ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలో బీజేపీ మాజీ కొడుకుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడినట్టు పోలీసులు తెలిపారు. ఇక, సదురు ఎమ్మెల్యే కొడుకుపై ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు.
వివరాల ప్రకారం.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మోహతా కుమారుడు తక్షీల్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. శనివారం ఉదయం తన ఖరీదైన లాంబోర్గినీ హురాకాన్ కారులో హైస్పీడ్‌లో వెళ్తుండగా వాహనం అదుపు తప్పింది. ఈ క్రమంలో ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్ బ్రిడ్జి రైలింగ్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తక్షీల్ గాయపడినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదం సందర్భంగా కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్టు పోలీసులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. భారత్‌లో లాంబోర్గినీ హురాకాన్ ధర రూ.3.5 కోట్ల వరకు ఉంటుందన్నారు. ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వర్లీ పోలుసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: దీప్తి కేసులో సంచలన విషయాలు వెల్లడించిన ఎస్పీ.. షాక్‌లో పేరెంట్స్!
Comments
Please login to add a commentAdd a comment