Olectra Greentech Launches Heavy-Duty Electric Truck Trials in Hyderabad - Sakshi
Sakshi News home page

Olectra Greentech: భారత్‌లో తొలి ఈవీ ట్రక్‌.. అదీ హైదరాబాద్‌ నుంచి

Published Sat, Apr 16 2022 11:02 AM | Last Updated on Sat, Apr 16 2022 12:32 PM

Olectra Greentech Entered Into EV Trucks Manufacturing - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ మరో ముందడుగు వేసింది. ఈ హైదరాబాద్‌ కంపెనీ భారీ ఎలక్ట్రిక్‌ ట్రక్స్‌ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం వాహన పనితీరు తెలుసుకునే పరీక్షలను మొదలుపెట్టింది. 

ఒకసారి చార్జింగ్‌ చేస్తే వాహనం 220 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. భారత్‌లో ఈ తరహా ట్రక్‌ రావడం ఇదే తొలిసారి అని ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్‌ తెలిపారు. ఉత్తమ పనితీరుతో పరిశ్రమలో ఇది గేమ్‌ చేంజర్‌గా నిలుస్తుందని అన్నారు. హైదరాబాద్‌ సమీపంలో నూతనంగా ఏర్పాటవుతున్న ప్లాంటు సామర్థ్యాన్ని పెంచనున్నట్టు వివరించారు. 

చదవండి: ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారును ఎగబడికొంటున్నారు..రేంజ్ కూడా అదుర్స్!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement