![Vivo S1 Pro India check out price features - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/4/Vivo-S1-Pro.jpg.webp?itok=1Zr4eW7I)
సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మిడ్-బడ్జెట్ రేంజ్‌లో ఎస్ 1 ప్రొ భారతదేశంలో విడుదల చేసింది. ఎస్ సిరీస్‌లో భాగంగా దీన్ని తీసుకొచ్చింది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 19,990 ధర వద్ద నేటి (శనివారం) నుంచి వివోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా అన్ని ఆన్‌లైన్,ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో వుంచింది.
వివో ఇండియా తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేసిన వివరాల ప్రకారం వైట్, బ్లూ, బ్లాక్ మూడు కలర్ వేరియంట్లలో వచ్చింది. ఈ మేరకు ఒక టీజర్ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే.
లాంచింగ్ ఆఫర్లు
జనవరి 31 వరకు వన్ టైం స్క్రీన్ రీప్లేస్‌మెంట్
ఐసీఐసీఐ క్రెడిట్‌కార్డు కొనుగోలుపై 10శాతం క్యాష్‌బ్యాక్
జనవరి 31 వరకు 12వేల రూపాయల విలువ చేసే జియో ఆఫర్
వివో ఎస్ 1 ప్రొ ఫీచర్లు
6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
2340 X 1080 పిక్సెల్స్ రిజల్యూషన్
క్వాల్కం స్నాప్ డ్రాగన్ 665 సాక్
48+8+2+2 ఎంపీ రియర్ కెమెరా
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
8 జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్
4500 ఎంఏహచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment