యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు బంపరాఫర్. దేశంలో దసరా ఫెస్టివల్ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌లు ప్రత్యేక సేల్ ను నిర్వహించనున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 30వరకు నిర్వహించనున్న సేల్‌లో ల్యాప్ ట్యాప్స్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. యాపిల్ లేటెస్ట్‌గా విడుదల చేసిన ఐఫోన్‌లను సైతం డిస్కౌంట్‌కే అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది.
ప్రస్తుతం ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ ధరల్ని ఫ్లిప్‌కార్ట్ తన సైట్‌లో లిస్ట్ చేసింది. లిస్టింగ్ చేసిన ధరల ప్రకారం.. ఐఫోన్ 13 ప్రారంభ ధర రూ.69,900, ఐఫోన్ 13 ప్రో ప్రారంభ ధర రూ.1,19,900, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ.1,26,000గా ఉంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో తగ్గించనుంది. ప్రస్తుతం ఆ ధరలు ఇలా ఉన్నాయంటూ ఫ్లిప్ కార్ట్‌తో పాటు పలు టెక్ బ్లాగ్‌లు కథనాల్ని ప్రచురించాయి. ఆ వివరాల ప్రకారం..
యాపిల్ ఐఫోన్ ధరలు
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్‌లో ఐఫోన్ 13ప్రో ప్రారంభ ధర రూ.89,900, ఐఫోన్ 13ప్రో మ్యాక్స్ ధర రూ.99,990గా ఉంది. అయితే ఐఫోన్ 13 ధర రూ.49,990 కంటే తక్కువ ధరకే లభించనుంది.
ఐఫోన్ 12 సిరీస్
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్‌లో ఐఫోన్ 12 మిని రూ.39,990 అంతకంటే తక్కువగా ఐఫోన్ 11 ధర రూ.29,990 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ తగ్గింపు ధరలతో పాటు ఇతర ఐఫోన్ సిరీస్‌ల కొనుగోళ్లపై డిస్కౌంట్స్, ఆఫర్స్ అందించనుంది. కాగా, ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 12 మిని ప్రారంభ ధర రూ.55,359 ఉండగా, ఐఫోన్ 11 ప్రారంభం ధర రూ.43,990గా ఉంది. వీటి ధర సెప్టెంబర్ 23నుంచి భారీగా తగ్గనున్నాయి.
ఎప్పుడు విడుదలయ్యాయంటే?
ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక సేల్‌లో డిస్కౌంట్ ధరలకే లభ్యమయ్యే ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ గతేడాది అక్టోబర్ నెలలో యాపిల్ సంస్థ విడుదల చేసింది. అమెరికా క్యాలిఫోర్నియా యాపిల్ ప్రధాన కార్యాలయం క్యూపర్టినో వేదికగా క్యాలిఫోర్నియా స్ట్రీమింగ్ పేరుతో ఈవెంట్‌ను నిర్వహించింది. ఆ ఈవెంట్‌లో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ విడుదలైంది. అక్టోబర్ 2020లో ఐఫోన్ 12 మినీ, సెప్టెంబర్ 2019లో ఐఫోన్ 11 సిరీస్ ఫోన్‌లను యాపిల్ మార్కెట్‌కు పరిచయం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment