
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అనుబంధ కంపెనీలైన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, ఈవీ ట్రాన్స్‌ల కన్సార్షియం భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు (ఎంఎస్‌ఆర్‌టీసీ) 5,150 ఎలక్ట్రిక్ బస్‌లను 24 నెలల్లో సరఫరా చేయాల్సి ఉంటుంది.
డీల్ విలువ సుమారు రూ.10,000 కోట్లు అని ఒలెక్ట్రా శుక్రవారం ప్రకటించింది. ఒలెక్ట్రా నుంచి ఈ ఎలక్ట్రిక్ బస్‌లను ఈవీ ట్రాన్స్ కొనుగోలు చేసి ఎంఎస్‌ఆర్‌టీసీకి అందిస్తుంది. కాగా, భారీ ఆర్డర్ నేపథ్యంలో ఒలెక్ట్రా షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్‌ఈలో శుక్రవారం 18.02% ఎగసి రూ.1,231.35 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment