ఐఫోన్‌-13 కొనుగోలుపై వోడాఫోన్‌-ఐడియా బంపర్‌ ఆఫర్‌...! | Vodafone Idea Offers On IPhone 13 Pre Orders | Sakshi
Sakshi News home page

Vodafone Idea Offers On IPhone 13: ఐఫోన్‌-13 కొనుగోలుపై వోడాఫోన్‌-ఐడియా బంపర్‌ ఆఫర్‌...!

Published Sun, Sep 19 2021 8:21 PM | Last Updated on Sun, Sep 19 2021 8:28 PM

Vodafone Idea Offers On IPhone 13 Pre Orders - Sakshi

ఐఫోన్‌ -13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను సెప్టెంబర్‌ 14 ఆపిల్‌ లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే.  భారత్‌లో ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ ప్రీ ఆర్డర్లు నేటి నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్‌ 13 స్మార్ట్‌ఫోన్లను మైవీఐ.కామ్‌, వీఐ యాప్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి ఫ్లాట్‌ఫాంలో ప్రీబుకింగ్స్‌ చేసుకోవచ్చును. తాజాగా వోడాఫోన్ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఐఫోన్ 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను ప్రీ-ఆర్డర్ చేసిన కొనుగోలుదారులకు ప్రత్యేక డీల్,  క్యాష్‌బ్యాక్ అందిస్తామని వోడాఫోన్-ఐడియా ప్రకటించింది. ఈ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ వోడాఫోన్‌-ఐడియా పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. వీఐ- వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేసిన కస్టమర్లకు ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను  సెప్టెంబర్‌ 25న పొందవచ్చును.  
చదవండి: Amazon Great Indian Festival Sale: బ్లాక్‌బస్టర్‌ డీల్స్‌తో..అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌

ఐఫోన్‌-13 సిరీస్‌ కొనుగోలుపై వీఐ అందిస్తోన్న ఆఫర్లు...!
వీఐ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేసిన కస్టమర్లు వీఐ రెడ్‌ఎక్స్‌ ప్లాన్లను కచ్చితంగా సబ్‌స్రైబ్‌ చేసుకొని ఉండాలి. రెడ్‌ఎక్స్‌ ప్లాన్స్‌ రూ. 1099, రూ. 1699,ఫ్యామీలీ ప్యాక్‌ రూ. 2299 పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లపై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను వీఐ అందించనుంది. క్యాష్‌బ్యాక్ ఆరు నెలల వ్యవధిలో రిఫ్లెక్ట్‌ అవుతోందని వీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, కాంప్లిమెంటరీ ఇంటర్నేషనల్ రోమింగ్,  ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ప్రీమియం కస్టమర్ సర్వీస్ , మరెన్నో వాటితో పాటు ప్రీమియం ఎంటర్‌టైన్‌మెంట్‌తో సహా రెడ్‌ఎక్స్‌ ప్లాన్‌లో భాగంగా ప్రయోజనాలను పొందవచ్చును. అదనంగా, రూ .299 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్‌పై ఐఫోన్ 13 కొనుగోలుదారులకు డబుల్ డేటా ప్రయోజనాలను అందిస్తున్నట్లు వీఐ ప్రకటించింది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్‌లతో సహా ఐఫోన్ 13 సిరీస్  అన్ని మోడళ్ల కొనుగోలుపై ఈ ఆఫర్లన్నీ అందుబాటులో ఉన్నాయి.
చదవండి: 20 నిమిషాల ఛార్జింగ్‌తో 482 కి.మీ ప్రయాణం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement