![Smart Phone Company VIVO New Campaign With Switch Off Mobile - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/3/vivo.jpg.webp?itok=IfROsVyi)
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత అనుబంధాలపై అది చూపిస్తున్న ప్రభావాన్ని ‘స్విచాఫ్’ ప్రచార కార్యక్రమం ద్వారా ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ వివో తెలియజేస్తోంది. తన బ్రాండ్ అంబాసిడర్ అమీర్‌ఖాన్‌తో కలసి ఈ కార్యక్రమాన్ని సంస్థ ఆరంభించింది. తమ మొబైల్ ఫోన్లను కొంత సమయం పాటు స్విచాఫ్ చేసి కుటుంబం, స్నేహితులతో గడపడంలో ఉన్న ఆనందాన్ని ఈ సంస్థ తన కార్యక్రమం ద్వారా భారతీయ వినియోగదారులకు తెలియజేయనుంది.
ఇటీవలే వివో సంస్థ, సీఎంఆర్ భాగస్వామ్యంతో మానవ సంబంధాలపై స్మార్ట్‌ఫోన్ ప్రభావాన్ని తెలుసుకునేందుకు సర్వే నిర్వహించింది. స్మార్ట్‌ఫోన్ వల్ల ప్రవర్తనలో వచ్చే మార్పులను తెలుసుకునే ప్రయత్నం చేసింది. 75 శాతం మంది తాము యుక్త వయసు నుంచే స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నట్టు చెప్పగా.. ఇందులోనూ 41 శాతం మంది హైస్కూల్ దశ నుంచే వాడుతున్నట్టు చెప్పడం గమనార్హం. ‘‘తమ స్మార్ట్ పరికరాలకు అతుక్కుపోవడం వల్ల కుటుంబం, స్నేహితులతో వెచ్చించే సమయం గణనీయంగా తగ్గిపోతోంది. దీర్ఘకాలంలో ఈ చెడు అలవాటు ఒంటరితనానికి, ఒత్తిడికి దారితీస్తుంది. దీనికి తక్షణ చికిత్సల్లా అవసరమైనంత వరకు సమతులంగా వినియోగించుకోవాలి’’ అని మ్యాక్స్ క్యూర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన మానసిక వైద్య విభాగం హెడ్ డాక్టర్ సమీర్ మల్హోత్రా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment