తూర్పు గోదావరి: అత్తారింట్లో ఉన్న భార్య, పాపలను చూసి వద్దామని బైక్‌పై బయలు దేరిన బ్యాంకు ఉద్యోగిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధి గామన్ బ్రిడ్జి రోడ్డుపై ఆటోనగర్ వద్ద ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీతానగరం మండలం బొబ్బిల్లంకకు చెందిన చిట్టూరి అజయ్ (33) సీతానగరం ఎస్‌బీఐలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు.
అతనికి రెండేళ్ల కిందట వివాహమైంది. 4 నెలల పాప కూడా ఉంది. ఈ క్రమంలో పెదపూడి మండలం కడకుదురులో అత్తారింటి వద్ద ఉన్న భార్య, పాపలను చూసి వద్దామని ఆదివారం ఉదయం ఇంటి నుంచి బైకుపై బయలు దేరాడు. గామన్ బ్రిడ్జిపై వెళ్తున్న అతను ఆటోనగర్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి వేగంగా ఢీకొని అతని పైనుంచి వెళ్లిపోయింది. దీంతో శరీరంతో పాటు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్సై సుధాకర్ తెలిపారు. వాహనం తలపై నుంచి వెళ్లడంతో ఆ ప్రాంతమంతా రక్తపు మడుగులా మారింది.
కష్టాలు తీరేవేళ..: ఇద్దరు బిడ్డలు అందివచ్చారు.. కష్టా లు తీరిపోతాయనుకుంటున్న తరుణంలో రోడ్డు ప్రమాదంలో ఇలా జరిగిందంటూ పెద్ద కుమారుడిని కోల్పోయిన ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి తండ్రి బాపన్నకు 10 సెంట్ల భూమి ఉంది. కొంతకాలం కౌలు రైతుగా పనిచేసిన ఆయన వృద్ధాప్యంతో వ్యవసాయం చేయడం లేదు. ఇద్దరు మగ సంతానంలో ఒకరు ఎస్‌బీఐలో, మరొక రు కాటవరం ఆంధ్రా బ్యాంకులో పనిచేస్తున్నారు. అ జయ్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment