌లో పనిచేస్తున్నారు. వీరి స్వగ్రామం నరసన్నపేట సమీపంలోని యారబాడు. స్వప్నప్రియకు 2010లో శ్రీకాకుళానికి చెందిన కుప్పలి ప్రదీప్‌కుమార్‌తో వివాహం జరిగినా అభిప్రాయ భేదాలు రావడంతో 2019లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి తాను ఒంటరిననే బాధతో ఉండేవారు. తనఖా బంగారం మాయమవ్వడంతో.. గార ఎస్బీఐలో ఖాతాదారులు తనఖా పెట్టిన రూ.3 కోట్ల బంగారం మాయమైందని, దీని వెనుక డిప్యూటీ మేనేజర్/అకౌంటెంట్‌గా ఉన్న ఓ మహిళా ఉద్యోగినితో పాటు కొందరి హస్తముందని కొన్ని పత్రికల్లో(సాక్షి కాదు) వరుస కథనాలు వస్తున్నాయి. ఖాతాదారులు బ్యాంకు వద్ద ఆందోళనకు దిగడం, చివరకు బుధవారం గార సీఐ కామేశ్వరరావు సమక్షంలో రీజనల్ మేనేజర్ ఖాతాదారులకు బంగారం ఇప్పించే బాధ్యత తనదని సర్దిచెప్పి వెళ్లిపోయారు. ఆ కథనాలతో మనస్థాపం చెంది.. పత్రికల్లో వస్తున్న కథనాలు తన గురించే అని ఇంటి వద్ద తల్లితో చెప్పి స్వప్నప్రియ తీవ్రంగా మనోవేదన చెందేదని, సోషల్ మీడియాలో కూడా కావాలనే తనపై తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని స్వప్నప్రియ వాపోయేది. ఈ క్రమంలో ఈ నెల 24న బయటకు వెళ్లి వచ్చిన స్వప్నప్రియ వాంతులు చేయడంతో తల్లి ఆందోళన చెందింది. ఏమైందని అడగ్గా.. తన బతుకు ఇలా అయిపోయిందని ఏడుస్తూ పడుకుంది. మరుసటి రోజు నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చి ఎలుకల మందు తాగానని తల్లితో చెప్పింది. అప్పటి నుంచి మందులు వాడుతున్నా వాంతులు తగ్గలేదు. ఈక్రమంలో ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తుండటంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా బుధవారం ఉదయం మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని స్వప్నప్రియ స్వగ్రామం యారబాడుకు తరలించనున్నట్లు ఎస్ఐ లక్ష్మి చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
400 అడుగుల ఎత్తు నుంచి దూకేశాడు!
ముంబై నగర పరిధిలోని బాంద్రా-వోర్లి వంతెనపై నుంచి సముద్రంలోకి దూకి ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతున్ని సెంట్రల్ ముంబైలోని పారెల్ ప్రాంతానికి చెందిన ఆకాశ్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం (నవంబర్ 10) రాత్రి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ నుంచి పారెల్‌కు ట్యాక్సీ బుక్ చేసుకున్న ఆకాశ్ సింగ్.. బాంద్రా-వోర్లి సముద్ర వంతెన మీదకు వెళ్లాలని ట్యాక్సీ డ్రైవర్‌కు చెప్పాడు. ట్యాక్సీ వంతెన మీదకు రాగానే తన ఫోన్ పడిపోయిందని చెప్పిన ఆకాశ్ సింగ్ డ్రైవర్ ట్యాక్సీ ఆపగానే దిగి సముద్రంలోకి దూకేశాడు. ఈ వంతెన ఎత్తు సుమారు 400 అడుగులు ఉంటుంది. ఆకాశ్‌సింగ్ మృతదేహం అర్ధ రాత్రి తర్వాత పైకి తేలిందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఆకాశ్‌సింగ్ తల్లిదండ్రులతో కలిసి నివసించేవాడని, మూడు నెలల క్రితం ప్రియురాలితో విడిపోయాడని పోలీసులు పేర్కొన్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు. -
అత్తారింటికి వెళ్తుండగా వెనకే వచ్చిన మృత్యువు.. భార్య, బిడ్డలను చూడకుండానే
తూర్పు గోదావరి: అత్తారింట్లో ఉన్న భార్య, పాపలను చూసి వద్దామని బైక్‌పై బయలు దేరిన బ్యాంకు ఉద్యోగిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధి గామన్ బ్రిడ్జి రోడ్డుపై ఆటోనగర్ వద్ద ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీతానగరం మండలం బొబ్బిల్లంకకు చెందిన చిట్టూరి అజయ్ (33) సీతానగరం ఎస్బీఐలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అతనికి రెండేళ్ల కిందట వివాహమైంది. 4 నెలల పాప కూడా ఉంది. ఈ క్రమంలో పెదపూడి మండలం కడకుదురులో అత్తారింటి వద్ద ఉన్న భార్య, పాపలను చూసి వద్దామని ఆదివారం ఉదయం ఇంటి నుంచి బైకుపై బయలు దేరాడు. గామన్ బ్రిడ్జిపై వెళ్తున్న అతను ఆటోనగర్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి వేగంగా ఢీకొని అతని పైనుంచి వెళ్లిపోయింది. దీంతో శరీరంతో పాటు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్సై సుధాకర్ తెలిపారు. వాహనం తలపై నుంచి వెళ్లడంతో ఆ ప్రాంతమంతా రక్తపు మడుగులా మారింది. కష్టాలు తీరేవేళ..: ఇద్దరు బిడ్డలు అందివచ్చారు.. కష్టా లు తీరిపోతాయనుకుంటున్న తరుణంలో రోడ్డు ప్రమాదంలో ఇలా జరిగిందంటూ పెద్ద కుమారుడిని కోల్పోయిన ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి తండ్రి బాపన్నకు 10 సెంట్ల భూమి ఉంది. కొంతకాలం కౌలు రైతుగా పనిచేసిన ఆయన వృద్ధాప్యంతో వ్యవసాయం చేయడం లేదు. ఇద్దరు మగ సంతానంలో ఒకరు ఎస్బీఐలో, మరొక రు కాటవరం ఆంధ్రా బ్యాంకులో పనిచేస్తున్నారు. అ జయ్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
బ్యాంకు ఉద్యోగి నిర్వాకం.. ఖాతాదారుల సొమ్ముతో ఆన్లైన్లో రమ్మీ ఆట
బెంగళూరు: కర్ణాటకలో ఓ ప్రైవేటు బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఖాతాదారుల సొమ్మును కాజేశాడు. ఆన్లైన్లో రమ్మీ వంటి గ్యాంబ్లింగ్ గేమ్స్‌కు బానిసైన అతడు మొత్తం రూ.2.36 కోట్లు తన స్నేహుతుడి ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. వాటితో తరచూ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడాడు. బ్యాంకుకు రూ.2.36 కోట్లు నష్టం రావడంతో షాక్ అయిన మేనేజర్ పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. అసిస్టెంట్ మేనేజరే ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వీరేశ్ కేషిమఠ్(28) కర్ణాటక హవేరిలోని ఓ ప్రైవేటు బ్యాంకు శాఖలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్లో గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడి వాటికి బానిసయ్యాడు. బ్యాంకింగ్ ఆపరేషన్స్ కోసం ప్రతిరోజు రూ.5లక్షలు బదిలీ చేసే అధికారం ఇతనికి ఉంటుంది. దీన్నే అదునుగా తీసుకొని ఖాతాదారుల ఖాతాల నుంచి తరచూ రూ.5లక్షలు తన స్నేహితుడు మహంతేషయ్య పీ హిరేమఠ్కు బదిలీ చేశాడు. వాటితో రమ్మీ, ఇతర ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. గతేడాది ఆగస్టు నుంచి ఇలా చేస్తున్నాడు. కొన్ని నెలలపాటు ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు కూడా గుర్తించలేకపోయారు. అయితే ఇటీవల ఈ బ్రాంచ్‌లో ఆడిటింగ్ నిర్వహించినప్పుడు రూ.2.36కోట్ల అవకతవకలు జరిగినట్లు తేలింది. దీంతో మేనెజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో అసిస్టెంట్ నిర్వాకం బహిర్గతమైంది. గతేడాది ఆగస్టు నుంచి జరగుతున్న ఈ వ్యవహారం గురించి ఈ ఏడాది ఫిబ్రవరి 7న బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియడం గమనార్హం.మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేషిమఠ్ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రూ.2 కోట్లకు పైగా మోసం జరగడంతో ఈ కేసును రాష్ట్ర సీఐడీకి బదిలీ చేశారు. చదవండి: ముంబైలోకి ప్రవేశించిన 'డేంజర్ మ్యాన్'.. చైనా, పాకిస్తాన్, హాంకాంగ్‌లో శిక్షణ.. -
‘అప్పు తీర్చకపోతే చావు’
మైసూరు: అప్పు కంతు చెల్లించకపోతే చావు అంటూ మహిళా రైతును ఒక బ్యాంకు ఉద్యోగి దూషించాడు. నీవు చస్తేనే నీ రుణం మాఫీ అవుతుందంటూ హేళన చేసిన ఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలూకా కొళఘట్ట లో జరిగింది. లతా అనే మహిళ రైతు ప్రైవేటు బ్యాంకులో రూ. 50 వేల రుణం తీసుకుంది. వారానికి రూ. 500 కంతు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో రుణం వసూలు కోసం వచ్చిన బ్యాంకు సిబ్బంది సురేశ్ నడి రోడ్డుపై ఆమెను దూషించాడు. వెంటనే రూ. 500 చెల్లించాలని పట్టుబట్టాడు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పినా వినిపించుకోలేదు. అప్పు తీర్చలేకపోతే చావు... అప్పుడే నీ రుణం మాఫీ అవుతుందని అందరి ఎదుట దూషించాడు. చదవండి: భారత ఆర్మీని పెళ్లికి ఆహ్వానించిన నవజంట.. సైన్యం రిప్లై ఇదే.. -
బ్యాంక్ మేనేజర్ సూసైడ్ కేసులో మరో ట్విస్ట్.. మచిలీపట్నంలో ఏం జరిగింది?
యానాం: యూకో బ్యాంకు మేనేజర్ విస్సాప్రగడ సాయిరత్న శ్రీకాంత్(33) ఆత్మహత్య ఘటన నేపథ్యంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. బ్రాంచ్‌లో బ్యాలెన్స్ షీట్లో రూ.29 లక్షలు తక్కువగా వుందని, ఆ సొమ్మును ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీకాంత్ అనధికారికంగా తీసుకున్నారని పేర్కొంటూ బుధవారం యానాం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై బడుగు కనకారావుకు అసిస్టెంట్ మేనేజర్ కోమలి, క్యాషియర్ విమలాజ్యోతి ఫిర్యాదు చేశారు. మంగళవారం తాము బ్రాంచ్ తెరిచేటప్పటికి కంప్యూటర్ నగదు తక్కువగా చూపిందని పేర్కొన్నారు. ఆ కోణంలో బ్యాంకు ఉన్నతాధికారులు సైతం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. బ్రాంచ్‌లో ఉన్న రికార్డుల తనిఖీ, ఆడిటింగ్ సైతం చేసినట్లు తెలిసింది. మచిలీపట్నంలో రుణ గ్రహీతల అప్పులు తీర్చేందుకు.. మచిలీపట్నం బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసేటప్పుడు ఇచ్చిన రుణాలను సంబంధిత రుణగ్రహీతలు తీర్చకపోవడంతో తానే బ్యాంకు నిబంధనల ప్రకారం తీర్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పలువురి దగ్గర మేనేజర్ శ్రీకాంత్ అప్పులు చేసినట్టు, వాటికి వడ్డీలు సైతం కడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యానాం బ్రాంచ్‌లో ఘటన చోటు చేసుకుంది. మా ఒత్తిడి లేదు యానాం యూకో బ్రాంచ్ మేనేజర్‌పై రుణాల రికవరీ కోసం బ్యాంకు యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందన్న వార్తల్లో వాస్తవం లేదని, పూర్తిగా నిరాధారమని ఆ బ్యాంకు హైదరాబాద్ జోనల్ మేనేజర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంకు మేనేజర్ మృతికి చింతిస్తున్నామని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ బ్యాంకు లావాదేవీలకు ఎటువంటి అంతరాయం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. -
Loan Apps: నలుగురికి చెప్పాల్సిన బ్యాంకు ఉద్యోగే ఇలా చేశాడేంటి?
బెంగళూరు: ఇన్స్టాంట్ లోన్ యాప్‌ల వలలో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. అయితే.. కొందరు అన్నీ తెలిసి కూడా వాటి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే కర్ణాటకలో వెలుగు చూసింది. అయితే.. నలుగురికి చెప్పాల్సిన ఓ బ్యాంకు ఉద్యోగి లోన్‌యాప్ ఉచ్చులో పడి చనిపోవటం గమనార్హం. కేవలం రూ.40వేలు లోన్‌యాప్‌ల ద్వారా తీసుకుని, వారి వేధింపులు తట్టుకోలేక ట్రైన్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కెంగరీ జిల్లాలోని దొడ్డగొల్లారహట్టి గ్రామానికి చెందిన టీ నంద కుమార్(52) అనే వ్యక్తి కోఆపరేటివ్ బ్యాంకులో విధులు నిర్వర్తిస్తున్నారు. పశ్చిమ బెంగళూరులోని నయాందహల్లి సమీపంలో సోమవారం రైలు కింద పడి చనిపోయారు. లోన్‌యాప్‌తో పాటు తనకు డబ్బులు ఇచ్చిన స్థానికుల వేధింపులు తట్టుకోలేకే జీవితాన్ని ముగిస్తున్నానని సూసైడ్ నోట్ రాసి చనిపోయారు నంద. తనకు మెయిల్ ద్వారా లోన్‌యాప్ ప్రతినిధులు అసభ్యకర సందేశాలు పంపారని, అలాంటి వాటిని నిషేధించాలని సూసైడ్ నోట్లో కోరినట్లు బెంగళూరు నగర రైల్వే పోలీసులు తెలిపారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేక మొదట లోన్‌యాప్ ద్వారా రూ.3వేలు అప్పు తీసుకున్నారు నంద. ఈ క్రమంలో లోన్‌యాప్ ఉచ్చులో పడిపోయారు. పాత లోన్ తీర్చేందుకు మరో యాప్ ద్వారా రుణం తీసుకున్నారు. వివిధ యాప్‌ల ద్వారా మొత్తం రూ.36,704 రుణం తీసుకున్నారు నంద. వాటిని వసూలు చేసుకునేందుకు అసభ్యకర మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ చేశారు యాప్ ప్రతినిధులు. దాంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నంద తన వద్ద రూ.3.6 లక్షల అప్పు చేశాడని, కేవలం రూ.1.5 లక్షలు చెల్లించినట్లు ఓ మహిళ అతడిపై కేసు పెట్టింది. మొత్తం రూ.5 లక్షలు ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం నంద ఆత్మహత్య చేసుకున్న క్రమంలో 46 లోన్‌యాప్‌లు సహా మహిళపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదీ చదవండి: తినేందుకు రోటీ ఇవ్వలేదని గొడవ.. కత్తితో పొడిచి హత్య -
దారి తప్పడంతో.. దొంగ అనుకుని బ్యాంక్ ఉద్యోగిని కొట్టి చంపాడు
బనశంకరి(బెంగళూరు): ఎక్కడో చత్తీస్ఘడ్ నుంచి వచ్చాడు. ఇక్కడి భాష తెలియదు, ఊరు తెలియదు, చివరికి ప్రాణాలు కోల్పోయాడు. దొంగ అని భావించి సెక్యూరిటీ గార్డు బ్యాంకు ఉద్యోగిని రాడ్‌తో కొట్టి చంపాడు. ఈ సంఘటన బెంగళూరు హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మారతహళ్లి వద్ద వంశీ సిటాడెల్ అపార్టుమెంట్ వద్దకు ఈ నెల 5వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వెళ్లాడు. సెక్యూరిటీగార్డు శ్యామనాథ్ అతన్ని ఎవరని ఎన్నిసార్లు అడిగినా జవాబివ్వలేదు. లోపలికి వెళ్లడానికి ప్రయత్నించడంతో సెక్యూరిటిగార్డు రాడ్‌తో అతడి తలపై దాడిచేశాడు. తలకు తీవ్రగాయం కావడంతో వ్యక్తి అక్కడే మృతిచెందారు. హతుడు చత్తీస్ఘడ్ చెందిన బ్యాంకు ఉద్యోగి కాగా శిక్షణ తీసుకోవడానికి బెంగళూరుకు వచ్చినట్లు తెలిసింది. స్నేహితులతో విందులో పాల్గొని ఒక్కడే స్నేహితుడి రూమ్ కు నడుచుకుని బయలుదేరాడు. మొబైల్లో అడ్రస్ అడుగుతూ వస్తుండగా అది బ్యాటరీ అయిపోయి స్విచాఫ్ అయ్యింది. దీంతో దారి తప్పి వేరే అపార్టుమెంట్ వద్దకు వెళ్లాడు. దొంగ అని భావించి సెక్యూరిటీ గార్డు దాడి చేసినట్లు తెలిసింది. హెచ్ఏఎల్ పోలీసులు పరారీలో ఉన్న శ్యామ్‌నాథ్‌ను ను ఆదివారం అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. చదవండి: 11ఏళ్ల అనంతరం వీడిన మర్డర్ మిస్టరీ! -
ఆ రోజు టీడీపీ నాయకులు అడ్డురాకుంటే.. యువతి బతికేది కదా!
పుత్తూరు రూరల్(చిత్తూరు జిల్లా): రెండేళ్ల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు.. ఆరు నెలల క్రితం తల్లి కూడా కన్నుమూసింది. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయింది. తల్లిదండ్రులు లేరన్న బాధతో బ్యాంకు ఉద్యోగిని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పుత్తూరులో బుధవారం వెలుగుచూసింది. సీఐ లక్ష్మీ నారాయణ కథనం మేరకు.. స్థానిక రెడ్డిగుంట వీధిలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్లర్క్‌గా పనిచేస్తున్న వి.సరస్వతి(38), తన అన్న సుబ్రమణ్యంతో కలిసి నివసిస్తోంది. వీరిరువురూ అవివాహితులే. తండ్రి గోవిందస్వామి విశ్రాంత అటవీ ఉద్యోగి. చదవండి: తల్లీకూతుళ్ల సజీవ దహనం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి.. రెండేళ్ల క్రితం తండ్రి, జనవరిలో తల్లి కృష్ణమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. నాలుగేళ్లుగా తల్లిదండ్రులను కాపాడుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరిగి, చివరకు వారిని కోల్పోవడంతో మానసికంగా సరస్వతి కుంగిపోయింది. అన్న సుబ్రమణ్యం మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ కూడా ఇప్పించాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సరస్వతి బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతురాలి పిన్నమ్మ ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నన్ను ఒంటరిని చేసి అమ్మనాన్నలతో పాటు వెళ్లిపోయావా చెల్లీ.. అంటూ అన్న సుబ్రమణ్యం ఆక్రందన అందరిని కలిచివేసింది. ఆ రోజు టీడీపీ నాయకులు అడ్డురాకుంటే..! ఈ పాడుబడిన బావిని పూడ్చేసే సమయంలో టీడీపీ నాయకులు అడ్డురాకుండా ఉండివుంటే యువతి బతికేది కదా అంటూ స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సరస్వతి ఆత్మహత్య చేసుకున్న బావి రెండు దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉంటూ దుర్వాసన వెదజల్లుతోంది. స్థానికుల కోరిక మేరకు 24వ వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కె.ఏకాంబరం ఈ ఏడాది జనవరిలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డికి బావిని పూడ్చివేయాల్సిందిగా వినతిపత్రం అందించారు. స్పందించిన కమిషనర్ జనవరి 31వ తేదీ సిబ్బందితో బావిని పూడ్చివేసేందుకు ఉపక్రమించారు. అదే సమయంలో టీడీపీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ యుగంధర్ తన అనుచరులతో వచ్చి బావిని పూడ్చేందుకు వీలులేదంటూ అడ్డుకున్నారు. విధులకు అడ్డుతగలడమే కాకుండా దుర్భాషలాడారని కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఆ రోజు టీడీపీ నాయకులు అడ్డురాకుండా ఉంటే యువతి చావుకు ఆ బావి సాక్షి భూతంగా నిలిచేది కాదని మహిళలు వాపోయారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఉద్యోగి ఘనకార్యం.. రిచ్‌గా పెళ్లి చేసుకునేందుకు ఏం చేశాడంటే..?
యశవంతపుర(కర్ణాటక): వైభవంగా పెళ్లి చేసుకోవడానికి తను పనిచేసే బ్యాంకునే దోచుకున్నాడో ఘనుడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెళగావి జిల్లా సవదత్తి తాలూకా మురుగోడు డీసీసీ బ్యాంక్‌లో మార్చి 6న రూ.ఆరు కోట్ల విలువ గల బంగారం, నగదును దొంగలు దోచుకెళ్లారు. అయితే కేసు విచారించిన పోలీసులు బ్యాంక్‌లో పనిచేస్తున్న క్లర్క్ బసవరాజు సిద్ధంగప్ప హుణిసికట్టి (30), అతడి అనుచరులు సంతోష్ కాళప్ప కుంబార (31), గిరీశ్ (26) దొంగతనం చేశారని తేల్చారు. చదవండి: కోడలిపై కోపం.. మూడు రోజుల తర్వాత ఏం జరిగిందంటే? దీంతో వీరిని అరెస్టు చేసి.. నాలుగుకోట్ల 20 లక్షల నగదు, రూ. కోటి 63 లక్షల విలువచేసే మూడు కేజీల బంగారు నగలను, ఒక కారు, బైకును స్వాదీనం చేసుకున్నారు. నకిలీ తాళాల్ని ఉపయోగించి క్లర్క్ బసవరాజు, అతని స్నేహితులతో కలిసి బ్యాంకు దోపిడీ చేసినట్లు తేలింది. దోచుకున్న సొత్తును జిల్లాలోని రామదుర్గ తాలూకా తోరణగట్టి గ్రామంలోని వ్యవసాయతోటలో పాతి పెట్టారు. తన పెళ్లిని వైభవంగా చేసుకోవడానికి డబ్బు కోసం ఈ చోరీకి పాల్పడినట్లు క్లర్క్ విచారణలో తెలిపాడు. -
బ్యాంకు ఉద్యోగి బలవన్మరణం.. చిన్న విషయాలకే భయం అంటూ..
సాక్షి, ప్రకాశం (టంగుటూరు): భరించలేని పని ఒత్తిడి ఓ వైపు.. ఆందోళన మరో వైపు వెరసి ఓ బ్యాంకు ఉద్యోగి బలవన్మరణానికి కారణమైంది. ఈ సంఘటన స్థానిక వాణి నగర్ మొదటి వీధిలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, ఉద్యోగులు కథనం ప్రకారం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాకు చెందిన ఐశ్వర్య నర్నత్ రణ్‌దేవ్ (24) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో బంధువులు పిన్ని, బాబాయి పెంచి పెద్ద చేశారు. ఉన్నతంగా చదువుకున్న ఐశ్వర్య పట్టుదలతో రెండేళ్ల క్రితం బ్యాంక్ ఉద్యోగం సాధించింది. ఆరు నెలల క్రితం టంగుటూరి సిండికేట్ బ్యాంక్ శాఖలో ఫీల్డ్ ఆఫీసర్‌గా విధుల్లో చేరింది. అయితే చిన్న పనులకే ఒత్తిడి గురవుతుండేదని తోటి సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం అధికారులకు రిజైన్ పత్రాలను అందించింది. కానీ ఉద్యోగం లేకపోతే ఏం చేయాలో తెలియక.. ఈ పని చేయలేక మానసికంగా కుంగిపోయింది. ఇటువంటి పరిస్థితుల మధ్య తాను నివసిస్తున్న బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. బంధువులు ఫోన్ చేయడంతో.. ఐశ్వర్య పిన్ని, బాబాయ్‌లు రోజూ ఐశ్వర్యతో ఫోన్లో మాట్లాడుతుంటారు. అలాగే ఘటన జరిగిన రోజు ఉదయం 8 గంటలకు ఫొన్ చేయగా తీయలేదు. దీంతో బ్యాంక్ మేనేజర్ కాకర్ణ కృష్ణ ప్రసాద్‌కు ఫోన్ చేశారు. మేనేజర్ ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఉదయం 9: 30 గంటలకు అటెండర్‌ను ఆమె ఇంటికి పంపించారు. అతను ఇంటి యజమానితో కలిసి పైకి వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. ఎంత పిలిచినా పలక్కపోవడంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా ఉరి వేసుకొని అప్పటికే మృతి చెందింది. ఎస్సై ఖాదర్ బాషా, సిబ్బంది మృతదేహాన్ని పరిశీలించారు. యువతి కుడి చేతి మణికట్టుకు ఉన్న దారంలో ఉంచిన లెటర్, ప్యాంటు జేబులో సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తన మృతికి ఎవరూ కారణం కాదని.. పని ఒత్తిడి, చిన్న విషయాలకే భయం అని సూసైడ్ నోట్లో రాసి ఉంది. బ్యాంక్ మేనేజర్ కాకర్ణ కృష్ణ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ తరలించారు. -
బ్యాంకు ఉద్యోగి వక్రబుద్ధి.. జల్సాలు.. అడ్డదారులు.. చివరికి కటకటాలు
అతనో బ్యాంకు ఉద్యోగి. జల్సాలకు అలవాటు పడ్డాడు. వక్రబుద్ధి చూపించాడు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు. తాను పనిచేస్తున్న బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలో నగదు చోరీ చేయించాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు. శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): ఏటీఎంలో నగదు చోరీ చేసిన కేసులో ఐదుగురు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 13న శ్రీకాళహస్తి పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఏటీఎంలో రూ.4.95 లక్షలు చోరీకి గురైంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. తిరుపతి వేదాంతపురం అగ్రహారానికి చెందిన నారగంటి నరేష్(32) డీసీసీబీ బ్యాంకు అధికారిగా పనిచేస్తున్నాడు. అతను గతంలో పనిచేసిన బ్యాంకు ఏటీఎం తాళం దొంగలించి ఇంట్లో పెట్టుకున్నాడు. అలాగే ఏటీఎంల పాస్‌వర్డ్‌ను కూడా తెలుసుకున్నాడు. తాను చోరీ చేస్తే సీసీ పుటేజీల్లో దొరకిపోతానని భావించాడు. గుర్తుతెలియని వ్యక్తులతో చోరీ చేయించాలని నిర్ణయించుకుని తన స్నేహితుడైన తిరుపతి జీవకోనకు చెందిన బట్టల వినోద్(25)కు చెప్పాడు. అతను నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలానికి చెందిన కొట్టు జయసూర్య(24)కు చెప్పాడు. అతని ద్వారా నెల్లూరు జిల్లా డక్కిలి మండలం, ఆల్తూరుపాడుకు చెందిన పల్లి వంశీ(23), నెల్లూరు నగర్ బీవీనగర్‌కు చెందిన మహ్మద్ రమీజ్(23)తో ఒప్పందం చేసుకున్నారు. నరేష్, వినోద్ పథకం ప్రకారం అందరూ కలిసి 13వ తేదీ తెల్లవారుజామున శ్రీకాళహస్తి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న డీసీసీబీ బ్యాంకు ఏటీఎం నుంచి రూ.4,95,700లు చోరీ చేశారు. అనంతరం 14వ తేదీ రాత్రి పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌లో ఉన్న డీసీసీ బ్యాంకు ఏటీఎంలో రూ.11,49,900 చోరీ చేశారు. పోలీసులు నిందితుడైన నారగంటి నరేష్, వినోద్‌తోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. వీరు ఇప్పటి వరకు రూ.15,20,380 చోరీ చేసినట్లు అంగీకరించారు. వారి నుంచి రూ.11,49,900 నగదు, నాలుగు సెల్ఫోన్లు, ఒక కారు, బైక్ స్వా«దీనం చేసుకున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ డి.విశ్వనాథ్, సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంక్ ఉద్యోగి చేతివాటం.. రూ.కోటికి పైగా బ్యాంకు సొమ్ము మాయం
కారంపూడి(మాచర్ల): కారంపూడి ఎస్బీఐ బ్రాంచ్ ఉద్యోగి ఒకరు సుమారు కోటి రూపాయలు బ్యాంకు సొమ్ము స్వాహా చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బ్యాంకులో గోల్డ్ లోన్ అధికారిగా పనిచేస్తున్న సేవ్యానాయక్ ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గత నాలుగో తేదీ ఒక ఫేక్ అకౌంట్ ద్వారా నగదు స్వాహా విషయాన్ని గుర్తించిన బ్యాంక్ చీఫ్ మేనేజర్ అప్రమత్తమై పై అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆర్బీఐ టీం, రీజినల్ ఆఫీస్ అధికారులు రంగంలోకి దిగి శోధించడంతో నగదు స్వాహా పర్వం వెలుగు చూసింది. గత మూడు నెలలుగా బ్యాంకు ఏటీఎంలలో పెట్టడానికి బ్యాంకు నుంచి తీసుకెళ్లిన నగదులో కొంత స్వాహా చేస్తూ మిగతాది ఏటీఎం మిషన్లలో పెడుతూ సేవ్యానాయక్ నగదు స్వాహాకు పాల్పడ్డాడు. చదవండి: భక్తుడిలా రెక్కీ .. రాత్రికి చోరీ! ఇలా మూడు నెలల కాలంలో సుమారు రూ.కోటికి పైగా దారి మళ్లించాడు. క్రికెట్ బెట్టింగులకు బానిసగా మారిన సేవ్యానాయక్ బ్యాంకు సొమ్ముతో క్రికెట్ బెట్టింగులు ఆడాడంటున్నారు. అయితే ఇతని స్వాహా పర్వాన్ని అధికారులు గత నాలుగో తేదీనే గుర్తించి, ఖాతాలన్నింటినీ జల్లెడ పట్టి ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకున్నారు. సేవ్యానాయక్‌ను సస్పెండ్ చేశారు. అయితే ఈ ఘటనపై వివరణ ఇవ్వడానికి బ్యాంకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. -
బ్యాంక్ ఉద్యోగి: భార్య వేధిస్తోంది.. చనిపోతున్నా..
గోల్కొండ: ఉన్నత చదువులు, మంచి ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. షేక్‌పేట్‌కు చెందిన సంతోష్(36) నగరంలోని బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి 2013లో పాత నగరానికి చెందిన కళ్యాణితో పెళ్లి అయింది. వీరికి అభిరామ్(6) కొడుకు ఉన్నాడు. అభిరామ్ కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నాడు. దీంతో సంతోష్‌ను భార్య కళ్యాణి వేధిస్తోంది. భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఆన్లైన్లో పురుగుల మందు తెప్పించుకున్నాడు. శుక్రవారం రాత్రి కూల్ డ్రింక్‌లో ఆ మందును కలిపి తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా ఆదివారం మృతి చెందాడు. సెల్ఫీ వీడియో.. సంతోష్ ఆత్మహత్య చేసుకునే ముందే ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన మరణానికి భార్య కళ్యాణి కారణమని స్పష్టం చేశాడు. ఇప్పటి వరకు మూడుసార్లు తనపై కళ్యాణి కుటుంబ సభ్యులు హత్యాయత్నం చేశారని, కేసులు, పంచాయితీలతో తనను ఇబ్బంది పెట్టారని రికార్డ్ చేశాడు. కళ్యాణి తల్లిదండ్రులు అరుణ, పండరినాథ్, కళ్యాణి సోదరుడు గణేష్, బాబాయి భీమ్ హత్యాయత్నం చేశారని ఆరోపించాడు. -
కారు హారన్ మోగించాడని... ఎంత పని చేశారంటే..
కర్నూలు: తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా మానవపాడు ఎస్బీఐ శాఖ ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న గుట్టపాటి ముని మహేశ్వరరెడ్డి హత్య కేసు మిస్టరీని 4వ పట్టణ పోలీసులు ఛేదించారు. బండి ఆత్మకూరు మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ముని మహేశ్వరరెడ్డి కర్నూలు నగరంలోని సంతోష్ నగర్ వెనుక వైపు ఉన్న విజయ లక్ష్మీ నగర్లో ఇళ్లు నిర్మించుకుని స్థిరపడ్డాడు. వీరి ఇంటి వరుసలోనే కొంత దూరంలో తెలుగు చంద్రకాంత్ ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఈ నెల 14వ తేదీ రాత్రి మహేశ్వరరెడ్డి ఇంటికి కారులో వెళ్తూ.. చంద్రకాంత్ ఇంటి ముందు దారికి అడ్డంగా ఉన్న కారును పక్కకు తీయాలని హారన్‌ను కొట్డాడు. అయితే హారన్ మోగించాడనే కోపంతో ఇరువురు తిట్టుకోవడం, తోసుకోవడం జరిగింది. కొద్ది సేపటి తర్వాత ఇంటి ముంగిట ఉన్న మహేశ్వరరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి కత్తులతో పొడిచి హత్య చేశారు. మృతుడి భార్య రామేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పక్కా ఆధారాలతో నిందితులు బెస్త చంద్రకాంత్, బెస్త శ్రీకాంత్, పటాన్ రెహన్‌ఖాన్, పటాన్ ఇలియాస్ ఖాన్, షేక్ ఇమ్రాన్ బాషా, సొప్పారం ధనుంజయ్, కుమ్మరి రామదాస్ అలియాస్ రామిరెడ్డి తదితరులను సంతోష్ నగర్ జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు. వారు నేరానికి ఉపయోగించిన బొలొరో వాహనంతో పాటు రెండు వేటకొడవల్లు, పిడుబాకు స్వాధీనం చేసుకుని కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్ ఎదుట హాజరుపరిచారు. బుధవారం సాయంత్రం 4వ పట్టణ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐలు గోపాల్‌రెడ్డి, చిరంజీవి, రామయ్యలతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించి డీఎస్పీ వివరాలను వెల్లడించారు. చదవండి: తన చావుకు వారే కారణమంటూ సెల్ఫీ వీడియో తీసి.. సాక్షి ఎఫెక్ట్: మాయలేడి అరెస్టు -
బ్యాంకులో ఉద్యోగం .. మరి ఇదేం కక్కుర్తి బాబు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి అయిన అతగాడు తండ్రి మెడికల్ షాపును అడ్డాగా చేసుకుని రెమిడెసివిర్ (రెడీఎక్స్‌ఎల్) ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లో విక్రయించడం మొదలెట్టాడు. ఒక్కో దాన్ని రూ.35 వేలకు అమ్ముతున్న ఇతడి వ్యవహారంపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు నాలుగు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని పాన్ బజార్‌కు చెందిన ఆకుల మేహుల్ కుమార్ హైటెక్ సిటీలోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో ఉద్యోగి. ఇతడి తండ్రి విజయ్‌కుమార్ పాన్ బజార్లో మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో యాంటీ వైరల్ డ్రగ్స్‌కు భారీ డిమాండ్ వచ్చింది. తన తండ్రి దుకాణంలో కూర్చున్న సమయంలో ఈ విషయం తెలుసుకున్న మేహుల్ వాటిని సమీకరించుకుని బ్లాక్ మార్కెట్లో విక్రయించాలని పథకం వేశాడు. దీన్ని అమలులో పెడుతూ వివిధ మార్గాల్లో రెమిడెసివిర్ సంబంధిత ఇంజక్షన్ అయిన రెడీఎక్స్‌ఎల్ సమీకరిస్తున్నాడు. వీటిని అవసరమున్నవారికి అధిక ధరలకు విక్రయిండం మొదలెట్టారు. గరిష్టంగా ఒక్కో ఇంజక్షన్‌ను రూ.35 వేలకు విక్రయిస్తున్నాడు. దీనిపై ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావుకు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన బృందం మేహుల్ ను పట్టుకుని నాలుగు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకుంది. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని మహంకాళి పోలీసులకు అప్పగించారు. కేపీహెచ్‌బీకాలనీ పరిధిలో.... రెమిడెసివిర్ ఇంజక్షన్‌ను అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం కేపీహెచ్‌బీ టెంపుల్ బస్టాప్ వద్ద గల ఓ మెడికల్ షాపు వద్ద రెమిడిసెవిర్ ఇంజక్షన్ కలిగి ఉన్న జోసఫ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కరోనాతో బాధపడుతున్న ఓ వ్యక్తికి లక్ష రూపాయలకు నాలుగు ఇంజక్షన్లు విక్రయించాడు. మరో ఇంజక్షన్‌ను 25 వేలకు అమ్మకానికి పెట్టాడు. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు జోసఫ్‌రెడ్డిని ఇంజక్షన్ విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. హయత్‌నగర్‌లో... రెమిడెసివిర్‌ను అధిక ధరకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. హయత్‌నగర్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేసే ల్యాబ్ అసిస్టెంట్ కొర్ర బాల్‌రాజు, భాషపంగు పరశురాములు, భాషపంగు రవీందర్‌లు పథకం ప్రకారం తమకు తెలిసిన మెడికల్ దుకాణాలు, డి్రస్టిబ్యూటర్ల ద్వారా కొనుగోలు చేసిన రెమిడెసివిర్ ఇంజక్షన్లను రూ.30 నుంచి 35 వేలకు అమ్మడం మొదలు పెట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆస్పత్రి సమీపంలో ఇంజక్షన్ అమ్మడానికి సిద్ధంగా ఉన్న బాల్రాజును అరెస్టు చేశారు. ( చదవండి: కరోనా డాక్టర్ల కాసుల దందా.. బ్లాక్ మార్కెట్లో రెమిడెసివర్ ) -
4సార్లు పెళ్లి..మూడు సార్లు విడాకులు..32 సెలవులు
ఆఫీసుల్లో సాధారణంగా సెలవు కావాలంటే.. పంటి నొప్పి నుంచి ఈ లోకంలో లేనివారి చావు వరకూ చాలా కథలే వినిపిస్తుంటాయి. అయితే తైవాన్ కి చెందిన ఓ బ్యాంక్ క్లర్క్.. కేవలం సెలవు కోసం ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకుని, మూడు సార్లు విడాకులు ఇచ్చాడు. తైవానీస్ చట్టం ప్రకారం, ఒక వ్యక్తి వివాహానికి 8 రోజుల వేతన సెలవులు(పెయిడ్ లీవ్స్) పొందే హక్కు ఉంది. దాని ప్రకారం సదరు హీరో.. గత ఏడాది ఏప్రిల్ 6న పెళ్లి చేసుకుని పెయిడ్ లీవ్స్ పొందాడు. అయితే.. 8వ(చివరి) రోజు తన భార్యకు విడాకులు ఇచ్చి.. ఆ మరునాడే మళ్లీ పెళ్లి అంటూ మరో 8 రోజుల పెయిడ్ లీవ్స్‌కి అప్లై చేసుకున్నాడు. ఇలా 37 రోజుల్లో 4 సార్లు పెళ్లి, 3 సార్లు విడాకులతో 32 రోజులు సెలవులు తీసుకున్నాడు. ఇతగాడి గారడీలను గుర్తించిన సదరు బ్యాంక్.. ఆ సెలవులకు అనుమతించకపోవడంతో న్యాయం చెయ్యాలంటూ తైపీ సిటీ లేబర్ బ్యూరోని ఆశ్రయించాడు ఆ పెళ్లికొడుకు. దర్యాప్తు ప్రారంభించిన బ్యూరో.. బ్యాంక్ కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిందని అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో యజమానికి 7వందల డాలర్లు జరిమానా కూడా విధించింది. ‘లేబర్ లీవ్ రూల్స్’ ఆర్టికల్ 2 ప్రకారం ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా చట్టంలోని లూప్ హోల్స్ ఉపయోగించుకున్నప్పటికీ.. దాన్ని కారణంగా తీసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే వాదోపవాదాల నడుమ బ్యాంక్‌కి, క్లర్క్‌కి జరిగిన సమరంలో ఈ ఏడాది ఏప్రిల్ 10న బ్యూరో మరో తీర్పునూ వెలువరించింది. బ్యాంక్ క్లర్క్ ప్రవర్తన అనైతికం అయినప్పటికీ.. గతంలో ఇచ్చిన తీర్పును అయిష్టంగానే సమర్థించుకుంటూ ‘అతను చట్టాన్ని ఉల్లంఘించలేదు’అని స్పష్టం చేసింది. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
అక్రమాలకు పాల్పడ్డ బ్యాంకు ఉద్యోగి రంగాచారి
-
అందరూ చూస్తుండగా భర్తను చితకబాదిన భార్య
సాక్షి, వరంగల్: మరో మహిళతో సహజీవనం చేస్తూ తనను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్న భర్తకు ఒక మహిళ తగిన రీతిలో బుద్ధి చెప్పింది. బ్యాంకులో పనిచేస్తున్న అతడిని అందరూ చూస్తుండగానే చొక్కా పట్టుకుని చితకబాదింది. ఈ ఘటన మంగళవారం వరంగల్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్‌కు చెందిన శ్రీనివాస్ పోచమ్మ మైదాన్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా 10 సంవత్సరాల క్రితం ఒక మహిళను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వారికి ఒక పాప ఉంది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని కట్టుకున్న భార్యను పట్టించుకోవడం మానేశాడు. కాగా మహిళతో సహజీవనం చేస్తూ ఇంటికి రావడం తగ్గించిన శ్రీనివాస్‌పై అనుమానం వచ్చి అతను పని చేస్తున్న బ్యాంకుకు వెళ్లి నిలదీసింది. వేరొక మహిళతో కలిసి ఉంటూ నాకు అన్యాయం చేస్తావా అంటూ అందరు చూస్తుండగానే శ్రీనివాస్ చొక్కా పట్టుకొని చితకబాదింది. ఈ ఘటనతో షాక్‌కు గురైన సిబ్బంది ఆమెను నిలువరించేందుకు ప్రయత్నించినా ఎవరి మాట వినకుండా మరోసారి చితకబాదింది. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. -
ఫోన్ కోసం వెంటపడి ప్రాణం తీశారు
సాక్షి, నెల్లూరు(క్రైమ్): నగరంలోని కరెంటాఫీస్ సెంటర్లో బ్యాంక్ ఉద్యోగి దారుణ హత్యకు గురైన కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఫోన్ కోసం ఓ పాతనేరస్తుడు తన సహచరుడితో కలిసి హత్య చేసిన విషయం పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దీంతో పోలీసులు నిందితులను శనివారం అరెస్ట్ చేశారు. వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి నిందితుల వివరాలను వెల్లడించారు. నగరంలోని విక్రమ్నగర్లో గల చాముండేశ్వరి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న మల్లిరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (32) కెనరా బ్యాంక్ లైఫ్ ఇన్సురెన్స్‌లో పనిచేస్తున్నారు. గతేడాది డిసెంబర్ నాలుగున కార్యాలయ పని నిమిత్తం విజయవాడ వెళ్లిన ఆయన ఆరో తేదీ రాత్రి అక్కడి నుంచి నెల్లూరొచ్చారు. రాత్రి 11.45 గంటల సమయంలో కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద బస్సు దిగి వస్తుండగా, అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో కరెంటాఫీస్ సెంటర్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యారు. చదవండి: ఎవరూ లేనిది చూసి.. ఆరేళ్ల చిన్నారిపై ఘటనపై కేసు నమోదు చేసిన వేదాయపాళెం పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. చిన్నపాటి క్లూ సైతం దొరక్కపోవడంతో కేసు మిస్టరీగా మారింది. దీంతో వేదాయపాళెం ఇన్స్పెక్టర్ రామకృష్ణ నేతృత్వంలో ఎస్సై లక్ష్మణ్‌రావు తమ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన సమయంలో బైక్‌లో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. హత్య చేసింది పాత నేరస్తుడైన డైకస్‌రోడ్డు ఎన్సీసీ కాలనీకి చెందిన మొఘల్ అక్బర్, అతని స్నేహితుడు సయ్యద్ జావీద్గా గుర్తించి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు స్థానిక పెద్ద మనుషుల సాయంతో పోలీస్‌స్టేషన్‌లో శనివారం లొంగిపోయారు. చదవండి: పెళ్లి వేడుకలకు వెళ్తున్నామని.. తాగిన మైకంలో! హత్య చేసింది ఇలా.. నిందితులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా, హత్యచేసింది తామేనని అంగీకరించారు. పాత నేరస్తుడైన మొఘల్ అక్బర్‌పై పలు చోరీ కేసులు ఉన్నాయి. హత్య జరిగిన రోజు రాత్రి అక్బర్ తన స్నేహితుడు జావీద్తో కలిసి చోరీ చేసేందుకు బయల్దేరారు. డైకస్‌రోడ్డు మీదుగా గాంధీనగర్ చేరుకోగా, అక్కడ దొంగతనానికి అనువుగా లేకపోవడంతో కరెంటాఫీస్ సెంటర్‌కు చేరుకున్నారు. అదే సమయంలో రవీంద్రనాథ్‌రెడ్డి ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గమనించిన నిందితులు ఫోన్‌ను చోరీ చేయాలని నిశ్చయించుకున్నారు. బైక్‌పై నిందితులిద్దరూ రవీంద్రనాథ్‌రెడ్డి వద్దకెళ్లి ఫోన్‌ను లాక్కునేందుకు యత్నించగా, ఆయన ప్రతిఘటించారు. వారిని మందలించి పోలీసులకు పట్టిస్తానని చెప్పడంతో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆందోళనకు గురైన అక్బర్ తన జేబులో నుంచి కత్తిని తీసి రవీంద్రనాథ్‌రెడ్డి ఎడమై వైపు గొంతుకింద, ఛాతిపైన బలంగా పొడిచాడు. దీంతో రవీంద్రనాథ్‌రెడ్డి కుప్పకూలిపోయారు. అతని జేబు నుంచి కిందపడిన ఏటీఎం కార్డును నిందితులు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారని డీఎస్పీ వెల్లడించారు. వేదాయపాళెం ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్సై లక్ష్మణ్‌రావు, క్రైమ్ పార్టీ సిబ్బంది ప్రసాద్, సుధ, గోపాల్, జిలానీ, మస్తాన్‌ను డీఎస్పీ అభినందించారు. -
లంచం కేసులో చైనా కోర్టు సంచలన తీర్పు
బీజింగ్: లంచం ఎన్నో సందర్బాల్లో ఎంతో మంది జీవితాల్లో పెను విషాదాలు నింపింది. మన దేశంలో లంచగొండి అధికారుల వేధింపులు తాళలేక ఎందరో ప్రభుత్వ కార్యాలయాల ముందే ప్రాణాలు తీసుకున్న ఘటనలు కోకొల్లలు. ఇక లంచగొండులకు వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు తెచ్చినా మార్పు మాత్రం శూన్యం. ఈ క్రమంలో ఓ లంచగొండి అధికారికి ఉరి శిక్ష విధించిన వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఇది మన దగ్గర కాదు.. చైనాలో. వివరాలు.. లంచం, అవినీతి కేసులో చైనా ప్రభుత్వ మాజీ అధికారి లై షియామిన్‌కు అక్కడ న్యాయస్థానం మంగళవారం మరణశిక్ష విధించింది. మొత్తం 260 మిలియన్ డాలర్ల మేర అవినీతికి పాల్పడినట్టు న్యాయస్థానం నిర్ధారించింది. చైనా అతిపెద్ద ప్రభుత్వ-నియంత్రిత ఆర్ధిక నిర్వహణ సంస్థకు లై షియోమిన్ గతంలో ఛైర్మన్‌గా వ్యవహరించారు. కమ్యూనిటీ పార్టీ మాజీ సభ్యుడైన లై షియామిన్ గతేడాది జనవరిలో అధికార మీడియా సీసీటీవీలో తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించారు. బీజింగ్‌లోని తన అపార్ట్మెంట్లో ఉన్న లాకర్లను తెరిచిన అధికారులు.. అందులో బయటపడ్డ నగదు చూసి షాక్ అయ్యారు. అక్రమమార్జన కోసం లై తన హోదాను దుర్వినియోగం చేశాడని తియాంజిన్ కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన లంచం తీసుకున్న చర్యను ‘చాలా పెద్ద’ నేరంగా, తీవ్రమైనదగా కోర్టు అభిప్రాయపడింది. ఇక లై ఉద్దేశపూర్వకంగా తీవ్రమైన హానికారక చర్యకు పాల్పడ్డారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. (చదవండి: నడి రోడ్డు మీద లంచావతారం..) హాంగ్‌కాంగ్-లిస్టెడ్ చైనా హువారోంగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మాజీ ఛైర్మన్ అయిన లై.. మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించి, చట్టవిరుద్ధంగా పిల్లలను కన్నట్టు నిర్ధారణ అయ్యింది. హువారంగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఛైర్మన్‌గా ఉంటూ 2009 నుంచి 2018 మధ్య 3.8 మిలియన్ డాలర్ల మేర ప్రజా ధనాన్ని అపహరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2018 ఏప్రిల్‌లో ఆయనపై దర్యాప్తు ప్రారంభమయ్యింది. టెలివిజన్ లైవ్‌లో తన నేరాన్ని అంగీకరించిన లై.. మొత్తం డబ్బును దాచిపెట్టానని, అందులోది ఒక్క పైసా కూడా తాను ఖర్చుచేయలేదు.. దానికి తనకు ధైర్యం సరిపడలేదని తెలిపారు. (చదవండి: శంకరయ్య.. 4.58 కోట్లు.. 11 ప్లాట్లు..) లంచంగా లై ఖరీదైన కార్లు, బంగారు బిస్కెట్లను తీసుకున్నట్టు అంగీకరించారు. లై వ్యక్తిగత ఆస్తులన్నీ జప్తు చేసి, తన రాజకీయ హక్కులను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే, జీ జిన్‌పింగ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన అవినీతి నిరోధక ప్రచారం తన ప్రత్యర్థులను, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఒక మార్గంగా ఉపయోగపడిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. సీసీటీవీ తరచూ నేరాలకు పాల్పడే నిందితులతో ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తుంది. వారు కోర్టులో హాజరుకాకముందే బలవంతంగా నేరాన్ని ఒప్పుకునేలా ప్రేరేపించడాన్ని న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. -
64 ఏళ్ల వయస్సులో ఎంబీబీఎస్
భువనేశ్వర్: 40 ఏళ్లపాటు బ్యాంకు ఉద్యోగం చేసి, 4 దశాబ్దాల పాటు సంసార సాగరాన్ని ఈది, పిల్లలను పెంచి పెద్దచేసి, ప్రయోజకులను చేశాక ఎవరైనా సంతృప్తిగా ఊపిరి పీల్చుకుంటారు. కానీ, ఒడిశాకు చెందిన 64 ఏళ్ళ విశ్రాంత బ్యాంకు ఉద్యోగి జై కిశోర్ ప్రధాన్ మాత్రం అలా అనుకోలేదు. డాక్టర్ అవ్వాలన్న తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు వయస్సుని పక్కనబెట్టి కృషి చేశారు. ఎట్టకేలకు నీట్లో 175 మార్కులు పొంది, 5,94,380 స్కోరుని సాధించి, ఒడిశాలోని బర్లాలో ప్రభుత్వ, వీర్ సురేంద్ర సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కాలేజీలో నాలుగేళ్ళ ఎంబీబీఎస్ కోర్సులో చేరి తన కల నిజం చేసుకున్నారు. ప్రధాన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2016లో డిప్యూటీ మేనేజర్‌గా రిటైర్ అయ్యారు. 1970లో ఇంటర్మీడియట్ అయిన తరువాత ఒకసారి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాశారు. సీటు రాకపోవడంతో బీఎస్సీలో చేరారు. అయితే అప్పటి నుంచి తన కోరిక అసంపూర్ణంగానే ఉండిపోయింది. 15 ఏళ్ళు బ్యాంకు ఉద్యోగం చేశాక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని, ఇదే ప్రయత్నం చేయాలను కున్నప్పటికీ కుటుంబం గడవడం కష్టమని భావించారు. కూతుళ్ళిద్దరూ నీట్కి ప్రిపేర్ అవుతుండడంతో వారిని చదివిస్తూ తాను కూడా కృషిని కొనసాగించారు ప్రధాన్. 2019లో సుప్రీంకోర్టు నీట్ పరీక్షకు వయోపరిమితిని తాత్కాలికంగా ఎత్తివేయ డంతో ఇది సాధ్యమైందంటారు ప్రధాన్. అయితే తన కూతుళ్ళలో ఒకరు ఇటీవల మృతి చెందడంతో ప్రధాన్ కుటుంబాన్ని విషాదం వీడలేదు. తన కూతురుకు గుర్తుగా ఈ చదువుని కొనసాగిస్తానంటున్నారు ప్రధాన్. -
బ్యాంక్ రెడీ అవుతోంది!
మహేశ్ బాబు కోసం ఓ బ్యాంక్ రెడీ అవుతోంది. నెల రోజుల పాటు మహేశ్ ఈ బ్యాంక్‌కి వెళుతుంటారు. ఇంతకీ బ్యాంక్ కథ ఏంటీ అంటే.. ‘సర్కారువారి పాట’లో మహేశ్‌బాబు బ్యాంక్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తారనే వార్త వినపడుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో బ్యాంక్ సెట్ వేస్తున్నారని సమాచారం. ఈ సెట్లో నెల రోజుల చిత్రీకరణ ప్లాన్ చేశారట. వచ్చే నెల ఈ షూటింగ్ ప్రారంభమయ్యే చాన్స్ ఉంది. ముందు అమెరికా షెడ్యూల్ జరిపి, ఆ తర్వాత ఇక్కడ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల ప్లాన్ మారింది. ముందు ఈ సెట్లో షూట్ చేసి, మార్చిలో అమెరికా షెడ్యూల్ ప్రారంభించాలనుకుంటున్నారు. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ సంస్థలు నిర్మించనున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ కథానాయికగా నటించనున్నారు. -
సూసైడ్‌లో నోట్లో షాకింగ్ విషయం
సాక్షి, చెన్నై: చదువుకున్న ప్రతి యువకుడి అతిమ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం. ఎంత పెద్ద చదువు చదవినా.. నిద్రలేని రాత్రులు గడిపినా వారి ప్రయత్నమంతా గవర్నమెంట్ జాబ్ కోసమే. ఒక్కసారి జాబ్ వచ్చిందంటే ఇక వారి ఆనందానికి హద్దులే ఉండవు. అయితే ఈ ప్రయత్నంలో ఎంత కష్టపడ్డా కోరుకున్న ఉద్యోగం రాలేదని ఆత్మహత్యకు పాల్పడిన యువకులు, నిరుద్యోగుల సంఖ్య కోకొల్లలు. దేశంలో రోజు నమోదు అవుతున్న ఆత్మహత్యల కేసుల్లో సింహ భాగం వీరిదే ఉంటుంది. (నీవు లేక నేనుండ లేను.. నీ వద్దకే వస్తా) అయితే ఓ యువకుడు విచిత్రంగా తనకు ఉద్యోగం వచ్చిందని ప్రాణం తీసుకున్నాడు. వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. నమ్మి తీరాల్సిందే. వివరాల ప్రకారం.. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన ఎస్ నవీన్ (33) అనే యుకుడికి ఇటీవల ఓ జాతీయ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం లభించింది. ఆర్థిక రాజధాని ముంబైలో పోస్టింగ్. ఎన్నో ప్రయత్నాల తరువాత ఉన్నత ఉద్యోగం రావడంతో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సన్నిహితులు ఎంతో సంతోషపడ్డారు. అయితే ఉద్యోగంలో చేరిన 15 రోజుల్లోనే నవీన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబై నుంచి త్రివేండ్ర వెళ్తున్న రైలు కింద పడి గత శనివారం ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తుల్లో విషాదంలో నింపింది. అయితే నవీన్ ఆత్మహత్యపై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. అతని చేబులో స్వాధీనం చేసుకున్న సూసైడ్ లెటర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే తన ప్రాణాలు అర్పిస్తానని దేవుడికి మొక్కినట్లు దానిలో రాసిఉంది. ‘ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నా. ఎన్నో ప్రార్థనలు చేశా. జాబ్ వస్తే తన ప్రాణలు అర్పిస్తా అని మొక్కినా. చివరికి ప్రార్థనలు ఫలించి బ్యాంక్ మేజేజర్ పోస్టు వచ్చింది. 15 రోజులు ఉద్యోగం చేశా. దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆత్మహత్య చేసుకుంటున్నా. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అంటూ నోట్లో పేర్కొన్నాడు. మరోవైపు నవీన్ సూసైడ్ లెటర్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది అతనే రాశాడా లేక దీని వెనుక ఎవరి కుట్రైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగం వస్తే ఆత్మహత్య చేసుకోవడం ఏంటనీ మరింత లోతుగా విచారిస్తున్నారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు..మృతదేహాన్ని కన్యాకుమారిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. -
స్వలింగ సంపర్కం.. బ్యాంక్ అధికారి నిర్వాకం
సాక్షి, అమీర్‌పేట(హైదరాబాద్) : స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డ ఓ బ్యాంకు అధికారి ఆన్లైన్లో విటుడ్ని బుక్ చేసుకుని న్యూసెన్సు చేశాడు. దీంతో పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేశారు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన మేరకు.. వనస్థలిపురం ఆంధ్రాబ్యాంక్ శాఖలో పనిచేసే ఉన్నతాధికారి స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డాడు. ఆన్లైన్లో చాటింగ్ చేసి ఎస్ఆర్నగర్ సమీపంలోని బస్తీకి చెందిన విటుడ్ని 5 వేలకు బుక్ చేసుకున్నాడు. (చదవండి: కరోనా రాకుండా తండ్రికి విషమిచ్చి..) విటుడ్ని కలిసేందుకు ఆ అధికారి ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి 3 గంటల సమయంలో బస్తీకి వచ్చాడు. ఓ ఇంట్లోని మొదటి అంతస్తులో ఉన్న విటుడి వద్దకు వెళ్లాడు. అతడు వికలాంగుడు కావడంతో నిర్ఘాంతపోయిన బ్యాంకు అధికారి వెనుతిరిగాడు. అయితే డబ్బు ఇవ్వాల్సిందేనని వికలాంగుడు పట్టుబట్టడంతో ఇరువురి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ పెద్దది కావడం, ఇదే సమయంలో మంచినీటి సరఫరా జరుగుతుండంతో నీళ్లు పట్టుకునేందుకు బయటికి వచ్చిన మహిళలు దొంగేమోనని అనుమానించి అధికారిని పట్టుకున్నారు. 100కు డయల్ చేయడంతో పెట్రోలింగ్ సిబ్బందికి అక్కడకు చేరుకుని బస్తీలో న్యూసెన్సుకు పాల్పడ్డ ఇద్దరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 8వ తేదీన బ్యాంకు అధికారితో పాటు విటుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: రాచకొండలో నకిలీ డాక్టర్ హల్చల్) -
అతడిపై కఠిన చర్యలు తీసుకోండి: నిర్మల
న్యూఢిల్లీ : గుజరాత్లో మహిళా బ్యాంక్ ఉద్యోగినిపై దాడి కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కాగా సూరత్‌లోని కెనరా బ్యాంక్(ఒకప్పటి సిండికేట్ బ్యాంక్) మహిళా ఉద్యోగినిపై సోమవారం సాయంత్రం ఓ కానిస్టేబుల్ దాడి చేయడమే కాకుండా బ్యాంకులో నానా హంగామా సృష్టించాడు. ఈ ఘటన అనంతరం ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఇలాంటి చర్యల నుంచి బ్యాంకు ఉద్యోగులను రక్షించాలని ఈ లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆర్థిక మంత్రి బుధవారం మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి పోలీస్ కమిషనర్‌తోపాటు సంబంధిత అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఉద్యోగుల భద్రత గురించి, కేసు విచారణణు వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. (కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం) ఈ మేరకు ట్వీట్ చేసిన ఆమె ‘బ్యాంకు ఉద్యోగుల భద్రత ప్రాముఖ్యత. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ బ్యాంకులు తమ సేవలను ప్రజలకు అందిస్తున్నారు. బ్యాంకుకు చెందిన మహిళ సిబ్బంది దాడి ఘటనపై డాక్టర్ ధవాల్ పటేల్, సూరత్ జిల్లా కలెక్టర్, కమిషనర్ భ్రాంభట్తో మాట్లాడాను. మహిళా బ్యాంక్ ఉద్యోగి ప్రస్తుతం సెలవుల్లో ఉన్నారు. ఈ కేసుపై సకాలంలో చర్యలు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అలాగే నిందితుడు కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్ చేస్తామని పోలీస్ కమిషనర్ భ్రాంభట్ పేర్కొన్నారు’ అని నిర్మలా తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. (అక్టోబర్‌లో తారస్థాయికి.. మళ్లీ సంపూర్ణ లాక్డౌన్! ) -
కిడ్నీకి రూ. కోటి పేరుతో యువతిని..!
సాక్షి, కర్ణాటక: మహిళలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. కుటుంబ సమస్యలు ఒక్కసారిగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశ్యంతో కిడ్నీ విక్రయానికి పెట్టిన 24 ఏళ్ల యువతిని సైబర్ కీచకులు నిలువునా మోసగించారు. దీంతో బాధిత యువతి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ ఘటనపై హడాపింగ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఆర్థిక సమస్యలు తొలగించుకోవాలని: తల్లిదండ్రులతో బెంగళూరులో నివాసం ఉంటున్న యువతి బ్యాంకు ఉద్యోగిని. మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. వాటిని నుంచి గట్టెక్కడానికి యువతి ప్రయత్నాలు చేపట్టింది. ఓ సోషల్ మీడియాలో కిడ్నీ దానం చేస్తే రూ. కోటి ఇస్తామనే ప్రకటన గమనించి అక్కడి ఫోన్ నెంబర్లో విచారణ చేసింది. సైబర్ వంచకుడు యువతికి తిరిగి ఫోన్ చేసి కిడ్నీ ఇవ్వాలనుకుంటే మొదట కొంత ఫీజు చెల్లించాలని సూచించాడు. పోలీస్ సర్టిఫికెట్ ఇతరత్రా వాటికి ముందు నగదు చెల్లిస్తే అనంతరం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటామని వంచక ముఠా యువతికి సూచించింది. వీరి మాటలు నమ్మిన యువతి కిడ్నీ ఇవ్వడానికి సమ్మతించి దశల వారీగా వారి వంచకులకు రూ. 3.14 లక్షలు చెల్లించింది. తిరిగి వంచకులు యువతిని నగదు అడగడంతో ఆమెకు అనుమానం రావడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని అధికారులు తెలిపారు. చదవండి: బెజవాడలో కత్తులతో విద్యార్థుల వీరంగం బంగారు ఆభరణాలు విక్రయించి... లాక్ డౌన్ సమయంలో బ్యాంకులు పనిచేయలేదు. దీంతో సదరు యువతికి కూడా ఇంటికే పరిమితమైంది. ఈ క్రమంలో కష్టాలు తీరాలంటే డబ్బులు కావాలని, కిడ్నీ విక్రయిస్తే డబ్బులు వస్తాయని భావించి గూగుల్‌లో తీవ్రంగా సోదించింది. చివరికి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు విక్రయించి వంచకుల అకౌంట్‌కు జమ చేసి నిలువునా మోసపోయింది. ఏటా పెరుగుతున్న సైబర్ నేరాలకు ఎప్పడు అడ్డుకట్టపడతాయో. చదవండి: విషాదం : మత్తు కోసం స్పిరిట్ తాగి .. -
కరోనాతో బ్యాంకు ఉద్యోగి మృతి
హైదరాబాద్ (సుల్తాన్‌బజార్): కోఠి బ్యాంక్‌స్ట్రీట్ ఎస్బీఐ లోకల్ హెడ్ ఆఫీస్‌లోని కమర్షియల్ బ్రాంచ్‌లో మెసెంజర్‌గా పనిచేసే ఓ ఉద్యోగి కరోనాæతో సోమవారం మృతి చెందాడు. కాచిగూడ నింబోలిఅడ్డా ప్రాంతంలో నివసించే (57) సంవత్సరాల వ్యక్తి ప్రతిరోజు బ్యాంకుకు వచ్చే వినియోగదారులు ఇచ్చే వోచర్లను బ్యాంకు ఉద్యోగులకు అందజేస్తుంటాడు. అతనికి కొంత కాలంగా జ్వరం, దగ్గు వస్తుండటంతో సెలవులో ఉన్నాడు. ఈ నెల 14న బ్యాంకులోని డిస్పెన్సరీకి వెళ్లి మందులు తీసుకున్నాడు. జ్వరం తగ్గకపోవడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకోగా, గాంధీకి రిఫర్ చేశారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. దీంతో నింబోలిఅడ్డా కామ్‌ఘర్‌నగర్‌లోని అతని కుటుంబసభ్యులతో పాటు ఎస్బీఐ కమర్షియల్ బ్యాంక్‌లో పని చేసే 60 మంది ఉద్యోగులను హోం క్వారంటైన్ చేశారు. ఉద్యోగుల ఫోన్ నంబర్లు, ఇంటి అడ్రస్‌లు వైద్య సిబ్బంది సేకరించారు. జ్వరం, దగ్గు వస్తే తమను సంప్రదించాలని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు వేయి మంది విధుల నిర్వహణ... ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలోని కమర్షియల్ బ్రాంచ్‌లో పనిచేసే ఉద్యోగికి కరోనా రావడంతో ఆ బ్యాంక్‌లో పనిచేసే దాదాపు వేయి మంది ఉద్యోగులు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. వారితో పాటు కమర్షియల్ బ్రాంచ్‌లో పనిచేసే 60మంది సైతం వణికిపోతున్నారు. ఎస్బీఐ అధికారులు ఉద్యోగులను ఖాళీ చేయించి బ్యాంకు మొత్తం శానిటైజ్డ్ చేయించారు. ఇదిలా ఉండగా, కరోనా పాజిటివ్‌తో మృతి చెందిన వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగాడు అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడితో కాంటాక్ట్ అయిన వారికి కరోనా సోకితే వందల సంఖ్యలో బాధితులు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబంలో 9 మందికి కరోనా చంచల్‌గూడ: సంతోష్‌నగర్ సర్కిల్ మాదన్నపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుర్మగూడ బస్తీలో నివసించే ఓ 75 ఏళ్ల వృద్ధుడికి రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు అతని కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో సోమవారం మరో 8 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు. వృద్ధుడి నుంచి ఇతర కుటుంబసభ్యులకు సోకినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఇతరులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వెళ్లిన ఆశా వర్కర్లకు చేదు అనుభవం ఎదురైంది. పరీక్షలు వద్దంటూ స్థానికులు వారిని దూషించి వెనక్కు పంపినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మాదన్నపేట పోలీసులు పేర్కొన్నారు. -
దివ్య మరెవరికీ దక్కకూడదనే..
గజ్వేల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్యాంకు ఉద్యోగి దివ్య హత్యకేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట ఇన్చార్జి పోలీస్ కమిషనర్ శ్వేత గురువారం దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఈనెల 18న గజ్వేల్‌లో హత్యకు గురైన దివ్య తండ్రి లక్ష్మీరాజం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేములవాడకు చెందిన వెంకటేశ్‌గౌడ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం రాత్రి వేములవాడలో ప్రత్యేక బృందం పోలీసులు వెంకటేశ్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్య అనంతరం వెంకటేశ్ అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్ళాడని, ఆ తర్వాత రైలులో విజయవాడకు, అక్కడి నుంచి వరంగల్ మీదుగా బుధవారం రాత్రి వేములవాడకు వచ్చాడని పోలీసులు తెలిపారు. తనకు దక్కని దివ్య మరెవరికీ దక్కకూడదనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు విచారణలో వెంకటేశ్ చెప్పాడని, నిందితునికి కఠిన శిక్ష పడేలా చూస్తామని ఇన్చార్జి సీపీ పేర్కొన్నారు. కేసును 24 గంటల్లో ఛేదించిన గజ్వేల్ ఏసీపీ నారాయణ, సీఐ ఆంజనేయులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ శ్వేత అభినందించారు. నిందితునికి వైద్య పరీక్షలు అరెస్టు అనంతరం నిందితుడు వెంకటేశ్‌గౌడ్‌ను గజ్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రాంగణం వద్ద విలేకరులు వెంకటేశ్‌గౌడ్‌ను సంఘటనకు దారితీసిన పరిస్థితులపై ప్రశ్నించగా.. అతను నోరు విప్పలేదు. సుమారు 15 నిమిషాలపాటు వైద్య పరీక్షలు సాగాయి. ఆ తర్వాత పోలీసులు అతడిని గట్టి బందోబస్తు మధ్య గజ్వేల్‌లోని కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించారు. -
దివ్య హత్య కేసు: వేరే వాళ్లకు దక్కకూడదనే..
-
దివ్య హత్య కేసు: వేరే వాళ్లకు దక్కకూడదనే..
సాక్షి, గజ్వేల్(సిద్ధిపేట): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బ్యాంకు ఉద్యోగిని దివ్య(23)హత్య కేసులో నిందితుడైన వెంకటేశ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారం రోజుల్లో పెళ్లి అనగా.. దివ్యను ప్రేమిస్తున్నానని వెంటపడుతూ వేధిస్తున్న నిందితుడు వెంకటేష్ ఈ నెల 18న ఆమెను హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసును చివరకు పోలీసులు ఛేదించారు. మొదట పోలీసులు వెంకటేష్ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకోవడంతో.. నిందితుడు తానే స్వయంగా వచ్చి నిన్న(బుధవారం) వేములవాడ పోలీసు స్టేషన్లో లొంగిపోయిన విషయం తెలిసిందే. విచారణలో నిందితుడు తానే దివ్యను కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో వేములవాడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఇక నిందితుడు దివ్యను హత్య చేసిన తీరును పోలీసులు వివరిస్తూ.. ఈ నెల 18 దివ్య తండ్రి లక్ష్మీరాజ్యం పోలీసు స్టేషన్‌కు వచ్చి.. తన కూతురుని వేధిస్తున్న వేములవాడకు చెందిన వెంకటేశ్.. తనను హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు గజ్వేల్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. పోలీసు కమిషనర్ ఎన్ శ్వేత, ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో నిన్న(బుధవారం) రాత్రి వేములవాడ పట్టణంలో స్పెషల్ టీమ్స్ అధికారులు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే దివ్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దివ్య హత్య : పోలీసుల అదుపులో వెంకటేష్ తల్లిదండ్రులు కాగా 5 నెలల క్రితం దివ్యకు గజ్వేల్ ఏపీజీవీబీ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. గతంలో వెంకటేశ్‌తో సన్నిహితంగా మెలిగిన దివ్య.. ఉద్యోగం వచ్చిన నాటి నుంచి తనను దూరం పెడుతోందని భావించిన వెంకటేశ్.. ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో దివ్యకు వేరేవారితో పెళ్లి కుదరడంతో తనకు దక్కనిది, మరెవరికీ దక్కకూడదన్న ఉద్దేశంతో చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం దివ్య ఉద్యోగం చేస్తున్న గజ్వేల్ బ్యాంకు వద్దకు, ఆమె ఇంటికి పలుమార్లు వచ్చి వెళ్ళాడు. ఈ క్రమంలో ఈనెల 18న రాత్రి సుమారు 7:45 గంటల సమయంలో బ్యాంకు నుండి ఒంటరిగా ఇంటికి వెళ్తున్న దివ్యను గమనించి వెంబడించాడు. ఇక ఆ సమయంలో ఇంటిలో దివ్య తల్లిదండ్రులు కూడా లేకపోవడంతో నిందితుడు తన వెంట తెచ్చుకుని కత్తి తీసి దివ్య గొంతు, ఇతర శరీర భాగాలపై పొడిచి హత్య చేశాడు. (వారం రోజుల్లో ఆమెకు పెళ్లి, ఈలోగా ఘోరం..) ఈ నేపథ్యంలో పోలీసు స్టేషనులో లొంగిపోయిన వెంకటేశ్‌ను.. పోలీసులు విచారించగా తానే దివ్యను కత్తితో పొడిచి హత్య చేసినట్లు అంగీకరించాడు. తొలుత ఘటనాస్థలం నుంచి నేరుగా సికింద్రాబాద్ నుంచి రైలులో విజయవాడకు, అక్కడి నుంచి వరంగల్ మీదుగా వేములవాడకు వచ్చినట్లు వెల్లడించాడు. కాగా నిందితుడికి కఠిన శిక్ష పడి దివ్యకు న్యాయం జరిగేలా కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శ్వేత పేర్కొన్నారు. ఇక కేసు 24 గంటల్లో చేధించిన గజ్వేల్ ఏసీపీ నారాయణ, గజ్వేల్ సీఐ ఆంజనేయులు, మధుసూదన్ రెడ్డి, సిబ్బందిని పోలీస్ కమిషనర్ శ్వేత అభినందించారు. -
దివ్య హత్య కేసు : లొంగిపోయిన వెంకటేశ్
-
దివ్య హత్య కేసు : లొంగిపోయిన నిందితుడు
సాక్షి, సిద్దిపేట : సంచలనం సృష్టించిన బ్యాంకు ఉద్యోగిని దివ్య (23) హత్య కేసులో నిందితుడు వెంకటేశ్ బుధవారం వేములవాడ సీఐ శ్రీధర్ ఎదుట లొంగిపోయాడు. నిందితున్ని సీఐ శ్రీధర్ సిద్దిపేట పోలీసులకు అప్పగించారు. కాగా, వారం రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన దివ్య మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆమె గజ్వేల్‌లోని ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. బ్యాంకు సమీపంలోనే ఓ ఇంటిపై అంతస్తులో అద్దెకు ఉంటోంది. (చదవండి : గజ్వేల్‌లో యువతి దారుణ హత్య) ఆమెకు వరంగల్‌కు చెందిన సందీప్ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈనెల 26న పెళ్లి జరగాల్సి ఉంది. ఈనేపథ్యంలో ఇరు కుటుంబాల వారు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా..ఈ దారుణ ఘటన చోటుచేసుంది. బ్యాంకులో పనులు ముగించుకుని ఇంటికి చేరిన దివ్య.. కాబోయే భర్తతో ఫోన్లో మాట్లాడుతుండగా దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. పదునైన కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. ఆ సమయంలో దివ్య తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడం.. దివ్య నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సందీప్ బ్యాంకు సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో చుట్టుపక్కల వారు, తోటి బ్యాంకు ఉద్యోగులు అక్కడకు వచ్చి చూసేసరికి దివ్య రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి కనిపించింది. ప్రేమోన్మాదమే తమ కుమార్తె హత్యకు కారణమని దివ్య తల్లిదండ్రలులు కన్నీరుమున్నీరయ్యారు. (చదవండి : దివ్య హత్య కేసులో మరో కోణం..) (దివ్య హత్య : పోలీసుల అదుపులో వెంకటేష్ తల్లిదండ్రులు) -
దివ్య హత్య : పోలీసుల అదుపులో వెంకటేష్ తల్లిదండ్రులు
సాక్షి, వేములవాడ : దివ్య హత్యకేసు విచారణలో భాగంగా నిందితుడిగా అనుమానిస్తున్న వెంకటేష్ తల్లిదండ్రులను పోలీసులు వేములవాడలో అదుపులోకి తీసుకున్నారు. పరుశరాం గౌడ్, లతను విచారణ నిమిత్తం గజ్వేల్‌కు తరలించారు. వెంకటేష్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ తండ్రి మాట్లాడుతూ..‘చిన్నప్పుడు 5,6 తరగతుల్లోనే వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. జ్యోతిష్మతి కాలేజీలో ఇద్దరు ఇంజనీరింగ్ పూర్తి చేశారు. హైదరాబాద్‌లో కోచింగ్‌కు వెళ్లిన వాళ్లు అక్కడే పెళ్లి చేసుకున్నామని చెప్పారు. అప్పట్లో అమ్మాయి మిస్సింగ్ అంటూ దివ్య తల్లిదండ్రులు సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. (దివ్య హత్య కేసులో మరో కోణం..) దివ్య తల్లిదండ్రుల ఫిర్యాదుతో ప్రేమించి పెళ్లి చేసుకున్నామని.. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలతో పోలీసుల్ని కలిశారు. ఆ తర్వాత దివ్య మనసు మార్చేసిన ఆమె తల్లిదండ్రులు.. వెంకటేష్ వేధిస్తున్నాడని 2018 అక్టోబర్‌లో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దర్నీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అమ్మాయి జోలికి వెళ్లవద్దని పోలీసులు చెప్పడంతో రాత పూర్వకంగా హామీ ఇచ్చాం. మా కొడుకు హత్య చేశాడని అనుకోవడం లేదు. చనిపోయిన వారిని చూస్తేనే భయపడతాడు. అలాంటి వాడు హత్య చేశాడంటే ఎలా నమ్ముతాం’ అని అన్నారు. (వారం రోజుల్లో ఆమెకు పెళ్లి, ఈలోగా ఘోరం..) మరోవైపు దివ్య మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. అయితే తమకు న్యాయం జరిగేంత వరకూ మృతదేహాన్ని తరలించే ప్రస్తకే లేదని మృతురాలి కుటుంబసభ్యులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వెంకటేష్ కోసం పోలీసులు అయిదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. -
దివ్యకు మూడేళ్ల క్రితమే ప్రేమ వివాహం
-
దివ్య హత్య కేసులో మరో కోణం..
సాక్షి, గజ్వేల్ : దారుణ హత్యకు గురైన దివ్య కేసులో మరో కొత్తకోణం వెలుగు చూసింది. ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వేములవాడకు చెందిన వెంకటేష్‌తో దివ్యకు మూడేళ్ల క్రితమే ప్రేమ వివాహం జరిగినట్లు సమాచారం. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో వెంకటేష్ తల్లిదండ్రులు ఈ పెళ్లిని అంగీకరించకపోవడంతో వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పెళ్లి సమయంలో దివ్య మేజర్ కాకపోవడంతో ఆమెను తల్లిదండ్రులు... హాస్టల్లో ఉంచి చదివించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు దివ్యను వెంకటేష్ వేధించాడని, చివరకు ఈ వ్యవహారం పంచాయితీ వరకూ వెళ్లిందని...దీంతో దివ్య జోలికి రానంటూ వెంకటేష్ హామీ పత్రం రాసిచ్చినట్లు భోగట్టా. (గజ్వేల్‌లో యువతి దారుణ హత్య) ఆ తర్వాత దివ్యకు గజ్వేల్‌లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ)లో ఫీల్డ్ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రులు ఆమెకు వరంగల్‌కు చెందిన సందీప్ అనే యువకుడితో వివాహం కుదిర్చారు. ఈనెల 26న వారి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దివ్యకు బ్యాంక్ ఉద్యోగం రావడంతో పాటు, మరో వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో కసి పెంచుకున్న వెంకటేషే..ఈ ఘోరానికి పాల్పడి వుంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేములవాడలోని ఇంటికి తాళం వేసి వెంకటేష్‌తోపాటు అతని కుటుంబం ఎక్కడికో వెళ్లిపోయానట్లు తెలుస్తోంది. వెంకటేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దివ్య మెడలో బలవంతంగా దండ వేసి పెళ్లంటూ.. కాగా ఎల్లారెడ్డిపేటలో దివ్య నివాసం వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. ఎదిగిన బిడ్డ కుటుంబానికి ఆసరాగా ఉంటున్న సమయంలో దారుణంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దివ్య తల్లి మణెమ్మ మాట్లాడుతూ.. వెంకటేషే తన బిడ్డను హతమార్చాడని, ఆరేళ్లుగా వెంటపడుతున్నాడని తెలిపారు. పెళ్లి చేసుకోకుంటే చంపుతానని బెదిరించాడని, చిన్నప్పుడు దివ్య మెడలో బలవంతంగా దండ వేసి పెళ్లి అయినట్లు ప్రచారం చేశాడని తెలిపారు. దివ్య జోలికి రావద్దని చెప్పినా వినలేదని, దీంతో 2018 అక్టోబర్ 9న ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వెంకటేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని, ...మరోసారి దివ్య జోలికి రాను అని అతడు కాగితం రాసిచ్చాడని తెలిపారు. తన బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న వెంకటేష్‌ను కఠినంగా శిక్షించాలని దివ్య కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
బ్యాంకు ఉద్యోగిని దారుణ హత్య
-
వారం రోజుల్లో ఆమెకు పెళ్లి, ఈలోగా ఘోరం..
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : వారం రోజుల్లో ఆమెకు పెళ్లి జరగాల్సి ఉంది. తల్లిదండ్రులు ఆ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఈలోగా ఘోరం జరిగిపోయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో లోపలకు ప్రవేశించిన దుండగుడు పదునైన ఆయుధంతో ఆమె గొంతుకోసి చంపేశాడు. మంగళవారం రాత్రి గజ్వేల్‌లో ఈ ఘటన జరిగింది. ప్రేమ పేరుతో గత కొంతకాలంగా వేధిస్తున్న యువకుడే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. కాబోయే భర్తతో ఫోన్లో మాట్లాడుతుండగా.. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన న్యాలకంటి లక్ష్మీరాజ్యం, మణెమ్మ దంపతుల మూడో కుమార్తె దివ్య (25) గజ్వేల్‌లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ)లో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు వరంగల్‌కు చెందిన సందీప్ అనే యువకుడితో వివాహం కుదిరింది. ఈనెల 26న వారి పెళ్లి జరగాల్సి ఉంది. సందీప్ కూడా ఏపీజీవీబీలో ఉద్యోగం చేస్తున్నాడు. కోచింగ్ సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. దీంతో పెద్దల అంగీకారంతో వారి పెళ్లి కుదిరింది. ఈ నేపథ్యంలో దివ్య తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పెళ్లి పనుల నిమిత్తం మంగళవారం ఉదయం ఎల్లారెడ్డిపేట వెళ్లారు. దివ్యను కూడా తమతో రావాలని అడగ్గా.. తనకు బ్యాంకులో పనులున్నాయని, వాటిని పూర్తి చేసుకుంటానని చెప్పి బ్యాంకుకు వెళ్లారు. ఎప్పటిలాగే సాయంత్రం విధులు ముగించుకుని లక్ష్మీప్రసన్ననగర్‌లో తాము ఉంటున్న ఇంటికి వచ్చారు. అనంతరం తనకు కాబోయే భర్త సందీప్‌తో ఫోన్లో మాట్లాడుతూ మెట్లు దిగుతుండగా.. రాత్రి 8.06 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి దివ్యపై దాడి చేశాడు. పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోశాడు. ఈ క్రమంలో ఆమె కేకలు వేయడం ఫోన్ మాట్లాడుతున్న సందీప్‌కు వినిపించాయి. వెంటనే అతడు గజ్వేల్‌లో తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి చెప్పారు. దీంతో చుట్టుపక్కల వారు, తోటి బ్యాంకు ఉద్యోగులు అక్కడకు వచ్చి చూసేసరికి దివ్య రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో విచారణ చేశారు. కొన్నేళ్లుగా యువతికి వేధింపులు... కుమార్తె హత్యకు గురైందన్న సమాచారం తెలియడంతో దివ్య తల్లిదండ్రులు హుటాహుటిన ఇంటికి వచ్చారు. ప్రేమోన్మాదమే తమ కుమార్తె హత్యకు కారణమని విలపిస్తూ చెప్పారు. గత కొంతకాలంగా వేములవాడకు చెందిన వెంకటేష్ అనే యువకుడు దివ్యను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పేర్కొన్నారు. దివ్య హైస్కూల్లో చదువుకునే సమయంలో పరిచయం ఉన్న ఆ యువకుడు.. కొన్నేళ్లుగా వేధింపులు తీవ్రతరం చేశాడని చెప్పారు. అతడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్టు వెల్లడించారు. అనంతరం ఈ వ్యవహారంపై పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా.. ఇక తమ కుమార్తె జోలికి రానని కాగితం రాసిచ్చాడని వివరించారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో పెళ్లి ఉండగా.. తమ కుమార్తెను పొట్టనపెట్టుకున్నాడని విలపించారు. కాగా, మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వెంకటేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ నారాయణ తెలిపారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, యువతి ఉంటున్న ఇంటికి అతడు ఏ సమయంలో వచ్చాడు.. ఎలా దాడి చేశాడనే అంశాలను సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తిస్తామని చెప్పారు. ఇప్పటికే తమకు కొన్ని ఆధారాలు లభించాయని వెల్లడించారు. -
బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య
కర్ణాటక, ముళబాగిలు : ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి కలిగి బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం నగరంలో చోటుచేసుకుంది. స్టేట్ బ్యాంక్‌లో విస్తరణ అధికారిగా పనిచేస్తున్న మంజునాథ్ (35) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాలూకాలోని గుమ్లాపుర గ్రామానికి చెందిన మంజునాథ్ ముళబాగిలు ఎస్బీఐ బ్యాంకు విస్తరణాధికారిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన కొందరితో కలిసి ముత్యాల పేటలో ఓ సూపర్ బజార్ ప్రారంభించారు. వ్యాపారంలో నష్టం రావడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. -
నేరగాడు.. బిచ్చగాడు!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నివసించే ఓ ఉద్యోగికి బ్యాంకు అధికారుల మాదిరిగా కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.లక్ష స్వాహా చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఝార్ఖండ్‌లోని జమ్‌తార వరకు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక ఆ సిమ్ ఒక బిచ్చగాడిదని, ఈ నేరంతో అతడికి ఎలాంటి సంబంధం లేదని తెలిసి కంగుతిన్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇటీవల కాలంలో సిమ్ కార్డుల కోసం ఈ పంథా అనుసరిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. వీరు ఒక్కో నేరానికి ఒక్కో సిమ్‌కార్డు, సెల్‌ఫోన్ వాడుతూ ‘పని’ పూర్తి కాగానే వాటిని ధ్వంసం చేస్తున్నారని వివరిస్తున్నారు. నేరగాళ్ల అడ్డా.. జమ్‌తార పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోస్ జిల్లా దాటి ఝార్ఖండ్‌లోకి ప్రవేశించగానే వచ్చేది జమ్‌తార జిల్లా. ఆ జిల్లాలో ఉన్న ఏడు గ్రామాల్లోని యువతకు సైబర్ నేరాలే ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. పూర్తి స్థాయిలో విద్యుదీకరణ సైతం జరగని ఆ జిల్లా కేంద్రంలో జనరేటర్లకు మంచి డిమాండ్ ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వీటి సాయంతో ల్యాప్టాప్స్, సెల్ఫోన్లను వినియోగించే యువత దేశవ్యాప్తంగా అనేక మందికి కాల్స్ చేసి కార్డుల వివరాలు సహా ఓటీపీల కోసం గాలం వేస్తుంటారు. కొన్నేళ్ల క్రితం వరకు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి, అక్కడి కాల్ సెంటర్లలో పని చేసిన వచ్చిన జమ్‌తార యువత... ప్రస్తుతం సొంతంగా నకిలీ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకొని ఈ సైబర్ నేరాలకు పాల్పడుతోంది. జమ్‌తారలో ఉన్న కొందరు కీలక వ్యక్తులు ఫోన్లలో ఎదుటి వారితో మాట్లాడడం ఎలా? అనే అంశంపై తమ యువతకు శిక్షణ కూడా ఇస్తుంటారని పోలీసులు పేర్కొంటున్నారు. రూటు మార్చి... కేవలం ఫోన్ల ఆధారంగా ఈ నేరాలు చేసే వారికి సిమ్‌కార్డుల అవసరం ఎంతో ఉంటుంది. అలాగని తమ పేర్లు, చిరునామాలతో తీసుకుంటే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు దర్యాప్తులో చిక్కే ప్రమాదం ఉంటుందన్నది వారి భావన. దీంతో సిమ్‌కార్డుల కోసం ఈ సైబర్ నేరగాళ్లు గతంలో నకిలీ పేర్లు, బోగస్ చిరునామాలను వినియోగించేవాళ్లు. అయితే కొన్నాళ్లుగా సిమ్‌కార్డుల జారీ నిబంధనలు కఠినతరమయ్యాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించిన జమ్‌తార నేరగాళ్లు... బిచ్చగాళ్లు, అడ్డా కూలీలపై దృష్టిసారించారు. జమ్తారతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన వారిని సంప్రదిస్తూ వారికి అసలు విషయం చెప్పట్లేదు. కేవలం తమకు తక్షణం సిమ్‌కార్డు అవసరం ఉందంటూ రూ.200 నుంచి రూ.500 వరకు వారికి చెల్లించి, వాళ్ల పేరు మీద సిమ్ కార్డులు తీసుకుంటున్నారు. ఆపై తమ ప్రాంతానికి చేరుకొని కాల్స్ చేసి ఎదుటి వారిని నిండా ముంచుతున్నారు. డేటా ఎలా వస్తోంది? ఈ సైబర్ నేరగాళ్లకు ఆయా బ్యాంకు వినియోగదారులకు చెందిన డేటా ఎక్కడి నుంచి అందుతోందనేది ఇప్పటికీ పూర్తిస్థాయిలో స్పష్టంగా తెలియట్లేదని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. బ్యాంకుల్లో కిందిస్థాయి, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు కాల్ సెంటర్లు తదితర మార్గాల్లో డేటా పొందుతున్నారని ప్రాథమికంగా భావిస్తున్నామని చెబుతున్నారు. ఈ డేటా వినియోగించి అప్పటికే సిద్ధంగా ఉన్న సిమ్‌కార్డులను బేసిక్ మోడల్, తక్కువ ఖరీదున్న ఫోన్లలో వేసి వినియోగదారులకు కాల్స్ చేసి ఎర వేస్తున్నారు. ‘ట్రూకాలర్’ యాప్‌లో తాము వినియోగిస్తున్న నంబర్లను బ్యాంక్ హెడ్–ఆఫీస్/బ్యాంక్ మేనేజర్ లేదా ఆయా బ్యాంకు పేర్లతో రిజిస్టర్ చేస్తున్నారు. దీంతో కాల్‌ను రిసీవ్ చేసుకున్న వ్యక్తులు అవి బ్యాంకు నుంచే వస్తున్నట్లు భ్రమపడి తమ వ్యక్తిగత, కార్డు వివరాలు, ఓటీపీలు చెప్పేస్తున్నారు. ఇలా ఓ వ్యక్తి నుంచి డబ్బు కాజేసిన వెంటనే అందుకు వినియోగించిన సెల్‌ఫోన్, సిమ్‌కార్డును ధ్వంసం చేసేస్తున్నారు. దర్యాప్తులో సవాళ్లు... క్రెడిట్, డెబిట్ కార్డులు కలిగిన వారికి ఫోన్లు చేసే ఈ నేరగాళ్లు ముందుగా ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి పేరు, ఏ బ్యాంకు కార్డు వినియోగిస్తున్నారో చెప్పి... ఆ బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటారు. డెబిట్ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చేయాలనో వారిని నమ్మిస్తారు. ఆపై ఓటీపీ సహా అన్ని వివరాలు తెలుసుకొని వినియోగదారుడి ఖాతాలోని నగదును తమ ఖాతాల్లోకి మార్చుకొని టోకరా వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ డేటా ఆధారంగా క్లోన్డ్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు సైతం తయారు చేసి డ్రా చేసుకుంటున్నారని వెలుగులోకి వచ్చింది. వీరు వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలన్నీ తప్పుడు వివరాలతో ఉంటున్నాయని సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు. జమ్‌తార ప్రాంతంలో ఒక్కో సెల్‌టవర్ పరిధి కిలోమీటర్ మేర విస్తరించి ఉంటోంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్లి సాంకేతికంగా దర్యాప్తు చేయడం సైతం పెను సవాలుగా మారుతోందని అధికారులు పేర్కొంటున్నారు. గుడ్డిగా నమ్మొద్దు ఈ తరహా వ్యవహారాలే కాదు ఎలాంటి సైబర్ నేరంలో అయినా మోసపోవడం ఎంత తేలికో... నేరగాళ్లను పట్టుకోవడం అంత కష్టం. వినియోగదారులు అప్రమత్తంగా ఉంటే ఈ తరహా సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పవచ్చు. ఆధార్ లింకేజ్ లేదా అప్‌గ్రేడ్ కోసం ఏ బ్యాంకు ఫోన్ చేయదని గుర్తుంచుకోవాలి. పేపర్లో ప్రకటన ఇవ్వడం, వ్యక్తిగతంగా బ్యాంకునకు రమ్మని కోరతాయి తప్ప ఫోన్ ద్వారా రహస్య వివరాలు అడగవు. సైబర్ నేరాలను కొలిక్కి తీసుకురావడానికి, నేరగాళ్లను కట్టడి చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలి.– సైబర్ క్రైమ్ అధికారులు -
ఒక్క సినిమా సీఎం.. ఎన్టీఆర్‌కు నచ్చిన బ్యాంకు ఉద్యోగి
‘ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి.. నీ రూపం ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుంది.. నీ నటనతోనే ఈ సినిమాకు ప్రాణం వస్తుంది’ అంటూ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ ఓ సాధారణ బ్యాంకు ఉద్యోగిని ఒప్పించి ఆ చిత్రంలో నటించేలా చేశారు. అదే ‘మేజర్ చంద్రకాంత్’ చలనచిత్రం. ఇప్పటికీ ఆయన నటించింది ఆ ఒక్క సినిమాలోనే. ఆ పాత్రలో జీవించి.. జీవితాంతం ఎన్టీఆర్‌తో నటించానన్న సంతృప్తి, సంతోషంతో కాలం గడుపుతున్నారు చింతలపాటి హరివిఠల్‌రావు. ఆ సినిమాలో అవకాశం గురించి తన అనుభవాలు ఇలా చెప్పుకొచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. – బంజారాహిల్స్ మాది విజయవాడ. అప్పట్లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో డీజీఎంగా పనిచేసేవాడిని. నగరంలోని అబిడ్స్‌లో పని చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ తరచూ మా బ్యాంక్‌కు వచ్చేవారు. కొన్ని బ్యాంక్ పనుల నిమిత్తం ఆయన ఇంటికి వచ్చివెళుతుండేవారు. నన్ను కలిసిన ప్రతి సందర్బంలోనూ ‘నువ్వు సీఎంలా ఉంటావు’ అంటూ నవ్వేవారు. ఎప్పటికైనా నేను నటించే సినిమాలో సీఎం పాత్ర ఉంటే తప్పకుండా నువ్వే నటించాలంటూ చెబుతుండేవారు. ఇదంతా అయ్యేది కాదు.. పొయ్యేది కాదూ అంటుండేవాణ్ని. లోలోపల నవ్వుకునేవాణ్ని. ఈ నేపథ్యంలోనే 1992– 93లో మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయానికి ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సినిమాలో సీఎం పాత్ర ఉందనగానే ఎన్టీఆర్‌కు నేను గుర్తుకొచ్చాను. ఇంకేముంది సూరత్‌లో పనిచేస్తున్న నన్ను చాలా కష్టపడి ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించి నన్ను అక్కడినుంచి రప్పించారు. మేజర్ చంద్రకాంత్ సినిమాలో నేను సీఎంపాత్రలో నటించేందుకు ఇక్కడికి వచ్చాను. పది రోజుల్లోనే షూటింగ్ ప్రారంభమైంది. ఎన్టీఆర్‌తో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. భయం.. భయంగా.. సినిమా నటించేందుకు భయంగా ఉందని, నటన రాదని ఎంత చెప్పినా ఎన్టీఆర్ వినిపించుకోలేదు. నేను నేర్పిస్తాను నువ్వేం అధైర్యపడవద్దంటూ దగ్గరుండి మరీ భరోసా కల్పించారు. ఆ సినిమాలో నాలుగు సీన్లు ఉన్నాయి. అవన్నీ ఎన్టీఆర్తోనే కావడం నా అదృష్టం. నటించింది ఒక్క సినిమాలో అయినా ఎన్టీఆర్ పక్కన కనిపించడం ఒక అరుదైన అవకాశమేనని భావిస్తా. అవకాశాలు వస్తున్నా ఒప్పుకోవడంలేదు.. ప్రస్తుతం శ్రీనగర్‌కాలనీలో నా నివాసం. ఎన్టీఆర్‌తో అప్పట్లో నాకు బాగా సాన్నిహిత్యం ఉండేది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ సినిమా షూటింగ్ సమయంలో బయట కూర్చుంటే నేను మాత్రం నేరుగా లోనికి వెళ్లేంత చొరవ ఉండేది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించాలని అవకాశాలు వచ్చినా గుర్తుండిపోయేంత స్థాయిలో లేకపోవడంతో వేరేవి ఒప్పుకోలేదు. ఇప్పటికీ సినిమాల్లో అవకాశాల కోసం తనను కొందరు సంప్రదిస్తున్నా అంగీకరించడంలేదు. -
నకిలీ బంగారంతో రూ.3.77 కోట్ల టోకరా
ముంబై: కస్టమర్ల నుంచి స్వీకరించిన బంగారంతో ఓ బ్యాంకు ఉద్యోగి రూ.3.77 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. ముంబైలోని ధారావి ఇండియన్ బ్యాంకు గోల్డ్‌లోన్ విభాగంలో పనిచేస్తున్న రామస్వామి నాడార్ ఆ పక్కనే ఓ జువెల్లరీ షాపు నడుపుతున్నాడు. ఇటీవల బ్యాంకు అధికారులు బంగారం దాచిన 77 పాకెట్లు ఉన్న లాకర్లను తెరిచి చూడగా అది నకిలీ బంగారం అని తేలింది. దీంతో వారు ధారావి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న కస్టమర్ల నుంచి బంగారాన్ని తనిఖీ చేసి వారికి సర్టిఫికెట్ జారీ చేయడం నాడార్ పని. అయితే ఆధార్, పాన్ కార్డుల ఆధారంగా అతడు 12 మంది నకిలీ కస్టమర్లను సృష్టించాడు. వీరి పేర్లతో నకిలీ బంగారాన్ని డిపాజిట్ చేసి మోసానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. -
బ్యాంకు ఉద్యోగి అత్యుత్సాహం
సాక్షి, నాగులుప్పలపాడు: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బ్యాంకు ఉద్యోగి అతి తెలివి తేటలు ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయాడు. తన కారును తానే తగలబెట్టుకొని ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలనే దుర్బిద్ధితో పోలీసులకు చిక్కిపోయాడు. పోలీసులు, బీఆర్వో వివరాల మేరకు నాగులుప్పలపాడు ఆంధ్రాబ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తున్న సుబ్రమణ్యేశ్వర శర్మకు సంబంధిచిన ఇండికా కారు నాగులుప్పలపాడు–ఇంకొల్లు రోడ్డులో రేగులగుంట సమీపంలో ఈ నెల 7వ తేది రాత్రి 9 గంటల సమయంలో తగలబడింది. ఈ ప్రమాదంలో కారుకు సంబంధించిన నెంబరు ప్లేటు ఛాయిస్ నంబరుతో పాటు కారు కూడా పూర్తిగా దగ్ధమయింది. దీనిపై గ్రామ వీఆర్వో సురేష్ విచారించగా మంటల్లో తగలబడిన కారు ఆంధ్రాబ్యాంకుకు చెందిన ఉద్యోగి సుబ్రమణ్యేశ్వరశర్మగా తేలింది. ఈ ఘటనపై ఆదివారం కేసు నమోదు చేసిన పోలీసులు ఉద్యోగిని పిలిచి తమదైన శైలిలో విచారించగా తానే ఇన్సూరెన్సు కోసం తగలబెట్టుకున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. -
బ్యాంకు ఉద్యోగి మోసాల పర్వం
చైతన్యపురి: బ్యాంకు ఖాతాదారుల ఫిక్స్డ్ డిపాజిట్లను అక్రమంగా డ్రా చేసుకుని మోసానికి పాల్పడుతున్న కేసులో బ్యాంక్ మహిళా ఉద్యోగిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ బి.సాయిప్రకాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన కాశీభట్ల సురేఖ(35) దిల్‌సుఖ్‌నగర్‌లో నివాసం ఉంటోంది. 2008 నుంచి కొత్తపేటలోని హెచ్డీఎఫ్సీ గడ్డి అన్నారం బ్రాంచిలో అసిస్టెంట్ మేనేజర్‌గా చేరింది. డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ వస్తుందని రిటైర్డ్ ఉద్యోగులకు చెప్పి బ్యాంక్‌లో ఖాతా ఓపెన్ చేయించి డబ్బు జమ చేసేది. డబ్బు జమ చేశాక ఫోన్ నంబర్ తమ బంధువులది ఇచ్చి కొన్ని రోజుల తరువాత ఫిక్స్డ్ డిపాజిట్లను లబ్ధిదారులకు తెలియకుండానే డ్రా చేసుకుని తన ఖాతాలో వేసుకునేది. ఇలా 12 మంది డిపాజిట్లు సుమారు రూ.1.90 కోట్ల నగదును కాజేసింది. వాటిని ఆన్లైన్ ట్రేడింగ్‌లో పెట్టి నష్టపోయింది. 2012లో సురేఖపై ఇలాంటి ఫిర్యాదులు రావటంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించగా కొంత మందికి డబ్బులు తిరిగి ఇచ్చేసింది. అనంతరం ఎల్బీనగర్లోని ఇండస్ బ్యాంక్‌లో ఉద్యోగిగా చేరి అక్కడా ఇదే తరహా మోసాలకు పాల్పడటంతో ఉద్యోగం నుంచి తొలగించారు. న్యూ మారుతీనగర్‌కు చెందిన బాలచందర్ ప్రేమ చైతన్యపురి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో సురేఖ మోసాలు బయటపడ్డాయి. సురేఖతో ఉన్న పరిచయంతో తాము, తమ బంధువులు రూ.7 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని, కాలపరిమితి తర్వాత బ్యాంక్‌కు వెళ్లగా సురేఖ డబ్బులు డ్రా చేసుకున్నట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించామన్నారు. ముగ్గురు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సురేఖను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితురాలు సురేఖపై సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో రూ.5 లక్షల చీటింగ్‌కు సంబంధించి రెండు కేసులు, ఎల్బీనగర్ స్టేషన్లో రూ.10 లక్షల చీటింగ్‌పై మరో కేసు రికార్డయిందని ఎస్ఐ తెలిపారు. నిందితురాలిని కష్టడిలోకి తీసుకుని పూర్తి విచారణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
వీడనున్న రాఘవులు హత్య కేసు మిస్టరీ
ప్రకాశం, కనిగిరి: బ్యాంక్ ఉద్యోగి వీరారాఘవులు హత్య కేసులో నిందిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. హత్యోదంతంలో ఇద్దరు యువకులు పాల్గొన్నట్లు తెలిసింది. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు నిందితులను గుర్తించినట్లు సమాచారం. అర్బన్ కాలనీలోని రాఘవులు ఇంట్లో అద్దెకు ఉండే యువకులతో ఆయన మద్యం తాగాడు. ఆ తర్వాత ఆర్థిక, ఇతర వ్యవహారాల్లో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. రాఘవులును హత్య చేసిన వారిలో కీలకంగా ఉన్న ఇద్దరు యువకులు సీఎస్‌పురం మండలం వాసులుగా తెలుస్తోంది. వారిలో ఒకరు పాత నేరగాడు. మరోకరు యువకుడు ఉన్నాడు. వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందిన స్నేహితులుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు హత్యకు కారణాలపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు సాగిస్తున్నారు. ఇంట్లోనే రాఘవులు హత్య బ్యాంక్ ఉద్యోగి రాఘవులకు, యువకులకు ఆదివారం మధ్యాహ్నం తర్వాత ఇంట్లో సిట్టింగ్‌లో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. హత్యకు ముందు ముగ్గురూ పూటుగా మద్యం తాగారు. ఆర్థిక పరమైన అంశాల్లో అప్పుడు వివాదం జరిగింది. ఆ క్రమంలో రాఘవులును కొట్టి, కత్తితో పొడిచి హత్య చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాఘవులను చంపిన ఇద్దరు యువకులు ఆ తర్వాత మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి చిల్లచెట్లల్లో పడేసి దిండు కవరు, దప్పుటి కప్పి పెట్రోలు పోసి తగల పెట్టినట్లు పోలీసులు నిర్ధారించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. -
ఆత్మాభిమానం చంపుకోలేక..
అమ్మ.. నాన్న.. వారి ఆశల సౌధమైన కుమారుడు. ఆయన బ్యాంకు ఉద్యోగి. ఆమె గృహిణి. కుమారుడిని ఇంజినీరింగ్ చదివించారు. స్నేహితులతో కలసి సౌరవిద్యుత్ కార్ల యూనిట్ పెట్టాలనుకున్న అతడి ఆలోచనకు సరే అన్నారు. స్నేహితులను సమకూర్చుకుని మౌలిక వసతులకోసం కొందరు బయటి వ్యక్తుల సాయం ఆశించి రూ.లక్షల సొమ్ములు ఇచ్చి మోసపోయారు. డబ్బడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి. చస్తే చావండి అన్నారు. అంతే.. ఆ మధ్య తరగతి కుటుంబానికి ఆత్మాభిమానం దెబ్బతింది. ఇతరులకు చెప్పడం అవమానంగా భావించారు. ఆత్మహత్యే శరణ్యం అనుకున్నారు. శుక్రవారం రాత్రి గోదావరిలో దూకి తనువు చాలించారు. రాజమహేంద్రవరం రూరల్: పెట్టుబడి పెట్టి కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయిన విషయాన్ని, ఆర్థికంగా ఉన్న ఇబ్బందులను కనీసం అన్నదమ్ములకు చెప్పినా.. సహోద్యోగులకు చెప్పినా.. చిన్న సలహాతో తీరిపోయేది. రాజమహేంద్రవరం గాదాలమ్మనగర్‌కు చెందిన కెనరాబ్యాంకు ఉద్యోగి కొల్లి ఆనందబాబు కుటుంబం ఇతరులకు చెప్పడం అవమానంగా భావించారో.. ఏమో తమ బాధను మనసులోనే దాచేసుకుని గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడడం కుటుంబసభ్యులను, బ్యాంకు ఉద్యోగులను, స్నేహితులను తీవ్రంగా కలిచివేసింది. వివరాలలోకి వెళితే రాజమహేంద్రవరం గాదాలమ్మనగర్‌కు చెందిన కెనరాబ్యాంకు ఉద్యోగి కొల్లి ఆనందబాబు(46), అతని భార్య కొల్లి అరుణ (40), కుమారుడు లక్ష్మీచంద్ సాయిచరణ్‌లు గురువారం రాత్రి 8.10 గంటల సమయంలో ఇంటినుంచి మోటార్‌బైక్‌పై కొవ్వూరు వెళ్లారు. అక్కడ అనన్య థియేటర్లో రోబో 2.0 సినిమా చూసి రాజమహేంద్రవరం బయలుదేరారు. రోడ్డు కం రైలు బ్రిడ్జిపై 135వ నెంబరు పోల్ వద్ద మోటార్ బైక్, సెల్‌ఫోన్, చెప్పులు విడిచి గోదావరిలోకి దూకి భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే సాయిచరణ్ చెప్పులు, సెల్‌ఫోన్ మాత్రం అక్కడ లభించలేదు. ఆనందబాబు సోదరుడు మధుబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి బొమ్మూరు ఇన్స్పెక్టర్ కేఎన్ మోహన్‌రెడ్డి, ఎస్సై యూవీఎస్ నాగబాబులు జాలర్లతో కలిసి విస్తృతంగా గాలించారు. ఉదయం10 గంటల సమయంలో ఆనందబాబు మృతదేహం దూకిన పిల్లర్ వద్దే పైకి తేలిందని, అరుణ మృతదేహం వాడపల్లి ఇసుకర్యాంపు వద్ద నీటిలో తేలింది. కుమారుడు సాయిచరణ్ చెప్పులు, సెల్‌ఫోన్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులతో పాటు దూకాడా లేదా అన్న కోణంలో కుటుంబసభ్యలు, పోలీçసులు భావిస్తున్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినా శనివారం రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. ఆనందబాబు, అరుణ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో విషాదఛాయలు.. ఆనందబాబు, అరుణల మృతదేహాలు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి చేరుకోవడంతో ఆయన సోదరులు మధుబాబుతో పాటు, బెహ్రైన్‌లో ఉంటున్న అన్నయ్య వీరవెంకటసత్యనారాయణ, అరుణ తల్లిదండ్రులు ఆకాశపు వీరభద్రరావు, పాపాజీలతో పాటు ఇతర కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. కనీసం మాకు ఒక్కమాట చెప్పి ఉంటే ఈబాధ ఉండేది కాదని తామంతా చూసుకునేవారమని, ఎవరికీ చెప్పకుండా తన మనస్సులోనే పెట్టుకుని మా అందరికీ దూరమయ్యారన్నారు. అలాగే బ్యాంకు ఉద్యోగులు సైతం అక్కడకు చేరుకుని బ్యాంకు యూనియన్‌లో కీలకమైన పాత్ర పోషించిన ఆనందబాబు కనీసం ఒక్కమాట చెప్పి ఉంటే ఇంతకష్టం వచ్చేది కాదని అన్నారు. తులీప్ అపార్టుమెంటు వాసులు సైతం అందరితోను కలివిడిగా ఉండే ఆనందబాబు, అరుణ దంపతులు ఈ విధంగా చేస్తారని అనుకోలేదన్నారు. ఆ నలుగురే కారణమా? సంస్థ నెలకొల్పడానికి సాయం చేస్తామని వంచన డబ్బు తీసుకుని ముఖం చాటేసిన వైనం సాయిచరణ్ సూసైడ్ నోట్లో వివరాలు వెల్లడి రాజమహేంద్రవరం రూరల్: నలుగురు వ్యక్తులు యువమేధావికి ఆశలు కల్పించడంతో పాటు, దఫదఫాలుగా సుమారు రూ.23.75 లక్షలు తీసుకుని ఇప్పుడు తమకు ఎటువంటి సంబంధం లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి.. చస్తేచావండి అని అనడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాజమహేంద్రవరం కెనరాబ్యాంకు క్యాష్ అసిస్టెంట్ ఆనందబాబు, అతని భార్య అరుణ గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడడం, వారి కుమారుడు లక్ష్మీచంద్సాయిచరణ్ ఆచూకీ లభించకపోవడం అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. ఆనంద్‌బాబు కుమారుడు రాసిన సూసైడ్‌నోట్‌లో విషయాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో ఒక ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ మూడో సంవత్సరం చదువుతున్న చంద్సాయిచరణ్ తన సీనియర్లు రాజీవ్, మోహన్, సురేష్, హరికమల్, అఖిల్‌తో కలసి సోలార్కార్ల తయారీ ప్రాజెక్టును డిజైన్ చేశాడు. దీంతో ఏడాదిన్నర క్రితం ఆల్ట్రాస్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి దానికి సీఈవో, ఫౌండర్‌గా చరణ్ ఉన్నాడు. కళాశాల యాజమాన్యం అనుమతి తీసుకుని ఏడాదిగా ప్రాజెక్టు విషయంపై తిరుగుతున్నాడు. అయితే సోలార్ టెక్నాలజీతో తయారుచేసిన ప్రాజెక్టును పట్టాలెక్కించాలంటే కోట్లాది రూపాయలు అవసరమవుతాయి. అంత డబ్బు తమ వద్ద లేకపోవడంతో ఎవరైనా పెట్టుబడిదారుడ్ని పట్టుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు బ్రోకర్లు కె.సత్యనారాయణ, బి.అప్పల కనక శ్రీనివాస్ ఎలియాస్ స్వామిలను వీరు ఆశ్రయించినట్లు తెలిసింది. ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు భూమి అవసరమని అలాగే పెట్టుబడి కూడా కావాల్సి ఉంటుందని సదరు బ్రోకర్లకు చరణ్, అతని స్నేహితులు చెప్పినట్లు సమాచారం. దీంతో తాము అంతా చూసుకుంటామని భరోసా ఇచ్చిన బ్రోకర్లు.. విశాఖపట్నానికి చెందిన స్థల యజమాని దొర, గుంటూరుకు చెందిన ఫైనాన్షియర్ శ్రీనివాసరెడ్డిలను రంగంలోకి దింపినట్లు సమాచారం. మొత్తం ఈ నలుగురు కలసి చరణ్ బృందం నుంచి ఖర్చులు నిమిత్తం రూ.23.75 లక్షలను తీసుకున్నట్లు సూసైడ్‌నోట్ ద్వారా అర్థమవుతోంది. పరిశ్రమకు సంబంధించిన 20 ఎకరాల భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టడం ద్వారా డబ్బు సమకూరుస్తామని చెప్పి చరణ్ బృందం నుంచి ఖాళీ చెక్కులు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చెక్కులు ఉద్యోగాల నిమిత్తం తీసుకున్నట్లుగా చూపిస్తూ చెక్కులు రిటర్న్ అయినట్లు సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సుమారు రూ.23.75 లక్షలు చరణ్, అతడి స్నేహితులు సత్యనారాయణ ద్వారా స్వామి, దొర, ఫైనాన్షియర్ శ్రీనివాసరెడ్డిలకు ఇచ్చినట్లు తెలుస్తోంది. వారు నలుగురు మోసం చేయడంతో చరణ్ కుటుంబం అప్పుల బాధ తట్టుకోలేకపోయింది. మిగిలిన వారి నుంచి తీవ్ర స్థాయిలో వత్తిళ్లు పెరగడంతో ఆనందరావు, అరుణ, చరణ్‌లు మానసికంగా కుంగిపోయినట్లు తెలుస్తోంది. స్థలం యజమాని దొర డబ్బులు తీసుకుని మోసం చేసిన ఫైనాన్షియర్ శ్రీనివాసరెడ్డి, బ్రోకర్లు సత్యనారాయణ, బీఏకే శ్రీనివాస్‌లను ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేయించమన్నా, అగ్రిమెంటు చేయమన్నా, కనీసం డబ్బు వెనక్కి ఇచ్చేయమన్నా వారు వాయిదాలు వేస్తూ రావడంతో చరణ్ కుటుంబం విసిగి వేసారిపోయింది. వారికి ఎన్నిసార్లు ఫోన్‌చేసినా ఏం చేసుకుంటారో చేసుకోండి.. చస్తే చావండి అంటూ సమాధానాలు రావడంతో ఆకుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని ఆనందబాబు సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కోణంలోనే బొమ్మూరు ఇన్స్పెక్టర్ కేఎన్ మోహన్‌రెడ్డి, ఎస్సై యూవీఎస్ నాగబాబు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. -
భార్య, కుమారుడితో సహా బ్యాంకు ఉద్యోగి అదృశ్యం
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం రూరల్: తన సోదరుడు, అతడి భార్య, కుమారుడితో గురువారం రాత్రి నుంచి కనిపించడం లేదని తణుకుకు చెందిన కొల్లిమధుబాబు శుక్రవారం రాత్రి బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం రోడ్డుకం రైలుబ్రిడ్జిపై సోదరుడి సెల్‌ఫోన్, మోటార్ బైక్ ఉన్నాయని కొవ్వూరు పోలీసుల ద్వారా తెలిసిందని ఆయన పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం గాదాలమ్మనగర్‌లోని తులీప్ అపార్టుమెంట్లో నివసిస్తున్న కెనరాబ్యాంకు ఉద్యోగి 42 ఏళ్ల కొల్లి ఆనందబాబు, అతడి భార్య 40 ఏళ్ల కొల్లి అరుణ, కుమారుడు, బీటెక్ చదువుతున్న చరణ్‌సాయిచంద్‌ను తీసుకుని గురువారం రాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లారు. రాజమహేంద్రవరం రోడ్డుకం రైలుబ్రిడ్జిపై అర్ధరాత్రి ఆనందబాబు బైకు, సెల్‌ఫోన్, ముగ్గురి చెప్పులు ఉండడంతో అక్కడ చూసిన వారు 100కి కాల్ చేస్తే కొవ్వూరు పోలీసులు అక్కడికి వచ్చి పరిశీలించారు. శుక్రవారం ఉదయం వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఫోన్లో నంబర్ ఆధారంగా అతడి సోదరునికి పోలీసులు ఫోన్ చేసి చెప్పడంతో మధుబాబు సంఘటన స్థలంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సోదరుడు ఆనందబాబుకు సుమారు రూ.ఏడులక్షల వరకు అప్పులు ఉండడంతోనే ఇంటి నుంచి వెళ్లిపోయి ఉంటాడని మధుబాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు బొమ్మూరు సబ్ఇన్స్పెక్టర్ యూవీఎస్ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓ ఉద్యోగి ఆతృతకు.. నిండు ప్రాణం బలి
శ్రీకాకుళం, కాశీబుగ్గ: తిత్లీ తుఫాన్ విజృంభణ నేపథ్యంలో జిల్లాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు ఇతర జిల్లా నుంచి సంబంధిత సిబ్బందితో వచ్చిన ఓ సహాయకుడు విద్యుత్ఘాతానికి గురై మృత్యువాతపడ్డాడు. తన ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని ఓ ఉద్యోగి ఆతృతకు ఇలా నిండు ప్రాణం బలి కావడంతో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఆదివారం సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళ్తే.. మున్సిపాలిటీ పరిధి 16వ వార్డు గాంధీనగర్‌లో పన్నెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక్కడ నివాసముంటున్న స్టేట్ బ్యాంకు ఉద్యోగి శివరాం తన ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు ఎల్సీ(విద్యుత్‌ను అనుమతితో నిలిపివేసే పక్రియ) తీసుకోకుండానే అక్రమంగా పనులు చేయించాడు. ఈయన ఓ విద్యుత్ కూలీని తీసుకొచ్చి స్థానికంగా స్తంభం ఎక్కించాడు. ఈ క్రమంలో వైరు కలుపుతుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న వార్డు కౌన్సెలర్ బోర బుజ్జి, ఉప చైర్మన్ గురిటి సూర్యనారాయణ, కౌన్సెలర్ రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి విద్యుత్ సిబ్బంది తమ సహాయకులుగా (రోజు కూలీలు) పది వేల మంది వరకు తీసుకొచ్చారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట నుంచి వచ్చిన ఈ వ్యక్తి పది రోజులుగా పనులు చేస్తూ ఇలా మృత్యవాత పడ్డాడు. ఇటువంటి కార్మికులకు స్థానికంగా పలువురు నగదు ఆశ చూపి ఈ విధంగా వినియోగిస్తుండటం గమనార్హం. ఈ విషయమై ఇంకా కేసు నమోదు కాలేదు. -
ఇంటి దొంగ...
అనంతపురం, హిందూపురం అర్బన్: ఇంటిదొంగను ఈశ్వరుడైన పట్టలేడు అన్న చందంగా..బ్యాంకులో నమ్మకంగా ఉండే అప్రైజర్ (బంగారు నాణ్యత పరిశీకుడు) నకిలీబంగారు నగలు తాకట్టు పెట్టించి అధికారులను బురిడీ కొట్టించిన సంఘటన వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి...హిందూపురంలోని సిండికేట్బ్యాంకు టీచర్స్‌కాలనీ బ్రాంచ్‌లో బంగారు రుణాలు ఇవ్వడానికి రవిచంద్ర అనే వ్యక్తి నగల అప్రైజర్‌గా ఉన్నాడు. నాలుగేళ్లుగా తనకు తెలిసిన వారి పేరిట బంగారు నగలను తాకట్టు పెట్టించి బంగారు రుణాలు ఇప్పించాడు. బంగారు పూత పూసిన గిల్టు నగలను బంగారు నగలుగా చూపిస్తూ ఇలా సుమారు రూ.45 లక్షలకు పైగా దాదాపు 16 మంది పేరిట రుణాలు తీసుకున్నారు. ఈ డబ్బుతో ఆయన రియల్ ఎస్టేట్‌వ్యాపారం సాగిçస్తూ వచ్చాడు. వ్యాపారం అనుకున్న రీతిలో సాగలేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. గుట్టు రట్టయ్యిందిలా.. టీచర్స్‌కాలనీ బ్రాంచ్‌కు ఎక్కువగా బంగారు నగలు తాకట్టుగా వస్తుండటంతో మెయిన్బ్రాంచ్ అధికారులు ర్యాండమ్ చెకింగ్ చేయడానికి వారంరోజుల కిందట మడకశిర నుంచి మరో అప్రైజర్‌ను పంపించారు. తాకట్టులో ఉన్న మొత్తం బంగారు నగలు, వాటివిలువ, ఎన్నాళ్లుగా తాకట్టులో ఉన్నాయన్న విషయాలను పరిశీలించగా నకిలీ బంగారు బయటపడింది. తాను బాధ్యతలు చేపట్టకమునుపే ఈ వ్యవహారం జరిగినట్లు ప్రస్తుత మేనేజర్ చిన్నబాబు ఉన్నతాధికారులకు తెలిపారు. ఉన్నతాధికారుల విచారణ నకిలీ బంగారం తాకట్టు వ్యవహారంపై రీజినల్ మేనేజర్ కోదండరామిరెడ్డి, చీఫ్‌మేనేజర్ రమేష్‌తో పాటు మరో లాయర్ సిండికేట్‌నగర్ టీచర్స్ కాలనీ బ్రాంచ్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం విచారణ చేపట్టారు. పలు రికార్డులు పరిశీలించారు. వ్యవహారం బయటకు రావడంతో సంబంధిత అప్రైజర్‌పై కేసు నమోదు కాకుండా నియోజకవర్గస్థాయి రాజకీయ నేత నుంచి బ్యాంకు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. తీసుకున్న రుణాల మొత్తాన్ని తిరిగి కట్టేసేటట్టు ఒప్పించినట్లు సమాచారం. కాగా బ్యాంకు మేనేజర్ చిన్నబాబును విలేరులు అడుగగా బంగారు నగలు తాకట్టు పెట్టి రూ.29 లక్షల వరకు రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని చెప్పారు. రీజినల్ అధికారులు మాత్రం సాధారణ తనిఖీలలో భాగంగా ఇలా వచ్చామని మాత్రమే చెప్పారు. సాయంత్రం బ్యాంకు అధికారులు నిబంధన మేరకు టూటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సైబర్ మోసాలు తమ పరిధిలోకి రావన్నారు. అస్మదీయుల మోసం రెండోసారి.. సిండికేట్ బ్యాంకులో పనిచేసే వారే మోసానికి పాల్పడటం ఇది రెండవసారి. మూడేళ్లక్రితం హిందూపురం మెయిన్‌బ్రాంచ్‌లో పనిచేసే సహాయ మేనేజర్ బాబా అక్బర్ తోటి ఉద్యోగుల కంప్యూటర్లో నుంచి ఇతరుల ఖాతాలకు రుణాలు మంజూరు చేసినట్లు రికార్డు చేసి సుమారు రూ.కోటి పైగా స్వాహా చేశాడు. దీనిన్ని కనుగొన్న ఉన్నతాధికారులు విచారణ చేసి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముంబయి, ఇతర ప్రాంతాల్లో గాలించి చివరకు సైబర్ మోసంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు టీచర్స్ కాలనీ బ్రాంచ్‌లో నకిలీ బంగారు నగల తాకట్టు రుణాల వ్యవహారం బయటపడింది. దీంతో ఖాతాదారులు భయాందోళన చెందుతున్నారు. -
అమెరికా డాలర్లకు కక్కుర్తి..
అమెరికన్ డాలర్లకు ఆశపడి ఓ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి మోసపోయిన ఘటన విజయవాడలోని పటమట దర్శిపేటలో వెలుగులోకి వచ్చింది. పెట్టుబడి కోసం అమెరికన్ డాలర్లు పంపిస్తామని యూఎస్‌కే చెందిన మైఖేల్ ఎస్తేర్ డోనాల్డ్ అనే మహిళ నుంచి ఆరు నెలల కిందట ఆ ఉద్యోగికి వీడియో కాల్ వచ్చింది. దీంతో రూ.28 లక్షలు వారి అకౌంట్లో డిపాజిట్ చేసి మోసపోయాడు. ఆటోనగర్(విజయవాడ): ‘మా వద్ద రెండు లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నాయి.. మీకు పెట్టుబడిగా ఆ డబ్బును సమకూరుస్తాం.. మీరు ఏదైనా వ్యాపారం మొదలెట్టండి.. లాభాల్లో మీకు వాటా ఇస్తాం..’ అంటూ ఓ రిటైర్డ్ ఎస్బీఐ ఉద్యోగికి 6 నెలల కిందట అమెరికాకు చెందిన మైఖేల్ ఎస్తేర్ డోనాల్డ్ అనే మహిళ నుంచి ఫేస్బుక్ వీడియో కాల్ వచ్చింది. ముందు వెనుకా ఆలోచించకుండా ఆ ఉద్యోగి ఆమె చెప్పిన విధంగా రూ. 28 లక్షలు వారు తెలిపిన అకౌంట్లో జమ చేశాడు. ఆ తరువాత అటువైపు నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో తాను మోసపోయానని తెలుసుకుని శుక్రవారం పటమట పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు, బాధితుడు ఫిర్యాదు పేర్కొన్నట్లుగా వివరాలు ఇలా ఉన్నాయి.. పటమట దర్శిపేట చెందిన వెంకట సత్యప్రసాద్ ఎస్బీఐ రిటైర్డ్ ఉద్యోగి. ఇతనికి ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాకు చెందిన మైఖేల్ ఎస్తేర్ డోనాల్డ్ అనే మహిళ నుంచి ఫేస్బుక్ వీడియో కాల్ వచ్చింది. తన వద్ద 2 లక్షల అమెరికా డాలర్లు ఉన్నాయని.. మీకు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వినియోగించుకోవచ్చని నమ్మబలికింది. దీంతో సత్యప్రసాద్ ఆమెతో పలు దఫాలు డాలర్ల విషయమై ఫేస్బుక్ ద్వారా చాటింగ్ చేయడం.. మాట్లాడం జరిగింది. ఆ తర్వాత అతనితో అమెరికాకు చెందిన మ్యాత్యు టేలర్‌తోపాటు అజయ్ అనే మరొ వ్యక్తి కూడా ఫోన్ ద్వారా పరిచయమయ్యారు. వారు ముగ్గురు కలిసి మీకు డబ్బులు పంపిస్తాం కానీ పెట్టుబడుల పెట్టే నిమిత్తం కొంత డబ్బు పన్ను రూపేణ చెల్లించాల్సి ఉంటుందని ఆమె చెప్పింది. అకౌంట్ నెంబరు కూడా ఇచ్చింది. అన్నింటికీ అంగీకరించిన ఆ ఉద్యోగి పలు దఫాలుగా రూ. 28 లక్షలు చెల్లించాడు. ఆ తరువాత వారి నుంచి ఎటువంటి ఫోన్ రాకపోవడం.. ఫేస్బుక్ నుంచి కూడా చాటింగ్‌లు నిలిచిపోవడంతో ఆత్యాశకుపోయి ‘బుక్కయ్యాను’ అనుకున్న సత్యప్రసాద్ శుక్రవారం పటమట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రుణం పేరుతో మహిళలకు టోకరా
గుంటూరు : బాపట్ల బ్యాంకు ఉద్యోగినంటూ బ్యాంకులో కొద్ది సేపు హడావుడి చేసి ఇద్దరు మహిళల వద్ద ఆరు సవర్ల బంగారు ఆభరణాలతో ఓ నిందితుడు ఉడాయించిన ఘటన బాపట్లలో గురువారం తీవ్ర సంచలనం రేకేత్తించింది. బ్యాంకులో హడవుడి చేసిన నిందితుడు మహిళల ఇంటికి వెళ్లి అక్కడ వ్యాపారానికి సంబంధించిన ఫోటోలు తీసి సంతకాలు పెట్టించి మరీ బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. బాధిత మహిళలు కె.మరియమ్మ, అలిదిరాణి తెలిపిన వివరాలు మేరకు కొత్తకంకటపాలెంకు చెందిన కె.మరియమ్మ, అలిదిరాణి చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. స్టేట్‌బ్యాంకులో ముద్రరుణాలు ఇస్తున్నారని తెలుసుకుని గురువారం ఉదయం బ్యాంకుకు వచ్చి అక్కడ పీబీడీ మేనేజర్‌ను కలిశారు. బ్యాంకు ఇప్పుడు రుణాలు ఇవ్వటం లేదని అతను చెప్పటంతో వెనుదిరిగేందుకు యత్నించిన మహిళలను గమనించిన 30 ఏళ్లలోపు వయస్సు ఉన్న యువకుడు ఓ ఐడీ కార్డుతో వారిని పలకరించాడు. ముద్రరుణాలు కాకుండా మీకు ఒక్కొక్కరికి రూ.3.50లక్షలు వచ్చేవిధంగా వ్యాపారానికి సంబంధించిన రుణాలు ఇప్పిస్తానంటూ చెప్పాడు. మహిళలు ఇంటి వద్ద వారు చేస్తున్న చిరువ్యాపారాలను చూపించాలంటూ నిందితుడు కోరటంతో సరేనన్నారు. వెంటనే బ్యాంకు కిందకు దిగి అప్పటికే అక్కడ ఉన్న ఆటోలో కొత్తకంకటపాలెంకు బయలుదేరారు. ఇంటి వద్ద ఉన్న బొంకును ఫోటోలు తీయటంతోపాటు వారితో బ్యాంకు రుణాలకు సంబంధించిన పత్రాలుగా చెప్పి సంతకాలు చేయించుకున్నాడు. మళ్లీ అదే ఆటోలో తిరిగి బ్యాంకుకు వచ్చి రుణాలు తీసుకోవాలంటూ ముందు బ్యాంకులో ఏదో ఒక రుణం తీసుకోవాలని, బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకోవాలని నమ్మబలికాడు. సరేనని వారి వద్ద ఉన్న గొలుసులు, బంగారు గాజులు అతడికి ఇచ్చారు. అతను తూకం వేయించుకుని వస్తానంటూ చెప్పి ఇలోపు ఫోటోలు దిగి రావాల్సిందిగా చెప్పారు. మహిళలు ఫొటోలు దిగి వెళ్లి విచారించగా అతను కనిపించకుండా ఉడాయించారు. ఆటో డ్రైవర్‌పై కూడా అనుమానాలు.. మహిళలు వారి వ్యాపారాలు చూపించాలని చెప్పి కిందకు దిగిరాగానే అప్పటికే సిద్ధంగా ఉన్న ఆటోలో మహిళలతోపాటు నిందితుడు ఎక్కాడు. అయితే ఆటో డ్రైవర్ కూడా సార్ మంచోడమ్మ అంటూ చెప్పటం...మీకు లోన్ వెంటనే ఇప్పిస్తాడంటూ చెప్పటంతో అతడి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసును దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కేసును పట్టణ ఎస్ఐ అనిల్‌రెడ్డి నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్టేట్‌బ్యాంకులోని సీసీ కెమెరాలలో నిందితుడు గురించి ఆరా తీశారు. నిందితుడినికి సంబంధించిన చిత్రాలు కూడా దొరికినట్లు సమాచారం. అయితే స్టేట్‌బ్యాంకు ఉద్యోగులు, సెక్యూర్టీ విభాగం ఏమి చేస్తున్నారనేది ఖాతాదారులలో చర్చానీయాంశమైంది. అసలు బయట వ్యక్తి వద్ద ఐడీ కార్డు ఎందుకు ఉంది. ఐడీ బ్యాంకుదా? కాదా ఎవరికి సంబంధించిందనే కోణంలో విచారణ చేపట్టారు. -
బ్యాంకు అధికారినని నమ్మించి..
రౌతులపూడి: తాము బ్యాంకు అధికారినని నమ్మించి ఓ అపరిచితుడు బంగారయ్యపేట గ్రామానికి చెందిన కర్రి బాబూరావు అనే వ్యక్తి నుంచి ఈ నెల 26న రూ.59వేలు నగదు చోరీ చేసిన సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. రౌతులపూడి మండలం బంగారయ్యపేట గ్రామానికి చెందిన కర్రి బాబూరావు అనే వ్యక్తి తన సొంత అవసరాల నిమిత్తం తనవద్ద ఉన్న బంగారు వస్తువులను మూడేళ్ల క్రితం స్థానిక సెంట్రల్‌బ్యాంకులో కుదవపెట్టాడు. ఈ మేరకు ఈనెల 26న ఆ బంగారు నగలను విడిపించుకుందామని బ్యాంకుకు వచ్చాడు. బ్యాంకులో తన వద్ద ఉన్న బ్యాంకు పత్రాలను అధికారులకు అందించి తాకట్టుపెట్టిన వస్తువులకు వడ్డీ, అసలు ఎంతైందని అడగగా బ్యాంకు అధికారులు రూ.64,300వరకు అయ్యిందని తెలిపారు. దీంతో బ్యాంకు నుంచి బయటకి వచ్చిన బాబూరావు వద్దకు బ్యాంకు లోపలి నుంచి ఓ అపరిచిత వ్యక్తి వచ్చి.. అతడి వద్ద ఉన్న బ్యాంకు పత్రాలను తీసుకుని ‘‘మీరు బంగారు వస్తువులు తీసుకుని మూడేళ్లుపైబడింది. వీటి చెల్లింపుల కోసం మీ ఇంటికి వచ్చాం. ఇంత ఆలస్యమైతే ఎలా?’’ అని చెప్పి బాబూరావును బంగారయ్యపేటలో ఉన్న తన ఇంటివద్దకు తీసుకెళ్లాడు. ఇంట్లోని సొమ్ములు తెమ్మని ఆదేశించారు. బ్యాంకు అధికారులేనని నమ్మిన బాబూరావు అని అనుకుని ఇంట్లో ఉన్న రూ.59వేలు నగదు తీసుకువచ్చి వారికి చూపాడు. మిగిలిన సొమ్ములు శుక్రవారం చెల్లిస్తే బంగారు వస్తువులు ఇస్తారని ఈ సొమ్ములు ఇప్పుడు చెల్లించాలని సొమ్ములు తీసుకుని తిరిగి రౌతులపూడిలో ఉన్న బ్యాంకుకు తిరిగి వచ్చారు. బాబూరావు వద్ద ఉన్న రూ.59వేలు తీసుకుని బాబూరావును ఆధార్, బ్యాంకు పాస్ పుస్తకాల జెరాక్స్‌లు తీసుకురమ్మని అపరిచిత వ్యక్తి బ్యాంకు లోపలికి వెళ్లాడు. జెరాక్స్‌లు తీసుకుని వచ్చిన బాబూరావుకు సొమ్ములు చెల్లించినట్టు బ్యాంకులోని డిపాజిట్ ఫారం ఒక ముక్క చించి రశీదుగా ఇచ్చాడు. దీంతో సరే అని అక్కడి నుంచి అపరిచిత వ్యక్తి, బాబూరావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరలా బాబూరావు మిగిలిన సొమ్ములను తీసుకుని బుధవారం బ్యాంకుకు రాగా సొమ్ములు చెల్లించలేదని ఎవరో అపరిచిత వ్యక్తి నిన్ను మోసం చేశారని అధికారులు వెల్లడించారు. దీంతో కంగుతిన్న బాబూరావు లబోదిబోమంటూ అన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
బ్యాంక్‌లో డబ్బు షేర్స్‌లో పెట్టి..కటకటాలపాలై..
కడప అర్బన్ : సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మార్తల గురుమోహన్‌రెడ్డి డిగ్రీ వరకు చదివి బ్యాంకు ఉద్యోగిగా సెలెక్ట్ అయ్యాడు. ఉద్యోగం చేస్తూ భార్య, పిల్లలను పోషించుకుని జీవితం సాగించాల్సిన ఆయన.. డిగ్రీ చదువుతున్న వయసు నుంచే వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలుగన్నాడు. అయితే తన ప«రిధిలో, అందుబాటులో ఉన్న నగదు, సహోద్యోగులను ఉపయోగించుకుని తద్వారా డబ్బు తీసుకుని.. వారి కళ్లు గప్పి ఏకంగా షేర్ మార్కెట్లో పెట్టాడు. ఉద్యోగంలో చేరిన కొన్నేళ్లకే.. షేర్ మార్కెట్ మోజుతో కటకటాల పాలయ్యాడు. మొదటగా మైదుకూరు ఎస్బీఐలో పని చేసే సమయంలోనే ఏటీఎంలలో డబ్బులు పెడుతూ.. రూ.30–40 లక్షలు కాజేశాడు. ఈ విషయాన్ని అప్పట్లో బ్యాంకు అధికారులు పసిగట్టి సస్పెన్షన్ చేశారు. వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించడంతో తిరిగి పోరుమామిళ్లలోని రంగసముద్రం ఎస్బీఐ బ్రాంచ్‌కు క్యాషియర్‌గా పంపించారు. రంగసముద్రంలో చెలరేగాడు రంగసముద్రం ఎస్బీఐ బ్రాంచ్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్న మహిళా ఉద్యోగి.. క్యాష్ ఇన్చార్జిగా ఉన్న గురుమోహన్‌రెడ్డిని నమ్మి సేఫ్ లాకర్ నుంచి నగదును తీసుకొచ్చి మరలా పెట్టడం లాంటి ప్రక్రియను అప్పగించింది. అమాయకురాలైన ఆమె అతని చర్యలను పసిగట్టలేకపోయింది. దీంతో ఖాతాదారులకు సంబంధించిన దాదాపు రూ.2.50 కోట్ల మేరకు బంగారు ఆభరణాలు, నగదు కాజేశాడు. ఆ డబ్బులను ఏటీఎంలో పెట్టేటపుడు తీసుకునే వాడు. ఉదాహారణకు రూ. 40 లక్షలు నగదును మిషన్‌లో పెట్టేటపుడు అందులో కొన్ని లక్షల రూపాయలు పక్కకు తీసి.. ఆన్లైన్లో మాత్రం రూ.40 లక్షలనే పెట్టినట్లుగా చూపిం చేవాడు. అలాగే బంగారు ఆభరణాలను కూడా ప్రొద్దుటూరులోని తన భార్య మంజులత ఖాతా లో తనఖా పెట్టి.. ఆ డబ్బును మరలా తన ఖాతా లోకి జమ చేసుకునే వాడు. ఏరోజుకారోజు షేర్స్‌లో డబ్బులు పెడుతుండడంతో.. లాభాలు వచ్చి న తర్వాత అదే డబ్బును మరలా మరుసటి రోజు షేర్స్‌లో పెట్టేవాడు. ఎక్కువ మొత్తం వస్తుందని ఆశ పడడం, మరలా నష్టపోవడం పరిపాటిగా మారింది. గతంలో మైదుకూరులో జరిగిన సంఘటన పునరావృతం అవుతుందని భావించాడు. ఆడిటింగ్ వారు కూడా వస్తారని, అదే సమయంలో తాను చేసిన చీటింగ్ వ్యవహారం బట్టబయలవుతుందని పసిగట్టాడు. మార్చి 28న తన భార్యతోపాటు రూ. 91 లక్షల నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యాడు. ఆటకట్టు గురుమోహన్‌రెడ్డి బద్వేలు, చెన్నైలో ఉన్న సురేష్‌రెడ్డి, కుమార్‌కు లక్షల్లో డబ్బులను ఇచ్చి తమ అవసరాలకు వాడుకోవాలని.. మరలా తాను తీసుకుంటానని చెప్పాడు. ఈ క్రమంలోనే తన వెంట తెచ్చుకున్న డబ్బును మరలా షేర్లలో పెట్టడంతో.. వస్తూ పోతూ ఉండడం గమనించాడు. ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న భార్య అతనితోపాటు ఉండకుండా ప్రొద్దుటూరులో తాము ఉంటున్న ఇంటికి వచ్చేసింది. అప్పటికే పోరుమామిళ్ల పోలీసులకు బ్యాంకు అధికారులు, ఖాతాదారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్య పోలీసులకు చిక్కిందని తెలుసుకున్న గురుమోహన్‌రెడ్డి తన దగ్గర ఉన్న డబ్బులు, బంగారు నగలు తీసుకుని వచ్చేశాడు. ఈ నెల 11న కడప ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉండగా మైదుకూరు డీఎస్పీ బీఆర్ శ్రీనివాసులు, పోరుమామిళ్ల సీఐ మధుసూదన్‌గౌడ్, ఎస్ఐలు ఘన మద్దిలేటి, పెద్ద ఓబన్న తమ సిబ్బందితో కలసి గురుమోహన్‌రెడ్డిని, అతనికి ఆశ్రయం కల్పించిన సురేష్‌రెడ్డి, కుమార్‌ను అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుతోపాటు బంగారు, నగదు రికవరీ పోరుమామిళ్ల టౌన్‌లోని రంగసముద్రం ఎస్బీఐలో క్యాష్ ఇన్చార్జిగా పని చేసిన గురుమోహన్‌రెడ్డి, అతని స్నేహితులు సురేష్‌రెడ్డి, కుమార్‌ను అరెస్టు చేసినట్లు ఓఎస్డీ అద్నాన్ నయీమ్ అస్మి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ. 56.76 లక్షల నగదు, రూ. 51.54 లక్షల విలువైన 1.718 కిలో గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కోటి ఎనిమిది లక్షల రూపాయలు ఉంటుంది. నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన పోలీసు అధికారులను ఓఎస్డీ అభినందించారు. -
రాత్రి పూట టెర్రస్‌పైకి వద్దనేలోపే..
సాక్షి, న్యూఢిల్లీ : ఇంట్లో చెడిపోయిన నీటి కుళాయిని సరిచేస్తానంటూ వచ్చి ఓ బ్యాంకు ఉద్యోగిపై వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గత ఏడాది (2017) డిసెంబర్ 19న ఉత్తర ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఓ బ్యాంకులో సీనియర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. తనపై లైంగిక దాడి జరిగిన విషయం తెలియడంతో ప్రస్తుతం సహ ఉద్యోగులంతా తీవ్రంగా అవమానిస్తున్నారని బాధితురాలు వాపోతోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. 29 ఏళ్ల మహిళకు మూడేళ్ల కిందట ఉద్యోగ రీత్యా ఢిల్లీకి బదిలీ అయింది. బ్యాంకు తాళాలు నిర్వహించే బాధ్యత కూడా ఆమె చేతుల్లోనే ఉంది. దీంతో బ్యాంకుకు సమీపంలోనే ఓ ఇల్లును అద్దెకు తీసుకుంది. అది నాలుగంతస్తుల భవనం. కింద జిమ్ సెంటర్ ఉండగా మధ్యలో తాను ఉంటున్న పోర్షన్ ఉంది. ఆమెకు ఆ ఇంటి యజమాని తప్ప ఎవరూ తెలియదు. ఇంట్లో ఓ పనిమనిషిని పెట్టుకుంది. డిసెంబర్ 19న ఇంట్లో నీళ్లు రావడం లేదని పనిమనిషి చెప్పింది. దాంతో ఉద్యోగిని జిమ్ నిర్వహిస్తున్న ఇంటి యజమాని కుమారుడికి ఆ విషయం చెప్పగా అతడు సహాయం చేసేందుకు నిరాకరించాడు. ఆ సమయంలో ఆమె చెబుతున్న మాటలు ఆ జిమ్‌లోనే ఉన్న మరో వ్యక్తి విని సాయం చేస్తానంటూ ఆమెను అనుసరించాడు. అయితే ఆ సమయంలో పనిమనిషి కూడా పని ముగించుకుని వెళ్లిపోయింది. కాగా రాత్రి పూట టెర్రస్‌పైకి ఓ వ్యక్తితో కలిసి వెళ్లడం మంచిది కాదని భావించింది. అతడిని తిరిగి పంపించేలోగానే... ఆమెను నేరుగా బెడ్రూమ్లోకి నెట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. -
మోసగించిన స్నేహితులు.. బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య
సాక్షి, చెన్నై: ఇంటి స్థలం విషయంలో తనను స్నేహితులు మోసగించడంతో తట్టుకోలేక ఓ బ్యాంకు ఉద్యోగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై ఐనావరం రామనాథం వీధికి చెందిన చంద్రశేఖర్(52) సేలయూరు సహకార బ్యాంకులో పనిచేస్తున్నారు. సేలయూరులోని తన ఇంటిని అమ్మి తన వద్ద ఉన్న మరికొంత సొమ్ముతో స్థలం కొనుగోలు నిమిత్తం సన్నిహితులు, చిన్న కంచికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులైన శరవణన్, గణేష్‌లకు రూ.50 లక్షలు ఇచ్చాడు. అయితే స్థలం కొనివ్వకపోగా తీసుకున్న డబ్బు ఇచ్చేది లేదని వారు బెదిరించారు. దీంతో మనోవేదనకు గురైన చంద్రశేఖర్ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా ఐనావరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ జీవితం నాకొద్దు..
సాక్షి, బెంగుళూరు : అతనో బ్యాంకు ఉద్యోగి. మంచి జీతం. కానీ జీవితంలో మాత్రం ప్రశాంతత లేదు. ఉదయం నుంచి ఆఫీస్‌లో పనిచేసి సాయంత్రానికి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుందామనుకుంటే ఇంటి నిండా గొడవలే. చాలాసార్లు ఇంటి సభ్యులందరికీ సర్దిచెప్పాడు. అయినా ఏమాత్రం మార్పు రాలేదు. కుటుంబ సమస్యలతో విసిగివేసారి జీవితంపై విరక్తి చెంది బలవ్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే గురువారం నగరంలోని ఆలనహళ్లి లేఅవుట్లో ఓబ్యాంకు ఉద్యోగి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కురుబరహళ్లికి చెందిన వేణుగోపాల్ (32) ఆలనహళ్లి లేఅవుట్లోని కెనరా బ్యాంకులో పని చేస్తున్నాడు. గత కొద్ది కాలంగా వేణుగోపాల్ కుటుంబ సమస్యలు, కలహాలతో సతమతమవుతున్నాడు. తరచూ స్నేహితుల దగ్గర తన సమస్యలను చెప్పుకొని బాధపడేవాడు. ఈ జీవితం తనకు వద్దంటూ ఆవేదన వ్యక్తం చేసేవాడు. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన వేణు, గురువారం తన అన్నకు ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. అన్న వద్దంటూ వారించినా వినిపించుకోని వేణు బ్యాంకుకు సమీపంలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఈతగాళ్ల సహాయంతో వేణు మృతదేహాన్ని వెలికితీయించారు. నగర దక్షిణ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గిల్టు నగలు తాకట్టు: రూ.39 లక్షలకు టోకరా
అన్నానగర్: బ్యాంకులో గిల్టు నగలు తాకట్టుపెట్టి రూ.39 లక్షల రుణం తీసుకున్నాడో ఉద్యోగి. తమిళనాడులోని నాగై జిల్లా తిరుక్కడైయూర్ మేలవీధికి చెందిన బాలాజి (40) అదే ప్రాంతంలో ఉన్న ఓ బ్యాంకులో అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను గిల్టు నగలను బ్యాంకులో కుదువబెట్టి మోసానికి పాల్పడ్డట్టు బ్యాంక్ అధికారి కబాలీశ్వరన్‌కు సమాచారం అందింది. దీనిపై విచారణ జరపగా బాలాజీ కవరింగ్ నగలను కుదువబెట్టి రూ.39 లక్షల 46 వేల 206ల రుణం తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై బ్యాంకు అధికారి కబాలీశ్వరన్ నాగై జిల్లా నేర విభాగ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ముణియాండి, ఎస్ఐ సుమతి బ్యాంకుకు వచ్చి కేసు నమోదు చేసి బాలాజీని అరెస్టు చేశారు. అతడి నుంచి రెండు కార్లు, వ్యాన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంకు ఉద్యోగి ఘాతుకం
పావగడ(అనంతపురం): పట్టణంలోని రెయిన్ గేజ్ వీధిలో స్థానిక ఎస్బీఎం(ఐ) ఉద్యోగి రాఘవేంద్రాచారి(50) ఘాతుకం సృష్టించాడు. తల్లి వెంకటలక్ష్మమ్మ(70), భార్య మాధవి(45) కూతురు ప్రవల్లిక(12) లపై విచక్షణా రహితంగా మచ్చు కత్తితో దాడి జరిపి తీవ్ర గాయాల పాలుచేశాడు. ఈ దుర్ఘటన మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఈ దాడిలో తల్లి తలకు బలమైన దెబ్బలు తగలడంతో పరిస్థితి సీరియస్‌గా ఉంది. భార్య, కూతురు చేతులు, వీపు కు దెబ్బలు తగిలి తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులు ముగ్గురు బెంగుళూరు లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు రాఘవేంద్రాచారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... నిందితుడు ఎస్బీఎం బ్యాంకులో సీనియర్ హెడ్ క్యాషియర్ గా పని చేస్తున్నాడు. సంఘంటన జరిగిన రాత్రి సుమారు 1 గంటకు ఇంటికి చేరుకున్నాడు. ఎందుకు ఆలస్యంగా వచ్చావని తల్లి అడగడంతో కోపోద్రిక్తుడై అందుబాటు లో ఉన్న మచ్చుకత్తితో తల్లి పై దాడి చేసి విచక్షణారహితంగా నరికాడు. అడ్డొచ్చిన భార్య , కూతురి పై కూడా దాడి చేసి నరికాడు. అయితే తల్లి తలను బలంగా నరకడంతో రక్త సిక్తమైంది. భార్య వీపుకు, కూతురి చేతులకు బలమైన గాయాలయ్యాయి. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను రాత్రికి రాత్రే బెంగుళూరు ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా నిందితుడు చాలా కాలం నుండి మానసిక వ్యాధితో బాధ పడుతుండే వాడని, సైకలాజిస్టుతో చికిత్స పొంది ఔషధాలు వాడుతుండేవాడని తెల్సింది. ఈ నేపథ్యంలో 2 నెలల నుండి మాత్రలు వాడక పోవడంతో సైకో రీతిలో ప్రవర్తించే వాడని తెల్సింది. -
బ్యాంక్ ఉద్యోగిని బలవన్మరణం
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): ఎన్ఏడీ ఎస్బీఐ ఆర్‌ఏసీపీసీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న చిట్టాజీ గంగా భవాని(28) బుధవారం బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదు. స్థానికులు, ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని చీడిగకు చెందిన గంగాభవాని మర్రిపాలెం వుడా లేఅవుట్లోని సాంబశివ అపార్ట్మెంట్లో ఏడాదిగా నివాసం ఉంటోంది. బుధవారం విధులు నిర్వర్తించేందుకు బ్యాంక్‌కు వెళ్లింది. మధ్యాహ్నం భోజన విరామం çసమయంలో ఇంటికి వచ్చి తిరిగి బ్యాంక్‌కు వెళ్లలేదు. సాయంత్రం 4.30 సమయంలో బ్యాంక్‌లోని ఆమె స్నేహితురాలు రమాదేవికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, గంగాభవాని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలి పాడు. ఇంటికి వెళ్లి చూడాలని కోరాడు. దీంతో బ్యాంక్ ఉన్నతాధికారులు అనుమతి పొంది ఆమె ఇంటికి వెళ్లి చూసింది. తలుపులు మూసి ఉండటంతో ఇంటికి వచ్చిందా.. లేదా బయటకు వెళ్లిందా అన్న విషయాలు నిర్ధారించుకోవడానికి సీసీ టీవీ ఫుటేజ్‌లు పరిశీలించినట్టు ఆమె తెలిపింది. గంగా భవాని ఇంట్లోకి వెళ్లిందని గుర్తించిన ఆమె బ్యాంక్ అధికా రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గది తలుపులు తెరచి చూడగా ఫ్యాన్‌కు చున్ని కట్టి గంగాభవాని ఉరి వేసుకుని ఉంది. ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులకు తెలియజేసింది. గంగా భవానికి వివాహమై మూడు నెలలు అయింది. ప్రస్తుతం ఆమె ఒంటరిగా నివసిస్తోంది. వెస్ట్‌జోన్ ఏసీపీ భీమారావు, ఎయిర్పోర్ట్ జోన్ సీఐ ప్రభాకర్, ఎస్ఐ నాగేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గురువారం తహసీల్దార్, కుటుంబ సభ్యుల సమక్షంలో శవ పంచనామా నిర్వహిస్తామని ఏసీపీ తెలిపారు. -
బ్యాంకు అధికారిపై దాడి.. లూటీ
రాంచీ: జార్ఖండ్‌లో దోపిడీదారులు మరోసారి రెచ్చిపోయారు. గిరిద్ జిల్లాలో.. ఓ బ్యాంకు అధికారిని టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో రూ. 5 లక్షల విలువైన రెండువేల నోట్లను దుండగులు లూటీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఇటీవల బ్యాంకు నుంచి డబ్బు విత్ డ్రా చేసుకుని వెళ్తున్న వర్తకుడిపై ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు దాడి చేసి రూ. 5 లక్షలు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవల దుండగుల ఆగడాలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బ్యాంకు ఉద్యోగి దారుణహత్య
బావను గొడ్డలితో నరికి కడతేర్చిన బావమరిది గూడూరు : గొడవలతో విడిపోయి ఉన్న అక్కా, బావలను కలిపి వారి కాపురం చక్కబెట్టాల్సిన తమ్ముడే.. బావను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపి, తన సోదరి ఐదోతనాన్ని కాలరాశాడు. స్వయానా తన అక్క భర్త అయిన రఘు (54)ను అతడి బావమరిది రవి గొడ్డలితో నరికి చంపి పరారైన సంఘటన ఆదివారం అర్ధరాత్రి గూడూరు రెండో పట్టణంలోని జానకిరాంపేట ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. జానకిరాంపేటకు చెందిన గంగాబత్తిన లింగయ్య, సుబ్బమ్మల కుమార్తె మహేశ్వరిని సంగీతం రఘుకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వారికి పెళ్లిళ్లు అయిపోయాయి. రఘు విద్యానగర్‌లో కాపురం ఉంటూ వాకాడులోని బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నినెలల క్రితం రఘుకు అతని భార్యకు మధ్య గొడవలు ప్రారంభయ్యాయి. ఈ క్రమంలో రఘు వేరుగా ఒక గదిని అద్దెకు తీసుకుని ఉన్నాడు. ఈ క్రమంలో మహేశ్వరి పుట్టింటివారే వేరుగా ఎందుకుంటావని రఘుకు చెప్పి నాలుగునెలల క్రితం గూడూరుకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి రఘు గూడూరు నుంచి రోజూ బ్యాంకు వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రఘుకు అతని బావమరిది రవికి మధ్య గొడవ జరిగింది. రవి సోదరుడు ఈశ్వరయ్య, అతని భార్య సుజాతలతోపాటు తల్లి సుబ్బమ్మ వారి వద్దకు వచ్చి సర్ధిచెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ నిద్రిస్తున్న రఘుపై రవి గొడ్డలితో దాడిచేయగా అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సోమవారం సంఘటనా స్థలానికి డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ సీఐ సుబ్బారావు, ఎస్సై నరేస్లు చేరుకుని పరిశీలించారు. వివరాలు విచారించి కేసు నమోదు చేశారు. గతంలోనూ ఇంతే.. రవి గతంలో కూడా తన కన్న తండ్రి లింగయ్యపైనే కత్తితో దాడి చేసి నరికి హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అలాగే రవిపై సస్పెక్టడ్ షీట్ కూడా ఉన్నట్లు ఎస్సై నరేష్ వెల్లడించారు. -
రోడ్డు ప్రమాదంలో ఐసీఐసీఐ ఉద్యోగి మృతి
ఎర్రగడ్డలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగి మృత్యువాతపడ్డాడు. జేఎన్టీయూలోని ఐసీఐసీఐ బ్యాంకు శాఖలో పనిచేస్తున్న మురళీకృష్ణ బైక్‌పై వెళ్తుండగా మెట్రోస్టేషన్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మురళీకృష్ణ ఆస్పత్రికి తరలించేలోగానే చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్యాంకర్‌ను సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
చైతన్యపురిలో ఓ ఇంట్లో భారీ చోరీ
హైదరాబాద్: ఓ బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో బుధవారం భారీ చోరీ జరిగింది. నగరంలోని చైతన్యపురి అల్కాపురిలో బ్యాంక్ ఉద్యోగిని రాజేశ్వరి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలో 33 తులాల బంగారం, 10 లక్షల నగదును దొంగలు అపహరించినట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రైతుల పేరుతో రూ. 20 లక్షలు స్వాహా
నెల్లూరు: నెల్లూరు జిల్లా కొండాపూర్ మండలం రాయపేటలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లోని ఉద్యోగి చేతి వాటం ప్రదర్శించాడు. రైతుల పేరుతో రూ. 20 లక్షలు స్వాహా చేశారు. ఆ విషయాన్ని అధికారులు చాలా ఆలస్యంగా గుర్తించారు. దాంతో బ్యాంకు అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం విచారణ చేపట్టారు. అందులోభాగంగా బ్యాంకు ఉద్యోగిని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. -
బ్యాంకు అధికారినంటూ టోకరా
వనపర్తిటౌన్ : తాము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని ఓ వ్యక్తి వనపర్తిలో ఇద్దరికి టోకరా వేశాడు. పిన్ నెంబర్ సాయంతో వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు లేగేశాడు. పోలీసుల కథనం ప్రకారం కొద్దిరోజులు క్రితం వల్లభ్ నగర్‌కు చెందిన విజయ్ కుమార్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి..తాము వనపర్తి ఐసీఐసీఐ బ్యాంకు నుంచ మాట్లాడుతున్నామని, మీ ఎటీఎం కార్డుపిన్, అకౌంట్ నెంబర్ చెప్పమని అడగటంతో విజయ్ కుమార్ చెప్పేశాడు. క్షణాల్లోనే అతని ఖాతా నుంచి రూ. 20 వేలు డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. అదేకాలనీకి చెందిన మరో వ్యక్తి కృష్ణయ్యకు ఫోన్ రావడంతో పిన్ నెంబర్ చుప్పేశాడు. వెంటనే రూ.50 వేలు డ్రా అయినట్టు అతనికి మెసేజ్ వచ్చింది. ఈ ఘటనలపై బాధితులు బ్యాంకు అధికారులను సంప్రదించారు. తమ సిబ్బంది అలాంటి కాల్స్ చేయలేదని వారు స్పష్టం చేయటంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సీతారామిరెడ్డి మంగళవారం తెలిపారు. -
ఎస్బీఐలో ఉద్యోగి చేతివాటం
చిత్తూరు: జిల్లాలోని వరదయ్య పాలెంలో ఎస్బీఐ ఉద్యోగి చేతి వాటం ప్రదర్శించాడు. బ్యాంక్ లో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహేంధ్ర రూ.1,50 లక్షలను స్వాహా చేశాడు . విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు మహేంధ్ర పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు .పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అవతలివాళ్ళకు కష్టం వచ్చిందంటే... అమ్మే మొక్కుకొనేది!
సూర్యకాంతం... సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. విచిత్రమైన మాటవిరుపు, విసురైన చేతి వాటంతో తెరపై గయ్యాళితనం వెలిగించిన నట సూర్యమణి ఆమె. సూర్యకాంతమనే పేరే గయ్యాళి తనానికి మారుపేరన్నంత పేరు తెచ్చిన ఆమె నిజజీవితంలో ఆ స్క్రీన్ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా శాంతమూర్తి. ఆపదలో ఉన్నవాళ్ళెవరైనా సరే వాళ్ళ కోసం దేవుడికి మొక్కే ప్రేమమూర్తి. అందరికీ వండి వడ్డించే మాతృమూర్తి. మరి, ‘పొన్నాడ’ వారి ఇంట పుట్టి, ‘పెద్దిభొట్ల’ వారింట మెట్టి, అక్క కొడుకునైన తననే సొంత కొడుకుగా పెంచుకున్న ‘అమ్మ’ గురించి ఆమె దత్తపుత్రుడు ఏమంటారు? ఇవాళ సూర్యకాంతం 90వ జయంతి సందర్భంగా, మునుపెన్నడూ పత్రికల్లోకి ఎక్కని మాజీ బ్యాంకు ఉద్యోగి, హోమియో డాక్టర్ దిట్టకవి అనంత పద్మనాభమూర్తి ‘అమ్మ’ గురించి ఆత్మీయంగా పంచుకున్న ముచ్చట్లు... మా అమ్మ సూర్యకాంతం నిజానికి నాకు స్వయానా పిన్ని. నన్ను దత్తత తీసుకొని, కన్నబిడ్డలా పెంచి, పిన్నే నాకు అమ్మ అయింది. అమ్మ పుట్టింది ఇప్పటికి సరిగ్గా 90 ఏళ్ళ క్రితం. కాకినాడకు 8 కిలోమీటర్ల దూరంలోని వెంకట కృష్ణరాయ పురంలో. తాతయ్య పొన్నాడ అనంతరామయ్య ఆ ఊరికి కరణం. మా అమ్మమ్మ (వెంకట రత్నం), తాతయ్యలకు అమ్మ సూర్యకాంతం 14వ సంతానం. ఆ 14 మందిలో మిగిలింది నలుగురే! మూడో బిడ్డ నాకు జన్మనిచ్చిన తల్లి సత్యవతి అయితే, కడగొట్టు బిడ్డ - అమ్మ సూర్యకాంతం. మా తాతయ్య జ్ఞాపకంగా నాకు అనంత పద్మనాభమూర్తి అని అమ్మ పేరు పెట్టింది. అందుకే పేరుతో కాకుండా, ‘నాన్నా’ అనే పిలిచేది. నా కన్నతల్లి వారింటి పేరు నిలపడం కోసం నాకు ‘దిట్టకవి’ అనే ఇంటిపేరే కొనసాగించింది. మద్రాసు బండిలో... అమ్మ, అమ్మమ్మ అమ్మ సినిమాల్లోకి రావడం గమ్మత్తుగా జరిగింది. అమ్మకు ఆరేడేళ్ళ వయసులోనే తాతయ్య చనిపోయారు. దాంతో, కొన్నాళ్ళు కాకినాడలో తన పెద్దక్క, బావల దగ్గర అమ్మ పెరిగింది. అయితే, చదువు ఒంటబట్టలేదు. చిన్నతనంలో అమ్మ కొద్దిగా పెంకి. పృథ్వీరాజ్ కపూర్ హిందీ చిత్రాలంటే తగని పిచ్చి. పల్లెటూరి నుంచి కాకినాడకు ఎడ్లబండిలో వచ్చి హిందీ సినిమాలు చూసేవారట. అలా చిన్నప్పుడే సినిమాల మీద మక్కువ కలిగింది. చివరకు పెద్దక్క ఒప్పుకోకున్నా, అమ్మ, ఆమె వెంటే మా అమ్మమ్మ మద్రాస్‌కు బండెక్కే శారట. ‘నారద నారది’ (1946) అమ్మ తొలి సినిమా. గమ్మత్తేమిటంటే, అమ్మ మొదట్లో నాయిక పాత్రలు ధరించాలనుకున్నా, సినీ రంగంలోకి వచ్చిన చాలా కొద్ది రోజులకే క్యారెక్టర్ వేషాల వైపు మళ్ళారు. దానికి ఓ కారణం ఉంది. మద్రాసులో అమ్మ ఒకసారి రోడ్డు మీద వెళుతుంటే, ఓ యాక్సిడెంట్ జరిగింది. ముక్కు మీద మచ్చ పడింది. అది క్లోజప్‌లో తెలిసిపోతుందని గ్రహించి, నాయిక పాత్రలకు దూరంగా ఉన్నానని అమ్మే స్వయంగా చెప్పింది. అంతకు ముందు ఎన్నో పాత్రలతో పేరు తెచ్చుకున్నా ‘గుండమ్మ కథ’ (’62) నుంచి ‘సూర్యకాంతం శకం’ ఆరంభమైందని అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రభ చివరి దాకా కొనసాగింది. భానుమతికి ‘సూర్యం’... అంజలీదేవికి ‘అమ్మ’ సినీ రంగంలోని తోటి నటీనటులందరికీ అమ్మంటే ప్రాణం. తొలి రోజుల నుంచి నటి భానుమతి గారికి అమ్మతో మహా దోస్తీ. ఆవిడ కష్టసుఖాలు ఈవిడకీ, ఈవిడ కష్టసుఖాలు ఆవిడకీ చెప్పుకొనేవారు. అంత ఆంతరంగికులు. భానుమతి గారు అమ్మను ‘సూర్యం’ అని పిలిచేవారు. అలాగే, అంజలీ దేవి అమ్మను సాక్షాత్తూ కన్నతల్లిగా భావించేవారు. తెర మీద ఇద్దరూ ప్రత్యర్థుల్లా కొట్టుకున్నట్లు కనిపించినా ఛాయాదేవి, అమ్మ మంచి స్నేహితులు. మా ఇంట్లో శుభ కార్యాలన్నిటికీ ఆమె వచ్చేవారు. ఇక, కాంచన, గీతాంజలి, రమాప్రభ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. రాధాకుమారి అయితే వారానికి ఒకసారి అమ్మను కలవాల్సిందే. పండుగ, పబ్బం ఏదొచ్చినా తోటి నటులకు అమ్మ ఉండాల్సిందే. నటి - మాజీ ముఖ్య మంత్రి జయలలిత తల్లి సంధ్యతో అమ్మకు సాన్నిహిత్యం. తెరపై గయ్యాళి భార్య... ఇంట్లో నాన్నకు అనుకూలవతి నాన్న గారు పెద్దిభొట్ల చలపతిరావు గుంటూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్. మద్రాసుకొచ్చి, హైకోర్ట్‌లో వకీలుగా స్థిర పడ్డారు. ప్రసిద్ధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు లీగల్ అడ్వైజర్. ఆయనకు నాటకాలన్నా, పద్యాలన్నా తగని ప్రేమ. పద్యాలు బాగా పాడేవారు. ఆ కళాభిరుచితోనే 1950లో అమ్మను ద్వితీయ కళత్రంగా చేసుకున్నారు. తెరపై గయ్యాళి భార్యగా కనిపించే అమ్మ, జీవితంలో భర్త మనసెరిగి ప్రవర్తించే అనుకూలవతైన ఇల్లాలు. నాన్న కూడా అమ్మ మీద ఎప్పుడూ ఎలాంటి షరతులూ పెట్టలేదు. సినిమా వాతావరణం, ఆ భేషజాలు ఇంట్లో ఎక్కడా ఉండేవి కాదు. సాదా మధ్యతరగతి జీవితాన్నే అమ్మ ప్రేమించింది. వాళ్ళకు పిల్లలు లేరు కాబట్టి, రోజుల పిల్లాడిగా ఉన్నప్పుడే నన్ను దత్తత తీసుకున్నారు. వారి బిడ్డగా పెరగడం అదృష్టం. కుటుంబ సభ్యుల మీద అమ్మకెంత ప్రేమంటే, రాత్రి నిద్ర మధ్యలో లేచినప్పుడు ఒక్కసారి అందరినీ చూసొచ్చి కానీ పడుకొనేది కాదు. ఆ అలవాటే నాకూ వచ్చింది. విపరీతమైన భక్తి... విచిత్రమైన మొక్కులు అమ్మకు దైవభక్తి చాలా ఎక్కువ. ఎప్పుడూ ఏవో పూజలు, వ్రతాలు చేస్తుండేది. రోజూ తెల్లవారుజామున 4.30 కల్లా లేచి, స్నానాదికాలు ముగించుకొని, లక్ష్మీదేవికీ, వెంకన్నకీ ఓ అరగంట పూజ చేసి, అన్నపూర్ణాదేవికి పాలు నైవేద్యం పెట్టిన తరువాత కానీ బయటకు వెళ్ళేది కాదు. ఉదయం 7.30 కల్లా వంట చేసేసి, షూటింగ్‌కు వెళ్ళేది. తిరుమలలో అమ్మ పేరు మీద కాటేజీ ఉంది. రెండు నెలలకోసారి తిరు మల వెళ్ళాల్సిందే! అలాగే, సూళ్ళూరుపేటలోని చెంగాళమ్మ గుడి అంటే అమ్మకు మహాభక్తి. నెలనెలా వెళ్ళాల్సిందే! అప్పట్లో ఆ గుడి ఇంత ప్రాచుర్యం పొందలేదు, పెద్దదీ కాలేదు. చిన్న గుడి, బయటకు ఓపెన్‌గా ఉండేది. వచ్చే పోయేవారి కోసం అక్కడ గుడి పక్కనే గది కట్టించి, వసతులు కల్పించింది. అలాగే, ఏడాదికి ఒకసారి బెజవాడ కనకదుర్గమ్మ, అన్నవరం సత్యనారాయణస్వామి, సింహాద్రి అప్పన్న - ఇలా అందరినీ దర్శించుకొని రావాల్సిందే! సినిమాల్లో గయ్యాళిగా చేసిందే కానీ, అమ్మ స్వభావం అందుకు పూర్తి వ్యతిరేకం. పైకి గంభీరంగా, నిబ్బరంగా కనిపించినా, సున్నిత మనస్కురాలు. ప్రేమ అయినా, బాధ అయినా ఆమె పైకి పెద్దగా వ్యక్తం చేసేది కాదు. తనలో తానే ఉండేది. అందరి మంచీ కోరుకొనేది. ఆమెకు నమ్మకాలు ఎక్కువ. తన, పర భేదం లేకుండా ఎవరికి ఏ కష్టం వచ్చినా, వాళ్ళ క్షేమం కోసం ‘దేవుడా! దేవుడా!’ అంటూ, మొక్కులు మొక్కడం అమ్మలోని ప్రత్యేక లక్షణం. ఆమె ఊతపదాన్ని ఆ మధ్య సినిమాల్లో కూడా పెట్టినటు ్లన్నారు. అలాగే, ‘‘ఏంటి తల్లీ! రోజూ పూజ చేస్తున్నా. డబ్బులివ్వవేంటీ?’’ అని మనం దరితో మాట్లాడుతున్నట్లే అమ్మవారితో అమ్మ మాట్లాడేది. నిర్మాత, దర్శకులను కన్న తల్లితండ్రుల్లా భావించేది. వాళ్ళ క్షేమం కోసమే తపించేది. పనివాళ్ళకు అనారోగ్యం వచ్చినా అంతే! ‘అదృష్టవంతులు’ చిత్ర సమయంలో ప్రమాదం జరిగి, నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ కారు మధ్యలో ఇరుక్కొన్నారు. వెంటనే అమ్మ ఇంట్లో మా అందరితో ‘మృత్యుంజయ మంత్రజపం’ చేయించడం నాకిప్పటికీ గుర్తు. ‘బందిపోటు దొంగలు’ అవుట్డోర్ షూటింగ్లో నటుడు జగ్గయ్య గుఱ్ఱం మీద నుంచి పడిపోతే, నిర్మాతెంతో నష్టపోతాడన్న భయంతో రకరకాల మొక్కులు మొక్కుకుంది. ఆమె మొక్కుకొనే మొక్కులు కనీవినీ ఎరగనివి. ఉదాహరణకు, ‘బాల బాలాజీ వ్రతం’ అనేది! ప్రతి శనివారం అయిదుగురు చిన్నపిల్లల్ని తీసుకురమ్మనేది. వాళ్ళను వెతికి పట్టుకురావడం నా పని. రకరకాల వంటలు వండి, మడిగా వడ్డించేది. స్కూళ్ళకు వెళ్ళే లోపల ఇవన్నీ చేసి వాళ్ళకు పెట్టి, స్కూల్లో తినడానికీ కట్టి పంపించేది. ఆ వ్రతం ఎక్కడా ఉండేది కాదు.. ఆమె అనుకొని చేసేసేది. అంతే! ఆరోగ్యం బాగుపడుతుందంటే, దర్గాకూ పంపేది. పుస్తకాల పురుగు... పది భాషల్లో ప్రవీణ! అమ్మకు దానగుణం కూడా ఎక్కువే. ఉన్న దాంట్లోనే దాన దర్మాలు చేసేది. చిన్న చిన్న పత్రికలకు కూడా ఆర్థికంగా అండగా నిలిచేది. మా అమ్మ స్కూలు చదువులు పెద్దగా చదువుకోలేదన్న మాటే కానీ, నవలలు, పత్రికలు, పురాణాలు - ఇలా ఏ పుస్తకమైనా తెగ చదివేది. పొద్దున్నే ‘ఆంధ్రపత్రిక’ డైలీ కాస్త ఆలస్యంగా వస్తే చాలు... పేపర్ కుర్రాడికి అమ్మ చేత అక్షింతలు పడేవి. యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి నవలలంటే అమ్మకు ఇష్టం. ఇంట్లో ఉంటే అందరం ఎవరికి వాళ్ళం పుస్తకాలు చదువుకోవడమే. బాపు జోక్స్ అన్నా, ముళ్ళపూడి అన్నా అమ్మకు భలే ఇష్టం. అమ్మకు ఓ చిత్రమైన అలవాటుండేది. విమాన ప్రయాణంలో ఇచ్చే బోర్డింగ్ పాస్‌లు మందంగా ఉంటాయి కాబట్టి, పుస్తకాల్లో వాటిని బుక్మార్క్లుగా వాడేది. ఆమెకు కుక్కలు, చేపల పెంపకమంటే తగని పిచ్చి. చివరి దాకా వాటిని వదులుకోలేదు. చిన్నప్పుడు పెద్దగా చదువుకోకపోయినా, మద్రాసుకు వచ్చాక ఇంగ్లీషు నేర్చుకుంది. పుస్తకాలు చదివి చదివి తెలుగులో ప్రావీణ్యం సంపాదించింది. రకరకాల భాషలు నేర్చుకోవడం అమ్మకిష్టం. ఆమెకు 10 భాషలు వచ్చు. 50 ఏళ్ళ వయసులో ఆమె ఫ్రెంచ్ నేర్చుకుంది. చిన్నప్పటి నుంచీ అమ్మది ఎడమచేతివాటం. సినిమాల్లోనూ అదే కనిపిస్తుంది. సహజనటి అయిన అమ్మ ఏకసంథాగ్రాహి. ఒక్కసారి డైలాగ్ వింటే, ఏళ్ళ తరబడి గుర్తుపెట్టుకొనేది. అయితే, బహిరంగ సభలకు రావడం, మాట్లాడడం తక్కువ. మైక్ ఇచ్చారంటే, మాట్లాడలేదు. నవ్వేసి కూర్చొనేది. ప్రసిద్ధ రచయిత కొవ్వలి తన వెయ్యో నవల ‘మంత్రాలయ’ను అమ్మకు అంకిత మిచ్చి, నాన్న గారి ద్వారా సభకు ఒప్పించారు. ఆ సభకు కృష్ణశాస్త్రి, కొడవటిగంటి లాంటివారంతా హాజరయ్యారు. తెర మరుగైన సూర్యకాంతి సహజ నటి అయిన అమ్మకు ‘పద్మశ్రీ’లు ప్రభుత్వాలు ఇవ్వలేదు కానీ, ప్రజలు మాత్రం ఇప్పటికీ ఆమె గురించి గొప్పగా మాట్లాడతారు. ఊహించని రీతిలో చుట్టుపక్కలి మిత్రులే శత్రువులవడంతో నాకు జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలు, అసహజ రోడ్డు ప్రమాదం అమ్మను కుంగదీశాయి. మనోవేదనతో 1994లో అమ్మ కన్నుమూసింది. నమ్మిన వాళ్ళ పన్నాగాలతో మాకు ఆస్తిపాస్తులు, చివరకు అమ్మ ఫోటోలు సైతం మిగలలేదు. పాత ఇల్లు పడేసి కట్టినచోట ఈ ఒక్క ఫ్లాట్ దక్కింది. అయితేనేం, ఇవాళ్టికీ సూర్యకాంతం గారి అబ్బాయినంటే దక్కే గౌరవం, ప్రేమ అంతా ఇంతా కాదు. అమ్మ నాకిచ్చివెళ్ళిన పెద్ద ఆస్తి అదే! ఆ తృప్తి చాలు. సంభాషణ: రెంటాల జయదేవ అమ్మది అమృతం లాంటి వంట... అన్నపూర్ణ లాంటి మనసు! అమ్మ చేతివంట అమృతం. అమ్మ చేసే ములక్కాడల పులుసు, ఉల్లి పాయల పులుసు, పులిహోర లాంటివి నాలుగు రోజుల పాటు పాడవకుండా ఉండేవి. షూటింగ్‌లకు కూడా రెండు బుట్టల్లో నాలుగు క్యారేజీల నిండా భోజనం, మిఠాయిలు, చిరు తిండ్లు పట్టుకు వెళ్ళేది. అమ్మ షూటింగ్లో ఉందంటే, సెట్లోని వాళ్ళకు పండగే! ఎన్టీఆర్ సైతం ‘అక్కయ్య గారూ.. ఏం తెచ్చారు’ అని అడిగి మరీ వడ్డించుకొనేవారు. తెల్లవారుజామునే లేచి పూజ చేసుకొని, వంట చేసి, మాకు క్యారేజీలు కట్టి, తను సిద్ధమై క్యారేజీలు తీసుకొని మరీ షూటింగ్‌కు వెళ్ళేది. ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే చాలు... అప్పటికప్పుడు వాళ్ళ కోసం ఫలహారమో, మిఠాయిలో, చిరుతిండ్లో స్వయంగా వండి పెట్టేది. ఇంటికి వచ్చినవాళ్ళు తప్పనిసరిగా ఏదైనా తిని వెళ్ళాలి. లేకపోతే, ఆమె మనసు ఊరుకోదు. చివరలో అనారోగ్యంతో లేవలేని పరిస్థితుల్లో కూడా ఎవరైనా ఇంటికి వస్తే, పెట్టడానికని జంతికలు, పాలకాయలు, సున్నుండల లాంటివి కొని డబ్బాల్లో ఉంచేది. కూల్‌డ్రింక్ సీసాలు క్యాన్లకు క్యాన్లు తెప్పించి ఉంచేది. ‘నాయనా! నేను లేవలేనురా! అక్కడ ఉన్న ఆ కూల్‌డ్రింక్ తీసుకొని, ఆ ఓపెనర్‌తో మూత తీసుకొని, తాగి వెళ్ళరా!’ అని చెప్పేది. చనిపోయేదాకా ఆవిడలోని ఆ అన్నపూర్ణేశ్వరి లక్షణం పోలేదు. -
బ్యాంక్ ఉద్యోగి చేతివాటం.. రూ. 18.70 లక్షలు స్వాహా
కడప: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు స్టేట్ బ్యాంక్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న నాగేశ్వరరెడ్డి చేతివాటం ప్రదర్శించాడు. ఫోర్జరీ సంతకాలు చేసి 18.70 లక్షల రూపాయలను స్వాహా చేశాడు. బ్యాంక్ అధికారులు నాగేశ్వర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బ్యాంక్ ఉద్యోగి చేతివాటం
గుర్రంపోడు, న్యూస్‌లైన్: గుర్రంపోడులోని గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి ప్రభుత్వ కార్యాల యాల ఖాతాలలోని సొమ్మును పక్కదారి పట్టించాడు. లెక్కల్లో తేడాను ఆలస్యంగా గుర్తించిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ గౌరీనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఎపీజీవీబీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గాదెపాక రవీందర్ సెప్టెంబర్ 13 ఎంపీడీఓ ఖాతా నుంచి రూ 28,276, తహసీల్దార్ ఖాతా నుంచి రూ 47,516లను గుర్రంపోడుకు చెందిన సైదిరెడ్డి అనే వ్యక్తి ఖాతాకు బదిలీ చేశాడు. మళ్లీ రూ 58,307లను తహసీల్దార్ ఖాతా నుంచి కట్ట నర్సింహ్మ అనే వ్యక్తి ఖాతాలోకి మళ్లించాడు. అక్టోబర్ 7న రూ 75,000లను ఖాతాదారుడికి తెలియకుండా శివప్రసాద్ అనే వ్యక్తి ఖాతాలో జమచేశాడు. ఆతర్వాత లెక్కల్లో తేడాలు రావడంతో గుర్తించిన బ్యాంకు అధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టి నగదు బదిలీ కాబడిన ఖాతాదారుల నుంచి సొమ్మును రికవరీ చేశారు. నిందితుడు విషయం బయట పడినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. బ్యాంక్ మేనేజర్ సుంకు విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఉద్యోగి రవీందర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.