switch off
-
ఫ్రాన్స్ స్కూళ్లలో ఫోన్లు స్విచ్ఛాఫ్
పారిస్: సెల్‌ఫోన్.. ప్రపంచమంతటా కేవలం పెద్దలకే కాదు, పిల్లలకు సైతం వ్యసనంగా మారిన సమాచార సాధనం. ఫోన్ చేతిలో లేకుండా ఒక్క క్షణం కూడా గడవని పరిస్థితి. హెల్‌ఫోన్ మారిన సెల్‌ఫోన్ పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను దెబ్బతీస్తున్నట్లు పలు అధ్యయనాల్లో గుర్తించారు. అంతేకాదు ఆధునిక యుగంలో ఎన్నో నేరాలకు ఫోన్లు కారణమవుతున్నాయి. ఈ జాడ్యాన్ని వదిలించడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం నడుం కట్టింది. వచ్చే ఏడాది నుంచి పిల్లలు పాఠశాలలో ఉన్నప్పుడు ఫోన్లు వాడకుండా పూర్తి నిషేధం విధించబోతోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా 50 వేల మందికిపైగా విద్యార్థులకు ఫోన్లు నిషేధిస్తూ ఉత్తర్వు తీసుకొచి్చంది. ఇది ఇప్పటికే అమల్లోకి వచి్చంది. ఫ్రెంచ్ మిడిల్ స్కూళ్లలో చదువుతున్న 11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో ఉన్నంతసేపు ఫోన్లు పూర్తిగా స్విచ్ఛాఫ్ చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమానికి ‘డిజిటల్ విరామం’ అని నామకరణం చేసింది. ఫోన్ల తెరల ముందు విద్యార్థులు సాధ్యమైనంత తక్కువ సమయం గడిపేలా చేస్తే వారిలో కొత్త విషయాలు నేర్చుకొనే సామర్థ్యం పెరుగుతుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్ చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని నర్సరీలు, ఎలిమెంటరీ స్కూళ్లలో మొబైల్ ఫోన్లతోపాటు ఇతర ఎల్రక్టానిక్ కమ్యూనికేషన్ పరికరాల వినియోగంపై 2018 నుంచే నిషేధం అమల్లో ఉంది. ఉన్నత పాఠశాలల్లో చదువుకొనే 15 నుంచి 18 ఏళ్ల పిల్లలు తరగతి గదిలో ఫోన్ వాడకుండా నిషేధించారు. అయితే, వారు ఫోన్లు తప్పనిసరిగా స్విచ్ఛాఫ్ చేయాలన్న నిబంధన లేదు. -
టెక్కీ: జైలుకైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను!
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో గత 12 రోజులుగా కనబడకుండా పోయిన టెక్కీ విపిన్ గుప్తా ఢిల్లీ వద్ద నోయిడాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కొడిగేహళ్లి పోలీసులు నోయిడాకు వెళ్లి అతనిని తీసుకువచ్చారు. మాన్యతా టెక్‌పార్క్ కంపెనీలో ఐటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్న విపిన్ గుప్తా, భార్య పిల్లలతో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. 4వ తేదీన కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో చెప్పకుండా తన కవాసకి బైక్‌లో వెళ్లిపోయాడు. గంట తరువాత బ్యాంకు ఖాతా నుంచి రూ.1.80 లక్షలు డ్రా అయ్యాయి. ఫోన్ కూడా స్విచాఫ్ చేసుకున్నాడు. రెండు రోజుల తరువాత భార్య కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తను వెతికిపెట్టాలని సోషల్ మీడియా ద్వారా పోలీసు శాఖకు వేడుకుంది. డబ్బుల కోసం తన భర్తను ఎవరో కిడ్నాప్ చేసారని వాపోయింది. విషయం రచ్చ కావడంతో పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి గుప్త కోసం వేట ప్రారంభించగా నోయిడాలో ఉన్నట్టు గుర్తించి తీసుకువచ్చారు. కుటుంబ కలహాల కారణంగా మనశ్శాంతి కోసం ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు అతడు చెబుతున్నాడు. భార్యాభర్తల కలహం పోలీసులను పరుగులు పెట్టించింది. -
డిసెంబర్ 20న మొబైల్ ఫోన్లు స్విచ్ఆఫ్.. ఎందుకంటే..
అన్నం తినకుండా మారాం చేస్తున్నారనో.. అల్లరి ఆపడం కోసమో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చేతికి ఫోన్ ఇస్తుంటారు. తొలుత సరదాగా ప్రారంభమైనప్పటికీ.. క్రమేపీ వారికి అదో వ్యసనంగా మారుతోంది. దీంతో.. రోజులో ఫోన్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో ‘స్విచాఫ్’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ నెల 20న తమ కస్టమర్లు అందరూ వారి స్మార్ట్ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలని కోరింది. డిసెంబర్ 20న రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు తమ కుటుంబాలతో సరదాగా గడపాలని, పిల్లలు వారి తల్లిదండ్రులతో సంతోషంగా ఉండాలని ప్రజలను కోరింది. కంపెనీ చేసిన ఓ సర్వేలో.. 77 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు విపరీతంగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారని ఫిర్యాదు చేసినట్లు వివో తెలిపింది. తల్లిదండ్రులకు సైతం ఫోన్ వ్యసనంగా మారిందని పేర్కొంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య అంతరాలు ఏర్పడితే భవిష్యత్తులో సమాజానికి నష్టం కలుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కొన్ని సర్వేల ప్రకారం.. 42 శాతం మంది 12 ఏళ్ల లోపు వయసు పిల్లలు రోజులో రెండు నుంచి నాలుగు గంటలపాటు ఫోన్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. 12 ఏళ్ల కంటే పైబడిన పిల్లలు రోజులో 47 శాతం సమయం ఫోన్ చూస్తున్నారు. 69 శాతం పిల్లలకు సొంత ఫోన్లు, ట్యాబ్‌లు ఉన్నాయట. 12 ఏళ్లు, అంతకంటే పెద్ద వయసు పిల్లలకు ఎలాంటి షరతులు లేకుండా ఇంటర్నెట్ యాక్సెస్ పొందుతున్నారని సర్వేల్లో వెల్లడైంది. 74 శాతం మంది పిల్లలు యూట్యూబ్ చూసేందుకు ఫోన్ వాడుతుంటే, 12 ఏళ్ల పైబడినవారు గేమింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని తేలింది. ఇదీ చదవండి: ‘కంపెనీని టేకోవర్ చేసే ప్రతిపాదన లేదు’ -
విమాన ప్రయాణం.. మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయమంటారు, ఎందుకో తెలుసా?
గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తే కాలక్షేపానికి మొబైల్ వాడకం సాధారణమే. అదే విమానంలో ప్రయాణం అంటే మాత్రం మన స్మార్ట్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని లేదా ఎరోప్లేన్ మోడ్ లో పెట్టమని చెప్తుంటారు. అసలు బస్సు, రైలు, బైకు వీటిలో ప్రయాణించేటప్పుడు లేని ఈ నిబంధన కేవలం విమాన ప్రయాణంలోనే ఎందుకు పాటించాలి. మీ సెల్యులార్ ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరం విమానానికి నిజంగా ప్రమాదం కలిగించగలదా?అలా చేయడం వెనుకు దాగున్న సైంటిఫిక్ కారణాల పై ఓ లుక్కేద్దాం! విమాన ప్రయాణంలో మొబైల్ స్విచ్ ఆఫ్.. విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో ప్యాసింజర్లు వారి మొబైల్స్‌ను స్విచ్ ఆఫ్ చేయమని అందులోని సిబ్బంది చెప్తుంటారు. అయితే విమానంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం నిషేధించలేదు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA). కానీ ప్లైట్ అటెండెంట్స్ మాత్రం ఈ నిబంధన పాటించమని చెబుతుంటారు. దీనికి ప్రధాన కారణం సెల్ ఫోన్స్, వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలు విడుదల చేసే రేడియో తరంగాలే (Radio Frequencies). ఇవి విమానంలోని నావిగేషన్ కు ఉపయోగించే రేడియో తరంగాలు దాదాపుగా ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. దాంతో కాక్ పిట్ లో ఉండే ఏరోనాటికల్ వ్యవస్థకు ఇది అంతరాయం కలిగిస్తుంది. ఒకవేళ అదే జరిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. విమాన ప్రయాణం సజావుగా సాగాలన్నా, మన స్మార్ట్‌ఫోన్ ఉపయోగించలన్నా ఈ రెండు సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడి పని చేస్తాయి. అందుకే విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో మీ ఫోన్స్ ను స్విచ్ ఆఫ్ చేయమని చెప్పేది. ఇప్పటి వరకు సెల్ ఫోన్ సిగ్నల్స్ కారణంగా ఈ తరహా ప్రమాదాలు జరగలేదు. కాకపోతే.. విమాన ప్రయాణంలో టేకాఫ్, ల్యాండింగ్ అనే ప్రక్రియ చాలా కీలకమైంది. అందుకే ముందు జాగ్రత్తగా ఇలా ఫోన్స్ ను ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం అనేక విమానయాన సంస్థలు తమ విమానాల్లో వై-ఫై సేవలను కూడా ప్రారంభించాయి. చదవండి: దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? -
ఒక్కరోజు స్విచ్చాఫ్.. కబుర్లన్నీ ఇంట్లో వాళ్లతోనే!
వారంలో ఓ రోజు ఫోన్, టీవీ, కంప్యూటర్, ట్యాబ్, ల్యాప్‌టాప్ అన్నింటికీ సెలవు ప్రకటించి తీరాలి. మెదడుకు రెక్కలు విచ్చుకుని విహరించే అవకాశం కల్పించాలి. ఒకేసారి రోజంతా అన్ని స్క్రీన్లకూ ఆఫ్ అంటే కొంత కష్టం కావచ్చు. టీవీ, కంప్యూటర్లైతే మన చేతిలోనే ఉంటాయి. ఫోన్ కాల్స్ మన చేతిలో ఉండవు. ఇంట్లో ఒక ఫోన్ స్విచాఫ్‌లో ఉంటే ‘ఫోన్ ఆఫ్‌లో ఉందేమిటి’ అంటూ మరొకరి ఫోన్‌కు కాల్స్ వస్తుంటాయి. కాబట్టి మొదట్లో ఒక గంటతో మొదలు పెట్టండి. రెగ్యులర్‌గా ఫోన్ చేసే స్నేహితులు, బంధువులకు ‘ఇది స్విచాఫ్ అవర్’ అని మెసేజ్ పెట్టేసి ఫోన్ బంద్ చేయాలి. గంటతో మొదలు పెట్టి క్రమంగా ‘స్విచాఫ్ డే’గా మార్చాలి. ‘స్విచాఫ్ డే’ కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకునే రోజవుతుంది. కుటుంబ బంధాలు ఆనందాల హరివిల్లుగా మారుతాయి. అనగనగా ఓ రోజు కాదు. ఈ ఆధునిక కాలంలోనే ఓ రోజు ఫోన్ లేకుండా గడిపితే ఎలా ఉంటుంది. వారంలో ఓ రోజు పనికి సెలవు తీసుకున్నట్లే ఇది కూడా. పనికి దూరంగా ఉన్నట్లే ఫోన్‌కు దూరంగా ఉంటే ఎలా ఉంటుంది? మెదడు ఓపెన్ అవుతుంది. సొంతంగా ఆలోచించడం మొదలవుతుంది. ఒకదానితో మరొక విషయాన్ని బేరీజు వేసుకోవడం మొదలు పెడుతుంది. ఆ మాత్రపు ఖాళీని మెదడుకు ఇచ్చి చూద్దాం. సెలవు రోజు ఇంటికి అవసరమైన వస్తువులు తెచ్చుకోవడం లేదా ఆర్డర్ చేసుకోవడం వంటి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఇక ఆ రోజుకు ఫోన్ ముట్టుకోవద్దు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పెట్టి కాలనీలో రోడ్లన్నీ చుట్టి వస్తే... మనం నివసించే ప్రదేశం ఎలా ఉందో తెలుస్తుంది. కొత్తగా కడుతున్న ఓ భవనం కనిపిస్తుంది. ఇంతకు ముందు ఈ ప్రదేశంలో ఏముండేది? ఓ ప్రశ్న మదిలో మెదలుతుంది. కానీ సమాధానమే తట్టదు. గడచిన పదేళ్లుగా ఇదే కాలనీలో ఉన్నప్పటికీ వారంలో పది–పదిహేను సార్లు ఇదే దారిలో ప్రయాణించినప్పటికీ మనం ఈ ప్రదేశానికి చిరపరిచితులం కాలేకపోయామా అనే సందేహం కూడా అనిపిస్తుంది. నిజానికి ఈ ప్రదేశానికి మనం చిరపరిచితులయ్యాం, కానీ మనకే ఈ ప్రదేశం చిరపరిచితంగా మారలేకపోయింది. ఒక్క రోజైనా చేతిలో ఉన్న ఫోన్‌ని జేబులో పెట్టుకుని ఈ దారిలో నడిచి ఉంటే కదా! ఏ విషయమైనా మెదడు గ్రహింపునకు వచ్చేది. అనుక్షణం కళ్లు, చెవులు, మెదడు ఫోన్‌తో ఎంగేజ్ అయి ఉంటాయి. అలవాటు పడిన దారిలో దేహం యాంత్రికంగా సాగిపోతూ ఉంటుంది. పనులు ముగించుకుని ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత కూడా టీవీ స్క్రీన్ మీద దృష్టి కేంద్రీకరిస్తాం. ప్రపంచంలోని విషయాలన్నింటినీ మెదడులోకి గుప్పించడంలోనే రోజు పూర్తవుతుంటే... ఇక మెదడు సొంతంగా ఆలోచించేదెప్పుడు? ఆ మాత్రం వెసులుబాటు దొరికినప్పుడే మెదడు తన సృజనాత్మకతను బయటపెడుతుంది. చదవండి: Health Tips: గలిజేరు ఆకును పప్పుతో కలిపి వండుకుని తింటున్నారా.. అయితే.. అందులోని ఆ గుణం వల్ల.. -
ఆమిర్ ఖాన్ అందుకే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్
ఆమిర్ ఖాన్‌ను అందరూ పర్ఫెక్షనిస్ట్ అని అంటారు. అనుకున్న కథ అనుకున్న పని అనుకున్న సినిమా అనుకున్న విధంగా చేయడానికి అతడు పెట్టవలసిన శ్రద్ధనంతా పెడతాడు. అతడు ‘గజనీ’ కోసం లావెక్కి, ‘3 ఇడియెట్స్’ కోసం సన్నబడి, ‘ధూమ్ 3’ కోసం సిక్స్ ప్యాక్ చేసి, ‘దంగల్’ కోసం ఒదులొదులు శరీరం చేసుకుని ఇన్ని ప్రయోగాలు చేశాడు తన శరీరంతో సినిమా కోసం. అలాంటిది ఇప్పుడు ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమా కోసం ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేమంటే తన ఫోన్ స్విచ్చాఫ్ చేయాలని అనుకోవడం. ‘పనికి అది ఆటంకం కలిగిస్తోంది. అందుకే డిసెంబర్ వరకూ నా ఫోన్ వాడదలుచుకోలేదు. మరీ ముఖ్యమైన విషయమైతే చెక్ చేసి నా అసిస్టెంట్ నాకు చెబుతాడు’ అన్నాడు అతను. ‘అలాగే నా సోషల్ మీడియా అకౌంట్స్ వైపు కూడా డిసెంబర్ వరకూ చూడదలుచుకోలేదు. నా టీమ్ వాటిని నిర్వహిస్తుంది’ అని చెప్పాడు. ఫోన్ లేని రోజుల్లో మనుషులకు ఏ పని మీదైనా తగిన అటెన్షన్ ఉండేది. ఇప్పుడు ఆ అటెన్షన్‌ను ఫోన్ చెదరగొడుతూ ఉంది. ఫోన్ లేకుండా ఉండటం అసాధ్యం ఇప్పుడు కొందరికి. క్షణం అది పక్కన లేకపోతే ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతారు. అలాంటిది అంతపెద్ద స్టార్ అయ్యి ఫోన్ పక్కన పడేశాడంటే ఆమిర్‌కు తన నటన, కెరీర్ పట్ల ఉండే శ్రద్ధ అర్థమవుతోంది. చదవండి: ఉత్తరాఖండ్ విలయం.. గొంతెత్తిన దియా మిర్జా -
ఆ లైట్లు ఆర్పకండి: కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ: వీధి లైట్లను ఆర్పాల్సిన అవసరం లేదని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. కరోనాపై పోరాటానికి ఆదివారం రాత్రి 9 గంటలకు విద్యుత్ దీపాలు ఆర్పేసి సంఘీభావం తెలపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరిన నేపథ్యంలో పలు అనుమానాలు తలెత్తడంతో కేంద్ర విద్యుత్ శాఖ వివరణ ఇచ్చింది. ఇళ్లలోని విద్యుత్ వస్తువులను స్విచ్చాఫ్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆసుపత్రులు, అత్యవసర విభాగాల్లో లైట్లు బంద్ చేయాల్సిన పనిలేదన్నారు. వీధి లైట్లను బంద్ చేయాలని ఎటువంటి పిలుపు ఇవ్వలేదని, శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని వీధి లైట్ల ఆర్పొద్దని స్థానిక సంస్థలకు సూచించింది. విద్యుత్ దీపాలను ఆర్పడం వల్ల పవర్‌గ్రిడ్ కుప్పకూలిపోతుందని, వోల్టేజ్ హెచ్చుతగ్గులు తలెత్తి గృహోపకరణాలు పాడవుతాయన్న వదంతులను కేంద్ర విద్యుత్ శాఖ తోసిపుచ్చింది. అలాంటివేమి జరగబోదని పేర్కొంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్లలోని విద్యుద్ దీపాలు బంద్ చేస్తే చాలని స్పష్టం చేసింది. (లైట్లను ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది) ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరాటానికి చిహ్నంగా ప్రజలంతా ఆదివారం (ఏప్రిల్–5) రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు విద్యుత్ దీపాలను ఆర్పేసి కొవ్వొత్తులు, టార్చిలైట్లు, సెల్‌ఫోన్ లైట్లను వెలిగించాలంటూ ప్రధాని మోదీ శుక్రవారం వీడియా సందేశంలో విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కట్టడికి సమర్థవంతమైన చర్యలు చేపట్టకుండా ప్రధాని ఇలాంటి పిలుపులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. (కొవ్వొత్తుల తర్వాత రంగోలి పోటీలా!?) -
మీ మొబైల్ కొద్దిసేపు స్విచాఫ్ చేయండి..!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్లు వచ్చిన తర్వాత అనుబంధాలపై అది చూపిస్తున్న ప్రభావాన్ని ‘స్విచాఫ్’ ప్రచార కార్యక్రమం ద్వారా ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ వివో తెలియజేస్తోంది. తన బ్రాండ్ అంబాసిడర్ అమీర్‌ఖాన్‌తో కలసి ఈ కార్యక్రమాన్ని సంస్థ ఆరంభించింది. తమ మొబైల్ ఫోన్లను కొంత సమయం పాటు స్విచాఫ్ చేసి కుటుంబం, స్నేహితులతో గడపడంలో ఉన్న ఆనందాన్ని ఈ సంస్థ తన కార్యక్రమం ద్వారా భారతీయ వినియోగదారులకు తెలియజేయనుంది. ఇటీవలే వివో సంస్థ, సీఎంఆర్ భాగస్వామ్యంతో మానవ సంబంధాలపై స్మార్ట్‌ఫోన్ ప్రభావాన్ని తెలుసుకునేందుకు సర్వే నిర్వహించింది. స్మార్ట్‌ఫోన్ వల్ల ప్రవర్తనలో వచ్చే మార్పులను తెలుసుకునే ప్రయత్నం చేసింది. 75 శాతం మంది తాము యుక్త వయసు నుంచే స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నట్టు చెప్పగా.. ఇందులోనూ 41 శాతం మంది హైస్కూల్ దశ నుంచే వాడుతున్నట్టు చెప్పడం గమనార్హం. ‘‘తమ స్మార్ట్ పరికరాలకు అతుక్కుపోవడం వల్ల కుటుంబం, స్నేహితులతో వెచ్చించే సమయం గణనీయంగా తగ్గిపోతోంది. దీర్ఘకాలంలో ఈ చెడు అలవాటు ఒంటరితనానికి, ఒత్తిడికి దారితీస్తుంది. దీనికి తక్షణ చికిత్సల్లా అవసరమైనంత వరకు సమతులంగా వినియోగించుకోవాలి’’ అని మ్యాక్స్ క్యూర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన మానసిక వైద్య విభాగం హెడ్ డాక్టర్ సమీర్ మల్హోత్రా తెలిపారు. -
ఏటీఎం కార్డును స్విచాఫ్ చెయ్యండి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంట్లో ఫ్యాన్ లేదా లైట్‌కు ఆన్–ఆఫ్ బటన్ ఉన్నట్టే.. చేతిలోని డెబిట్, క్రెడిట్ కార్డులనూ స్విచాఫ్ చేసే వీలుంటే? లేకనేం... ఆగస్టు నుంచి ఈ సరికొత్త సాంకేతిక సేవలు అందుబాటులోకి వస్తున్నాయ్. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సీ అనుసంధానిత ఈ–షీల్డ్ యాప్‌ను దేశంలో పరిచయం చేస్తోంది ముంబైకి చెందిన ఆటమ్ టెక్నాలజీస్. డెబిట్, క్రెడిట్ కార్డులను ఆన్–ఆఫ్ చేయటం ద్వారా ఆన్లైన్ మోసాలకు చెక్ చెప్పడంతో పాటూ బ్యాంక్‌లకు కస్టమర్ కేర్ నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందని ఆటమ్ సీఈఓ దేవాంగ్ నేరళ్ల ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. స్మార్ట్‌ఫోన్ లేకున్నా సేవల వినియోగం.. వాస్తవానికి ఈ–షీల్డ్ సాంకేతికతను ఆస్ట్రేలియాకు చెందిన ట్రాన్వాల్ అభివృద్ధి చేసింది. మధ్య ప్రాచ్య, ఆఫ్రికాలోని ఐదారు దేశాల్లో వీటిని అందిస్తోంది కూడా. ముంబైకి చెందిన ఆటమ్ టెక్నాలజీస్‌తో ప్రత్యేక ఒప్పందం చేసుకొని భారత్‌లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. భారతీయుల అవసరాలు, ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా టెక్నాలజీలో కొద్ది మార్పులు చేశామని దేవాంగ్ తెలిపారు. ఈ–షీల్డ్ ఎలా పనిచేస్తుందంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) అనుసంధానిత యాప్. వాయిస్, చాట్ ద్వారా ఇది యాక్టివేట్ అవుతుంది. డెబిట్, క్రెడిట్ కార్డులను ఆన్–ఆఫ్ చేయటమే కాకుండా పరిమిత లావాదేవీలు, ఏరియాల వారీగా, విదేశీ లావాదేవీలనూ నియంత్రించవచ్చు. కార్డు, అకౌంట్ స్టేటస్, బ్యాలెన్స్ చెక్ వంటి సేవలను వినియోగించుకోవ చ్చు. స్మార్ట్‌ఫోన్ లేని కస్టమర్లు ఎస్ఎంఎస్ ద్వారా ఈ–షీల్డ్ సేవలను వినియోగించుకునే వీలుంది. ఈ–షీల్డ్ సేవల కోసం దేశంలోని ఒకటిరెండు ప్రధాన బ్యాంక్‌లతో చర్చలు జరుపుతున్నట్లు దేవాంగ్ తెలిపారు. ఈ బ్యాంక్‌లకు ప్రతి కార్డుకూ నెలకు రూ.1–3 చార్జీ ఉంటుందని చెప్పారు. రిటైలర్ల కోసం ‘ఎం గల్లా’.. ఒకే వేదికపై అన్ని పేమెంట్ ఆప్షన్లనూ ఉపయోగించుకునేందుకు వీలు కల్పించే ‘ఎం గల్లా’ రిటైలర్స్ యాప్‌ను దేవాంగ్ ఈ సందర్భంగా విడుదల చేశారు. భారత్ క్యూఆర్, పీఓఎస్, ఐవీఆర్, యూపీఐ, భీమ్, ఆధార్, లింక్ ఆధారిత లావాదేవీల వంటి అన్ని రకాల పేమెంట్లనూ ఎంగల్లా యాప్ నుంచి చేసుకునే వీలుందని చెప్పారాయన. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో 5,000 మంది వర్తకులు ఎం గల్లా యాప్‌ను వాడుతున్నారని, వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 10 వేల మంది వర్తకులకు చేరాలని, నెలకు రూ.200 కోట్ల లావాదేవీలు నిర్వహించాలని లకి‡్ష్యంచినట్లు ఆయన తెలియజేశారు. ఏటా రూ.50 వేల కోట్ల లావాదేవీలు..: ‘‘ఎండ్ టు ఎండ్ పేమెంట్ సేవలందించే ఆటమ్... 2006లో ప్రారంభమైంది. రిటైల్, ప్రభుత్వ విభాగాలు, డీటీహెచ్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్ అండ్ టూరిజం, టెలీకమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో లక్షకు పైగా వర్తకులు ప్రస్తుతం ఆటమ్ సేవలను వినియోగిస్తున్నారు. మొత్తం వర్తకుల్లో 2 వేల మంది ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏటా రూ.1,000 కోట్ల లావాదేవీలు మా ద్వారా జరుగుతున్నాయి. గతేడాది ఆటమ్ వేదికగా రూ.50 వేల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19) రూ.85,000–90,000 కోట్ల లావాదేవీలు లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశంలో 30 లక్షల పీఓఎస్ మిషన్లున్నాయి. వీటిలో 80 వేల మిషన్లను ఆటమ్ నిర్వహిస్తోంది. వచ్చే 6 నెలల్లో మలేషియా, వియత్నాం, ఇండోనేషియా దేశాలకు విస్తరిస్తాం’’ అని దేవాంగ్ వివరించారు. -
వైఫై ఆఫ్ చేసిందన్న కోపంతో భార్యను...
-
హైదరాబాద్‌లో దారుణం.. వైఫై కోసం భార్యను...
సాక్షి, హైదరాబాద్ : వైఫై కోసం భార్యను చితకబాదాడు ఓ వ్యక్తి. ఆఫ్ చేసిందన్న కోపంతో ఆమెపై పిడిగుద్దులు గుద్దాడు. సోమాజిగూడలో బుధవారం రాత్రి చోటు చేసుకోగా.. గాయాలపాలైన భార్య ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానా అనే మహిళ తన భర్త అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్లో మునిగిపోతుండటం భరించలేకపోయింది. ఈ క్రమంలో వైఫైను ఆఫ్ చేయటంతో ఆ భర్తకు చిర్రెత్తుకొచ్చింది. ఆమెపై పడి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సుల్తానాను ఆమె తల్లి గురువారం ఉదయం ఆస్పత్రిలో చేర్చింది. సుల్తానా ముఖం, ఛాతీ, తలపై గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సుల్తానా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేసే ముందు వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చే యత్నం చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. -
రాత్రి 8.30-9.30.. స్విచ్ఆఫ్
- పర్యావరణ పరిరక్షణకు నేడు ‘ఎర్త్ అవర్’ - ఈపీటీఆర్ఐ డెరైక్టర్ జనరల్ కల్యాణ చక్రవర్తి విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: సమతుల్య వాతావరణం కోసం ప్రపంచవ్యాప్తంగా శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా అవసరం లేని లైట్లను స్విచ్ ఆఫ్ చేసి ఎర్త్ అవర్ పాటిస్తున్నారని... ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలంతా విజయవంతం చేయాలని పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) డెరైక్టర్ జనరల్ బి.కల్యాణ చక్రవర్తి విజ్ఞప్తి చేశారు. ఎర్త్ అవర్‌పై శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పారిస్ ప్రొటోకాల్ ప్రకారం ఉష్ణోగ్రతల పెరుగుదల రెండు శాతానికి మించకుండా ప్రతీ దేశంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అందులో భాగంగానే ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నామన్నారు. 2007 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ అవర్‌ను ప్రతీ ఏడాది పాటిస్తున్నారని తెలిపారు. మన దేశంలో 150 పట్టణాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కంపెనీలు, ఇండియాగేట్, గేట్ వే ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి కార్యాలయం, హౌరా బ్రిడ్జి వద్ద లైట్లను ఆర్పివేసి మద్దతు అందిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి స్థానంలో పవన, సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. మిషన్ కాకతీయ, హరితహారం కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ పరిరక్షణకు కృషి చేస్తోందని చక్రవర్తి తెలిపారు. భూతాపంతో వివిధ జీవ జాతులు అంతరించిపోకుండా ఎర్త్ అవర్ కార్యక్రమానికి ‘వరల్డ్ వైడ్ ఫండ్’ సహకారం అందిస్తుందని... విద్యుత్ ఆదా, వనరుల పరిరక్షణ ద్వారా సమకూరే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేస్తున్నామని ఆ సంస్థ రాష్ట్ర ైడె రెక్టర్ ఫరీదా తంపాల్ తెలిపారు. -
అసెంబ్లీలో మొబైల్స్ స్విచాఫ్..!
పట్నా: బిహార్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మొబైల్ ఫోన్లు వాడటంపై స్పీకర్ విజయ్ చౌదరి ఆంక్షలు విధించారు. సభ్యులు అసెంబ్లీలోకి వచ్చే ముందుగా తమ మొబైల్స్‌ను స్విచాఫ్ చేసుకోవాలని ఆదేశించారు. 'అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు కొందరు సభ్యులు మొబైల్ ఫోన్లు వాడటం చూశా. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలోనూ సభ్యులు మొబైల్స్ వాడటం కనిపించింది. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి సంఘటనలు సభ గౌరవానికి విరుద్ధం. సభ్యులు తమ మొబైల్ ఫోన్లు ఉంచడానికి సభ వెలుపల ఏర్పాట్లు చేస్తాం. లేదంటే ఎమ్మెల్యేలు సభలోకి వచ్చే ముందు తమ మొబైల్స్ స్విచాఫ్ చేసుకుని తీసుకురావాలి' అని సభలో విజయ్ చౌదరి చెప్పారు. -
స్మార్ట్ ఫోన్ స్విచ్చాఫ్ చేయొద్దు!
న్యూయార్క్: బ్యాటరీ బాగా మన్నుతుందన్న ఉద్దేశంతో చాలా మంది తమ స్మార్ట్ ఫోన్ ను పడుకునే ముందు స్విచ్ఛాఫ్ చేస్తారు. అయితే దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదంటున్నారు సాంకేతిక నిపుణుడు, ఐఫిక్సిట్ వ్యవస్థాపకుడు కైలి వీన్స్. స్మార్ట్ ఫోన్ ను స్విచ్ఛాఫ్ చేసినంత మాత్రానా బ్యాటరీ జీవితకాలం పెరగదని చెప్పారు. ఫోన్ వాడుతూవుంటనే బ్యాటరీ బాగా మన్నుతుందని వెల్లడించారు. ఫోన్ చార్జింగ్ సగానికి తగ్గినప్పుడే ఛార్జింగ్ పెడితే బ్యాటరీ జీవిత కాలం పెరుగుతుందని వివరించారు. మ్యూజిక్ వినడం, జీపీఎస్ వాడడం, వీడియోలు వీక్షించడం వల్ల బ్యాటరీ పాడైపోదని చెప్పారు. స్విచ్చాఫ్ చేసి, ఆన్ చేయడం వల్లే బ్యాటరీ జీవితకాలం తగ్గుతుందని వివరించారు. -
సర్వేజన కష్టాలు
ప్రచార ఆర్భాటమెక్కువ..ఏర్పాట్లు తక్కువ సమగ్ర సర్వే నిర్వహణలో అధికారుల వైఫల్యం వరంగల్ నగరంలో మరీ అధ్వానం వివరాల నమోదుకు ఆసక్తి చూపిన ప్రజానీకం అయినా.. ఇళ్లకు రాని సిబ్బంది ఇబ్బందులు పడిన కుటుంబాలు స్పందించని టోల్‌ఫ్రీ నంబర్లు కలెక్టర్ మొబైల్ స్విచ్ ఆఫ్ రాత్రి వరకూ కొనసాగిన సర్వే సాక్షి ప్రతినిధి, వరంగల్ : సరిపోని ఎన్యూమరేటర్లు, తక్కువ పడిన నమోదుపత్రాలు, ఉన్నతాధికారుల ప్రణాళికలేమి, కిక్కిరిసిన బస్సులు, ఊళ్లకు చేరేందుకు ప్రజల అవస్థలు, అవసరమైన సమాచారం కాకుండా అనవసర విషయాలు తెలుసుకోవడం.. వీటి మధ్య జిల్లాలో మంగళవారం సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. సర్వేపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించడంలో సఫలమైన ఉన్నతాధికారులు, నిర్వహణ ఏర్పాట్లు మాత్రం సరిగా చేయలేకపోయారు. ముందుగా గుర్తించిన 10.69 లక్షల కుటుంబాల వివరాలు సేకరించేందుకు అవసరమైన ఎన్యూమరేటర్ల(వివరాలు సేకరించేవారు)ను సమకూర్చుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. చివరి నిమిషంలో విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులను తీసుకోవడంతో సర్వేకు మొదట్లో ఉన్న ప్రాధాన్యత తగ్గినట్లు కనిపించింది. సరిపడా ఎన్యూమరేటర్లు లేకపోవడంతో చాలా కుటుంబాల వివరాలు నమోదు కాలేదు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు నిర్వహించారు. కలెక్టరేట్లో, కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు పని చేయకపోవడంతో సర్వే వివరాలు సేకరించే వారు తమ ఇళ్లకు రాకపోవడంపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించిన వారికి నిరాశే మిగిలింది. ఇబ్బందులు ఉంటే మెస్సేజ్ చేయాలని సూచిస్తూ ప్రకటించిన కలెక్టర్ జి.కిషన్ మొబైల్ సైతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో ప్రజలు నిరసన తెలిపారు. వివరాలు నమోదు చేసికోని వారు, ఎన్యూమరేటర్లు రాని వారి పరిస్థితి ఏమిటనే విషయంలో స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు ఉత్సాహం చూపినా... సమగ్ర కుటుంబ సర్వేలో వరంగల్ నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది ప్రణాళిక లోపం స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే విషయంలో ప్రజలనుంచి అనూహ్య స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు ఉదయం నుంచి ఎన్యూమరేటర్ల కోసం ఎదురు చూశారు. ప్రజలు ఉత్సాహంపై బల్దియా అధికారులు నీళ్లు చల్లారు. ఎన్యూమరేటర్లకు కేటాయించిన ఇళ్ల వివరాల విషయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు చేసిన తప్పిదాలతో సర్వే అస్తవ్యస్తంగా జరిగింది. ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ఇంటి నం బర్ల పరిధికి మాత్రమే పరిమితమయ్యారు. వం దలాది మంది కుటుంబాల వివరాలు నమోదు చేయలేదు. 400 మంది ఎన్యూమరేటర్ల కొరత ఏర్పడింది. ఎంపిక చేసి శిక్షణ ఇచ్చిన మరో 100 మంది విధులకు హజరుకాలేదు. నగరంలో 2,44,646 కుటుంబాలు ఉంటే దాదాపు 25వేల కుటుంబాల వివరాలను సేకరించలేకపోయారు. హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం 100 ఫీట్ల రోడ్డు మార్గలోని జవహన్కాలనీ, రాంనగర్‌లోని కొన్నిప్రాంతాలు, ఎన్ఐటీ ఎదురుగా ఉన్న కాలనీలు, జూలైవాడ, రెవెన్యూకాలనీ, ప్రకాష్‌రెడ్డిపేట తదితర కాలనీల నుంచి ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చి అధికారులను కలిసి పరిస్థితి వివరించారు. తమకు సంబంధంలేదని నగరపాలకసంస్థ వారికి ఫిర్యాదు చేయాలని డీఆర్వో సురేందర్‌కరణ్ నిర్లక్ష్యంగా చెప్పడంతో ఆగ్రహించిన బాధితులు కొందరు కలెక్టర్ అధికారిక నివాసం ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. సుబేదారి పోలీసులు నచ్చజెప్పి పంపించారు. నగరంలోని కొత్తవాడ, మర్రివెంకటయ్య కాలనీ, నవయుగ కాలనీ, రామన్నపేట, హన్మకొండలోని కొత్తూరు, కుమార్‌పల్లి, పోలీస్ హెడ్ క్వార్టర్స్, రెడ్డికాలనీ, వడ్డేపల్లి టీచర్స్ కాలనీ, రామకృష్ణ కాలనీ తదితర కాలనీల్లో అసలు సర్వే కోసం ఎన్యూమరేటర్లు వెళ్లలేదు. 19 డివిజన్లోని రఘునాథ్‌నగర్ కాలనీవాసులు 200 మంది కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. మరికొందరు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. జనగామ పట్టణం 5 వార్డులో ఎన్యూమరేటర్ ఒకే చోట కూర్చుని సర్వే చేస్తుండగా కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని 8వ వార్డులో పలు ఇళ్లకు, జనగామ మండలం గానుగుపాడ్, వడ్లకొండ, వెంకిర్యాలలో ఇందిరమ్మ ఇళ్లకు, బచ్చన్నపేట మండలం చిన్నరాంచెర్ల జీపీ పరిధిలోని గోపాల్‌నగర్‌లో బుడిగె జంగాలకు చెందిన 50 గుడిసెలకు, నర్మెట మండల కేంద్రంలో పలు ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో ఎన్యూమరేటర్లు సర్వే చేయడానికి మొండికేయడంతో ప్రజలు ఆందోళన చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నంబర్లు లేకపోవడంతో పాత ఇళ్లలో తల్లిదండ్రులు ఉంటున్న చోట ఉమ్మడి కుటుంబంగా వివరాలు ఇవ్వాల్సి వచ్చింది. మానుకోట నియోజకవర్గంలో ఒకే ఇంటి నంబరుపై పలు కుటుంబాలు నివాసం ఉన్నా వేర్వేరుగా నంబర్లు ఇవ్వకపోవడంతో సమస్య తలెత్తింది. మానుకోట పట్టణ శివారు పత్తిపాక, మంగలికాలనీ, తదితర కాలనీలలో ఇండ్లకు నంబర్లు ఇవ్వకపోవడంతో పూర్తిస్థాయిలో సర్వే జరుగలేదు. కేసముద్రంలోనూ రెండుమూడు కుటుంబాలు ఉండే ఇళ్లకు ఒకే నంబరు ఇవ్వడంతో కుటుంబ యజమానులు సిబ్బందితో గొడవపడ్డారు. నెల్లికుదురు మండలం నర్సింహులగూడెం, మునిగలవీడు, చిన్న నాగారం గ్రామాల్లో సూరత్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించేందుకు సిబ్బంది నిరాకరించగా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గూడురు మండలంలోనూ నంబర్ల సమస్య తలెత్తింది. భూపాలపల్లి పట్టణంలో పలు కాలనీల్లో ఇంటి నంబర్ల ఆధారంగా ఇళ్లను గుర్తించేందుకు ఎన్యూమరేటర్లు కష్టపడాల్సి వచ్చింది. భూపాలపల్లి, గణపురం, చిట్యాల మండలాల అధికారులు సకాలంలో టిఫిన్, భోజనం అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిట్యాలలో కనీసం వాహన సౌకర్యం కల్పించకపోవడంతో కేటాయించిన ప్రాంతాలకు వెళ్లడానికి నానా తిప్పలు పడ్డారు. రేగొండ, భూపాలపల్లి, చిట్యాల మండలాల్లో పలు చోట్ల పలు కుటుంబీకుల పేర్లు లిస్టులో లేకపోవడంతో బాధితులు వాగ్వివాదానికి దిగారు. నర్సంపేట పట్టణంలో 45 వుంది ఎన్యూవురేటర్లు గైర్హాజరయ్యూరు. సూపర్వైజర్లు ఇంటి నంబర్ల జాబితాను సరిగా రూపొందించకపోవడంతో సర్వే సిబ్బంది ఇబ్బంది పడ్డారు. పలు వార్డుల్లో సర్వే టీం ఇంటికి వెల్లని వారి కోసం స్థానిక బాలుర హైస్కూల్లో వుూడు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. గైర్హాజరైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటావుని ఆర్డీఓ తెలిపారు. నల్లబెల్లి మండల కేంద్రంలో ఒక ఇంటిలో పలు కుటుంబాలున్నా ఒకే ఫారంలో వివరాలు నమోదు చేయడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పరకాల నగర పంచాయతీ పరిధి 13వ వార్డులో ఎన్యూమరేటర్లతో స్థానికులు ఘర్షణకు దిగారు. కుటుంబంలో కొందరి పేర్లు మాత్రమే రావడంతో తప్పుడు సర్వే చేస్తున్నారని వాదించారు. పట్టణంలోని ఒక వాడలో ఇద్దరు భార్యలు నా పేరు అంటే నా పేరు రాయమంటూ గొడవకు దిగడంతో ఎన్యూమరేటర్ ఆ ఇంటిని సర్వే చేయకుండా వదిలి వేశారు. పరకాల మండలంలోని వెంకటాపూర్, నాగారం గ్రామాల్లో పలువురి పేర్లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. గీసుకొండ మండలం విలీన గ్రామాల్లో ఇంటి యజమానుల కుటుంబాలను మాత్రమే సర్వే చేశారు. వృద్ధుల పేర్లను లేకుండా చేశారు. సంగెం మండలంలోని తిమ్మాపురం, ఎల్గూరు స్టేషన్, మొండ్రాయిలో ఎన్యూమరేటర్లు సర్వే చేయడంలో ఇబ్బంది పడగా కొత్తవారితో చేయించారు. ఆత్మకూరు మండలంలో సిబ్బందికి ఇంక్ ప్యాడ్లకు బదులు స్కేచ్ పెన్నులు ఇచ్చారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సమగ్ర సర్వే ప్రశాంతంగా జరిగింది. పలువురి ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో ఎన్యూమరేటర్లు ఆయా కుటుంబాల వివరాలు నమోదు చేసుకోలేదు. దీంతో బాధితులు గొడవకు దిగడంతో అధికారులు కల్పించుకొని సమస్యను పరిష్కరించారు. నియోజకవర్గం మొత్తం సర్వే తీరును జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ప్రాజెక్టు డెరైక్టరు వి.వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని వర్ధన్నపేట, పర్వతగరి, హసన్‌పర్తి(రూరల్), హన్మకొండ గ్రామీణ మండలాల్లో అర్ధరాత్రి సర్వే జరిగింది. 150 మంది ఎన్యూమరేటర్లు విధులకు డుమ్మాకొట్టడంతో కానిస్టేబుళ్లు ఆ విధులు నిర్వర్తించారు. ఎల్లాపురంలో సర్వే ఆలస్యం కావడంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. కుమ్మరిగూడెం, మడికొండలోని కొన్ని ప్రాంతాల్లో సర్వే జరగలేదు. వర్ధన్నపేట మండలంలో ప్రత్యేక అధికారి బి.సంజీవరెడ్డి సర్వేను పర్యవేక్షించారు. పాలకుర్తి మండలం బమ్మెర శివారు పలుగుబోడు తండాలో ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబం సర్వే కోసం సొంత ఊరికి వచ్చింది. ఆ ఇంటి దూలం విరిగి పడి లకావత్ ధర్మా కుమారుడు నితిన్ రెండు కాళ్లు విరిగిపోయాయి. ఇంటి నంబర్ల కేటాయింపులో పొరపాట్లపై దేవరుప్పుల మండలం గొల్లపల్లిలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్రావును ప్రజలు నిలదీసారు. తొర్రూరు, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల మండలంలోని పలు గ్రామాల్లో ఇదే విషయంపై ప్రజలు ఎన్యూమరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డోర్నకల్ మండలంలో 46 మంది ఎన్యూమరేటర్లు విధులకు రాలేదు. మరిపెడ మండలంలో ఫారాలు సరిపోలేదు. నర్సింహులపేట మండలం బొజ్జన్నపేటలో ఎన్యూమరేటర్ ఐ.మధు కళ్లు తిరిగి పడిపోయాడు. కురవి మండలం బలపాల, గుండ్రాతిమడుగులో అర్ధరాత్రి వరకు సర్వే జరిగింది. ఏటూరునాగారం మండలంలో ఒక దగ్గరే కూర్చుని వివరాలు నమోదు చేయడం కని పించింది. కొత్తగూడ మండలంలో సర్వే ప్రశాతంగా ముగిసింది. వెంకటాపురం మం డలంలో ఎన్యూమరేటర్ల కొరత ఏర్పడడం తో ప్రేవేటు ఉపాధ్యాయులను, యువజన సంఘాల సభ్యులతో సర్వే చేయించారు. తాడ్వాయి మండలంలో ఇంటి నంబర్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. మంగపేట మండలంలో అధికారులు చేసిన తప్పులపై ప్రజలు నిలదీశారు. కొన్ని ఇళ్లను విస్మరించడంతో బాధితులు గ్రామ పంచాయతీకి చేరుకుని ఆందోళన నిర్వహించారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకున్నారు. గోవిందరావు పేట మండలంలో సర్వే ప్రశాతంగా జరిగింది. -
సీఎం కిరణ్ సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్!