సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో మంగళవారం కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వీ సిరీస్ లో భాగంగా వివో వి 20 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో మనదేశంలో లాంచ్ అయిన మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం.
వివో వీ20 ఫీచర్లు
6.44అంగుళాల అమోలేడ్ ఎఫ్‌హెచ్‌డి + హాలో ఫుల్ వ్యూ డిస్‌ప్లే
1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720 జీ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 11
8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్
1 టీబీ వరకు విస్తరించుకునే అవకాశం
64+ 8 +2 ట్రిపుల్ రియర్ కెమెరా
44 మెగా పిక్సెల్ ఆటోఫోకస్ సెల్పీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
వివో వీ20 ధర, లభ్యత
రెండు వేరియంట్లలో లభ్యం.
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,990
8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,990గా ఉంది
ప్రీ-బుకింగ్స్ ఈరోజు నుంచి ప్రారంభం. అలాగే అక్టోబర్ 20 నుంచి సేల్ ప్రారంభం.
లాంచింగ్ ఆఫర్
వీ-షీల్డ్ మొబైల్ ప్రొటెక్షన్ ద్వారా కొత్త ఫోన్ కొనేటప్పుడు దీనిపై రూ.2,500 అదనపు ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాండ్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, జెస్ట్ మనీ ద్వారా ఆఫ్ లైన్‌లో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది. దీంతో పాటు వీఐ(వొడాఫోన్ ఐడియా) 819 రీచార్జ్ పై ఒక సంవత్సరం అదనపు వారంటీ కూడా లభ్యం.
Out with the blurry, and in with clarity.
— Vivo India (@Vivo_India) October 13, 2020
Capture your life with the ultra-sleek #vivoV20 powered by 44MP Eye Autofocus Selfie to explore a new #DelightEveryMoment.
Prebook now: https://t.co/PHsB9eFNXT pic.twitter.com/26zNlw9Mwh
Comments
Please login to add a commentAdd a comment