ఇండియా టాప్ ఫైవ్ స్మార్ట్ ఫోర్ బ్రాండ్‌లలో షియోమీ,శాంసంగ్, వివో, ఒప్పో,రియల్ మీ బ్రాండ్‌లు ఉన్నాయి. అయితే 16 శాతం మార్కెట్‌తో ఐదో స్థానంలో ఉన్న రియల్ మీ.. తన మార్కెట్ షేర్‌ను పెంచుకునేందుకు ప‍్రయత్నాలు చేస్తోంది. తాజాగా యూజర్లు ఆకట్టుకునేలా ఇండియాలో తొలి 'రియల్ మీ స్లిమ్ బుక్' పేరుతో ల్యాప్ ట్యాప్ ను విడుదల చేసింది. విడుదలైన ఆ ల్యాప్ ట్యాప్ యూజర్లను అట్రాక్ట్ చేస్తుండగా.. రియల్ మీ జీటీ 5జీ సిరీస్ లో 'రియల్ మీ జీటీ 5జీ, రియల్ మీ జీటీ మాస్టర్ ఎడిషన్ 5జీ' పేరుతో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది.
రియల్ మీ జీటీ 5జీ ఫీచర్స్
రియల్ మీ జీటీ 5జీ క్వాల‍్కమ్ 8 సిరీస్ ప్రాసెసర్, ఆకా 888 స్నాప్ డ్రాగన్, ఎల్‌పీడీడీఆర్5 12 జీబీ నుంచి 256జీబీ యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్, హీట్‌ను తగ్గించేందుకు వీసీ కూలింగ్ సిస్టంతో వస్తుంది. ఇక 6.43 అంగుళాల ఆమ్లోడ్ డిస్ ప్లే , 1080 రెజుల్యూషన్, 120జెడ్ హెచ్ రిఫ్రెష్ రేట్, ఫ్రంట్ ఎండ్ పంచ్ హోల్ కట్ అవుట్‌లో 16 మెగా పిక్సెల్ కెమెరా, వెనక భాగంలో 3 కెమెరాలు, 64 మెగా పిక్సెల్ లో ఫ్రంట్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, 2ఎంపీ మైక్రో సెన్సార్‌తో వస్తుంది.
ఇక బ్యాటరీ విషయానికొస్తే..65 వాల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500ఏఎంహెచ్ బ్యాటరీ, డ్యాయల్ స్టెరో స్పీకర్స్, హై రెజెల్యూషన్‌తో ఆడియో సపోర్ట్, హెడ్ ఫోన్ జాక్ , ఆండ్రాయిడ్ 11 బేస్డ్, యూజర్ ఇంటర్ ఫేస్ 2.0తో ఆకట్టుకుంటుంది.
రియల్ మీ జీటీ 5జీ మాస్టర్ ఎడిషన్ ఫీచర్స్
రియల్ మీ జీటీ 5జీ మాస్టర్ ఎడిషన్ 6.43 అంగుళాల సూపర్ ఆమ‍్లోడ్ డిస్ ప్లే, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, హోల్ పంచ్ కంట్ అవుట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778 ఎస్‌ఓసీ, 8జీబీ ర్యామ్ నుంచి 256జీబీ స్టోరేజ్ తో యూజర్ ఇంటర్ ఫేస్ 2.0తో ఆండ్రాయిడ్ 11 వెర్షన్ లో అందుబాటులో ఉంది. అట్రాక్ట్ చేసేలా ఫోటోలు తీసేలా ఫ్రంట్ ఎండ్ 32మెగా పిక్సెల్ కెమెరా, 64మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, 2ఎంపీ మాక్రో షూటర్‌ను అందిస్తుంది. 65 వాల్ట్‌లతో ఫాస్ట్ గా ఛార్జింగ్ ఎక్కేందుకు 4,300 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస‍్తుంది.
రియల్ మీ జీటీ 5జీ మాస్టర్ ఎడిషన్ ధర
త్రీ కాన్ఫిగరేషన్ తో 6జీబీ/128జీబీ, 8జీబీ/128జీబీ, 8జీబీ/256జీబీ వస్తుండగా..6జీబీ/128జీబీ ప్రారంభ ధర రూ.25,999, 8జీబీ/128జీబీ ధర రూ.27,999, 8జీబీ/256జీబీ వెర్షన్ లో రూ.29,999కే అందిస‍్తున్నట్లు రియల్ మీ ఇండియా ప్రతినిధులు తెలిపారు.
రియల్ మీ జీటీ 5జీ ధర
రియల్ జీటీ 5జీ రెండు కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. 8జీబీ/128జీబీ,12జీబీ/256జీబీ తో వస్తుండగా 8జీబీ/128జీబీ మోడల్ ధర రూ. 37,999, 12జీబీ/256జీబీ వెర్షన్ ధర రూ .41,999 వస్తుంది. రియల్ మీ జీటీ 5జీ ఆగస్ట్ 25 నుండి realme.com, Flipkart తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment