
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ మేకర్లలో ఒకటైన ప్యూర్ ఈవీ (PURE EV) తమ ఉత్పత్తుల అమ్మకాలను మరింత పెంచుకునేందుకు సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రాబోయే పండుగ సీజన్‌లో కస్టమర్లను ఆకట్టుకునేందుకు 'ప్యూర్ పర్ఫెక్ట్ 10' (PURE Perfect 10) రిఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది.
ప్రోగ్రామ్ వివరాలు
ప్యూర్ పర్ఫెక్ట్ 10 రిఫరల్ ప్రోగ్రామ్ ఇప్పటికే ఉన్న ప్యూర్ ఈవీ కస్టమర్లందరితోపాటు మార్చి 31 నాటికి లేదా సంబంధిత అవుట్‌లెట్లలో స్టాక్స్ ఉన్నంత వరకూ ప్యూర్ ఈవీ వాహనాన్ని కొనుగోలు చేసే కొత్త కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ కింద కస్టమర్లు ఈవీ వాహనాన్ని కొనుగోలు చేసే తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు రెఫర్ చేయడం ద్వారా రూ.40,000 వరకు క్యాష్ బ్యాక్ రివార్డులను పొందవచ్చు.
ఇది ఎలా పనిచేస్తుందంటే..
ఇప్పటికే ఉన్న కొత్త ప్యూర్ ఈవీ వినియోగదారులతోపాటు కొత్త కస్టమర్లకు వారి రిజిస్టర్డ్ వాట్సాప్ నంబర్ ద్వారా 10 ప్రత్యేక రిఫరల్ కోడ్‌లు అందుతాయి. రిఫరర్ కొనుగోలుకు దారితీసే ప్రతి విజయవంతమైన రిఫరెన్స్ కు రూ.4,000 చొప్పున క్యాష్ బ్యాక్ వోచర్లను అందుకుంటారు. ఇలా గరిష్టంగా పది మందికి రెఫర్ చేసి వారు వాహనాన్ని కొనుగోలు చేస్తే రూ.40,000 వరకూ క్యాష్ బ్యాక్ వోచర్లు లభిస్తాయి.
రిఫరల్స్ ద్వారా సంపాదించిన క్యాష్ బ్యాక్ వోచర్లను భవిష్యత్ సర్వీస్, స్పేర్ పార్ట్స్ అవసరాల కోసం ఉపయోగించవచ్చు. అలాగే వాహన అప్‌గ్రేడ్‌లు, ఎక్చ్సేంజ్, బ్యాటరీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ల కోసం కూడా వీటిని వినియోగించుకోవచ్చు. లేదా తమవారెవరైనా ప్యూర్ ఈవీ వాహనం కొనుగోలు చేసినప్పుడు ప్రత్యక్ష నగదు డిస్కౌంట్లను పొందవచ్చు.
"మా ప్రతి ప్రయత్నంలోనూ కస్టమర్లు మా హృదయంలో ఉంటారు. ఈ ప్రత్యేక రిఫరల్ కార్యక్రమంతో వారి పండుగ వేడుకలకు మరింత ఆనందాన్ని జోడించాలనుకుంటున్నాము. ఈ చొరవ మా కస్టమర్ల విశ్వాసం, విశ్వసనీయతకు ప్రతిఫలం ఇవ్వడమే కాకుండా ప్యూర్ ఈవీ అనుభవాన్ని వారి ప్రియమైనవారితో పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది" అని ప్యూర్ ఈవీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్ వడేరా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment