BHIM App Offers: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ భీమ్ (BHIM) తమ యూజర్లకు సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. రూ. 750 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్లు పొందడానికి కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది.
యూజర్ బేస్ పెంచుకునేందుకు మొదట్లో గూగుల్ పే అందించినట్టుగానే భీమ్ యాప్ కూడా విభిన్న క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. ఇందులో రూ. 750 వరకు క్యాష్‌బ్యాక్ అందించే రెండు రకాల ఆఫర్లు ఉన్నాయి. వీటితో పాటు అదనంగా 1 శాతం క్యాష్ బ్యాక్ వచ్చే మరో ఆఫర్ కూడా ఉంది.
భీమ్ యాప్‌లో ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ అయ్యేందుకు 7 వారాల కన్నా ఎక్కువ సమయం పడుతుందని గమనించాలి. ఆఫర్లను మరింత కాలం పొడిగించే అవకాశం ఉందా అన్నదానిపై స్పష్టత లేదు.
రూ.750 క్యాష్‌బ్యాక్ ఎలా పొందాలంటే..
ఫుడ్ ఆర్డర్లు, ట్రావెల్ చేసే యూజర్లు భీమ్ యాప్ ద్వారా రూ. 150 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్లు, ట్రావెల్ ఖర్చులు అంటే రైల్వే టిక్కెట్ బుకింగ్‌లు, క్యాబ్ రైడ్‌లు, మర్చంట్ యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించే రెస్టారెంట్ బిల్లులపై రూ. 100 మించి లావాదేవీలు చేస్తే రూ. 30 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్‌ను కనీసం 5 సార్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. తద్వారా గరిష్టంగా రూ. 150 క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు.
ఇక రూ. 600 క్యాష్‌బ్యాక్ అందించే మరో ఆఫర్ కూడా ఉంది. రూపే క్రెడిట్ కార్డులను భీమ్ యాప్‌నకు లింక్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు. అన్ని మర్చంట్ యూపీఐ పేమెంట్లపై రూ. 600 క్యాష్‌బ్యాక్ రివార్డ్‌ను అందుకోవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా ఒక్కొక్కటి రూ. 100 దాటిన మొదటి మూడు లావాదేవీలపై రూ. 100 క్యాష్‌బ్యాక్, ఆ తర్వాత ప్రతి నెలా రూ. 200 దాటిన 10 ట్రాన్సాక్షన్స్‌పై రూ. 30 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇలా ఈ ఆఫర్లన్నీ కలుపుకొంటే మొత్తంగా రూ.600 క్యాష్‌బ్యాక్‌ను అందుకోవచ్చు.
ఇవేకాకుండా భీమ్ యాప్ ఉర్జా (Urja) ఒక శాతం స్కీమ్‌ను కూడా అందిస్తోంది. దీని కింద పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీతో సహా అన్ని ఫ్యూయల్ పేమెంట్లపై 1 శాతం ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ రూ. 100 లేదా అంతకు పైబడి ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్స్, గ్యాస్ బిల్లుల వంటి యుటిలిటీ బిల్లు చెల్లింపులపై కూడా వర్తిస్తుంది. భీమ్ యాప్‌తో లింక్ చేసిన ప్రైమరీ బ్యాంక్ అకౌంట్లలో ఈ క్యాష్‌బ్యాక్ నేరుగా క్రెడిట్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment