రియల్‌మి నుంచి బడ్జెట్‌ఫోన్‌ విడుదల | Realme 6i budget smartphone arrives in India at Rs 12,999 | Sakshi
Sakshi News home page

రియల్‌మి నుంచి బడ్జెట్‌ ఫోన్‌ విడుదల

Published Fri, Jul 24 2020 2:23 PM | Last Updated on Fri, Jul 24 2020 2:52 PM

Realme 6i budget smartphone arrives in India at Rs 12,999 - Sakshi

ప్రముఖ మొబైల్ తయారీదారు రియల్‌మి నేడు భారత మార్కెట్లోకి మరో కొత్త మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌మి 6ఐ గా పిలువబడే ఈ స్మార్ట్‌ ఫోన్‌ రెండు వేరియంట్లలో లాంచ్‌ అయ్యింది. ఈ జూలై 31 మధ్యాహ్నం 12గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మి డాట్‌కామ్‌ ద్వారా కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్‌, వైట్‌ రెండు కలర్‌ ఆప్షన్లలో వస్తుంది. వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. 

రియల్‌మి 6ఐ ఫీచర్లు

6.5 ఇంచుల డిస్‌ ప్లే+ 90 హెర్ట్జ్‌ అల్ట్రా స్మూత్‌ డిస్‌ ప్లే 
మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్ కలిగి ఉంది. 
ముందువైపు 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా 
వెనుకు వైపు 4ప్రధాన కెమెరాలు ఉన్నాయి. 
48+ 8+ 5+ 2మెగాపిక్సెల్స్‌ క్వాడ్‌ రియర్‌ కెమెరా
అందులో ప్రధాన కెమెరా 48 మెగాఫిక్చెల్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 
4100ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
30W ఫాస్ట్ చార్జింగ్ ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 

రియల్‌మి 6ఐ ధర

4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌  ధర రూ.12,999
6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌  ధర రూ.14,999

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement