ఎస్‌బీఐ కార్డ్ యూజర్లకు బంపర్ ఆఫర్! | SBI Card to offer cashback for online shopping for 3 days | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ కార్డ్ యూజర్లకు బంపర్ ఆఫర్!

Published Wed, Sep 29 2021 8:02 PM | Last Updated on Wed, Sep 29 2021 8:12 PM

SBI Card to offer cashback for online shopping for 3 days - Sakshi

దసరా పండుగ సీజన్ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అన్నీ భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎస్‌బీఐ కార్డ్స్ తమ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ పండుగ సమయంలో మొబైల్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ల్యాప్ టాప్స్, కిచెన్ అప్లయన్సెస్, హోమ్ డెకార్, ఫర్నిషింగ్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ వంటి మొదలైన ఏ కేటగిరీల్లోనైనా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే వారికి 10 శాతం క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ఆఫర్ కేవలం అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 5, 2021 వరకు మాత్రమే ఉంటుంది.(చదవండి: జీన్స్‌, టీషర్ట్స్‌ లవర్స్‌కు షాకింగ్‌ న్యూస్‌...!)

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే సమయంలో ఈఎమ్ఐ కింద కొనుగోళ్లు చేసిన ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే, కొనే సమయంలోనే ఈఎంఐ ఆప్షన్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా, మీకు ఇష్టమైన ఈ-కామర్స్ సంస్థ నుంచి కొనుగోలు చేసినా ఆఫర్‌ వర్తిస్తుందని పేర్కొంది. అలాగే, ఆ మూడు రోజుల సమయంలో కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు కూడా కల్పిస్తామని తెలిపింది. వాటి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొంది. మరింత సమాచారం కోసం ఎస్‌బీఐ కార్డ్. కామ్ సందర్శించండి అని తెలిపింది.

(చదవండి: ఎస్‌బీఐ హోమ్ లోన్ ద‌ర‌ఖాస్తుకు కావాల్సిన ధ్రువ పత్రాలు ఇవే..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement