Bandra-Worli Sea Link
-
400 అడుగుల ఎత్తు నుంచి దూకేశాడు!
ముంబై నగర పరిధిలోని బాంద్రా-వోర్లి వంతెనపై నుంచి సముద్రంలోకి దూకి ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతున్ని సెంట్రల్ ముంబైలోని పారెల్ ప్రాంతానికి చెందిన ఆకాశ్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం (నవంబర్ 10) రాత్రి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ నుంచి పారెల్‌కు ట్యాక్సీ బుక్ చేసుకున్న ఆకాశ్ సింగ్.. బాంద్రా-వోర్లి సముద్ర వంతెన మీదకు వెళ్లాలని ట్యాక్సీ డ్రైవర్‌కు చెప్పాడు. ట్యాక్సీ వంతెన మీదకు రాగానే తన ఫోన్ పడిపోయిందని చెప్పిన ఆకాశ్ సింగ్ డ్రైవర్ ట్యాక్సీ ఆపగానే దిగి సముద్రంలోకి దూకేశాడు. ఈ వంతెన ఎత్తు సుమారు 400 అడుగులు ఉంటుంది. ఆకాశ్‌సింగ్ మృతదేహం అర్ధ రాత్రి తర్వాత పైకి తేలిందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఆకాశ్‌సింగ్ తల్లిదండ్రులతో కలిసి నివసించేవాడని, మూడు నెలల క్రితం ప్రియురాలితో విడిపోయాడని పోలీసులు పేర్కొన్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు. -
ట్రాఫిక్ పోలీసులపై యువతి వీరంగం.. చేయి నరికేస్తా అంటూ బెదిరింపులు
ముంబై: మహారాష్ట్రలో ఓ యువతి హల్చల్ చేసింది. నిబంధనలకు విరుద్దంగా రోడ్డుపై డ్రైవ్ చేయడమే కాకుండా.. బైక్ ఆపిన పోలీసులపై రెచ్చిపోయి ప్రవర్తించింది. ట్రాఫిక్ పోలీసులపై దుర్భషలాడుతూ కానిస్టేబుల్‌ను నెట్టేసింది. ఈ ఘటన ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్ వద్ద జరిగింది. వివరాలు.. నూపుర్ ముఖేష్ పటేల్ అనే 26 ఏళ్ల ఆర్కిటెక్ట్ దక్షణి ముంబై వైపు అతివేగంతో వెళుతోంది. గుర్తించిన బాంద్రా-వర్లీ సీ లింక్ ట్రాఫిక్ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అయితే మహిళ తన బైక్‌ను దిగడానికి నిరాకరించింది. దీంతో పోలీసులుర ఆమెను కిందకు దింపేందుకు ప్రయత్నించగా వారితో వాదించడం ప్రారంభించింది. ‘ఈ రోడ్డు నా తండ్రిది. నేను ట్యాక్స్ కడుతున్నాను. నన్ను ఎవరూ ఆపలేరు’ అంటూ పోలీసులను బెదిరించింది. బైకర్‌ను ఎంత విజ్ఞప్తి చేసినప్పటికీ వినిపించుకోకుండా బైక్‌ను నడిరోడ్డుపై నిలిపి ట్రాఫిక్ పోలీసులతో గొడవకు దిగింది. ‘నా బైక్‌పై చేయి పెట్టడానికి ఎంత ధైర్యం.. నీ చేయి నరికేస్తాను’ అంటూ రెచ్చిపోయింది. అంతేగాక ఓ కానిస్టేబుల్‌ను నెట్టేసింది. Meet NUPUR PATEL, joyriding on her motorcycle without a #helmet on the Bandra-Worli Sea Link where two-wheelers are not permitted. She started verbally #abusing the police and even allegedly pointed her cigarette lighter, which was shaped like a #pistol, at the police when asked… pic.twitter.com/wGzuSDaUW8 — ShoneeKapoor (@ShoneeKapoor) September 24, 2023 కాగా ట్రాఫిక్ పోలీసులతో మహిళ వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులతో ఆమె ప్రవర్తించిన విధానాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. యువతిని మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ ప్రాంతానికి చెందిన ఆమెగా గుర్తించారు. బుల్లెట్ బైక్ అక్కడి రియల్ ఎస్టేట్ సంస్థలో రిజిస్టర్ అయి ఉన్నట్లు తేలింది. మరోవైపు యువతిపై నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక విచారణకు హాజరు కావాల్సిందిగా సెక్షన్ 41A కింద ఆమెకు నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
ర్యాష్ డ్రైవింగ్.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడికి గాయాలు
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలో బీజేపీ మాజీ కొడుకుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడినట్టు పోలీసులు తెలిపారు. ఇక, సదురు ఎమ్మెల్యే కొడుకుపై ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. వివరాల ప్రకారం.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మోహతా కుమారుడు తక్షీల్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. శనివారం ఉదయం తన ఖరీదైన లాంబోర్గినీ హురాకాన్ కారులో హైస్పీడ్‌లో వెళ్తుండగా వాహనం అదుపు తప్పింది. ఈ క్రమంలో ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్ బ్రిడ్జి రైలింగ్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తక్షీల్ గాయపడినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదం సందర్భంగా కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. భారత్‌లో లాంబోర్గినీ హురాకాన్ ధర రూ.3.5 కోట్ల వరకు ఉంటుందన్నారు. ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వర్లీ పోలుసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: దీప్తి కేసులో సంచలన విషయాలు వెల్లడించిన ఎస్పీ.. షాక్‌లో పేరెంట్స్! -
ఘోర ప్రమాదం.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ముంబై: ప్రమాదం జరిగిందని సాయం అందించేందుకు కార్లు దిగిన కొందరిని.. మృత్యువు అతివేగం రూపంలో కబళించేసింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ కారు.. ఆంబులెన్స్‌ను, మూడు కార్లను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ముంబైలోని బాంద్రా-వర్లి సీ లింక్ మీద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం 3గం. ప్రాంతంలో బాంద్రా-వర్లి సీ లింక్ 76-78 పోల్స్ మధ్య ఈ ఘటన జరిగింది. దక్షిణ ముంబై వర్లి-పశ్చిమ సబర్బ్స్‌ను కలుపుతూ ఉండే ఈ వారధిపై ప్రమాదం జరిగిందని, ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారని, మరో ఎనిమిది మంది చికిత్స పొందుతున్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. తొలుత ఓ కారు డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. క్షతగాత్రులకు సాయం అందించేందుకు అక్కడికి చేరుకుంది ఆంబులెన్స్. ఈ క్రమంలో కార్లలో వెళ్తున్న కొందరు ఆగారు. ఇద్దరు కార్ల నుంచి దిగి.. ఆంబులెన్స్ సిబ్బందికి సాయం చేయబోయారు. ఆ సమయంలోనే వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. కార్లను, ఆంబులెన్స్‌లను బలంగా ఢీ కొట్టింది. దీంతో అంతా చెల్లాచెదురై పడిపోయారు. BREAKING : Five people died after a speeding car rammed into an accident site on the Bandra-Worli sea link in Mumbai.#Mumbai #Bandra #Worli #Accident #ViralVideo pic.twitter.com/m32mH7LYWb — Sangpu Changsan (@_sangpuchangsan) October 5, 2022 ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు.. క్షతగాత్రులను స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే మార్గాన్ని మూసేశారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఘటన బాధించిందని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారాయన. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదీ చదవండి: అప్పటిదాకా సంతోషం.. అంతలోనే ఊహించని విషాదం -
బాంద్రా-సీలింక్‌పై భద్రతా చర్యలు కట్టుదిట్టం
సాక్షి, ముంబై: బాంద్రా-వర్లీ సీలింక్‌పై భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. మరో రెండు నెలల్లో ఈ వంతెనపై నిఘా వ్యవస్థను పటిష్టం చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముంబై పోలీసులు, ట్రాఫిక్ పోలీసులతోపాటు, మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీలింక్ టోల్ కలె క్షన్ ఏజెన్సీ అధికారులు భద్రతపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకొన్నారు. ఈ ఏడాది నవంబర్ వరకు అదనంగా 70 క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలు (సీసీటీవీ) ఏర్పాటు చేయనున్నారు. భద్రతా సిబ్బందిని కూడా మోహరించనున్నారు. ఈ వంతెనపై ప్రస్తుతం షిఫ్టుల వారీగా నలుగురు భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి షిఫ్టులో ఆరుగురు భద్రతా సిబ్బందిని పెంచనున్నట్లు ముంబై ఎంట్రి పాయింట్స్ లిమిటెడ్ చెర్మైన్, మేనేజింగ్ డెరైక్టర్ జయంత్ మైస్కర్ తెలిపారు. ఈ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేసే వారిని అరికట్టడం కోసం ప్రతి 50 నుంచి 100 మీటర్లలో భద్రతా సిబ్బందిని మోహరించడం సాధ్యంకాదని పలువురు అధికారులు అంటున్నారు. వంతెన కింది భాగంలో, పక్కలకు నెట్లను ఏర్పాటు చేయడమే సరైందని, దీంతో వంతెన ఆత్మహత్యలను నివారించడానికి అవకాశం, సమయం దొరుకుతుందని చెబుతున్నారు. మూడు వారాలలో ఈ సీలింక్‌పై ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడడంతో సత్వర చర్యలు తీసుకొంటున్నట్లు చెప్పారు. పర్యావరణ నిపుణులు అనుమతి ఇచ్చిన తర్వాత సేఫ్టీ నెట్లను అమర్చన్నుట్లు తెలిపారు. వంతెనపై వాహనాలను నిలుపుదల చేసిన వారికి తక్షణమే జరిమానాలు విధించాలని నిర్ణయించామని మైస్కర్ తెలిపారు. -
సీ లింక్ మీదుగా ఉచిత రాకపోకలు
సాక్షి, ముంబై: బాంద్రా-వర్లీ సీ లింకు మీదుగా కార్పొరేటర్లు ఉచితంగా రాకపోకలు సాగించేందుకు మేయర్ సునీల్ ప్రభు సౌకర్యం కల్పించారు. మేయర్ పదవీ కాలం సెప్టెంబర్ 9వ తేదీన ముగియనుంది. తాను పదవిలో ఉండగా కార్పొరేటర్లకు మేలు చేయాలని సంకల్పించారు. అందుకు బీఎంసీ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన చివరి సమావేశంలో ఈ శుభవార్త వెల్లడించారు. బీఎంసీలో మొత్తం 227 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో అనేకమంది బాంద్రా-వర్లీ సీ లింకు మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. కానీ అక్కడ ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా వద్ద జేబులోంచి డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఈ విషయాన్ని కార్పొరేటర్లు పలుమార్లు మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సంబంధిత ప్రభుత్వాధికారులతో మేయర్ చర్చించారు. ఎట్టకేలకు కార్పొరేటర్లకు సీలింకు మీదుగా ఉచితంగా రాకపోకలు సాగించేందుకు అనుమతి లభించింది. కార్పొరేటర్ వాహనానికి ఒక ట్యాగ్ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా బాంద్రా సీ లింకు మీదుగా ఎన్నిసార్లైనా రాకపోకలు సాగించేందుకు వీలు లభించనుందని మేయర్ తెలిపారు. బోరివలిలోని నేషనల్ పార్క్‌లోనికి వెళ్లాలంటే అక్కడి సిబ్బంది కార్పొరేటర్ల నుంచి పన్ను వసూలు చేస్తున్నారు. ఇక నుంచి అది కూడా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇందుకు మేయర్‌కు కొర్పొరేటర్లు ప్రశంసలతో ముంచెత్తారు. అభినందనలు తెలియజేశారు. -
అరెస్టు అనివార్యమేనా!
సాక్షి, ముంబై: టోల్‌ప్లాజాలపై దాడులు చేసేలా పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధినేత రాజ్‌ఠాక్రేపై పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈప్రక్రియను ప్రారంభించిన పోలీసులు రాజ్‌ఠాక్రేను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశాలున్నాయి. నవీముంబైలో ఆదివారం రాత్రి రాజ్‌ఠాక్రే చే సిన రెచ్చగొట్టే సీడీ ప్రసంగాలను హోంశాఖ, పోలీసులు ఇప్పటికే పరిశీలించారు. ఆయనపై ఎప్పుడైనా కేసులు నమోదుచేయవచ్చని హోంశాఖ వర్గాలు తెలిపాయి. టోల్ చెల్లించొద్దని, ఎవరైన బలవంతం చేస్తే వారిని చితక్కొట్టండని రాజ్‌ఠాక్రే పిలుపునివ్వడంతో రాష్ట్రంలోని అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎమ్మెన్నెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి రాష్ట్రవ్యాప్తంగా టోల్ ప్లాజాలపై విరుచుకుపడ్డారు. పుణే-సతార రహదారిపై టోల్ ప్లాజాపై రాళ్లు రువ్వడంతో నాలుగు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులకు నష్టం వాటిళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు కూడా గాయపడ్డారు. తాజాగా మంగళవారం సాయంత్రం బాంద్రా-వర్లీ సీలింక్‌పై కూడా దాడులు చేశారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నీచర్, టోల్ రసీదులు జారీచేసే యంత్రాలను ధ్వంసంచేసి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారు. ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు రాజ్‌పై కేసు నమోదుచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నష్టాన్ని ఆందోళనకారుల నుంచి వసూలు చేస్తామని హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన రాజ్‌ఠాక్రే, ప్రభుత్వం ఏం చేయాలని అనుకుంటుందో అది చేసుకోవచ్చని. తాను ఏం చేయదలుచుకున్నానో అది కచ్చితంగా చేస్తానని ప్రభుత్వానికి సవాలు విసిరారు. శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన సీఎం పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్లపై భారీగా విమర్శలు చేసే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికిముందే రాజ్ ఠాక్రేను అరెస్టు చేసే అవకాశముందని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఇదేం టోల్ వసూళ్ల పద్ధతి: బీజేపీ ముంబై: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న టోల్ రుసుం వసూళ్ల విధానంపై బీజేపీ మండిపడింది. వీరి తీరువల్ల భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ బుధవారం విలేకరులతో అన్నారు. డబ్బులు వెచ్చించి కాంట్రాక్టును దక్కించుకున్న కంపెనీలు టోల్ రూపంలో వాహనదారుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నాయన్నారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) కార్యకర్తలు సృష్టించిన విధ్వంసాన్ని సీసీటీవీ ఫుటేజీల్లో పరిశీలిస్తామని హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ప్రకటించడంపై ఫడ్నవిస్ మండిపడ్డారు. ఆయన తరచూ ఇలాంటి ప్రకటనలు చేస్తూనే ఉంటారని, అయితే వీటిని పెద్దగా ఎవరూ పట్టించుకోరని విమర్శించారు. కాగా, ప్రారంభం నుంచే అప్రమత్తంగా ఉంటే ఇలాంటి పరిస్థితి తలెత్తేదే కాదని బీజేపీ ఎంపీ గోపీనాథ్ ముండే అన్నారు. టోల్ విధానంలో మార్పుండదు: సీఎం ప్రస్తుతమున్న టోల్ వ్యవస్థ కొనసాగుతుందని రాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. టోల్ రుసుంను నిలిపివేయాలంటూ రాష్ట్రంలోని అనేక టోల్‌ప్లాజాల వద్ద ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త రోడ్లను నిర్మించేందు కోసమే ఈ టోల్ విధానాన్ని కొనసాగిస్తున్నామని చవాన్ మీడియాకు తెలిపారు. ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే పేరు ఎత్తకుండానే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమంజసం కాదన్నారు. రోడ్లను నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ టోల్ విధానాన్ని కొనసాగిస్తున్నాయన్నారు. టోల్ వసూళ్లలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయ గిమ్మిక్కే: ఉద్ధవ్ ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టోల్‌రుసుం రూపంలో ఎమ్మెన్నెస్ పార్టీ రాజకీయ డ్రామాలకు తెరలేపిందని శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే ఆరోపించారు. ఆయనదంతా ఎన్నికల గిమ్మిక్కు అని విమర్శించారు. కొల్హాపూర్‌లో స్థానికుల సహకారంతో తమ పార్టీ నిర్వహించిన ఆందోళన విజయవంతమైందన్నారు. ముంబై, ఠాణే, పుణే టోల్‌నాకాలపై భారీ విధ్వంసం జరగడంపై మాట్లాడుతూ ఇన్నేళ్లుగా నిద్రపోయిన ఎమ్మెన్నెస్ పార్టీ ఆకస్మాత్తుగా మేలుకోవడాన్ని తాము అర్ధం చేసుకుంటున్నామన్నారు. ఎన్నికలకు ముందు ఇలా చేస్తున్నారని అన్నారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ఆందోళన రాజుకుందని, డబ్బులు వసూలు చేయడం లేదని రాజ్‌ఠాక్రే గొప్పలు చెబుతున్నారు. ఎక్కడ రాజుకుంది...? రాష్ట్రవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాలు యథాతథంగా పనిచేస్తున్నాయి. వాహన యజమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నార’ని ఉద్ధవ్ ఠాక్రే వ్యంగంగా మాట్లాడారు. టోల్‌ప్లాజాలను ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, ఓటర్లను ఆకట్టుకునేందుకు కేవలం గొప్పలు చెప్పుకోవడం తప్ప వాటివల్ల ఒరిగిందేమి లేదని ఘాటుగా విమర్శించారు. కేవలం శివసేన, బీజేపీ, ఆర్పీఐ నేతృత్వంలోని మహాకూటమి అధికారంలో వస్తే రాష్ట్ర ప్రజలకు తప్పకుండా టోల్ నుంచి విముక్తి లభిస్తుందని హామీ ఇచ్చారు. ఆరు లేన్ల పుణే, ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని, ఆ రహదారిలో టోల్ చెల్లించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. అయితే ఆధ్వాన్న రోడ్లు ఉన్న కొల్హాపూర్, నాసిక్‌లలో ఎందుకు టోల్ రుసుం చెల్లించాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. వసూలు చేసిన టోల్ రుసుం వ్యయంలో భారీగా అవినీతి జరుగుతోందన్నారు.