Flipkart Diwali Sale: Vivo T1 44w Smartphone Available On 90% Discount, Know Details - Sakshi
Sakshi News home page

ఈ ఫోన్‌పై బోలెడు ఆఫర్లు, 90 శాతం వరకు తగ్గింపు కూడా!

Published Mon, Oct 17 2022 12:34 PM | Last Updated on Mon, Oct 17 2022 1:37 PM

Flipkart Diwali Sale: Vivo T1 44w Smartphone Available On 90 Percent Discount - Sakshi

ఫెస్టివల్‌ సీజన్‌లో ప్రజలు షాపింగ్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే కంపెనీల తమ ఉత్పత్తులపై బోలెడు ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే పనిలో ఉంటాయి. తాజాగా దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తమ కస్టమర్ల కోసం బిగ్ దీపావళి సేల్‌ నిర్వహిస్తోంది. ఇందులో ప్రాడెక్ట్స్‌పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఇక ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఫ్లిప్‌కార్ట్‌. ఈ సేల్‌ సందర్భంగా వివో (Vivo) స్మార్ట్‌ఫోన్‌ను (Smart Phone) ఏకంగా 90 శాతం డిస్కౌంట్‌తో అందిస్తోంది. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ ఆఫర్ వివరాలపై ఓ లుక్కేయండి!

అదిరే ఆఫర్లతో వివో టీ1 44డబ్ల్యూ
వివో కంపెనీకి చెందిన టీ1 44డబ్ల్యూ( Vivo T144w) ఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు లభిస్తున్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ (Qualcomm Snapdragon) 680 ప్రాసెసర్‌ ఉంది. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా సెన్సార్ ఉంది. ఇది తక్కువ బ్రైట్‌నెస్‌తో అదిరిపోయే ఫోటోలను తీస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో 6.44 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ అమొలెడ్ డిస్‌ప్లే, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 

 90% వరకు తగ్గింపు.. ఎలా అంటారా!
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.19,990 ఉంది. ప్రస్తుతం బిగ్ దీపావళి సేల్ సందర్భంగా, ఈ ఫోన్‌ను 27 శాతం తగ్గింపుతో రూ.14,499కే కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. అంతేనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా కోటక్ బ్యాంక్ కార్డుల ద్వారా చేసిన చెల్లింపుపై అదనంగా మరో రూ.1,000 తగ్గింపు కూడా ఉంది. ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.13,600 వరకు తగ్గింపు ఉంది.

వీటన్నింటికి కలిపి చూస్తే 90 శాతం వరకు తగ్గింపుతో ఈ ఫోన్‌ను కస్టమర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ఫోన్‌ను ఈఎంఐలో కూడా కొనుగోలు చేయవచ్చు. 

చదవండి: ఆ కారు క్రేజ్‌ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్‌.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement