సాక్షి, ముంబై: బాంద్రా-వర్లీ సీలింక్‌పై భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. మరో రెండు నెలల్లో ఈ వంతెనపై నిఘా వ్యవస్థను పటిష్టం చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముంబై పోలీసులు, ట్రాఫిక్ పోలీసులతోపాటు, మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సీలింక్ టోల్ కలె క్షన్ ఏజెన్సీ అధికారులు భద్రతపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకొన్నారు. ఈ ఏడాది నవంబర్ వరకు అదనంగా 70 క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలు (సీసీటీవీ) ఏర్పాటు చేయనున్నారు.
భద్రతా సిబ్బందిని కూడా మోహరించనున్నారు. ఈ వంతెనపై ప్రస్తుతం షిఫ్టుల వారీగా నలుగురు భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి షిఫ్టులో ఆరుగురు భద్రతా సిబ్బందిని పెంచనున్నట్లు ముంబై ఎంట్రి పాయింట్స్ లిమిటెడ్ చెర్మైన్, మేనేజింగ్ డెరైక్టర్ జయంత్ మైస్కర్ తెలిపారు. ఈ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేసే వారిని అరికట్టడం కోసం ప్రతి 50 నుంచి 100 మీటర్లలో భద్రతా సిబ్బందిని మోహరించడం సాధ్యంకాదని పలువురు అధికారులు అంటున్నారు.
వంతెన కింది భాగంలో, పక్కలకు నెట్‌లను ఏర్పాటు చేయడమే సరైందని, దీంతో వంతెన ఆత్మహత్యలను నివారించడానికి అవకాశం, సమయం దొరుకుతుందని చెబుతున్నారు. మూడు వారాలలో ఈ సీలింక్‌పై ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడడంతో సత్వర చర్యలు తీసుకొంటున్నట్లు చెప్పారు. పర్యావరణ నిపుణులు అనుమతి ఇచ్చిన తర్వాత సేఫ్టీ నెట్‌లను అమర్చన్నుట్లు తెలిపారు. వంతెనపై వాహనాలను నిలుపుదల చేసిన వారికి తక్షణమే జరిమానాలు విధించాలని నిర్ణయించామని మైస్కర్ తెలిపారు.
బాంద్రా-సీలింక్‌పై భద్రతా చర్యలు కట్టుదిట్టం
Published Sat, Sep 6 2014 10:30 PM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
Advertisement