Electric Bus
-
డీజిల్ బస్సుకు ఎలక్ట్రిక్ రూపు
సాక్షి, హైదరాబాద్: ఖర్చులు తగ్గించుకొనేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) అన్ని మార్గాలను వెదుకుతోంది. ఇంధన భారం తడిసి మోపెడవుతుండటంతో ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గుచూపింది. ఆ బస్సులుఖరీదైనవి కావటంతో అద్దెకు తీసుకొని నడుపుతోంది. అదే సమయంలో సంస్థకు గుదిబండగా మారుతున్న పాత డీజిల్ బస్సులనూ ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రెట్రో ఫిట్మెంట్ టెక్నాలజీ ద్వారా పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చటానికి రెండేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వ సాయం కోరింది. కానీ, ప్రభుత్వం స్పందించకపోవటంతో తాజాగా కేంద్రం తలుపు తట్టింది. రెట్రో ఫిట్‌మెంట్‌కు ఆర్థిక సాయం చేయాలని లేఖ రాసింది. ఆ ప్రయోగం సక్సెస్.. డీజిల్ వ్యయాన్ని భరించలేక ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గు చూపాలని మూడేళ్ల క్రితం ఆర్టీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఫేమ్ పథకం కింద 40 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేసింది. వాటిని ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎయిర్‌పోర్టుకు నడుపుతోంది. ఆ సమయంలో ఒక్కో బస్సు ధర రూ.2 కోట్ల వరకు ఉండటంతో సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులు కొనటం సాధ్యం కాదని చేతులెత్తేసింది. రెట్రో ఫిట్మెంట్ ద్వారా రూ.60 నుంచి రూ..65 లక్షలతోనే డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చవచ్చని గుర్తించి, అందుకోసం టెండర్లు పిలిచింది. ఎలక్ట్రిక్ రైల్ లోకోమోటివ్‌లు తయారు చేస్తున్న ఓ ప్రైవేటు సంస్థ రెట్రో ఫిట్‌మెంట్‌కు ఆసక్తి చూపింది. శాంపిల్‌గా ముషీరాబాద్ డిపోకు చెందిన ఒక బస్సును ఆ సంస్థ రెట్రో ఫిట్మెంట్ చేసి ఇచ్చింది. ప్రస్తుతం అది ఉప్పల్ డిపో పరిధిలో తిరుగుతోంది. ఈ ప్రాజెక్టు భారాన్ని మొత్తం మోయలేనని భావించిన ఆర్టీసీ.. రేండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వ సాయం కోరింది. ప్రభుత్వం కూడా సాయం చేయలేనని చేతులెత్తేయటంతో ప్రాజెక్టు అంతటితో ఆగిపోయింది. కేంద్రం వైపు ఆర్టీసీ చూపు నగరంలో డీజిల్ బస్సులను తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులే తిప్పాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా పీఎం ఈ–డ్రైవ్ పథకానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాలకు 11 వేల ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయాలని నిర్ణయించింది. వాటిలో తనకు 2,500 బస్సులు కావాలని ఆర్టీసీ దరఖాస్తు చేసుకుంది. పనిలో పనిగా రెట్రో ఫిట్మెంట్ ద్వారా పాత డీజిల్ బస్సులను ఎలక్రి్టక్ బస్సులుగా మార్చేందుకు కూడా ఓ విధానం ప్రకటించాలని లేఖ రాసింది. రెట్రో ఫిట్మెంట్ పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని లేఖలో పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా తిరుగుతున్న బస్సును ఉదహరించింది. ఈ లేఖపై కేంద్రం ఇంకా స్పందించలేదు. కేంద్రం గనుక రాయితీ పద్ధతిలో రెట్రో ఫిట్‌మెంట్‌కు పాలసీ అందుబాటులోకి తెస్తే, ఆర్టీసీ వద్ద ఉన్న పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చి నిర్వహించేందుకు చాలా సంస్థలు ముందుకొచ్చే అవకాశం ఉంది. కొత్త ఎలక్ట్రిక్బస్సు ఖరీదు రూ.1.50కోట్లు పాత డీజిల్ బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మార్చేందుకు అయ్యే వ్యయం రూ.60 లక్షలు డీజిల్ బస్సుఖర్చు కి.మీ.కు రూ.20ఎలక్ట్రిక్ బస్సుకు అయ్యే వ్యయం రూ.6 -
ఏ–332 ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు మళ్లీ మొదలు
దాదర్: కుర్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన ఏ–332 బెస్ట్ బస్సు తిరిగి రోడ్డెక్కింది. గతవారం ప్రమాదం నేపథ్యంలో కుర్లా బస్ డిపోలో ఈ బస్సుకు గత ఐదారు రోజుల నుంచి మరమ్మతులు జరుగుతున్నాయి. పనులు పూర్తి, పరీక్షలు సఫలం కావడంతో తిరిగి ఈ బస్సు రాకపోకలు సాగించేందుకు అధికారులు అనుమతినిచ్చారు. గత సోమవారం రాత్రి 9.35 గంటల ప్రాంతంలో పశ్చిమ దిశలో కుర్లా రైల్వే స్టేషన్ నుంచి అంధేరీ దిశగా బయలుదేరిన ఏ–332 నంబరు ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ఎల్బీఎస్ రోడ్డుపై అదుపు తప్పింది. అడ్డువచ్చిన అనేక వాహనాలను ఢీ కొడుతూ వేగంగా ముందుకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా, 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెస్ట్ అధికారులు, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి తగిన చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన బస్సును కుర్లా బస్ డిపోకు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా మరుసటి రోజు అంటే మంగళవారం రోజున కుర్లా రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే బస్సులన్నింటినీ నిలిపివేశారు. ఇప్పటికే బెస్ట్ సంస్ధలో బస్సుల కొరత తీవ్రంగా ఉండటంతో సాధారణ మరమ్మతుల నిమిత్తం డిపోకి వచ్చిన బస్సులను సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు పూర్తిచేసి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు తనిఖీల అనంతరం గత వారం రోడ్డు ప్రమాదానికి గురైన ఏ–332 బస్సును కూడా వెంటనే రోడ్డెక్కించారు. ఈ విషయం తెలుసుకున్న అనేక మంది ప్రయాణికులు కుర్లా స్టేషన్ బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సును చూడడానికి గుమిగూడారు. గత సోమవారం రాత్రి ప్రమాడానికి గురైన బస్సు ఇదేనంటూ చర్చించుకున్నారు. కొందరైతే ఈ బస్సులో ఎక్కేందుకు ముఖం చాటేశారు. -
Mumbai : ఆర్టీసీ బస్సు ప్రమాదం.. వెలుగులోకి సంచలన విషయాలు
ముంబై : ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బస్సు డ్రైవర్ సంజయ్ మోర్కి ఎలక్ట్రిక్ బస్సు నడపడం రాదని, ఈవీ బస్సుపై అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు విచారణ అధికారులు నిర్ధారించారు. విచారణలో బస్సు డ్రైవర్ సంజయ్ ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పినట్లు తేలింది. పోలీస్ కస్టడీలో ఉన్న పోలీసుల విచారణలో బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ పలు కీలక విషయాల్ని వెల్లడించాడు. ఎలక్ట్రిక్ బస్సు నడపడంలో తనకు అనుభవం లేదని, కేవలం ఒక్క రోజు ఈవీ బస్సును డ్రైవింగ్ చేసినట్లు చెప్పాడు. ఆ ఒక్క రోజు కేవలం మూడుసార్లు నడిపిట్లు చేసినట్లు, అనంతరం విధులకు హజరైనట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు.కాబట్టే 60 కేఎంపీహెచ్ వేగంతో వెళ్తున్న ఈవీ బస్సును ఎలా కంట్రోల్ చేయాలో తనకు అర్ధం కాలేదని, కాబట్టే ఈ ఘోర ప్రమాదానికి దారి తీసినట్లు పోలీసులకు చెప్పాడు. అనుభవం లేకపోవడంతో ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి ఘోర ప్రమాదానికి దారి తీసింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కిటికి అద్దాలు పగులగొట్టి, తన క్యాబిన్లో ఉన్న బ్యాగ్ తీసుకుని పారిపోయినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ముంబై ఆర్టీసీ విభాగంపై విమర్శలుముంబై ఆర్టీసీ నిబంధనల ప్రకారం.. ఆరు వారాల పాటు ఎలక్ట్రిక్ బస్సు డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా సంజయ్ మోరాకు ఈవీ బస్సులో విధులు అప్పగించడంపై ముంబై ఆర్టీసీ అధికారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆర్టీసీ బస్సు బీభత్సంగత సోమవారం సాయంత్రం 9.30 గంటల సమయంలో హౌసింగ్ కాలనీలో కుర్లాలోని ఎస్జీ బార్వేరోడ్‌లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. 42మందికి తీవ్ర గాయాలయ్యాయి. 20కి పైగా వాహనాలు ధ్వంస మయ్యాయి. బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43)ని అరెస్ట్ చేశారు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికీ వెళ్తుండగా బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ధారించారు. 👉చదవండి : ఆర్టీసీ బస్సు బీభత్సం.. జనాలపైకి దూసుకెళ్లి.. -
ఫస్ట్ డే డ్యూటీకి వెళ్లింది.. అంతలోనే అంతులేని విషాదం
19 ఏళ్ల అఫ్రీన్ షా ఎంతో హుషారుగా తన జీవితంలో తొలి రోజు ఉద్యోగానికి వెళ్లింది. కానీ అదే ఆమెకు చివరి రోజు అవుతుందని ఆమె ఊహించలేదు. అఫ్రీన్ షా కుటుంబ సభ్యులు కూడా అనుకోలేదు. మొదటి రోజు డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఆటోలు దొరక్కపోవడంతో తండ్రి అబ్దుల్ సలీంకు అఫ్రీన్ ఫోన్ చేసింది. కుర్లా స్టేషన్‌కు వెళ్లమని కూతురికి ఆయన సలహా ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆయనకు మరోసారి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఆస్పత్రికి రావాలని ఫోన్ చేశారు. అతడు ఆస్పత్రికి వచ్చే చూసేసరికి కూతురు నిర్జీవంగా కనిపించడంతో సలీం కుప్పకూలిపోయారు. అపురూపంగా పెంచుకున్న తన కుమార్తె మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించాడు.కన్నిస్ అన్సారీ(55) అనే నర్సు నైట్ షిప్ట్ డ్యూటీ చేసేందుకు బయలుదేరి అనూహ్యంగా పప్రాణాలు కోల్పోయింది. వీరిద్దరితో పాటు మరో ఐదుగురిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ముంబై మహానగరంలోని కుర్లా ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన బస్సు ప్రమాదం ఏడుగురిని బలిగొంది. 42 మందిని గాయాలపాల్జేసింది. కుర్లా రైల్వే స్టేషన్ - అంధేరి మధ్య నడిచే రూట్ నంబర్ 332 బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) బస్సు అదుపుతప్పి విధ్వంసం సృష్టించడంతో ఈ ఘోరం జరిగింది. కుర్లా వెస్ట్‌లోని అంజుమన్-ఇ-ఇస్లాం స్కూల్ సమీపంలో నిన్న రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.డ్రైవర్ తప్పిదం వల్లే..బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43) తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వేగంగా దూసుకొచ్చిన బస్సు.. పోలీసు వ్యాను, కార్లు, టూవీలర్లు, తోపుడు బండ్లతో సహా 22 వాహనాలను ఢీకొట్టింది. చివరకు గోడను ఢీకొని ఆగిపోయింది. ప్రమాద తీవ్రత చూసిన వారంతా ఉగ్రదాడిగా భయపడి పరుగులు తీశారు. ‘ప్రమాదానికి గురైన వాహనాల జాబితాను సిద్ధం చేశాం. 22 వాహనాలను బస్సు ఢీకొట్టినట్టు మా దృష్టికి వచ్చింది. బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ మరిన్ని వాహనాలను ఢీకొట్టాడో, లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామ’ని ముంబై జోన్ 5 పోలీస్ డిప్యూటీ కమిషనర్ గణేష్ గవాడే మీడియాతో చెప్పారు.బస్సు కండిషన్లోనే ఉందిబస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందన్న వార్తలను గవాడే తోసిపుచ్చారు. బస్సు మంచి కండిషన్లో ఉందని, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే దుర్ఘటన జరిగిందన్నారు. డిసెంబర్ 1 నుంచి డ్రైవర్ సంజయ్ మోర్ బెస్ట్ బస్సు నడుపతున్నాడని, గతంలో అతడు మాన్యువల్ మినీ బస్సు నడిపేవాడని వెల్లడించారు. ప్రయాణికులతో కూడిన బస్సును నడిపేందుకు అవసరమైన శిక్షణ తీసుకున్నాడా, లేదా విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కాగా, డ్రైవర్‌ను డిసెంబర్ 21 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కుర్లా కోర్టు ఆదేశాలిచ్చింది.చదవండి: 150 అడుగుల బోరుబావిలో బాలుడు..‘ప్రమాదానికి కారణమైన బస్సులో ఎటువంటి సాంకేతిక లోపం లేదు. యాక్సిలరేట్ ఇచ్చిన తర్వాత వేగాన్ని నియంత్రించడంలో డ్రైవర్ విఫలమయ్యాడు. భయాందోళనకు గురై బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్ తొక్కాడు. అతడు మొదట ఆటోరిక్షాను ఢీకొట్టాడు. ఆ తర్వాత పోలీసు వాహనం, ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లను ఢీకొట్టాడు. గోడను ఢీకొట్టిన తర్వాత మాత్రమే బస్సు ఆగింద’ని డీసీపీ గణేష్ గవాడే తెలిపారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, సంబంధిత శాఖలు విచారించి నివేదిక సమర్పించాక తదుపరి చర్యలు చేపడతామన్నారు. సంజయ్ మోర్ మద్యం సేవించి బస్సు నడిపాడా లేదా అన్నది నిర్ధారించేందుకు అతడికి పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. ప్రమాదంపై విచారణకు జరిపేందుకు ఫోరెన్సిక్, రీజినల్ ట్రాన్స్‌ఫోర్ట్ కార్యాలయ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే?బస్సు ప్రమాదాన్ని చూసి ప్రత్యక్ష సాక్షులు భయాందోళన చెంతారు. సహాయక చర్యల్లో పాల్గొని బాధితులను ఆస్పత్రులకు తరలించడంలో సాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షి జైద్ అహ్మద్ (26) మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరుతుండగా పెద్ద శబ్ధం వినిపించింది. వెంటనే సంఘటనా స్థలానికి పరిగెత్తాను. పాదచారులతో పాటు ఆటోరిక్షా, మూడు కార్లు, ఇతర వాహనాలను బస్సు ఢీకొట్టింది. నా కళ్ల ముందు కొన్ని మృతదేహాలను చూశాను. ఆటోరిక్షాలో ఉన్న ప్రయాణికులను రక్షించి బాబా ఆసుపత్రికి తీసుకెళ్లాం. మరో మూడు చక్రాల వాహనం కూడా క్షతగాత్రులకు సహాయం అందించింద’ని తెలిపాడు.సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతిముంబై బస్సు ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్సకు అయ్యే ఖర్చును బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) భరిస్తుందన్నారు. -
ఆర్టీసీ బస్సు బీభత్సం.. జనాలపైకి దూసుకెళ్లి..
ముంబై: కుర్లాలోని ఎస్జీ బార్వేరోడ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో పాదచారులపై దూసుకెళ్లినట్లు సమాచారం. మృతులను శివమ్ కశ్యప్ (18), కనీజ్ ఫాతిమా (55), అఫీల్ షా (19), అనమ్ షేక్ (20)లు మరణించారు. 29మంది గాయపడ్డారు. ఐదారు ఆటోలు, 10 ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. సోమవారం సాయంత్రం 9.30 గంటల సమయంలో హౌసింగ్ కాలనీలో బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన కుర్లా- అంధేరి రైల్వే స్టేషన్ మధ్య నడిచే రూట్ నంబర్ 332 బస్సుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43)ని అరెస్ట్ చేశారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సు బ్రేకులు ఫెయిలవ్వడంతో జరిగిన ప్రమాద తీవ్రతను చూసిన స్థానికులు ఉగ్రదాడి తరహాలో ఉండడంతో భయాందోళనకు గురయ్యారు. పలువురు ప్రాణ భయంతో పారిపోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు.బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికీ వెళ్తుండగా బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. అయితే ఆ బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ కాంట్రాక్ట్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదానికి గల కారణాల్ని గుర్తించేందుకు ఆర్టీఓ అధికారి రవి గైక్వాడ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది.జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ చౌదరి స్వయంగా కుర్లా పోలీస్ స్టేషన్లో డ్రైవర్‌ను విచారించారు. సంజయ్ మోర్‌ను వైద్య పరీక్షల నిమిత్తం జేజే ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. ఇదీ చదవండి : నా డెత్ లేఖ సుప్రీం కోర్టుకు చేరాలి -
హైదరాబాద్‌కు ఢిల్లీ దుస్థితి రానివ్వం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు ఢిల్లీ తరహా దుస్థితి రాకుండా వాహన కాలుష్యానికి కళ్లెం వేసే చర్యలు చేపడుతు న్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో విపరీతంగా కాలు ష్యం పెరిగి ఆ నగరం చివరకు నివాసయోగ్యం కాని నగరాల జాబితాలో చేరేలా ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరా బాద్‌కు భవిష్యత్తులో ఆ పరిస్థితి రాకుండా ఎలక్ట్రిక్ వాహనా లను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. వచ్చే రెండేళ్లలో హైదరా బాద్‌లోని ఆర్టీసీ డీజీల్ బస్సులను ఓఆర్ఆర్ ఆవలకు తరలించి వాటి స్థానంలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతా మని అన్నారు.డీజిల్ ఆటోల విషయంలో కూడా ఇదే పద్ధతి అవ లంబించే ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ప్రజాపాలన ఏడాది విజయో త్సవాల్లో భాగంగా ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్ఎండీఏ మైదానంలో రవాణా శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏడాది కాలంలో రవాణా శాఖ, ఆర్టీసీ సాధించిన విజయాలతో కూడిన బ్రోచర్లను ఆవిష్కరించారు. ఫొటో ఎగ్జిబిషన్, ట్రాఫిక్ నియమాలపై చిన్నారులు ఏర్పాటు చేసిన నమూనాలను, ఎలక్ట్రిక్ వాహనాలను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. ఆర్టీసీ పునరుజ్జీవంలో ‘మహాలక్ష్మి’ కీలకం‘మూసీ పునరుజ్జీవం కూడా కాలుష్య నివారణ చర్యల్లో భాగ మే. దీనికి అందరూ సహకరించాలి. నష్టాల ఆర్టీసీ పునరుజ్జీ వంలో మహాలక్ష్మి పథకం కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటి కే ఆ పథకంతో 115 కోట్లమంది ఉచితంగా ప్రయాణించటంద్వారా రూ.4 వేల కోట్ల వరకు ఆదా చేసుకున్నారు. ఒక్కో మహిళ సగటున ప్రతినెలా రూ.7 వేల వరకు ఆదా చేసుకుంటూ ఆ మొత్తాన్ని కుటుంబ అవసరాలకు వాడుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికులది కీలక భూమిక. వారి సంక్షేమం, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ఒకే ఏడాదిలో 55,143 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం.ఏ రాష్ట్రంలో కూడా ఈ ఘనత సాధించలేదు. నరేంద్ర మోదీ, కేసీఆర్‌లు వచ్చి కావాలంటే లెక్కపెట్టుకోవచ్చు. ఒక్క తల తగ్గినా క్షమాపణ కోరేందుకు సిద్ధం..’ అని సీఎం సవాల్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్థంగా మారిన ఆర్టీసీని తమ ప్రభుత్వం గాడిలో పెడు తూ లాభాల బాట పట్టిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కాగా తొలిసారి రవాణా శాఖ కోసం ఏర్పాటు చేసిన లోగోను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మహాలక్ష్మీ పథకంతో మహిళలకు రూ.3,902.31 కోట్ల మేర ఆదా అయినదానికి గుర్తుగా అంత విలువతో ముద్రించిన భారీ నమూనా చెక్కును మహిళా ప్రయాణికులకు సీఎం అందించారు.మహిళలు ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలి⇒ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ⇒ సీఎంతో కలిసి ఇందిరా మహిళాశక్తి బజార్ల ప్రారంభంమాదాపూర్ (హైదరాబాద్): మహిళలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి మాదాపూర్‌లోని శిల్పారామంలో ఇందిరా మహిళాశక్తి బజార్లను సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలకు సాధికారత కల్పిస్తేనే దేశ ప్రగతి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో మహిళలకు ప్రాధాన్యత పెంచడం అభినందనీయమని, క్యాంటీన్ల ఏర్పాటు వినూత్న ఆలోచన అని పేర్కొన్నారు. ఎస్‌హెచ్‌జీల మహిళలతో మాట్లాడితే.. వారు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించినట్లు తెలుస్తోందని, వారిని మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. అదానీ, అంబానీలతో ఆడబిడ్డల పోటీ: సీఎంకొత్త సంవత్సరంలో ఉమ్మడి జిల్లాల్లో లక్ష మంది ఆడబిడ్డలతో సమావేశాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈనెల 9వ తేదీన సచివాలయంలో లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాల్లో (ఎస్‌హెచ్‌జీలు) 65 లక్షల మంది ఉన్నారని, వీరిని కోటి మందిని చేయాలని మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారికి సూచించారు. మీరంతా కలిసి కోటి మంది సభ్యులను చేస్తే ఆ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు.ఇందిరా మహళాశక్తి క్యాంటీన్ల నిర్వహణ, రాబోయే రోజుల్లో సోలార్ పవర్ నిర్వహణ తదితర కార్యక్రమాలతో అదానీ, అంబానీలతో పోటీ పడేలా మహిళలను తీర్చిదిద్దుతామని రేవంత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, గవర్నర్ సతీమణి సుధా జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో ఇక ఎలక్ట్రిక్ బస్సులే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో డీజిల్ బస్సులు లేకుండా పూర్తిగా బ్యాటరీ బస్సులే నడిపేలా ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం 2,700 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకునేందుకు, దేశంలోనే ప్రధాన బ్యాటరీ బస్సు తయారీ సంస్థలతో చర్చలు మొదలుపెట్టింది. మూడు కంపెనీలను సంప్రదించిన ఆర్టీసీ అధికారులు, వాటికి నిర్వహణ బాధ్యతలు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు బ్యాటరీ బస్సుల నిర్వహణను.. ఒక్కో దఫాలో ఒక్కో కంపెనీకి అప్పగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఒకేసారి పెద్దసంఖ్యలో బస్సులు సమకూర్చుకోవాల్సి ఉన్నందున, ఒకే కంపెనీకి కాకుండా మూడు కంపెనీలకు బాధ్యత అప్పగించాలని భావిస్తున్నారు. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ మోడల్‌తో.. ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 2,700 బస్సులు తిరుగుతున్నాయి. వీటిల్లో ఎలక్ట్రిక్ బస్సులు వందలోపే ఉన్నాయి. మిగతా అన్నీ డీజిల్ బస్సులే. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మొత్తం బ్యాటరీ బస్సులనే వాడాలని ఇటీవల జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరీ్టసీని ఆదేశించారు. ఈమేరకు ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే ఒక్కో బస్సు ధర రూ.1.85 కోట్లు ఉన్నందున, 2,700 బ్యాటరీ బస్సులను సంస్థ సొంతంగా కొనడం దాదాపు అసాధ్యం. దీంతో గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిలో ప్రైవేటు సంస్థల నుంచి అద్దెకు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఒలెక్ట్రా, జేబీఎం కంపెనీల నుంచి కొన్నింటిని జీసీసీ పద్ధతిలో నిర్వహిస్తోంది. ఇటీవలే జేబీఎం నుంచి తీసుకున్న బస్సులకు ఒక కిలోమీటరుకు ఆర్టీసీ రూ.57.90 చొప్పున అద్దె చెల్లిస్తోంది. ఇప్పుడు కొత్తగా తీసుకునే బస్సులకు ఈ మొత్తం రూ.60 దాటే అవకాశం ఉంది.ఈ పద్ధతిలో తీసుకునే బస్సుల్లో ఆ కంపెనీలే డ్రైవర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కండక్టర్లను మాత్రం ఆర్టీసీ ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న బస్సుల్లో కండక్టర్ల ఖర్చు కిలోమీటరుకు రూ.18 ఉంటోంది. రూ. 60 అద్దె అనుకున్నా.. కండక్టర్ల ఖర్చుతో కలుపుకొంటే ఆ మొత్తం రూ.78 వరకు చేరుతుంది. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచి్చన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగిన విషయం తెలిసింది. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో 100 శాతాన్ని దాటింది. ఈపీకే (కి.మీ.కు ఆదాయం) రూ.90గా ఉంటోంది. కండక్టర్ల వేతనం ప్లస్ బస్సుల అద్దె కలిపి రూ.78 కాగా.. ఈపీకే రూ.90గా ఉండటంతో ఆరీ్టసీకి మార్జిన్ కి.మీ.కు రూ.12 వరకు ఉంటుంది. ఇందులో నిర్వహణ ఖర్చులు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆరీ్టసీకి పెద్ద నష్టం కాబోదని అధికారులు భావిస్తున్నారు. 3 వేలు దాటనున్న బ్యాటరీ బస్సులు..హైదరాబాద్‌లో నడిపేందుకు వీలుగా ఆర్టీసీ ఇప్పటికే ఐదొందల బ్యాటరీ బస్సులకు ఆర్డరిచి్చంది. దశలవారీగా అవి సమకూరనున్నాయి. ఇప్పుడు మరో 2,700 బస్సులకు కొత్తగా ఆర్డరిస్తే.. మొత్తం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 3 వేలను మించనుంది. దశలవారీగా మరో ఏడాదిన్నరలో అవి అందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఛార్జింగ్ స్టేషన్లు అవసరం లేని ఎలక్ట్రిక్ వాహనాలు..!
ఇకపై భవిష్యత్తు రవాణా ఇదే.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాలవైపు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టిసారించేలా వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. దాంతో పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో కరెంట్‌తో నడిచే భారీ వాహనాలు వస్తున్నాయి. అధిక లోడుతో వెళ్లే ఇవి ఎక్కువగా హైవేలపై కనిపిస్తుంటాయి. వీటికి పెద్దమొత్తంలో కరెంట్ అవసరం అవుతోంది. మధ్యలో ఛార్జింగ్ అయిపోయినా లేదా ఛార్జింగ్ కోసం ఎక్కడైనా ఆగినా సమయం వృథా అవుతుంది. కాబట్టి విద్యుత్‌తో నడిచే భారీ ట్రక్కులపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపడంలేదు. కానీ అలాంటి వారితోపాటు తరచూ సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్రభుత్వం ఎలక్ట్రిక్ హైవేలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో విదేశీ తరహాలో దేశంలో మొదటిసారిగా హైవేలో ఎలక్ట్రిసిటీ సిస్టమ్ టెక్నాలజీ రాబోతోంది. ఇకపై హైవేలో వెళ్లే భారీ వాహనాలు పవర్ ద్వారా నడవనున్నాయి. రైళ్లు, మెట్రో ట్రెయిన్లు ఎలా అయితే కరెంటుతో నడుస్తున్నాయో అలానే హైవే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పరుగులు పెట్టనున్నాయి. గతంలో ఈ ఎలక్ట్రిక్ హైవే టెక్నాలజీని జర్మనీ మొదటిసారి ఉపయోగించింది. ఇందులో భాగంగా హైవేపై వెళ్లే ట్రక్కుల పైభాగంలో రైళ్ల మాదిరి కరెంట్ సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది. దాని నుంచి ట్రక్కులోని బ్యాటరీల్లోకి విద్యుత్ సరఫరా అవుతుంది. అవి రీచార్జ్ అవుతూ ట్రక్కు ముందుకుసాగుతుంది. హైవే నుంచి డైవర్షన్ తీసుకున్న తర్వాత ఎలాగూ అప్పటికే బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి కాబట్టి అందులోని విద్యుత్‌ను వినియోగించుకుని వాహనం కదులుతుంది. ఈ టెక్నాలజీతో మార్గం మధ్యలో మళ్లీ ఛార్జింగ్ చేసుకోకుండా వాహనం కదులుతున్నప్పుడే చార్జ్ అయ్యే వెసులుబాటు ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో రూపాయి దారెటు? సోలార్ ఎనర్జీ సాయంతో రహదారులపై ట్రక్కులు, బస్సులు పరుగులు పెట్టేందుకు వీలుగా ఎలక్ట్రిక్ హైవేలు అభివృద్ధి చేయబోతున్నట్లు ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం సోలార్, పవన విద్యుత్ ఆధారిత ఛార్జింగ్ మెకానిజంను ఉపయోగించుకోవాలన్న దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉందని మంత్రి అన్నారు. దిల్లీ-జైపుర్ మధ్య భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవేను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జర్మనీ, స్వీడన్, నార్వే వంటి దేశాల్లో ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారని తెలిపారు. రహదారిపై ఏర్పాటు చేసిన పవర్ కేబుళ్ల విద్యుత్‌ను వాడుకొని వాహనాలు సునాయాసంగా ప్రయాణిస్తాయన్నారు. -
సీఎం జగన్ పారిశ్రామిక విధానాలు అభినందనీయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటులో పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సహాయ సహకారాలు, విధానాలు అంతర్జాతీయ సంస్థల అధిపతుల ప్రశంసలు అందుకుంటున్నాయి. పరిశ్రమ ఏర్పాటుకు దరఖాస్తు నుంచి పరిశ్రమ ప్రారంభోత్సవం వరకు పారిశ్రామికవేత్తలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండదండగా నిలుస్తోంది. వేగంగా అన్ని అనుమతులూ ఇస్తోంది. దీంతో రాష్ట్రంలో శరవేగంతో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. జర్మనీకి చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ కూడా సీఎం వైఎస్ జగన్ విధానాలకు ప్రశంసలందించారు. ఈ సంస్థ విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీకి రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద యూనిట్ ఏర్పాటు చేస్తోంది. రూ.4,640 కోట్లతో చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద 800 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ యూనిట్ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనుంది. ఈ యూనిట్ ద్వారా 8,100 మంది ఇంజినీర్లు, టెక్నీషియన్లకు ఉపాధి లభిస్తుంది. పెప్పెర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసింది. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే పెప్పర్ మోషన్ యూనిట్ వివరాలను వివరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ బస్సులు ట్రక్కుల క్లస్టర్ ఏర్పాటుకు వేగంగా అనుమతులు మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటులో సీఎం వైఎస్ జగన్ విధానాలను కొనియాడారు. ఏడాదికి 30,000 విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సామర్ధ్యంతో ఇక్కడి యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ వర్టికల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ, 20 జీడబ్ల్యూహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీల తయారీ, అంతర్జాతీయ ప్రమాణాలతో యూనిట్ ఏర్పాటు, డీజిల్ బస్సులు, ట్రక్కులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రిట్రో ఫిట్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా వంటి దేశాల్లోని పెప్పర్ భాగస్వాములకు కూడా ఇక్కడి నుంచే సేవలు అందిస్తామని చెప్పారు. మూడు దశల్లో ఏర్పాటు చేసే ఈ యూనిట్ తొలి దశ 2025 మూడో త్రైమాసికానికి అందుబాటులోకి వస్తుందన్నారు. 2027 మూడో త్రైమాసికానికి మూడో దశలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాలు, సింగిల్ విండో అనుమతులు, అమలు చేస్తున్న పారదర్శక విధానాలను సీఎం జగన్ పెప్పర్ మోషన్ ప్రతిని«దులకు వివరించారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెప్పర్ మోషన్ సీటీవో డాక్టర్ మథియాస్ కెర్లర్, ఫైనాన్స్ డైరెక్టర్ ఉవే స్టెల్టర్, సీఐవో రాజశేఖర్‌రెడ్డి నల్లపరెడ్డి, సీఎస్‌వో సత్య బులుసు, సీసీవో రవిశంకర్, అసోసియేట్ శ్రీధర్ కిలారు, ఉర్త్ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండీ హర్ష ఆద్య పాల్గొన్నారు. సీఎం విజనరీ థింకింగ్ మమ్మల్ని ఆకట్టుకుంది: ఆండ్రియాస్ హేగర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజనరీ థింకింగ్, అమలు చేస్తున్న పాలసీలు తమను ఆకట్టుకున్నాయని, ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు మరువలేమంటూ పెప్పర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ కొనియాడారు. సీఎంను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఏపీలో వరల్డ్ క్లాస్ యూనిట్ ఏర్పాటు చేయడంపై చాలా సంతోషంగా ఉన్నాం. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మా యూనిట్ ఏర్పాటుచేస్తున్నాం. ప్రజా రవాణాకు అవసరమైన విధంగా డీకార్బొనైజ్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తీసుకువచ్చేలా మా యూనిట్ నుంచి వాహనాల ఉత్పత్తి జరుగుతుంది. ఏపీలో యూనిట్ ఏర్పాటు చేయడం సరైన నిర్ణయంగా భావిస్తున్నాం. బెంగళూరు, చెన్నై నగరాలకు దగ్గరగా మా యూనిట్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తున్నాం. మాకు సహాయ సహకారాలు అందించిన సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని చెప్పారు. -
తిరుమలలో టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు మిస్సింగ్
-
తిరుమల: రెచ్చిపోయిన దొంగలు.. టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు చోరీ
సాక్షి, తిరుమల: తిరుమలలో టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు అదృశ్యమైంది. గుర్తు తెలియని దుండగులు ఏకంగా బస్సు దొంగతనానికి పాల్పడ్డారు. అయితే, లోకేషన్ ఆధారంగా ఎలక్ట్రిక్ బస్సు నాయుడుపేటలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో బస్సును స్వాధీనం చేసుకుని దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు చోరీకి గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు బస్సును దొంగతనం చేశారు. చోరీ చేసిన బస్సును తీసుకెళ్తుండగా లోకేషన్ ఆధారంగా నాయుడుపేట వద్ద బస్సు గుర్తించారు. దీంతో, బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ, దుండగులు పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, వాహనాల మిస్సింగ్‌ను టీటీడీ.. అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఇది కూడా చదవండి: కదులుతున్న ‘స్కిల్’ డొంక.. లోకేష్ పీఏ అమెరికాకు జంప్! -
పీఎం–ఈబస్ సేవాతో ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 10,000 ఎలక్ట్రిక్ బస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పీఎం–ఈబస్ సేవా’ పథకం.. క్షేత్ర స్థాయిలో ఈవీల విస్తరణకు దోహదపడుతుందని పరిశ్రమ వర్గాల్లో ఆశాభావం వ్యక్తమైంది. పట్టణాల్లో ఎలక్ట్రిక్ బస్ సేవలకు వీలుగా ఈ పథకానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. 169 పట్టణాలకు 10,000 బస్‌లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో కేటాయించనున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఎలక్ట్రిక్ ఆటోమోటివ్ కంపెనీలకు ప్రయోజనం కలిగించనుంది. ఈ పథకంపై జేబీఎం ఆటో వైస్ చైర్మన్, ఎండీ నిశాంత్ ఆర్య స్పందిస్తూ.. ప్రముఖ పట్టణాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పర్వత ప్రాంతాలకు, ఈశాన్య రాష్ట్రాలకు కేటాయింపులు చేయడంతో ఎలక్ట్రిక్ బస్‌లను క్షేత్రస్థాయికి తీసుకెళ్లిన్టటు అవుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఈవీ ఎకోసిస్టమ్ మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. పీఎంఐ ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ సీఈవో ఆంచాల్ జైన్ సైతం దీన్ని నిర్ణయాత్మక, పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చేసే పథకంగా పేర్కొన్నారు. స్థానికంగా ఈబస్ల తయారీని ప్రోత్సహిస్తుందన్నారు. -
TSRTC: ఆర్టీసీ బస్సుల్లో సీటు బెల్టులు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా కార్లలో సీటు బెల్టులు వాడుతుంటారు. కానీ, తొలిసారి నగరంలో సీట్ బెల్టులుండే సిటీ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. విదేశాల్లో బస్సుల్లో కూడా సీటు బెల్టులు తప్పని సరి. వాస్తవానికి మన దగ్గర కూడా బస్సుల్లోనూ సీటు బెల్టులుండాలనే నిబంధ న ఉన్నా అది అమలుకావటం లేదు. తొలిసా రి ఆర్టీసీ సిటీ సర్విసుల్లో ఆ తరహా సీట్లను అందుబాటులోకి తెస్తోంది. నగరంలో మరో నెలన్నరలో అందుబాటులోకి రానున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో ఇవి కనిపించనున్నాయి. ఆ బస్సులు ఎలా ఉండనున్నాయో అధికారులు పరిశీలించేందుకు వీలుగా నమూనా బస్సును సోమవారం బస్‌భవన్‌కు తీసుకురాగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిశీలించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కారిడార్ మార్గాల్లో తిరిగేందుకు వీలుగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తిప్పాలని ఆర్టీసీ ఇటీవల నిర్ణయించింది. ఇప్పటికే పుష్పక్ పేరుతో 40 ఎలక్ట్రిక్ బస్సులు విమానాశ్రయం మార్గంలో తిరుగుతున్న విషయం తెలిసిందే. అవన్నీ లాభాల్లో ఉండటం, రద్దీకి చాలినన్ని లేకపోవటంతో అదనంగా మరిన్ని బస్సులు తిప్పాలని నిర్ణయించారు. దానితోపాటు ఐటీ కారిడార్‌లో మెట్రో రైలు సేవలు అందుబాటులో లేని రూట్లలో కొన్ని తిప్పనున్నారు. ప్రస్తుతం విమానాశ్రయ మార్గంలో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులతో పోలిస్తే ఆధునిక వసతులు అదనంగా ఉన్న ఈ కొత్త బస్సులు ప్రయాణికులకు మెరుగైన రవాణా వసతిని అందించనున్నాయి. 500 బస్సులకు ఆర్డర్ 500 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నగరంలో తిప్పాలని నిర్ణయించిన ఆరీ్టసీ, ఇప్పటికే ఆర్డర్ ఇచి్చన విషయం తెలిసిందే. సిటీ బస్సులుగా తిప్పే సర్విసులకు సంబంధించి తొలి విడతలో 50 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అందులో 20 శంషాబాద్ విమానాశ్రయానికి, 30 ఐటీ కారిడార్‌లో తిరుగుతాయి. ఇందులో 25 బస్సులు నెలనెలన్నరలో రోడ్డెక్కుతాయని అధికారులు అంటున్నారు. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్దతిలో వీటిని ఆర్టీసీ అద్దెకు తీసుకుంటోంది. ఇవి కాకుండా మరో 800 ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా సమకూర్చుకోవాలనేది ఆర్టీసీ ఆలోచన. వాటికి ఇంకా టెండర్లు పిలవలేదు. ఆకుపచ్చ, తెలుపు రంగుతో.. ఆకుపచ్చ, తెలుపు రంగుతో ఈ బస్సులుంటాయి. రంగుల మేళవింపుపై ఎండీ సంతృప్తి వ్యక్తం చేశారు. బస్సు ముందువైపు ఆర్టీసీ లోగో లేకపోవటాన్ని ప్రశ్నించిన ఆయన, ప్రయాణికులకు కనిపించేలా లోగో ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్ని సీట్లకే బెల్టులుండటంతో, అన్ని సీట్లకు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఓఓ రవీందర్, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్, ఒలెక్ట్రా కంపెనీ ప్రతినిధులు వేణుగోపాలరావు, ఆనంద్, యతీశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 12 మీటర్ల పొడవు.. ఇప్పుడు కొత్తగా సమకూరే ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు 12 మీటర్ల పొడవుతో ఉంటాయి. ఒక్కో బస్సులో 35 సీట్లుంటాయి.ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సాకెట్ అందుబాటులో ఉంటుంది. బస్సుల్లో మూడు సీసీ టీవీ కెమెరాలు అమర్చి ఉంటాయి. అవి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్‌తో ఉంటాయి. రివర్స్ చేసేప్పుడు డ్రైవర్‌కు వెనక భాగం కనిపించేలా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. ప్రయాణికులకు సూచనలు అందజేసేందుకు వీలుగా బస్సులో నాలుగు ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులుంటాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు వీలుగా బస్సులో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం ఉంటుంది. వెహికిల్ ట్రాకింగ్ సిస్టం కూడా ఉంటుంది. ఒకసారి ఫుల్ చార్జి అయితే 225 కి.మీ. దూరం వరకు ప్రయాణిస్తాయి. ఫుల్ చార్జింగ్కు దాదాపు 3 గంటల సమయం పడుతుంది. -
ఒలెక్ట్రాకు రూ.10,000 కోట్ల ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనుబంధ కంపెనీలైన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, ఈవీ ట్రాన్స్‌ల కన్సార్షియం భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కు (ఎంఎస్ఆర్టీసీ) 5,150 ఎలక్ట్రిక్ బస్‌లను 24 నెలల్లో సరఫరా చేయాల్సి ఉంటుంది. డీల్ విలువ సుమారు రూ.10,000 కోట్లు అని ఒలెక్ట్రా శుక్రవారం ప్రకటించింది. ఒలెక్ట్రా నుంచి ఈ ఎలక్ట్రిక్ బస్‌లను ఈవీ ట్రాన్స్ కొనుగోలు చేసి ఎంఎస్ఆర్టీసీకి అందిస్తుంది. కాగా, భారీ ఆర్డర్ నేపథ్యంలో ఒలెక్ట్రా షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో శుక్రవారం 18.02% ఎగసి రూ.1,231.35 వద్ద స్థిరపడింది. -
చార్జింగ్ చాలట్లే!
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ బస్సుల బ్యాటరీలోని చార్జింగ్‌ను ట్రాఫిక్ జామ్‌లు హరిస్తున్నాయి. దీంతో బస్సు గమ్యం చేరేందుకు అవసరమైన చార్జింగ్ లేకపోవడంతో మధ్యలో మరోసారి బ్యాటరీని చార్జ్ చేయాల్సి వస్తోంది. ఇది ఇటీవలే ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ– గరుడ బస్సులకు తలనొప్పిగా మారింది. ‘ఈ–బస్సు’.. రెండు సార్లు చార్జ్ చేయాల్సిందే.. ♦ ఆర్టీసీ ఇటీవలే పది ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన ప్రారంభించిన విషయం తెలి సిందే. తొలి విడతలో అందుబాటులోకి వచి్చ న ఈ పది బస్సులను విజయవాడ వరకు తిప్పుతున్నారు. వీటిని బీహెచ్ఈఎల్ డిపో ద్వారా నిర్వహిస్తున్నారు. ఎయిర్‌పోర్టుకు తిరు గుతున్న ఎలక్ట్రిక్ బస్సుల కోసం మియాపూర్ డిపోలో బ్యాటరీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడంతో, ఈ బస్సులకు కూడా అక్కడే చార్జి చేస్తున్నారు. పూర్తి చార్జింగ్ తర్వా త బస్సు ప్రారంభమై ప్రయాణికులను ఎక్కించుకుంటూ ఎంజీబీఎస్‌కు వెళ్తుంది. అక్కడి నుంచి విజయవాడ బయలు దేరుతుంది. సిటీ దాటేటప్పటికే చార్జింగ్ డౌన్ ♦ మియాపూర్–ఎంజీబీఎస్ మధ్య 30 కి.మీ. దూరం ఉంది. ఈ రూట్ అంతా విపరీతమైన ట్రాఫిక్ నేపథ్యంలో తరచూ బస్సుకు బ్రేకులు వేయాల్సి వస్తుండటంతో బ్యాటరీ శక్తి ఎక్కువగా ఇక్కడే ఖర్చవుతోంది. ఎంజీబీఎస్‌లో బయలు దేరిన తర్వాత చౌటుప్పల్ వెళ్లే వరకు ట్రాఫిక్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో కూడా మరింత ఖర్చవుతోంది. మొత్తంగా 150 కి.మీ. దూరం రావాల్సిన శక్తి ఈ రెండు ప్రాంతాల్లోనే ఖర్చవుతుండటంతో విజయవాడ వరకు వెళ్లేందుకు సరిపోవటం లేదు. విజయవాడకు చేరుకున్న తర్వాత తిరిగి చార్జ్ చేసేందుకు, అక్కడి బస్టాండుకు పది కి.మీ. దూరంలో ఉన్న చార్జింగ్ పాయింట్ వద్దకు వెళ్లాలి. వెరసి మియాపూర్ నుంచి ఆ పాయింట్ వరకు 325 కి.మీ.దూరం అవుతోంది. సాధారణంగా బ్యాటరీలో 20 శాతం చార్జింగ్ ఉండగానే మళ్లీ ఫిల్ చేయాలనేది నిబంధన. లేదంటే సాంకేతిక సమస్య తలెత్తి బస్సు ఉన్నదిఉన్నట్టు ఆగిపోతుంది. దీంతో నగరంలో ఫుల్ చార్జ్ చేసినా... ట్రాఫిక్ చిక్కుల్లో పవర్ ఖర్చవుతుండటంతో మధ్యలో మరోసారి విధిగా చార్జ్ చేయించాల్సి వస్తోంది. దీంతో సూర్యాపేటలో ఉన్న ఓ ప్రైవేటు చార్జింగ్ స్టేషన్లో రెండో సారి చార్జ్ చేయిస్తున్నారు. ఇది ప్రయాణికులకు విసుగ్గా మారింది. నాన్‌స్టాప్‌గా వెళ్తుందనుకుంటే మధ్యలో ఆగాల్సి రావటం వారికి చిరాకు తెప్పిస్తోంది. బ్రేక్ సమయంగా మార్పు.. విజయవాడ వెళ్లే బస్సులను మధ్యలో కోదాడ వద్దో, ఇతర దాబాల వద్దనో అరగంటపాటు ఆపుతుంటారు. ప్రయాణికుల ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ బ్రేక్ సమయాన్ని సూర్యాపేటలో ఇస్తూ, ఆ సమయంలోనే బ్యాటరీని చార్జ్ చేయిస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. సూర్యాపేట బస్టాండులో ఆర్టీసీ సొంతంగా చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే మరింత వేగంగా చార్జ్ అవుతుందని పేర్కొంటున్నారు. మళ్లీ తిరుగు ప్రయాణంలో కూడా, విజయవాడ బస్టాండుకు 10 కి.మీ. దూరంలో ఉన్న పాయింట్లో ఫుల్ చార్జ్ చేయించి.. మళ్లీ సూర్యాపేటలో రెండో సారి చార్జ్ చేయిస్తున్నారు. ఫుల్ డిమాండ్.. ఈ–గరుడ బస్సులకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఏసీ బస్సులు కావటం, ఎలక్ట్రిక్ బస్సులు కావడంతో చప్పుడు లేకపోవటంతో ప్రయాణికులు వీటిల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేటప్పటితో పోలిస్తే అక్కడి నుంచి వచ్చేటప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఇటీవల వరసగా కొన్ని రోజులపాటు 100 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. వెళ్లేప్పుడు అది 70 శాతంగా ఉంటోంది. -
పర్యావరణ హితం, సౌకర్యవంతం.. ఈ–గరుడ ఎలక్ట్రిక్ వాహనాల ముఖ్య ఉద్దేశం ఇదే
మియాపూర్: కాలుష్య నివారణతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించడమే ఈ– గరుడ ముఖ్యోద్దేశ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఈ– గరుడ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాందీ.. మియాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలోని బస్టాప్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి పువ్వాడ మాట్లాడుతూ రాబోయే తరాలకు కాలుష్య రహిత సమాజం కోసం ఎలక్ట్రికల్ వాహనాలను టీఎస్ఆర్టీసీ విస్తరిస్తోందన్నారు. రానున్న రోజుల్లో 1300 బస్సులు హైదరాబాద్ సీటీలో, 550 సదూర ప్రాంతాలలో నడుపుతామని తెలిపారు. ఎలక్ట్రికల్ వాహనాల బ్యాటరీలకు సంబంధించిన యూనిట్లకు అమర్‌రాజా సంస్థతో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్‌లో శంఖుస్థాపన చేశారన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు 50 ఎలక్ట్రికల్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించామని, అందులో ప్రస్తుతం 10 బస్సులు ప్రారంభించామని, విడతల వారీగా మిగతా బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామరని తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా.. కొత్త బస్సులను ప్రవేశ పెడుతూ ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఆర్టీసీ కృషి చేస్తోందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సుమారు 10 వేల బస్సులు ప్రజా రవాణాకు వినియోగిస్తున్నామని తెలిపారు. త్వరలో నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ గతంలో ప్రైవేటు వాహనాలను తట్టుకోవడం ఆర్టీసీకి కష్టంగా ఉండేదని, కానీ ప్రస్తుతం ఆర్టీసీ వాహనాలను తట్టుకోవడం ప్రైవేటుకు కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం, ప్రజల సహకారంతో ఆర్టీసీ నడుస్తోందని తెలిపారు. కొత్త కారులలో ఉండే ఆధునిక సదుపాయాలు ఆర్టీసీ బస్సుల్లో కల్పిస్తున్నామని వివరించారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సుల కారణంగా ట్రాఫిక్ సమస్య పెరిగిందని, నియంత్రించేదుకు బస్సు టెర్మినల్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఒలెక్ట్రా ప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ‘ఈ–గరుడ’ పేరుతో నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున ఈ బస్సులను నడపనున్నారు. మొదటి విడతగా 10 బస్సులను ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని మియాపూర్ క్రాస్‌రోడ్ సమీపంలోని పుష్పక్ బస్ పాయింట్ వద్ద మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలోరవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జెండా ఊపి ఈ బస్సులను లాంఛనంగా ప్రారంభిస్తారు. టీఎస్‌ఆరీ్టసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మిగతా 40 బస్సులను ఈ ఏడాది చివరినాటికి దశలవారీగా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ–గరుడ బస్సుల ప్రత్యేకతలివీ.. 👉కొత్తగా ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు 12 మీటర్ల పొడవు ఉంటాయి. 41 సీట్లు ఉంటాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. 👉 ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యంతోపాటు రీడిండ్ ల్యాంప్‌లను ఏర్పాటు చేశారు. 👉 ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతోపాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ ఉంటుంది. వాటిని టీఎస్‌ఆరీ్టసీ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేస్తారు. 👉 ప్రతి బస్సులో మూడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటికి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ ఉంటుంది. 👉 బస్సులోని ప్రయాణికులను లెక్కించే ఆటోమేటిక్ ప్యాసింజర్ కౌంటర్ (ఏపీసీ) కెమెరా కూడా ఉంది. 👉 బస్సును రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. 👉 బస్సుకు ముందు, వెనుక ఎల్ఈడీ బోర్డులు ఉంటాయి. వాటిలో గమ్యస్థానాల వివరాలను ప్రదర్శిస్తారు. 👉 అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ఈ బస్సుల్లో ‘ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం (ఎఫ్డీఎస్ఎస్)’ను ఏర్పాటు చేశారు. 👉 ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా బస్సుల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఉంది. త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు గ్రేటర్ హైదరాబాద్‌లో పరుగులు తీసేందుకు త్వరలోనే 10 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫ్లైఓవర్లు, మెట్రో మార్గాలు లేని రూట్లలో వీటిని నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక రానున్న రెండేళ్లలో ఆర్టీసీలో మొత్తంగా 1,860 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో 1,300 బస్సులను హైదరాబాద్‌లో నడుపుతారు. మరో 550 బస్సులను హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు తిప్పనున్నారు. చదవండి: 16 బోగీలతో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్.. ఎప్పటి నుంచి అంటే? -
TSRTC: ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు వచ్చేస్తున్నాయ్! రేపే ప్రారంభోత్సవం
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ).. వాటిలో 10 బస్సులను మంగళవారం నుంచి వాడకంలోకి తెస్తోంది. మిగతా బస్సులు ఈ ఏడాది చివరినాటికి విడతల వారీగా అందుబాటులోకి వస్తాయి. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించే ఈ బస్సులకు ‘ఈ-గరుడ’ గా సంస్థ నామకరణం చేసింది. హైటెక్ హంగులతో ప్రయాణికులకు వీటిని అందుబాటులోకి తెచ్చామని, హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించామని సంస్థ ప్రకటించింది. రాబోయే రెండేళ్లలో కొత్తగా 1860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపింది. వాటిలో 1300 బస్సులను హైదరాబాద్ సిటీలో, 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడుపుతామని పేర్కొంది. హైదరాబాద్ లో 10 డబుల్ డెక్కర్ బస్సులను త్వరలోనే ప్రారంభిస్తామని వివరించింది. హైదరాబాద్ లో ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల ప్రారంభోత్సవం రేపు జరగనుంది. మియాపూర్ క్రాస్ రోడ్ సమీపంలోని పుష్ఫక్ బస్ పాయింట్ వద్ద మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ బస్సుల ప్రారంభోత్సవానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తో కలిసి “ఈ-గరుడ” బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ప్రత్యేకతలివే! 12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. 41 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు రీడిండ్ ల్యాంప్ లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ ఉంటుంది. బస్సులోని ప్రయాణికులను లెక్కించే ఆటోమెటిక్ ప్యాసింజర్ కౌంటర్(ఏపీసీ) కెమెరా కూడా ఉంది. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్డీఎస్ఎస్)ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టం బస్సుల్లో ఉంటుంది. ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. (చదవండి: రానున్న 10 ఏళ్లలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలు: కేటీఆర్) -
TSRTC: కొత్త ఈ-బస్సును చూశారా?
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ హితం దిశగా టీఎస్ఆర్టీసీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఈ-బస్సులను రోడ్డెక్కించనుంది. వచ్చే నెల నుంచి ఈ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అదీ విజయవాడ(ఆంధ్రప్రదేశ్) రూట్లో కావడం గమనార్హం. వచ్చే నెలలో కొన్ని బస్సులను ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఏర్పాట్లు చేస్తోంది. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను వాడకంలోకి తీసుకురాబోతుంది. విజయవాడ మార్గంలో తొలిసారిగా 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త ప్రోటో (నమూనా) ఎలక్ట్రిక్ ఏసీ బస్సును సజ్జనార్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, సౌకర్యాల విషయంలో రాజీ పడొద్దని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ప్రతినిధులకు సూచించారు. వచ్చే నెలలోనే కొన్ని బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వినోద్ కుమార్, మునిశేఖర్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (సీఎంఈ) రఘునాథ రావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(సీటీఎం) జీవన్ ప్రసాద్‌తో పాటు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ఏజీఎంలు వేణుగోపాల్ రావు, ఆనంద్ బసోలి, తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికులకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చే నెలలో కొన్ని బస్సులను ప్రారంభించేందుకు #TSRTC ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ మార్గంలో తొలిసారిగా 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వాడకంలోకి తేనుంది.హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త ప్రోటో (నమూనా)… pic.twitter.com/Yzk0svcSja — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 17, 2023 ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ప్రత్యేకతలివే! ►12 మీటర్ల పొడవు గల ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో 41 సీట్ల సామర్థ్యం ఉంది. ► ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ► బస్సులో ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు రీడిండ్ ల్యాంప్ లను ఏర్పాటు చేయడం జరిగింది. ► ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ► ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ ఉంటుంది. ► బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. ► బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. ► అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్డీఎస్ఎస్)ను ఏర్పాటు చేయడం జరిగింది. ► ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టం బస్సుల్లో ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్(ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చింది. అందులో 500 బస్సులను హైదరాబాద్ సిటీలో, 50 బస్సులు విజయవాడ మార్గంలో తిప్పనుంది. ఇవి కాకుండా అశోక్ లేలాండ్, జీబీఎం సంస్థల నుంచి కూడా మరో 1,000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) పద్ధతిలో విడతల వారీగా ఈ బస్సులను ఆయా సంస్థలు టీఎస్ఆర్టీసీకి అందజేయనున్నాయి. -
మరిన్ని ఈ–బస్సులు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మరిన్ని విద్యుత్ బస్సులు (ఈ–బస్సులు) ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) సన్నద్ధమవుతోంది. పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించే లక్ష్యంతో కొత్తగా వెయ్యి ఈ–బస్సులను ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఆర్టీసీకి అనుమతినిచ్చారు. ఈ బస్సులతో ఏటా కనీసం 51 వేల మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా వేశారు. ఆర్టీసీ తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో గత ఏడాది ఈ–బస్సులను ప్రవేశపెట్టింది. ఈ మార్గంలో 100 బస్సులను ప్రవేశపెడుతోంది. రెండో దశ కింద రాష్ట్రంలో ఇతర నగరాల్లో వెయ్యి విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ఏయే ప్రాంతాల్లో వీటిని ప్రవేశపెట్టాలో నిర్ణయించేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. తొలుత విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలులో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులో సిటీ సర్వి సులతో పాటు దూరప్రాంత, అంతర్రాష్ట్ర సర్వి సులుగా ప్రవేశపెట్టనున్నారు. మిగతా మూడు నగరాల నుంచి దూరప్రాంత సర్వి సులు నడపాలన్నది ఆర్టీసీ ఉద్దేశం. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది. అనంతరం టెండర్ల ప్రక్రియ చేపడుతుంది. ఈ ఏడాది ఆగస్టుకు ఈ–బస్సులను అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ భావిస్తోంది. ఆ తర్వాత దశలో మరో 3 వేల బస్సులు ఇకపై విద్యుత్ బస్సులనే కొనాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. డీజిల్ బస్సులను అద్దె ప్రాతిపదికన మాత్రమే ప్రవేశపెడతారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న 11,214 డీజిల్ బస్సుల స్థానంలో దశలవారీగా ఈ–బస్సులను ప్రవేశపెడతారు. అందుకోసం రానున్న మూడేళ్లలో దశలవారీగా 4 వేల ఇ–బస్సుల ప్రతిపాదనను ప్రభుత్వం గత ఏడాది ఆమోదించింది. అందులో భాగంగానే ప్రస్తుతం వెయ్యి బస్సులను ప్రవేశపెడుతున్నారు. అనంతరం మరో మూడు దశల్లో 3 వేల బస్సులను అందుబాటులోకి తేనున్నారు. ఇవి కూడా వస్తే తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డు సర్వీసులతో కలిపి మొత్తం 4,100 ఈ–బస్సులు అందుబాటులోకి వస్తాయి. దాంతో మొత్తం మీద వాతావరణంలో ఏటా 2.10 లక్షల మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని ఆర్టీసీ భావిస్తోంది. ఒకసారి చార్జింగ్ చేస్తే ఒక ఇ–బస్సు ఒక రూట్లో రానుపోనూ ప్రయాణించవచ్చని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. డిస్కంలతో కలిసి చార్జింగ్ స్టేషన్లు విద్యుత్ బస్సుల కోసం సొంతంగా చార్జింగ్ స్టేషన్లు కూడా ఆర్టీసీ ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు డిస్కంలతో కలసి వీటిని ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. రెండో దశలో జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ బస్ స్టేషన్లలో, మూడో దశలో డివిజన్ కేంద్రాలు, రాష్ట్ర సరిహద్దుల్లోని పట్టణాల్లో ఉన్న బస్ స్టేషన్లలో చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పుతారు. -
టీఎస్ఆర్టీసీలోకి ఎలక్ట్రిక్ బస్సులు.. దక్షిణ భారత్‌లో అతి పెద్ద ఆర్డర్: ఒలెక్ట్రా
భారతదేశం అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది, ఈ క్రమంలో దేశంలో వినియోగించే వాహనాలు కూడా మారుతున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్, సిఎన్జి వాహనాలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడానికి ముందడుగు వేసింది. ఇటీవల ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ సంస్థకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏకంగా 550 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 50 ఇంటర్సిటీ, 500 ఇంట్రాసిటీ బస్సులు ఉన్నాయి. ఇది దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద ఆర్డర్ అని కంపెనీ మేనేజింగ్ డైరక్టర్ కె.వి.ప్రదీప్ తెలిపారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్నెట్ లిమిటెడ్ అందించే ఇంటర్సిటీ బస్సులు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు, ఇంట్రాసిటీ బస్సులు నగరంలో తిరగనున్నాయి. ఇంటర్సిటీ బస్సులు ఒక ఛార్జ్‌తో 325 కిలోమీటర్లు, ఇంట్రాసిటీ బస్సులు 225 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయని కంపెనీ తెలిపింది. (ఇదీ చదవండి: చైనా ఉత్పత్తులకు బ్రేక్! హోలీ వేళ భారతీయులంతా..) 2025 మార్చి నాటికి హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు విరివిగా అందుబాటులోకి వస్తాయని TSRTC ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. అంతే కాకుండా రానున్న రోజుల్లో మూడు వేలకంటే ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు వినియోగంలోకి రానున్నట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. భాగ్యనగరంలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, కార్యకలాపాల కోసం టీఎస్ఆర్టీసీ జంటనగరాల్లో ఐదు డిపోలను కేటాయించినట్లు ప్రస్తావించారు. -
త్వరలో ఎలెక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు
సాక్షి బెంగళూరు: బెంగళూరు నగర వాసులకు అతి త్వరలో డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించే అనుభవం రానుంది. ఇవన్నీ ఎలెక్ట్రిక్ బస్సులే కానున్నాయి. ఓ ప్రముఖ సంస్థతో బస్సుల కొనుగోలుకు బీఎంటీసీ ఒప్పందం చేసుకుంది. తొలుత ఐదు డబుల్ డెక్కర్ బస్సులకు రూ. 10 కోట్లు బీఎంటీసీ చెల్లించనుంది. తొలి బస్సు మార్చిలో, మరో నాలుగు బస్సులు ఏప్రిల్‌లో వస్తాయి. ఇందులో ఏసీ సహా పలు ఆధునిక వసతులు ఉంటాయని బీఎంటీసీ వర్గాలు తెలిపాయి. మొదటి ఏసీ డబుల్ డెక్కర్ బస్సు హెబ్బాల నుంచి సిల్క్ బోర్డు మార్గంలో ప్రయాణించనుంది. వోల్వో వజ్ర బస్సులో చెల్లించే టికెట్ చార్జీలే ఈ బస్సులోనూ ఉండనున్నాయి. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే సుమారు 250 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఈ బస్సుకు ముందు భాగం, వెనుక భాగంలో తలుపులు ఉంటాయి. 65 మంది ప్రయాణించవచ్చు. -
ఆర్టీసీకి అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన నిర్వహించనుంది. ఆర్టీసీ కొత్తగా సమకూర్చుకునే ఎలక్ట్రిక్ బస్సులను ఆ కంపెనీ నుంచే తీసుకోనుంది. అయితే నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ, వాటిని సొంతంగా కొనకుండా గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిలో అద్దెకు తీసుకోనుంది. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి కావటంతో ఇక బస్సులను సరఫరా చేయాల్సి ఉంది. త్వరలో అవి ఆర్టీసీకి అందనున్నాయి. అయితే అశోక్ లేలాండే వాటిని నిర్వహిస్తుంది కాబట్టి, అందుకు ప్రతిగా ఆ సంస్థకు ఆర్టీసీ కి.మీ.కు నిర్ధారిత మొత్తం చొప్పున అద్దెను చెల్లిస్తుంది. మూడేళ్లలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు ఇంతకాలం డీజిల్ బస్సులనే నడుపుతున్న టీఎస్ ఆర్టీసీ క్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల వైపు చూస్తోంది. భారీగా పెరిగిన డీజిల్ ధర ఆర్టీసీపై భారం పెంచుతోంది. దీంతో క్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల వైపు మళ్లటం ద్వారా ఆ ఖర్చును తగ్గించుకోవాలని సంస్థ నిర్ణయించింది. కానీ డీజిల్ బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్ బస్సుల ధర చాలా ఎక్కువ. ఎక్స్‌ప్రెస్ కేటగిరీలో తిరిగే డీజిల్ బస్సు రూ.35 లక్షలు పలుకుతుంటే, నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సు ధర రూ.కోటిన్నర వరకు పలుకుతోంది. అంత మొత్తం వెచ్చించి వాటిని కొనటం ఆర్టీసీకి తలకు మించిన భారంగా మారింది. దీంతో జీసీసీ పద్ధతిలో అద్దెకు తీసుకోవాలని నిర్ణయించింది. వచ్చే మూడేళ్లలో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆర్టీసీ, ఇప్పుడు అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి 500 బస్సులు సమకూర్చుకోనుంది. టెండర్ల ప్రక్రియలో ఆ సంస్థ ఎల్1గా నిలవటంతో దానికే బస్సుల నిర్వహణ బాధ్యత అప్పగించింది. కి.మీ.కు అద్దెను ఆ సంస్థ రూ.58గా కోట్ చేసింది. దాన్ని కనీసం రూ.54కు తగ్గించాలని ఆర్టీసీ కోరింది. దీనిపై ఆ సంస్థ ఇంకా తుది నిర్ణయం వెల్లడించలేదు. వచ్చే రెండు, మూడురోజుల్లో అది ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. డిపోల్లో చార్జింగ్ వ్యవస్థలు ఎలక్ట్రిక్ బస్సులు పెరుగుతున్నందున, వాటి చార్జింగ్ కోసం డిపోల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఏయే డిపోలకు ఎలక్ట్రిక్ బస్సులను కేటాయిస్తారో, ఆయా డిపోల్లో ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు అవసరం. కాగా 33 కేవీ అవసరమా, 11 కేవీ సరిపోతుందా? అనే పరిశీలన జరుగుతోంది. ఇందుకోసం ఇటీవలే అధికారుల స్థాయిలో కొన్ని మార్పులు చేశారు. గతంలో ఆర్టీసీ ఈడీ వినోద్‌కు ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణ బాధ్యత ఉండేది. ఇప్పుడు ఓ అధికారి ప్రత్యేకంగా ఈ పనులకే ఉండాలన్న ఉద్దేశంతో ఆయన నుంచి దాన్ని తప్పించి సీఎంఈకి కేటాయించారు. కి.మీ.కు రూ.79 అశోక్ లేలాండ్ ఆర్టీసీకి డబుల్ డెక్కర్ బస్సులను కూడా సరఫరా చేయాల్సి ఉంది. తొలుత 10 బస్సులను ఆర్టీసీ తీసుకుంటోంది. ఇది కూడా జీసీసీ పద్ధతిలోనే అయినందున, దానికి కి.మీ.కు ఆ సంస్థ రూ.79ని అద్దెగా కోట్ చేసింది. అయితే దాన్ని కూడా కొంతమేర తగ్గించాలని ఆర్టీసీ కోరింది. త్వరలో దానిపై కూడా నిర్ణయం వెలువడనుంది. -
డబుల్ డెక్కర్ ఆగయా.. నిజాం నాటి బస్సులకు పూర్వ వైభవం..
సాక్షి, హైదరాబాద్: ‘అలనాటి చారిత్రక డబుల్ డెక్కర్ పూర్వవైభవాన్ని సంతరించుకుంది. హైదరాబాద్ అందాలను ఆస్వాదిస్తూ రెండంతస్తుల బస్సుల్లో ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభూతి’ అంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్ ఆ అందమైన అనుభవాన్ని నగరవాసులకు తిరిగి అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులను రోడ్డెక్కించనున్నట్లు ఆయన అప్పుడే చెప్పారు. ట్విట్టర్ వేదికగా స్పందించినట్లుగానే పర్యావరణ ప్రియమైన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను మంగళవారం ప్రారంభించారు. నగరవాసులతో పాటు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను, సందర్శకులను సైతం విశేషంగా ఆకట్టుకొనే విధంగా ఉన్న మూడు డబుల్ డెక్కర్ బస్సులను నానక్‌రాంగూడలోని హెచ్ఎండీఏ అనుబంధ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయం వద్ద జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఫార్ములా– ఈ ప్రిక్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. చేవెళ్ల ఎంపీ జి.రంజిత్‌రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆహ్లాదభరింతంగా పర్యాటక విహారం.. ఫార్ములా– ఈ ప్రిక్స్ సందర్భంగా ప్రారంభించిన డబుల్ డెక్కర్ బస్సులు ప్రస్తుతం రేసింగ్ ట్రాక్ పరిధిలోని ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, పారడైజ్ ,నిజాం కాలేజీ రూట్లలో తిరుగుతాయి. మొదటి విడతగా హెచ్ఎండీఏ 6 బస్సులను కొనుగోలు చేయగా ప్రస్తుతం మూడింటిని ప్రవేశపెట్టారు. త్వరలో మరో మూడు బస్సులు రానున్నాయి. దశలవారీగా మొత్తం 20 బస్సులను ప్రవేశపెట్టేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఫార్ములా– ఈ ప్రిక్స్ అనంతరం డబుల్ డెక్కర్ బస్సులను చారిత్రక, వారసత్వ కట్టడాల సర్క్యూట్లలో నడుపుతారు. హైదరాబాద్ పర్యాటక స్థలాలను ఈ బస్సుల్లో సందర్శించవచ్చు. పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనున్నారు. ఈ నెల 11న ఫార్ములా– ఈ పోటీల సందర్భంగా డబుల్ డెక్కర్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. ఇదీ నేపథ్యం... నిజాం కాలంలోనే ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ బస్సులను ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ 2003 వరకు నడిపింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి జూపార్కు వరకు, అఫ్జల్‌గంజ్ వరకు ఇవి నడిచేవి. సికింద్రాబాద్ నుంచి మెహిదీపట్నం వరకు డబుల్ డెక్కర్లు ఉండేవి. నగరవాసులతో పాటు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఆ బస్సులో పయనించేందుకు ఎంతో మక్కువ చూపేవారు. ట్యాంక్‌బండ్ మీదుగా ఇందులో ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభూతి. కాలక్రమంలో బస్సుల నిర్వహణ భారంగా మారడంతో వీటికి కాలం చెల్లింది. ఫ్లైఓవర్ల కారణంగా కూడా బస్సులు నడపడం కష్టంగా మారింది. మంత్రి కేటీఆర్ చొరవ మేరకు ప్రస్తుతం అత్యాధునిక సాంకేతిక సామర్థ్యంతో రూపొందించిన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్లు అందుబాటులోకి వచ్చాయి. -
ఏటా 40 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ బస్సుల విభాగం వచ్చే పదేళ్లలో ఏటా సుమారు 40% మేర వృద్ధి చెందవచ్చని అంచనా వేస్తున్నట్లు స్విచ్ మొబిలిటీ సీఈవో మహేశ్ బాబు తెలిపారు. గతేడాది 1,200 ఎలక్ట్రిక్ బస్సులు రిజిస్టర్ కాగా, ఈసారి 2,000 దాటేయొచ్చని చెప్పారు. వచ్చే ఏడాది ఇది 6,000కు చేరవచ్చని సాక్షి బిజినెస్ బ్యూరోకు వివరించారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సు తయారీ వ్యయం సగటున రూ. 1.5 కోట్ల స్థాయిలో ఉంటోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సానుకూల పాలసీలు ఇందుకు తోడ్పడగలవని ఆయన చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపర్చుకోవడంపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుందని మహేష్ బాబు చెప్పారు. తమ సంస్థ విషయానికొస్తే.. ఇప్పటికే 500 పైచిలుకు బస్సులు సరఫరా చేశామని, వచ్చే 12–18 నెలల్లో సుమారు 2,600 బస్సులు అందించనున్నామన్నారు. తెలంగాణకు దాదాపు 1,000 బస్సులు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను తయారు చేస్తున్నది తమ కంపెనీ మాత్రమేనని, హెచ్ఎండీఏకి 6 అందిస్తున్నామని తెలిపారు. -
రూ.5,000 కోట్లు విలువ చేసే ఈ–బస్‌లకు టెండర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ (సీఈఎస్ఎల్) తాజాగా 4,675 ఎలక్ట్రిక్ బస్‌లకు టెండర్లను పిలిచింది. వీటి విలువ రూ.5,000 కోట్లు. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ (ఎన్‌ఈబీపీ) కింద టెండర్లను ఆహ్వానించడం ఇది రెండవసారి అని సీఈఎస్ఎల్ గురువారం తెలిపింది. డ్రై లీజ్ ప్రాతిపదికన ఈ బస్‌లను తెలంగాణ, ఢిల్లీ, కేరళలో ప్రవేశపెడతారు. డ్రై లీజ్ పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్లు లేకుండా ఈ బస్‌లను ఆపరేటర్లు రాష్ట్ర రోడ్డు రవాణా (ఎస్టీసీ) సంస్థలకు సరఫరా చేస్తారు. ఎస్టీసీలు తమ సిబ్బందితో వీటిని నడిపిస్తాయి. యాజమాన్య హక్కులతోపాటు నిర్వహణ బాధ్యతలను 10, 12 ఏళ్లపాటు సర్వీస్ ప్రొవైడర్లు (ఆపరేటర్లు) చేపడతారు. ఒక్కో బస్‌కు నిర్దేశిత రుసుమును ఆపరేటర్లకు ఎస్టీసీలు చెల్లిస్తాయి. బిడ్డర్లు, ఎస్టీసీలు తప్పనిసరిగా మహిళలను నియమించుకోవడంతోపాటు సురక్షిత వాతావరణాన్ని కల్పించాల్సి ఉంటుంది. 4,675 ఎలక్ట్రిక్ బస్‌లు వస్తే ఏటా 15 లక్షల కిలోలీటర్ల ఇంధనం ఆదా అవుతుందని సీఈఎస్ఎల్ తెలిపింది. -
ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఎన్‌ఈబీపీ టెండర్లు
న్యూఢిల్లీ: జాతీయ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం (ఎన్‌ఈబీపీ) కింద తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 6,465 ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రభుత్వ రంగ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ (సీఈఎస్ఎల్) ఏకీకృత టెండర్లు ఆహ్వానించింది. ఇందులో డీజిల్‌తో పోలిస్తే నిర్వహణ వ్యయం 29 శాతం తక్కువగా ఉండే విధంగా టెండర్లు దాఖలైనట్లు సీఈఎస్ఎల్ తెలిపింది. 12 మీటర్ల బస్సు (ఇంట్రా–సిటీ)ల నిర్వహణ వ్యయం కిలోమీటరుకు రూ. 54.3గాను, 12 మీటర్ల ఇంటర్సిటీ బస్సుకి కిలోమీటరుకు రూ. 39.8/కి.మీ.గాను బిడ్లు వచ్చాయి. అలా గే, 9 మీటర్ల బస్సుకు రూ. 54.46, 7 మీటర్ల బస్సుకు రూ. 61.92 వ్యయం ఉండేలా బిడ్లు వచ్చినట్లు సీఈఎస్ఎల్ ఎండీ మహువా ఆచార్య తెలిపారు. ఎలక్ట్రిక్ విధానంలో ప్రజా రవాణా బస్సులను ప్రభుత్వ రవాణా సంస్థలు (ఎస్టీయూ) ఒక సర్వీసుగా ఉపయోగించుకుని, నిర్దిష్ట ఫీజులను చెల్లించే విధంగా ఎన్‌ఈబీపీని రూపొందించారు. దీని ప్రకారం ప్రైవేట్ ఆపరేటరు బస్సులను 10–12 ఏళ్ల పాటు నడిపిస్తారు. బస్సు సర్వీసు పొందినందుకు గాను ఎస్టీయూలు ఫీజులను చెల్లిస్తాయి. -
ఫేమ్ ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: టెండర్లలో తక్కువ మొత్తం కోట్ చేసిన కంపెనీకి ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా కాంట్రాక్టును అప్పగించే విషయంలో నెలకొన్న వివాదం సకాలంలో బస్సులు రోడ్డెక్కకుండా చేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికల్లా 300 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ విషయం కోర్టుకు చేరటంతో బస్సులు రావటానికి మరింత సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచే ఉద్దేశంతో తాజాగా ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇన్ ఇండియా)–2 పథకం కింద 10 వేల బస్సులను రాయితీపై సరఫరా చేయాలని నిర్ణయించింది. తెలంగాణకు 300 బస్సులు మంజూరయ్యాయి. ఇటీవల కేంద్ర భారీ పరిశ్రమల శాఖ టెండర్లు పిలిచి ఖరారు చేసింది. ఇందులో ఎల్–1(తక్కువ మొత్తం కోట్ చేసిన కంపెనీ)గా వచ్చిన కంపెనీకి ఎక్కువ బస్సులు సరఫరా ఉన్న రాష్ట్రాల బాధ్యత అప్పగించింది. ఎల్–2గా ఉన్న కంపెనీ జాబితాలో తెలంగాణ ఉంది. కాగా ఎల్–2గా ఉన్న కంపెనీతో ఒప్పందం చేసుకునే సమయంలో వివాదం తలెత్తింది. ఆ కంపెనీ కోర్టుకు వెళ్లటంతో.. తొలుత టెక్నికల్ బిడ్ తెరిచినప్పుడు ఓ కంపెనీ బిడ్‌కు అర్హమైంది కాదని భావించిన అధికారులు దాన్ని తిరస్కరించారు. నిజానికి ఆ కంపెనీ కోట్ చేసిన మొత్తం ప్రకారం ఎల్–2 స్థానంలో అదే ఉంటుంది. మూడో స్థానంలో ఉన్న కంపెనీని ఎల్–2గా నిర్ధారించారు. దీనికి తెలంగాణకు బస్సుల సరఫరా బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. ఇంతలో అన ర్హమైందిగా అధికారులు తేల్చిన కంపెనీ కోర్టును ఆశ్రయించిందని, తీర్పు ఆ కంపెనీకి అనుకూలంగా వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దీంతో మూడో స్థానంలో ఉన్న కంపెనీని ఎల్–2గా నిర్ధారిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తొలుత ఎల్–2గా నిర్ధారించిన కంపెనీకే బస్సుల సరఫరా బాధ్యత అప్పగించాల్సి ఉంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ఆ కంపెనీతో చర్చించే సమయంలో, కేంద్ర ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుని దీనిపై ఎలాంటి నిర్ణయానికి రావద్దని, తాము కోర్టు తీర్పును సవాల్ చేయబోతున్నామని చెప్పినట్టు సమాచారం. త్వరలో 500 అద్దె ఎలక్ట్రిక్ బస్సులు.. ఫేమ్–2 పథకం బస్సుల పరిస్థితి ఇలావుండగా, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి పిలిచిన టెండర్లలో రెండు బడా కంపెనీలు పాల్గొన్నాయి. టెక్నికల్ బిడ్ ఓకే అయింది. ఫైనాన్షియల్ బిడ్‌లో తక్కువ మొత్తం కోట్ చేసిన కంపెనీకి ఆర్డర్ ఇవ్వనున్నారు. మరో నెలరోజుల్లో ఈ బస్సుల రాక ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. -
దేశంలో విద్యుత్ వాహనాల జోరు
సాక్షి, అమరావతి: దేశంలో విద్యుత్ వాహనాల(ఈవీ) అమ్మకాలు జోరందుకున్నాయి. వీటిని ఉపయోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2030 నాటికల్లా దేశంలోని టూ వీలర్ సెగ్మెంట్లో ఏకంగా 40–45 శాతం విద్యుత్ వాహనాలే ఉంటాయని బైన్–కో అనే సంస్థ అధ్యయనంలో వెల్లడయ్యింది. రాబోయే ఎనిమిదేళ్లలో మొత్తంగా 66 శాతం మంది విద్యుత్ వాహనాలనే వాడతారని ఈ అధ్యయనం తేల్చింది. విద్యుత్ వాహనాలు తక్కువ ధరకే అందుబాటులో ఉండటం, రిపేర్లకు అవకాశం తక్కువ కావడం, మెయింటనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ ఉండటంతో వాహనదారులు వీటిని ఎంచుకుంటున్నారని అధ్యయనంలో వెల్లడైంది. అలాగే వాయు, శబ్ధ కాలుష్యాలు లేకపోవడం కూడా అమ్మకాల పెరుగుదలకు ఒక కారణంగా తేలింది. కేంద్ర ప్రభుత్వం కూడా కాలుష్యానికి చెక్ పెట్టేందుకు 2030 నాటికి 30 శాతం ఈవీ కార్లు, 80 శాతం ఈవీ టూ వీలర్లు, 70 శాతం ఈవీ కమర్షియల్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. వేగంగా పెరుగుతున్న అమ్మకాలు.. మన దేశంలో మొదటి విద్యుత్ వాహనాన్ని స్కూటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 1996లోనే తయారు చేసింది. ‘విక్రమ్ సఫా’ అనే పేరుతో త్రీ వీలర్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. దాదాపు 400 వాహనాలను విక్రయించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో బీహెచ్ఈఎల్ 18 సీట్లున్న ఎలక్ట్రిక్ బస్సును రూపొందించింది. 2001లో బెంగళూరుకు చెందిన ‘రెవా’ అనే సంస్థ కూడా ఈవీ కార్ల పరిశ్రమలోకి ప్రవేశించింది. 2012 నుంచి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో పెరుగుదల మొదలైంది. ఆ ఏడాది 6 వేల వాహనాలకు రిజిస్ట్రేషన్లవ్వగా.. 2015లో 9 వేలు, 2016లో 50 వేల మార్కును దాటేసింది. 2016–2019 మధ్యలో ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ 51,129 నుంచి 1.61 లక్షలకు పెరిగింది. 2020లో కోవిడ్ వల్ల 1.19 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలే జరిగాయి. 2021 నుంచి మళ్లీ ఊపందుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13.34 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు తిరుగుతుండగా.. ఇతర వాహనాల సంఖ్య 27.81 కోట్లుగా ఉంది. 2030 నాటికి ఈ సంఖ్యలో సగభాగం ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. -
ఎలక్ట్రిక్‌గా డీజిల్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఎన్టీపీసీతో కలసి సంయుక్తంగా కేంద్రం ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ కూడా భాగం పంచుకోనుంది. ప్రయోగాత్మకంగా మొదటి దశలో హైదరాబాద్‌లో నడుస్తున్న 100 బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చనున్నారు. మరో 2–3 నెలల్లో ఇవి పొగలేని కాలుష్యరహిత వాహనాలుగా నగర రోడ్లపై పరుగుపెట్టనున్నాయి. మలిదశలో మరిన్ని బస్సులను కూడా మార్చనున్నారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచే క్రమంలో కేంద్రం ఈ కార్యక్రమం చేపట్టింది. కేంద్రం నుంచి కిట్.. ఎన్టీపీసీ నుంచి బ్యాటరీ.. కొత్త ఎలక్ట్రిక్ బస్సు కొనాలంటే రూ. కోటిన్నరకుపైగానే ఖర్చు కానుంది. అదే ఏసీ బస్సుకు రూ. 2 కోట్ల వరకు వ్యయం చేయాల్సిందే. ఇంత భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఆర్టీసీ వాటిని సమకూర్చుకోలేకపోతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం ఉన్న మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో అక్కడి ఆర్టీసీలు ఎలక్ట్రిక్ బస్సులు కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పాత బస్సులనే ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని తెలంగాణ ఆర్టీసీ గతంలో ప్రయత్నించింది. ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ముషీరాబాద్ డిపోలోని ఓ బస్సును మార్చి పరిశీలిస్తోంది. ఇలా మార్చడానికి కూడా దాదాపు రూ.65 లక్షల వరకు ఖర్చు కానుండటంతో ఆ ప్రక్రియ కూడా ముందుకు పడటం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీకి తీపికబురు అందించింది. స్వయంగా ఈ మార్పిడి ప్రక్రియ ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. దీంతో తెలంగాణ ఆర్టీసీ కూడా అందుకు అంగీకరిస్తూ ప్రయోగాత్మకంగా తొలిదశలో 100 బస్సులను కన్వర్ట్ చేసుకోవడానికి ముందుకొచ్చింది. తాజా ప్రాజెక్టు ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం కన్వర్షన్ కిట్ కోసం ఒక్కో బస్సుకు రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఆ కిట్ సరఫరాకు కూడా ఏర్పాట్లు చేయనుంది. ఇక ఎన్టీపీసీ రూ. 40 లక్షల విలువైన బ్యాటరీని సరఫరా చేయనుంది. ఇందుకోసం బ్యాటరీ తయారీ కంపెనీతో అది ఒప్పందం కుదుర్చుకుంది. వెరసి ఆర్టీసీకి నయాపైసా ఖర్చు లేకుండా ఒక్కో బస్సుకు రూ.60 లక్షల విలువైన పరికరాలు అందనున్నాయి. అద్దె వసూలు చేసుకోనున్న ఎన్టీపీసీ.. ఎలక్ట్రిక్ బస్సులుగా కన్వర్ట్ అయిన బస్సులను ఆర్టీసీనే నడపనుంది. టికెట్ల రూపంలో వచ్చే ఆదాయాన్ని ఆర్టీసీనే తీసుకోనుంది. కానీ జీసీసీ పద్ధతిలో ఆర్టీసీకి సమకూర్చే బస్సులకు కిలోమీటరుకు నిర్ధారిత మొత్తం అద్దె చెల్లిస్తున్నట్టుగా ఈ కన్వర్ట్ అయిన బస్సులకుగాను ఎన్టీపీసీకి నిర్ధారిత మొత్తాన్ని ఆర్టీసీ అద్దెగా చెల్లించాల్సి ఉంటుంది. బస్సుల చార్జింగ్ ఏర్పాట్లను ఆర్టీసీ సొంతంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ►సాధారణంగా ఒక డీజిల్ బస్సుకు కి.మీ.కు రూ. 20 వరకు నిర్వహణ ఖర్చు వస్తుంది. ►అదే బ్యాటరీ బస్సుకు ఆ ఖర్చు రూ. 6గానే ఉంటుంది. వెరసి కి.మీ.కు రూ. 14 వరకు ఆదా అవుతుంది. ►కేంద్ర ప్రాజెక్టు వల్ల ఆర్టీసీకి కన్వర్షన్ భారం లేనందున వీలైనన్ని బస్సులను ఎలక్ట్రిక్‌లోకి మార్చుకొనే వెసులుబాటు కలుగుతుంది. ►ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 3 వేలకుపైగా అద్దె బస్సులున్నాయి. త్వరలో 300 ఎలక్ట్రిక్ బస్సులు, 10 డబుల్ డెక్కర్ బస్సులను, కొన్ని స్లీపర్ బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకోనుంది. వాటికి చెల్లిస్తున్నట్టుగానే కన్వర్షన్ బస్సులకు కూడా అద్దె చెల్లిస్తుంది. ఇది ఆర్టీసీకి పెద్ద భారం కాబోదు. -
Hyderabad: ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు.. వచ్చేస్తున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: సిటీ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. త్వరలో ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు భాగ్యనగర రహదారులపై పరుగులు పెట్టనున్నాయి. ఈసారి గతానికి భిన్నంగా ఎలక్ట్రిక్ బస్సులు సేవలు అందించనున్నాయి. హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్ మాత్రమే కాదు. డబుల్ డెక్కర్ బస్సులు కూడా గుర్తొస్తాయి. 1990వ దశకంలో పుట్టినవారు డబుల్ డెక్కర్ బస్సుల్లో తిరిగిన జ్ఞాపకాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. మళ్లీ హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సుల్ని తీసుకురావాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. సిటీలో డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పాలంటూ మంత్రి కేటీఆర్‌ను ట్విటర్లో నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు. హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పుతామని కేటీఆర్ హామీ కూడా ఇచ్చారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు ప్రారంభించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కోరారు. దీంతో నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ చర్యలు ప్రారంభించింది. ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్ని నడపనుంది. అద్దె ప్రాతిపదికన తీసుకుని.. ► ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను అద్దెకు తీసుకొని నడిపేందుకు టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. సిటీలో మూడు వేర్వేరు రూట్లలో 10 ఈ– డబుల్ డెక్కర్ బస్సుల్ని అద్దెకు తీసుకొని నడపనుంది. ఇందుకు సంబంధించిన టెండర్‌ను మరో వారంలో ఆహ్వానించనుంది. అద్దె ప్రాతిపదికన ఈ బస్సులను నడపడానికి ఆసక్తి ఉన్న కంపెనీలు తమ బిడ్లను నమోదు చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఆహ్వానించనుంది. బిడ్ గెలుచుకున్న కంపెనీ ఈ బస్సులను అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు టీఎస్ఆర్టీసీతో ఒప్పందం చేసుకుంటుంది. ఆ కంపెనీకి టీఎస్ఆర్టీసీ అద్దెను ఫిక్స్‌డ్‌గా చెల్లిస్తుంది. ► చార్జీలు, రూట్లు లాంటి నిర్ణయాలన్నీ టీఎస్ఆర్టీసీ తీసుకుంటుంది. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ప్రయాణికుల రద్దీని పెంచి లాభాలవైపు పరుగులు తీసుకేందుకు టీఎస్ఆర్టీసీ అనేక చర్యల్ని తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుపెట్టి బస్సుల్ని కొనకుండా అద్దెకు తీసుకొని నడపడం ద్వారా భారాన్ని తగ్గించుకుంటుంది. ఇక ఈ– డబుల్ డెక్కర్ బస్సుల్ని ఏ రూట్లో నడపాలన్నదానిపై ఇప్పటికే ఆర్టీసీ అధికారులు అధ్యయనం జరిపారు. హైదరాబాద్‌లో పలు చోట్ల ఫ్లైఓవర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఫ్లైఓవర్లతో ఇబ్బంది లేని రూట్లోనే డబుల్ డెక్కర్ బస్సులు తిరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మూడు రూట్లు ఫైనలైజ్ చేశారని వార్తలొస్తున్నాయి. ► పటాన్చెరు– కోఠి, జీడిమెట్ల–సీబీఎస్, అఫ్జల్‌గంజ్– మెహిదీపట్నం రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులు తిరిగే అవకాశాలున్నాయి. ఇక ముంబైలో ఇప్పటికే ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతున్నాయి. స్విచ్ మొబిలిటీ 22 మోడల్ బస్సుల్ని ముంబైలో ప్రజా రవాణా కోసం తిప్పుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్ని ఇండియాలోనే డిజైన్ చేసి తయారు చేయడం విశేషం. బృహత్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ఈ బస్సులు నడుస్తున్నాయి. (క్లిక్ చేయండి: బస్టాప్‌లో బస్సు ఆపొద్దంటూ బోర్డు.. పాపం ప్రయాణికులు..) -
కాలుష్యానికి చెక్.. ఇక హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులే..!
సాక్షి, హైదరాబాద్: సాధారణ బస్సులకు బదులుగా వీలైనన్ని ఎలక్ట్రిక్ బస్సులనే స మకూర్చుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. 360 బస్సులు కొనేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచింది. మలి దఫాలో మరో 100 బస్సులు తీసుకునే యోచనలో ఉంది. నగరంలో వాహన కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏకంగా 300 బస్సులను సిటీ సర్వీసులుగా తిప్పాలని నిర్ణయించింది. 50 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ఇంటర్ స్టేట్ సర్వీసులుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలతో అనుసంధానించాలనుకుంటోంది. కొన్ని నాన్ ఏసీ, ఏసీ బస్సులను కొని, హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలకు తిప్పబోతోంది. ఇవన్నీ అద్దె ప్రాతిపదికన సమకూర్చుకోనుంది. ముంబై తరహాలో పది ఏసీ డబుల్ డెక్కర్ బస్సులనూ హైదరాబాద్‌లో తిప్పబోతోంది. అద్దెతో భారం తక్కువ.. కాలుష్యానికి చెక్.. దేశవ్యాప్తంగా వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఫేమ్ పథకం కింద పలు రాష్ట్రాల ప్రజా రవాణా సంస్థలకు ఎలక్ట్రిక్ బస్సులను అందించింది. ఆ పథకం తొలి దశలో 40 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకున్న తెలంగాణ ఆర్టీసీ, రెండో విడతలో 324 బస్సులకు టెండర్లు పిలిచింది. ఏసీ బస్సులకు డిమాండ్ అంతగా ఉండటం లేదన్న ఉద్దేశంతో తర్వాత రద్దు చేసుకుంది. ఇప్పు డు ఆ పథకం కింద కాకపోయినా, దాదాపు అదే సంఖ్యలో నాన్ ఏసీ బస్సులు తీసుకుంటోంది. ఇటీవలే వాటికి టెండర్లు పిలిచింది. వాటిని సిటీ బస్సులుగా హైదరాబాద్‌లో తిప్పుతారు. బ్యాటరీ బస్సులు కావటంతో వాతావరణ కాలుష్యం ఉండదు. అద్దె ప్రాతిపదికన తీసుకున్నందున నిర్వహణ, డ్రైవర్ ఖర్చు కూడా ఆర్టీసీపై పడదు. విజయవాడ, గుంటూరులకు ఏసీ బ్యాటరీ బస్సులు.. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూ రు ఏసీ బస్సులకు బాగా డిమాండ్ ఉంటోంది. సిటీ నుంచి తిరిగే ప్రైవేటు బస్సుల్లో మూడొంతులు ఈ మార్గాల్లోనే తిరుగుతా యి. కానీ ప్రైవేటు ఆపరేటర్లు బ్యాటరీ బ స్సులను వాడటం లేదు. దాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు తొలిసారి ఆ మార్గంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. మల్టీ యాక్సిల్ తరహాలో 13.5 మీటర్ల పొడవుండే భారీ బస్సులను కొనబోతోంది. కుదుపులు లేకపోవడం, శబ్దం ఉండకపోవటంతో రాత్రి వేళ వీటిలో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతారని భావిస్తోంది. ఇందుకోసం 50 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లు పిలిచింది. నగరంలో తిప్పేందుకు ఇప్పటికే 10 ఏసీ ఎలక్ట్రిక్ డబుల్ డెక్క ర్ బస్సులకూ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే మార్చి నాటికి దశలవారీగా ఈ బస్సులన్నీ రోడ్డెక్కనున్నాయి. హైదరాబాద్ నుంచి జిల్లాలకూ... హైదరాబాద్ నుంచి వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్‌లాంటి పట్టణాలకు తిప్పేందుకు కొన్ని ఏసీ, కొన్ని నాన్ఏసీ ఎలక్ట్రిక్ బస్సులూ కొనే యోచనలో ఉంది. ప్రస్తుతం బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేక వాటిని తిప్పటం కష్టంగా ఉంది. దీంతో టెండర్లు దక్కించుకునే సంస్థలే ఆ బ్యాటరీ చార్జింగ్ సెంటర్లు కూడా నిర్వహించాలన్న కండీషన్‌తో త్వరలో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 670 సాధారణ బస్సులను సొంతంగా కొంటున్న విషయం తెలిసిందే. క్రమంగా సాధారణ బస్సుల సంఖ్యను తగ్గించుకుంటూ బ్యాటరీ బస్సుల సంఖ్యను పెంచాలన్నది ఆర్టీసీ ఆలోచన. చదవండి: తెలంగాణ రాష్ట్రానికి గ్రీన్ చాంపియన్ అవార్డు -
భాగ్యనగరానికి 10 విద్యుత్ డబుల్ డెక్కర్లు
సాక్షి, హైదరాబాద్: ముంబై తరహాలో హైదరాబాద్ రోడ్లపైనా త్వరలోనే ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. నగరంలోని పలు రూట్లలో 10 విద్యుత్ డబుల్ డెక్కర్ బస్సులను తిప్పాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. అయితే ఒక్కో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఖరీదు రూ. 2.25 కోట్ల వరకు ఉండటం.. అంత ఖర్చును భరించే ఆర్థిక పరిస్థితి సంస్థకు లేకపోవడంతో అద్దె ప్రాతిపదికన వాటిని ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం 4–5 రోజుల్లో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. క్రాస్ కాస్ట్ విధానంలో ఈ బస్సులు నడిపేందుకు ఆసక్తి ఉన్న కంపెనీలు ముందుకు రావాలని టెండర్ నోటిఫికేషన్లో కోరనుంది. అద్దె పద్ధతిలో బస్సులు నిర్వహించే సంస్థతో టెండర్ దక్కించుకున్న సంస్థ ఒప్పందం కుదుర్చుకొని ఆర్టీసీకి బస్సులు సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రతి కిలోమీటర్ చొప్పున నిర్ధారిత అద్దెను ఆర్టీసీ ఆ సంస్థకు చెల్లించనుంది. ప్రభుత్వ ఆర్థిక సాయం లేనందున.. ముంబైలోని బృహన్ముంబై విద్యుత్ సరఫరా, రవాణా (బెస్ట్) సంస్థ దేశంలోనే తొలిసారి విద్యుత్‌తో నడిచే డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టనుంది. అశోక్ లేలాండ్ అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీ ద్వారా దశలవారీగా సుమారు 400 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు కొనుగోలు చేయనుంది. ఇప్పటికే తయారీ సంస్థ నుంచి ఓ బస్సును అందుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ బస్సుల కొనుగోలుకు ‘బెస్ట్’కు భారీగా ఆర్థిక చేయూత అందించడంతో సొంతంగా ఆ బస్సులను కొనుగోలు చేస్తోంది. కానీ రాష్ట్రంలో కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం కొత్తగా ఆర్థిక సాయం ఏదీ ప్రకటించనందున అద్దె ప్రాతిపదికపై వాటిని కొనాలని ఆర్టీసీ నిర్ణయించింది. గతంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టే అంశాన్ని ప్రస్తావించడంతో ఆర్టీసీ సిద్ధపడ్డ విషయం తెలిసిందే. అప్పట్లో సాధారణ డబుల్ డెక్కర్ బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలవగా అశోక్ లేలాండ్ కాంట్రాక్టు దక్కించుకుంది. కానీ నిధుల సమస్యతో దాన్ని రద్దు చేశారు. అప్పట్లో పురపాలక శాఖ నుంచి ఆర్టీసీకి రూ. 9 కోట్లు విడుదల చేయబోతున్నారన్న అంశం కూడా తెరపైకి వచ్చినా ఆ నిధులు అందలేదని తెలిసింది. దీంతో దేశంలోనే తొలిసారి అద్దెకు డబుల్ డెక్కర్ బస్సులు తీసుకునే సంస్థగా నిలిచిపోనుంది. 3 రూట్లలో బస్సులు! పటాన్చెరు–కోఠి (218), జీడిమెట్ల–సీబీఎస్ (9ఎక్స్), అఫ్జల్‌గంజ్–మెహిదీపట్నం (118) రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులు తిప్పొచ్చని ఆర్టీసీ అధికారులు అధ్యయనంలో తేల్చారు. ఇప్పుడు తీసుకొనే 10 బస్సులను ఈ రూట్లలోనే తిప్పుతారని చెబుతున్నారు. ఫ్లైఓవర్ల సమస్య లేని రూట్లు అయినందున వాటిని ఎంపిక చేసినట్లు పేర్కొంటున్నారు. కానీ మెహిదీపట్నం మార్గంలో ఎన్ఎండీసీ వద్ద భారీ ఫుట్ఓవర్ బ్రిడ్జి ఉండటంతో ఆ సమస్యను అధికారులు ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది. -
నెరవేరిన చిరకాల స్వప్నం
ఇది 21వ శతాబ్దం. ఆధునికత, సాంకేతికతల సమ్మేళనంతో వాహన రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. విమాన, రైలు ప్రయాణాలు తప్పించి, రోడ్డు మీద తిరుగాడే అన్ని వాహనాలకు ఇప్పటివరకు పెట్రోలు / డీజిలు విని యోగమే అధికంగా జరుగుతున్నది. కాగా, ఇటీవలి కాలంలో ఈ పెట్రోలు / డీజిలు ధరలు గరిష్ఠంగా పెరిగి ప్రభుత్వాలకు, ప్రజలకు ఆర్థికంగా పెనుభారంగా మారాయి. వీటికి ప్రత్యామ్నాయ ఆలోచనే విద్యుత్ వాహనాలను ప్రవేశ పెట్టాలనుకోవడం. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీని రాష్ట్ర పురోభివృద్ధికి ఉపయోగపడేలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. దశల వారీగా రాష్ట్రంలో ‘ఈవీ’ల వినియోగాన్ని ప్రోత్సహించి, పర్యావరణ పరిరక్షణకు తన వంతు కర్తవ్యాన్ని పూర్తి స్థాయిలో చేపడుతున్నది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలతో అనేక ప్రయోజనాలు సమకూరుతాయి. ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత సమర్థంగా పని చేస్తాయి. డీజిల్, పెట్రోలు వాహనాలతో పోలిస్తే, తక్కువ నిర్వహణ ఖర్చులు కలిగి ఉంటాయి. డీజిల్ / పెట్రోలుతో పోల్చినప్పుడు విద్యుత్ ఇంధన ఆదా గణనీయంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలు సురక్షితమైనవి, నమ్మదగినవి. ఇతర సాంకేతికతలకు సమానమైన సమయ వ్యవధిని కలిగి ఉంటాయి. వాటి నిశ్శబ్ద, మృదువైన పయనం ప్రయాణికులు విశ్రాంతి తీసు కోవడానికి అనువుగా ఉంటుంది. డీజిల్ / పెట్రోలు ఇంజిన్ లేకపోవడం వల్ల శబ్ద కాలుష్యం తగ్గుతుంది. డీజిల్/ పెట్రోలు వాహనాల వల్ల గాలిలోకి హానికర ఉద్గారాలు విడుదలై ప్రజలకు... ముఖ్యంగా పిల్లలకు ఉబ్బసం, ఊపిరితిత్తుల సమస్యలు వంటివి తలñ త్తుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈవీలు ఇప్పటికీ వాటి సంప్రదాయ ప్రత్యర్థుల కంటే తక్కువ ఉద్గారాలు, తక్కువ గ్లోబల్ వార్మింగ్లతో వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ఈ విద్యుత్ వాహనాల వినియోగంతో ప్రజా రవాణా శక్తి పెరుగుతుంది. పర్యావరణాన్ని దెబ్బతీసే హానికరమైన కార్బన్ డయాక్సైడ్ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు తగ్గుతాయి. ఎలక్ట్రిక్ డ్రైవింగ్ నుండి ఒక కిలో మీటరుకు వచ్చే ఉద్గారాలు పెట్రోల్ లేదా డీజిల్ డ్రైవింగ్ వల్ల విడుదలయ్యే ఉద్గారాల కంటే చాలా తక్కువ. అలాగే, పవర్ స్టేషన్ (ఛార్జింగ్ స్టేషన్) ఉద్గారాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు కూడా ఇది నిజం. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి చాలా ఉత్సాహ పూరితమైన వాతావరణం ఉన్నప్పటికీ, అధిక కొనుగోలు ధరలు, కొత్త ఛార్జింగ్ స్టేషన్ల స్థాపన వంటి కొన్ని ఆర్థ్ధికపరమైన భారాలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే, ఈ సవాళ్లు తొలిదశలోనే వుంటాయి. తదనంతరం ప్రత్యామ్నాయ మార్గాలూ వుంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు ఆశాజనకమైన భవిష్యత్తు ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వ స్ఫూర్తితో ప్రజలకు, ప్రయా ణికులకు తన వంతు కర్తవ్యంగా ఈ విద్యుత్ బస్సుల వినియోగానికి ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం చుడుతున్నది. ఇటీవలి కాలంలో రవాణా రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే, ప్రజా రవాణాలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఎన్నో చర్యలు చేపట్టినది. సాధారణమైన ఎర్ర బస్సు స్థాయి నుంచి, క్రమేపీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, ఏసీ, చివరగా అత్యున్నత స్థాయి ఏసీ స్లీపర్ బస్సుల స్థాయి వరకు ఎదిగి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలో కూడా వాసికెక్కి, ప్రయాణికుల మన్ననలు పొంది, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు పొందుతున్నది కూడా. ప్రస్తుతం తలపెట్టిన ఈవీల వాడకం ఈ సంస్థ కిరీటంలో మరో కలికి తురాయి కానున్నది. మొదటి దశలో 100 ఎలక్ట్రిక్ బస్సులను పవిత్ర నగరమైన తిరుపతి – తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాలలో నడపటానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ విద్యుత్ బస్సుల వల్ల ప్రయాణికులకు ఆహ్లాదకరమైన ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. అంటే శబ్దం, కాలుష్యం లేని ప్రశాంత ప్రయాణమన్న మాట. ఈవీలకు చార్జింగ్ చేసే విద్యుత్ ఛార్జీల పెరుగుదలతో పోలిస్తే పెట్రోలు, డీజిల్ ధర పెరుగుదల ఎక్కువ. ఈవీ బ్యాటరీ ధర క్రమంగా తగ్గుతూ ఉండటం గమనించవచ్చు. అలాగే కాపెక్స్ మోడల్‌తో పోల్చి నప్పుడు ఈవీల ఆపరేషన్ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఈవీలను సమకూర్చుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ అనేక సంవత్సరాలుగా యోచిస్తున్నది. పైన పేర్కొన్న విస్తృత ప్రయో జనాలు, ప్రస్తుత ప్రభుత్వ సహకారం వల్ల, ఇన్నాళ్ళకు ఈ చిరకాల స్వప్నం నెరవేరబోతున్నది. ఇందువల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుంది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరింత చేరువ అయ్యే అవకాశంగా దీన్ని భావిస్తున్నది. సీహెచ్ ద్వారకా తిరుమల రావు వ్యాసకర్త ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ -
అలిపిరిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
తిరుమల–తిరుపతిలో ఈ–బస్సులు
సాక్షి, అమరావతి: ప్రజా రవాణా రంగంలో సరికొత్త అధ్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలుకుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల–తిరుపతిని కేంద్రంగా చేసుకుని తొలిసారిగా ఎలక్ట్రికల్ బస్సు (ఈ–బస్)లను ఆర్టీసీ ప్రవేశపెడుతోంది. తిరుమల, తిరుపతిలలో 100 ఈ–బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈవే ట్రాన్స్ లిమిటెడ్ సంస్థ సరఫరా చేసిన ఈ–బస్‌ను ఆర్టీసీ ఇప్పటికే విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది. మరో 9 ఈ–బస్సులను మంగళవారం ఉదయానికి తిరుపతికి తీసుకురానుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలుత 10 ఈ–బస్సులను మంగళవారం సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అనంతరం దశల వారీగా డిసెంబర్ నాటికి 100 ఈ–బస్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. తిరుమల ఘాట్ రోడ్డులో 50 బస్సులు.. అలిపిరి బస్ డిపో కేంద్రంగా ఆర్టీసీ వీటిని నడపనుంది. కాంట్రాక్టు దక్కించుకున్న ఈవే ట్రాన్స్ లిమిటెడ్ కంపెనీ వీటిని 12 ఏళ్ల పాటు నిర్వహించనుంది. 50 బస్సులను తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డు సర్వీసుల కోసం కేటాయించారు. అలాగే, రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు 14 బస్సులు, తిరుపతి నుంచి మదనపల్లికి 12, తిరుపతి నుంచి నెల్లూరుకు, కడపకు 12 సర్వీసుల చొప్పున నిర్వహించాలని నిర్ణయించారు. కాలుష్య నియంత్రణ జీరో కర్బన ఉద్గారాలను వెదజల్లే వీటితో కాలుష్యాన్ని నియంత్రించవచ్చని అధికారులు చెబుతున్నారు. 100 ఈ–బస్సులవల్ల ఏటా 5,100 మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయంటున్నారు. ఏసీ ఇంద్ర బస్సుకు కిలోమీటర్‌కు రూ.28.75 ఇంధన వ్యయం అవుతుండగా.. ఎలక్ట్రికల్ బస్వల్ల కిలోమీటర్‌కు కేవలం రూ.7.70 ఖర్చే అవుతుంది. రానున్న రోజుల్లో ‘ఈవీ’ బ్యాటరీల ధరలు తగ్గనుండటంతో నిర్వహణ వ్యయం మరింతగా తగ్గుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. -
అలిపిరి బస్ డిపోకు మొదటి దశలో 50 ఎలక్ట్రిక్ బస్ లు
-
ఈ–బస్.. ట్రయల్ రన్ సక్సెస్!
తిరుపతి అర్బన్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలను కేంద్రంగా చేసుకుని ఎలక్ట్రికల్ బస్సులను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి ఈ–బస్ ట్రయల్ రన్‌ను సోమవారం అధికారులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ– బస్సును తిరుపతి అలిపిరి డిపో నుంచి తిరుమలకు రెండు సార్లు నడిపారు. ఈ ట్రయల్ రన్ విజయవంతం అయినట్లు ఆర్టీసీ కడప ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) గోపినాథ్‌రెడ్డి తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈ– బస్సులను వినియోగంలోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. కాగా, బస్సు పనితీరును పరిశీలించడానికి విజయవాడ నుంచి ఆర్టీసీకి చెందిన ప్రత్యేక కమిటీ సభ్యులు రవివర్మ, చంద్రశేఖర్, సుధాకర్, వెంకటరత్నం తిరుపతికి వచ్చారు. అనంతరం ఈ–బస్సు సర్వీస్‌ను తిరుపతి ఐఐటీకి చెందిన ప్రొఫెసర్లు శ్రీరామసుందర్, విఘ్నేష్ పరిశీలించారు. బస్సు కండీషన్‌పై వారు నివేదిక ఇచ్చిన తర్వాత రెండు మూడు రోజుల్లో మరో 10 ఎలక్ట్రికల్ బస్సులు అలిపిరి డిపోకు చేరుకోనున్నాయి. అలిపిరి నుంచి తిరుమలకే కాకుండా ఇతర ప్రాంతాలకూ ఈ– బస్సులు అందుబాటులోకి రానున్నాయని గోపినాథ్‌రెడ్డి చెప్పారు. ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటాయని, బ్రహ్మోత్సవాల్లో ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. -
ఒలెక్ట్రాకు 123 ఈ–బస్‌ల ఆర్డర్.. ఏడు కోట్ల కిలోమీటర్ల ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, ఈవీ ట్రాన్స్ కన్సార్షియం తాజాగా 123 ఎలక్ట్రిక్ బస్‌ల సరఫరాకై లెటర్ ఆఫ్ అవార్డును అందుకుంది. థానే మున్సిపల్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్ నుంచి దీనిని చేజిక్కించుకుంది. ఆర్డర్ విలువ రూ.185 కోట్లు అని ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. ఈవీ ట్రాన్స్ ఈ ఎలక్ట్రిక్ బస్‌లను ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నుండి కొనుగోలు చేసి 9 నెలల్లో డెలివరీ చేయనుంది. లిథియం అయాన్ బ్యాటరీని బస్‌లకు పొందుపరిచారు. నాలుగు గంటల్లో చార్జింగ్ పూర్తి అవుతుంది. మహారాష్ట్రలో ఇప్పటికే కంపెనీ తయారీ బస్‌లు ముంబై, పుణే, నాగ్‌పూర్‌లో పరుగెడుతున్నాయి. ఒలెక్ట్రా ఈ–బస్‌లు దేశవ్యాప్తంగా ఏడు కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయని కంపెనీ తెలిపింది. చదవండి: బీఎస్ఎన్ఎల్ చవకైన ప్లాన్.. రూ.275 ప్లాన్‌తో 3300జీబీ.. ఆఫర్ లాస్ట్ డేట్ ఇదే! -
మనకూ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్లు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర రోడ్లపై ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను నడిపేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోనే తొలిసారి ముంబైలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్లు గురువారం రోడ్డెక్కిన నేప థ్యంలో వాటిని రూపొందించిన అశోక్ లేలాండ్ అను బంధ సంస్థ స్విచ్ మొబిలిటీతోపాటు మరో 2 కంపె నీలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరుపుతోంది. ఇందులో ఓ కంపెనీతో చర్చలు దాదాపు కొలిక్కి వస్తు న్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైదరాబాద్‌లో 20–25 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిప్పాలని నిర్ణయించిన ఆర్టీసీ... ధర విషయంలో స్పష్టత రాగానే ఆర్డర్ ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలోనే టెండర్లు: హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులను పునఃప్రారంభించే విషయమై మంత్రి కేటీఆర్ చేసిన సూచనకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సానుకూలంగా స్పందించడంతో కొత్త డబుల్ డెక్కర్ బస్సులు కొనాలని గతేడాది నిర్ణయించారు. ఈ మేరకు టెండర్లు కూడా పిలిచారు. కానీ కొత్త బస్సులు కొనేందుకు నిధుల్లేకపోవడంతో ఆర్టీసీ చేతులెత్తేసింది.అయితే ఇది కేటీఆర్ ప్రతిపాదన కావడంతో పురపాలక శాఖ ఆర్థిక సాయం చేస్తుందన్న అంశం తెరపైకి వచ్చినా అది సాకారం కాలేదు. ఆర్టీసీకి భారమే..:ముంబైలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు ధర రూ.2 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ సాయం లేకుండా ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం ఆర్టీసీకి తలకుమించిన భారమే. మరోవైపు డబుల్ డెక్కర్ బస్సుపై రెండు షిఫ్టుల్లో కలిపి ఆరుగురు సిబ్బంది పని చేయాలి. గతంలో డబుల్ డెక్కర్ బస్సులతో తీవ్ర నష్టాలు రావడం వల్లే వాటిని తప్పించారు. ఇప్పుడు కూడా వాటితో నష్టాలు తప్పవన్నదే ఆర్టీసీ నివేదిక చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సాయంకోసం ఆర్టీసీ యత్నిస్తోంది. మరోవైపు నగరంలోని చాలా మార్గాల్లో ఫ్లైఓవర్లు ఉన్నందున డబుల్ డెక్కర్ బస్సులను తిప్పడం కూడా ఇబ్బంది కానుంది. ఈ నేపథ్యంలో త్వరలో ఓ అధికారుల బృందం ముంబై వెళ్లి అక్కడ ఫ్లైఓవర్ల సమస్యను అధిగమించి డబుల్ డెక్కర్ బస్సులను ఎలా తిప్పుతున్నారో అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. -
టాటా మోటార్స్‌కు జాక్ పాట్!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ జాక్ పాట్ కొట్టేసింది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) టాటా మోటార్స్ నుండి 921 ఎలక్ట్రిక్ బస్సులను లీజుకు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఒప్పందం ప్రకారం.. టాటా మోటార్స్ 12 ఏళ్ల పాటు ఎలక్ట్రిక్ కార్ల తయారీ,వాటి నిర్వహణ చూసుకోనుంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలో కార్యకలాపాలు నిర్వహించే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్)..బీఎంటీసీ కోసం ఎలక్ట్రిక్ బస్సుల తయారీ, వాటి నిర్వహణకోసం ఆటోమొబైల్ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించగా..ఆ టెండర్‌ను టాటా దక్కించుకుంది. ఈ సందర్భంగా స్వచ్ఛమైన, సుస్థిరమైన పట్టణ ప్రజా చైతన్యానికి బెంగళూరు పెరుగుతున్న అవసరానికి ఈ ఆర్డర్ అత్యంత కీలకమైందని బీఎంటీసీ మేనేజింగ్ డైరెక్టర్ జి.సత్యవతి తెలిపారు. 'గ్రాండ్ ఛాలెంజ్ ఆఫ్ సీఈఎస్ఎల్' కింద ఎలక్ట్రిక్ బస్సుల కోసం బీఎంటీసీ ఆర్డర్ ఇచ్చిందని సీఈఎస్ఎల్ సీఈవో మహువా ఆచార్య పేర్కొన్నారు. అదే సమయంలో, టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ బస్సుల కోసం అనేక రాష్ట్ర రవాణా సంస్థ నుండి ఆర్డర్లను అందుకుంది. గత 30 రోజుల్లో ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ నుంచి 1,500 ఎలక్ట్రిక్ బస్సులు, పశ్చిమ బెంగాల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి 1,180 ఎలక్ట్రిక్ బస్సులకు టాటా మోటార్స్ ఆర్డర్ దక్కించుకుంది. -
ఒలెక్ట్రాకు 300 బస్‌ల ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ బస్‌ల తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తాజాగా 300 బస్‌లకు ఆర్డర్ దక్కించుకుంది. డీల్ విలువ రూ.500 కోట్లు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు (టీఎస్ఆర్టీసీ) 20 నెలల్లో బస్‌లు చేరనున్నాయి. ఇప్పటికే మూడేళ్లుగా హైదరాబాద్ రోడ్లపై సంస్థ తయారీ ఈ–బస్‌లు విజయవంతంగా పరుగెడుతున్నాయని ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేమ్–2 పథకంలో భాగంగా 300 ఈ–బస్‌ల సరఫరా ఆర్డర్‌ను టీఎస్ఆర్టీసీ నుంచి ఈవీ ట్రాన్స్ చేజిక్కించుకుంది. ఈవీ ట్రాన్స్ ఈ బస్‌లను ఒలెక్ట్రా నుంచి కొనుగోలు చేసి టీఎస్ఆర్టీసీకి అందజేస్తుంది. ఒలెక్ట్రాతోపాటు, ఈవీ ట్రాన్స్‌ను మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) ప్రమోట్ చేస్తోంది. -
ఆర్టీసీకి 300 నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: అడ్డగోలుగా పెరిగిన డీజిల్ ధరలు బెంబేలెత్తిస్తున్న సమయంలో ఆర్టీసీకి కాస్త ఉపశమనం కలగనుంది. కేంద్ర ప్రభుత్వం ‘ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఫేమ్)–2’ పథకం కింద తెలంగాణ ఆర్టీసీకి 300 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసింది. వాటిని గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) పద్ధతిలో ఆర్టీసీకి అద్దెకు ఇస్తారు. ఈ బస్సుల కాంట్రాక్టు పొందిన సంస్థకు ఆర్టీసీ ప్రతి కిలోమీటర్‌కు రూ.41.58 చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం డీజిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు కిలోమీటర్‌కు రూ.60కిపైగా ఖర్చవుతున్నట్టు ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. అదే ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తే ఖర్చు గణనీయంగా తగ్గుతుందని అంటున్నాయి. తొలి విడతగా వచ్చే మార్చి నాటికి 150 బస్సులు ఆర్టీసీకి అందనున్నాయి. మిగతావి ఆ తర్వాత రానున్నాయి. నాన్ ఏసీ బస్సుల కోసం పట్టుబట్టి.. గతంలో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద హైదరాబాద్‌కు 80 ఏసీ డీజిల్ బస్సులు రాగా.. వాటిని వివిధ మార్గాల్లో తిప్పారు. ఏసీ బస్సులు కావటంతో టికెట్ ధరలు ఎక్కువగా ఉండేవి. జనం ఎక్కేందుకు జంకటంతో ఖాళీగా తిరిగి ఆర్టీసీకి నష్టాలు పెంచాయి. వాటిలో ఇతర పట్టణాలకు కొన్ని, ఎయిర్‌పోర్టుకు కొన్నింటిని నడుపుతున్నారు. తర్వాత ఫేమ్–1 పథకం కింద 40 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. అవికూడా ఏసీ బస్సులు కావడంతో విమానాశ్రయానికి, నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య తిప్పుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఫేమ్–2’ పథకం కింద నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు కావాలని ఆర్టీసీ కోరింది. ఓ ప్రైవేట్ తయారీ సంస్థ మళ్లీ ఏసీ బస్సులే మంజూరయ్యేలా చక్రం తిప్పినా.. చివరకు ఆర్టీసీ పట్టే నిలిచింది. 300 నాన్ ఏసీ బస్సులను కేంద్రం మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) అనుబంధ సంస్థ అయిన ‘కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్)’ ఈ ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయనుంది. ప్రస్తుతం విమానాశ్రయానికి తిప్పుతున్న ఎలక్ట్రిక్ బస్సులను జీసీసీ పద్ధతిలోనే అద్దెకు తీసుకున్నారు. ఒలెక్ట్రా కంపెనీ వాటిని తిప్పుతోంది. రోజూ 300 కిలోమీటర్ల పైబడి తిరిగే బస్సులకు కి.మీ.కి రూ.33.80 చొప్పున.. అంతకన్నా తక్కువ తిరిగే బస్సులకు కి.మీ.కి రూ.38 చొప్పున ఆర్టీసీ అద్దె చెల్లిస్తోంది. బ్యాటరీ చార్జింగ్ ఖర్చుల కింద ఒక్కో కి.మీ.కి రూ.6 ఖర్చవుతోంది. కొత్తగా రానున్న నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులకు చార్జింగ్ ఖర్చుతో కలిపి ఒక్కో కి.మీ.కి రూ.41.58 అద్దె చెల్లించనున్నారు. బస్సులను నిర్వహించే ప్రైవేటు సంస్థనే డ్రైవర్లను ఏర్పాటు చేస్తుంది. కండక్టర్లు మాత్రం ఆర్టీసీ నుంచి ఉంటారు. -
రీమోడల్ ప్రయోగం సక్సెస్
చిత్తూరు రూరల్: ఆర్టీసీ బస్సు రీ మోడల్ ప్రయోగం ఫలించింది. చిత్తూరు–2 డిపోకు చెందిన బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మార్పు చేశారు. ఇందుకు రూ.72 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. 2 గంటలు చార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు పరుగులు పెట్టనుంది. డీజిల్ భారం ఆర్టీసీకి పెద్ద తలనొప్పిగా మారింది.ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రిక్ బస్సుగా మార్పు చేయాలని భావించి.. రెండేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని వీర వాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఈ బాధ్యతను అప్పగించింది. అన్ని పనులు పూర్తయ్యాక విజయవాడకు చెందిన ఆర్టీసీ టీమ్ ఆ ఎలక్ట్రిక్ బస్సును పరీక్షించింది. అనంతరం బస్సును చిత్తూరు–2 డిపోకు తీసుకొచ్చారు. బస్సు ప్రత్యేకతలు ఇవే... చిత్తూరు–2 డిపో గ్యారేజీకి గత వారం ఈ బస్సు చేరింది. ఇందులో ఆరు హెవీ డ్యూటీ బ్యాటరీలు ఉన్నట్లు గుర్తించారు. ఈ బ్యాటరీల చార్జింగ్కు 1.30 నుంచి 2 గంటల సమయం తీసుకుంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 180 నుంచి 200 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఈ బస్సు గేర్ సహాయం లేకుండా స్విచ్ టైప్‌తో ఆటోమెటిక్‌గా నడుస్తుంది. గంటకు 80 కి.మీ వేగంతో నడిచేలా తీర్చిదిద్దారు. ఎలక్ట్రిక్ మోటార్‌తో చక్కటి స్టీరింగ్‌ను ఏర్పాటు చేశారు. పాత పద్ధతిలో బ్రేక్ సిస్టం, డ్రైవర్‌కు సౌకర్యార్థంగా డాష్‌బోర్డును బిగించారు. దీని ద్వారా బ్యాటరీ పరిస్థితి, బస్సు ఏ గేర్‌లో వెళుతోంది.. అనే విషయాలను తెలుసుకునే వీలుంది. ఇక బస్సు కింద భాగంలో అమర్చిన పరికరాలు వర్షానికి తడవకుండా అల్యూమినియంతో పూర్తిగా కప్పేశారు. తిరుపతి–తిరుమల మార్గంలో.. కొత్తగా రూపుదిద్దుకున్న ఎలక్ట్రిక్ బస్సును తిరుపతి–తిరుమల మార్గంలో తిప్పనున్నారు. ఈ క్రమంలో అలిపిరి వద్ద చార్జింగ్ స్టేషన్ పనులు జరుగుతున్నాయి. అలాగే తిరుపతి బస్టాండులో కూడా ఒక చార్జింగ్ పాయింట్ పెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని పరీక్షలు పూర్తయిన తరువాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బండిని రోడ్డుపైకి తీసుకొస్తారని సమాచారం. డ్రైవర్‌కు అనుకూలమైన బస్సు. గేర్లు లేకుండా నడపవచ్చు. బ్యాటరీ, మోటార్ సాయంతో వెళుతుంది. ఈ బస్సుతో డీజిల్ భారం తగ్గనుంది. పొగ రాదు.. వాయు కాలుష్యం ఉండదు. – ఇబ్రహీం, డిప్యూటీ సీఎంఈ, చిత్తూరు -
భారత్ కోసం ప్రత్యేక ఎలక్ట్రిక్ బస్సులు
భారత మార్కెట్ కోసం తయారు చేసిన 12ఎం ఎలక్ట్రిక్ బస్సును స్విచ్ మొబిలిటీ సంస్థ ఆవిష్కరించింది. అలాగే, బ్రిటన్‌లో కొత్తగా టెక్నికల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ ధీరజ్ హిందుజా తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాణిజ్య వాహనాలు మొదలైన వాటి తయారీపై భారత్, బ్రిటన్‌లో 300 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 2,980 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు స్విచ్ మొబిలిటీ వెల్లడించింది. తద్వారా 4,000 మంది పైచిలుకు నిపుణులకు ఉద్యోగాల కల్పన చేయనున్నట్లు పేర్కొంది. చదవండి: హోండా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ -
పుణె రోడ్స్ మీద 150 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు సందడి..!
-
పుణె రోడ్స్ మీద 150 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు సందడి..!
పూణే: హైదరాబాద్ నగరానికి చెందిన ఒలెక్ట్రా గ్రీన్ కంపెనీ తయారు చేసిన 150 ఎలక్ట్రిక్ బస్సులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అంతేకాకుండా, పూణేలోని బనర్ ప్రాంతంలో నిర్మించిన అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్ డిపో, ఛార్జింగ్ స్టేషన్ కేంద్రాన్ని కూడా మోడీ ఒక కార్యక్రమంలో ప్రారంభించినట్లు ఈ-బస్సుల తయారీసంస్థ ఒలెక్ట్రా గ్రీన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒలెక్ట్రా ప్రస్తుతం పూణే మహానగర్ పరివర్తన్ మహామండల్ లిమిటెడ్(పిఎమ్ పిఎంఎల్) కోసం నగరంలో 150 ఈ-బస్సులను నడుపుతోంది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్'లో భాగమైన ఈ సంస్థ పూణేతో పాటు సూరత్, ముంబై, సిల్వాస్సా, గోవా, నాగ్ పూర్, హైదరాబాద్, డెహ్రాడూన్ నగరాలలో తన సేవలను అందిస్తుంది. ఈ బస్సుల పట్ల మెట్రో నగరాల్లోని ప్రయాణికుల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నట్లు రవాణా సంస్థలు తమకు తెలిపాయని సంస్థ పేర్కొంది. "పూణే నగరంలో ప్రస్తుతం నడుస్తున్న 150 బస్సులకు మరో 150 ఎలక్ట్రిక్ బస్సులను జోడించడం ఒలెక్ట్రాకు గర్వంగా ఉంది. సమర్థవంతమైన ఎలక్ట్రిక్ ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఒలెక్ట్రా కట్టుబడి ఉంది" అని ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కెవి ప్రదీప్ తెలిపారు. ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సు ఛార్జ్‌కి 250-300 కిలోమీటర్ల అద్భుతమైన పరిధిని అందిస్తుంది. Olectra C9 3000 ఎన్ఎమ్ టార్క్, 480 బీహెచ్ పి పవర్ ఉత్పత్తి చేయగలవు. ఇవి రెండు 180 kW లిథియం-అయాన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా శక్తిని పొందుతాయి. ఇందులో లభించే ఫాస్ట్ ఛార్జింగ్‌తో 2-3 గంటల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇందులో ఒకేసారి 45-49 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. సుదూర ప్రయాణానికి ఇది సరైన బస్సు. ప్రయాణికుల భద్రత కోసం సీసీటివి కెమెరాలను కూడా ఉన్నాయి, ప్రతి సీటుకు అత్యవసర బటన్, యుఎస్బి సాకెట్ కూడా ఉంది. (చదవండి: ఆహా! ఏమి అదృష్టం.. పెట్టుబడి రూ.లక్ష లాభం రెండున్నర కోట్లు)