smartphones sales
-
5జీ స్మార్ట్ఫోన్లదే హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు జోరందుకున్నాయి. 2021తో పోలిస్తే గతేడాది 5జీ మోడళ్ల అమ్మకాలు 74 శాతం అధికం అయ్యాయి. కస్టమర్ల చేతుల్లోకి వెళ్లిన ఈ 5జీ స్మార్ట్ఫోన్ల విలువ సుమారు రూ.1.65 లక్షల కోట్లు ఉంటుందని సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) తన నివేదికలో వెల్లడించింది. కఠినమైన మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో 2022లో మొత్తం మొబైల్స్ సేల్స్ 17 శాతం, స్మార్ట్ఫోన్ల విక్రయాలు 8 శాతం తగ్గడం గమనార్హం. అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ 28 శాతం క్షీణించింది. 2023లో స్మార్ట్ఫోన్ల పరిశ్రమ చక్కటి వృద్ధి తీరుతో 16–16.5 కోట్ల యూనిట్లు ఉండే వీలుంది. ప్రీమియం వైపునకు మార్కెట్.. మరోవైపు రూ.1 లక్ష ఆపైన ఖరీదు చేసే అల్ట్రా ప్రీమియం విభాగం ఏకంగా 95 శాతం దూసుకెళ్లిందని సీఎంఆర్ వెల్లడించింది. రూ.7 వేల లోపు ధర ఉండే మొబైల్స్ సేల్స్ గతేడాది 55 శాతం తగ్గాయి. సరఫరా సమస్యలు, ఆర్థిక సవాళ్లు ఇందుకు కారణం. రూ.7–25 వేల ధరల శ్రేణిలో విక్రయాలు 8 శాతం క్షీణించాయి. రూ.25,000 నుంచి రూ.50,000 మధ్య ఉండే ప్రీమియం మోడళ్ల అమ్మకాలు 12 శాతం, రూ.50,000 నుంచి రూ.1 వరకు ఉండే సూపర్ ప్రీమియం 41 శాతం దూసుకెళ్లాయి. స్మార్ట్ఫోన్ల మార్కెట్లో యాపిల్ వాటా 4 శాతం. గతేడాది ఈ సంస్థ 17 శాతం వృద్ధి నమోదు చేసింది. యాపిల్ విక్రయాల్లో రూ.50,000–1,00,000 ధరల శ్రేణి మోడళ్ల వాటా 79 శాతం ఉంది. -
టెక్ దిగ్గజం యాపిల్‌కు రూ.870 కోట్ల ఫైన్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు జపాన్ ప్రభుత్వం భారీ ఎత్తున ఫైన్ విధించింది. జపాన్ రాజధాని టోక్యో నుంచి యాపిల్ సంస్థ ఐఫోన్ అమ్మకాల్ని నిర్వహిస్తుంది. అయితే టోక్యోకి వచ్చే విదేశీయులకు యాపిల్ కంపెనీ భారీ ఎత్తున ఐఫోన్లతో పాటు ఇతర డివైజ్‌లపై ఎలాంటి దిగుమతి సుంకం చెల్లించకుండా బల్క్‌లో ఫ్రీగా అమ్ముకోవడం ఏంటని ప్రశ్నించింది. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు నిర్వహించిన యాపిల్ 105 మిలియన్లు (రూ. 870 కోట్లు) చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు క్యోడో మీడియా పలు కథనాల్ని ప్రచురించింది. క్యోడో నివేదిక ప్రకారం..జపాన్‌లో యాపిల్ సంస్థ $1,04,16,84,000 (రూ. 8,634 కోట్లు) పన్ను మినహాయింపు పొందింది. ఇంపోర్ట్ డ్యూటీ చెల్లించకుండా సెప్టెంబర్ 2021 నుండి రెండు సంవత్సరాల పాటు విక్రయాలు సాగించినట్లు ట్యోక్యో రీజనల్ ట్యాక్సేషన్ బ్యూరో అధికారులు గుర్తించారు. యాపిల్ తన వ్యాపార ప్రయోజనాల కోసం ప్రొడక్ట్‌లపై రీసేల్ నిర్వహించినట్లు పేర్కొంది. అనైతికంగా వ్యాపారం యాపిల్ అనైతికంగా నిర్వహిస్తున్న బిజినెస్‌పై దృష్టిసారించిన ట్యాక్సేషన్ బ్యూరో గతేడాది నుంచి విచారణ చేపట్టింది. ఈ విచారణలో అసాదారణ లావేదేవీలు, యాపిల్ స్టోర్ నుంచి వందల సంఖ్యలోని యాపిల్ డివైజ్‌లను టూరిస్ట్‌లకు అమ్మినట్లు గుర్తించిందని జపాన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అందుకే తక్కువ సేల్స్ (underreported) నిర్వహించిన ప్రొడక్ట్‌లపై 105 మిలియన్ల అదనపు పన్ను, ట్యాక్స్ చెల్లించాల్సిన ఉత్పత్తులపై అదనపు వినియోగపు పన్నును భారీగా విధించనుంది. టూరిస్ట్‌ల ముసుగులో జపాన్‌కు వచ్చిన విదేశీయులు ఆరు నెలలలోపు కొనుగోలు చేసే వస్తువులపై ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే అదే వస్తువుల్ని రీసేల్ చేస్తే.. జరిపిన విక్రయాలను బట్టి పన్ను కట్టాలి. కాబట్టే యాపిల్..ఐఫోన్లు, ఇతర ప్రొడక్ట్‌లను జపాన్‌కు వచ్చే టూరిస్ట్‌లకు విక్రయించి.. ఆపై వాటిని విదేశాలకు భారీ ఎత్తున తరలించి పన్ను మినహాయింపు పొందేలా బిజినెస్ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నట్లు ట్యాక్స్ బ్యూరో అధికారులు అనుమానిస్తున్నారు. చైనా పౌరులపై కేసులు 2020లో జపాన్ను సందర్శించేందుకు టూరిస్ట్, ఇతర వీసాలను ఉపయోగించిన ఏడుగురు చైనీయులపై కేసులు నమోదయ్యాయి. ఒసాకా ప్రాంతీయ ట్యాక్స్ బ్యూరో అధికారులు వారి కొనుగోళ్లపై సుమారు $56,58,162 (దాదాపు రూ. 46 కోట్లు)ను వసూలు చేసింది. క్యోడో నివేదించిన ప్రకారం రూ. 475 కోట్ల విలువైన లగ్జరీ బ్రాండ్ వస్తువులు. వాచీలు, హ్యాండ్‌బ్యాగ్‌లతో కూడిన ఉత్పత్తులను రీసేల్ కోసం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కాగా, ఈ ఏడాది జూన్‌లో రీసేల్ నిర్వహించేందుకు డిపార్ట్మెంటల్ స్టోర్లలో కాస్మోటిక్స్‌తో పాటు ఇతర ఉత్పత్తులను పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపిన సందర్భాలు వెలుగులోకి రావడంతో ట్యాక్స్ బ్యూరో అడ్మినిస్ట్రేటీవ్ అధికారులు అప్రమత్తమయ్యారు. డిపార్ట్మెంట్ స్టోర్ల యజమానులు అనైతికంగా విక్రయాలు జరపొద్దని ఆదేశాలు జారీ చేశారు. చదవండి👉 ఎలాన్ మస్క్‌కు మరో ఎదురు దెబ్బ..‘టిమ్ కుక్ ఇక్కడ ఏం జరుగుతోంది’? -
సగం ధరకే రెడ్ మీ స్మార్ట్‌ఫోన్స్.. ఎక్కడంటే..!
సాక్షి,ముంబై: స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్మీ పేరెంట్ కంపెనీ ఎంఐ క్లియరెన్స్ సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్ అతి తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లను అందిస్తోంది. ఈ సేల్‌లో కొనుగోలుదారులు రూ. 3,999కే స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎంఐ క్లియరెన్స్ సేల్కు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. దీని ప్రకారం రెడ్ మీ 6ఏ, రెడ్ మీ వై3, రెడ్ మీ నోట్ 7 ప్రో. వంటి మోడల్స్ ను దాదాపు సగం ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎంట్రీ-లెవల్ బడ్జెట్ ఫోన్ రెడ్ మీ 6ఏ మోడల్ ప్రారంభ ధర రూ.6,999 కాగా, క్లియరెన్స్ సేల్ లో దీన్ని రూ. 3,999కి అందుబాటులో ఉంచింది. ప్రాథమిక ఫీచర్లతో, 2జీ ర్యామ్, 16జీబీ స్టోరేజీతో వచ్చిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ 6ఏ, దీంతోపాటు మిగతా మోడళ్లను కూడా తక్కువకే ఎంఐ సేల్‌లో లభ్యం. అయితే ఈ సేల్‌లో తగ్గింపుతో కొనుగోలు చేసిన స్మార్ట్ఫోన్లు వారంటీని కలిగి ఉండవు అనేది గమనార్హం. -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్: ఐఫోన్13పై కళ్లు చెదిరే ఆఫర్
సాక్షి, ముంబై: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రానున్న దీపావళి సందర్భంగా బిగ్ సేల్ ప్రకటించింది. ఈ సందర్బంగా 30వేల లోపు స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్స్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సాధారణ యూజర్లకు సంబంధించిన ఈ సేల్ అక్టోబర్ 16 వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా నథింగ్, గూగుల్, శాంసంగ్, రియల్ మీ, పోకోతో పాటు పలు బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఎస్బీఐ కార్డుకొనుగోళ్లపై అదనపు తగ్గింపు కూడా లభ్యం. (Maiden Pharma వివాదాస్పద మైడెన్కు భారీ షాక్: అక్టోబరు 14 వరకు గడువు) ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ 13పై కళ్లు చెదిరే అఫర్ అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్సైట్లో ఆపిల్ ఐఫోన్ 128 జీబీ ధర రూ. 58,900. దీనికి రూ. 2 వేల అదనపు తగ్గింపును పొందవచ్చు. అలాగే రూ.16,900 ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ డిస్కౌంట్ల తరువాత ఐఫోన్ 13ని దాదాపు రూ. 45,000కి సొంతం చేసుకోవచ్చన్న మాట. రెండు నెలల క్రితం మార్కెట్లోకి వచ్చిన నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో దాదాపు రూ. 27,000కి అందుబాటులో ఉంది. దీనికి ఎస్బీఐ ఆఫర్ కూడా అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3 స్మార్ట్ ఫోన్ ఫ్లాట్ తగ్గింపు తర్వాత రూ.59,999కి అందుబాటులో ఉంది. ఇంకా గూగుల్ పిక్స్ల్ 6ఏ ఫోను రూ. 27,999కి అందుబాటులో ఉంది. వీటి కొనుగోళ్లపై అదనంగా ఎస్బీఐ 10 శాతం తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. గృహోపకరణాలపై 75 శాతం, టీవీలపై కూడా ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్టీ సందర్భంగా టీవీలు, ఆడియో ఉత్పత్తులపై తగ్గింపులను కూడా అందిస్తుంది. గృహోపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపు ఉంటుందని కంపెనీ తెలిపింది. వినియోగదారులు రూ. 17,249కే 4కె టీవీలను కొనుగోలు చేయవచ్చు. అలాగే సాధారణ హెచ్డీ స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. -
స్మార్ట్‌ఫోన్ బొనాంజా: నిముషానికి ఎన్ని ఫోన్స్ కొన్నారో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిముషానికి 1,100 మొబైల్ ఫోన్లు.. పండగల సీజన్ విక్రయాల్లో భాగంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల వేదికలపై నాలుగు రోజుల్లో అమ్ముడైన సంఖ్య ఇది. వీటి విలువ రూ.11,000 కోట్లు అని కన్సల్టెన్సీ కంపెనీ రెడ్‌సీర్ వెల్లడించింది. ‘సెప్టెంబర్ 22-25 మధ్య ఈ–కామర్స్ సంస్థలు రూ.24,500 కోట్ల వ్యాపారం నమోదు చేశాయి. సేల్-1 అంచనా విక్రయాల్లో ఇది 60 శాతం. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, మీషో మెగా బ్లాక్‌బస్టర్ సేల్‌తోపాటు మింత్రా, అజియో, నైకా తదితర వేదికలు సేల్-1లో ఉన్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఫ్యాషన్ విభాగం నాలుగున్నర రెట్లు అధికంగా అమ్మకాలు జరిగి రూ.5,500 కోట్లకు చేరుకున్నాయి’ అని వివరించింది. -
అదిరిపోయే సేల్..అస్సలు మిస్సవ్వద్దు! 75 శాతం భారీ డిస్కౌంట్!
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ మరో సేల్‌తో ముందుకు వచ్చింది. ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 10 వరకు గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ ఆఫర్ సేల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, ఎల్జీ ఓఎల్ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లపై ఆఫర్లు అందిస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధులు వెల్లడించారు. ఇక ఈ సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అదనంగా 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు. 60 రకాలైన ప్రొడక్ట్‌లు లాంచ్ కానున్న ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, యాక్ససరీస్‌పై 40శాతం డిస్కౌంట్‌కే కొనుగోలు చేసే అవకాశం లభిస్తుండగా.. బడ్జెట్ స్మార్ట్ఫోన్లు రూ. 6,599కే కొనుగోలు చేయొచ్చు. మొబైల్ ఉపకరణాలు రూ.69 నుంచి ప్రారంభం కానున్నాయి. ల్యాప్‌టాప్ కొనుగోలుదారులు రూ.40,000 వరకు డిస్కౌంట్, హెడ్ఫోన్లపై 75శాతం వరకు డిస్కౌంట్, ట్యాబ్స్‌పై 45శాతం డిస్కౌంట్, స్మార్ట్‌వాచ్‌లపై 70శాతం డిస్కౌంట్ ఉంటుందని అమెజాన్ తెలిపింది. అదనంగా టీవీలు,ఉపకరణాలపై 60 శాతం, ప్రీమియం టీవీలు 50 శాతం డిస్కౌంట్ ధరలో లభిస్తాయి.ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్‌తో పాటు మొబైల్ ఫోన్ కొనుగోళ్లపై నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ పొందవచ్చు. -
రూ.20 వేల లోపు లభించే బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే!
టెక్నాలజీ పెరిగే కొద్ది స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు తయారీ సంస్థలు కొత్త కొత్త ఫీచర్లు, సరికొత్త హంగులతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఆ ఫోన్ల విడుదల ఎక్కువైంది. కొనుగోలు దారులు సైతం ఆకట్టుకునే ఫోన్లు కళ్లెదురుగా కనిపిస్తుంటే ఏ ఫోన్ కొనుగోలు చేయాలో అర్ధం గాక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. అందుకే పనితీరు బాగుండి.. కెమెరా, బ్యాటరీ, స్మూత్ డిస్ప్లేతో రూ.20వేలకు మార్కెట్లో ఇప్పటికే కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటున్న ఫోన్ల గురించి తెలుసుకుందాం. 5జీ పోకో ఎక్స్4 ప్రో రూ.20వేల లోపు బడ్జెట్ ధరలో లభ్యమయ్యే ఫోన్ల స్థానంలో పోకో ఎక్స్4 ప్రో నిలిచింది. 6.67 అంగుళాలతో ఎఫ్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఫాస్ట్ ఫర్మామెన్స్ కోసం స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 5000ఏఎంహెచ్ బ్యాటరీ, 67డబ్ల్యూ ఛార్జర్, 64 ఎంపీ లెడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో లభ్యం అవుతుంది 5జీ రెడ్మీ నోట్ 11ప్రో షావోమీకి చెందిన రెడ్ మీ నోట్ 11ప్రో. దీని ధర రూ.18,999గా ఉంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే హేలియా జీ96 చిప్ సెట్‌తో రూ.20వేల లోపు బడ్జెట్ ధర ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుంటే ఈ ఫోన్లో బీజీఎంఐ,కాల్ ఆఫ్ డ్యూటీ (సీఓడీ) లాంటి హై గ్రాఫిక్స్ గేమ్స్‌ను ఈజీగా ఆడుకోవచ్చు. అంతేకాదు 6.67 ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ రేట్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు. 5జీ ఐక్యూ జెడ్6 రూ.15వేల లోపు బడ్జెట్ ఫోన్ కోసం చూస్తున్నట్లైతే ఐక్యూ జెడ్6 బెస్ట్ ఆప్షన్ అని మార్కెట్ పండితులు చెబుతున్నారు. ఎందుంటే ఇందులో ఆండ్రాయిడ్ 12 ఎక్స్పీరియన్స్, బ్యాటరీ లైఫ్, కెమెరా పనితీరు బాగుండటమే కాదు.. స్నాప్ డ్రాగన్ 696 చిప్సెట్తో వస్తుంది. 50 ఎంపీ,2ఎంపీ, 2 ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో డిజైన్ చేసింది ఉంది. ఈ ఫోన్ ధర రూ.14,999గా ఉంది. 5జీ రియల్ మీ 9ప్రో రియల్ మీ 9ప్రోలో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్, 6.6 అంగుళాల డిస్ప్లే,120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ,33 డబ్ల్యూ ఛార్జర్, 64ఎంపీ నైట్ స్కేప్ కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు 2 ఎంపీ మైక్రో లెన్స్‌తో అందుబాటులో ఉంది. మోటోజీ52 మోటరోలా మోటో జీ 52 సూపర్ డిస్ల్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33 డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అండ్ 2ఎంపీ సెన్సార్లతో ఈ ఫోన్ రూ.14,999కే లభ్యమవుతుంది. -
ఫ్లిప్ కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్లు, వాటిపై ఏకంగా 80శాతం డిస్కౌంట్లు!!
మార్చి 18న జరగాల్సిన హోలీ వారం రోజుల ముందే వచ్చేసింది. ఉక్రెయిన్ -రష్యా దేశాల యుద్ధం కారణంగా దేశీయంగా మండి పోతున్న ధరల నుంచి ఉపశమనం పొందేలా వినియోగదారులకు ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్లు ప్రకటించింది. హోలీ ఫెస్టివల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ మార్చి12 నుంచి మార్చి 16వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్స్‌ను ప్రారంభించనుంది. ఈ సేల్‌లో పలు ప్రొడక్ట్‌లపై భారీ ఎత్తున అంటే 80శాతం డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపింది. బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ ఈ సేల్స్‌లో దిగ్గజ కంపెనీల స్మార్ట్ ఫోన్లు యాపిల్, రియల్ మీ,ఒప్పో,శాంసంగ్ 60శాతం వరకు డిస్కౌంట్‌కే అందించనున్నట్లు తెలుస్తోంది. ల్యాప్ టాప్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్‌లో స్మార్ట్ వాచెస్ పై 60శాతం, ట్రిమ్మర్స్ అండ్ షేవింగ్ కిట్లపై 70శాతం,ల్యాప్టాప్స్ పై 40శాతం, వన్ ప్లస్,బోట్,జేబీఎల్, రియల్ మీకి చెందిన ఫోర్టబుల్ స్పీకర్స్, హెడ్ ఫోన్స్‌పై 80 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. మిగిలిన ఉత్పత్తులపై హోలీ సందర్భంగా చేసే షాపింగ్‌లో దుస్తులపై 80శాతం డిస్కౌంట్ అందిస్తుండగా, హోమ్, కిచెన్ ఎషెన్షియల్, ఫర్నీచర్, జిమ్, న్యూట్రిషియన్, గ్రాసరీస్‌ను డిస్కౌంట్లలో కొనుగోలు చేయోచ్చు. ఆఫర్లో ఇంకా మార్చి 12 శనివారం తెల్లవారు జామున 2గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్స్ ప్రారంభం కానుంది. ఈ సేల్ ప్రారంభం నుంచి ప్రతి రోజు తెల్లవారు జాము 12ఏమ్, 8ఏమ్, 4పీఎం కొత్త డీల్స్‌ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. రష్ అవర్‌లో ఎర్లీ బర్డ్స్ సేల్స్‌లో మరిన్ని డిస్కౌంట్లను అందిస్తామని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు స్పష్టం చేశారు. చదవండి: యాపిల్ ఈవెంట్: టెక్ లవర్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కొత్త ప్రొడక్ట్‌లు!! -
అదిరిపోయే బంపరాఫర్!! 60శాతం డిస్కౌంట్‌తో అమెజాన్ సేల్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, యాక్సెసరీస్‌లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ అండ్ ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 28వరకు జరగనున్న ఈసేల్‌లో శాంసంగ్, వన్ ప్లస్, ఐక్యూ, రియల్ మీ తోపాటు ఇతర బ్రాండ్లను తక్కువ ధరకే అందిస్తుంది. ఈ సేల్ సమయంలో అమెజాన్, హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్‌లను వినియోగిస్తే రూ.1000వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎంపిక చేసిన ప్రొడక్ట్‌లపై 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ అవకాశం కల్పిస్తుంది. స్మార్ట్‌ఫోన్ డీల్స్ అమెజాన్ ఫ్యాబ్ఫోన్స్ ఫెస్ట్ అండ్ ఫ్యాబ్ టీవీ ఫెస్ట్సేల్ సందర్భంగా ఐక్యూ జెడ్5 ధర రూ.20,990 ఉండగా, ఐక్యూ జెడ్3 రూ.17,990కే అందిస్తుంది. ఈ రెండు ఫోన్ల ధరలపై సుమారు రూ.3వేల వరకు డిస్కౌంట్ అందిస్తుంది. రియల్ మీ నార్జో 50ఏ రూ.11,599 ఉండగా రూ.500 డిస్కౌంట్‌తో రూ.10,999కే పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎం 12 ధర రూ.11,499 ఉండగా రూ.2000 డిస్కౌంట్‌తో రూ.9,499కే పొందవచ్చు. ఒప్పో ఏ 15ఎస్ ధర రూ.13,9990 ఉండగా రూ.9,990కే సొంతం చేసుకోవచ్చు. ఇవి కాకుండా, వన్ ప్లస్ 9 సిరీస్ కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించి రూ.8,000 వరకు తగ్గింపు పొందవచ్చు. తాజా వన్ ప్లస్ 9ఆర్టీ పై రూ.4,000, వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 5జీ పోన్‌ను ఐసీఐసీ ఐ క్రెడిట్ కార్డ్‌లపై రూ.1500 తగ్గింపుతో పొందవచ్చని అమెజాన్ ప్రకటించింది. సేల్ సమయంలో, అమెజాన్ పవర్ బ్యాంక్‌లు, హెడ్ఫోన్లు, ఇతర ప్రొడక్ట్‌లపై 60 శాతం వరకు తగ్గింపుకే అందిస్తుంది. స్మార్ట్ టీవీలపై పెద్ద డిస్కౌంట్లు,ఈఎంఐ సదుపాయాల్ని కల్పిస్తుంది. శాంసంగ్ ఫ్రేమ్ క్యూఎల్ఈడీ టీవీ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లపై రూ.5 000 క్యాష్‌బ్యాక్‌తో, అమెజాన్ కూపన్లను ఉపయోగించి అదనంగా రూ. 1750 తగ్గింపుతో లభిస్తుంది. -
రూ.10 వేల కంటే తక్కువ ధర..! హాట్‌కేకుల్లా అమ్ముడైన 30 లక్షల స్మార్ట్‌ఫోన్స్ ..!
POCO Sells Over 30L C-Series Smartphones On Flipkart: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో భారత్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో బీభత్సం సృష్టించింది. తక్కువ సమయంలో సుమారు 30 లక్షలకు పైగా పోకో సీ-సిరీస్ స్మార్ట్ఫోన్లను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలతో పోకో ఈ ఏడాది సెప్టెంబర్ 30 న పోకో సీ-సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత్‌లో లాంచ్ చేసింది. POCO C3, POCO C31 మోడళ్లను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచింది. రూ. 10,000 కంటే తక్కువ ధర సెగ్మెంట్లో ఈ రెండు స్మార్ట్ఫోన్లు వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందనను పొందాయి.అదిరిపోయే ఫీచర్స్, ట్రిపుల్ కెమెరా, బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్స్‌తో పోకో సీ-సిరీస్ ఫోన్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్‌గా నిలిచాయి. POCO C3 ఫీచర్స్..! 6.53 అంగుళాల HD+ డిస్ప్లే మీడియాటెక్ హెలియో జీ35 ఆక్టాకోర్ ప్రాసెసర్ 13ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 5ఎంపీ సెల్ఫీ కెమెరా 4జీబీ ర్యామ్+ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 5000 mAh బ్యాటరీ 10W ఛార్జింగ్ సపోర్ట్ చదవండి: స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో దుమ్ములేపిన వన్‌ప్లస్ ..! -
మరోసేల్, రెండు రోజులు మాత్రమే..స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు..!
ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు కేవలం రెండు రోజులు మాత్రమే అందుబాటులోకి ఉంటాయని తెలిపింది. డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 6వరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై కొనుగోలు దారులకు ఆఫర్లతో పాటు సేవింగ్ డీల్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ లో ప్రత్యేకంగా రియల్మీ స్మార్ట్ ఫోన్ల ధరల్ని భారీగా తగ్గించింది. రియల్మీ జీటీ నియో2 పై రూ.4వేలు, రియల్ మీ జీటీ మాస్టర్ ఎడిషన్ (ప్రీ-పెయిడ్)పై రూ.4వేలు, రియల్ మీ 8ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్‌పై రూ.2వేల తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. రియల్ మీ 8ఐ రూ.1,000, నార్జో 50ఏ పై రూ.1500, రియల్ మీ సీ25వై పై రూ.1,500, నార్జ్ 50ఐ, రియల్ మీ 50ఐ తోపాటు ఇతర స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. రియల్ మీ 8 పై ఫ్లిప్ కార్ట్, రియల్ మీ. కామ్ లో రూ.2 వేల డిస్కౌంట్, రియల్ మీ 8 5జీ రూ.1500 వరకు ఆఫర్‌ను పొందవచ్చు. రియల్ మీ సీ21వై ,రియల్ మీ సీ 21పై రూ.500, రియల్ మీ 50ఐ స్మార్ట్ ఫోన్ పై రూ.200 వరకు తగ్గింపు పొందవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. చదవండి: ఆడుతూ..పాడుతూ కోట్లు సంపాదిస్తుంది..ఎలా అంటే? -
అమెజాన్ బంపర్ ఆఫర్: బంగారం, వెండి నాణేలపై భారీ డిస్కౌంట్
దివాళీ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ ఆఫర్లను ప్రకటించింది. బంగారం, వెండి నాణేలు, టీవీలు, హోమ్ అప్లయన్సెస్ పై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపింది. బంగారు నాణేలపై ఆఫర్ ధన్‌తేరాస్ సందర్భంగా అమెజాన్ ధన్‌తేరాస్ షాపింగ్ స్టోర్ పేరుతో బంగారు నాణేలపై 20 శాతం డిస్కౌంట్, వెండి నాణేలపై 20 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే బంగారం, వెండి ఆభరణాలపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అంతేకాదు డైమండ్ ఆభరణాలపై జీరో శాతం మేకింగ్ ఛార్జీలు ఉంటాయని పేర్కొంది. ఇక ఈ సేల్‌లో ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్, రూపే క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. అమెజాన్ ధన్‌తేరాస్ షాపింగ్ స్టోర్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందిస్తోంది. స్మార్ట్ఫోన్లపై 40 శాతం, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లపై 40 శాతం తగ్గింపును అందిస్తోంది. స్మార్ట్ టీవీలపై 65 శాతం వరకు తగ్గింపు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లపై కూడా 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది ఆఫర్లు ఎలా ఉన్నాయ్ దాదాపూ నెలరోజులుగా కొనసాగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రేపటితో ముగియనుంది. అయితే మరికొన్ని గంటల్లో ముగియనున్న ఈ సేల్‌లో టీవీలు, హోమ్ అప్లయన్సెస్ 65శాతం డిస్కౌంట్లు ఇస్తున్నట్లు ట్వీట్ చేసింది. మొబైల్,యాక్సెసరీలపై అమెజాన్ 40 శాతం, పురుషులు, మహిళల ఫ్యాషన్‌లో 80 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. చదవండి:సేల్స్ బీభత్సం..! గంటలో 5లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయి..! -
వచ్చేస్తోంది..ఫ్లిప్‌కార్ట్ మరో దివాళీ సేల్..! 80 శాతం మేర భారీ తగ్గింపు..!
ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరో సేల్‌తో ముందుకు రానుంది. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్‌పై 80శాతం భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. దేశంలో ఫెస్టివల్ సీజన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్ సేల్ పేరుతో వరుస ఆఫర్లను అందిస్తుంది. ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 3 నుండి 10 వరకు, రెండో సేల్ బిగ్ దీపావళి సేల్ పార్ట్ 1 అక్టోబర్ 17 నుండి 23 వరకు నిర్వహించింది. తాజాగా అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3వరకు మరో బిగ్ దివాళీ సేల్‌ను ప్రారంభించనుంది. ఈ సేల్‌లో కొనుగోలు దారులకు నో కాస్ట్ ఈఎంఐ, ఫ్రీ డెలివరీ, ఎక్స్ఛేంజ్ ఆఫర్, డీల్స్‌తో పాటు ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులపై తగ్గింపు, ఎస్బీఐ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. 80శాతం డిస్కౌంట్ ఫ్లిప్ కార్ట్ దివాళీ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్ పై 80శాతం ఆఫర్లో సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లలో రెడ్మీ 9ప్రైమ్, ఎంఐ 11 లైట్, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్12, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 వంటి స్మార్ట్ఫోన్లపై 80శాతం ఆఫర్‌ను అందిస్తుండగా..ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ ఎస్ఈ 2020 ఫోన్ ధరలు తగ్గుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. టైమ్ బాంబ్ డీల్స్ సాధారణ డిస్కౌంట్లు కాకుండా.. బిగ్ దీపావళి సేల్ సమయంలో కస్టమర్లు 12ఏఎం, 8ఏఎం,4 పీఎం సమయాల్లో 'క్రేజీ డీల్స్'ను సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. 'టైమ్ బాంబ్ డీల్స్' లో డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లు గరిష్టంగా 30 శాతం తగ్గింపుతో లభించనున్నాయి. పవర్ బ్యాంక్‌లు, హెడ్ఫోన్లు,స్పీకర్ల వంటి యాక్సెసరీలను కూడా 75 శాతం వరకు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్‌లో దేశీయ విమానాల టికెట్లను బుక్ చేసుకుంటే రూ. 2,500 వరకు, అంతర్జాతీయ విమానాలపై రూ. 25,000 వరకు తగ్గిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. చదవండి: బ్యాంకుల్లో బంపర్ ఆఫర్లు..లోన్ల కోసం అప్లయ్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! -
పాపులర్ స్మార్ట్ ఫోన్, ధర ఐదోసారి పెరిగింది
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి మరోసారి రెడ్మీ నోట్ 10ను ధరను పెంచింది. రెడ్మీ నోట్ సిరీస్ అంటే మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ సిరీస్ విడుదలైన ప్రతీసారి ఆ ఫోన్ కొనుగోలు కోసం యూజర్లు ఎంతో ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే ఈ ఏడాది మార్చి 16న రెడ్మీ నోట్ 10ను విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదుసార్లు ఈ ఫోన ధరను షావోమి పెంచింది. మొత్తంగా ఐదు నెలల కాలంలో ఈ ఫోన్ ధర రెండు వేల రూపాయలు పెరిగింది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చిప్‌ల తయారీ తగ్గిపోయింది. దీంతో స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిపై చిప్‌ల కొరత ప్రభావం పడుతోంది. ఫలితంగా ఫోన్ల ధరలు పెంచేందుకు స్మార్ట్ తయారీ కంపెనీలు వెనుకాడటం లేదు. చదవండి : అద్భుతమైన ఫీచర్లతో మరో స్మార్ట్ ఫోన్, ఫీచర్లు లీకయ్యాయి అప్పుడు రూ. 11,999లకే రెడ్మీ నోట్ 10 మార్కెట్లోకి వచ్చినప్పుడు 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. ఇప్పుడు ధర పెరిగిన అనంతరం ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గానూ ఉంది. ఈ రెండు వేరియంట్ల ధర రూ.500 మేర పెరిగింది. రెడ్మీ నోట్ 10 ఫీచర్స్ నెట్వర్క్ టెక్నాలజీ : జీఎస్ఎం / హెచ్ఎస్పీఏ లాంచ్ డేట్ : మార్చి 4 డైమన్షన్ : 160.5 x 74.5 x 8.3 మిల్లీమీటర్ (6.32 x 2.93 x 0.33 అంగుళాలు) వెయిట్ : 178.8 గ్రాములు బిల్డ్ : ఫ్రంట్ గ్లాస్ (గొరిల్లా గ్లాస్ 3), ప్లాస్టిక్ బ్యాక్, ప్లాస్టిక్ ఫ్రేమ్ సిమ్ : సిమ్ డ్యూయల్ సిమ్ (నానో-సిమ్, డ్యూయల్ స్టాండ్-బై) డిస్ ప్లే : సూపర్ ఆమ్లోడ్, 450 నిట్స్ (టైప్), 1100 నిట్స్ (పీక్) సైజ్ : 6.43 అంగుళాలు, 99.8 cm2 (83.5% స్క్రీన్-టు-బాడీ రేషియో ) రిజల్యూషన్ :1080 x 2400 పిక్సల్స్, 20: 9 రేషియో ప్రొటెక్షన్ : కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఓఎస్ : ఆండ్రాయిడ్ 11, MIUI 12.5 చిప్సెట్ : క్వాల్కామ్ SDM678 స్నాప్‌డ్రాగన్ 678 (11 nm) సీపీయూ : ఆక్టా కోర్ (2x2.2 GHz క్రియో 460 గోల్డ్ అండ్ 6x1.7 GHz క్రియో 460 సిల్వర్) జీపీయూ : అడ్రినో 612 మెమరీ కార్డ్ స్లాట్ : మైక్రో ఎస్డీఎక్స్సీ ఇంటర్నల్ : 64జీబీ 4జీబీ RAM, 128జీబీ 4జీబీ ర్యామ్, 128జీబీ 6జీబీ ర్యామ్ క్వాడ్ : కెమెరా 48 ఎంపీ,ఎఫ్ /1.8, 26ఎంఎం సెల్ఫీ : కెమెరా సింగిల్ 13 ఎంపీ, ఎఫ్/2.5 -
ఒకేసారి రెండు, అద్భుతమైన ఫీచర్లతో రియల్ మీ స్మార్ట్ ఫోన్లు
ఇండియా టాప్ ఫైవ్ స్మార్ట్ ఫోర్ బ్రాండ్లలో షియోమీ,శాంసంగ్, వివో, ఒప్పో,రియల్ మీ బ్రాండ్లు ఉన్నాయి. అయితే 16 శాతం మార్కెట్‌తో ఐదో స్థానంలో ఉన్న రియల్ మీ.. తన మార్కెట్ షేర్‌ను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా యూజర్లు ఆకట్టుకునేలా ఇండియాలో తొలి 'రియల్ మీ స్లిమ్ బుక్' పేరుతో ల్యాప్ ట్యాప్ ను విడుదల చేసింది. విడుదలైన ఆ ల్యాప్ ట్యాప్ యూజర్లను అట్రాక్ట్ చేస్తుండగా.. రియల్ మీ జీటీ 5జీ సిరీస్ లో 'రియల్ మీ జీటీ 5జీ, రియల్ మీ జీటీ మాస్టర్ ఎడిషన్ 5జీ' పేరుతో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. రియల్ మీ జీటీ 5జీ ఫీచర్స్ రియల్ మీ జీటీ 5జీ క్వాల్కమ్ 8 సిరీస్ ప్రాసెసర్, ఆకా 888 స్నాప్ డ్రాగన్, ఎల్పీడీడీఆర్5 12 జీబీ నుంచి 256జీబీ యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్, హీట్‌ను తగ్గించేందుకు వీసీ కూలింగ్ సిస్టంతో వస్తుంది. ఇక 6.43 అంగుళాల ఆమ్లోడ్ డిస్ ప్లే , 1080 రెజుల్యూషన్, 120జెడ్ హెచ్ రిఫ్రెష్ రేట్, ఫ్రంట్ ఎండ్ పంచ్ హోల్ కట్ అవుట్లో 16 మెగా పిక్సెల్ కెమెరా, వెనక భాగంలో 3 కెమెరాలు, 64 మెగా పిక్సెల్ లో ఫ్రంట్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, 2ఎంపీ మైక్రో సెన్సార్‌తో వస్తుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే..65 వాల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500ఏఎంహెచ్ బ్యాటరీ, డ్యాయల్ స్టెరో స్పీకర్స్, హై రెజెల్యూషన్‌తో ఆడియో సపోర్ట్, హెడ్ ఫోన్ జాక్ , ఆండ్రాయిడ్ 11 బేస్డ్, యూజర్ ఇంటర్ ఫేస్ 2.0తో ఆకట్టుకుంటుంది. రియల్ మీ జీటీ 5జీ మాస్టర్ ఎడిషన్ ఫీచర్స్ రియల్ మీ జీటీ 5జీ మాస్టర్ ఎడిషన్ 6.43 అంగుళాల సూపర్ ఆమ్లోడ్ డిస్ ప్లే, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, హోల్ పంచ్ కంట్ అవుట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778 ఎస్ఓసీ, 8జీబీ ర్యామ్ నుంచి 256జీబీ స్టోరేజ్ తో యూజర్ ఇంటర్ ఫేస్ 2.0తో ఆండ్రాయిడ్ 11 వెర్షన్ లో అందుబాటులో ఉంది. అట్రాక్ట్ చేసేలా ఫోటోలు తీసేలా ఫ్రంట్ ఎండ్ 32మెగా పిక్సెల్ కెమెరా, 64మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, 2ఎంపీ మాక్రో షూటర్‌ను అందిస్తుంది. 65 వాల్ట్‌లతో ఫాస్ట్ గా ఛార్జింగ్ ఎక్కేందుకు 4,300 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తుంది. రియల్ మీ జీటీ 5జీ మాస్టర్ ఎడిషన్ ధర త్రీ కాన్ఫిగరేషన్ తో 6జీబీ/128జీబీ, 8జీబీ/128జీబీ, 8జీబీ/256జీబీ వస్తుండగా..6జీబీ/128జీబీ ప్రారంభ ధర రూ.25,999, 8జీబీ/128జీబీ ధర రూ.27,999, 8జీబీ/256జీబీ వెర్షన్ లో రూ.29,999కే అందిస్తున్నట్లు రియల్ మీ ఇండియా ప్రతినిధులు తెలిపారు. రియల్ మీ జీటీ 5జీ ధర రియల్ జీటీ 5జీ రెండు కాన్ఫిగరేషన్లలో వస్తుంది. 8జీబీ/128జీబీ,12జీబీ/256జీబీ తో వస్తుండగా 8జీబీ/128జీబీ మోడల్ ధర రూ. 37,999, 12జీబీ/256జీబీ వెర్షన్ ధర రూ .41,999 వస్తుంది. రియల్ మీ జీటీ 5జీ ఆగస్ట్ 25 నుండి realme.com, Flipkart తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. -
ఈ స్మార్ట్ ఫోన్లనే ఎగబడి కొంటున్నారంట
అమెజాన్ ప్రైమ్‌డేలో మరోసారి మొబైల్ఫోన్లు దుమ్ముదులిపాయి. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, దుస్తులు, బ్యూటీ ప్రొడక్ట్స్ ఇలా వివిధ కేటరిగిల్లో వేల సంఖ్యలో వస్తువులను అమ్మకానికి పెట్టగా.. జనాలు స్మార్ట్ఫోన్లు కొనేందుకే ఎక్కువ ఆసక్తి చూపించారు. మొత్తం అమ్మకాల్లో స్మార్ట్ఫోన్ల వాటానే ఎక్కువగా ఉంది. ఫోన్లప్రై ప్రకటించిన డిస్కౌంట్లకు కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. లేటెస్ట్గా విడుదలైన ఫోన్లలను ప్రైమ్‌డేలో సొంతం చేసుకునేందుకు ప్రజలు పోటీ పడ్డారు. 1.26 లక్షల కొనుగోళ్లు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 48 గంటల పాటు 'ప్రైమ్ డే' సేల్ నిర్వహించింది. ఈ స్మాల్ మీడియం బిజినెస్ మోడల్లో డెస్క్‌ట్యాప్, ల్యాప్ ట్యాప్, బ్యూటీ ప్రాడక్ట్, దుస్తులు, ఇంట్లో ఉపయోగించే సామాగ్రి, స్మార్ట్ ఫోన్లతో పాటు వంటగదిలో వినియోగించే వస్తువులు భారీ మొత్తంలో కొనుగోళ్లు జరిగినట్లు అమెజాన్ తెలిపింది. రెండురోజుల పాటు జరిగిన ఈ సేల్‌లో ప్రైమ్ మెంబర్స్ 1.26లక్షల మంది కొనుగోళ్లు చేయగా..31,000 మంది అమ్మకాలు జరిపినట్లు.. ఆ అమ్మకాల్లో 25శాతం మంది పైగా రూ.1కోటి పైగా బిజినెస్ నిర్వహించినట్లు అమెజాన్ ప్రతినిధులు వెల్లడించారు. 10 నగరాల్లో ప్రధానంగా ప్రధానంగా 10నగరాల్లో 70శాతం మంది కొత్త ప్రైమ్ మెంబర్స్ షాపింగ్ చేసినట్లు అమెజాన్ చెప్పింది. అందులో ముఖ్యంగా జమ్ము-కాశ్మీర్ కు చెందిన అనంతనాగ్,జార్ఖండ్ లోని బొకారో, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్, నాగలాండ్ లోని మొకోక్చుంగ్, పంజాబ్‌లోని హోషియార్పూర్, తమిళనాడులో నీలగిరి, కర్ణాటకలోని గడగ్, కేరళలోని కాసరగోడ్ ప్రాంతాల ప్రజలు ఎక్కువ మంది కొనుగోళ్లు జరిపినట్లు తేలింది. ఎక్కువ ఏ బ్రాండ్ ఫోన్లను కొనుగోలు చేశారంటే అమెజాన్ ప్రైమ్ డేలో వన్ ప్లస్ నార్డ్2 5జీ, వన్ ప్లస్ నార్డ్ సీఈ 5జీ, రెడ్ మీ నోట్ 10 సిరీస్, రెడ్మీ 9, శాంసంగ్ గెలాక్సీ ఎం 31ఎస్, శాంసంగ్ గెలాక్సీ ఎం21, రియల్మీ సీ11 ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేసినట్లు అమెజాన్ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. -
స్మార్ట్ఫోన్లు, భారీ ఉపకరణాలకు డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో (జీఐఎఫ్) స్మార్ట్ఫోన్లు, భారీ ఉపకరణాలు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు గణనీయంగా డిమాండ్ నెలకొందని ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ వెల్లడించారు. వన్‌ప్లస్, శాంసంగ్, యాపిల్, షావోమీ తదితర సంస్థల ఉత్పత్తులు భారీగా అమ్ముడయ్యాయని పేర్కొన్నారు. ఈసారి జీఐఎఫ్‌కు మరింత స్పందన లభిస్తోందని, ప్రారంభమైన తొలి 48 గంటల్లో రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయని ఆయన తెలిపారు. చిన్న, మధ్య తరహా సంస్థలకు సంబంధించి 5,000 పైచిలుకు విక్రేతలు పాల్గొన్నారని తివారీ చెప్పారు. గతేడాది ఫెస్టివల్ సేల్ మొత్తం మీద అమ్ముడైన ఐఫోన్లకు మించి ఈసారి ఒక్కరోజులోనే అమ్ముడవడం గమనార్హమని తివారీ తెలిపారు. నవంబర్ 13 దాకా జరిగే ‘ఫినాలే డేస్’ సందర్భంగా భారీ ఉపకరణాలు, టీవీలపై 75 శాతం దాకా, గృహోపకరణాలపై 80 శాతం దాకా, స్మార్ట్ఫోన్లపై 40 శాతం దాకా డిస్కౌంట్లు ఇస్తున్నట్లు వివరించారు. అలాగే, కనీస ఆర్డర్ పరిమితికి లోబడి ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం బ్యాంక్ డిస్కౌంటు ఉంటుందని తెలిపారు. పెరిగిన విక్రేతలు.. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో గతంతో పోలిస్తే కొత్త విక్రేతల రిజిస్ట్రేషన్ల సంఖ్య 50 శాతం పెరిగిందని తివారీ వివరించారు. వ్యక్తిగత గ్రూమింగ్ ఉత్పత్తులు, స్టడీ ఫ్రం హోమ్‌కి అవసరమైన ఉత్పత్తులు, గృహోపకరణాలు మొదలైన వాటికి ఆర్డర్లు గణనీయంగా వస్తున్నాయన్నారు. కరోనా నేపథ్యంలో డిమాండ్‌కి అనుగుణంగా వేగవంతంగా, సురక్షితంగా ఉత్పత్తులను డెలివర్ చేయడానికి అమెజాన్ భారీ సన్నాహాలు చేసిందని తివారీ చెప్పారు. కొత్తగా దాదాపు 200 డెలివరీ స్టేషన్లు, వేలకొద్దీ డెలివరీ పార్ట్నర్స్ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న 8 స్టోర్ సెంటర్లను విస్తరించడంతో పాటు మరో అయిదింటిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పండుగ సీజన్ నేపథ్యంలో సుమారు 1,00,000 పైచిలుకు సీజనల్ ఉపాధి అవకాశాలు కల్పించగలిగామని చెప్పారు. -
శాంసంగ్‌ను దాటిన హువావే
లండన్: స్మార్ట్‌ఫోన్స్ విక్రయాల్లో ప్రపంచ టాప్ సెల్లర్‌గా హువావే నిలిచినట్టు పరిశోధన సంస్థ కెనలిస్ వెల్లడించింది. శాంసంగ్‌ను వెనక్కి నెట్టి తొలి స్థానాన్ని కైవసం చేసుకుందని తెలిపింది. రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) హువావే 5.58 కోట్ల స్మార్ట్ఫోన్లను విక్రయించినట్టు కెనలిస్ ప్రకటించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 5 శాతం తగ్గుదల. శాంసంగ్ విషయానికి వస్తే క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 30 శాతం అమ్మకాలు తగ్గి 5.37 కోట్ల యూనిట్లు నమోదైంది. హువావేకు కోవిడ్–19 కలిసి వచ్చిందని కెనలిస్ తెలిపింది. చైనాలో ఈ కంపెనీ అమ్మకాలు గడిచిన త్రైమాసికంలో 8 శాతం వృద్ధి చెందాయి. కంపెనీ మొత్తం విక్రయాల్లో చైనా వాటా 70 శాతముంది. చైనా రికవరీ హువావేకు కలిసి వచ్చింది. శాంసంగ్‌కు యూఎస్, యూరప్, బ్రెజిల్, భారత్ ప్రధాన మార్కెట్లు. చైనా నుంచి సమకూరుతుంది తక్కువే. -
రూ.70 వేల శాంసంగ్ ఫోన్ రూ. 25 వేలకే
సాక్షి, ముంబై: ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ‘బిగ్ షాపింగ్ డేస్’ పేరుతో లాంచ్ చేసిన స్పెషల్ సేల్ ద్వారా ఒప్పో, శాంసంగ్ రియల్‌మి తదితర బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్చి 19 నుంచి 22 వరకు ఈ సేల్ నిర్వహించనుంది. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9 ప్లస్‌పై భారీ తగ్గింపు ఆఫర్ చేస్తోంది ఫ్లిప్‌కార్ట్. 6 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను దాదాపు 50 వేల తగ్గింపుతో అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు కొనుగోలుపై అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభ్యం. మూడు రంగుల్లో ఇది లభిస్తోంది. అలాగే 12100 దాకా ఎక్స్జేంజ్ ఆఫర్ కూడా వుంది. అసలు ధర రూ. 70 వేలు ఆఫర్ ధర రూ.24,999 గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫీచర్లు 6.2 డిస్ప్లే 1440x2960 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8 ఓరియో 6జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 12+12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ -
షావోమి ఎంఐ ఫ్యాన్ షేల్ షురూ!
సాక్షి,న్యూఢిల్లీ: చైనా మొబైల్ దిగ్గజం షావోమి నెం.1 ఎంఐ ఫ్యాన్ సేల్ పేరుతో డిస్కౌంట్ అమ్మకాలను ప్రారంభించింది. నేటి (డిసెంబరు19వ తేదీ నుంచి 21వ తేదీ ) నుంచి మూడు రోజుల పాటు ఈ సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ఎంఐ ఎల్ఈడీ టీవీలు, ఇతర ఉత్పత్తులపై ఆకట్టుకునే ఆఫర్లతోపాటు రాయితీలను కూడా అందిస్తోంది. ఎంఐ ఆన్లైన్ స్టోర్‌తోపాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలోనూ ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా రెడ్ మీ నోట్ 5 ప్రొ, ఎం ఏ2, రెడ్ మీవై2 స్మార్ట్ఫోన్లతో పాటు ఎంఐటీవీలపై తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. ఎంఐ ఎ2 6జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.16,999లకే లభ్యం. ఎంఐ ఎ2 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.14,999 ధరకు అందుబాటులో ఉంది. రెడ్మీ నోట్ 5 ప్రొ 6జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.14,999 ధరకు లభ్యమవుతోంది. 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.12,999 ధరకు విక్రయిస్తోంది. రెడ్మీ వై2 4జీబీ ర్యామ్ వేరియెంట్ వెయ్యి రూపాయల తగ్గింపుతో రూ.10,999లభ్యం. 3జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.8,999 ధరకు లభ్యం. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ (49 ఇంచెస్) రూ.1వేయి తగ్గింపుతో రూ.30,999 ధరకు లభ్యం కానుంది. అలాగే ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ (43 ఇంచెస్) రూ.21,999 ధరకు, ఎంఐ ఎల్ఈడీ టీవీ 4సి ప్రొ (32 ఇంచెస్) రూ.14,999 ధరకు లభ్యం కానున్నాయి. అంతేకాదు ఈ సేల్‌లో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు ఐటమ్స్‌ను కొనుగోలు చేస్తే రూ.50, రూ.100, రూ.200, రూ.500 విలువైన కూపన్లు ఇస్తారు. మొబిక్విక్ యూజర్లకు 10 శాతం ఇన్స్టంట్ సూపర్ క్యాష్ వస్తుంది. గూగుల్ పే యూజర్లు రూ.500, . పేటీఎం యూజర్లు రూ.300 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అలాగే మొబిక్విక్ యూజర్లు 10శాతం దాకా డిస్కౌంట్ పొందే అవకాశం. Smartphone or a smart device, choose your pick. Because we've offers on your favourite products in #1MiFanSale. Check out for more offers here: https://t.co/uhKAPsvyYj pic.twitter.com/Qw9cjGQHLX — Mi India (@XiaomiIndia) December 17, 2018 -
నోకియా ఫోన్స్ సేల్: క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
సాక్షి,న్యూఢిల్లీ: హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ ఇటీవల లాంచ్ చేసిన నోకియా స్మార్ట్ఫోన్ల విక్రయాలు భారత మార్కెట్లో సోమవారం ప్రారంభమయ్యాయి. నోకియా 6(2018)నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో స్మార్ట్ఫోన్లు అమెజాన్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. నోకియా 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్/కాప్, వైట్/కాపర్ కలర్ కాంబినేషన్లలో రూ.25,999 ధరకు లభిస్తోంది. ప్రీమియం సెగ్మెంట్లో నోకియా 8 సిరోకో స్మార్ట్‌ఫోన్ బ్లాక్ కలర్లో రూ.49,999 ధరకు అందుబాటులోఉంది. దీంతోపాటు ఆఫ్‌లైన్‌లో పలు రిటెయిల్ స్టోర్స్‌లోనూ విక్రయానికి లభ్యం. ముఖ్యంగా నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో ఫోన్లపై సంస్థ పలు క్యాష్ బ్యాక్ ఆఫర్లను వినియోగదారులకు అందిస్తోంది. కియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో కొనుగోలుపై ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్ , క్రెడిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం కాష్ బ్యాక్ ఆఫర్. అమెజాన్ నుంచి నోకియా 7 ప్లస్ కొనుగోలు చేసిన వారికి 2000 రూపాయల ఎయిర్టెల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. 36 నెలల వ్యవధిలో నిర్ణీత రీచార్జ్‌ల అనంతరం ఈ మొత్తాన్ని ఎయిర్టెల్ పే పేమెంట్‌బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. అలాగే నోకియా 8 సిరోకోపై ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.199, రూ.349 రీచార్జిలపై, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు రూ.399, రూ.499 ప్లాన్లపై అదనంగా 6 నెలల పాటు 20 జీబీ డేటాను నెల వారీగా అందిస్తున్నారు. అలాగే ఎయిర్టెల్ టీవీ యాప్‌కు డిసెంబర్ 31, 2018 వరకు ఉచిత సబ్స్క్రిప్షన్ అందిస్తున్నారు. దీంతోపాటు ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్, అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తోంది. నోకియా 7 ప్లస్ ఫీచర్లు 6 ఇంచ్ డిస్ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 12+13 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ నోకియా 8 సిరోకో ఫీచర్లు 5.5 ఇంచ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 12+13 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 3260 ఎంఏహెచ్ బ్యాటరీ , ఫాస్ట్, వైర్లెస్ చార్జింగ్ -
‘స్మార్ట్’గా కొనేస్తున్నారు...!
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ దేశాల్లో స్మార్ట్ఫోన్ల అమ్మకాలకు సంబంధించి భారత్ జోరు కొనసాగుతోంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 82 శాతం వృద్ధితో అత్యంత వేగంగా ఎదుగుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్ నిల్చింది. రీసెర్చ్ సంస్థ ఐడీసీ ఈ వివరాలను వెల్లడించింది. మొబైల్ వినియోగదారులు స్మార్ట్ఫోన్లకు అప్‌గ్రేడ్ అవుతుండటం, అలాగే తక్కువ వ్యవధిలోనే పాతవి మార్చేసి కొంగొత్తవి తీసుకుంటూ ఉండటం అమ్మకాల పెరుగుదలకు కారణమని పేర్కొంది. క్రిత సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే ఈసారి అమ్మకాలు 82 శాతం ఎగిసి 2.33 కోట్లకు చేరాయి. దీంతో వార్షిక ప్రాతిపదికన వరుసగా రెండో త్రైమాసికంలోను 80 శాతం పైగా వృద్ధి సాధించినట్లయిందని ఐడీసీ తెలిపింది. క్యూ3లో మొత్తం మొబైల్ ఫోన్ల మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల వాటా 32 శాతంగా నిల్చింది. క్రితం క్యూ3లో ఇది 19 శాతమే. మరోవైపు, ఫ్యాబ్లెట్ల (5.5-6.99 అంగుళాల స్క్రీన్) అమ్మకాలు ఒక మోస్తరు స్థాయికి చేరుకున్నాయని ఐడీసీ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కిరణ్ కుమార్ వివరించారు. 4జీ సర్వీసులు వస్తుండటంతో 4.5-5.5 అంగుళాల స్క్రీన్ ఉండే స్మార్ట్ఫోన్లు డిమాండ్ మరింత పెరగగలదని ఆయన వివరించారు. స్మార్ట్‌ఫోన్ యూజర్లు సగటున 12-24 నెలల్లో పాతవి మార్చేసి కొత్తవి కొంటున్నారని పేర్కొన్నారు. 2014లో 5.3 కోట్ల పైగా స్మార్ట్‌ఫోన్స్ విక్రయాలు.. ఇంటర్నెట్పై అవగాహన పెరుగుతుండటం, ఎంట్రీ లెవెల్ ఫోన్ల ధరలు తగ్గుతుండటం వంటి అంశాలతో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ ఇంకా పెరుగుతుందని మరో రీసెర్చ్ సంస్థ జీఎఫ్కే తెలిపింది. ఈ ఏడాది దేశీయంగా 5.3 కోట్ల పైగా స్మార్ట్‌ఫోన్స్ అమ్ముడవుతాయని వివరించింది. మొత్తం మొబైల్స్ అమ్మకాలు 20 కోట్లకు చేరతాయని తెలిపింది. విలువ పరంగా చూస్తే మొత్తం మొబైల్ ఫోన్ మార్కెట్ రూ. 75,000 కోట్లు ఉంటుందని, ఇందులో రూ. 52,000 కోట్లు స్మార్ట్ఫోన్లదే ఉంటుందని పేర్కొంది. జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో 14.7 కోట్ల మొబైల్ ఫోన్స్ అమ్ముడు కాగా.. వీటిలో 3.9 కోట్లు స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఇక విలువపరంగా చూస్తే తొలి తొమ్మిది నెలల్లో మొత్తం మొబైల్ ఫోన్ మార్కెట్ రూ. 57,000 కోట్లు ఉంటే స్మార్ట్ఫోన్ల వాటా రూ. 39,000 కోట్లు. అగ్రస్థానంలో సామ్సంగ్.. ఐడీసీ గణాంకాల ప్రకారం క్యూ3లో మొబైల్స్ తయారీ దిగ్గజం సామ్సంగ్ 24 శాతం వాటాతో స్మార్ట్ఫోన్ల మార్కెట్లో అగ్రస్థానంలో నిల్చింది. మైక్రోమ్యాక్స్ (20శాతం), లావా..కార్బన్ (చెరి 8 శాతం), మోటరోలా (5శాతం) తర్వాత స్థానాలు దక్కించుకున్నాయి. మొత్తం మీద మూడో త్రైమాసికంలో దేశీయంగా హ్యాండ్సెట్స్ అమ్మకాలు 7.25 కోట్ల మేర నమోదయ్యాయి. ఇందులో ఫీచర్ ఫోన్లు 4.92 కోట్లు. వార్షిక ప్రాతిపదికన వీటి మ్మకాలు తొమ్మిది శాతం తగ్గాయి. ఓవరాల్ మార్కెట్లో చూస్తే సామ్సంగ్ 16 శాతం వాటాతో అగ్రస్థానంలోనూ, మైక్రోమ్యాక్స్ (14 శాతం), నోకియా (11 శాతం), లావా (10%), కార్బన్ (8%) వాటాలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక జీఎఫ్కే గణాంకాల ప్రకారం జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో సామ్సంగ్ 34.2 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో, మైక్రోమ్యాక్స్ (17.9%), నోకియా (16.3%) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. -
కొత్త కొత్తగా ఉన్నది...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల విపణిలో భారత్ కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. ఆకర్షణీయ ఫీచర్లు, అప్లికేషన్లు, డిజైన్లతో కస్టమర్ల హృదయాలను ‘టచ్’ చేస్తుండండంతో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు అంచనాలను మించి నమోదవుతున్నాయి. 2014లో దేశవ్యాప్తంగా 22.5 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా. అత్యంత ఆసక్తికర అంశమేమంటే కొత్తగా స్మార్ట్‌ఫోన్‌ను కొనేవారు 92 శాతం మంది ఉంటారట. అగ్రరాజ్యంగా భాసిల్లుతున్న అమెరికాను వెనక్కినెట్టి, స్మార్ట్ఫోన్ల విషయంలో నువ్వా నేనా అన్నట్టు చైనాతో భారత్ పోటీ పడుతుండడం విశేషం. దూసుకెళ్తున్నాయి.. 50 వేలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో ఫ్యాబ్లెట్లతో కలిపి స్మార్ట్ఫోన్ల అమ్మకాలు అంచనాల కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఈ నగరాల్లో గతేడాది నవంబరులో రూ.3,423 కోట్ల విలువైన 28.68 లక్షల పీసులు అమ్ముడయ్యాయి. అంతకు ముందు నెలలో రూ.3,202 కోట్ల విలువైన 26.88 లక్షల స్మార్ట్ఫోన్లు విక్రయమయ్యాయి. సరాసరిగా ఒక్కో పీసుకు చేస్తున్న వ్యయం అక్టోబరులో రూ.11,916 ఉంటే, నవంబరులో రూ.11,937లకు చేరింది. 2012 నవంబరుతో పోలిస్తే ఏడాదిలో స్మార్ట్ఫోన్ల విక్రయాలు రెండింతలయ్యాయి. ఖరీదైనవి కొంటున్నారు.. విలువ పరంగా రూ.30 వేలు ఆపై ఖరీదున్న ఫోన్ల వాటా అక్టోబరులో 20.3 శాతముంటే, తర్వాతి నెలకు 21.4 శాతానికి చేరింది. ఈ విభాగంలో ఆపిల్ వాటా అనూహ్యంగా 8.8 నుంచి 29.1 శాతానికి ఎగబాకింది. నవంబరుతో ముగిసిన ఏడాదిలో రూ.30 వేలకుపైగా ఖరీదున్న మోడళ్లు దాదాపు రెండింతలు నమోదై 1.77 లక్షల పీసులుగా ఉంది. రూ.7 వేలలోపున్న స్మార్ట్ఫోన్లతోపాటు రూ.15-20 వేల శ్రేణిలో లభించే మోడళ్ల అమ్మకాలు పెరుగుతూ వచ్చాయి. ఇక రాష్ట్రంలో రూ.10 వేల లోపు విభాగంలో శామ్సంగ్, నోకియా, మైక్రోమ్యాక్స్, సెల్‌కాన్‌లు టాప్‌లో నిలిచాయి. చైనాతో గట్టి పోటీ.. ఈ ఏడాది చైనాలో 28.3 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా. ఇందులో కొత్తగా కొనేవారు 21.6 కోట్ల మంది. కొంచెం తక్కువగా భారత్‌లో ఈ సంఖ్య 20.7 కోట్లు ఉండొచ్చని ఒక పరిశోధనా సంస్థ అధ్యయనంలో తేలింది. అదే అమెరికాలో ఈ ఏడాది 8.9 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమవుతాయని, వీటిలో కొత్త కస్టమర్లు 4.75 కోట్ల మంది ఉంటారని అంచనా. మొత్తం అమ్మకాల పరంగా తొలి పది స్థానాల్లో చైనా, భారత్, అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా, రష్యా, జపాన్, మెక్సికో, జర్మనీ, ఫ్రాన్స్, యూకేలు నిలవనున్నాయి. ప్రస్తుతం భారత్‌లో స్మార్ట్‌ఫోన్ యూజర్లు 15.6 కోట్ల మంది ఉన్నట్టు సమాచారం.