ముంబై: కుర్లాలోని ఎస్‌జీ బార్వేరోడ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో పాదచారులపై దూసుకెళ్లినట్లు సమాచారం. మృతులను శివమ్ కశ్యప్ (18), కనీజ్ ఫాతిమా (55), అఫీల్ షా (19), అనమ్ షేక్ (20)లు మరణించారు. 29మంది గాయపడ్డారు. ఐదారు ఆటోలు, 10 ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.
సోమవారం సాయంత్రం 9.30 గంటల సమయంలో హౌసింగ్ కాలనీలో బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్)కు చెందిన కుర్లా- అంధేరి రైల్వే స్టేషన్ మధ్య నడిచే రూట్ నంబర్ 332 బస్సుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43)ని అరెస్ట్ చేశారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బస్సు బ్రేకులు ఫెయిలవ్వడంతో జరిగిన ప్రమాద తీవ్రతను చూసిన స్థానికులు ఉగ్రదాడి తరహాలో ఉండడంతో భయాందోళనకు గురయ్యారు. పలువురు ప్రాణ భయంతో పారిపోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు.
బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్)కు చెందిన బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికీ వెళ్తుండగా బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. అయితే ఆ బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ కాంట్రాక్ట్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదానికి గల కారణాల్ని గుర్తించేందుకు ఆర్టీఓ అధికారి రవి గైక్వాడ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది.
జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ చౌదరి స్వయంగా కుర్లా పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్‌ను విచారించారు. సంజయ్ మోర్‌ను వైద్య పరీక్షల నిమిత్తం జేజే ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి : నా డెత్ లేఖ సుప్రీం కోర్టుకు చేరాలి
Comments
Please login to add a commentAdd a comment