ముంబై నగర పరిధిలోని బాంద్రా-వోర్లి వంతెనపై నుంచి సముద్రంలోకి దూకి ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతున్ని సెంట్రల్ ముంబైలోని పారెల్ ప్రాంతానికి చెందిన ఆకాశ్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం (నవంబర్ 10) రాత్రి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ నుంచి పారెల్‌కు ట్యాక్సీ బుక్ చేసుకున్న ఆకాశ్ సింగ్.. బాంద్రా-వోర్లి సముద్ర వంతెన మీదకు వెళ్లాలని ట్యాక్సీ డ్రైవర్‌కు చెప్పాడు. ట్యాక్సీ వంతెన మీదకు రాగానే తన ఫోన్ పడిపోయిందని చెప్పిన ఆకాశ్ సింగ్ డ్రైవర్ ట్యాక్సీ ఆపగానే దిగి సముద్రంలోకి దూకేశాడు. ఈ వంతెన ఎత్తు సుమారు 400 అడుగులు ఉంటుంది.
ఆకాశ్‌సింగ్ మృతదేహం అర్ధ రాత్రి తర్వాత పైకి తేలిందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఆకాశ్‌సింగ్ తల్లిదండ్రులతో కలిసి నివసించేవాడని, మూడు నెలల క్రితం ప్రియురాలితో విడిపోయాడని పోలీసులు పేర్కొన్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment