ఐఫోన్ ప్రియులకు శుభవార్త. త్వరలో విడుదల కానున్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ధరల్ని ఐఫోన్ 13 ధరలకే యాపిల్ అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐఫోన్ 14 మోడల్ ప్రారంభ ధర దాదాపు రూ. 80,000 ఉండవచ్చంటూ ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది.
కొరియన్ టెక్ బ్లాగ్ Naverలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, పరిమిత సంఖ్యలో సప్లయ్ చైన్ సమస్యలు ఇతర కారణాల్ని పరిగణలోకి తీసుకున్న యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు యాపిల్ 14 ధరల్ని పెంచే యోచన లేదని టెక్ బ్లాగ్ పేర్కొంది. అయితే స‍్తబ్ధుగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్, డిమాండ్ తగ్గుదల కారణంగా యాపిల్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ నిర్ణయం తీసుకున్నారని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అదే జరిగితే యుఎస్‌లో ఐఫోన్14 ధర 799 డాలర్లు ఉండగా.. మనదేశంలో ఆ ఫోన్ ధర రూ. 63,200కే లభ్యం కానుంది. జీఎస్టీ, దిగుమతి సుంకం,ఇతర ఛార్జీల్ని కలుపుకొని ఈ ఫోన్ ధర పెరిగే అవకాశం ఉండనుంది. కానీ, గతేడాది యూఎస్ మార్కెట్‌లో ఐఫోన్ 13 ఫోన్ సిరీస్‌కు సమానంగా భారత్ మార్కెట్‌లో అదే సిరీస్ ఫోన్ లభ్యమయ్యాయని.. కాబట్టి భారత్‌లో సైతం ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ధరలు పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment