Vivo company
-
మనీలాండరింగ్ కేసులో లావా ఎండీ అరెస్టు
మనీ లాండరింగ్ కార్యకలాపాలపై కొనసాగుతున్న విచారణలో భాగంగా లావా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు హరి ఓం రాయ్‌తో పాటు వివో మొబైల్స్ ఇండియాకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం అరెస్టు చేసింది. అయితే హరి ఓం రాయ్ ప్రమేయంపై నిర్దిష్ట వివరాలు ఇంకా వెల్లడించలేదు. వివో మొబైల్స్ ఇండియా, గ్రాండ్ ప్రాస్పెక్ట్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ (జీపీఐసీపీఎల్)తో సహా 23 అనుబంధ కంపెనీలకు చెందిన 48 స్థానాల్లో ఈడీ దాడుల నిర్వహించింది. దిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్కు అనుగుణంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఫిబ్రవరి 3, 2022న ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అయిలే జీపీఐసీపీఎల్ నేరపూరిత చర్యలకు పాల్పడిందని ఆరోపిస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. అక్రమంగా చైనాకు నిధులు తరలించడమే లక్ష్యంగా భారత్‌లో బోగస్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భారత్‌లో పన్నులు ఎగవేస్తూ వివో మొబైల్స్ ఇండియా విక్రయాల ద్వారా వచ్చిన మొత్తంలో దాదాపు సగం డబ్బును చైనాకు తరలించిందనే ఆరోపణలు వచ్చాయి. -
మొబైల్స్ ఎగుమతికి కొత్త వ్యూహాలు.. ఈ ఏడాది టార్గెట్ ఇదే!
న్యూఢిల్లీ: మొబైల్స్ తయారీలో ఉన్న వివో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి 2023 చివరినాటికి మరో రూ. 1,100 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించింది. గ్రేటర్ నోయిడాలో నూతనంగా రాబోతున్న యూనిట్లో ఉత్పత్తి 2024 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. 169 ఎకరాల విస్తీర్ణంలో నెలకొంటున్న ఈ కేంద్రం ఉత్పత్తి సామర్థ్యం ఏటా 12 కోట్ల యూనిట్లు. ఈ ఏడాది 10 లక్షలకుపైగా మేడిన్ ఇండియా మొబైల్స్‌ను ఎగుమతి చేసే పనిలో నిమగ్నమైనట్టు కంపెనీ వెల్లడించింది. తొలిసారిగా వివో మేడిన్ ఇండియా ఫోన్లు గతేడాది థాయ్‌లాండ్, సౌదీ అరేబియాకు ఎగుమతి అయ్యాయి. భారత్‌లో విక్రయిస్తున్న ప్రతి వివో ఫోన్ దేశీయంగా తయారైనదే. బ్యాటరీ 95 శాతం, చార్జర్ విడిభాగాలు 70 శాతం స్థానికంగా సేకరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే గ్రేటర్ నోయిడాలో వివో తయారీ కేంద్రం ఉంది. రూ. 7,500 కోట్ల పెట్టుబడి ప్రణాళికలో భాగంగా తొలిదశలో 2023 చివరినాటికి ర.3,500 కోట్లు ఖర్చు చేస్తోంది. ‘ఇప్పటికే రూ. 2,400 కోట్లు వ్యయం చేశాం. మరో రూ. 1,100 కోట్లు డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాం’ అని కంపెనీ తెలిపింది. ఇక్కడ అడుగు పెట్టిన నాటి నుండి వ్యూహాత్మక మార్కెట్ గా భారత్ కొనసాగుతోందని వివో ఇండియా బ్రాండ్ స్ట్రాటజీ హెడ్ యోగేంద్ర శ్రీరాముల తెలిపారు. -
ఈ ఫోన్‌పై బోలెడు ఆఫర్లు, 90 శాతం వరకు తగ్గింపు కూడా!
ఫెస్టివల్ సీజన్లో ప్రజలు షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే కంపెనీల తమ ఉత్పత్తులపై బోలెడు ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే పనిలో ఉంటాయి. తాజాగా దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తమ కస్టమర్ల కోసం బిగ్ దీపావళి సేల్ నిర్వహిస్తోంది. ఇందులో ప్రాడెక్ట్స్పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఇక ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది ఫ్లిప్‌కార్ట్. ఈ సేల్ సందర్భంగా వివో (Vivo) స్మార్ట్‌ఫోన్‌ను (Smart Phone) ఏకంగా 90 శాతం డిస్కౌంట్‌తో అందిస్తోంది. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ ఆఫర్ వివరాలపై ఓ లుక్కేయండి! అదిరే ఆఫర్లతో వివో టీ1 44డబ్ల్యూ వివో కంపెనీకి చెందిన టీ1 44డబ్ల్యూ( Vivo T144w) ఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు లభిస్తున్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ (Qualcomm Snapdragon) 680 ప్రాసెసర్ ఉంది. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా సెన్సార్ ఉంది. ఇది తక్కువ బ్రైట్‌నెస్‌తో అదిరిపోయే ఫోటోలను తీస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్లో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ అమొలెడ్ డిస్ప్లే, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 90% వరకు తగ్గింపు.. ఎలా అంటారా! ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.19,990 ఉంది. ప్రస్తుతం బిగ్ దీపావళి సేల్ సందర్భంగా, ఈ ఫోన్‌ను 27 శాతం తగ్గింపుతో రూ.14,499కే కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. అంతేనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా కోటక్ బ్యాంక్ కార్డుల ద్వారా చేసిన చెల్లింపుపై అదనంగా మరో రూ.1,000 తగ్గింపు కూడా ఉంది. ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.13,600 వరకు తగ్గింపు ఉంది. వీటన్నింటికి కలిపి చూస్తే 90 శాతం వరకు తగ్గింపుతో ఈ ఫోన్‌ను కస్టమర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ఫోన్‌ను ఈఎంఐలో కూడా కొనుగోలు చేయవచ్చు. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
వివో నుంచి స్లిమ్ ఫోన్ ‘వై35’: ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
న్యూఢిల్లీ: వివో సంస్థ వై35 స్మార్ట్‌ఫోన్‌ను దేశీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది చాలా స్లిమ్‌గా, నాజూకుగా ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్ ఉంటుంది. 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 90 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటు, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫ్లాష్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.18,499. రెండు రంగుల్లో లభిస్తుంది. డాన్ గోల్డ్, అగేట్ బ్లాక్ రంగుట్లో వివో ఇండియా ఆన్లైన్ స్టోస్టోర్తోపాటు దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్ కార్డులపై రూ.1,000 క్యాష్బ్యాక్నుసెప్టెంబర్ 30వరకు అందిస్తున్నట్టు వివో ప్రకటించింది. -
వన్‌ప్లస్‌కి పోటీ: ఐకూ 9టీ 5జీ వచ్చేసింది..ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: వివో అనుబంధ సంస్థ ఐకూ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఐకూ 9టీ 5జీ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్సెట్, పంచ్-హోల్ డిజైన్‌తో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, నాలుగు రియర్ కెమెరాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయ. ఆప్టిమైజ్ ఫోటోగ్రఫీ అనుభవం కోసం Vivo V1+ ఇమేజ్ ప్రాసెసింగ్ చిప్ ను ఇందులో అమర్చింది. మరోవైపు వన్‌ప్లస్ రేపే( ఆగస్టు 3న ) వన్ ప్లస్10టీ లాంచ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ఐకూ 9టీ 5జీ విడుదల కావడం విశేషం. ఐకూ 9టీ 5జీ ఫీచర్లు 6.78 అంగుళాల E5 AMOLED ఫ్లాట్ డిస్ప్లేను పూర్తి HD+ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 12 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 50ఎంపీ మెయిన్ కెమెరా, 13+2+12 ఎంపీ కెమెరాలు 4,700mAh బ్యాటరీ, W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ధరలు, లభ్యత 8జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్+ 256 స్టోరేజ్ రెండు కాన్ఫిగరేషన్లలో లాంచ్ అయింది. వీటి ధరలు వరుసగా రూ.49,999 , రూ.54,999. బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్స్‌లో లభ్యం. iQOO 9T 5G iQOO ఇండియా వెబ్సైట్ ద్వారా సేల్ షేరూ అయింది. iQOO.com ద్వారా 9Tని కొనుగోలు చేసిన వారికి రూ. 3,999 విలువైన గేమ్‌ప్యాడ్ ఉచితం. అమెజాన్ ఆగస్టు 4 నుంచి అందుబాటులో ఉంటుంది. ICICI బ్యాంక్ ఆఫర్‌తో, వినియోగదారులు రూ. 4,000 తగ్గింపును అందిస్తోంది.అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. -
టర్బో ప్రాసెసర్, భారీ కెమెరా, అతితక్కువ ధర: ‘వివో టీ1ఎక్స్’
సాక్షి, ముంబై: మొబైల్ మేకర్ వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. T-సిరీస్‌లో కొత్త వెర్షన్‌ను బడ్జెట్ ధరలో కస్టమర్లకు అందించనుంది. వివో టీ1 ఎక్స్ పేరుతో, మూడు వేరియంట్లలో ఈ మొబైల్‌ను బుధవారం తీసుకొచ్చింది. వివో టీ1 ఎక్స్ బేసిక్ మోడల్ ధరను ధర రూ. 11,999గా ఉంచింది. వివో టీ1 ఎక్స్ ఫీచర్లు 6.58 అంగుళాల FHD+ డిస్ప్లే క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్ ఆండ్రాయిడ్ 12 OS 50MP డ్యూయల్ కెమెరాలు 8MP సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ ,18W ఫాస్ట్ ఛార్జింగ్ ధరలు, లభ్యత 4 జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్ రూ. 11,999, 4 జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ రూ. 10,999 6 జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్రూ. 14,999 గ్రావిటీ బ్లాక్ , స్పేస్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో లభ్యం. ఫ్లిప్‌కార్ట్ వివో ఇ-స్టోర్ ద్వారా జూలై 27వ తేదీ నుండి మధ్యాహ్నం 12 గంటలనుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డుల కొనుగోళ్లపై రూ. 1,000 తక్షణ తగ్గింపును అందిస్తుంది. Arm yourself with the all-new #vivoT1x that gets you, and your action-packed life! Take your gaming experiences to the max with Turbo Snapdragon 680 Processor, while you stay uber cool with the Segment’s First Turbo 4 Layer Cooling System. Sale starts 27th July on @Flipkart pic.twitter.com/YhIlm5MQye — Vivo India (@Vivo_India) July 20, 2022 -
మనీ లాండరింగ్ కేసు: వివోకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివోకి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. బ్యాంకుల ఖాతాలపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే 945 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని ఆదేశించింది. అలాగే రూ. 250 కోట్ల బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తూ ఆయా ఖాతాలను ఆపరేట్ చేసుకోవచ్చని తెలిపింది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు, బ్యాంకు ఖాతాల స్వాధీనంపై కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ, జస్టిస్ సుబ్రమణియంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం బుధవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి ఈడీ దాడులు, బ్యాంకు ఖాతాల సీజ్‌పై వివో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. బ్యాంకు ఖాతాలను సీజ్ చేస్తే 2,826 కోట్ల రూపాయల నెలవారీ జీతాలు చెల్లించలేమని పేర్కొంది. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. వివో తరపున సీనియర్ న్యాయ వాదులు సిద్ధార్థ్ లూత్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదిస్తూ బ్యాంకు ఖాతాలను సీజ్ వల్ల వివో కార్యకలాపాలు నిలిచి పోయాయని వాదించారు. కాగా పన్నులు ఎగవేసేందుకు దేశంలో ఆదాయాన్ని తక్కువ చూపించి కోట్ల రూపాయలను చైనాకు తరలించిందనే ఆరోపణలపై ఈడీ జూలై 5న దేశవ్యాప్తంగా వివో కార్యాలయాలపై విస్తృత దాడులు చేసింది. 119 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.465 కోట్లను స్వాధీనం చేసుకుంది. మరో రూ.73 లక్షల నగదు, రెండు కిలోల బంగారాన్ని కూడా సీజ్ చేసింది. భారత్‌లో పన్నులు ఎగవేసేందుకు స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో 2017-21 మధ్యకాలంలో రూ.62,476 కోట్ల టర్నోవర్‌ను చైనాలోని మాతృసంస్థకు తరలించిందని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. -
వివోకి భారీ షాక్: పెద్ద ఎత్తున నగలు, నగదు, బ్యాంక్ ఖాతాలు సీజ్
సాక్షి, ముంబై: చైనాకు చెందిన కంపెనీలకు షాకిస్తున్న కేంద్రం తాజాగా వివో మొబైల్స్‌కు భారీ ఝలకిచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణలపై భారీ ఎత్తున బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 48 ప్రదేశాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీగా సోదాలు చేపట్టింది. ఈ సందర్భంగా ఇండియా వ్యాపారానికి సంబంధించిన 119 బ్యాంక్ ఖాతాలను బ్లాక్ చేసినట్టు ఈడీ గురువారం ప్రకటించింది. మనీలాండరింగ్‌పై దర్యాప్తులో భాగంగా చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని 23 అనుబంధ కంపెనీల్లో విస్త్రృత తనిఖీలు చేసింది. ఈ సందర్భంగా 465 కోట్ల రూపాయలను సీజ్ చేసింది. 119 బ్యాంకుల్లో 73 లక్షల నగదు సహా, 66 ఫిక్స్డ్ డిపాజిట్లు, 2 కేజీలల బంగారం బార్స్ ఈడీ స్వాధీనం చేసుకుంది. వివో భారతీయ విభాగం దాదాపు 62,476 కోట్ల రూపాయల టర్నోవర్‌లో దాదాపు 50 శాతం "రెమిట్" చేసిందని ఈడీ గురువారం వెల్లడించింది. విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నష్టాలను చూపించి పన్నులు చెల్లించకుండా ఎగవేసిందని, ఆ నిధులను దేశం వెలుపలికి తరలించిందనీ ఆరోపించింది. 2018లో వివో మాజీ డైరెక్టర్ బిన్ లౌ దేశం విడిచి పారిపోయాడని పేర్కొంది. -
వివో బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా కెప్టెన్..
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 ప్రధాన స్పాన్సర్‌గా వ్యహరిస్తున్న చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో.. తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని నియమిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కోహ్లికి ఉన్న క్రేజ్ తమ ఉత్పత్తుల ప్రమోషన్‌కు బాగా ఉపయోగపడుతుందని ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు సంస్థ వెల్లడించింది. టెక్నాలజీపై ఆసక్తి కనబర్చే వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ పేర్కొంది. కోహ్లి తన కాంట్రాక్ట్‌లో భాగంగా.. సంస్థకు చెందిన ఉత్పత్తులను ప్రమోట్ చేయడంతో పాటు వాటిపై అవగాహన కల్పించనున్నాడని కంపెనీ వివరించింది. మరో రెండు రోజుల్లో 14వ ఐపీఎల్ ఎడిషన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న వివో.. కోహ్లిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడం ప్రాముఖ్యత సంతరించుకుంది. వివో ప్రస్తుతం ఐపీఎల్ అఫిషియల్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే, చెన్నై వేదికగా ఈ నెల 9న జరుగనున్న లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో కోహ్లి సారధ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢీకొంటుంది. చదవండి: రోహిత్ 'ఆరే'యడం ఖాయం.. -
ఆండ్రాయిడ్ 11: తొలి స్మార్ట్‌ఫోన్ వివో వీ20
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో మంగళవారం కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వీ సిరీస్ లో భాగంగా వివో వి 20 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో మనదేశంలో లాంచ్ అయిన మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. వివో వీ20 ఫీచర్లు 6.44అంగుళాల అమోలేడ్ ఎఫ్‌హెచ్‌డి + హాలో ఫుల్ వ్యూ డిస్ప్లే 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720 జీ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ 1 టీబీ వరకు విస్తరించుకునే అవకాశం 64+ 8 +2 ట్రిపుల్ రియర్ కెమెరా 44 మెగా పిక్సెల్ ఆటోఫోకస్ సెల్పీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వివో వీ20 ధర, లభ్యత రెండు వేరియంట్లలో లభ్యం. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,990 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,990గా ఉంది ప్రీ-బుకింగ్స్ ఈరోజు నుంచి ప్రారంభం. అలాగే అక్టోబర్ 20 నుంచి సేల్ ప్రారంభం. లాంచింగ్ ఆఫర్ వీ-షీల్డ్ మొబైల్ ప్రొటెక్షన్ ద్వారా కొత్త ఫోన్ కొనేటప్పుడు దీనిపై రూ.2,500 అదనపు ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాండ్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, జెస్ట్ మనీ ద్వారా ఆఫ్ లైన్లో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది. దీంతో పాటు వీఐ(వొడాఫోన్ ఐడియా) 819 రీచార్జ్ పై ఒక సంవత్సరం అదనపు వారంటీ కూడా లభ్యం. Out with the blurry, and in with clarity. Capture your life with the ultra-sleek #vivoV20 powered by 44MP Eye Autofocus Selfie to explore a new #DelightEveryMoment. Prebook now: https://t.co/PHsB9eFNXT pic.twitter.com/26zNlw9Mwh — Vivo India (@Vivo_India) October 13, 2020 -
వివో ఎస్1 ప్రొ, జియో భారీ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మిడ్-బడ్జెట్ రేంజ్లో ఎస్ 1 ప్రొ భారతదేశంలో విడుదల చేసింది. ఎస్ సిరీస్‌లో భాగంగా దీన్ని తీసుకొచ్చింది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 19,990 ధర వద్ద నేటి (శనివారం) నుంచి వివోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా అన్ని ఆన్లైన్,ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో వుంచింది. వివో ఇండియా తన అధికారిక ట్విటర్లో షేర్ చేసిన వివరాల ప్రకారం వైట్, బ్లూ, బ్లాక్ మూడు కలర్ వేరియంట్లలో వచ్చింది. ఈ మేరకు ఒక టీజర్ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. లాంచింగ్ ఆఫర్లు జనవరి 31 వరకు వన్ టైం స్క్రీన్ రీప్లేస్మెంట్ ఐసీఐసీఐ క్రెడిట్‌కార్డు కొనుగోలుపై 10శాతం క్యాష్‌బ్యాక్ జనవరి 31 వరకు 12వేల రూపాయల విలువ చేసే జియో ఆఫర్ వివో ఎస్ 1 ప్రొ ఫీచర్లు 6.39 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 2340 X 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కం స్నాప్ డ్రాగన్ 665 సాక్ 48+8+2+2 ఎంపీ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 8 జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ 4500 ఎంఏహచ్ బ్యాటరీ -
మీ మొబైల్ కొద్దిసేపు స్విచాఫ్ చేయండి..!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్లు వచ్చిన తర్వాత అనుబంధాలపై అది చూపిస్తున్న ప్రభావాన్ని ‘స్విచాఫ్’ ప్రచార కార్యక్రమం ద్వారా ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ వివో తెలియజేస్తోంది. తన బ్రాండ్ అంబాసిడర్ అమీర్‌ఖాన్‌తో కలసి ఈ కార్యక్రమాన్ని సంస్థ ఆరంభించింది. తమ మొబైల్ ఫోన్లను కొంత సమయం పాటు స్విచాఫ్ చేసి కుటుంబం, స్నేహితులతో గడపడంలో ఉన్న ఆనందాన్ని ఈ సంస్థ తన కార్యక్రమం ద్వారా భారతీయ వినియోగదారులకు తెలియజేయనుంది. ఇటీవలే వివో సంస్థ, సీఎంఆర్ భాగస్వామ్యంతో మానవ సంబంధాలపై స్మార్ట్‌ఫోన్ ప్రభావాన్ని తెలుసుకునేందుకు సర్వే నిర్వహించింది. స్మార్ట్‌ఫోన్ వల్ల ప్రవర్తనలో వచ్చే మార్పులను తెలుసుకునే ప్రయత్నం చేసింది. 75 శాతం మంది తాము యుక్త వయసు నుంచే స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నట్టు చెప్పగా.. ఇందులోనూ 41 శాతం మంది హైస్కూల్ దశ నుంచే వాడుతున్నట్టు చెప్పడం గమనార్హం. ‘‘తమ స్మార్ట్ పరికరాలకు అతుక్కుపోవడం వల్ల కుటుంబం, స్నేహితులతో వెచ్చించే సమయం గణనీయంగా తగ్గిపోతోంది. దీర్ఘకాలంలో ఈ చెడు అలవాటు ఒంటరితనానికి, ఒత్తిడికి దారితీస్తుంది. దీనికి తక్షణ చికిత్సల్లా అవసరమైనంత వరకు సమతులంగా వినియోగించుకోవాలి’’ అని మ్యాక్స్ క్యూర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన మానసిక వైద్య విభాగం హెడ్ డాక్టర్ సమీర్ మల్హోత్రా తెలిపారు. -
వివో కీలక నిర్ణయం, ఇక ఆ డీల్స్ వుండవు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ ద్వారా ప్రత్యేక ఆఫర్లతో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకట్టుకున్న వివో ఇండియా తాజాగా షాకింగ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది (2020) నుంచి ఆన్లైన్ ఎక్స్‌క్లూజివ్ సేల్స్‌అందుబాటులో వుండవని తేల్చి చెప్పింది. రిటైలర్స్‌కు మేలు చేయాలన్న సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. అయితే తమ ఉత్పత్తులను దాదాపు అవే ధరలకు మిగతా చానళ్ల ద్వారా తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచుతామని వివో ఇండియా సీఈవో జెరోమ్ చెన్ వెల్లడించారు. దీంతో వివోకు సంబంధించిన ఉత్పతుత్లన్నీ స్టాండర్ట్ రేట్స్‌కే లభిస్తాయన్నారు. అలాగే ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ ఆఫర్లు ఉంటాయని హామీ ఇచ్చారు. దేశంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారులలో ఒకటిగా నిలిచిన వివో ఇక ఆఫ్‌లైన్ మార్కెట్‌పై దృష్టి పెట్టనుంది. వివో తాజా నిర్ణయాన్ని స్వాగతించిన ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (ఐమ్రా), అన్యాయమైన ఇ-కామర్స్ వాణిజ్య పద్ధతులకు వ్యతిరేకంగా, సరసమైన వ్యాపార అవకాశాలతో మొబైల్ రిటైలర్ల కోసం కొత్త మార్పును తీసుకు వస్తున్నామని శుక్రవారం ఒక ట్వీట్లో పేర్కొంది. ఇందులో వివో మొబైల్స్ ఇండియా సీఈవో లేఖ కాపీని కూడా జత చేసింది. మరోవైపు 2020 జనవరి మొదటి వారంలో ఎస్ 1 ప్రో పేరుతో తో కొత్త స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఫుల్-హెచ్డి + రిజల్యూషన్‌తో 6.38-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 665 సాక్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డైమండ్ ఆకారంలో 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. We thank and appreciate @Vivo_India for their support against unfair e-commerce trade practices! Together, let’s bring in the new change for mobile retailers with fair business opportunities. Team AIMRA pic.twitter.com/bKomt50db9 — Aimra (@AimraIndia) December 27, 2019 -
వివో జెడ్1 ఎక్స్ : సూపర్ ఫీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ తయారీదారు వివో తన జెడ్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. వివో జెడ్ 1 ఎక్స్ పేరుతో భారతదేశంలో ప్రారంభించింది. వివో జెడ్-సిరీస్‌లో ఇది కంపెనీ రెండవ ఫోన్. ఇందులో 48 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అమోలేడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 712 సాక్, 22 వాట్ ఫ్లాష్‌చార్జ్ స్పెషల్ ఫీచర్లుగా ఉన్నాయి. ఫాంటమ్ పర్పుల్, ఫ్యూజన్ బ్లూ రంగులలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. వివో జెడ్ 1 ఎక్స్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 6 జీబీర్యామ్/ 64 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ .16,990. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.18,990 ఆఫర్ల విషయానికొస్తే, వివో జెడ్ 1 ఎక్స్ ఫోన్ కొనుగోలుపై రిలయన్స్ జియో రూ .6,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. అంతేకాకుండా, వినియోగదారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డు రూ .1,250 ఆఫర్ కూడా ఉంది. సెప్టెంబర్ 13 నుండి అమ్మకానికి లభ్యం. వివో జెడ్ 1 ఎక్స్ ఫీచర్లు 6.38-అంగుళాల సూపర్ అమోలెడ్ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 712 ఎఐఈ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9 పై 48+ 2+8 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా . 32 ఎంపీ సెల్పీ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ -
వివో కొత్త స్మార్ట్‌ఫోన్ వివో ఎస్ 1
సాక్షి, ముంబై : వివో ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఎస్ సిరీస్‌లో తొలి స్మార్ట్‌ఫోన్‌గా వివో ఎస్1 పేరుతో దీన్ని లాంచ్ చేసింది. అంతేకాదు దేశంలో వివో ఎస్ సిరీస్‌కు నటుడు సారా అలీ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. స్కైలైన్ బ్లూ, డైమండ్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వివో ప్రొడక్ట్ మేనేజర్ అంకిత్ మల్హోత్రా ప్రకటించారు. వివో ఎస్ 1లో 16 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 499 ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ ఎఫ్ / 2.2 లెన్స్‌తో 8 ఎంపీ సెకండరీ సెన్సార్ 5 ఎంపీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అమర్చింది. స్మార్ట్ బటన్ కూడా ఉంది, ఇది సింగిల్ ట్యాప్‌లో గూగుల్ అసిస్టెంట్‌ను, డబుల్ ట్యాప్ జోవి ఇమేజ్ రికగ్నిజర్ను ఓపెన్ చేస్తుంది. 4 జీబీ ర్యామ్/ 128 జీబీస్టోరేజ్, 6జీబీ ర్యామ్/ 64జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్,/128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ లభించనుంది. అయితే 4 జీబీ వేరియంట్ గురువారం నుంచే అమ్మకానికి సిద్ధం. వివో ఎస్ 1 ఫీచర్లు 6.80 అంగుళాల స్క్రీన్ 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9 పై ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి 65 సాక్ 19.5: 9 కారక నిష్పత్తిసూపర్ అమోలెడ్ ప్యానల్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 32 ఎంపీ సెల్పీ కెమెరా 16+ 8+ 5 ఎంపీ ట్రిపుల్ కెమెరా 6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ 4 500 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 4 జీబీ వేరియంట్ ధర రూ. 17,990 6 జీబీ ర్యామ్, 64/జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,990 , 6 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ. 19,990 -
బడ్జెట్ ధరలో వివో జెడ్ 1 ప్రొ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ తయారీదారు వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. జెడ్ సిరీస్‌లో భాగంగా వివో జెడ్ 1 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం తీసుకొచ్చింది. 11 జూలై 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా వివో జెడ్1 ప్రొ లభ్యం కానుంది. మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఏఐ ఆధారితి ట్రిపుల్ రియర్ కెమెరా, డెడికేటెడ్ గేమ్ మోడ్, పంచ్ హోల్ డిజైన్ తదితర ముఖ్య పీచర్లతోపాటు స్నాప్‌డ్రాగన్ 712 సాక్‌తో తీసుకొస్తున్న తొలి మొబైల్ ఇదని వివో స్ట్రాటజీ డైరెక్టర్ నిపుణ మార్య ప్రకటించారు. వివో జెడ్ 1 ప్రొ ఫీచర్లు ఆండ్రాయిడ్ 9 స్నాప్‌డ్రాగన్ 712 సాక్ 8+16+2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 4జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 14,999 6జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 16,999 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 18,999 ధరల్లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో వుంటుంది. సోనిక్బ్లూ, సోనిక్ బ్లాక్, మిర్రర్బ్లాక్ కలర్స్‌లో లభ్యం. -
భారీ బ్యాటరీతో వివో వై3 లాంచ్
బీజింగ్ : చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. వై సిరీస్‌లో భాగంగా వై 3 పేరుతో మొబైల్‌ను చైనాలో లాంచ్ చేసింది. ట్రిపుల్ రియర్ కెమెరా, భారీ బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా ఉంది. భారత్ మార్కెట్లో ఎపుడు విడుదలయ్యేది స్పష్టత ఇవ్వలేదు వివో. వివో వై 3 ఫీచర్లు 6.35 అంగుళాల డిస్ప్లే 720x1544 పిక్సెల్స్ రిజల్యూషన్ మీడియా టెక్ హీలియో పీ 35 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 13+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర సుమారు రూ. 15,200 -
వివో వి 15 ప్రొ కొత్త వేరియంట్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా మొబైల్ తయారీదారు వివో తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసింది. వివో వి 15 ప్రొలో హై ఎండ్ వేరియంట్‌గా 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను సోమవారం విడుదల చేసింది. దీని ధరను రూ. 29,990గా నిర్ణయించింది. ఇప్పటి వరకు ఈ ఫోన్ 6జీబీ ర్యామ్, 128 స్టోరేజ్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. వివో వి 15 ప్రొ ఫీచర్లు 6.39 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 9.0పై 2340 x 1080 పిక్సెల్స్ స్ర్కీన్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 675 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్ /128స్టోరేజ్ 256దాకా విస్తరించుకునే అవకాశం 48+8+5 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 3700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ -
వివో ఎస్1 ప్రొ స్మార్ట్‌ఫోన్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో దీన్నితీసుకొస్తోంది. వివో ఎస్1 ప్రొ పేరుతో చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. ఇటీవల భారత్‌లో తీసుకొచ్చిన వివో వీ 15 ప్రొ ఫీచర్లతోనే దీన్ని అందుబాటులోకి తెచ్చింది. 6జీబీ, 8 జీబీ రెండు వేరియంట్లో అందుబాటులో ఉండనుంది. అలాగే ట్రిపుల్ రియర్‌కెమెరా, 32 ఎంపీ సెల్పీ కెమెరా ప్రధాన ఆకర్షణ. ధర రూ. 27,700గా ఉంది. వివో ఎస్ 1 ప్రొ ఫీచర్లు 6,39 డిస్ప్లే 2340 X 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 28+8+5 ఎంపీ రియర్ కెమెరా 48ఎంపీ సెల్ఫీ కెమెరా 6జీబీ, 256 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్/128జీబీ ర్యామ్ 3700 ఎంఏహచ్ బ్యాటరీ -
రూ.101లకే వివో స్మార్ట్‌ఫోన్
సాక్షి,ముంబై: కొత్త సంవత్సరం సందర్భంగా చైనా మొబైల్ కంపెనీ వివో బంపర్ ఆఫర్ ప్రకటించింది. న్యూఫోన్, న్యూ ఆఫర్ పేరుతో కేవలం రూ.101 చెల్లించు అంటూ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఆఫర్ డిసెంబర్ 20నుంచి జనవరి 21, 2019 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ ద్వారా ఆన్ నెక్స్, వి11 ప్రొ, వి11, వై 95, వై 83, వై 81(4జీ) స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసుకోవచ్చు. మొదట 101రూపాయలు చెల్లించి నిర్దేశిత స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అనంతరం ఫోన్ విలువ మొత్తాన్ని ఆరు సులభ వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీబీ, క్యాపిటల్ ఫస్ట్ లాంటి సంస్థల ద్వారా ఫైనాన్సింగ్ సదుపాయం ఉంది. #NewPhoneNewYou Pay just INR 101 and own a new Vivo smartphone. Start this new year on the right note - with the right phone. Know more https://t.co/wzYDFH67Bg pic.twitter.com/ifZJsEzUwv — Vivo India (@Vivo_India) December 24, 2018 -
వివో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్
సాక్షి,న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌తో తమ కస్టమర్లను పలకరిస్తోంది. వై సిరీస్‌లో భాగంగా వివో వై 93 పేరుతో నూతన డివైస్‌ను తీసుకొచ్చింది. డ్యుయల్ కెమెరా, కర్వడ్ గ్లాస్, భారీ బ్యాటరీతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 13,990గా నిర్ణయించింది. అమెజాన్‌తో పాటు, ఇతర ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్ల ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయానికి అందుబాటులో ఉంది. వివో వై 93 ఫీచర్లు 6.22 ఇంచెస్ ఫుల్‌వ్యూ హెచ్డీ డిస్ప్లే 720x1520 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆక్టాకోర్ క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 4జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 256 దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం 13+2 డ్యుయల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 4030 ఎంఏహెచ్ బ్యాటరీ -
వివో వి11 స్మార్ట్‌ఫోన్ లాంచ్ : ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వి11ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వివో విసిరీస్కు కొనసాగింపుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. స్టారీ నైట్ బ్లాక్, నెబ్యులా పర్పుల్ కలర్ వేరియెంట్లలో ఈ డివైస్‌ను మంగళవారం విడుదల చేసింది. దీని ధరను రూ.22,900గా నిర్ణయించింది. వివో ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ సైట్లో ప్రత్యేకంగా ఈ నెల 27 నుంచి ఈ ఫోన్ విక్రయానికి లభ్యం. ఈ స్మార్ట్‌ఫోన కొనుగోలుపై ఆఫర్ల విషయానికి వస్తే హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్‌కార్డ్ కొనుగోళ్లపై 2వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో బై బ్యాక్గ్యారంటీతోపాటు ఆరునెలల్లో వన్‌టైం స్క్రీన్ రీప్లేస్ మెంట్ ఆఫర్ ఉంది. అంతేకాదు జియో, వోడాఫోన్ ఐడియా, మింత్రా, పేటీఎం, స్విగ్గీ ఆఫర్లను కూడా అందిస్తోంది. రిలయన్స్ జియో ద్వారా రూ.4050 విలువైన ఆఫర్లను వినియోగదార్లు పొందవచ్చు. వొడాఫోన్ ఐడియా భాగస్వామ్యంతో ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ. 499పైన రీచార్జ్‌లపై డ్యామేజ్ ఆఫర్ అందివ్వనుంది. అలాగే 198, 399 రూపాయల ప్లాన్లపై ప్రీపెయిడ్ కస్టమర్లకు 820జీబీ డేటా, ప్రీపెయిడ్ వినియోగదారులకు 600జీబీ డేటా ఆఫర్. వీటితోపాటు రూ. 2,100 రూపాయల విలువైన మింత్రా, స్విగ్గీ, పేటీఎం కూపన్లు కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లు సెప్టెంబరు 30న ముగుస్తాయి. వివో వి11 ఫీచర్లు 6.3 ఇంచ్ హాలో ఫుల్ వ్యూ డిస్ప్లే, విత్ 19.9 యాస్పెక్ట్ రేషియో 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆక్టాకోర్ ప్రాసెసర్ 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 16+5ఎంపీ డబుల్ రియర్ కెమెరా 25 ఎంపీ సెల్పీ కెమెరా 3315 ఎంఏహెచ్ బ్యాటరీ -
వివో వి9 : కొత్త వేరియంట్ లాంచ్
సాక్షి,న్యూఢిల్లీ: వివో తన పాపులర్ ఫోన్లో కొత్త వేరియంట్‌ను ఇండోనేసియాలో లాంచ్ చేసింది. వివో వి9లో 6జీబీ వేరియంట్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీని ధరను సుమారు 20,600లుగా ఉండనుంది. గత ఏడాది 4 జీబీ ర్యామ్‌తో తీసుకొచ్చిన వివో వి9 స్మార్ట్‌ఫోన్‌లో ఇపుడు 6జీబీ వేరియంట్‌ను విడుదల చేసింది. ముఖ్యంగా తాజా డివైస్‌లో కెమెరా, ప్రాసెసర్‌లో కూడా మార్పులు చేసింది. జూలై 5 నుంచి విక్రయానికి అందుబాటులో ఉంది. 6జీబీ ర్యామ్‌తో మార్కెట్లో వున్న ఒప్పో ఎఫ్7 కి ఇది గట్టి పోటీగా నిలవనుంది. వివో వి9 ఫీచర్లు (64జీబీ) 6.3 ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ ఓరియో 8.1 1080x2280 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కం స్నాప్ డ్రాగెన్ 660 ఎస్వోసీ 13 +2 ఎంపీ రియర్ కెమెరా 12 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ అల్ట్రా హెచ్డీ మోడ్ 6జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 256దాకా విస్తరించుకునే అవకాశం 3260ఎంఏహెచ్ బ్యాటరీ -
నయా ట్రెండ్ : వివో ఇన్నోవేటివ్ స్మార్ట్‌ఫోన్
బీజింగ్: చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 'వివో నెక్స్' పేరుతో ఈ డివైస్‌ను విడుదల చేసింది. ఫుల్-స్క్రీన్ డిస్ప్లేతో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ముఖ్యంగా ఆ స్మార్ట్‌ఫోన్‌లో పాప్ అప్ సెల్ఫీ కెమెరా ప్రధాన ఫీచర్‌గా నిలవనుంది. అత్యధిక స్టోరేజ్ కెపాసిటీతో ప్రీమియర్ వెర్షన్‌గా వివో నెక్స్ ఎస్, వివో నెక్స్ ఏ పేరుతో మరో స్టాండర్డ్ వెర్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. జోవి ఇంటెలిజెంట్ వాయిస్ అసిస్టెంట్, మరింత అభివృద్ధిపరచిన ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో ఈ ఇన్నోవేటివ్ వివో స్మార్ట్‌ఫోన్ నెక్స్ నయా ట్రెండ్‌ను సృష్టించనుందని టెక్ పండితులు భావిస్తున్నారు. ఈ రెండు స్మార్ట్ఫోన్లు బ్లాక్, రెడ్ కలర్స్‌లో లభ్యం. చైనాలో వీటి ధర మన కరెన్సీ ప్రకారం సుమారు 53వేల రూపాయలు( ప్రీమియం వెర్షన్)గా ఉంది. త్వరలోనే భారత మార్కెట్లో కూడా వీటిని లాంచ్ చేయనుందని అంచనా. వివో నెక్స్ ఫీచర్లు 6.59 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 ఎస్ఓసీ ప్రాసెసర్ 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ 12+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్‌చార్జ్ -
పెర్ఫాక్ట్ షాట్, వ్యూ: వి9 వచ్చేసింది
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్‌మేకర్ వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో వి9 పేరుతో ఇప్పటికే థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేయగా శుక్రవారం భారత్మార్కెట్లో విడుదల చేసింది. బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.22,990 గా నిర్ణయించింది. నేటి(మార్చి 23)నుంచి ప్రీ బుకింగ్‌కు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. వివో వి9 ఫీచర్లు 6.3 అంగుళాల ఫుల్ వ్యూ డిస్ ప్లే 19.9 యాస్పెక్ట్ రేషియో ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆక్టాకోర్ క్వాల్కం స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్ 1080x2280 పిక్సెల్స్ రిజల్యూషన్ 4జీబీ ర్యామ్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 16+5 ఎంపీ డ్యుయల్ రియల్ కెమెరా 24 ఎంపీ సెల్ఫీ కెమెరా 3260 ఎంఏహెచ్ బ్యాటరీ