Olectra Green
-
ఒలెక్ట్రాకు రూ.10,000 కోట్ల ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనుబంధ కంపెనీలైన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, ఈవీ ట్రాన్స్‌ల కన్సార్షియం భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కు (ఎంఎస్ఆర్టీసీ) 5,150 ఎలక్ట్రిక్ బస్‌లను 24 నెలల్లో సరఫరా చేయాల్సి ఉంటుంది. డీల్ విలువ సుమారు రూ.10,000 కోట్లు అని ఒలెక్ట్రా శుక్రవారం ప్రకటించింది. ఒలెక్ట్రా నుంచి ఈ ఎలక్ట్రిక్ బస్‌లను ఈవీ ట్రాన్స్ కొనుగోలు చేసి ఎంఎస్ఆర్టీసీకి అందిస్తుంది. కాగా, భారీ ఆర్డర్ నేపథ్యంలో ఒలెక్ట్రా షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో శుక్రవారం 18.02% ఎగసి రూ.1,231.35 వద్ద స్థిరపడింది. -
లాభాల్లో దూసుకెళ్తున్న ఒలెక్ట్రా - ఆదాయం అక్షరాలా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 376 కోట్ల ఆదాయం (కన్సాలిడేటెడ్)పై రూ. 27 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఆదాయం రూ. 271 కోట్లుగా, లాభం రూ. 18 కోట్లుగా నమోదైంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం 84 శాతం ఎగిసి రూ. 594 కోట్ల నుంచి రూ. 1,091 కోట్లకు చేరింది. నికర లాభం 86 శాతం వృద్ధితో రూ. 35 కోట్ల నుంచి రూ. 66 కోట్లకు పెరిగింది. 2021–22లో 259 ఎలక్ట్రిక్ బస్సులు డెలివరీ చేయగా, 2022–23లో 117 శాతం అధికంగా 563 ఈ–బస్సులను అందించినట్లు సంస్థ తెలిపింది. మొత్తం 3,394 బస్సుల కోసం ఆర్డర్లు ఉన్నట్లు వివరించింది. ఎలక్ట్రిక్ టిప్పర్లను కూడా విక్రయించడం ప్రారంభించామని, క్యూ4లో 17 వాహనాలను డెలివరీ చేశామని పేర్కొంది. సరఫరా వ్యవస్థ, స్థూల పరిస్థితులపరమైన రిస్కులు నెలకొన్నప్పటికీ తాము తయారీ, సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సీఎండీ కె.వి. ప్రదీప్ తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల విభాగంలో అగ్రగామిగా కొనసాగేందుకు ఇది తోడ్పడుతోందని ఆయన పేర్కొన్నారు. -
ఒలెక్ట్రా జోరు.. కేఎస్ఆర్టీసీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తాజా గా కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు(కేఎస్ఆర్టీసీ) 25 ఈ–బస్‌లను సరఫరా చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై విధానసౌధ ఆవరణలో ఈ బస్సులను సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కంపెనీ తయారీ బస్‌లు సేవలు అందిస్తున్నాయని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. 1,100 పైగా ఈ–బస్‌లు 10 కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయని చెప్పారు. -
టీఎస్ఆర్టీసీలోకి ఎలక్ట్రిక్ బస్సులు.. దక్షిణ భారత్‌లో అతి పెద్ద ఆర్డర్: ఒలెక్ట్రా
భారతదేశం అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది, ఈ క్రమంలో దేశంలో వినియోగించే వాహనాలు కూడా మారుతున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్, సిఎన్జి వాహనాలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడానికి ముందడుగు వేసింది. ఇటీవల ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ సంస్థకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏకంగా 550 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 50 ఇంటర్సిటీ, 500 ఇంట్రాసిటీ బస్సులు ఉన్నాయి. ఇది దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద ఆర్డర్ అని కంపెనీ మేనేజింగ్ డైరక్టర్ కె.వి.ప్రదీప్ తెలిపారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్నెట్ లిమిటెడ్ అందించే ఇంటర్సిటీ బస్సులు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు, ఇంట్రాసిటీ బస్సులు నగరంలో తిరగనున్నాయి. ఇంటర్సిటీ బస్సులు ఒక ఛార్జ్‌తో 325 కిలోమీటర్లు, ఇంట్రాసిటీ బస్సులు 225 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయని కంపెనీ తెలిపింది. (ఇదీ చదవండి: చైనా ఉత్పత్తులకు బ్రేక్! హోలీ వేళ భారతీయులంతా..) 2025 మార్చి నాటికి హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు విరివిగా అందుబాటులోకి వస్తాయని TSRTC ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. అంతే కాకుండా రానున్న రోజుల్లో మూడు వేలకంటే ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు వినియోగంలోకి రానున్నట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. భాగ్యనగరంలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, కార్యకలాపాల కోసం టీఎస్ఆర్టీసీ జంటనగరాల్లో ఐదు డిపోలను కేటాయించినట్లు ప్రస్తావించారు. -
ఇక ఒలెక్ట్రా ఈ–టిప్పర్స్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ భారత్‌లో తొలిసారిగా తయారు చేసిన 6్ఠ4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్స్కు హోమోలోగేషన్ ధ్రువీకరణ లభించింది. ఆటోమోటివ్ రీసర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ సర్టిఫికెట్ సాధించింది. రహదారులకు టిప్పర్ అనువైనదో లేదో తెలుసుకునేందుకు పర్వత ప్రాంతాలు, ఎత్తయిన ప్రదేశాలు, మైనింగ్, క్వారీల్లో పరీక్షలు చేసి ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. దేశంలోనే మొట్టమొదటి సర్టిఫైడ్ హెవీ డ్యూటీ ఈ–టిప్పర్గా ఇది నిలిచిందని ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. 20 ఈ–టిప్పర్ల సరఫరాకై ఒక సంస్థతో చర్చలు తుది దశలో ఉన్నాయని చెప్పారు. వివిధ వేరియంట్లలో ఈ వాహనాన్ని విడుదల చేస్తామన్నారు. నిర్మాణం, మౌలిక సదుపాయాలు, మైనింగ్, క్వారీ రంగాల్లో ఇది గణనీయమైన మార్పును తేనుందని వివరించారు. -
హైడ్రోజన్‌తో నడిచే బస్.. త్వరలో భారత్ రోడ్ల పైకి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు (ఎంఈఐఎల్) చెందిన ఎలక్ట్రిక్ వాహన రంగ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ హైడ్రోజన్‌తో నడిచే బస్‌ను తయారు చేసింది. రిలయన్స్ భాగస్వామ్యంతో ఈ వాహనాన్ని రూపొందించినట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ఏడాదిలోగా వాణిజ్యపరంగా వీటి ఉత్పత్తి ప్రారంభించాలని ఒలెక్ట్రా లక్ష్యంగా చేసుకుంది. పూర్తి ఇంధన సామర్థ్యంతో 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించడం బస్ ప్రత్యేకత. బస్ పైభాగంలో టైప్–4 హైడ్రోజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. 12 మీటర్ల పొడవు ఉన్న ఈ బస్సులో డ్రైవర్ సీటు కాకుండా ప్రయాణికులకోసం 32–49 సీట్లు ఏర్పాటు చేయవచ్చు. హైడ్రోజన్ నింపడానికి 15 నిమిషాలు పడుతుంది. (ఇదీ చదవండి: సింథటిక్ వజ్రాల ల్యాబ్.. ఎక్కడో తెలుసా?) -
ఒకసారి చార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు.. భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ ట్రక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు (ఎంఈఐఎల్) చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ ట్రక్‌ను ఆవిష్కరించింది. బెంగుళూరు వేదికగా జరిగిన ఇండియా ఎనర్జీ వీక్–2023లో ఈ వాహనం తన సత్తా చాటింది. బ్యాటరీ ఒకసారి చార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయడం టిప్పర్ ప్రత్యేకత. రెండు గంటల్లోనే చార్జింగ్ 100 శాతం అవుతుంది. ఈ–ట్రక్ పనితీరు తెలుసుకోవడానికి కంపెనీ 2022 ఏప్రిల్‌లో ట్రయల్స్ ప్రారంభించింది. ఎంఈఐఎల్ ఎండీ పి.వి.కృష్ణా రెడ్డి, హైడ్రోకార్బన్స్ ప్రెసిడెంట్ రాజేశ్ రెడ్డి, డైరెక్టర్ దొరయ్య ఈ సదస్సుకు హాజరయ్యారు. ఎనర్జీ వీక్–2023లో మేఘా అనుబంధ కంపెనీలు డ్రిల్మెక్ ఇంటర్నేషనల్, పెట్రివెన్ ఎస్పిఏ, మేఘా గ్యాస్, ఐకామ్ పాలుపంచుకున్నాయి. -
ఒలెక్ట్రాకు 123 ఈ–బస్‌ల ఆర్డర్.. ఏడు కోట్ల కిలోమీటర్ల ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, ఈవీ ట్రాన్స్ కన్సార్షియం తాజాగా 123 ఎలక్ట్రిక్ బస్‌ల సరఫరాకై లెటర్ ఆఫ్ అవార్డును అందుకుంది. థానే మున్సిపల్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్ నుంచి దీనిని చేజిక్కించుకుంది. ఆర్డర్ విలువ రూ.185 కోట్లు అని ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. ఈవీ ట్రాన్స్ ఈ ఎలక్ట్రిక్ బస్‌లను ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నుండి కొనుగోలు చేసి 9 నెలల్లో డెలివరీ చేయనుంది. లిథియం అయాన్ బ్యాటరీని బస్‌లకు పొందుపరిచారు. నాలుగు గంటల్లో చార్జింగ్ పూర్తి అవుతుంది. మహారాష్ట్రలో ఇప్పటికే కంపెనీ తయారీ బస్‌లు ముంబై, పుణే, నాగ్‌పూర్‌లో పరుగెడుతున్నాయి. ఒలెక్ట్రా ఈ–బస్‌లు దేశవ్యాప్తంగా ఏడు కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయని కంపెనీ తెలిపింది. చదవండి: బీఎస్ఎన్ఎల్ చవకైన ప్లాన్.. రూ.275 ప్లాన్‌తో 3300జీబీ.. ఆఫర్ లాస్ట్ డేట్ ఇదే! -
ఒలెక్ట్రాకు 100 ఈ–బస్‌ల ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తాజాగా 100 ఈ–బస్‌లకు ఆర్డర్ అందుకుంది. అసోం రోడ్డు రవాణా సంస్థ నుంచి ఈ మేరకు లెటర్ ఆఫ్ అవార్డ్ స్వీకరించింది. డీల్ విలువ రూ.151 కోట్లు అని సంస్థ సీఎండీ కె.వి.ప్రదీప్ ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీ తయారీ ఎలక్ట్రిక్ బస్‌లు ఇప్పటికే దేశవ్యాప్తంగా 5 కోట్లకుపైగా కిలోమీటర్లు ప్రయాణించాయని గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి కంపెనీకి ఇదే తొలి ఆర్డర్. తొమ్మిది నెలల్లో ఈ బస్సులను డెలివరీ చేయనుంది. ఒలెక్ట్రాను మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రమోట్ చేస్తోంది. కాగా, గ్రీన్‌టెక్ సెక్యూరిటీల జారీ ద్వారా రూ.800 కోట్ల వరకు నిధులను సమీకరించడానికి బోర్డ్ ఆమోదం తెలిపిందని ఒలెక్ట్రా పేర్కొంది. -
ఒలెక్ట్రా లాభం 825 శాతం జంప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ జూన్ త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో నికరలాభం 825 శాతం దూసుకెళ్లి రూ.18.8 కోట్లు సాధించింది. ఎబిటా 322 శాతం అధికమై రూ.36.8 కోట్లకు చేరుకుంది. టర్నోవర్ 640 శాతం పెరిగి రూ.305 కోట్లు నమోదైంది. త్రైమాసికంలో 169 ఎలక్ట్రిక్ బస్‌లను సరఫరా చేయడంతో గణనీయమైన ఆదాయ వృద్ధిని సాధించామని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. రానున్న త్రైమాసికాలలో కొత్త ఉత్పత్తి శ్రేణిని పరిచయం చేయడంతోపాటు మరిన్ని విభాగాల్లోకి ప్రవేశిస్తామని చెప్పారు. రోడ్డు రవాణా సంస్థలకు బస్‌ల డెలివరీలను పెంచడంతోపాటు డెలివరీల షెడ్యూల్‌ను పూర్తి చేస్తామని అన్నారు. -
ఒలెక్ట్రాకు 300 బస్‌ల ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ బస్‌ల తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తాజాగా 300 బస్‌లకు ఆర్డర్ దక్కించుకుంది. డీల్ విలువ రూ.500 కోట్లు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు (టీఎస్ఆర్టీసీ) 20 నెలల్లో బస్‌లు చేరనున్నాయి. ఇప్పటికే మూడేళ్లుగా హైదరాబాద్ రోడ్లపై సంస్థ తయారీ ఈ–బస్‌లు విజయవంతంగా పరుగెడుతున్నాయని ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేమ్–2 పథకంలో భాగంగా 300 ఈ–బస్‌ల సరఫరా ఆర్డర్‌ను టీఎస్ఆర్టీసీ నుంచి ఈవీ ట్రాన్స్ చేజిక్కించుకుంది. ఈవీ ట్రాన్స్ ఈ బస్‌లను ఒలెక్ట్రా నుంచి కొనుగోలు చేసి టీఎస్ఆర్టీసీకి అందజేస్తుంది. ఒలెక్ట్రాతోపాటు, ఈవీ ట్రాన్స్‌ను మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) ప్రమోట్ చేస్తోంది. -
ఈవీ ట్రాన్స్‌కు భారీ కాంట్రాక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఉన్న హైదరాబాద్ సంస్థ ఈవీ ట్రాన్స్ ఓ భారీ కాంట్రాక్టును చేజిక్కించుకుంటోంది. ఒక రోడ్డు రవాణా సంస్థ నిర్వహించిన టెండర్లలో 1,400 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరాకు లోయెస్ట్ బిడ్డర్‌గా నిలిచింది. మరో 700 బస్సులను అందించేందుకూ పోటీ పడుతోంది. ఈ రవాణా సంస్థకు అద్దె ప్రాతిపదికన 12 ఏళ్లపాటు బస్సులను నడుపుతారు. ఆర్డర్ (లెటర్ ఆఫ్ అవార్డ్) చేతికి రాగానే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నుంచి 1,400 బస్సులను ఈవీ ట్రాన్స్ కొనుగోలు చేయనుంది. ఈ బస్సుల విలువ రూ.2,450 కోట్లు. డీల్ కార్యరూపం దాలిస్తే ఒలెక్ట్రాకు ఇదే అతిపెద్ద ఆర్డర్‌గా నిలవనుంది. ఈవీ ట్రాన్స్, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ రెండూ కూడా మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) అనుబంధ కంపెనీలు. -
భారత్‌లో తొలి ఈవీ ట్రక్.. అదీ హైదరాబాద్ నుంచి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ మరో ముందడుగు వేసింది. ఈ హైదరాబాద్ కంపెనీ భారీ ఎలక్ట్రిక్ ట్రక్స్ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం వాహన పనితీరు తెలుసుకునే పరీక్షలను మొదలుపెట్టింది. ఒకసారి చార్జింగ్ చేస్తే వాహనం 220 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. భారత్‌లో ఈ తరహా ట్రక్ రావడం ఇదే తొలిసారి అని ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. ఉత్తమ పనితీరుతో పరిశ్రమలో ఇది గేమ్ చేంజర్‌గా నిలుస్తుందని అన్నారు. హైదరాబాద్ సమీపంలో నూతనంగా ఏర్పాటవుతున్న ప్లాంటు సామర్థ్యాన్ని పెంచనున్నట్టు వివరించారు. చదవండి: ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారును ఎగబడికొంటున్నారు..రేంజ్ కూడా అదుర్స్! -
పుణె రోడ్స్ మీద 150 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు సందడి..!
-
పుణె రోడ్స్ మీద 150 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు సందడి..!
పూణే: హైదరాబాద్ నగరానికి చెందిన ఒలెక్ట్రా గ్రీన్ కంపెనీ తయారు చేసిన 150 ఎలక్ట్రిక్ బస్సులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అంతేకాకుండా, పూణేలోని బనర్ ప్రాంతంలో నిర్మించిన అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్ డిపో, ఛార్జింగ్ స్టేషన్ కేంద్రాన్ని కూడా మోడీ ఒక కార్యక్రమంలో ప్రారంభించినట్లు ఈ-బస్సుల తయారీసంస్థ ఒలెక్ట్రా గ్రీన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒలెక్ట్రా ప్రస్తుతం పూణే మహానగర్ పరివర్తన్ మహామండల్ లిమిటెడ్(పిఎమ్ పిఎంఎల్) కోసం నగరంలో 150 ఈ-బస్సులను నడుపుతోంది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్'లో భాగమైన ఈ సంస్థ పూణేతో పాటు సూరత్, ముంబై, సిల్వాస్సా, గోవా, నాగ్ పూర్, హైదరాబాద్, డెహ్రాడూన్ నగరాలలో తన సేవలను అందిస్తుంది. ఈ బస్సుల పట్ల మెట్రో నగరాల్లోని ప్రయాణికుల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నట్లు రవాణా సంస్థలు తమకు తెలిపాయని సంస్థ పేర్కొంది. "పూణే నగరంలో ప్రస్తుతం నడుస్తున్న 150 బస్సులకు మరో 150 ఎలక్ట్రిక్ బస్సులను జోడించడం ఒలెక్ట్రాకు గర్వంగా ఉంది. సమర్థవంతమైన ఎలక్ట్రిక్ ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఒలెక్ట్రా కట్టుబడి ఉంది" అని ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కెవి ప్రదీప్ తెలిపారు. ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సు ఛార్జ్‌కి 250-300 కిలోమీటర్ల అద్భుతమైన పరిధిని అందిస్తుంది. Olectra C9 3000 ఎన్ఎమ్ టార్క్, 480 బీహెచ్ పి పవర్ ఉత్పత్తి చేయగలవు. ఇవి రెండు 180 kW లిథియం-అయాన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా శక్తిని పొందుతాయి. ఇందులో లభించే ఫాస్ట్ ఛార్జింగ్‌తో 2-3 గంటల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇందులో ఒకేసారి 45-49 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. సుదూర ప్రయాణానికి ఇది సరైన బస్సు. ప్రయాణికుల భద్రత కోసం సీసీటివి కెమెరాలను కూడా ఉన్నాయి, ప్రతి సీటుకు అత్యవసర బటన్, యుఎస్బి సాకెట్ కూడా ఉంది. (చదవండి: ఆహా! ఏమి అదృష్టం.. పెట్టుబడి రూ.లక్ష లాభం రెండున్నర కోట్లు)