ఆమిర్ ఖాన్‌ను అందరూ పర్‌ఫెక్షనిస్ట్ అని అంటారు. అనుకున్న కథ అనుకున్న పని అనుకున్న సినిమా అనుకున్న విధంగా చేయడానికి అతడు పెట్టవలసిన శ్రద్ధనంతా పెడతాడు. అతడు ‘గజనీ’ కోసం లావెక్కి, ‘3 ఇడియెట్స్’ కోసం సన్నబడి, ‘ధూమ్ 3’ కోసం సిక్స్ ప్యాక్ చేసి, ‘దంగల్’ కోసం ఒదులొదులు శరీరం చేసుకుని ఇన్ని ప్రయోగాలు చేశాడు తన శరీరంతో సినిమా కోసం. అలాంటిది ఇప్పుడు ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమా కోసం ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేమంటే తన ఫోన్ స్విచ్చాఫ్ చేయాలని అనుకోవడం. ‘పనికి అది ఆటంకం కలిగిస్తోంది. అందుకే డిసెంబర్ వరకూ నా ఫోన్ వాడదలుచుకోలేదు.
మరీ ముఖ్యమైన విషయమైతే చెక్ చేసి నా అసిస్టెంట్ నాకు చెబుతాడు’ అన్నాడు అతను. ‘అలాగే నా సోషల్ మీడియా అకౌంట్స్ వైపు కూడా డిసెంబర్ వరకూ చూడదలుచుకోలేదు. నా టీమ్ వాటిని నిర్వహిస్తుంది’ అని చెప్పాడు. ఫోన్ లేని రోజుల్లో మనుషులకు ఏ పని మీదైనా తగిన అటెన్షన్ ఉండేది. ఇప్పుడు ఆ అటెన్షన్‌ను ఫోన్ చెదరగొడుతూ ఉంది. ఫోన్ లేకుండా ఉండటం అసాధ్యం ఇప్పుడు కొందరికి. క్షణం అది పక్కన లేకపోతే ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతారు. అలాంటిది అంతపెద్ద స్టార్ అయ్యి ఫోన్ పక్కన పడేశాడంటే ఆమిర్‌కు తన నటన, కెరీర్ పట్ల ఉండే శ్రద్ధ అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment