సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వి11ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. వివో విసిరీస్‌కు కొనసాగింపుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. స్టారీ నైట్ బ్లాక్, నెబ్యులా పర్పుల్ కలర్ వేరియెంట్లలో ఈ డివైస్‌ను మంగళవారం విడుదల చేసింది. దీని ధరను రూ.22,900గా నిర్ణయించింది. వివో ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్రత్యేకంగా ఈ నెల 27 నుంచి ఈ ఫోన్ విక్రయానికి లభ్యం.
ఈ స్మార్ట్‌ఫోన కొనుగోలుపై ఆఫర్ల విషయానికి వస్తే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్‌కార్డ్ కొనుగోళ్లపై 2వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో బై బ్యాక్‌గ్యారంటీతోపాటు ఆరునెలల్లో వన్‌టైం స్క్రీన్ రీప్లేస్ మెంట్ ఆఫర్ ఉంది. అంతేకాదు జియో, వోడాఫోన్ ఐడియా, మింత్రా, పేటీఎం, స్విగ్గీ ఆఫర్లను కూడా అందిస్తోంది. రిలయన్స్ జియో ద్వారా రూ.4050 విలువైన ఆఫర్లను వినియోగదార్లు పొందవచ్చు.
వొడాఫోన్ ఐడియా భాగస్వామ్యంతో ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ. 499పైన రీచార్జ్‌లపై డ్యామేజ్ ఆఫర్ అందివ్వనుంది. అలాగే 198, 399 రూపాయల ప్లాన్లపై ప్రీపెయిడ్ కస్టమర్లకు 820జీబీ డేటా, ప్రీపెయిడ్ వినియోగదారులకు 600జీబీ డేటా ఆఫర్. వీటితోపాటు రూ. 2,100 రూపాయల విలువైన మింత్రా, స్విగ్గీ, పేటీఎం కూపన్లు కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లు సెప్టెంబరు 30న ముగుస్తాయి.
వివో వి11 ఫీచర్లు
6.3 ఇంచ్ హాలో ఫుల్ వ్యూ డిస్‌ప్లే, విత్ 19.9 యాస్పెక్ట్ రేషియో
2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
ఆక్టాకోర్ ప్రాసెసర్
6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
16+5ఎంపీ డబుల్ రియర్ కెమెరా
25 ఎంపీ సెల్పీ కెమెరా
3315 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment