ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లపై బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు కేవలం రెండు రోజులు మాత్రమే అందుబాటులోకి ఉంటాయని తెలిపింది.
డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 6వరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై కొనుగోలు దారులకు ఆఫర్లతో పాటు సేవింగ్ డీల్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ లో ప్రత్యేకంగా రియల్‌మీ స్మార్ట్ ఫోన్ల ధరల్ని భారీగా తగ్గించింది.
రియల్‌మీ జీటీ నియో2 పై రూ.4వేలు, రియల్ మీ జీటీ మాస్టర్ ఎడిషన్ (ప్రీ-పెయిడ్)పై రూ.4వేలు, రియల్ మీ 8ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్‌పై రూ.2వేల తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.
రియల్ మీ 8ఐ రూ.1,000, నార్జో 50ఏ పై రూ.1500, రియల్ మీ సీ25వై పై రూ.1,500, నార్జ్ 50ఐ, రియల్ మీ 50ఐ తోపాటు ఇతర స్మార్ట్ ఫోన్‌లపై ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. రియల్ మీ 8 పై ఫ్లిప్ కార్ట్, రియల్ మీ. కామ్ లో రూ.2 వేల డిస్కౌంట్, రియల్ మీ 8 5జీ రూ.1500 వరకు ఆఫర్‌ను పొందవచ్చు. రియల్ మీ సీ21వై ,రియల్ మీ సీ 21పై రూ.500, రియల్ మీ 50ఐ స్మార్ట్ ఫోన్ పై రూ.200 వరకు తగ్గింపు పొందవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment