నోకియా ఫోన్స్‌ సేల్‌: క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు | Nokia 7 Plus, Nokia 8 Sirocco go on sale in India | Sakshi
Sakshi News home page

నోకియా ఫోన్స్‌ సేల్‌: క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు

Published Mon, Apr 30 2018 2:12 PM | Last Updated on Mon, Apr 30 2018 3:02 PM

Nokia 7 Plus, Nokia 8 Sirocco go on sale in India - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ  ఇటీవల లాంచ్‌ చేసిన  నోకియా స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు భారత మార్కెట్లో సోమవారం  ప్రారంభమయ్యాయి. నోకియా 6(2018)నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో స్మార్ట్‌ఫోన్లు  అమెజాన్‌ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. నోకియా 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్/కాప్, వైట్/కాపర్ కలర్‌ కాంబినేషన్లలో రూ.25,999 ధరకు   లభిస్తోంది.  ప్రీమియం సెగ్మెంట్‌లో నోకియా 8 సిరోకో స్మార్ట్‌ఫోన్ బ్లాక్ కలర్‌లో రూ.49,999 ధరకు అందుబాటులోఉంది. దీంతోపాటు  ఆఫ్‌లైన్‌లో పలు రిటెయిల్ స్టోర్స్‌లోనూ విక్రయానికి లభ్యం.

ముఖ్యంగా  నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో ఫోన్లపై సంస్థ పలు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను వినియోగదారులకు అందిస్తోంది. కియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో  కొనుగోలుపై ఐసీఐసీఐ  బ్యాంకు డెబిట్ ,  క్రెడిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం కాష్‌ బ్యాక్‌ ఆఫర్‌. అమెజాన్  నుంచి నోకియా 7 ప్లస్ కొనుగోలు చేసిన వారికి 2000 రూపాయల ఎయిర్‌టెల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ కూడా ఉంది. 36 నెలల వ్యవధిలో  నిర్ణీత రీచార్జ్‌ల అనంతరం ఈ మొత్తాన్ని ఎయిర్‌టెల్‌ పే పేమెంట్‌బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది.  అలాగే నోకియా 8 సిరోకోపై ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.199, రూ.349 రీచార్జిలపై, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు రూ.399, రూ.499 ప్లాన్లపై అదనంగా 6 నెలల పాటు 20 జీబీ డేటాను నెల వారీగా అందిస్తున్నారు. అలాగే ఎయిర్‌టెల్ టీవీ యాప్‌కు డిసెంబర్ 31, 2018 వరకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్నారు.  దీంతోపాటు  ఆకర్షణీయమైన ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌, అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తోంది.


నోకియా 7 ప్లస్ ఫీచర్లు
6 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
4 జీబీ ర్యామ్
 64 జీబీ స్టోరేజ్
12+13 ఎంపీ డ్యుయల్ రియర్‌ కెమెరాలు
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

నోకియా 8 సిరోకో ఫీచర్లు
5.5 ఇంచ్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
 12+13 ఎంపీ డ్యుయల్  రియర్‌ కెమెరా
 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
 3260 ఎంఏహెచ్ బ్యాటరీ , ఫాస్ట్, వైర్‌లెస్  చార్జింగ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement