cashback offers
-
ఈ యాప్ యూజర్లకు ఆఫర్లే ఆఫర్లు.. రూ.750 వరకు క్యాష్‌బ్యాక్!
BHIM App Offers: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ భీమ్ (BHIM) తమ యూజర్లకు సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. రూ. 750 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్లు పొందడానికి కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. యూజర్ బేస్ పెంచుకునేందుకు మొదట్లో గూగుల్ పే అందించినట్టుగానే భీమ్ యాప్ కూడా విభిన్న క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. ఇందులో రూ. 750 వరకు క్యాష్‌బ్యాక్ అందించే రెండు రకాల ఆఫర్లు ఉన్నాయి. వీటితో పాటు అదనంగా 1 శాతం క్యాష్ బ్యాక్ వచ్చే మరో ఆఫర్ కూడా ఉంది. భీమ్ యాప్‌లో ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ అయ్యేందుకు 7 వారాల కన్నా ఎక్కువ సమయం పడుతుందని గమనించాలి. ఆఫర్లను మరింత కాలం పొడిగించే అవకాశం ఉందా అన్నదానిపై స్పష్టత లేదు. రూ.750 క్యాష్‌బ్యాక్ ఎలా పొందాలంటే.. ఫుడ్ ఆర్డర్లు, ట్రావెల్ చేసే యూజర్లు భీమ్ యాప్ ద్వారా రూ. 150 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్లు, ట్రావెల్ ఖర్చులు అంటే రైల్వే టిక్కెట్ బుకింగ్‌లు, క్యాబ్ రైడ్లు, మర్చంట్ యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించే రెస్టారెంట్ బిల్లులపై రూ. 100 మించి లావాదేవీలు చేస్తే రూ. 30 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్‌ను కనీసం 5 సార్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. తద్వారా గరిష్టంగా రూ. 150 క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. ఇక రూ. 600 క్యాష్‌బ్యాక్ అందించే మరో ఆఫర్ కూడా ఉంది. రూపే క్రెడిట్ కార్డులను భీమ్ యాప్‌నకు లింక్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు. అన్ని మర్చంట్ యూపీఐ పేమెంట్లపై రూ. 600 క్యాష్‌బ్యాక్ రివార్డ్‌ను అందుకోవచ్చు. ఈ ఆఫర్లో భాగంగా ఒక్కొక్కటి రూ. 100 దాటిన మొదటి మూడు లావాదేవీలపై రూ. 100 క్యాష్‌బ్యాక్, ఆ తర్వాత ప్రతి నెలా రూ. 200 దాటిన 10 ట్రాన్సాక్షన్స్‌పై రూ. 30 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇలా ఈ ఆఫర్లన్నీ కలుపుకొంటే మొత్తంగా రూ.600 క్యాష్‌బ్యాక్‌ను అందుకోవచ్చు. ఇవేకాకుండా భీమ్ యాప్ ఉర్జా (Urja) ఒక శాతం స్కీమ్‌ను కూడా అందిస్తోంది. దీని కింద పెట్రోల్, డీజిల్, సీఎన్జీతో సహా అన్ని ఫ్యూయల్ పేమెంట్లపై 1 శాతం ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ రూ. 100 లేదా అంతకు పైబడి ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్స్, గ్యాస్ బిల్లుల వంటి యుటిలిటీ బిల్లు చెల్లింపులపై కూడా వర్తిస్తుంది. భీమ్ యాప్‌తో లింక్ చేసిన ప్రైమరీ బ్యాంక్ అకౌంట్లలో ఈ క్యాష్‌బ్యాక్ నేరుగా క్రెడిట్ అవుతుంది. -
షాపింగ్ చేస్తున్నారా? బెస్ట్ క్యాష్ బ్యాక్ ఆఫర్లున్న క్రెడిట్‌కార్డులు ఇవే..
Best Credit Card Cashback Offers: దేశవ్యాప్తంగా ప్రస్తుతం పండుగ సీజన్ నడుస్తోంది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా చాలా మంది షాపింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో చాలా ఆఫ్‌లైన్, ఆన్లైన్ సంస్థలు పలు రకాల ఆఫర్లను ప్రకటించాయి. వీటితోపాటు వివిధ బ్యాంకులు తమ క్రెడిట్‌కార్డులతో షాపింగ్ చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తమ క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ఇతర ప్రయోజనాలు అందిస్తున్న కొన్ని క్రెడిట్ కార్డుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ క్రెడిట్‌కార్డ్‌తో ఎటువంటి ఇబ్బందికరమైన వ్యాపారి పరిమితులు లేకుండా ఆన్లైన్ షాపింగ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అదే ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేస్తే అదనంగా మరో 1 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇక డిజిటల్ లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు కూడా లభిస్తాయి. అయితే, క్యాష్‌బ్యాక్ నెలకు రూ. 5,000 మాత్రమే ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ యుటిలిటీ బిల్లుల చెల్లింపులకు అనువైనది. గూగుల్‌పే ద్వారా బిల్లు చెల్లింపులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. అలాగే స్విగ్గీ, జొమాటో, ఓలా వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లపై 4 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఈ క్రెడిట్ కార్డుతో పొందవచ్చు. అయితే, ఈ క్యాష్‌బ్యాక్‌ల గరిష్ట మొత్తం నెలకు రూ. 500 మాత్రమే. అదనంగా ఈ కార్డ్ ఇతర అన్ని చెల్లింపులపైనా 2 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా ఈ క్రెడిట్ కార్డ్‌ను తీసుకొచ్చాయి. ఈ క్రెడిట్ కార్డ్ ఫ్లిప్‌కార్ట్ కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. దీంతోపాటు స్విగ్గీ, క్లయర్ట్రిప్, కల్ట్‌ఫిట్, పీవీఆర్, టాటా ప్లే, ఉబెర్ వంటి ఫ్లాట్‌ఫామ్స్‌లో చెల్లింపులపై 4 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో విమాన, హోటల్ చెల్లింపులపై 1.5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ క్యాష్‌బ్యాక్‌లను ఎలాంటి పరిమితి లేకుండా నెలంతా వినియోగించుకోవచ్చు. -
జోయాలుక్కాస్‌లో అక్షయ తృతీయ ఆఫర్లు
హైదరాబాద్: ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ అక్షయ తృతీయ సందర్భంగా జ్యుయలరీ కొనుగోళ్లపై ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. రూ.50,000 అంతకుపైబడిన వజ్రాలు, అన్‌కట్ వజ్రాలను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.2,000 విలువైన గిఫ్ట్ వోచర్‌ను ఇవ్వనుంది. అలాగే రూ.50,000, అంతకు పైబడిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి రూ.1,000 విలువ గల గిఫ్ట్ వోచర్, రూ.10,000 విలువైన వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్‌ను అందించనున్నట్లు తెలిపింది. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన వారికి 5 శాతం రాయితీ కూడా ఇస్తుంది. నేటి నుంచి(14వ తేదీ) ప్రారంభమై ఈ నెల 23వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఈ అద్భుతమైన ఆఫర్‌ను కస్టమర్లంతా వినియోగించుకోవాలని కంపెనీ ఎండీ జాయ్ అలుక్కాస్ కోరారు. -
జియో యూజర్లకు గుడ్‌న్యూస్..!
జియో యూజర్లకు గుడ్‌న్యూస్..! ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థలు ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా టారిఫ్ రేట్లను పెంచడంతో జియో కూడా తన యూజర్లకు షాకిస్తూ టారిఫ్ ప్లాన్లను ధరలను పెంచింది. కాగా పెరిగిన ధరల నుంచి ఉపశమనం ఇస్తూ ..పలు ప్రీపెయిడ్ ప్లాన్స్‌పై క్యాష్‌బ్యాక్‌ను జియో అందిస్తోంది. 20 శాతం క్యాష్‌బ్యాక్..! రిలయన్స్ జియో తన మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ రీఛార్జీపై 20 శాతం జియోమార్ట్ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. రూ.719, రూ.666, రూ. 299 ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 20 శాతం సుమారు రూ.200 వరకు క్యాష్‌బ్యాక్‌ను యూజర్లు సొంతం చేసుకోవచ్చును. అన్ని రిలయన్స్ రిటైల్ స్టోర్లు , జియో మార్ట్, ఆజియో, రిలయన్స్ ట్రెండ్స్, నెట్‌మెండ్స్, రిలయన్స్ డిజిటల్లో ఈ క్యాష్‌బ్యాక్‌ను వాడవచ్చును. ఒక కస్టమర్ ప్రతి రోజు రూ.200 వరకు గెలుచుకునే అవకాశం ఉంది. క్యాష్‌బ్యాక్ ఎలా వస్తోందంటే..! ఆయా ప్లాన్లను రీఛార్జ్ చేసిన మూడు రోజులలోపు వినియోగదారుల ఖాతాకు క్యాష్‌బ్యాక్ క్రెడిట్ అవుతుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ను వివిధ రిలయన్స్ రిటైల్ ఛానెళ్ల నుంచి రీడీమ్ చేసుకోవచ్చను. చదవండి: 15 నిమిషాల్లోనే సరుకులు డోర్ డెలివరీ: స్విగ్గీ -
పండుగ సీజన్ మార్కెటింగ్‌కు రూ.100 కోట్లు: పేటీఎం
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం ప్రస్తుత పండుగ సీజన్లో ప్రచార కార్యక్రమాల కోసం రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, యూపీఐపరమైన ప్రోత్సాహకాలు, ’బై నౌ, పే లేటర్ (ఇప్పుడు కొనుక్కోండి, తర్వాత కట్టండి)’ వంటి ఆఫర్లు మొదలైన వాటికి ఈ నిధులు ఉపయోగించనున్నట్లు వెల్లడించింది. నవంబర్ 14 దాకా ఈ ప్రచార కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై మరింతగా దృష్టి పెడుతూ ’పేటీఎం క్యాష్‌బ్యాక్ ధమాకా’ ఆఫర్‌ను కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. ‘పండుగ సీజన్ డిమాండ్ తారాస్థాయిలో ఉన్నప్పుడు ప్రతి రోజు 10 మంది లక్కీ విన్నర్లు తలో రూ. 1 లక్ష గెల్చుకోవచ్చు. అలాగే 10,000 మంది విజేతలు రూ. 100 క్యాష్‌బ్యాక్, మరో 10,000 మంది యూజర్లు రూ. 50 క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. ఇక దీపావళి దగ్గరపడే కొద్దీ (నవంబర్ 1–3) యూజర్లు రోజూ రూ. 10 లక్షల దాకా గెల్చుకోవచ్చు‘ అని పేటీఎం ఒక ప్రకటనలో తెలిపింది. మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ డీటీహెచ్ రీచార్జీలు, బిల్లుల చెల్లింపులు, మనీ ట్రాన్స్ఫర్, ట్రావెల్ టికెట్ల బుకింగ్, కిరాణా దుకాణాల్లో చెల్లింపులు మొదలైన లావాదేవీలకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందుకోవచ్చు. -
యాక్సిస్ బ్యాంకుతో షాపింగ్ చేస్తే 45 శాతం మేర క్యాష్‌బ్యాక్...!
ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులకు తీపి కబురును అందించింది. యాక్సిస్ బ్యాంక్ తన ఏఎస్ఏపీ డిజిటల్ సేవింగ్స్ నూతన బ్యాంక్ కస్టమర్ల కోసం ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్‌లో షాపింగ్ చేస్తే 10 నుంచి 15 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. అంతేకాకుండా 30 కంటే ఎక్కువ బ్రాండ్లపై 45 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. ఈ క్యాష్‌బ్యాక్‌ను యాక్సిస్ బ్యాంక్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్‌లో "గ్రాబ్ డీల్స్" ద్వారా పొందవచ్చు. చదవండి: వారంలో మూడు రోజులు పనిచేస్తే చాలు..! తెరపైకి మరో కొత్త పాలసీ ఎఏస్ఎపీ డిజిటల్ సేవింగ్స్ ఖాతాల్లో భాగంగా ఈజీ, ప్రైమ్, ప్రయారిటీ, బుర్గుండి పేరిట నాలుగు రకాల ఖాతాలను యాక్సిస్ బ్యాంక్ ప్రవేశపెట్టింది. అంతేకాకుండా వీడియో కేవైసీ ప్రక్రియ ద్వారా బ్యాంక్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఖాతాదారులు ఖాతాలను తెరిచే సౌకర్యాన్ని యాక్సిస్ అందిస్తోంది. ఈజీ ఖాతాల డెబిట్ కార్డులపై 10 శాతం, ప్రైమ్ ఖాతాల డెబిట్ కార్డులపై 12.5 శాతం, ప్రయారిటీ అండ్ బుర్గుండీ ఖాతాలపై ఫ్లాట్ 15 శాతం క్యాష్‌బ్యాక్‌ను యాక్సిస్ అందిస్తోంది. ఈ ఆఫర్ ఖాతాదారులకు 2021 నవంబర్ 30 వరకు అందుబాటులో ఉండనుంది. కాగా ఈ ఆఫర్ కేవలం ఆర్నెల్లకుపైగా ఏఎస్ఏఎస్ ఖాతాలను కల్గిన వారికే వర్తించనుంది. క్యాష్‌బ్యాక్‌ను నేరుగా అకౌంట్లో జమా అవుతోందని యాక్సిస్ బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: దేశంలోని పది లోక్‌సభ నియోజకవర్గాల్లో స్టార్ లింక్ సేవలు -
ఎస్బీఐ కార్డ్ యూజర్లకు బంపర్ ఆఫర్!
దసరా పండుగ సీజన్ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అన్నీ భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎస్బీఐ కార్డ్స్ తమ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ పండుగ సమయంలో మొబైల్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ల్యాప్ టాప్స్, కిచెన్ అప్లయన్సెస్, హోమ్ డెకార్, ఫర్నిషింగ్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ వంటి మొదలైన ఏ కేటగిరీల్లోనైనా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో ఆన్లైన్ షాపింగ్ చేసే వారికి 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ఆఫర్ కేవలం అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 5, 2021 వరకు మాత్రమే ఉంటుంది.(చదవండి: జీన్స్, టీషర్ట్స్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్...!) ఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో ఈఎమ్ఐ కింద కొనుగోళ్లు చేసిన ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే, కొనే సమయంలోనే ఈఎంఐ ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా, మీకు ఇష్టమైన ఈ-కామర్స్ సంస్థ నుంచి కొనుగోలు చేసినా ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. అలాగే, ఆ మూడు రోజుల సమయంలో కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు కూడా కల్పిస్తామని తెలిపింది. వాటి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొంది. మరింత సమాచారం కోసం ఎస్బీఐ కార్డ్. కామ్ సందర్శించండి అని తెలిపింది. (చదవండి: ఎస్బీఐ హోమ్ లోన్ దరఖాస్తుకు కావాల్సిన ధ్రువ పత్రాలు ఇవే..!) Start the celebrations with the most exciting sale of the festive season. Stay Tuned for more info on #DumdaarDus Cashback*! *T&Cs Apply#SBICard #Cashback #FestiveOffers #FestiveShopping #Sale #FestiveSale pic.twitter.com/Kc1bpzRIbt — SBI Card (@SBICard_Connect) September 28, 2021 -
ఐఫోన్-13 కొనుగోలుపై వోడాఫోన్-ఐడియా బంపర్ ఆఫర్...!
ఐఫోన్ -13 సిరీస్ స్మార్ట్ఫోన్లను సెప్టెంబర్ 14 ఆపిల్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ప్రీ ఆర్డర్లు నేటి నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ 13 స్మార్ట్ఫోన్లను మైవీఐ.కామ్, వీఐ యాప్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఫ్లాట్‌ఫాంలో ప్రీబుకింగ్స్ చేసుకోవచ్చును. తాజాగా వోడాఫోన్ అధికారిక వెబ్సైట్ నుంచి ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లను ప్రీ-ఆర్డర్ చేసిన కొనుగోలుదారులకు ప్రత్యేక డీల్, క్యాష్‌బ్యాక్ అందిస్తామని వోడాఫోన్-ఐడియా ప్రకటించింది. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వోడాఫోన్-ఐడియా పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. వీఐ- వెబ్సైట్ నుంచి కొనుగోలు చేసిన కస్టమర్లకు ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లను సెప్టెంబర్ 25న పొందవచ్చును. చదవండి: Amazon Great Indian Festival Sale: బ్లాక్‌బస్టర్ డీల్స్‌తో..అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఐఫోన్-13 సిరీస్ కొనుగోలుపై వీఐ అందిస్తోన్న ఆఫర్లు...! వీఐ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేసిన కస్టమర్లు వీఐ రెడ్ఎక్స్ ప్లాన్లను కచ్చితంగా సబ్‌స్రైబ్ చేసుకొని ఉండాలి. రెడ్ఎక్స్ ప్లాన్స్ రూ. 1099, రూ. 1699,ఫ్యామీలీ ప్యాక్ రూ. 2299 పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను వీఐ అందించనుంది. క్యాష్‌బ్యాక్ ఆరు నెలల వ్యవధిలో రిఫ్లెక్ట్ అవుతోందని వీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, కాంప్లిమెంటరీ ఇంటర్నేషనల్ రోమింగ్, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, ప్రీమియం కస్టమర్ సర్వీస్ , మరెన్నో వాటితో పాటు ప్రీమియం ఎంటర్టైన్మెంట్తో సహా రెడ్ఎక్స్ ప్లాన్‌లో భాగంగా ప్రయోజనాలను పొందవచ్చును. అదనంగా, రూ .299 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్‌పై ఐఫోన్ 13 కొనుగోలుదారులకు డబుల్ డేటా ప్రయోజనాలను అందిస్తున్నట్లు వీఐ ప్రకటించింది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్‌లతో సహా ఐఫోన్ 13 సిరీస్ అన్ని మోడళ్ల కొనుగోలుపై ఈ ఆఫర్లన్నీ అందుబాటులో ఉన్నాయి. చదవండి: 20 నిమిషాల ఛార్జింగ్‌తో 482 కి.మీ ప్రయాణం..! -
పెరిగిన గ్యాస్ ధరలు, బంపర్ ఆఫర్ ప్రకటించిన పేటీఎం
paytm cash back offer : పెట్రోలియం కంపెనీలు దేశీయ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి భారీగా పెంచాయి. దీంతో సబ్సిడీ లేని సిలిండర్లను కొనుగులు చేయడం సామాన్యులకు కష్టంగా మారింది. అయితే పెరుగుతున్న సిలిండర్ల ధరల్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త స్కీమ్‌లను ప్రకటించింది. కొత్త, పాత కస్టమర్లకు వేర్వేరు ఆఫర్లు అందిస్తోంది. ♦ పేటీఎం తాజాగా '3పే 2700 క్యాష్ బ్యాక్ ఆఫర్' ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం పేటీఎంలో కొత్తగా చేరిన కస్టమర్ మొదటి మూడు నెలల కాలంలో పేటీఎం ద్వారా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకుంటే గరిష్టంగా రూ. 900ల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు. ఒకేసారి మూడు కంపెనీలకు చెందిన మూడు సిలిండర్లు బుక్ చేస్తే ఏకంగా రూ. 2700 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ♦ ఇక ఇప్పటికే ఉన్న పేటీఎం కష్టమర్లు ఇండేన్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్‌కు చెందిన ఎల్పీజీ సిలీండర్లను బుక్ చేస్తే ప్రతి బుకింగ్ మీద 5000 వరకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అందిస్తోంది. ఈ పాయింట్లను పేటీఎంలో చేసే ఇతర షాపింగుల్లో ఈ పాయింట్లను ఉపయోగించుకోవచ్చు. ♦ పేటీఎం పోస్ట్ పెయిడ్ కష్టమర్లు ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకొని తర్వాత డబ్బులు చెల్లించవచ్చు -
జియో దివాళి ధమాకా : 100 పర్సెంట్ క్యాష్‌బ్యాక్
టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో దివాళి సందర్భంగా కస్టమర్లకు 100 పర్సెంట్ క్యాష్‌బ్యాక్, గిఫ్ట్ కార్డ్ లాంటి ఎన్నో ఆఫర్లను ప్రకటించింది. పండుగ సందర్భంగా రూ. 100 కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న అన్ని రిచార్జ్ ప్లాన్లపై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ని రిలయన్స్ డిజిటల్ కూపన్ల రూపంలో అందిస్తోంది. వీటిని ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిచార్జ్‌ల కోసం వాడుకోవచ్చని తెలిపింది. అంతేకాక పేటీఎమ్ వ్యాలెట్, ఫోన్‌పే, అమెజాన్ పే, మోబిక్విక్ యాప్‌ల ద్వారా పేమెంట్స్ చేసే వారికి రూ. 300 వరకూ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ని ప్రకటించింది. దివాళి ధమాకాలో భాగంగా పండుగ సందర్భంగా స్పెషల్ యాన్యువల్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.1,699తో రీఛార్జ్ చేయించుకుంటే వచ్చే ఏడాది దివాళి వరకు కస్టమర్లు ఉచితంగా అన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చని ప్రకటించింది. ఈ ప్లాన్ కింద ఉచితంగా లోకల్, నేషనల్ కాల్స్, అపరిమిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, 547.5 జీబీ డేటాను పొందవచ్చు. వచ్చే ఏడాది దివాళి వరకు ఈ ప్రయోజనాలను కస్టమర్లకు జియో ఆఫర్ చేస్తోంది. ఈ యాన్యువల్ ప్లాన్‌పై కూడా 100 శాతం క్యాష్‌బ్యాక్‌ని ఇస్తోంది. పండుగ సందర్భంగా ‘జియో ఫోన్ 2 ఫెస్టీవ్ సేల్ 2’ని ప్రకటించింది. రూ. 2,999 ఖరీదైన ఈ జియో ఫోన్ 2.. నవంబర్ 5(నేటి నుంచి) నుంచి 12 వరకూ కంపెనీ సైట్లో అందుబాటులో ఉంటుంది. జియో ఫోన్ 2ను కొనేవారు పేటీఎం వ్యాలెట్ ద్వారా పేమెంట్ చేస్తే రూ. 200 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో రూ.2,799కే లభిస్తుంది. వీటితో పాటు జియో ఫోన్, జియో ఫోన్2 కోసం మూడు రకాల ప్రిపేయిడ్ రిచార్జ్ ప్లాన్స్‌ని అందుబాటులోకి తేచ్చింది. రూ. 49తో రిచార్జ్ చేస్తే 1 జీబీ డాటా, ఫ్రీ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 50 ఎస్ఎంఎస్లను 28 రోజుల పాటు పొందవచ్చు. రూ. 99తో రిచార్జ్ చేస్తే రోజుకు 500 ఎంబీ 4జీ డాటా, ఫ్రీ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 300 ఎస్ఎంఎస్లను 28 రోజుల పాటు పొందవచ్చు. రూ. 153తో రిచార్జ్ చేస్తే రోజుకు 1. 5జీబీ డాటా, ఫ్రీ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను 28 రోజుల పాటు పొందవచ్చు. కొత్త 4జీ స్మార్ఫోన్ల కొనుగోలుపై కూడా జియో రూ.2, 200 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఈ క్యాష్‌బ్యాక్‌ను రూ. 50 విలువైన 44 కూపన్ల ద్వారా మైజియో యాప్ ద్వారా అందించనుంది. ఈ కూపన్లను అదే 4జీ స్మార్ట్‌ఫోన్ రిచార్జ్ కోసం వాడాలని తెలిపింది. వీటితో పాటు రిలయన్స్ రిటైల్ స్టోర్ల నుంచి రూ.35,000 విలువైన ల్యాప్‌టాప్‌ని కొంటే రూ. 3,000 విలువైన జియోఫై, డాటా లాభాలతో పాటు జియో ప్రైమ్ మెంబర్షిప్, 168 రోజుల పాటు రోజుకు 2జీబీ డాటాతో పాటు.. 6జీబీ డాటాను కల్గిన 10 వోచర్లను ఉచితంగా పొందవచ్చు. రూ. 30,000 ఖరీదైన ల్యాప్‌టాప్ కొనేవారికి కూడా ఈ ఆఫర్ వర్తించాలంటే.. అదనంగా రూ. 999 చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించింది. -
ఐ ఫోన్లపై భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్స్
ఐ ఫోన్ కావాలని కలలు కంటున్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్ మిస్ అయ్యారా? అయితే దసరా పండుగ సందర్భంగా పేటీఎం మాల్ పలు ఉత్పత్తులపై భారీగా క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. ఒకవైపు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఫెస్టివ్ సేల్ ఆదివారంతో ముగిసిపోవడంతో పే టీఎం మాల్ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. నేటి నుంచి (అక్టోబర్ 16) ఈ నెల 18 వరకు పేటీఎం మాల్ మరోసారి ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ లో అనేక ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. తాజా ఐ ఫోన్లపై మహా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ ఎక్స్ 256జీబీ స్మార్ట్‌ఫోన్‌పై భారీగా 20వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ మార్కెట్ ధర రూ. 1,05,720తో పోలిస్తే. రూ .3830 డిస్కౌంట్ ఆఫర్‌తో 1,01,890 రూపాయల వద్ద పేటీఎం మాల్ విక్రయించింది. దీనికి ప్రస్తుత క్యాష్‌బ్యాక్ అదనం. 64 జీబీ ఐఫోన్ ఎక్స్‌పై రూ. 3502 తగ్గింపు లభిస్తుంది. అంటే మార్కెట్ ధర రూ. 95,390 నుంచి తగ్గి 91,888 రూపాయలకు లభ్యం. అలాగే రూ. 22వేల దాకా క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. అయితే ఈ ఆఫర్ పొందేందుకు MOBFESTIVE18K ప్రోమో కోడ్‌ను ఉపయోగించాలి. అంతేకాదు ఐ ఫోన్ ఎక్స్ఎస్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఉంది. IPH5000 ప్రోమో కోడ్ ద్వారా 64జీబీ ఐఫోన్ కొనుగోలుపై 5వేల దాకా క్యాష్ బ్యాక్ ఉంది. 256 జీబీ స్మార్ట్‌ఫోన్ లో 12వేల క్యాష్ బ్యాక్ ఆఫర్. దీనికి ప్రోమో కోడ్ MOBFESTIVE12K. వీటితోపాటు 64జీబీ ఐఫోన్ 8 ప్లస్‌పై 13వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్. ప్రోమో కోడ్ MOBFESTIVE13K.. 256జీబీ ఐఫోన్ 8 కొనుగోలుపై 13500 క్యాష్ బాక్ ఉంది. ప్రోమో కోడ్MOBFESTIVE13500. 32జీబీ , 128జీబీ ఐఫోన్ 7 వరుసగా 4500, 8500 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ .ప్రోమో కోడ్ MALLFESTIVE8500.32జీబీ ఐఫోన్ 6ఎస్ లో రూ. 3500 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. చివరగా, 32జీబీ ఐఫోన్ 6 వేరియంట్ 6000 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. ప్రోమోకోడ్ ద్వారానే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తుంది. ప్రోమోకోడ్ ద్వారా ఆఫర్ చేస్తున్న నగదును ఫోన్లను డెలివరీ చేసిన 24గంటల్లోపు కస్టమర్ల ఖాతాలో క్రెడిట్ చేస్తామని కంపెనీ తెలిపింది. దీంతోపాటు దుస్తులపై గరిష్టంగా 70శాతంరాయితీని ప్రకటించింది. కంప్యూటర్ ఉత్పత్తులపై 25శాతం క్యాష్ బ్యాక్‌ను, గేమింగ్ కన్సోల్స్‌పై రూ.6వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్. అలాగే గృహోపకరణాలపై 60శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతోపాటు ల్యాప్‌టాప్‌లు, హెడ్ఫోన్లు, మొబైల్ యాక్ససరీస్‌పై కూడా ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తోంది. -
వోడాఫోన్ ఐడియా క్యాష్ బ్యాక్ ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు ఆకట్టుకునే వ్యూహాలు అమలును ప్రారంభించింది. వోడాఫోన్ , ఐడియా మెగా మెర్జర్ ద్వారా ఆవిర్భవించిన వోడాఫోన్ ఐడియా తాజాగా వినియోగదారులకు ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. రీచార్జ్‌లపై క్యాష్‌బ్యాక్, ఫ్రీ వోచర్లు అందిస్తున్నట్టు ప్రకటించింది. దీనికోసం పేటిఎంతో జతకట్టింది. దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో పేటీఎం ద్వారా రీచార్జ్ చేసుకున్న వోడాఫోన్, ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు ఈ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు మంగళవారం తెలిపింది. ముఖ్యంగా రూ .149 కనీస రీఛార్జికి 25 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. అలాగే దీనికి అదనంగా రూ.375 విలువ వోచర్లును అందిస్తుంది. వీటిని పేటీఎంమాల్ లో షాపింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. కాగా వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు యుపి వెస్ట్, పంజాబ్, చెన్నై, తమిళనాడులో కొత్త కాంబో ఆఫర్‌ను సోమవారం ప్రారంభించింది. 25 రూపాయల రీచార్జ్ పై ఉచిత డేటాతోపాటు తగ్గింపు రేటులో కాలింగ్ సదుపాయాన్ని కల్పించింది. -
ఐఫోన్ ఎక్స్‌పై భారీ ఆఫర్
ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్‌లు, మార్కెటింగ్ ఆఫర్లతో పేటీఎం మాల్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీనిలో భాగంగా ఈ సంస్థ ‘ఫ్రీడం క్యాష్‌బ్యాక్ సేల్’ను నిర్వహిస్తోంది. ఆగస్టు 8 నుంచి ప్రారంభమైన ఈ సేల్, ఆగస్టు 15 వరకు కొనసాగనుంది. ఈ ఫ్రీడం క్యాష్‌బ్యాక్ సేల్‌లో భాగంగా ఐఫోన్ అభిమానుల కోసం ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఐఫోన్ ఎక్స్(64జీబీ)ను కేవలం 67,298 రూపాయలకే విక్రయిస్తోంది. దీని అసలు ధర 92,798 రూపాయలుగా ఉంది. ఫ్రీడం క్యాష్‌బ్యాక్ సేల్‌లో ఐఫోన్ ఎక్స్‌పై ఫ్లాట్ 10వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. దీంతో ఐఫోన్ ఎక్స్(64జీబీ) పేటీఎం మాల్లో రూ.82,798కి అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు తమ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే అదనంగా మరో 1,250 రూపాయల క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. పాత ఫోన్ల ఎక్స్చేంజ్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఐఫోన్ ఎక్స్ ధర మరో రూ.14,250 తగ్గుతోంది. దీంతో మొత్తంగా ఐఫోన్ ఎక్స్ 64జీబీ వేరియంట్ ధర 67,298 రూపాయలకు దిగొస్తోంది. మరోవైపు పేటీఎం మాల్ నిర్వహిస్తున్న సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 20 వేల రూపాయల వరకు ధర తగ్గించింది. ఇంటెల్ కోర్ ఐ3, 4జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ స్పేస్, ఏడాది పాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కలిగిన లెనోవో ఐడియాప్యాడ్ 320 ధర పేటీఎం మాల్లో రూ.22,490కు తగ్గింది. అదేవిధంగా ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ స్పేస్ కలిగిన డెల్ వోస్ట్రో 3578 ల్యాప్‌టాప్‌పై ఫ్లాట్ 6000 వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. ఎంఎస్ఐ జీఎల్63 8ఆర్ఈ-455ఐఎన్ గేమింగ్ ల్యాప్‌టాప్‌పై రూ.20వేల క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం మాల్ తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. 13 శాతం తగ్గింపు, 11000 రూపాయల క్యాష్‌బ్యాక్ ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎంక్యూడీ42హెచ్ఎన్/ ల్యాప్‌టాప్‌పై కస్టమర్లకు అందుతుంది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రొ కోర్ ఐ5 ల్యాప్‌టాప్‌పై 10 వేల రూపాయల క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. -
అమెజాన్‌కు పోటీ : ఫ్లిప్‌కార్ట్ ‘ది బిగ్ ఫ్రీడం సేల్’
అంతర్జాతీయ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్‌కు, దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పోటీకి వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్ సైతం ‘ది బిగ్ ఫ్రీడం సేల్’ను ప్రకటించింది. 72వ స్వాతంత్య్రం సందర్భంగా ఈ బిగ్ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ రివీల్ చేసింది. 2018 ఆగస్టు 10 నుంచి ఆగస్టు 12 వరకు ఈ సేల్‌ను నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే ఈ సేల్‌లో భాగంగా అందించే ఆఫర్లను మాత్రం ఫ్లిప్‌కార్ట్ బహిర్గతం చేయలేదు. ఈ 72 గంటల సేల్‌లో బ్లాక్‌బస్టర్ డీల్స్‌ను, ప్రైస్ క్రాష్ ఆఫర్లను, రష్ అవర్ డీల్స్‌ను, ఫ్రీడం అవర్‌ను, గంట గంటకు పలు డీల్స్‌ను అందించనున్నట్టు మాత్రం పేర్కొంది. ఈ సేల్‌లో ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి ప్రైస్ క్రాష్ ఆఫర్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. దాంతో పాటు ఆగస్టు 10న అంటే ఫ్లిప్‌కార్ట్ సేల్ ప్రారంభమయ్యే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ‘రష్ అవర్’ను చేపట్టనున్నట్టు పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ మూడు రోజుల సేల్‌లో ‘ఫ్రీడం కౌంట్‌డైన్’ను నిర్వహించనుంది. ఇది సాయంత్రం 7.47 గంటల నుంచి 8.18 గంటల వరకు ఉంటుంది. ఈ 31 నిమిషాల్లో పలు కేటగిరీలోని ఉత్పత్తులన్నింటిపై ధర తగ్గింపు ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ ఫ్రీడం సేల్‌లో యూజర్లకు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తోంది. అంతేకాక షావోమి, శాంసంగ్, ఆపిల్ వంటి పలు బ్రాండ్ స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఉండనున్నాయని, ల్యాప్‌టాప్, ఆడియో ఈక్విప్మెంట్, కెమెరాలపై 80 శాతం వరకు తగ్గింపు ఉండనుందని సమాచారం. ఈ సేల్‌లో ప్రొడక్ట్‌లను కొనుగోలు చేయాలని భావించే కస్టమర్లు విష్‌లిస్ట్‌లో మీకు ఇష్టమైన ప్రొడక్ట్‌లను యాడ్ చేయాలని, మీ అకౌంట్‌కు క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలను సేవ్ చేసుకోవాలని, డెలివరీ అడ్రస్‌ను ముందస్తుగానే అప్డేట్ చేసుకోవాలని ఫ్లిప్‌కార్ట్ సూచించింది. ఫ్లిప్‌కార్ట్ కంటే ఒక్కరోజు ముందుగానే అమెజాన్ తన ఫ్రీడం సేల్‌ను ప్రారంభింబోతుంది. అమెజాన్ సేల్ ఆగస్టు 9 నుంచి ఆగస్టు 12 వరకు ఉండనుంది. అమెజాన్ ఇండియా గత వారం ప్రకటించిన ఈ ‘ఫ్రీడం సేల్’లో వన్‌ప్లస్ 6, రియల్‌మి 1, మోటో జీ6 వంటి స్మార్ట్ఫోన్లపై పలు డీల్స్‌ను, ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు తెలిపింది. -
అలా చేస్తే ఎంఆర్పీపై తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ : డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. డిజిటల్ ద్వారా చెల్లింపులు చేపట్టే వినియోగదారులకు ఎంఆర్పీపై డిస్కౌంట్ ఇచ్చే ప్రతిపాదనకు రెవెన్యూ విభాగం తుదిమెరుగులు దిద్దుతోంది. ఈ డిస్కాంట్‌ను గరిష్టంగా రూ 100గా నిర్ణయించనున్నారు. ఇక డిజిటల్ పద్ధతిలో లావాదేవీలు నిర్వహించే వ్యాపారులకు టర్నోవర్ పరిమాణం ఆధారంగా క్యాష్‌బ్యాక్‌ను వర్తింపచేయనున్నారు. మే 4న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీ ముందు ఈ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ సిద్ధం చేస్తోంది. ప్రధాని కార్యాలయంలో ఇటీవల జరిగిన సమావేశంలో డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు ఈ తరహా ప్రోత్సాహకాలు ప్రకటించాలనే అంశంపై విస్తృతంగా చర్చించారు. ఇక డిజిటల్ లావాదేవీలు నిర్వహించే వ్యాపారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలనేదానిపైనా భారీ కసరత్తు జరిగింది. డిజిటల్ లావాదేవీలు చేపట్టే వ్యాపారులకు టర్నోవర్‌పై నిర్థిష్ట మొత్తంలో క్యాష్‌బ్యాక్ ప్రకటించడానికే రెవిన్యూ విభాగం మొగ్గుచూపినట్టు తెలిసింది. -
నోకియా ఫోన్స్ సేల్: క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
సాక్షి,న్యూఢిల్లీ: హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ ఇటీవల లాంచ్ చేసిన నోకియా స్మార్ట్ఫోన్ల విక్రయాలు భారత మార్కెట్లో సోమవారం ప్రారంభమయ్యాయి. నోకియా 6(2018)నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో స్మార్ట్ఫోన్లు అమెజాన్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. నోకియా 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్/కాప్, వైట్/కాపర్ కలర్ కాంబినేషన్లలో రూ.25,999 ధరకు లభిస్తోంది. ప్రీమియం సెగ్మెంట్లో నోకియా 8 సిరోకో స్మార్ట్‌ఫోన్ బ్లాక్ కలర్లో రూ.49,999 ధరకు అందుబాటులోఉంది. దీంతోపాటు ఆఫ్‌లైన్‌లో పలు రిటెయిల్ స్టోర్స్‌లోనూ విక్రయానికి లభ్యం. ముఖ్యంగా నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో ఫోన్లపై సంస్థ పలు క్యాష్ బ్యాక్ ఆఫర్లను వినియోగదారులకు అందిస్తోంది. కియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో కొనుగోలుపై ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్ , క్రెడిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం కాష్ బ్యాక్ ఆఫర్. అమెజాన్ నుంచి నోకియా 7 ప్లస్ కొనుగోలు చేసిన వారికి 2000 రూపాయల ఎయిర్టెల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. 36 నెలల వ్యవధిలో నిర్ణీత రీచార్జ్‌ల అనంతరం ఈ మొత్తాన్ని ఎయిర్టెల్ పే పేమెంట్‌బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. అలాగే నోకియా 8 సిరోకోపై ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.199, రూ.349 రీచార్జిలపై, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు రూ.399, రూ.499 ప్లాన్లపై అదనంగా 6 నెలల పాటు 20 జీబీ డేటాను నెల వారీగా అందిస్తున్నారు. అలాగే ఎయిర్టెల్ టీవీ యాప్‌కు డిసెంబర్ 31, 2018 వరకు ఉచిత సబ్స్క్రిప్షన్ అందిస్తున్నారు. దీంతోపాటు ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్, అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తోంది. నోకియా 7 ప్లస్ ఫీచర్లు 6 ఇంచ్ డిస్ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 12+13 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ నోకియా 8 సిరోకో ఫీచర్లు 5.5 ఇంచ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 12+13 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 3260 ఎంఏహెచ్ బ్యాటరీ , ఫాస్ట్, వైర్లెస్ చార్జింగ్ -
భీమ్ యాప్: మరోసారి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్లు అందించనుంది. నగదు రహిత లావాదేవీల కోసం లాంచ్ చేసిన ప్రభుత్వ యాప్ భీమ్ లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ అఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా గూగుల్ తేజ్, ఫ్లిప్‌కార్ట్ ఫోన్ పే మార్కెటింగ్ వ్యూహాలను ఫాలో అవుతూ ఇపుడు భీమ్ యాప్ ద్వారా కూడా ఆఫర్ల వెల్లువ కురిపించేందుకు తద్వారా వినియోగదారులను భారీగా పెంచేందుకు సిద్ధమవుతోంది. గతేడాది ఆగస్టులో భీమ్ లావాదేవీలు 40.5 శాతం ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో అది 5.75 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో వినియోగదారులు లావాదేవీలు అధికంగా జరిపేందుకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2016 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన భీమ్ యాప్ ద్వారా అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14నుంచి క్యాష్ బ్యాక్ ఆఫర్లను అమలు చేయనుంది. సుమారు రూ.900 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించింది. ఫోన్‌పే, తేజ్, పేటీఎం నమూనాలను పరిశీలించాం. క్యాష్‌బ్యాక్, ప్రోత్సాహకాలు ప్రకటించినప్పుడల్లా లావాదేవీలు అకస్మాత్తుగా పెరుగుతున్నాయి. ఇదొక ప్రవర్తనా మార్పు’ అని దీనిపై పనిచేస్తున్న ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నోట్ల రద్దు తరువాత డిజిటల్ లావాదేవీలపై దృష్టిపెట్టిన కేంద్రం గూగుల్ తేజ్, ఫోన్‌పే లావాదేవీలు పెరగడం, ఇటు భీమ్ యూపీఐ విధానం ద్వారా పనిచేసే ఈ యాప్‌లో లావాదేవీలు గణనీయంగా(సింగిల్ డిజిట్‌కు) పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఆఫర్‌తో కస్టమర్లకు నెలకు 750 రూపాయల వరకు వ్యాపారులు ఒక నెలలో రూ.1,000 వరకు అందించే అవకాశాన్ని కల్పిస్తోంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్లు భీమ్ యాప్ ద్వారా తొలి లావాదేవీ జరిపినప్పుడు (కనీస మొత్తం రూ.100కి) రూ.51 క్యాష్ బ్యాక్ లభ్యం. ఇలా వినియోగదారులకు గరిష్టంగా రూ.750 క్యాష్ బ్యాక్ అందిస్తుంది. అదే వ్యాపారులకయితే మొత్తంగా ఒక నెలకు రూ.1000 వరకు పొందవచ్చు. మరిన్ని వివరాలు అధికారిక వెబ్సైట్లో లభ్యం. కాగా భీమ్ యాప్ ద్వారా ఆఫర్లను మొదటిసారి కాదు. గత ఏడాది కూడా, ప్రభుత్వం రెండు కొత్త పథకాలను లాంచ్ చేసింది. భీమ్ రిఫరల్ బోనస్ స్కీమ్, భీమ్ మర్చంట్ క్యాష్ బ్యాక్ స్కీమ్ లను ప్రకటించి.. బహుమతులను అందించిన సంగతి తెలిసిందే. -
ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్స్
సాక్షి,ముంబై: ఏప్రిల్ 1న ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి డిస్కౌంట్ సేల్. ఏప్రిల్ ఫూల్ కాదండీ.. నిజంగానే.. వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రత్యేక డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. నో కిడ్డింగ్ డేస్ సేల్ పేరుతో ప్రత్యేక తగ్గింపు ధరలను వెల్లడించింది. ఏప్రిల్ 1, 2 తేదీల్లో రెండు రోజులపాటు ఈ ప్రత్యేక ధరలను ఆఫర్ చేస్తోంది. గృహోపకరణాలు, ఫర్నిచర్, గ్రూమింగ్ & హెల్త్‌కేర్ ఉత్పత్తులు, బేబీ కేర్, టాయ్స్, పర్సులు ఇలా వివిధ అంశాలపై డిస్కౌంట్లను అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది. గృహ, ఫర్నిచర్ విభాగంలో 80శాతం భారీ తగ్గింపు. మొబైల్ యాక్ససరీస్ ధరలు రూ.99నుంచిప్రారంభం. లాక్మే, నివియా లాంటి సౌందర్య ఉత్పత్తులపై 70శాతం తగ్గింపు. అంతేకాదు ప్రైస్ క్రాష్ అవర్స్ పేరుతో నిర్దేశిత సమయంలో స్పెషల్ డిస్కౌంట్స్.. స్పెషల్ కాంబో ఆఫర్లు అందిస్తోది. కొన్ని ప్రత్యేక ఉత్పత్తులనపు రెండు కొనుగోలు చేస్తే 10శాతం, మూడు వస్తులను కొంటే 15శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఇంటర్నేషనల్ బ్రాండ్లకు చెందిన దుస్తులు, బూట్లు, హ్యాండ్బాగ్స్ను రూ. 199 ప్రారంభ ధరకే అందిస్తోంది. ప్యూమా, లీ వంటి బ్రాండ్లలో 50 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీంతో పాటు ఫోన్ పే ద్వారా జరిపే కొనుగోళ్లపై 15శాతం తగ్గింపు అదనం. మరిన్ని వివరాలు ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్సైట్లో... -
జియో క్యాష్‌బ్యాక్ ఆఫర్ రిటర్న్స్...
రిలయన్స్ జియో తన కస్టమర్లకు ఆఫర్ చేస్తున్న క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. తన ప్రైమ్ కస్టమర్లకు మరో క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను జియో ప్రకటించింది. రూ.398, ఆపై మొత్తాల రీఛార్జ్‌లకు ఈ కొత్త జియో ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ కింద కస్టమర్లకు రూ.799 వరకు ప్రయోజనాలను అందించనున్నట్టు పేర్కొంది. రీఛార్జ్ ఓచర్లు, వాలెట్ క్యాష్‌బ్యాక్‌ల రూపంలో ఈ ప్రయోజనాలు కస్టమర్లకు అందనున్నాయి. ముందటి జియో క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో పోలిస్తే.. ప్రస్తుతం 99 రూపాయల ఎక్కువ ప్రయోజనాలను జియో అందిస్తోంది. గరిష్ట వాలెట్ క్యాష్‌బ్యాక్‌ను రూ.300 నుంచి రూ.399 పెంచింది. ఈ ఆఫర్ 2018 ఫిబ్రవరి 15(గురువారం) వరకు అందుబాటులో ఉంటుంది. జియో ముందు ఆఫర్ చేసిన క్యాష్‌బ్యాక్స్ మాదిరిగా కస్టమర్లకు రూ.398, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై రూ.50తో ఎనిమిది ఓచర్లను అందించనుంది. అంటే మొత్తంగా 400 రూపాయల ప్రయోజనాలు పొందనున్నారు. ఈ ఓచర్లతో రీఛార్జ్ ప్యాక్ కొనుగోలు చేసిన ప్రతిసారి రూ.50 తక్కువ చేసుకోవచ్చు. మిగతా రూ.399 మొత్తాన్ని కస్టమర్లకు వాలెట్ క్యాష్‌బ్యాక్ రూపంలో జియో ఆఫర్ చేయనుంది. మొబిక్విక్, పేటీఎం, అమెజాన్‌పే, ఫోన్‌పే, ఫ్రీఛార్జ్, యాక్సిస్ పే నుంచి ఈ క్యాష్‌బ్యాక్‌లు కస్టమర్లు పొందనున్నారు. ఎవరైతే మొబిక్విక్ వాలెట్ వాడి రూ.398 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్ చేయించుకుంటారో, వారికి రూ.2,500 వరకు హోటల్ ఓచర్ లభించనుంది. అదేవిధంగా పేటీఎం యూజర్లు తొలిసారి మూవీ టిక్కెట్ బుకింగ్‌పై 50 శాతం క్యాష్‌బ్యాక్ పొందనున్నారు. ఓచర్లు, క్యాష్‌బ్యాక్‌లను యూజర్లు వెంటనే రిడీమ్ చేసుకోవచ్చు. అక్టోబర్ నుంచి జియో అందిస్తున్న క్యాష్‌బ్యాక్ ఆఫర్లలో ఇది నాలుగవది. -
నోకియా ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, తన ప్లాట్‌ఫామ్‌పై నోకియా మొబైల్ వీక్ నిర్వహిస్తోంది. నేటి అర్థరాత్రి నుంచి ప్రారంభమైన ఈ మొబైల్ వీక్‌లో నోకియా 8, నోకియా 6 స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్చేంజ్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐదు రోజుల పాటు అంటే జనవరి 12 వరకు ఈ మొబైల్ వీక్‌ను అమెజాన్ నిర్వహించనుంది. ఈ సేల్‌లో భాగంగా నోకియా 6, నోకియా 8 స్మార్ట్ఫోన్లపై ఇన్స్టాంట్ డిస్కౌంట్ కింద రూ.1500 వరకు అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఈ ఇన్స్టాంట్ డిస్కౌంట్‌తో రూ.14,999గా ఉన్న నోకియా 6 స్మార్ట్‌ఫోన్ రూ.13,499కు దిగొచ్చింది. అంతేకాక రూ.36,999గా ఉన్న నోకియా 8 స్మార్ట్‌ఫోన్ రూ.35,499కు తగ్గింది. అంతేకాక ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు యూజర్లకైతే, అదనంగా ఫ్లాట్ రూ.1500 డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఆఫర్ అందుబాటులోకి రావాలంటే, కార్డుపై రూ.10వేల వరకు కొనుగోళ్లు జరపాల్సి ఉంటుంది. ఒక్కో కార్డుపై ఒక్కసారి మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ నోకియా 8 స్మార్ట్‌ఫోన్ అమెజాన్ పే వాడి కొనుగోలు చేస్తే, ఆ యూజర్లకు రూ.2000 క్యాష్‌బ్యాక్ లభించనుంది. అమేజింగ్ మొబైల్స్ లేదా గ్రీన్ మొబైల్స్‌లో మాత్రమే కొనుగోలు జరపాల్సి ఉంటుంది. అంతేకాక కస్టమర్లకు రూ.1500 ఐసీఐసీఐ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ లేదా రూ.2000 అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ ఏదో ఒకటి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎక్స్చేంజ్ ఆఫర్లో నోకియా 6ను కొనుగోలు చేస్తే మరో రూ.1000 డిస్కౌంట్‌ను కూడా అమెజాన్ ఆఫర్ చేస్తోంది. అంటే మొత్తంగా ఇరు స్మార్ట్ఫోన్లపై రూ.3000 వరకు క్యాష్‌బ్యాక్ లభించనుంది. -
పేటీఎం బ్యాంక్ కార్యకలాపాలు షురూ
⇔ 4 శాతం వడ్డీ రేటు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ⇔ 2020 నాటికి 50 కోట్ల మంది ఖాతాదారుల టార్గెట్ న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం మంగళవారం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించింది. డిపాజిట్లపై 4 శాతం వడ్డీ రేటు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉంటాయని ప్రకటించింది. అలాగే కనీస బ్యాలెన్స్ నిబంధనలు ఉండబోవని, ఆన్లైన్ లావాదేవీలకు (నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ మొదలైనవి) ఫీజులు ఉండవని పేర్కొంది. ఎయిర్టెల్, ఇండియా పోస్ట్ తర్వాత పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించిన సంస్థల్లో పేటీఎం మూడోది. చైనా దిగ్గజం ఆలీబాబా, జపాన్ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులున్న పేటీఎం.. రెండేళ్లలో తమ బ్యాంకింగ్ నెట్వర్క్ విస్తరణ కోసం ప్రాథమికంగా రూ. 400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తొలి ఏడాదిలో సంస్థ31 శాఖలు, 3,000 పైచిలుకు కస్టమర్ సర్వీస్ పాయింట్స్‌ను ప్రారంభించనుంది. కస్టమరు ఖాతాలో రూ. 25,000 డిపాజిట్లు దాటితే రూ. 250 క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు వెల్లడించిన పేటీఎం.. డిపాజిట్లపై ఈ తరహా క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇవ్వడం ఇదే ప్రథమమని పేర్కొంది. వ్యాపార వర్గాల కోసం కరెంటు అకౌంట్లు కూడా ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. ‘ఒక కొత్త తరహా బ్యాంకింగ్ మోడల్‌ను రూపొందించేందుకు ఆర్బీఐ మాకు అవకాశం కల్పిం చింది. మా ఖాతాదారుల డిపాజిట్లు.. సురక్షితమైన ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా జాతి నిర్మాణంలో పాలుపంచుకోనుండటం గర్వకారణం. డిపాజిట్లేవీ రిస్కులున్న సాధనాల్లోకి మళ్లించడం జరగదు‘ అని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. టెక్నాలజీ తోడ్పాటుతో 2020 నాటికల్లా 50 కోట్ల మంది ఖాతాదారులకు విశ్వసనీయ బ్యాంకుగా ఎదగాలని నిర్దేశించుకున్నట్లు బ్యాంక్ సీఈవో రేణు తెలిపారు. 22 కోట్ల మంది వాలెట్ యూజర్లు... ప్రస్తుతం పేటీఎం డిజిటల్ వాలెట్ వినియోగిస్తున్న వారి సంఖ్య 22 కోట్లుగా ఉంది. ఈ వాలెట్స్‌ను సంస్థ పేమెంట్ బ్యాంకుకు మళ్లించనుంది. యూజర్లు అకౌంటు ప్రారంభించేందుకు ఖాతాదారుల వివరాల వెల్లడి నిబంధనల (కేవైసీ) ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా కేవైసీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. తొలి దశలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలు ఆహ్వాన ప్రాతిపదికన ఉండనున్నాయి. బ్యాంకింగ్ బీటా యాప్ ఉద్యోగులు, అనుబంధ సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పేటీఎం కస్టమర్లు బ్యాంక్ వెబ్సైట్ లేదా యాపిల్ ఐవోఎస్ ప్లాట్‌ఫాంలోని పేటీఎం యాప్ ద్వారా ఇన్విటేషన్ పొందవచ్చు.